Walmart
-
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు
ప్రముఖ రిటైల్ కార్పొరేషన్ వాల్‌మార్ట్‌కు చెందిన ఆలిస్ వాల్టన్ 102 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.46 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం వాల్‌మార్ట్ షేరు ధర పెరగడం వల్ల ఆమె సంపద గత సంవత్సరంతో పోలిస్టే 46 శాతం పెరిగింది. దాంతో 75 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ప్రపంచ మహిళ కుబేరులు జాబితాలో టాప్‌లో నిలిచారు. వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె అయిన ఆలిస్ తన సోదరులు రాబ్, జిమ్ వాల్టన్ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు వారసత్వంగా సమకూరిన అపారమైన సంపదను వ్యక్తిగత అభిరుచులకు, దాతృత్వం కోసం ఖర్చు చేస్తున్నారు. వాల్టన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ అండ్ వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా కంపెనీలో సుమారు 11.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.వాల్టన్‌కు చిన్నతనం నుంచే కళలపట్ల ఉన్న ఇష్టంతో వాటిని సేకరించి పరిరక్షిస్తున్నారు. వాల్టన్ తన పదో ఏటే పికాసో రిన్యూవేట్ పెయింటింగ్‌ను రెండు డాలర్లకు కొనుగోలు చేశారు. ఆండీ వార్హోల్, నార్మన్ రాక్వెల్, జార్జియా ఓకీఫ్ వంటి ప్రసిద్ధ అమెరికన్ కళాకారుల ఒరిజినల్ కళాకృతులను ఆమె సేకరించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఆమె 2011లో అర్కాన్సాస్‌లోని బెంటన్విల్లేలో 50 మిలియన్ డాలర్లతో క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అని పిలువబడే మ్యూజియంను కూడా ప్రారంభించారు. టెక్సాస్ గుర్రాల సంతానోత్పత్తి వ్యాపారంలోనూ తనకు ప్రవేశం ఉంది. ఆమె 2017లో రాకింగ్ డబ్ల్యు రాంచ్ అని పిలువబడే టెక్సాస్‌లోని గుర్రాల స్థావరాన్ని 16.5 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఇది 250 ఎకరాలకు పైగా పచ్చిక బయళ్లు, పశువులు, గుర్రాల పరిరక్షణ కోసం వీలుగా ఉన్న ప్రాంతం. తన సంపదను అభిరుచులు తీర్చుకోవడానికి, కళలను కాపాడేందుకు ఖర్చు చేస్తున్నారు.ఇదీ చదవండి: మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్‌ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు, పీఏసీలకు మద్దతుగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2016లో హిల్లరీ క్లింటన్ విక్టరీ ఫండ్‌కు 3,53,400 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో వాల్టన్ మొదటిస్థానంలో నిలువగా, 67 బిలియన్ డాలర్ల సంపదతో లోరియల్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్, 60 బిలియన్ డాలర్లతో కోచ్ ఇండస్ట్రీస్‌కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ, 53 బిలియన్ డాలర్ల సంపదతో మార్స్‌కు చెందిన జాక్వెలిన్ మార్స్, 40 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్ అండ్ ఫ్యామిలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్‌మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలువాల్మార్ట్అమెజాన్స్టేట్గ్రిడ్సౌదీ అరమ్కోసినోపెక్ గ్రూప్చైనా నేషనల్ పెట్రోలియంయాపిల్యూనైటెడ్ హెల్త్గ్రూప్బెర్క్షైర్ హాత్వేసివీఎస్ హెల్త్ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్‌లోని టాప్ కంపెనీలురిలయన్స్ ఇండస్ట్రీస్ఎల్ఐసీఇండియన్ ఆయిల్ఎస్బీఐఓఎన్జీసీభారత్ పెట్రోలియంటాటా మోటార్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ -
రెండు దశాబ్దాల్లో 30 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత మార్కెట్ నుంచి గత రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సోర్సింగ్ విభాగం) ఆండ్రియా ఆల్బ్రైట్ తెలిపారు. ఇప్పుడు 2027 నాటికల్లా ఏటా 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. వాల్‌మార్ట్ గత 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వాల్‌మార్ట్ గ్రోత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్‌లాంటి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమనేది దిగ్గజ సరఫరాదారులతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, అలాగే దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థ కోసం కొత్త సంస్థలతో సంబంధాలను ఏర్పర్చుకునేందుకు తోడ్పడగలదని ఆల్బ్రైట్ చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల ఆధునీకరణ, విస్తరణలో తోడ్పడేందుకు ఉద్దేశించిన వాల్‌మార్ట్ వృద్ధి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 వేల మందికి కంపెనీ శిక్షణనిచి్చనట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని గ్రోత్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ తెలిపారు. హీరో ఎకోటెక్ తయారు చేసే క్రూయిజర్ సైకిళ్లు, మిసెస్ బెక్టర్స్ ఉత్పత్తులు, వెల్స్పన్ టవళ్లు మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
Flipkart Orders: ఆర్డర్ చేసిన రోజే డెలివరీ.. కానీ..
వాల్‌మార్ట్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై ఏదైనా ఆర్డర్ చేస్తే అదేరోజు డెలివరీ ఇచ్చేలా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దేశంలోని 20 ప్రధాననగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందోర్, జైపుర్, కోల్‌కతా, లఖ్‌నవూ, లుథియానా, ముంబయి, నాగ్‌పూర్, పుణె, పట్నా, రాయ్‌పుర్, సిలిగురి నగరాల్లో ఈ సేవల్ని మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ఈ కొత్త సదుపాయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. రానున్న నెలల్లో దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నంలోపే ఆర్డర్.. బ్యూటీ, లైఫ్ స్టైల్, బుక్స్, మొబైల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ విభాగాలకు చెందిన వస్తువులను బుక్ చేసిన రోజే అందించాలనేది లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపే వస్తువులను బుక్ చేసుకోవాలి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి అప్పుడు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వస్తువులు డెలివరీ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినట్లయితే మరుసటి రోజు డెలివరీ అందుతుందని తెలిసింది. -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్‌డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్‌ను అందించనుందని తెలిసింది. ‘ఆప్‌డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్‌కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు 600 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అమెరికన్ రిటైల్ దిగ్గజం 600 మిలియన్ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత వేల్యుయేషన్‌కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్‌మార్ట్ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్ చివరిసారి 37.6 బిలియన్ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు..
అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద రిటైల్ స్టోర్స్ చైన్ కలిగి ఉన్న 'వాల్‌మార్ట్' (Walmart) గత కొంత కాలంగా భారతీయ మార్కెట్ మీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సుమారు నాలుగింట ఒక వంతు దిగుమతులను ఇండియా నుంచి స్వీకరిస్తున్న కంపెనీ, చైనా దిగుమతులను తగ్గించడానికి అన్ని విధాలా తయారవుతోంది. నిజానికి వాల్‌మార్ట్‌కు అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనా నుంచి కంపెనీ దిగుమతులను ప్రతి ఏటా తగ్గిస్తూనే ఉంది. 2018లో 80 శాతం దిగుమతులు చేసుకున్న సంస్థ.. 2023 నాటికి 60 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క సరఫరాదారు ఒక దేశం మీద ఆధారపడి పనిచేసే అవకాశం లేదు, భారత ఆర్థిక దృక్పథం, సానుకూల మార్కెట్ సూచికలు, తక్కువ ధర తయారీ సామర్థ్యాలు వాల్‌మార్ట్‌ను ఆకర్శించింది. గతంలో చైనా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకున్న కంపెనీ చైనా దిగుమతులను తగ్గించి భారతదేశం నుంచి దిగుమతులు చేసుకోవడానికి సుముఖత చూపింది. ఇందులో భాగంగానే ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! 2027 నాటికి మన దేశం నుంచి మొత్తం 10 బిలియన్ డాలర్స్ విలువైన వస్తువులను కంపెనీ దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వాల్‌మార్ట్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా ఆల్బ్రైట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా నుంచి వాల్‌మార్ట్ దిగుమతులు ఏడాదికి 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ భారత ప్రభుత్వంతో మంచి రిలేషన్ పెంచుకుంటూ.. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మరిన్ని వాటాలు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తమ వాటాలను మరింతగా పెంచుకుంది. ఇందులో భాగంగా నియంత్రణాధికారాలు లేని వాటాదారుల నుంచి షేర్ల కొనుగోలు కోసం జూలై 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,953 కోట్లు) చెల్లించింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాను దక్కించుకోగా తాజాగా దాన్ని 80.5 శాతానికి పెంచుకుంది. ఇందుకోసం హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ నుంచి వాటాలు కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేసే యోచనలో కూడా ఉంది. -
భారత్ నుంచి వాల్‌మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
ఎగుమతుల్లో రికార్డ్ సృష్టించనున్న వాల్‌మార్ట్ - 2027 నాటికి..
న్యూఢిల్లీ: దేశం నుంచి 2027 నాటికి ఏటా 10 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను వాల్‌మార్ట్ ఎగుమతి చేయడంలో సహాయపడటానికి అపూర్వ సరఫరాదారుల వ్యవస్థ దోహదం చేస్తుందని రిటైల్ వాల్‌మార్ట్ తెలిపింది. భారతీయ సంఘాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, స్థానిక వ్యాపారాలకు అవకాశాలను విస్తరించడానికి, దేశం నుండి ప్రపంచానికి రిటైల్ కోసం పరివర్తన, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించాలన్న సంస్థ ప్రణాళికను వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈవో డాగ్ మెక్‌మిలన్ పునరుద్ఘాటించారు. భారతీయ సరఫరాదారులు, భాగస్వాములను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘వాల్‌మార్ట్ భారతదేశానికి కట్టుబడి ఉంది. దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లు, సభ్యుల కోసం నాణ్యమైన, సరసమైన, స్థిర ఉత్పత్తులను తయారు చేసే భారతీయ సరఫరాదారులు, భాగస్వాముల గురించి మేము సంతోషిస్తున్నాము. ఉద్యోగాలను సృష్టించడం, సంఘాలను బలోపేతం చేయడం, తయారీ కేంద్రంగా భారత పురోగతిని వేగవంతం చేయడం ద్వారా మా వ్యాపారం దేశ వృద్ధికి తోడ్పడగలదని గర్విస్తున్నాము’ అని వివరించారు. -
వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,650 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ప్రధాన వాటాదారు వాల్‌మార్ట్ ఈ మేరకు నిధులు సమకూర్చింది. సింగపూర్ నుంచి భారత్‌కు కార్యాలయాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఫోన్‌పే 1 బిలియన్ డాలర్ల వరకూ మూలధనాన్ని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా అందిన నిధులతో ఇప్పటివరకూ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,360 కోట్లు) సమీకరించినట్లవుతుంది. (ఇదీ చదవండి: బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?) మిగతా పెట్టుబడులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిధులను బీమా, వెల్త్ మేనేజ్మెంట్, రుణాలు, స్టాక్ బ్రోకింగ్ మొదలైన వ్యాపార విభాగాల వృద్ధికి ఉపయోగించుకోనుంది. గూగుల్ పే, పేటీఎంలతో ఫోన్‌పే పోటీ పడుతోంది. సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ -
ఫోన్‌పే: 8,200 కోట్ల పన్ను చెల్లించాల్సిందే!
ఫోన్‌పే ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించినందకు గానూ వాల్‌మార్ట్, ఇతర ఫోన్‌పే వాటాదారులుపై భారీగా పన్నులు భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ పే మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేశాక.. అందులో మెజారిటీ యాజమాన్య హక్కులను వాల్‌మార్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫోన్‌పే విలువ పెరగడం, దీంతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఇండియాకు తరలించడంతో దాదాపు 1 బిలియన్ డాలర్లు పన్ను కట్టాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కన్నాయి. జనరల్ అట్లాంటిక్, కతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఇతరుల నుంచి 12 బిలియన్ డాలర్ల ప్రీ-మనీ వాల్యుయేషన్‌తో నిధులను సేకరించడం వల్ల ఫోన్‌పే పై భారీ చార్జీలు విధించే అవకాశం ఉంది. టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్తో సహా ఇన్వెస్టర్లు భారత్‌లో ఫోన్‌పే షేర్లను కొత్త ధరకు కొనుగోలు చేశారు. ఇది ఇప్పటికే ఉన్న వాటాదారులకు దాదాపు 80 బిలియన్ రూపాయల పన్ను విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వీటిపై ఫోన్‌పై ప్రతినిధి స్పందించలేదు. చాలా సంవత్సరాలుగా, టెక్ కంపెనీలు తమ వ్యాపారాలు, కార్యకలాపాల్లో ఎక్కువ భాగాన్ని భారతదేశంలో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రధాన కార్యాలయాన్ని మాత్రం సింగపూర్‌లో ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆ దేశంలో ఉన్న ఫ్రెండ్లీ ట్యాక్స్ విధానం, విదేశీ పెట్టుబడులను సులభంగా పొందే సౌలభ్యమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఇండియా బ్రీఫింగ్ నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి 8,000 భారతీయ స్టార్టప్‌లు సింగపూర్‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 700 మిలియన్ డాలర్లు క్యాష్ పేఔట్!
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేస్తున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్టాక్ ఆప్షన్స్ కలిగి ఉన్న దాదాపు 25,000 ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేయనుంది. ఫోన్‌పే (PhonePe), మింత్రా (Myntra), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థలోని ప్రస్తుత ఉద్యోగులే కాకుండా మాజీ సిబ్బందికి కూడా ప్రయోజనం చేకూరునుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని టాప్ 20 ఉద్యోగులు, కంపెనీలో అత్యంత సీనియర్ సిబ్బంది స్థాయి వారికి ఈ చెల్లింపులో దాదాపు 200 మిలియన్ డాలర్ల వరకు అందుకోనున్నారు. అమెజాన్ నుంచి ఫోన్‌పే (PhonePe) పూర్తిగా వేరు కావడంతో ఈ చెల్లింపు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌పేను 2015లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2020లో ఫోన్‌పే విలువను అన్‌లాక్ చేయడానికి దాన్ని ప్రత్యేక సంస్థగా మార్చింది. అయినప్పటికీ ఫోన్‌పేలో అధిక వాటాను కొనసాగించింది. ఇటీవల డిసెంబర్ 23న ఫోన్‌పేలోని తన వాటాలన్నింటినీ ప్రస్తుత వాటాదారులకు విక్రయిస్తున్న కీలక ప్రకటన చేసింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అందిస్తున్న ఈ క్యాష్ పేఔట్ దేశీయ ప్రైవేట్ రంగంలో అతి పెద్ద ఆఫర్‌గా నిలిచింది. చదవండి: Meesho Shopping Survey: ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు! -
ఫ్లిప్‌కార్ట్ నుంచి విడివడ్డ ఫోన్‌పే
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే విడివడింది. ఇకపై రెండు సంస్థలూ వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ రెండింటికీ యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మాతృ సంస్థకాగా.. ఫోన్‌పేను 2016లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. తాజా లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్ వాటాదారులు ఫోన్‌పే ఇండియాలో ప్రత్యక్షంగా షేర్లను కొనుగోలు చేసినట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వెరసి ఫోన్‌పే భారత కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ఈ ప్రాసెస్ తాజాగా పూర్తయినట్లు వెల్లడించింది. రెండు బిజినెస్ గ్రూపులలోనూ వాల్‌మార్ట్ మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ఒక్కో కంపెనీ 40 కోట్ల యూజర్ బేస్ ద్వారా దేశీ దిగ్గజాలుగా ఎదిగినట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫోన్‌పే స్వస్థలాన్ని(డొమిసైల్) సింగపూర్ నుంచి భారత్‌కు మార్పు చేసుకున్నట్లు తెలియజేశారు. -
విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ
శాన్ ఫ్రాన్సిస్కో: 74 ఏళ్ల భారత సంతతి వ్యక్తి తన కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి సితాల్ సింగ్ దోసాంజ్గా పోలీసులు గుర్తించారు. సౌత్శాన్ జోస్పార్కింగ్లోని వాల్‌మార్ట్ వద్ద ఆమె శవమై కనిపించిందని తెలిపారు. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసంజ్గా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు సితాల్ సింగ్ విచారణలో ఆమె తన కొడుకు నుంచి విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుండటంతో కోపంతో షూట్ చేసి చంపేశానని చెప్పాడు. అంతేగాదు భాధితురాలు ఫోన్లో తన మామా తనను చంపడం కోసం వెతుకుతున్నాడంటూ భయపడినట్లు ఆమె మేనమామ పోలీసులకు చెప్పాడు. ఆమె తన ఆఫీస్‌లో విరామ సమయంలో బయటకు వచ్చి తనకు కాల్ చేసిందని, అదే సమయంలో తన మామా తన కారు వద్దకు వస్తున్నాడంటూ భయపడుతూ చెప్పిందని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్ డిస్ కనక్డ్ అయ్యిందని వివరించాడు. సుమారు ఐదు గంటల తర్వాత బాధితురాలి సహోద్యోగురాలు ఆమె తన కారులోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించిందని తెలిపాడు. గురుప్రీత్ ఆమె భర్త, మామ గారితో కలిసి ఫ్రెస్నోలో ఉంటోందని బాధితురాలి మేనమామ చెప్పాడు. ఐతే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. ఈ మేరకు నిందితుడు సితాల్ సింగ్‌ని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఇంటి నుంచి క్యాలిబర్ బెరెట్టా పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలిని చివరిసారిగా ఆమె డ్రైవ్ చేస్తుంటే కలిసింది సితాల్ సింగ్ అని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని శాన్‌జోస్ జైలుకి తరలించినట్లు తెలిపారు. అతనిని నవంబర్14న కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు) -
ఐపీఓ బాటలో ఫోన్‌పే
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైలింగ్ కంపెనీ వాల్‌మార్ట్ గ్రూప్‌లోని యూపీఐ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కు మెజారిటీ వాటాగల కంపెనీ ఇందుకు బ్యాంకర్లు, న్యాయ సలహాదారు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ 8–10 బిలియన్ డాలర్ల(రూ. 62,000– 78,000 కోట్లు) విలువను ఆశిస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. నిధులతో యూపీఐ ఆధారిత చెల్లింపుల నిర్వహణతోపాటు ఫైనాన్షియల్ సర్వీసుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే ప్రణాళికలున్నట్లు పేర్కొన్నాయి. మేడిన్ ఇండియా సంస్థగా ఆవిర్భవించే బాటలో రిజిస్టర్డ్ హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఫోన్‌పే బోర్డు అనుమతించడం గమనార్హం! దేశీయంగా ఊపిరి ఇటీవల పలు కంపెనీలు విదేశాలలో లిస్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే మాత్రం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. స్నేహపూర్వక వ్యాపార నియంత్రణలు, పన్ను చట్టాలు గల యూఎస్ లేదా సింగపూర్‌లో లిస్టింగ్‌కు పలు స్టార్టప్‌లు చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌పేను నిజానికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ ఏర్పాటు చేశారు. తదుపరి 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. 2018లో ఫోన్‌పే సహా ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. 2023కల్లా... ఫోన్‌పే లాభాల్లోకి ప్రవేశించిన వెంటనే పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని చూస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. 2023కల్లా టర్న్అరౌండ్ కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా యూపీఐ లావాదేవీలు జోరందుకోవడంతో ఈ డిసెంబర్‌కల్లా సిబ్బంది సంఖ్యను 5,200కు చేర్చుకునే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం 2,600 మంది ఉద్యోగులను కలిగిన ఫోన్‌పే మరో 2,800 ఉపాధి అవకాశాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. భారీ విలువలో ప్రమోటర్లు ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ల నుంచి ఫోన్‌పే 70 కోట్ల డాలర్లు సమీకరించింది. దీంతో 2020లో కంపెనీ విలువ 5.5 బిలియన డాలర్లకు చేరింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, టెన్సెంట్ తదితర దిగ్గజాల నుంచి 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. యూపీఐ విభాగంలో నెలవారీ లావాదేవీల్లో కంపెనీ 47 శాతం మార్కెట్ వాటాతో అగ్రపథంలో ఉంది. వెల్త్‌డెస్క్, ఓపెన్‌క్యూ, గిగ్ఇండియాలను కొనుగోలు చేసిన కంపెనీ మ్యూచువల్ ఫండ్, ఎన్‌బీఎఫ్‌సీలైసెన్సులకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఎంఎఫ్ పంపిణీ లైసెన్స్‌ను కలిగి ఉంది. వెల్త్‌మేనేజ్‌మెంట్ ప్రొడక్టుల్లో భాగంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లను జమ చేసుకుంటోంది. బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ యూపీఐ సిప్‌ను ప్రవేశపెట్టింది. -
ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్‌లు చాలు.. వాటిపై ఆసక్తి లేదు.. వాల్‌మార్ట్ సంచలన ప్రకటన
ముంబై: భారత్‌లో రిటైల్ స్టోర్ల ఏర్పాటు పట్ల ఆసక్తి లేదని అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రకటించింది. కాకపోతే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, పేమెంట్స్ సేవల సంస్థ ఫోన్‌పే బలోపేతానికి కొనుగోళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. కొన్నేళ్ల క్రితం 16 బిలియన్ డాలర్లు (రూ.1.20 లక్షల కోట్లు) వెచ్చించి ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే సంస్థలను వాల్‌మార్ట్ సొంతం చేసుకోవడం గమనార్హం. ‘‘మాకు ఓమ్నిచానల్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) వ్యూహం ఉంది. ఈ రెండూ ఉన్నప్పుడు కస్టమర్ల అనుభవం అవరోధాల్లేకుండా ఉంటుంది. కోరుకున్నప్పుడు స్టోర్‌కు వెళ్లి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ, ప్రస్తుత దశలో మేము దానిపై దృష్టి సారించడం లేదు. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే విజయవంతానికే కృషి చేస్తున్నాం’’ అని వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిల్లన్ ముంబైలో అంతర్జాతీయ వ్యాపార సదస్సు సందర్భంగా చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీవో అంతిమ లక్ష్యం ఫ్లిప్‌కార్ట్ ఐపీవో అన్నది అంతిమ లక్ష్యమంటూ, ఎప్పుడు దీన్ని తీసుకొచ్చేది ఆయన స్పష్టం చేయలేదు. ‘‘ఏదో ఒక సమయంలో ఐపీవో సరైన నిర్ణయం అని ఆరంభం నుంచి అనుకుంటూనే ఉన్నాం. కానీ, బలమైన పునాదిని మేం నిర్మించాల్సి ఉంది. సన్నద్ధత ఆధారంగా నిర్వహణ టీమ్ ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఐపీవోకు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలను ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేకు సంబంధించి స్థానిక నాయకత్వాలే తీసుకుంటాయి’’ అని మెక్‌మిల్లన్ తెలిపారు. -
అమెరికాలో వైరల్ అవుతున్న ఇండియన్ బుడత
American Toddler accidentally purchases 2000 Dollars worth of items: కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలంతా మొబైల్ ఫోన్స్‌కే అతుక్కుపోతున్నారంటూ కంప్లైంట్ చేస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఆన్లైన్ క్లాస్ లేదంటే గేమ్స్ మొత్తానికి ఫోన్ వదలడం లేదు. అయితే అమెరికాకు చెందిన 20 నెలల చిచ్చర పిడుగు స్మార్ట్‌ఫోన్‌తో చేసిన పని ఇప్పుడు యూస్‌తో పాటు ఇండియాలోనూ వైరల్‌గా మారింది. అమెరికన్ ఇండియన్ దంపతులు ప్రమోద్ , మధుకుమార్‌లు న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారుంట ఇంటికి వరుసగా కొరియర్లు వచ్చి చేరుతున్నాయి. కొత్తగా తీసుకున్న ఇంటికి సంబంధించిన ఫర్నీచర్ వస్తువులు ఒక్కొక్కటిగా వాల్‌మార్ట్ బృందం ఇంటికి చేరవేస్తోంది. తాను ఆ వస్తువులు కొనాలని అనుకున్న మాట వాస్తమేనని, అయితే తాను ఆర్డర్ చేయలేదంటూ మధుకుమార్ డెలివరీ బాయ్స్‌తో వాదనకు దిగింది. అయితే వాల్‌మార్ట్ ప్రతినిధులు ఆర్డర్‌కి సంబంధించిన వివరాలను మధుకుమార్ ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యింది. ఎందుకంటే విలువైన వస్తువులు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసింది మరెవరో కాదు.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే ఇరవై నెలల బాబు ఆయాన్ష్. తల్లి ఫోన్లో వాల్‌మార్ట్ యాప్‌లో కార్ట్‌లో పిక్ చేసి ఉన్న వస్తువలను అతను సునాయాసంగా ప్లేస్ ఆర్డర్ చేసేశాడు. ఇలా అమెరికన్ కరెన్సీలో 2000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1.49 లక్షలు) విలువైన వస్తువులు బుక్ చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయాన్ష్ ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడని, కానీ ఫేస్ రికగ్నేషన్, పాస్‌కోడ్ ఉన్న ఫోన్‌ను ఆయాన్ష్ ఎలా ఓపెన్ చేశాడన్నది మిస్టరీగా మారింది. వెంటనే ఆయన్ష్ చేతికి కొన్ని ఫోన్లు ఇవ్వగా ఈ మెయిల్స్ పంపడం, కాంటాక్ట్ లిస్ట్ చెక్ చేయడం, క్యాలెండర్ క్లోజ్ చేయవం వంటి పనులు పక్కా చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా అమెరికా మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో 20 నెలల చిచ్చర పిడుగు ఆయాన్ష్ ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్ సిసింద్రీగా మారాడు. పొరపాటున ఆర్డర్ చేసినట్టుగా తెలపడంతో.. సదరు ఫర్నీచర్‌ని వెనక్కి తీసుకునేందుకు వాల్‌మార్ట్ అంగీకరించింది. చదవండి: రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం? -
ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు కోసం ఆసియాలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన వారసుడు ఎవరు అనే దాని విషయంలో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వారుసుల విషయంలో ఆసియాలోని ఇతర సంపన్న కుటుంబాలు చేసిన తప్పులను తను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ముకేష్ అంబానీ కుటుంబంలో అంతర్యుద్ధం రాకుండా ఉండటానికి నిపుణులతో చర్చిస్తున్నట్లు వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ ఒక కథనం ప్రచురితం చేసింది. బ్లూంబర్గ్ కథనం ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసత్వ విషయంలో ప్రణాళికలను రచిస్తున్నారు. కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో అంబానీ కుటుంబం ప్రస్తుత వాటా మార్చి 2019లో ఉన్న 47.27 శాతం నుంచి 50.6 శాతానికి పెరిగింది. రిలయన్స్ వైభవం భవిష్యత్తులో కూడా తగ్గకుండా ఉండటానికి యువ తరం అంబానీలను సిద్ధం చేస్తున్నారు. జూన్ నెలలో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) ముఖేష్ అంబానీ ఇలా మాట్లాడారు.. "ఇషా, ఆకాశ్, అనంత్ నేతృత్వంలో రిలయన్స్ మరి౦త సుసంపన్న౦ అవుతుంది అనడంలో నాకు స౦దేహ౦ లేదు" అన్నారు. (చదవండి: రూ.10 వేల పెట్టుబడితో రూ. 2 లక్షలు లాభం!) ప్రస్తుతం అతని కవల పిల్లలు ఆకాశ్, ఇషా అంబానీలు ఇద్దరూ రిటైల్ & టెలికామ్ వ్యాపారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. 2014లో వారిద్దరూ ఆర్ఐఎల్ టెలికాం, రిటైల్ వ్యాపారాల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ప్రస్తుతం, అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అతను డైరెక్టర్‌గా రిలయన్స్ పునరుత్పాదక శక్తి, చమురు & రసాయన యూనిట్ల భాద్యతలు కూడా చూస్తున్నాడు. అంబానీ వారసత్వ ప్రణాళిక 208 బిలియన్ డాలర్ల(సుమారు రూ.15.60 లక్షల కోట్ల) విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కోనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేశ్ అంబానీ తాజాగా వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నారు. కంపెనీ ప్రధాన కార్యకలాపాలను పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్‌కు అప్పగిస్తారు. వారంతా బయటవారే ఉంటారు. అంబానీ కుటుంబ అంతర్యుద్ధం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరజ్ లాల్ హిరాచంద్ అంబానీ 1973లో రిలయన్స్ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. కానీ, 2002లో ధీరుబాయ్ అంబానీ ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం అనిశ్చితిలో మునిగిపోయింది. ఆ సమయంలో ముఖేష్, అతని సోదరుడు అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపారంలో పాల్గొన్నప్పటికీ, ఒకరినొకరు అడగకుండా మరొకరు నిర్ణయాలు తీసుకువిస్తున్నారని నమ్మడంతో విభేదాలు రావడం ప్రారంభించాయి. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..?) కొన్ని విషయాలలో ఇద్దరూ సోదరులు ప్రధాన నిర్ణయాలపై విభేదించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 2005లో వారి తల్లి కోకిలాబెన్ రిలయన్స్ ఆస్తులను విభజించడానికి ముందు ఈ అంతర్యుద్ధం మూడు సంవత్సరాలు వరకు కొనసాగింది. ముఖేష్ అంబానీకి రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, వస్త్ర వ్యాపారాలను అందించగా.. అనిల్ అంబానీకి టెలికమ్యూనికేషన్స్, ఆస్తి-నిర్వహణ, వినోదం, విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలకు బాధ్యతలు అప్పజెప్పింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాల్టన్ కుటుంబ వారసత్వ ప్రణాళిక ప్రముఖ వాల్ మార్ట్ సంస్థ అమెరికన్ వ్యాపారవేత్త శామ్ వాల్టన్ చేత స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ సంస్థగా ఎదిగింది. అతని కుమారుడు రాబ్ వాల్టన్, అతని మేనల్లుడు స్ట్యూర్ట్ వాల్టన్, ఇద్దరూ వాల్ మార్ట్ బోర్డులో ఉన్నారు. సామ్ మనవడు గ్రెగ్ పెన్నర్ 2015లో కంపెనీ చైర్మన్ గా నియమితులయ్యారు. శామ్ వాల్టన్ తాను చనిపోవటానికి 40 ఏళ్ల ముందే కుటుంబ వాటాల్ని ట్రస్టుకు బదిలీ చేసి.. కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టర్ బాధ్యతల్ని అప్పజెప్పారు. ఇప్పటికీ ఆ సంస్థ చీలిపోకుండా ఉందంటే అందుకు ఆయన అనుసరించిన వ్యూహమేనని నిపుణులు చెబుతారు. ఇప్పటికి వాల్ మార్ట్ సంస్థలో 47 శాతం వాటాను ట్రస్టులు, వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ రూపంలో వాల్ మార్ట్ కుటుంబీకుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.ఇప్పుడు అదే విధంగా, ముకేశ్ అంబానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని చూస్తున్నారని బ్లూంబర్గ్ పేర్కొంది. -
లక్ష కోట్ల డాలర్లకు భారత రిటైల్ రంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డగ్ మెక్‌మిలన్ చెప్పారు. విశిష్టమైన దేశీ రిటైల్ రంగం .. 2025 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించగలదని పేర్కొన్నారు. కన్వర్జ్ ః వాల్‌మార్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్ వైవిధ్యమైనది కావడంతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని సంస్థ సిబ్బందికి సూచించారు. దేశీ మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలో నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు లేనందున తాము ఇతర విధానాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నామని డగ్ వివరించారు. అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా టాప్ 3 మార్కెట్లలో ఒకటన్నారు. వాల్‌మార్ట్‌లో భాగమైన ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్‌పే మెరుగ్గా రాణిస్తున్నాయని, వీటికి భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారని డగ్ పేర్కొన్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 3,00,000 పైచిలుకు విక్రేతలు ఉండగా, ఫోన్‌పే యూజర్ల సంఖ్య 30 కోట్ల పైచిలుకు ఉంది. రెండు సంస్థలూ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. -
వాల్‌మార్ట్‌లో జింక హల్చల్.. సిబ్బంది భలే కంట్రోల్ చేశారే! వైరల్
మనుషుల అభివృద్ధి పేరుతో నగరాలను విస్తరించూకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలు కూడా జననివాసాలుగా మారుతున్నాయ్.దీని కారణంగా అడవులు తగ్గి జంతువులు నగరాల్లో సంచరించడం ఇటీవల మామూలుగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో అవి మనుషుల మధ్య కనిపిస్తు అవి బెదురుతూ మనల్ని భయపెడుతున్నాయి. కాగా ఈ సన్నివేశాలు రికార్డు కావడం, నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి తరహాలో ఓ జింక్ వాల్‌మార్ట్‌లోకి రాగా దాన్ని కంట్రోల్ చేయడానికి నానతంటాలు పడ్డాడు ఓ సిబ్బంది. వివరాల్లోకి వెళితే.... విస్కాన్సిన్ వాల్‌మార్ట్‌లో అనుకోని కస్టమర్ రూపంలో ఓ జింక షాపులోకి వచ్చింది. పాపం అక్కడి పరిసరాలు అంతా కొత్తగా ఉండే సరికి కాస్త బెదిరి నానా హైరానా చేసింది. ఇక షాపును ధ్వంసం చేస్తుండడంతో అందులోని ఓ సిబ్బంది మాత్రం ధైర్యంగా ఆ జింకను కట్టడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో.. జింకను నడవకుండా సిబ్బంది చాకచక్యంగా దాన్ని నియంత్రిస్తూ వ్యవహరించాడు. జంతువు పట్టు నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ, వదలకుండా అలానే ఆ సిబ్బంది ఉండగా ఈ క్రమంలో ఇతర సిబ్బంది దాని బయటకు పంపడానికి వెనుక తలుపు తెరిచి పంపేసి హమ్మయ్యా అనుకున్నారు. ఈ ఘటన జూన్ 23 న బారాబూలో జరిగగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. When a deer got loose inside a Wisconsin Walmart, one brave employee pinned it with her bare hands until coworkers could rush to open a back door. According to reports, the deer was then released outside safely. pic.twitter.com/a3rzY9wMkg— NowThis (@nowthisnews) June 30, 2021 -
ఐపీవో బాట- ఫ్లిప్‌కార్ట్ బోర్డులో మిస్త్రీ
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా బోర్డు పునర్వ్యవస్థీకరణకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ అంశాలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి ఉద్యోగులకు తాజాగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం 2021లో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. బోర్డులో సీఈవో కళ్యాణ్‌తోపాటు.. హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ చేరనున్నారు. ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్లోబల్ సీఈవో సురేష్ కుమార్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ సైతం బోర్డులో సభ్యులు కానున్నారు. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ సీఈవో జుడిత్ మెకెన్నా బోర్డుకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. బోర్డు నుంచి బయటకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి హైప్రొఫైల్ వ్యక్తులు కొంతమంది వైదొలగనున్నారు. జాబితాలో వాల్‌మార్ట్ వ్యవస్థాపకులు స్టువార్ట్ వాల్టన్‌తోపాటు, కుటుంబ సభ్యులున్నారు. మరోవైపు వాల్‌మార్ట్ ఏషియాకు వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిర్క్ వాన్ డెన్ బెర్గే పదవీ విరమణ చేయనున్నారు. తద్వారా ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి తప్పుకోనున్నారు. మేక్‌మైట్రిప్‌కు చెందిన రాజేష్ మాగో, స్వతంత్ర డైరెక్టర్ రోహిత్ భగత్ సైతం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి వైదొలగనున్నారు. రోహిత్ భగత్ ఫోన్‌పే కొత్త బోర్డులో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 40 బిలియన్ డాలర్లు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాదిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ విలువను మాతృ సంస్థ వాల్‌మార్ట్ 40 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. ఈ బాటలో ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ విభాగం ఫోన్‌పేను ప్రత్యేక సంస్థగా విడదీయనుంది. దీనిలో భాగంగా ఫోన్‌పేకు సొంత బోర్డును ఏర్పాటు చేయనున్న్లట్లు తెలుస్తోంది. తదుపరి దశలో ఫోన్‌పే 5.5 బిలియన్ డాలర్ల విలువలో నిధులను సమకూర్చుకునే ప్రణాళిల్లో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో మార్పులు
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ తన డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించింది. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ, కేకీ మిస్త్రీలకు డైరెక్టర్ల బోర్డ్‌లో స్థానం కల్పించింది. నలుగురిని డైరెక్టర్ల బోర్డ్ నుంచి తప్పించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుండటంతో ఈ మార్పులు జరిగాయని సమాచారం. డైరెక్టర్ల బోర్డ్ పునర్వ్యస్థీకరణను ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కృష్ణమూర్తి డైరెక్టర్ల మార్పులు, చేర్పుల వివరాలను వెల్లడించారు. నలుగురు డైరెక్టర్లు–రాజేశ్ మాగౌ, రోహిత్ భగత్, స్టూవార్ట్ వాల్టన్, డిర్క్‌వాన్ డెన్ బెరేలను డైరెక్టర్లుగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీరి స్థానంలో కళ్యాణ్ కృష్ణమూర్తి, కేకీ మిస్త్రీలతో పాటు వాల్‌మార్ట్ నుంచి సురేశ్ కుమార్, లే హాప్కిన్స్ను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కంపెనీ 1,600 కోట్ల డాలర్లకు 2018లో కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
టాటా సూపర్ యాప్ : వాల్‌మార్ట్ భారీ డీల్
సాక్షి, ముంబై: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా వ్యాపారరంగంలో ప్రత్యేకతను చాటుకున్నటాటా గ్రూపు ఈ కామర్స్ రంగంలోకి దూసుకొస్తోంది. దేశంలోనే అతి భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. టాటా ‘సూపర్ యాప్’ లో భారీ పెట్టుబడులకు అమెరికా రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ టాటా గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. రీటైల్ ఆధిపత్యం కోసం దేశీయంగా వ్యాపార దిగ్గజాలు పోటీపడుతోంటే.. ఆయా కంపెనీల్లో భారీ విదేశీ పెట్టుబడులు విశేషంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా సూపర్ యాప్ ప్లాట్‌ఫామ్ వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడులకు వాల్‌మార్ట్ చర్చలు జరుపుతోంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద డీల్ గా నిలుస్తుందని అంచనా. టాటా-వాల్‌మార్ట్ జాయింట్ వెంచర్‌గా ఈ యాప్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇందులో పలు విదేశీ సంస్థలు కూడా భారీ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిపాదిత లావాదేవీ ఖరారు కోసం గోల్డ్‌మన్ సాచ్స్‌ను వాల్‌మార్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా నియమించినట్టు సమాచారం. టాటాతో ఒప్పందం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో కూడా విక్రయాలకు అదనపు బలం వస్తుందని కంపెనీ భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు ప్రత్యర్థిగా అవతరించినుందని భావిస్తున్నారు. ఒక కొత్త సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో సూపర్ యాప్ ద్వారా అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించాలని భావిస్తోంది. సుమారు 50-60 బిలియన్ డాలర్లతో ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో ప్రారంభించబోయే సూపర్ యాప్ కింద వివిధ వ్యాపారాలను ఒకే ఛానల్ కిందకి తీసుకురానుంది. హెల్త్ కేర్, ఆహారం, కిరాణా సేవలు, భీమా, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, బిల్ పేమెంట్స్ ఇలా అన్ని రకాలు సేవలను అందించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న వాల్‌మార్ట్ చర్చల్లో ఉంది. మరోవైపు టాటా , వాల్‌మార్ట్, గోల్డ్‌మన్ సాచే ఈ అంచనాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
గుడ్‌న్యూస్ : టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి..
వాషింగ్టన్ : జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా జారీచేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాలో బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌తో టిక్‌టాక్ జట్టు కట్టేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా కొనసాగించేందుకు ఒరాకిల్-వాల్‌మార్ట్ టిక్‌టాక్ యాజమాన్యం వేదికగా ఎంచుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా టిక్‌టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి నిషేదం అమల్లోకి రానుంది. అయితే తాజా ఒప్పందం ప్రకారం.. ఈ గడువును సెప్టెంబర్ 27 వరకు పెంచినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్, ఒరాకిల్ మధ్య డీల్‌కు అమెరికా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఆమోదముద్ర పడనుంది. దీనిపై ట్రంప్ ఇదివరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన) జాతీయ భద్రతకు ముప్పుగా చూపుతూ దేశీయ కార్యకలాపాలను అమెరికా సంస్థకు అమ్ముకోకపోతే ఈ నెల 20 నుంచి టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒరాకిల్ చేతికి అమెరికా టిక్‌టాక్ ఆపరేషన్స్ వచ్చాయి. అయితే ఈ డీల్ విలువ, టిక్‌టాక్‌లో ఒరాకిల్‌కు మెజారిటీ వాటా ఏదైనా దక్కబోతున్నదా? అన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు.. అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని సుమారు రూ.1.84 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ డీల్‌కు అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా రావాల్సి ఉన్నది. మరోవైపు టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను సంపాదించడానికి ఆసక్తి ఉందని మైక్రోసాఫ్ట్ ఆగస్టు ప్రారంభంలో తెలపగా.. దానిని టిక్‌టాక్ యాజమాన్యం సున్నితంగా తిరస్కరించింది. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు ఒరాకిల్ కట్టుబడి ఉంది. అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం కూడా నెరవేరనుంది. -
యాపిల్, వాల్‌మార్ట్ ప్లస్- యూఎస్ రికార్డ్స్
ఆరు రోజుల రికార్డ్ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడినప్పటికీ మంగళవారం తిరిగి అమెరికా స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ జంప్‌చేయడంతో ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఎస్అండ్పీ 26 పాయింట్లు(0.75%) బలపడి 3,527కు చేరగా.. నాస్డాక్ 164 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,940 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 216 పాయింట్లు(0.8%) ఎగసి 28,646 వద్ద స్థిరపడింది. ఆగస్ట్‌లో తయారీ రంగ పీఎంఐ గణాంకాలు 19ఏళ్ల గరిష్టాన్ని తాకడంతో సెంటిమెంటుకు బూస్ట్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దిగ్గజాల అండ ఈ నెలాఖరు నుంచి మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొనడంతో వాల్‌మార్ట్ 6 శాతం జంప్‌చేసింది. రీసెర్చ్ సంస్థలు బయ్ రేటింగ్ ద్వారా టార్గెట్ ధరను పెంచడంతో యాపిల్ ఇంక్ 4 శాతం ఎగసింది. 5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనమైంది. ఇక జూమ్ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. క్యూ2లో పటిష్ట ఫలితాలకుతోడు.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం జూమ్ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆగస్ట్‌లో స్పీడ్ గత నెలలో యూఎస్ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. డోజోన్స్ 7.6 శాతం, ఎస్అండ్పీ 7 శాతం చొప్పున పుంజుకోగా.. నాస్డాక్ మరింత అధికంగా 9.6 శాతం దూసుకెళ్లింది. వెరసి 2020 జనవరి నుంచి ఎస్అండ్పీ 8.3 శాతం, నాస్డాక్ 31.2 శాతం ర్యాలీ చేయగా.. డోజోన్స్ 0.4 శాతం వెనకడుగులో ఉంది. ఇందుకు ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు దోహదం చేశాయి. ఆగస్ట్లోమైక్రోసాఫ్ట్ 10 శాతం లాభపడగా.. 2020లో ఇప్పటివరకూ 43 శాతం జంప్‌చేసింది. ఇదే విధంగా గత నెలలో యాపిల్ ఇంక్ 21.4 శాతం పుంజుకోగా.. ఈ ఏడాదిలో 76 శాతం దూసుకెళ్లింది. టెస్లా జోరు ఆగస్ట్‌లో యాపిల్ ఇంక్ 4:1 నిష్పత్తిలోనూ, టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలోనూ షేర్ల విభజనను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో టెస్లా ఇంక్ షేరు 74 శాతం జంప్‌చేసింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 496 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. డోజోన్స్‌లో ఎగ్జాన్ మొబిల్, ఫైజర్ ఇంక్, రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోగా.. వీటి స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్, యామ్జెన్ ఇంక్, హనీవెల్ ఇంటర్నేషనల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. -
రైతులకు అండగా వాల్‌మార్ట్ ఫౌండేషన్
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్‌మార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచింది. చింతపల్లి ఏరియాలో పండించే పసుపు పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, ఇక్కడ పండే పసుపులో మందుల తయరీకి ఉపయోగించే కర్కుమిన్ 5 నుంచి 7 శాతం ఉండటంతో గిరాకీ అధికంగా ఉంటుంది. అయితే లాక్డౌన్ సమయంలో ఈ పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండటంతో టెక్నో సెర్వ్ అనే లాభాపేక్ష లేని సంస్థ సహకారంతో వాల్‌మార్ట్ ఫౌండేషన్ ఈ పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల 2,500 మంది చిన్న,సన్నకారు రైతులు లబ్ధిపొందినట్లు వాల్‌మార్ట్.ఆర్గ్, డైరెక్టర్ (స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్) షెర్రీ-లీ సింగ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. ►రైతులు తమ పంటను అమ్ముకోవడమే కాకుండా ఈ వ్యవసాయ సీజన్లో మరో పంటను వేసుకోవడానికి వీలుగా వారి చేతికి నగదు అందుతోంది. ►ఇప్పటి వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా 15కు పైగా రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా 17,000 మంది రైతులకు ప్రయోజనం లభించింది. ► ఈ లాక్డౌన్ సమయంలో పసుపుతో పాటు, జీడిపప్పు, మిరియాలు కూడా కొనుగోలు చేసినట్లు టెక్నోసెర్వ్ ఇండియా కంట్రీ హెడ్ పునీత్ గుప్తా తెలిపారు. -
అమెజాన్ ప్రైమ్‌కు వాల్‌మార్ట్ చెక్!
కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో తలెత్తిన ఆందోళనలకుతోడు.. ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. డోజోన్స్ 397 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,890 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) నీరసించి 3,145 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 90 పాయింట్లు(0.9 శాతం) నష్టంతో 10,344 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టం నుంచి నాస్డాక్ వెనకడుగు వేయగా.. ఎస్అండ్పీ ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. యూరోప్ వీక్ మే నెలలో పారిశ్రామికోత్పత్తి 7.8 శాతమే పుంజుకున్నట్లు జర్మన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విశ్లేషకులు 10 శాతం పురోగతిని అంచనా వేయడంతో మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా మంగళవారం యూకే, ఫ్రాన్స్, జర్మనీ 0.6-1.5 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. ప్రస్తుతం ఆసియాలో ఇండొనేసియా, చైనా, తైవాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ 1.4-0.3 శాతం మధ్య బలపడి ట్రేడవుతున్నాయి. ఇతర మార్కెట్లలో జపాన్, కొరియా 0.5-0.25 శాతం చొప్పున డీలాపడగా.. సింగపూర్ యథాతథంగా కదులుతోంది. వాల్‌మార్ట్ జోరు యూఎస్ ప్రభుత్వం కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 160 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,000 కోట్లు) కేటాయించడంతో ఫార్మా కంపెనీ నోవావాక్స్ ఇంక్ షేరు దాదాపు 32 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో 4.5 కోట్ల డాలర్లు పొందడంతో రీజనరాన్ ఫార్మా 2.2 శాతం పుంజుకుంది. అమెజాన్ ప్రైమ్ సర్వీస్‌కు పోటీగా మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంతో రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంక్ 7 శాతం జంప్‌చేసింది. దీంతో అమెజాన్ షేరు 2 శాతం నీరసించింది. ఇండియాలోనూ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ప్రధాన వాటా కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇటీవల రికార్డ్ గరిష్టాలను తాకుతున్న ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు మరో 1.3 శాతం బలపడి 1390 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 1425 డాలర్లను అధిగమించింది. నేలచూపులో ఇతర బ్లూచిప్స్‌లో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1.2 శాతం నీరసించగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 7 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో కరిబియన్, నార్వేజియన్ క్రూయిజర్ షేర్లు 5 శాతం చొప్పున నష్టపోయాయి. యూఎస్‌లోని ఆరిజోనా, టెక్సాస్ తదితర రాష్ట్రాలతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్‌లోని మరికొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
వాల్‌మార్ట్, ఏటీఅండ్‌టీకి ఫెడ్ దన్ను
కోవిడ్-19 ధాటికి కుదేలైన కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థికంగా దన్నునిచ్చే బాటలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలును ప్రారంభించింది. దీనిలో భాగంగా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, టెలికం దిగ్గజం ఏటీఅండ్‌టీ, వారెన్ బఫెట్ కంపెనీ బెర్కషైర్ హాథవే, ఫిలిప్ మోరిస్ తదితర కంపెనీల బాండ్లను సొంతం చేసుకుంది. ఇందుకు తొలి దశలో భాగంగా 428 మిలియన్ డాలర్లను వెచ్చించింది. వీటితోపాటు 530 కోట్ల డాలర్ల విలువైన 16 కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్‌లను సైతం కొనుగోలు చేసినట్లు ఫెడ్ ఆదివారం వెల్లడించింది. వెరసి చరిత్రలో తొలిసారి ఫెడరల్ రిజర్వ్ ఇండివిడ్యుయల్ కంపెనీల బాండ్లను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ నిధులు తాజా ప్రణాళికల్లో భాగంగా ఏటీఅండ్‌టీ, యునైటెడ్ హెల్త్ గ్రూప్‌నకు చెందిన 16.4 మిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విడిగా ఫెడ్ కొనుగోలు చేసింది. బాండ్ల కొనుగోలు ద్వారా నిధులు అందించే ప్రణాళికలకు అనుగుణంగా ప్రస్తుతం 790 కంపెనీలు ఎంపికైనట్లు ఫెడ్ తెలియజేసింది. తొలి దశలో భాగంగా వీటిలో 86 కంపెనీల బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల క్రెడిట్ రేటింగ్ జంక్ స్థాయికి డౌన్‌గ్రేడ్ అయిన ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ బాండ్లను సైతం సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. పావెల్‌కు పరీక్ష కరోనా వైరస్ కారణంగా కుదేలైన కంపెనీలకు అండగా.. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం ఇండివిడ్యుయల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు లిక్విడిటీని కల్పించే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. తద్వారా కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోకుండా సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నాయి. కాగా.. మంగళవారం(30న) ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విడిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు అంశంపై న్యాయ నిపుణులు పావెల్‌ను ప్రశ్నించనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
వ్యాపార పునర్వ్యవస్థీకరణలో వాల్‌మార్ట్
న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తాజాగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 56 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉండగా, మిగతా వారిలో.. మధ్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన వారిలో అత్యధిక శాతం మంది .. స్టోర్స్ విస్తరణలో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంలోని వారే కావడం గమనార్హం. ‘మరింత మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించుకునే మార్గాలపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగానే కార్పొరేట్ స్వరూపంలో మార్పులు చేస్తున్నాం‘ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. భారత్‌కు కట్టుబడి ఉన్నాం.. హోల్‌సేల్ రిటైల్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని, వీటి నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా ఆరు బెస్ట్ ప్రైస్ హోల్‌సేల్ స్టోర్స్, ఒక ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభించినట్లు.. అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు అయ్యర్ చెప్పారు. కస్టమర్లకు మరింతగా సేవలు అందించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. అమెజాన్, జియోమార్ట్‌లతో పోటీ.. 2014 జులైలో పుణె, హైదరాబాద్‌లో బెస్ట్ ప్రైస్ స్టోర్స్‌తో వాల్‌మార్ట్.. భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫార్మాట్ల ద్వారా విక్రయాలు జరుపుతోంది. 28 హోల్‌సేల్ స్టోర్స్ ఉన్నాయి. 2018లో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా పోటీ సంస్థ అమెజాన్.. దూకుడుగా ముందుకెడుతోంది. ఫ్యూచర్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఇతరత్రా ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల్లోనూ వాటాలు దక్కించుకుంటోంది. మరోవైపు దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జియో మార్ట్ పేరిట నిత్యావసరాల ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. -
వాల్‌మార్ట్‌తో టీఐహెచ్‌సీ ఒప్పందం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో తయారీ రంగంలోని ఖాయిలా పరిశ్రమలను పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్‌సీ) అమెరికాకు చెందిన రిటైల్ బహుళ జాతి కంపెనీ వాల్‌మార్ట్‌తో ఒప్పందం చేసుకోనుంది. టీఐహెచ్సీలోని ఎంఎస్ఈలకు ఆన్లైన్ వేదికను అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని టీఐహెచ్‌సీ అడ్వైజర్ డాక్టర్ బి. యెర్రం రాజు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ‘‘రూ.100 కోట్ల సోషల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పలు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల లాకిన్ పీరియడ్‌తో 7 శాతం డివిడెండ్‌ను కేటాయిస్తాం. వచ్చే 3 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఖాయిలా పడ్డ 43 ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించామని... వీటి ద్వారా సుమారు 1,100 మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుతం మరొక 12 ఎంటర్‌ప్రైజ్‌లు పునరుద్ధ్దరణ జాబితాలో ఉన్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నారీ పథకాన్ని ఏర్పాటు చేశాం. వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. గరిష్ట రుణం రూ.25 లక్షలు’ అని ఆయన వివరించారు. -
వాల్‌మార్ట్ రూ.1,616 కోట్ల పెట్టుబడి
వాల్‌మార్ట్‌కు చెందిన భారత ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఈ పండుగల సీజన్ కోసం తన మాతృసంస్థ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడిని అందుకుంది. సింగపూర్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలో రూ.1,616 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందుకోసం భారత సంస్థ తనకు 4,64,403 ఈక్విటీ షేర్లను (ఒక్కో షేరు విలువ రూ.34,800) జారీ చేసినట్లు పేర్కొంది. ఈఏడాది జనవరిలో రూ.1,431 కోట్లను పెట్టుబడి పెట్టగా.. ఇది ప్రస్తుత ఏడాదిలో రెండో విడత పెట్టుబడిగా వెల్లడించింది. -
ఫ్లిప్‌కార్ట్ నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లు
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ తన సరఫరా వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. పండుగల సీజన్ నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే ఆర్డర్లను అంతే వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లను చేర్చుకుంది. దీంతో మరిన్ని ప్రాంతాలకు, కస్టమర్లను చేరుకోవడం కంపెనీకి వీలు పడుతుందని, అదే సమయంలో కిరాణా స్టోర్లకు ఆదాయం పెరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా రానున్న బిగ్ బిలియన్ డేస్ కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త కస్టమర్లను చేరుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది. ‘‘ఆరు నెలల క్రితమే దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్ల చేరిక మొదలైంది. రానున్న పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నాం. కిరాణా స్టోర్లు అన్నవి దేశంలో ఎంతో కాలంగా ఉన్న రిటైల్ విధానం. డిజిటల్ చెల్లింపుల అనంతరం, కిరాణాలో తదుపరి విప్ల వం ఈ కామర్స్‌తో అనుసంధానించడమే’’ అని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..
న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొనే దిశగా వాల్‌మార్ట్ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో స్ట్రీమింగ్ సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ప్రకటించింది. ’ఫ్లిప్‌కార్ట్ వీడియోస్’ పేరిట ఈ సర్వీసు ప్రారంభించనుంది. ప్రకటనల ఆదాయంతో నిర్వహించే ఈ సర్వీసు.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. షార్ట్ ఫిలిమ్లు, పూర్తి నిడివి సినిమాలు, సిరీస్‌లు మొదలైనవి ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌లో ఉంటాయి. పండుగ సీజన్ రానున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. షాపింగ్ కోసమే కాకుండా మా ప్లాట్‌ఫాంపై యూజర్లు మరింత సమయం వెచ్చించేలా చేయాలని యత్నిస్తున్నాం‘ అని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. ముందుగా హిందీతో ప్రారంభించి తర్వాత దశల్లో తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా కంటెంట్ అందించనున్నట్లు వివరించారు. -
24గంటల్లో రెండుసార్లు కాల్పులు
-
రిలయన్స్ రిటైల్‌కు 94వ ర్యాంక్
న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సంస్థ మరో ఘనత సాధించింది. డెలాయిట్ ప్రకటించిన గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2019 ఇండెక్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 94వ స్థానంలో నిలిచింది. గతేడాది మార్చితో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆదాయం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 250 సంస్థలకు డెలాయిట్ ర్యాంకులు కేటాయించిందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పతుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ సంస్థకు మంచి ర్యాంకు దక్కించుకుందని వెల్లడించింది. (ఈ–కిరాణాలో హోరాహోరీ) డెలాయిట్ ప్రకటించిన టాప్ 250 రిటైల్ కంపెనీల జాబితాలో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలు చేసి వాల్‌మార్ట్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంది. అమెరికన్ కంపెనీలు కాస్ట్కో, క్రోజర్ వరుసగా రెండో, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్‌టెన్‌లో ఏడు అమెరికా కంపెనీలు ఉండటం విశేషం. మొత్తం జాబితాలో అత్యధికంగా 87 యూరోప్ కంపెనీలు ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్ బిన్నీ రాజీనామా!!
న్యూఢిల్లీ: ‘తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణల కారణంగా దేశీ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ మంగళవారం గ్రూప్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవలే కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి స్వతంత్రంగా విచారణ జరిపామని, కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను ధ్రువీకరించడానికి తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అయినప్పటికీ విచారణ అనంతరం బన్సల్ వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారని, సదరు ఆరోపణల మీద బిన్నీ స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం కారణంగా ఆయన రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్ వివరించింది. ‘‘ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆరోపణలపై క్షుణ్నంగా విచారణ చేశాం. బిన్నీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ కనిపించలేదు. కానీ ఆ వ్యవహారాన్ని సరిగ్గా అంచనా వేయడంలో బిన్నీ విఫలం కావడం, ఆయన స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం వంటి అంశాలు బయటపడ్డాయి. దీంతో ఆయన రాజీనామాను ఆమోదించాం‘ అని వాల్‌మార్ట్ పేర్కొంది. తక్షణమే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ‘వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు‘ అంటూ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, ఏమిటా ఆరోపణలన్నది మాత్రం వాల్‌మార్ట్ నిర్దిష్టంగా వివరించలేదు. అయితే ఈ ఆరోపణలు జూలైలో వచ్చాయని... వెంటనే వాల్‌మార్ట్ ఒక న్యాయవాద సంస్థతో వీటిపై విచారణ ఆరంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిర్యాదిదారు కొన్నాళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీతో కలిసి పనిచేశారని, ప్రస్తుతం ఆమె తన సొంత వెంచర్ నిర్వహించుకుంటున్నారని వివరించాయి. కానీ, వీటిని ధ్రువీకరించుకునేందుకు తగిన ఆధారాలు లభించలేదు. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను బిన్నీ బన్సల్ ఖండించారు. ఇకపైనా సంస్థలో వాటాదారుగా, బోర్డులో సభ్యుడిగా కొనసాగుతానని పేర్కొన్నారు. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మేలో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా సచిన్ బన్సల్ తన మొత్తం 5.5% వాటాను విక్రయించేసి తప్పుకోగా, బిన్నీ బన్సల్ మాత్రం కంపెనీలోనే కొనసాగుతున్నారు. కొత్త సారథి ఎంపిక వేగవంతం.. కొన్నాళ్లుగా బిన్నీ బాధ్యతలను బదలాయించే యోచనలో ఉన్నారని, వారసుల ఎంపికపై ఆయనతో కలిసి కొద్ది రోజులుగా తాము కూడా కసరత్తు చేస్తూనే ఉన్నామని వాల్‌మార్ట్ తెలిపింది. బిన్నీ నిష్క్రమణతో కొత్త సారథి నియామక ప్రక్రియ వేగవంతమైందని పేర్కొంది. మింత్రా, జబాంగ్‌తో కూడిన ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా కళ్యాణ్ కృష్ణమూర్తి కొనసాగుతారని వివరించింది. అయితే, మింత్రా, జబాంగ్‌లు ప్రత్యేక సంస్థలుగానే కొనసాగుతాయని, వీటి సీఈవోగా అనంత్ నారాయణన్ కొనసాగుతారని వాల్‌మార్ట్ వివరించింది. కృష్ణమూర్తికి అనంత్ నారాయణన్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ విభాగం ’ఫోన్‌పే’ సీఈవోగా సమీర్ నిగమ్ కొనసాగుతారు. కృష్ణమూర్తి, నిగమ్ నేరుగా బోర్డుకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వాల్‌మార్ట్ వివరించింది. పెట్టుబడుల ప్రక్రియ యథాప్రకారం.. దీర్ఘకాలంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ తెలిపింది. భవిష్యత్‌లో ఐపీవోకి రావాలన్న ప్రస్తుత లీడర్షిప్ టీమ్‌కి పూర్తి మద్దతునిస్తామని పేర్కొంది. మరోవైపు, తాజా పరిణామాల నేపథ్యంలో సంస్థ భవిష్యత్‌పై ఉద్యోగులు ఆందోళన చెందరాదని సంస్థ సిబ్బందికి అంతర్గతంగా పంపిన ఈ–మెయిల్లో కృష్ణమూర్తి భరోసానిచ్చారు. ‘ఈ వార్తల కారణంగా కంపెనీ నిర్వహణ, లక్ష్యాల సాధనలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఫ్లిప్‌కార్ట్ ఇకపై కూడా కొంగొత్త టెక్నాలజీలు, నవకల్పనలు, సరఫరా వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుంది’ అని కృష్ణమూర్తి తెలిపారు. -
ఈ–కిరాణాలో హోరాహోరీ
ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ఈ–గ్రోసరీ సెగ్మెంట్ (ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్ ఆర్డర్ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్ కేక్. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, –మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింతగా గుమ్మరించడం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం కోసం పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ సంస్థ ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తన ఈ కామర్స్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయబోతోంది. అంతేకాకుండా ఇటీవలనే మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్ కంపెనీ కూడా ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసం భారీగా పెట్టుబడులు గుమ్మరించబోతోంది. బిగ్‌బాస్కెట్ కోసం పేటీఎమ్ మాల్... బిగ్‌బాస్కెట్ మొదటగా బెంగళూరులో తన కార్యకలాపాలు ఆరంభించింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్‌ను డెలివరీ చేస్తోంది. 20,000పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. లో అత్యధిక మార్కెట్ వాటా బిగ్ బాస్కెట్‌దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్‌బాస్కెట్‌కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా. ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినప్పటికీ, ఈ కంపెనీ ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్ ప్లాట్ఫార్మ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించిన చర్చలు గత ఏడాదే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని సమాచారం. వాల్‌మార్ట్ సంస్థ, భారత్‌లో ఈ కామర్స్ సంస్థతో టై–అప్ కుదుర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినప్పటినుంచే బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు పేటీఎమ్ చర్చలు జరపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బిగ్‌బాస్కెట్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎమ్‌కు దన్నుగా నిలుస్తున్న అలీబాబా.. బిగ్‌బాస్కెట్‌లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా పేర్కొంది. విలువ దగ్గరే పీటముడి ? బిగ్‌బాస్కెట్–పేటీఎమ్ మాల్ డీల్ విషయమై... బిగ్‌బాస్కెట్ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైననే పీటముడి పడినట్లు బిగ్‌బాస్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశం తేలకనే చర్చలు ముందుకు సాగట్లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకుగాను పేటీఎమ్ మాల్లో తమకొక డైరెక్టర్ పదవి కావాలని కూడా బిగ్‌బాస్కెట్ కోరుతోందని సమాచారం. డీల్ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్‌బాస్కెట్‌కు ప్రీమియమ్ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి. బిగ్‌బాస్కెట్ అయితే బావుంటుంది..! ఈ కామర్స్ స్పేస్‌లో అమెజాన్–ఫ్లిప్‌కార్ట్‌ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్ మాల్ ఈ కామర్స్ స్పేస్‌లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్‌బాస్కెట్‌లో వాటా కొనుగోలు కోసం పేటీఎమ్ మాల్ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని నిపుణులంటున్నారు. బిగ్‌బాస్కెట్‌తో టై అప్ వల్ల పేటీఎమ్ మాల్‌కు రిపీటెడ్ కస్టమర్లు లభిస్తారని, ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్‌బాస్కెట్‌తో జత కడితే అది పేటీఎమ్ మాల్‌కు, బిగ్‌బాస్కెట్.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు. ఈ–గ్రోసరీదే హవా... ఆన్లైన్ మార్కెట్ సంస్థలకు భవిష్యత్తులో గ్రోసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని రెండేళ్ల క్రితమే అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అంచనా వేశారు. అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఐదేళ్లలో ఆన్లైన్ వ్యాపారంలో సగం వాటా గ్రోసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ గ్రోసరీ మార్కెట్ జోరు అంతకంతకూ పెరగనున్నదని గుర్తించిన అన్ని ఈ–కామర్స్ సంస్థలు గ్రోసరీస్పేస్లో మరింత మార్కెట్ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాల్‌మార్ట్ నుంచి సూపర్‌మార్ట్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ తదితర సంస్థలు ఈ గ్రోసరీ సెగ్మెంట్లో మరింత వాటా కొల్లగొట్టడంపై దృష్టి పెట్టాయి. ఇటీవలనే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్...ఈ గ్రోసరీ సెగ్మెంట్ కోసమే 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్లైన్ గ్రోసరీ విభాగాన్ని సూపర్‌మార్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్‌బై ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్‌కార్ట్ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సప్లై చెయిన్‌ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే 8,000 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో నాలుగో అతి పెద్ద రిటైల్ చెయిన్ మోర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు. ♦ రూ.1,460 కోట్లు–బిగ్‌బాస్కెట్‌లో ఆలీబాబా ఇన్వెస్ట్ చేసిన మొత్తం ♦ రూ.2,920 కోట్లు –ఈ–గ్రోసరీ కోసం వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్ చేయనున్న మొత్తం ♦ రూ.4,200 కోట్లు–మోర్ కోసం అమెజాన్, సమర క్యాపిటల్‌లు వెచ్చించిన మొత్తం ♦ 8,000– రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య. ఈ స్టోర్స్‌ను ఈ–గ్రోసరీ కోసం వినియోగించాలనుకుంటున్న రిలయన్స్ -
దిగ్గజాల దొడ్డిదారి!!
(సాక్షి, బిజినెస్ విభాగం) : చిన్నచిన్న వర్తకులు అసంఖ్యాకంగా ఆధారపడిన దేశీ రిటైల్ రంగంలోకి భారీ సూపర్ మార్కెట్లు రావటమన్నదే అనేక వివాదాల నడుమ సాకారమయింది. వీటితో తమ బతుకుదెరువు పోతుందని భయపడి.. ఆందోళనలు చేసిన ఆయా వ్యాపారులంతా మెల్లగా పరిస్థితులకు అలవాటుపడ్డారు. ఆ తరవాత హోల్‌సేల్, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ సంస్థల్ని పూర్తిగా అనుమతించినా... మల్టీ బ్రాండ్ రిటైల్‌లో మాత్రం ఇప్పటికీ విదేశీ సంస్థలకు 49 శాతం వాటాల వరకే అనుమతి ఉంది. కాకపోతే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు వెనుకచాటుగా దీనికి తూట్లు పొడుస్తున్నవేననేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవల అమెరికన్ రిటైల్ స్టోర్ల చెయిన్ వాల్‌మార్ట్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. నిజానికి వాల్‌మార్ట్ ఇప్పటికే హోల్‌సేల్ స్టోర్ల ద్వారా దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే దీనికి రిటైలర్లకు విడివిడిగా వస్తువుల్ని అమ్మే అర్హత లేదు. ఇపుడు ఫ్లిప్‌కార్ట్ దీని చేతికొచ్చింది కనక... మున్ముందు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వస్తువుల్ని కొనుగోలుదార్లకు వాల్‌మార్ట్ స్టోర్ల నుంచి డెలివరీ చేసే అవకాశం దీనికొస్తుంది. అలా చూస్తే ఇది నేరుగా మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి వచ్చేసినట్లే లెక్క. కానీ సాంకేతికంగా చూసినపుడు వాల్‌మార్ట్ హోల్సేల్కే పరిమితమవుతుంది. తాజాగా మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసేందుకు సమర క్యాపిటల్, అమెజాన్ కుదుర్చుకున్న డీల్ కూడా అలాంటిదే. తాజా డీల్ ప్రకారం మోర్లో 49 శాతం వాటాల్ని నేరుగా అమెజాన్ కొంటుంది. మిగతా 51 శాతం వాటాలు కొంటున్న సమర క్యాపిటల్‌కు చెందిన సంస్థలోనూ అమెజాన్‌కు వాటా ఉంటుంది. ఆ లెక్కన అమెజాన్ చేతికి మోర్ వచ్చేసినట్లే. అపుడు అమెజాన్‌లో కొనుగోలు చేసే వస్తువుల్ని మోర్ స్టోర్ల నుంచి డెలివరీ చేసే అవకాశం దానికి దక్కుతుంది. ఈ లెక్కన చూసినపుడు... ఆఫ్‌లైన్ స్టోర్లున్న వాల్‌మార్ట్.... ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌ను కొనుగోలు చేసింది. ఆన్లైన్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్... ఆఫ్‌లైన్ స్టోర్లున్న మోర్ ను కొనుగోలు చేసింది. మున్ముందు దేశీ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో రెండూ విదేశీ దిగ్గజాలే రాజ్యమేలుతాయన్నది ఈ రంగంలోని నిపుణుల మాట. ఇటీవలే అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం ‘ఐకియా’ కూడా హైదరాబాద్‌లో స్టోర్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. ఐకియా నిజానికి ఫర్నిచర్, ఫర్నిషింగ్ వస్తువులమ్మే సంస్థ. కానీ ఫుడ్, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మినహా ఒక ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దీన్లో లభ్యమవుతాయి. ఐకియా వీటన్నిటినీ వివిధ కంపెనీల ద్వారా తయారు చేయిస్తుంది. కాకుంటే తయారు చేసింది ఎవరైనా... వీటన్నింటికీ ‘డిజైన్డ్ బై ఐకియా’ అనే ట్యాగ్ మాత్రం ఉంటుంది. స్థూలంగా చూస్తే దేశీ రిటైల్ మార్కెట్లోకి విదేశీ దిగ్గజాలు రకరకాల మార్గాల్లో రానే వస్తున్నాయన్నది స్పష్టం కాకమానదు. -
ఎన్సీఎల్ఏటీకి వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్
న్యూఢిల్లీ: దేశీయ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ బహుళ ప్రొడక్టుల రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేయడంపై ట్రేడర్స్ సంఘం– సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్) తీవ్రంగా నిరసించింది. దీనికి వ్యతిరేకంగా ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో తమ వాదనలు వినిపించడానికి సీసీఐ తగిన అవకాశం ఇవ్వలేదని ట్రిబ్యునల్‌కు సీఏఐటీ తెలిపింది. వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ కలయిక మార్కెట్లో పూర్తి గుత్తాధిపత్యం నెలకొంటుందని సీఏఐటీ పేర్కొంది. ఈ కొనుగోలు వల్ల మిగిలిన టోకు వ్యాపారుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నది తమ వాదనని సీఏఐటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఈ రెండు సంస్థలూ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడిన అంశాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పట్టించుకోలేదని సీఏఐటీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ బహుళ ప్రొడక్టుల రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు ఒప్పందానికి ఈ నెల 8వ తేదీన సీసీఐ ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ దాదా పు 16 బిలియన్ డాలర్లు. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ ఈ ఏడాది మేలో తొలుత ప్రకటించింది. -
వాల్‌మార్ట్, రిలయన్స్‌కు ప్రపంచ కుబేరుడు చెక్
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అమెజాన్, రిలయన్స్ రిటైల్, వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లకు చెక్పెట్టబోతుంది. వాటిపై పోటీకి ఆదిత్య బిర్లా గ్రూప్‌ను టార్గెట్ చేసింది. ఆదిత్య బిర్లాకు చెందిన రిటైల్ స్టోర్ మోర్లో వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. ఫుడ్, గ్రోసరీ సూపర్‌మార్కెట్ మోర్‌ను కొనుగోలు చేసేందుకు గోల్డ్ మ్యాన్ సాచ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్‌తో కన్సోర్టియం ఏర్పాటు చేస్తోంది. మోర్లో వాటాను కొనుగోలు చేసే డీల్ రూ.4500 కోట్ల నుంచి రూ.5000 కోట్ల మధ్యలో ఉంటుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఇప్పటికే సమర, ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ ఈ ఎక్స్‌క్లూజివ్ అగ్రిమెంట్‌పై జూన్‌లోనే సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెలలో దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమర అనేది దేశీయ ఫండ్. ఈ నిధి సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్చ్, అమెజాన్‌ను కలిసినట్టు కూడా వెల్లడైంది. ఈ మూడు కలిసి ప్రత్యేక కంపెనీని లేదా ప్రత్యేక ప్రయోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి. దీనిలో వ్యూహాత్మక భాగస్వామ్యదారిగా 49 శాతం వాటాను దక్కించుకోవాలని అమెజాన్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇండియన్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ చట్టాల ప్రకారం, విదేశీ కంపెనీలు మల్టి బ్రాండ్ రిటైలర్లలో కేవలం 49 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండాలి. క్యాష్ అండ్ క్యారీ రిటైలింగ్‌లో సంస్థలను ఏర్పాటు చేస్తూ.. 100 శాతం విదేశీ యజమాన్యాన్ని అనుమతిస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీలకు దేశీయ గ్రూప్‌లు, సంస్థలు ముందుండి నడిపిస్తుంటాయి. గతేడాదిలోనే అమెజాన్, షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను దక్కించుకుంది. అమెరికాలో కూడా హోల్ ఫుడ్స్ అనే సంస్థను అమెజన్ 13.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు 77 శాతం వాటాలు..
న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 77 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ డీల్ కోసం వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ మెగా డీల్‌ను ఈ ఏడాది మేలో ప్రకటించారు. ‘ఇన్వెస్ట్మెంట్ పూర్తి కావడంతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు దాదాపు 77% వాటాలు లభించాయి. మిగతా వాటా ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మొదలైన ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటుంది‘ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటికీ.. రెండు సంస్థలూ వేర్వేరు బ్రాండ్స్‌గానే కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత మేనేజ్మెంట్ టీమ్ సారథ్యంలోనే ఉంటుంది. వాల్‌మార్ట్‌కి చెందిన అధికారులు ఫ్లిప్‌కార్ట్ బోర్డులో చేరతారు. ఇకపై ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక ఫలితాలను వాల్‌మార్ట్ అంతర్జాతీయ వ్యాపార ఫలితాల్లో చేర్చనున్నారు. నాణ్యమైన, చౌక ఉత్పత్తులను సమకూర్చడం ద్వారా ఈ డీల్ భారత్‌కు తోడ్పడగలదని, అలాగే కొత్తగా ఉపాధి కల్పనకు.. సరఫరాదారులకు వ్యాపార అవకాశాలు కల్పించగలదని వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ జూడిత్ మెకెన్నా తెలిపారు. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 21 హోల్‌సేల్ స్టోర్స్ ఉన్నాయి. -
ఈబే ఇండియా ఇక లేదు
బెంగళూరు : చాలా సంవత్సరాలుగా భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో తన సేవలను అందించిన ఆన్లైన్ సంస్థ ఈబే.ఇన్ మూతపడింది. నేటి నుంచి అంటే ఆగష్టు 14 నుంచి తన ఈబే.ఇన్ కార్యకలాపాలను దిగ్గజ ఈ-రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మూసివేసింది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా దక్కించుకున్న మూడు నెలల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘క్షమించండి, ఈబే.ఇన్‌లో ఇక ఏ లావాదేవీలు జరుపడానికి వీలుండదు. కానీ ఆందోళన చెందాల్సివసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ త్వరలో మరో కొత్త బ్రాండ్ షాపింగ్ అనుభవాన్ని అందించనుంది’ అని ఈబే ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏ కొత్త ఆర్డర్లను ఇక ఈబే స్వీకరించదు. కొనుగోలుదారులు తమ క్లయిమ్స్‌ను పొందడానికి చివరి తేదీ ఆగస్టు 30గా కంపెనీ నిర్ణయించింది. జూలై 26 నుంచే 250 రూపాయల కంటే తక్కువ, 8000 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ఉత్పత్తులను డీలిస్ట్ చేయడం ప్రారంభించింది. కాగా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంవత్సరం క్రితం 1.4 బిలియన్ డాలర్లకు ఈబేను కొనుగోలు చేసింది. 1995లో ఈబేను స్థాపించారు. ఇది కాలిఫోర్నియాకు చెందినది. 2004లో ఈబే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఈబే బ్రాండ్‌ను మూసేసి.. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ పైనే కొత్త పేరుతో ఈబే అమ్మకాలను సాగించాలని ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త వెబ్సైట్ లాంచింగ్‌పై మాత్రం ఫ్లిప్‌కార్ట్ స్పందించలేదు. -
అద్భుతం: వాల్‌మార్ట్‌తో ఆరేళ్ల బాలుడి డీల్!
న్యూఢిల్లీ : ముద్దులొలికే మాటలతో అలరించే ఓ ఆరేళ్ల బాలుడు అద్భుతం చేశాడు. అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్‌లో టోయస్(బొమ్మలను) సమీక్షించే ఆరేళ్ల బాలుడు ర్యాన్, ఏకంగా తన సొంత టోయస్ బ్రాండులను మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. దీని కోసం వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో, వెబ్‌సైట్‌తో సోమవారం డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ ర్యాన్ టోయస్రివ్యూకు ఈ అబ్బాయే స్టార్. గతేడాది 8వ బెస్ట్ పెయిడ్ యూట్యూబర్‌గా కూడా నిలిచాడు. యూట్యూబ్‌లో టోయిస్లను రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ ర్యాన్ యూట్యూబ్ టోయస్రివ్యూ ఛానల్‌కు 15 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. టోయస్తో ఆడుకుంటూ.. వాటికి అనుగుణంగా స్పందించే ర్యాన్ వీడియోలకు నెలకు 1 బిలియన్కు పైగా వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో టోయస్ రివ్యూ చేస్తూనే.. ఈ బాలుడు మిలీనియర్ అయ్యాడు. గతేడాది 11 మిలియన్ డాలర్లను ఆర్జించాడు. 2015 మార్చి నుంచి ర్యాన్ ఫ్యామిలీ ఆ బాలుడి వీడియోలను రికార్డు చేయడం, పోస్ట్ చేయడం చేస్తోంది. లిగో బ్యాక్స్ తెరవడం, దానితో ఆడటం ఈ బాలుడి తొలి వీడియో. మూడేళ్ల వయసులో దీన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇలా ర్యాన్ యూట్యూబ్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో తన సొంత బ్రాండ్ టోయస్‌నే ఏకంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. అక్టోబర్‌లో తన టోయస్ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు ర్యాన్ చెబుతున్నాడు. కాగ, యూట్యూబ్ స్టార్ల రీచ్‌ను విస్తరించడానికి వారితో పాకెట్.వాచ్ లైసెన్స్ డీల్స్ చర్చలు కూడా జరిపింది. టోయస్, అప్పీరల్, హోమ్ ప్రొడక్ట్‌లకు వీరి రీచ్‌ను విస్తరించాలనుకుంది. ర్యాన్ వరల్డ్ వర్తకం మూడేళ్లు, ఆపై వారికి డిజైన్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ర్యాన్‌కు ఇష్టమైన వాటిలో పిజ్జాలు కూడా ఉన్నాయి. -
విస్తరణ బాటలో వాల్‌మార్ట్
లక్నో: ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్... తన స్టోర్లను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో మరో 20 హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సోమవారం లక్నోలో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ ఈ విషయం చెప్పారు. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను పెంచడం ద్వారా ఆన్లైన్ బిజినెస్–టూ–బిజినెస్ (బీటూబీ) కస్టమర్లకు విస్తృత సేవలందించే అవకాశం లభిస్తుందన్నారు. వేగంగా పెరుగుతున్న ఈ–కామర్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘ఈ ఏడాదిలో రెండు, వచ్చే ఏడాదిలో 8, ఆ తరువాత ఏడాదిలో 10 స్టోర్లను ప్రారంభించడం ద్వారా వచ్చే మూడేళ్లలో మరో 20 స్టోర్లను భారత్‌లో ప్రారంభిస్తాం. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో 50 స్టోర్లను ప్రారంభిస్తాం. ’బెస్ట్‌ప్రైస్’ పేరుతో ఇప్పటికే భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాలలో 21 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లున్నాయి. రానున్న కాలంలో 15 స్టోర్ల ఏర్పాటుకు యూపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. తాజా ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ద్వారా 1,500 మందికి ఉద్యోగాలొచ్చాయి. పరోక్షంగా ఎస్ఎంఈ సప్లయర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వాల్‌మార్ట్ ఇండియా వ్యాపారంలో సగం వరకు స్టోర్ రహిత, అవుట్ ఆఫ్ స్టోర్ అమ్మకాల ద్వారా జరుగుతుంది.‘ అని వివరించారు. -
వాల్‌మార్ట్-ఫ్లిప్కార్ట్డీల్కు సియాట్ సెగ
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ వాల్మార్ట్డీల్కు వ్యతిరేకంగా రీటైల్ దుకాణదారులు, ఆన్లైన్ ట్రేడర్లు త్రీవ నిరసన వ్యక్తంచేశాయి. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఆందోళన నిర్వహించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మంది వ్యాపారులు దేశవ్యాప్త నిరసనకు దిగారు. ఈస్టిండియా కంపెనీ లాంటి వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కారణంగా తమ వ్యాపారం భారీగా దెబ్బతింటుందని ఆరోపించారు. తమ వ్యాపారాలను ఆదుకోవాలని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో సియాట్ సోమవారం ధర్నాలకు దిగింది. ఈ డీల్ కారణంగా రిటైల్ మార్కెట్లో గుత్తాధిపత్యం వస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు నాణ్యత లేని వస్తువులను భారత మార్కెట్లో చొచ్చుకు రానున్నాయని వాదించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యపరిశ్రమల శాఖ కల్పించుకోవాలని డిమాండ్‌చేశారు. తక్షణమే ఈ కామర్స్ విదానాన్ని , ఈ కామర్స్రెగ్యులేటరీ బాడీని నియమించాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు ఈడీకి, సీసీఐకి ఫిర్యాదు దాఖలు చేసినట్టు చెప్పారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే.. సుప్రీకోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు.ఇది తమ నిరసన లో మొదటి దశ మరియు ప్రభుత్వం వినకపోతే, ఈ నెలలో ఢిల్లీలో ఒక జాతీయ సదస్సు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని సియాట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ స్పష్టం చేశారు. -
2018 చివరకు ఫ్లిప్‌కార్ట్ డీల్ క్లోజ్!!
హైదరాబాద్: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయా లని భావిస్తోంది. ఈ కంపెనీ మే నెలలో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత కార్యకలాపాల వల్ల తమ 2019 ఆర్థిక సంవత్సరపు నికర ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వాల్‌మార్ట్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు తెలియజేసింది. వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈవో, డైరెక్టర్ డగ్ మెక్‌మిలన్ ఇన్వెస్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎక్కడైతే అపార అవకాశాలు అందుబాటులో ఉంటాయో అక్కడ మేం ఉండాలని కోరుకుంటాం. అందుకే ఫ్లిప్‌కార్ట్‌తో డీల్ కుదుర్చుకున్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌లాంటి దేశాల్లో ఈ డీల్ విలువైనదని తెలిపారు. అదే చిన్న మార్కెట్ కలిగిన దేశాల్లో ఈ డీల్ ఉంటే మేం ఆసక్తి కనబరచే వాళ్లం కాదన్నారు. ముందుచూపుతో ఫ్లిప్‌కార్ట్‌తో డీల్ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. -
‘సీసీఐ’తో వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధుల భేటీ
న్యూఢిల్లీ: దేశీయ ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలును పూర్తి చేసేందుకు వాల్‌మార్ట్ చురుగ్గా వ్యవహరిస్తోంది. 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు ఈ సంస్థ ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. ఈ కొనుగోలుకు అనుమతి కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు (సీసీఐ) వాల్‌మార్ట్ గతవారమే దరఖాస్తు సమర్పించింది. ఇందుకు ఆమోదం పొందే ప్రయత్నాల్లో భాగంగా బుధవారం వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఉన్నతోద్యోగులు సీసీఐ సభ్యుడు సుధీర్ మిట్టల్‌తో సమావేశమయ్యారు. దేశీయంగా తమ కంపెనీల వ్యాపారం, అభివృద్ధి ప్రణాళికల గురించి వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్, కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రజనీష్‌కుమార్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్‌కృష్ణమూర్తి, గ్రూపు లీగల్ హెడ్ ఆర్.బవేజా ఉన్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ భేటీపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు. తమ రెండు కంపెనీలూ ఏకమైతే పోటీ పరమైన సమస్యలేవీ ఉత్పన్నం కాబోవని ఇరు కంపెనీలు సీసీఐకి సమర్పించిన దరఖాస్తులో పేర్కొన్నాయి. ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్ డీల్‌పై సీసీఐని ఆశ్రయిస్తామని ట్రేడర్ల సంఘం సీఏఐటీ గత వారం ప్రకటించటం గమనార్హం. ఈ రెండూ ఒక్కటైతే దేశీయ రిటైల్ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని రిటైలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ విక్రయదారుల సంఘం ఇప్పటికే సీసీఐని ఆశ్రయించింది. -
మెగా డీల్
-
ఒప్పందంపై బహుపరాక్!
ఆన్లైన్ వ్యాపారంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమైంది. చాన్నాళ్లుగా ఇరు సంస్థల వ్యవస్థాపకుల మధ్యా సాగుతున్న చర్చల పర్యవసానంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను రూ. 1,05,000 కోట్లతో వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్ చేపట్టిన కంపెనీ కొనుగోళ్లలో మాత్రమే కాదు... మొత్తం ఈ–కామర్స్ రంగంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారంటేనే ఫ్లిప్‌కార్ట్ ఏ స్థాయికి ఎదిగిందో అర్ధమవుతుంది. ఆన్లైన్ వ్యాపారానికి అంతగా ఆదరణలేని తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను అటువైపు ఆకర్షించడానికి చాలానే కృషి చేసింది. 2000 సంవత్సరంలో డాట్కామ్లు తామరతంపరగా పుట్టుకొచ్చినప్పుడు ఇక భవిష్యత్తంతా ఆన్లైన్ వ్యాపారానిదేనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. కానీ చాలా తక్కువకాలంలోనే అదంతా నీటిబుడగ చందంగా మాయమైంది. ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పిం చుకునే వస్తువులు నాసిరకంగా ఉంటాయన్న అనుమానాలు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరన్న భయాలు ఆ వ్యాపారానికి అవరోధంగా మారాయి. ఇలా అంతంతమాత్రం ఆదరణ ఉన్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అలాంటి భయాలను, అనుమానాలను పోగొట్టడానికి కృషి చేశాయి. దీనికితోడు టెక్నాలజీ రంగంలో వచ్చిన పెను మార్పులు, ఈ–కామర్స్ సంస్థ లిచ్చే భారీ డిస్కౌంట్లు కూడా ఆన్లైన్ వ్యాపార విస్తరణకు దోహదపడ్డాయి. వినియోగదారులు ముందుగా చెల్లించడం కాక, కోరుకున్నది తమకు చేరాకే డబ్బు చెల్లించే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ–కామర్స్ తీరునే ఫ్లిప్‌కార్ట్ మార్చేసింది. పుస్తకా లతో మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, టీవీలు, దుస్తులు... ఇలా ఆన్లైన్లో ఇప్పుడు దొరకనిదేదీ లేదు. వచ్చే అయిదేళ్లలో ఈ–కామర్స్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగు తుందంటున్నారు. అయితే ఇప్పటికీ మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం వాటాయే అధికం. ఆన్లైన్ వ్యాపారం ఎంతగా విస్తరిస్తున్నా సంప్రదాయ వ్యాపారం దరిదాపులకు అదింకా చేరలేదు. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం మన దేశంలో మొత్తం రిటైల్ రంగం విలువ 65000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 43,62,800కోట్లు)కాగా, అందులో ఇప్పటికీ 90 శాతం వాటా సంప్రదాయ రిటైల్ వ్యాపారానిదే. కానీ మున్ముందు ఇది ఇలాగే కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఈ– కామర్స్ సంస్థలు ఎడాపెడా ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు క్రమేపీ వినియోగదారులను అటు మళ్లిస్తాయి. సాధారణ రిటైల్ వ్యాపారులకు వినియోగదారుల్లో వారిపై ఉండే విశ్వాసమే ప్రధాన పెట్టుబడి. ఒక దుకాణంతో ఏళ్లు గడిచేకొద్దీ ఏర్పడే అనుబంధం వినియోగ దారుల్ని ఎటూ పోకుండా నిలబెడుతుంది. ఆ వ్యాపారులు దుకాణానికి అద్దె చెల్లించాలి. సరుకు నిర్వ హణ చూసుకోవాలి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. వారి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాలి. కనుక వారు వినియోగదారులకిచ్చే డిస్కౌంట్లకు పరిమితి ఉంటుంది. కానీ ఆన్లైన్ వ్యాపార సంస్థలకు ఇలాంటి బాదరబందీ లేదు. ఆన్లైన్లో వారు అమ్మే సరుకేదీ వారి దగ్గర ఉండదు. గిడ్డంగులున్నవారితో, సరుకులు సరఫరా చేసేవారితో, కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారందరినీ సమన్వ యపరుచుకుంటూ విని యోగదారులు కోరుకున్నవి అందేలా చూస్తారు. అహేతుకమైన డిస్కౌంట్లు, ఆఫర్లవల్ల వీరికి నిజానికి నష్టాలే వస్తాయి. వీటిని కొన్నేళ్లు భరిస్తే క్రమేణా సంప్రదాయ రిటైల్ వ్యాపారం దెబ్బతిని కనుమరుగవుతుందని, అప్పుడు మార్కెట్‌ను శాసించి లాభాల బాట పట్టొచ్చునన్నది వీరి వ్యాపార సూత్రం. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిందదే. మన దేశంలో సంప్రదాయ రిటైల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారం దెబ్బతింటే వీరందరూ వీధిన పడతారు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకున్న వాల్‌మార్ట్‌తో మరో ప్రమాదం ఉంది. ఇది చవగ్గా దొరికే చైనా సరుకుతో మార్కెట్లను ముంచెత్తుతోంది. అది అమ్మే సరుకులో దాదాపు 80 శాతం చైనా మార్కెట్‌కు సంబంధించినవే. ఇందువల్ల రిటైల్ దుకాణదారులకు, వినియో గదారులకొచ్చే కష్టనష్టాల సంగతలా ఉంచి మన తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. రిటైల్ రంగంలోని కోట్లాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. చైనా తయారీరంగం మాత్రం పుంజుకుంటుంది. ఆ దేశంతో ఇప్పటికే మనకున్న వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది. చైనా కార్మికులకు ఉపాధి, అక్కడి పరిశ్రమలకు, అమెరికా ఈ–కామర్స్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే ఈ పరిణామం మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్డీఐపై ఉన్న పరిమితులను ఈ–కామర్స్ దారిలో ఉల్లంఘిస్తోంది. వీటన్నిటిపైనా ఇప్పటికే అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్వంటివి నిరసన వ్యక్తం చేశాయి. తాజా ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి మన ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాల్లోని లొసుగులను తొలగించాలి. -
ఫ్లిప్‌కార్ట్ డీల్.. భారత్‌కు మేలే
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్– వాల్‌మార్ట్ మధ్య కుదిరిన ఒప్పందం భారత్‌కు మేలు చేస్తుందని వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ చెప్పారు. కొంత కాలంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికంగా సరుకులను సమీకరించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్నారు. 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్టు వాల్‌మార్ట్ బుధవారం ప్రకటించగా, అనంతరం ప్రధాని మోదీ, ఇతర సీనియర్ మంత్రులను కలవకపోవడానికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. అధికారులతో తాను డీల్‌కు ముందు సమావేశమయ్యాయని, భవిష్యత్తులో మళ్లీ భేటీ అవుతానని మెక్‌మిలన్ చెప్పారు. భారత్‌కు వాల్‌మార్ట్ కొత్తగా రాలేదని గుర్తు చేశారు. బుధవారం ఈ డీల్‌పై ప్రకటన అనంతరం, వాల్‌మార్ట్ నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారిన భారత్‌లోకి వస్తోందని, జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని ఇందులో జోక్యం చేసుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేయడం తెలిసిందే. ‘‘ఈ డీల్ కస్టమర్లకు మంచిది. ఉద్యోగాల కల్పన ద్వారా సమాజానికి మంచి చేస్తుంది’’ అని మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో మెక్‌మిలన్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుకు నియంత్రణ సంస్థల అనుమతులు పొందడంలో ఎటువంటి సమస్య ఉండకపోవచ్చన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దానిపై కచ్చితమైన గణాంకాలు చెప్పడం కష్టమని మెక్‌మిలన్ వ్యాఖ్యానించారు. లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయంటూ థర్డ్ పార్టీ పరిశోధన వివరాలను ప్రస్తావించారు. ‘‘కొంత కాలానికి మరో కోటి ఉద్యోగాలు వస్తాయి. అయితే, ఇందుకు కచ్చితమైన సమయం చెప్పలేను’’ అన్నారు. కంపెనీలోనే కాకుండా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల వైపు ఉద్యోగాలు ఏర్పడతాయన్నారు. వాల్‌మార్ట్ కార్యకలాపాలు నిర్వహించే దేశాల్లో 90 శాతం సరుకులను స్థానికంగానే కొనుగోలు చేస్తున్నదనే విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా బోర్డు ఆధ్వర్యంలోని కంపెనీగానే కొనసాగుతుందని, వాల్‌మార్ట్ కేవలం రిసోర్స్ సెంటర్‌గా పనిచేస్తుందని, సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ సీఈవోగా వ్యవహరిస్తారని వివరించారు. మరో 50 వాల్‌మార్ట్ స్టోర్లు వచ్చే 4–5 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 50 స్టోర్లను ఏర్పాటు చేస్తామని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపార విస్తరణను కొనసాగిస్తామన్నారు. ఈ ఏడాది 5 స్టోర్లను ప్రారంభిస్తామని, ఆ తర్వాత నుంచి ఏటా 12–15 స్టోర్లు కొత్తగా తెరుస్తామని అయ్యర్ తెలిపారు. ప్రస్తుతం బెస్ట్‌ప్రైస్ పేరుతో 9 రాష్ట్రాల్లోని 19 పట్టణాల్లో 21 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను వాల్‌మార్ట్ నిర్వహిస్తోంది. తాము ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లోనే కొనసాగుతామని, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. బెస్ట్‌ప్రైస్ స్టోర్లను ఫ్లిప్‌కార్ట్‌పై జరిపే విక్రయాలకు పికప్, డెలివరీ సెంటర్లుగా వాల్‌మార్ట్ వినియోగించుకోవచ్చని భావిస్తున్నారు. సచిన్ ఫ్లిప్‌కార్ట్‌ను వీడడం బాధాకరం: బిన్నీ న్యూఢిల్లీ: ఇద్దరూ కలసి 11 ఏళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించి దేశీయ దిగ్గజ ఈ కామర్స్ సంస్థగా తీర్చిదిద్దిన తర్వాత అందులో ఒకరు బయటకు వెళ్లిపోనుండడం నిజంగా మరొకరిని బాధించే విషయమే. ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ ఒప్పందం కుదుర్చుకోగా, కంపెనీ సహ వ్యవస్థాపకుల్లోఒకరైన సచిన్బన్సల్ (36) తనకున్న 5.5 శాతం వాటాను పూర్తిగా అమ్మేసి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోగా... మరో సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ కంపెనీతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారంనాటి మీడియా సమావేశంలో బిన్నీ బన్సల్ స్పందించారు. సచిన్ నిర్ణయాన్ని భావోద్వేగంతో కూడిన క్షణంగా అభివర్ణించారు. పేరులో బన్సల్ పోలిక ఉన్నప్పటికీ ఢిల్లీ ఐఐటీలో కోర్సు పూర్తి చేసేంత వరకు వీరిలో ఒకరి గురించి మరొకరికి తెలియదు. 2005లో ఐఐటీ పూర్తి చేసుకున్న తర్వాత బెంగళూరుకు మకాం మార్చి తొలుత అమేజాన్‌లో ఎనిమిది నెలల పాటు పనిచేశారు. ఆ తర్వాత 2007లో రూ.4 లక్షల పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్‌ను ఆన్లైన్ పుస్తక విక్రయ వేదికగా ఏర్పాటు చేశారు. అనంతరం సమగ్ర ఈ కామర్స్ కంపెనీగా తీర్చిదిద్దారు. ‘‘సచిన్ నేను చాలా కాలం పాటు కలసి ప్రయాణించాం. ఐఐటీ ఢిల్లీ పాసింగ్ అవుట్ సందర్భంగా 2005లో కలుసుకున్నాం. తర్వాత ఇద్దరం బెంగళూరుకు వెళ్లాం. మేమంతా ఐఐటీ, ఢిల్లీకి చెందిన 8 మంది స్నేహితుల బృందం. మంచి స్నేహితులుగా ఉన్నాం. మా ఇద్దరిలో ఒకరు మరొకరికి మద్దతుగా నిలిచిన వారమే’’ అని బిన్నీ బన్సల్ వివరించారు. సచిన్ భవిష్యత్తు ప్రయత్నాలకు మంచి జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. రోజూ 40–50 కిలోమీటర్ల ప్రయాణం ‘‘వ్యాపారం కోసం చేయాల్సినవన్నీ చేశాం. సచిన్, నేను బెంగళూరు సిటీలో బైక్‌పై రోజూ 40–50 కిలోమీటర్లు తిరుగుతూ పలువురు డిస్ట్రిబ్యూటర్ల వద్ద పుస్తకాలను సమీకరించి, వాటిని ప్యాక్ చేసి కస్టమర్లకు పంపేవాళ్లం. పదేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే మేం ఎలా ప్రారంభించాం, ఏం చేశామన్నది తలచుకుంటే అద్భుతంగా ఉంది’’ అని బిన్నీ తమ వ్యాపార అనుభవాలను వివరించారు. వ్యక్తిగత ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది: సచిన్ ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తన అభిప్రాయాలతో ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారు. గేమింగ్‌పై పట్టు సాధించాలని, కోడింగ్ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాల్సి ఉందన్నారు. నిలిచిపోయి ఉన్న తన వ్యక్తిగత ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెడతానని చెప్పారు. ఇంత వరకు వాటికి సమయం చిక్కలేదన్నారు. ‘‘విచారకరం ఏమిటంటే నా పని ఇక్కడ పూర్తయింది. పదేళ్ల తర్వాత దండాన్ని స్వాధీనం చేసి ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వెళ్లాల్సిన సమయం ఇది’’అని తన పోస్టింగ్‌లో సచిన్ పేర్కొన్నారు. బయటి నుంచి తన ప్రోత్సాహం ఉంటుందని పేర్కొంటూ, ఫ్లిప్‌కార్ట్ బృందం తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎన్నో పెద్ద సవాళ్లను స్వీకరించి, దేశం కోసం ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపించామని పేర్కొన్నారు. దేశీయ రిటైల్ రంగాన్ని దెబ్బతీస్తుంది: సీఏఐటీ ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేయడం దేశీయ రిటైల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, సదరు ఒప్పందాన్ని అన్ని కోణాల్లోంచి పరిశీలించాలని వర్తకుల సంఘం సీఏఐటీ డిమాండ్ చేసింది. ‘‘ప్రభుత్వం నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. సదరు సంస్థ వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ ఒప్పందాన్ని పోటీతత్వం, సైబర్ భద్రత, దోపిడీ ధరలు, భారీ తగ్గింపులు, నష్టాలకు ఫండింగ్ తదితర కోణాల్లోంచి పరీక్షించాలి’’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు. ఒప్పందాన్ని పరిశీలించిన మీదట ప్రభుత్వం దృష్టికి లేదా కాంపిటిషన్ కమిషన్ దృష్టికి తీసుకెళతామని లేదా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దొడ్డిదారిలో కైవసం చేసుకోవటమే: సీపీఎం వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ ఒప్పందాన్ని సీపీఎం వ్యతిరేకించింది. ఈ కోనుగోలును వేల కోట్ల రూపాయల భారత రిటైల్ రంగాన్ని విదేశీ నిధులతో దొడ్డిదారిలో కైవసం చేసుకోవడంగా ఆ పార్టీ అభివర్ణించింది. -
ఖరారైన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ మెగా డీల్
-
డీల్ ప్రభావం ఏంటి..?
దేశీ ఈ–కామర్స్ రంగంలో రారాజుగా వెలగొందుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు పూర్తిగా విదేశీ పరం అవుతోంది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన అమెజాన్‌తో పోటీపడిన ఫ్లిప్‌కార్ట్‌ను మరో అమెరికా కంపెనీ వాల్‌మార్ట్ చేజిక్కించుకోవడంతో ఇకపై భారత ఆల్‌లైన్ రిటైల్‌లో రంగం మొత్తం దాదాపుగా అమెరికన్ కంపెనీల చేతుల్లోనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పోటీ కంపెనీలతోపాటు ఇటు ఆన్లైన్ వినియోగదారులపైనా ఈ మెగా డీల్ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు. వణుకుతున్న చిన్న కంపెనీలు... భారత్ ఆన్లైన్ మార్కెట్లోకి వాల్‌మార్ట్ మెగా ఎంట్రీతో తమ భవిష్యత్తుపై చిన్నాచితకా ఈ–కామర్స్ కంపెనీలు, అమ్మకందారులలో (సెల్లర్లు) తీవ్రమైన ఆందోళన నెలకొంది. అత్యంత చౌక ధరలతో చిన్న వ్యాపారాలను కకావికలం చేసిన చరిత్ర వాల్‌మార్ట్‌కు ఉండటమే వీరి భయాలకు ప్రధాన కారణం. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇకపై వాల్‌మార్ట్ తన సొంత ఉత్పత్తులను (ప్రైవేట్ లేబుల్స్) భారత వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా కొనుగోలుదారులకు మంచిదే అయినప్పటికీ... చిన్నస్థాయి పోటీ కంపెనీలు, సెల్లర్లకు మాత్రం ఆ పోటీని తట్టుకోవడం చాలా కష్టమేనన్నది విశ్లేషకుల భావన. ‘వాల్‌మార్ట్ గనక సొంత చౌక ఉత్పత్తులతో విరుచుకుపడితే దేశీ ఆన్లైన్ మార్కెట్లో పోటీ తారస్థాయికి చేరుతుంది. దీనివల్ల మన మార్కెట్లో చిన్న వ్యాపారాలు అతలాకుతలం అవుతాయి. ఇప్పటివరకూ ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్న సెల్లర్లు ఈ పోటీ తట్టుకోవడం చాలా కష్టం. తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం. చట్టపరమైన చర్యలతో పాటు ఇతరత్రా చర్యలూ చేపడతాం’ అని అఖిల భారత ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ) ప్రతినిధి పేర్కొన్నారు. ఈ సంఘంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా మొత్తం 3,500 మంది సెల్లర్లు ఉన్నారు. వాల్‌మార్ట్‌కు మహదావకాశం... భారత్ హోల్‌సేల్ రంగంలో దశాబ్దం క్రితమే అడుగుపెట్టిన వాల్‌మార్ట్‌కు ఇక్కడి మార్కెట్లో ఇప్పటిదాకా పెద్దగా పట్టుచిక్కలేదు. రిటైల్ రంగంలోకి భారత సర్కారు ద్వారాలు తెరచినప్పటికీ.. పలు సంక్లిష్టతల కారణంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇక ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా మరిన్ని సంస్థలు వేళ్లూనుకుపోవడంతో ఈ–కామర్స్‌లో సొంతంగా అడుపెట్టే సాహసం చేయలేకపోయింది. అయితే, ఇప్పుడు ఏకంగా హాట్‌కేక్ లాంటి అవకాశాన్ని చేజిక్కించుకుంది. మరో దశాబ్దకాలంలోపే భారత్ ఈ–కామర్స్ రంగం మార్కెట్ 200 బిలియన్ డాలర్ల స్థాయికి ఎగబాకనుందని అంచనా. ఇలాంటి తరుణంలో వాల్‌మార్ట్ ఇక్కడ నేరుగా అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఈ డీల్ ఉపకరించనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో అపార అవకాశాలను దక్కించుకోవడానికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉండగా.. ఇందులో 14 శాతమే షాపింగ్ కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ వాటా 2026 నాటికి 50 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. తాజా డీల్‌తో వాల్‌మార్ట్‌కు 17.5 కోట్ల మంది యూజర్లు దక్కుతారు. ప్రస్తుతం 21 బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ స్టోర్ల ద్వారా వాల్‌మార్ట్ భారత్‌లో అనేక ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ స్టోర్లను కూడా ఇకపై వాల్‌మార్ట్ తన డెలివరీ కేంద్రాలుగా వాడుకోవడానికి వీలవుతుంది. వాల్‌మార్ట్ రంగ ప్రవేశంతో పోటీ సంస్థ అమెజాన్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడం కోసం ఇక్కడ 5 బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు ఇప్పటికే ప్రణాళికలను ప్రకటించిన అమెజాన్... తాజాగా మరో 2 బిలియన్ డాలర్లను కుమ్మరించేందుకు సిద్ధమవుతోంది. మొత్తంమీద ఈ రెండు దిగ్గజాల జోరుతో భారత్‌లో అటు కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వేలాది ఉద్యోగాలు కూడా రానుండటం మంచి పరిణామం కిందే లెక్క. సచిన్ బన్సల్‌కు కనక వర్షం... వాల్‌మార్ట్ డీల్‌తో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పంట పండనుంది. తనకున్న మొత్తం 5.5 శాతం వాటాను విక్రయించేందుకు సచిన్ ఓకే చెప్పడంతో దాదాపు రూ.5,100 కోట్లకుపైగా మొత్తం ఆయన జేబులోకి వచ్చిపడనుంది. అయితే, దీనిపై 20 శాతం మేర మూలధన లాభాల పన్నును కేంద్రానికి ఆయన చెల్లించాలివస్తుందని అంచనా. అదేవిధంగా సాఫ్ట్‌బ్యాంక్ కూడా తన వాటా అమ్మకంపై వచ్చిన మొత్తంపై పన్ను కట్టాల్సి ఉంటుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ డీల్‌తో కేంద్ర ఖజానాపైకూడా కనకవర్షం కురుస్తుందన్నమాట!! ఇంకా నష్టాల్లోనే ఫ్లిప్‌కార్ట్... ఒక చిన్న స్టార్టప్‌గా మొదలై ఆన్లైన్ వటవృక్షంగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పటివరకూ లాభాలను కళ్లజూసింది లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా పెట్టుబడులను సమీకరిస్తూనే ఉంది. అయితే, ఇంత భారీగా నిధులొస్తున్నా.. కంపెనీ ఆర్థిక పనితీరులో ఇంకా పెద్దగా పురోగతిలేదు. కన్సాలిడేటెడ్‌గా 2016–17లో రూ.19,855 కోట్ల ఆదాయాన్ని (గ్రాస్ మర్చెంటైజ్ వేల్యూ–జీఎంవీ) ఆర్జించింది. అయితే, స్థూల నష్టం రూ.8,895 కోట్లకు ఎగబాకింది. 2014–15లో రూ.2,985 కోట్లు, 2015–16లో రూ.5,467 కోట్ల స్థూల నష్టం నమోదైంది. కాగా, డెరివేటివ్స్ పెట్టుబడుల్లో అంచనా నష్టాలు (ఎం–టు–ఎం) తీసేస్తే స్థూల నష్టాలు దాదాపు 2015–16 స్థాయిలోనే ఉన్నట్లు లెక్క. దేశీ స్టార్టప్‌ల విజయానికి ఇది ప్రతీక ఇండియన్ ఎంట్రప్రెన్యూర్లకు సెల్యూట్ చేస్తున్నా. ఒక స్టార్టప్ 21 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను దక్కించుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే వాల్‌మార్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో 2 బిలియన్ డాలర్లు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రకటించింది. భారత్‌లో ఇది అతిపెద్ద ఎఫ్‌డీఐ కాబోతోంది. – అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ కేవలం ఇన్వెస్టర్లు, ప్రమోటర్లకే ప్రయోజనం.. ఫ్లిప్‌కార్ట్– వాల్‌మార్ట్ డీల్ వల్ల ఈ–కామర్స్, రిటైల్ మార్కెట్‌పై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. వాల్‌మార్ట్ దీర్ఘకాలంలో ఈ–కామర్స్ ద్వారా భారత్‌లో రిటైల్ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. డీల్‌తో వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు మాత్రమే ప్రయోజనం పొందుతారు. దేశం కాదు. – అఖిల భారత వర్తకుల సమాఖ్య దొడ్డిదారిలో ఎంట్రీ అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్... ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుతో దొడ్డిదారిలో భారత రిటైల్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్ మార్గంలో ప్రస్తుత నిబంధలను తప్పించుకోవాలని చూస్తోంది. ఇండియాలో మల్టీ బ్రాండ్ రిటైల్‌కు విదేశీ కంపెనీలకు అనుమతి లేదు. తాజా డీల్ వల్ల చిన్న వర్తకులకు ముప్పు వాటిల్లుతుంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. – స్వదేశీ జాగరణ్ మంచ్ -
వాల్'మార్ట్' లోకి.. ఫ్లిప్'కార్ట్'!
న్యూఢిల్లీ : సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మొదలైన దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... దేశీయంగా ముందెన్నడూ ఎరుగని భారీ విదేశీ డీల్‌కు తెరతీసింది. భారత్ ఆన్లైన్ రిటైల్ రంగంలో కొద్దిరోజులుగా అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మెగా డీల్... ఎట్టకేలకు సాకారమైంది. అమెరికా రిటైల్ అగ్రగామి వాల్‌మార్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకోసం 16 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.1,05,000 కోట్లు) చెల్లించడానికి వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా ఫ్లిప్‌కార్ట్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ తెలియజేసింది. ఈ మొత్తం కూడా కొనుగోలు విలువలో భాగమే. ప్రస్తుత డీల్ ప్రకారం చూస్తే... ఫ్లిప్‌కార్ట్ కంపెనీ విలువ(వేల్యుయేషన్) 20.8 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,40,000 కోట్లు. ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకోవడం కోసం మరో అమెరికాఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా చివరివరకూ ప్రయత్నించినప్పటికీ... వాల్‌మార్ట్ ఈ పోరులో విజయం సాధించింది. వాల్‌మార్ట్ ఇప్పటిదాకా చేపట్టిన కంపెనీల కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది. అంతేకాదు!! ప్రపంచ ఈ–కామర్స్ రంగంలో అత్యంత భారీ కొనుగోలు డీల్‌గా కూడా ఇది రికార్డు సృష్టించింది. సాఫ్ట్‌బ్యాంక్... సచిన్ బన్సల్ గుడ్‌బై బెంగళూరు కేంద్రంగా 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పిన సహ–వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు ఇకపై చెరోదారి చూసుకోనున్నారు. వాల్‌మార్ట్ కొనుగోలు చేస్తున్న 77 శాతం వాటాలో సచిన్ బన్సల్ వాటా కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించేసి కంపెనీ నుంచి వైదొలగాలని సచిన్ బన్సల్ నిర్ణయించుకున్నారు. బిన్నీ బన్సల్ మాత్రం తన వాటాను అట్టిపెట్టుకోనున్నారు. వీరిద్దరికీ చెరో 5.5 శాతం చొప్పున వాటాలున్నాయి. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ తన మొత్తం 20 శాతం వాటాను (పెట్టుబడి విలువ 2.5 బిలియన్ డాలర్లు) 4 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇక దక్షిణాఫ్రికా సంస్థ నాస్పెర్స్ 2012లో 616 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి 11.18 శాతం వాటా తీసుకుంది. దీన్ని కూడా ఆ కంపెనీ 2.2 బిలియన్ డాలర్లకు వాల్‌మార్ట్‌కు పూర్తిగా విక్రయించేసింది. ‘డీల్‌లో భాగంగా కొత్తగా మేం పెడుతున్న 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తు వృద్ధి జోరుకు బాటలు వేస్తాయి. అంతేకాదు కొత్తగా కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు తగిన ఇన్వెస్టర్లెవరైనా ముందుకొస్తే స్వాగతిస్తాం కూడా. మొత్తంమీద ఈ డీల్ పూర్తయ్యేనాటికి ఫ్లిప్‌కార్ట్‌లో మా వాటా కొంత తగ్గొచ్చు. అయినా కూడా నియంత్రణ వాటా మా చేతుల్లోనే ఉంటుంది’ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో వివరించింది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్... ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌గా బిన్నీ బన్సల్... వాల్‌మార్ట్ డీల్ తర్వాత బిన్నీ బన్సల్ కంపెనీ చైర్మన్‌గా ఉంటారు. వాల్‌మార్ట్‌కు చెందిన క్రిష్ అయ్యర్ కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగానే ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. డీల్ పూర్తయిన తర్వాత కూడా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ రెండు వేర్వేరు బ్రాండ్లుగానే ఉంటాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డులో వాల్‌మార్ట్‌కు తగిన ప్రాతినిధ్యం దక్కుతుంది. కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులుగా ఉన్న టెన్సెంట్ హోల్డింగ్స్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లు తాజా డీల్‌లో తమ వాటాను విక్రయించడం లేదని, డీల్ తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతాయని వాల్‌మార్ట్ వెల్లడించింది. ఐపీఓను సాకారం చేస్తాం... తమ తక్షణ కార్యాచరణ మొత్తం కస్టమర్లకు మరింత మెరుగైన సేవలతో పాటు వ్యాపారాన్ని వృద్ధి చేయడంపైనే ఉంటుందని డీల్ సందర్భంగా వాల్‌మార్ట్ పేర్కొంది. అంతేకాకుండా ఫ్లిప్మార్ట్ కలలు గన్నట్లుగా భవిష్యత్తులో పబ్లిక్ ఆఫర్‌ను కూడా సాకారం చేస్తామని తెలిపింది. కంపెనీని పబ్లిక్ లిస్టెడ్‌గా మార్చేందుకు తాము సుముఖమేనని స్పష్టం చేసింది. కాగా, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల అనుమతులు ఈ ఒప్పందానికి కీలకం కానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా డీల్ పూర్తవుతుందని∙అంచనా. పరిమాణం, వృద్ధి పరంగా కూడా ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన రిటైల్ మార్కెట్లలో భారత్ ఒకటి. ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు ద్వారా ఇక్కడి ఈ–కామర్స్ మార్కెట్ వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ రంగంలో పెనుమార్పులు సాకారమవుతాయి. ఇక్కడి వినియోగదారులు తమ ఖర్చుకు తగ్గ నాణ్యమైన ఉత్పత్తులను చౌకగా అందుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా కొత్తగా నిపుణులకు ఉద్యోగావకాశాలు, చిన్న సప్లయర్లు, రైతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా తాజా అవకాశాలు తలుపుతడతాయి. – డగ్ మెక్‌మిలన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తు గమనానికి వాల్‌మార్ట్‌తో భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుంది. భారత్ రిటైల్ రంగంలో ఈ–కామర్స్ వాటా ఇంకా చాలా తక్కువే ఉంది. ఇది భవిష్యత్తులో దూసుకెళ్లేందుకు అపారమైన అవకాశాలున్నాయి. – బిన్నీ బన్సల్, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు ఆన్లైన్లో పుస్తకాల నుంచి ఆకాశానికి... 2007లో ఒక ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా మొదలైన ఫ్లిప్‌కార్ట్... ఆ తర్వాత ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. మింత్రా, జబాంగ్ వంటి ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్లను కొనుగోలు చేసి ఈ రంగంలో నంబర్‌వన్‌గా ఆవిర్భవించింది. భారత్ ఆన్లైన్ ఫ్యాషన్ బిజినెస్‌లో ఈ మూడింటి వాటా ఏకంగా 70 శాతం. భారత్‌లో స్టార్టప్ కంపెనీల విజయాలకు మార్గదర్శకంగా, ఒక ట్రెండ్‌సెట్టర్‌గా ఫ్లిప్‌కార్ట్ నిలిచింది. ప్రపంచ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్థానం కూడా ఆన్లైన్ బుక్ స్టోర్‌గానే మొదలవడం విశేషం. ఫ్లిప్‌కార్ట్ ఎలా ఎదిగిందంటే... ♦ ఐఐటీ ఢిల్లీలో కలిసి చదువుకున్న సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ (వీరిద్దరూ బంధువులు కారు) ఫ్లిప్‌కార్ట్‌కు 2007 అక్టోబర్‌లో బీజం వేశారు. 4 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో అపార్ట్మెంట్లోని రెండు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో ఆన్లైన్ ద్వారా బుక్స్ విక్రయం మొదలైంది. వీళ్లిద్దరూ అంతకుముందు అమెజాన్‌లో పనిచేశారు. ♦ తొలిసారిగా విక్రయించిన పుస్తకం జాన్ ఉడ్స్ రాసిన ‘లీవింగ్ మైక్రోసాఫ్ట్ టు చేంజ్ ద వరల్డ్’. మొదటి ఏడాది కంపెనీ 20 పుస్తకాలను మాత్రమే విక్రయించింది. ♦ 2009లో తొలిసారిగా అంబర్ అయ్యప్ప అనే వ్యక్తిని పూర్తిస్థాయి ఉద్యోగిగా కంపెనీ నియమించుకుంది. ఆయనకు ఇచ్చిన షేర్లతో ఎప్పుడో కోటీశ్వరుడయ్యాడు. అదే ఏడాది చివరికి ఉద్యోగుల సంఖ్య 150కి చేరింది. ♦ 2009 అక్టోబర్‌లో యాక్సెస్ పార్ట్నర్స్ మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చేరింది. ♦ ఆ తర్వాత కొద్ది నెలల్లోనే అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ కూడా 10 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ♦ 2010లో భారత ఆన్లైన్ షాపింగ్ రూపురేఖలను మార్చేస్తూ తొలిసారిగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ని ప్రారంభించింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ విక్రయాలను మొదలుపెట్టింది. ఇప్పుడు కంపెనీ విక్రయాల్లో అత్యధికంగా ఇవే ఉండటం గమనార్హం. ♦ 2011లో ఫ్లిప్‌కార్ట్ కంపెనీని సింగపూర్‌లో రిజిస్టర్ చేశారు. ♦ తర్వాత కాలంలో టెన్సెంట్, ఈబే, మైక్రోసాఫ్ట్‌ల నుంచి 1.4 బిలియన్ డాలర్లను కంపెనీ సమీకరించింది. అయితే, అత్యధికంగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. తద్వారా మెజారిటీ వాటాదారుగా నిలిచింది. ♦ ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్ మింత్రా, జబాంగ్ వంటి ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్లతో పాటు వియ్రీడ్, లెట్స్‌బై, ఎఫ్ఎక్స్ మార్ట్ వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. ఇంకా ఆన్లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పేను కూడా దక్కించుకుంది. జీవ్స్, ఎన్‌జీపే వంటి సంస్థల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ♦ 2017లో కంపెనీ తొలిసారిగా 10కోట్ల మంది యూజర్ల మైలురాయిని దాటింది. ♦ గతేడాది కంపెనీ మేనేజ్మెంట్లో భారీ మార్పులు జరిగాయి. టైగర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ కృష్ణమూర్తి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. బిన్నీ బన్సల్ గ్రూప్ సీఈఓగా, సచిన్ బన్సల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ♦ దేశీ ఈ–కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు గతేడాది ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నించినా అది సాకారం కాలేదు. ♦ ప్రస్తుతం కంపెనీకి లక్ష మంది రిజిస్టర్డ్ సెల్లర్లతో పాటు 21 గిడ్డంగులు (వేర్‌హౌజ్) ఉన్నాయి. 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 17.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ♦ ప్రస్తుతం ప్రతి నెలా 80కి పైగా విభాగాల్లో 17 మిలియన్లకు పైగా ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. రోజుకు 2 కోట్ల మంది యూజర్లు పోర్టల్, యాప్‌లను సందర్శిస్తున్నారు. ♦ ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్‌కు 34 శాతం, అమెజాన్‌కు 27 శాతం వాటాలున్నాయి. 2017–18లో ఫ్లిప్కార్ట్ద విక్రయాలు 50 శాతం పైగా ఎగబాకి 4.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాల్‌మార్ట్ సంగతిదీ... ♦ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అయిన వాల్‌మార్ట్... ప్రస్తుత మార్కెట్ విలువ 252 బిలియన్ డాలర్లు. అమెరికా మార్కెట్లో ఆన్లైన్లో అమెజాన్‌తో పోటీ పడేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ♦ 2007లో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జట్టుకట్టి దేశీయంగా హోల్‌సేల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. 2009లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తొలి ‘బెస్ట్‌ప్రైస్’ స్టోర్‌ను తెరిచింది. ♦ భారతీ ఎంటర్ప్రైజెస్ వైదొలగడంతో వాల్‌మార్ట్ ఇండియా 2014లో వాల్‌మార్ట్‌కు పూర్తి అనుబంధ సంస్థగా మారింది. ♦ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో వాల్‌మార్ట్ ఇండియా 21 బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ స్టోర్లను నిర్వహిస్తోంది. ♦ 2016లో అమెరికా ఆన్లైన్ రిటైలర్ జెట్.కామ్‌ను వాల్‌మార్ట్ ఇంక్ 3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఒప్పందమే కంపెనీ చరిత్రలో అతిపెద్ద డీల్. ఈ ఏడాది ఇదే అతిపెద్ద డీల్.. భారత కార్పొరేట్ రంగంలో ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్ డీల్ ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద డీల్‌గా నిలిచింది. దేశీయంగా మెగా డీల్స్‌ను పరిశీలిస్తే... 2016 ♦ ఐడియా సెల్యులార్తో బ్రిటిష్ టెలికం కంపెనీ వొడాఫోన్ విలీన ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువు 23 బిలియన్ డాలర్లు. ఒప్పందం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ♦ ఎస్సార్ ఆయిల్‌ను రష్యా చమురు–గ్యాస్ దిగ్గజం రాస్‌నెఫ్ట్ 12.9 బిలియన్ డాలర్ల మొత్తానికి కొనుగోలు చేసింది. అప్పటికి భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఇదే. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ విషయానికొస్తే... సింగపూర్‌లో రిజిస్టర్ అయిన హోల్డింగ్ కంపెనీని వాల్‌మార్ట్ కొనుగోలు చేస్తోంది. ♦ జైప్రకాశ్ అసోసియేట్స్ సిమెంట్ వ్యాపారాన్ని అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేసింది. డీల్ విలువ 2.4 బిలియన్ డాలర్లు. ♦ లఫార్జ్ ఇండియాను నిర్మా 1.4 బిలియన్ డాలర్లు వెచ్చించి చేజిక్కించుకుంది. 2011 ♦ బ్రిటన్ కంపెనీ కెయిర్న్ ఇండియాలో 58.5 శాతం వాటాను వేదాంత రిసోర్సెస్ కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ 8.67 బిలియన్ డాలర్లు. ♦ బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్ పెట్రోలియం... రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ–డీ6తో పాటు 23 చమురు–గ్యాస్ క్షేత్రాల్లో 30% వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ 7.2 బిలియన్ డాలర్లు. 2008 ♦ జపాన్ ఔషధ దిగ్గజం దైచీ శాంక్యో... 4.6 బిలియన్ డాలర్లు చెల్లించి భారత్ కంపెనీ రాన్‌బ్యాక్సీని సొంతం చేసుకుంది. ♦ టాటా టెలీసర్వీసెస్‌లో 26 శాతం వాటాను జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమో కొనుగోలు చేసింది. డీల్ విలువ 2.7 బిలియన్ డాలర్లు. ♦ 2007లో హచిసన్ వాంపోవా భారత్ టెలికం వ్యాపారంలో 67% వాటాను వొడాఫోన్ కొనుగో లు చేసింది. డీల్ విలువ 11.1 బిలియన్ డాలర్లు. -
ఫ్లిప్ కార్ట్‌ను వాల్‌మార్ట్ కొంటే ప్రభుత్వానికీ పండగే!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ దేశీయ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈ డీల్ సాకారం అయితే, కేంద్ర ప్రభుత్వానికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూపేణా భారీ ఆదాయం సమకూరనుంది. డీల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్బన్సల్, బిన్నీబన్సల్ తమ వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్టయితే 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్ డీల్‌పై ఈ వారంలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. 12 బిలియన్ డాలర్లతో 60 శాతానికిపైగా వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌పై డీల్ కుదిరితే రెండు రకాల పన్ను కోణాలుంటాయనేది నిపుణుల మాట. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులు పెట్టుబడులపై ఆర్జించిన లాభంపై పన్ను చెల్లించడం ఒకటి. రెండోది ఫ్లిప్‌కార్ట్ ఇండియా తన నష్టాలను ఆదాయపన్నుతో సర్దుబాటు చేయడం రెండోది. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలున్న ఇన్వెస్టర్ల మాతృ దేశంతో మనదేశానికి ఉన్న పన్ను ఒప్పందాలకు లోబడి ఇది ఉంటుందని నాంజియా అండ్‌కో డైరెక్టర్ చిరాగ్ నాంజియా పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించినట్టయితే వారు ఇక్కడి వారే కనుక ఆర్జించిన మూలధన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భారత్‌లో రూ.2,600 కోట్ల అమెజాన్ పెట్టుబడులు అమెరికా దిగ్గజం అమెజాన్.. భారత్‌లోని తన విభాగం కోసం తాజాగా రూ.2,600 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పెట్టుబడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ఫ్లిప్‌కార్ట్ షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు వాటాలు విక్రయించబోతున్న దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మైనారిటీ షేర్ హోల్డర్ల నుంచి 18 లక్షల పైచిలుకు షేర్లను బైబ్యాక్ చేసింది. వీటి విలువ 350 మిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. సింగపూర్‌కి చెందిన అకౌంటింగ్, కార్పొరేట్ నియంత్రణ సంస్థకి ఫ్లిప్‌కార్ట్ ఈ మేరకు వివరాలు సమర్పించింది. పేపర్డాట్వీసీ అనే డేటా ప్లాట్‌ఫాం సంస్థ సేకరించిన పత్రాల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ 18.95 లక్షల రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు, 1.74 లక్షల నాన్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలు ఏప్రిల్ 27న పూర్తయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కొనేటప్పుడు అసంఖ్యాక వాటాదారులతో లావాదేవీలు జరపనక్కర్లేకుండా.. తక్కువ మంది ఇన్వెస్టర్లతోనే డీల్ చేసేందుకు వాల్‌మార్ట్‌కి ఈ బైబ్యాక్ ఉపయోగపడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 20 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాలకొనుగోలుకు వాల్‌మార్ట్ 12 బిలియన్ డాలర్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. -
ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ భారీ డీల్
సాక్షి, ముంబై: దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ అతి భారీ వాటా విక్రయానికి ఆమోదముద్ర పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రీటెయిలర్‌గా పేరున్న వాల్‌మార్ట్‌కు 75 శాతం వాటా విక్రయానికి ఫ్లిప్కార్ట్బోర్డు అంగీకరించినట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అంచనాలకుమించి సుమారు 15 బిలియన్ డాలర్లకు (లక్షకోట్ల రూపాయలకు) ఈ డీల్ కుదిరింది. ప్రతిపాదిత ఒప్పందంలో సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దాదాపు 20 మిలియన్ డాలర్ల వాటాను విక్రయించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే గూగుల్-పేరెంట్ ఆల్ఫాబెట్ సంస్థ వాల్‌మార్ట్ పెట్టుబడిలో పాల్గొనే అవకాశం ఉంది. మరో 10 రోజుల్లో తుది డీల్ పూర్తి కావచ్చని అంచనా. మరోవైపు ఈ వార్తలపై స్పందించడానికి వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్ బ్యాంక్ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా దేశీయంగా ఆన్లైన్ సంస్థలపైకన్నేసిన వాల్‌మార్ట్ చివరకు ఫ్లిప్కార్ట్లోమెజారిటీ వాటాపై కొనుగోలుకు పథకం వేసింది. గ్లోబల్ ఇ-కామర్స్ వ్యూహంలో ఫ్లిప్‌కార్ట్ డీల్ కీలకమని న్యూఢిల్లీ ఆధారిత రిటైల్ కన్సల్టెన్సీ అడ్వైజర్ల ఛైర్మన్ అరవింద్ సింఘాల్ అన్నారు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ భారత రిటైల్ మార్కెట్లో ప్రవేశించేందుకు సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తోంది. తాజా డీల్ సాకారమైతే శరవేగంగా పరుగులుపెడుతున్న భారత ఈకామర్స్ మార్కెట్లో వాల్‌మార్ట్ భారీ స్థాయిలో పాగా వేయడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ప్రత్యర్ధి సంస్థ అమెజాన్‌కు గట్టి పోటీ తప్పదు. ముఖ్యంగా చైనాలో అమెజాన్‌కు ఎదురుదెబ్బ నేపథ్యంలో ఇండియాలో విస్తరించాలని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌కు సచిన్ బన్సాల్ గుడ్‌బై..?
బెంగళూరు : సచిన్ బన్సాల్ దాదాపు అందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత్ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. అయితే ఈయన ఇప్పుడు తన సొంత సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్‌బై చెబుతున్నారట. ఫ్లిప్‌కార్ట్‌ను, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తన సొంతం చేసుకుంటుండగా... ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సచిన్ బన్సాల్ వైదొలుగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దశాబ్దం క్రితం నుంచి అన్ని తానే అనుకుని ఫ్లిప్‌కార్ట్‌ను మార్కెట్లో అగ్రగామిగా ఉంచుతున్న సచిన్ బన్సాల్ కంపెనీని నుంచి బయటికి వచ్చేస్తుండటం గమనార్హంగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్కువ కాలం సీఈవోగా పనిచేసిన ఘనత కూడా ఇతనిదే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌కు అప్పగించిన తర్వాత మరో స్టార్టప్‌ను ఆయన ప్రారంభించబోతున్నట్టు, అంతేకాక పారిశ్రామిక వేత్తలకు మెంటర్‌గా నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాల్‌మార్ట్ డీల్‌తో, సచిన్ వైదొలిగే చర్చలు గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయని ఒకరు పేర్కొన్నారు. వచ్చే వారంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి సచిన్ వెళ్లిపోయే నిర్ణయం వెలువడుతుందని, వాల్‌మార్టే బోర్డు ఆకృతులను నిర్ణయిస్తుందని మరో సంబంధిత వ్యక్తి పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి వెళ్లే సచిన్ బయటికి వెళ్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా ఉన్న బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిలను రోజువారీ కార్యకలాపాలను చూసుకోవాలనుకుంటున్నట్టు వాల్‌మార్ట్ చెప్పింది. ప్రస్తుతం 10 మంది సభ్యులున్న ఫ్లిప్‌కార్ట్ బోర్డులో సచిన్, బిన్నీ బన్సాల్‌లు కూడా సభ్యులే. కల్యాణ్ బోర్డులో సభ్యుడు కాదు. అయితే ఈ విషయంపై మాత్రం స్పందించడానికి సచిన్ బన్సాల్ నిరాకరించారు. వాల్‌మార్ట్ డీల్‌లో భాగంగా బిన్నీ బన్సాల్ తనకున్న షేర్లలో పదోవంతు అమ్మేస్తున్నారు. సచిన్ బన్సాల్ ఎంత విక్రయిస్తున్నారో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ ఈ డీల్ కుదిరితే సచిన్ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్‌లో 5.5 శాతం స్టేక్‌ను కలిగి ఉండనున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా వాల్‌మార్ట్ డీల్‌కు బ్రేక్ వేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనేందుకు అమెజాన్ కూడా భారీ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. అయితే అమెజాన్‌కు అమ్మేందుకు సంసిద్ధంగా లేని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ టాప్ మేనేజ్మెంట్ మార్పులు పెద్ద కొత్త విషయమేమీ కాదని, కానీ వ్యవస్థాపకుల్లో ఒకరు వైదొలగడం కీలక పరిణామమే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లైన బన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు కలిసి 2007లో ఈ కంపెనీని ప్రారంభించారు. 2016 జనవరి వరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్నే ఉన్నారు. -
ఫ్లిప్‌కార్ట్.. వాల్‌మార్ట్ దోస్తీ
హాంకాంగ్: దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్.. మెజారిటీ వాటాలను కొనుగోలు చేసే అంశం మరింత జోరందుకుంది. ఈ జూన్ ఆఖరు నాటికల్లా డీల్ కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను మదింపు చేసిన వాల్‌మార్ట్.. 10–12 బిలియన్ డాలర్లకు 51 శాతం వాటాలను కొంటామంటూ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డీల్ స్వరూపం ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఉన్నవారి వాటాలతో పాటు కొత్తగా మరిన్ని షేర్లను కూడా వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త షేర్లకు కట్టే రేటు ప్రకారం ఫ్లిప్‌కార్ట్ విలువ 18 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని పేర్కొన్నాయి. అదే పాత షేర్లకు ఆఫర్ చేసే ధర ప్రకారం చూస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంటుందని వివరించాయి. షేర్ల విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ దూరం.. ప్రస్తుతమున్న షేర్లకు తక్కువ ధర లభించనున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు అయిదో వంతు వాటాలు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ తమ షేర్లను విక్రయించే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన టైగర్ గ్లోబల్, యాక్సెల్, నాస్పర్స్ మొదలైనవి మాత్రం తమ మొత్తం వాటాలు అమ్మేసేయొచ్చని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే, టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మొదలైనవి కూడా ఇన్వెస్ట్ చేశాయి. డీల్ ఇంకా ఖరారు కాలేదని, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, ఇన్వెస్టర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెజాన్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ నియంత్రణ సంస్థలపరమైన అభ్యంతరాలు తలెత్తవచ్చని ఇన్వెస్టర్లు సందేహిస్తున్నారు. కార్యకలాపాల విస్తరణకు వాల్‌మార్ట్‌కు అవకాశం ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన వాల్‌మార్ట్.. చాన్నాళ్లుగా భారత రిటైల్ మార్కెట్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇది భారత్‌లో 21 హోల్‌సేల్ స్టోర్స్ నిర్వహిస్తోంది. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్‌తో డీల్ సాకారమైతే వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో వాల్‌మార్ట్ భారీ స్థాయిలో విస్తరించేందుకు తోడ్పడనుంది. అలాగే, ప్రత్యర్ధి సంస్థ అమెజాన్‌కు కూడా గట్టి పోటీనివ్వడానికి ఉపయోగపడనుంది. ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్.. భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్నట్లు రీసెర్చ్ సంస్థ ఫారెస్టర్ అంచనా. -
ఫ్లిప్‌కార్ట్‌కు అమెజాన్ బంపర్ ఆఫర్, కానీ...
బెంగళూరు : ట్రైయాంగిల్ లవ్ అంటే ఇదేనేమో.. అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతుంటే... ఫ్లిప్‌కార్ట్ మాత్రం గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌లో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయాలని అన్వేషాత్మక చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. 20 బిలియన్ డాలర్లను వెచ్చించి, ఫ్లిప్‌కార్ట్‌ను తన సొంతమే చేసుకోవాలని అమెజాన్ చూస్తున్నట్టు మింట్ బిజినెస్ న్యూస్‌పేపర్ రిపోర్టు చేసింది. అయితే దేశీయ ఈ-కామర్స్ స్పేస్‌లో అమెజాన్‌తో ఎల్లప్పుడూ పోటీపడే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్‌కు ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. వాల్మార్ట్తోనే భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తుందని తెలిసింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్ కూడా అన్ని సిద్ధం చేసుకుంటోంది. ఈ రెండు కంపెనీల చర్చలు కూడా తుది దశకు వచ్చినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్లో భారత్‌కు ప్రముఖ స్థానముంది. అమెరికాను వదులుకున్న మాదిరిగా ఈ పాపులర్ మార్కెట్‌ను అమెజాన్ ఇండియాకు వదిలేయకూడదని వాల్‌మార్ట్ భావిస్తోంది. అమెజాన్‌కు చెక్ పెట్టడానికి వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు కూడా ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో తమ అన్ని షేర్లను విక్రయించాలని ప్లాన్చేస్తున్నారు. కాగ, అమెజాన్ మాజీ ఉద్యోగులైన బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు 2007లో భారత్‌లో ఈ ఫ్లిప్‌కార్ట్ సంస్థను ఏర్పాటుచేశారు. అనంతరం దేశీయ ఆన్లైన్ రిటైల్‌లో 40 శాతం వాటాను ఈ సంస్థ దక్కించుకుంది. అమెజాన్‌ను మించిపోయి ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో తన సత్తా చాటుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు ఎప్పడికప్పుడూ పోటీ ఇవ్వడానికి అమెజాన్ తీవ్ర కృషిచేస్తూనే ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మెజార్టీ వాటా దక్కితే, అమెజాన్ మరింత పోటీకర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. కేవలం అమెజాన్, వాల్‌మార్ట్ మాత్రమే కాక, ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. -
స్టార్టప్‌లను కొంటాం
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో తాము ఇక ముందూ దూకుడుగా వెళతామని వాల్‌మార్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జెరెమీ కింగ్ చెప్పారు. తమ విస్తరణ కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. భారత్‌లో అతిపెద్ద టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసిన వాల్‌మార్ట్... అమెజాన్‌కు పోటీగా దేశీయంగా అగ్రస్థానంలో ఉన్న ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటిపై ఆయన నేరుగా స్పందించలేదు. తమ విధానం కొనసాగుతుందంటూనే, ఇప్పటి వరకు 13 కంపెనీలను కొనుగోలు చేశామని, బెంగళూరులోనూ అలా చేయడాన్ని ఇష్టపడతామని చెప్పారు. వచ్చే ఏడాది, ఆపై కాలంలో మూడు నుంచి ఐదు స్టార్టప్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అమెరికాలో తమకు విజయాన్నందించిన ఈ మోడల్ ప్రకారం... బెంగళూరులో ఎన్ని స్టార్టప్‌ల కొనుగోలుకు అవకాశం లభిస్తుందో చూడాలని చెప్పారాయన. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొనుగోళ్ల ద్వారా విస్తరణ అంతర్జాతీయంగా అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా ఉన్న అమెజాన్‌తో ఉన్న అంతరాన్ని పూడ్చుకుని అగ్ర స్థానానికి చేరుకునేందుకు గత ఐదేళ్లలో తన ఈ కామర్స్ వ్యాపారంపై బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించింది. దీన్లో భాగంగా 2016లో అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైలర్ జెట్ డాట్ కామ్‌ను 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అదే ఏడాది చైనాకు చెందిన రెండో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ జేడీ డాట్‌కామ్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ద్వారా తమకు మంచి వ్యాపార నైపుణ్యం అందుబాటులోకి వచ్చినట్టు కింగ్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లోనూ ఈ కామర్స్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళతామని, దీనికి భారత్‌లోని టెక్నాలజీ కేంద్రం కీలకమని చెప్పారు. భారత్‌ను టెక్నాలజీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అమెరికాలోని ఆర్కాన్సాస్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, బెంగళూరులో తమకు పటిష్ట టెక్నాలజీ కేంద్రాలున్నాయని చెప్పిన కింగ్... బెంగళూరు కేంద్రం మరింత వృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఆకాంక్ష అయితే చాలా బలంగా ఉందని, తమ విధానం, ఉత్పత్తు్తలకు సరిపోలే, టాలెంట్‌తో కూడిన స్టార్టప్‌లను గుర్తించడమే కీలకమని వాల్‌మార్ట్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ హరి వాసుదేవ్ చెప్పారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అమెజాన్ వాటా 43 శాతం కాగా, వాల్‌మార్ట్ వాటా 4 శాతంలోపే ఉంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో చక్రం తిప్పనున్న వాల్‌మార్ట్!
ముంబై: దేశీయ ఈ-రిటైల్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీగా వాటాను చేజిక్కించుకోబోతుంది. దీనికి సంబంధించి చర్చలు తుది దశకు వచ్చినట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో సగానికి పైగా వాటాలను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ ఎన్నోరోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే, దేశీయ ఈ-రిటైల్ రంగంలో వాల్‌మార్ట్, అమెజాన్‌తో ప్రత్యక్షంగా పోటీకి దిగనుంది. తొలుత 20-26 శాతం వాటాను మాత్రమే కొనుగోలు చేయాలని భావించిన వాల్‌మార్ట్.. తదుపరి జరిగిన పరిణామాలతో ఫ్లిప్‌కార్ట్‌లో చక్రం తిప్పేందుకు అవసరమైన 51 శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌కు అత్యధిక వాటా ఉంది. అయితే సాఫ్ట్‌బ్యాంకు నుంచి ఈ వాటాలను వాల్‌మార్ట్ కొనుగోలు చేసి, ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా నిలవనుంది. మిగతా వాటాలను ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది.వాల్‌మార్ట్ కొనుగోలు చేయబోతున్న వాటాల విలువ రూ.77 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు, టైగర్ గ్లోబల్లతో వాల్‌మార్ట్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు కలిపి ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం వాటాలున్నాయి. అయితే ఏ కంపెనీ అధికారులు కూడా ఈ చర్చలను అధికారికంగా ధృవీకరించలేదు. ఎంతో కాలంగా దేశీయ మార్కెట్లో వాల్‌మార్ట్ తన సత్తా చాటాలని చూస్తోంది. కానీ ఇన్ని రోజులు రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 14.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ విలువ రెండింతలు కానుంది. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ పెట్టనున్న పెట్టుబడులతో, అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది. వాల్‌మార్ట్ భారత్‌లో ప్రస్తుతం 21 స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు వాటా!!
న్యూఢిల్లీ: ఇప్పటికే భారీ స్టోర్ల ద్వారా దేశ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన వాల్‌మార్ట్... ఆన్‌లైన్‌లోనూ సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ మార్గాన్ని ఎంచుకుంది. అంటే... ఫ్లిప్‌కార్ట్‌లో 15 నుంచి 20 శాతం వాటా కొనుగోలు చేయటం ద్వారా భారత ఆన్లైన్ మార్కెట్లోకి ప్రవేశించటమన్న మాట. దీనికోసం సుమారు 1 బిలియన్ డాలర్ల వరకూ ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరు సంస్థలూ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. ఇటీవలే భారత పర్యటనకి వచ్చిన వాల్‌మార్ట్ గ్లోబల్ సీఈవో డగ్ మెక్‌మిలన్.. బెంగళూరులోని ఫ్లిప్‌కార్ట్ కార్యాలయంలో కొంతసేపు గడిపారని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘భారత మార్కెట్‌కి వాల్‌మార్ట్ చాలా ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే మా గ్లోబల్ సీఈవో డగ్ మెక్‌మిలన్ ఇక్కడి మూడు వ్యాపార విభాగాలను (క్యాష్ అండ్ క్యారీ, గ్లోబల్ టెక్నాలజీ సెంటర్, గ్లోబల్ సోర్సింగ్) సమీక్షించేందుకు ఈ మధ్య భారత్ వచ్చారు. భారత మార్కెట్‌కి మేం కట్టుబడి ఉన్నాం‘ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌తో డీల్‌కు సంబంధించి మార్కెట్ వర్గాల ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. మరింత బలపడనున్న ఫ్లిప్‌కార్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన పక్షంలో భారీ భారత ఈ–కామర్స్ వ్యాపారంలో వాల్మార్ట్కూ వాటా దక్కినట్లవుతుంది. దేశీ ఈ– కామర్స్ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరం 33 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. మరోవైపు, ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న ఫ్లిప్‌కార్ట్‌కి వాల్‌మార్ట్ కూడా తోడైతే... ఆర్థికంగా మరింత బలపడుతుంది. అలాగే, వ్యాపార విభాగాలూ పటిష్ఠమవుతాయి. అమెరికన్ దిగ్గజం అమెజాన్‌కి దీటుగా పోటీనివ్వగలదు. ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇరు కంపెనీలు ఇప్పటికే బిలియన్ల డాలర్లు మార్కెట్లో కుమ్మరిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 4 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్ 2.5 బిలియన్ డాలర్లు.. టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే 1.4 బిలియన్ డాలర్లు అందించాయి. -
తెలంగాణతో గ్లోబల్ దిగ్గజం మెగా డీల్
గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్, తెలంగాణ ప్రభుత్వంతో మెగా డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో 10 వాల్ మార్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు, ఒక్కో స్టోర్ కు 10 మిలియన్ డాలర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టున్నట్టు తెలిపింది. అంటే మొత్తంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 120 మిలియన్ డాలర్ల వరకు ఉండనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎంఓయూపై రాష్ట్రప్రభుత్వంతో కలిసి సంతకం చేసింది. వాల్ మార్ట్ కు దేశవ్యాప్తంగా 21 స్టోర్లు ఉన్నాయి. దీనిలో ఒకటి హైదరాబాద్ లో కూడా ఉంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో మరో 50 కొత్త స్టోర్లను భారత్ లో ఏర్పాటుచేయాలని కంపెనీ నిర్ణయించింది. వాటిలో 10 తెలంగాణలోనే ఏర్పాటుచేయనుంది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, వాల్ మార్ట్ కెనడా, ఆసియా సీఈవో, ప్రెసిడెంట్ డిర్క్ వాన్ డెన్ బెర్గె, వాల్ మార్ట్ ఇండియా సీఈవో ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ సమక్షంలో వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ లు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ తో కూడా వాల్ మార్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఉత్తరభారత్ లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. హర్యానా, పంజాబ్ లతో కూడా వాల్ మార్ట్ డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటుచేయబోయే 10 వాల్ మార్ట్ స్టోర్లలో నాలుగు హైదరాబాద్ లోనే ఏర్పాటుచేయనున్నట్టు క్రిష్ అయ్యర్ చెప్పారు. వరంగల్, కరింనగర్, నిజామాబాద్ లో కూడా కొత్త స్టోర్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో వాల్‌మార్ట్ విస్తరణ
♦ రెండు రాష్ట్రాల్లో 10 స్టోర్ల చొప్పున ఏర్పాటు ♦ దేశవ్యాప్తంగా కొత్తగా 50 దుకాణాలు న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రిటైల్ దుకాణాల్లో అగ్రగామిగా ఉన్న వాల్‌మార్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా విస్తరించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10 స్టోర్ల చొప్పున కొత్తగా 20 దుకాణాలను ఏర్పాటు చేయనుంది. అలాగే, మహారాష్ట్రలోనూ 10 స్టోర్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్ మార్ట్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో (హోల్‌సేల్) దేశవ్యాప్తంగా 20 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటి సంఖ్యను గణనీయంగా పెంచే ప్రణాళికలతో ఉంది. దేశవ్యాప్తంగా 50 దుకాణాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో గణనీయ సంఖ్యలో ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్రభుత్వం నిబంధనలను సరళీకరిస్తే ఫుడ్ రిటైల్లోకీ అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి. భారతీ గ్రూపుతో రిటైల్ భాగస్వామ్యానికి కొన్నేళ్ల క్రితం ముగింపు పలికిన వాల్‌మార్ట్ అప్పటి నుంచి సొంతంగా దుకాణాల ఏర్పాటుపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇతర సంస్థల నుంచి క్యాష్ అండ్ క్యారీ విభాగంలో పోటీ తక్కువగా ఉండడంతో అధిక అవకాశాలున్నాయని భావిస్తున్న యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వాల్‌మార్ట్ నిర్వహిస్తున్న స్టోర్లన్నీ హల్‌సేల్ విభాగంలోనివే. అంటే రిటైల్ దుకాణాదారులు, క్యాంటీన్లు, హోటళ్ల వారు ఈ స్టోర్లలో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఫుడ్ రిటైల్లోకీ అడుగు! ఇక ఫుడ్ రిటైల్‌పైనా కంపెనీ ఆసక్తితో ఉంది. ఈ విషయంలో మార్గదర్శకాల పరంగా స్పష్టత కోసం వేచి చూస్తోంది. ఫుడ్ రిటైల్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం సానుకూల నిర్ణయమని, అయితే, ఆహారేతర ఉత్పాదనలను కూడా విక్రయించే వెసులుబాటు కల్పిస్తే ఆర్థికంగా గిట్టుబాటవుతుందని వాల్‌మార్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘‘భారత్‌లో కార్యకలాపాలను విస్తరించనున్నాం. వచ్చే కొన్నేళ్లలో ఏపీ, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్రలో కొత్తగా 50 దుకాణాలను ప్రారంభించనున్నాం. మా బృందం ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. కిరాణా దుకాణాలు, చిన్న, మధ్య స్థాయి సరఫరాదారులకు సాయం అందించేందుకు, వేలాది ఉద్యోగాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌తో వాల్‌మార్ట్ జట్టు !
న్యూఢిల్లీ: ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ కామర్స్ లీడర్ ఫ్లిప్‌కార్ట్ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్యంపై వీటి మధ్య చర్చలు నడుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలపడం ద్వారా బూమ్ మీదున్న దేశీయ ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశించడంతోపాటు, అమెరికాలో వలే ఇక్కడ కూడా అమెజాన్‌కు వాల్‌మార్ట్ గట్టిపోటీనివ్వవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఫ్లిప్‌కార్ట్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా స్వల్ప వాటా తీసుకునేందుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉందని, భాగస్వామ్యంపై ఇరు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దీనిపై పీటీఐ వార్తా సంస్థ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లను సంప్రదించగా... వదంతులు, ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని తిరస్కరించాయి. -
ఫార్చ్యూన్-500లో మనవి ఏడు!!
♦ మన ఏడింట్లో నాలుగు చమురు కంపెనీలే ♦ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న వాల్‌మార్ట్ ♦ రెండు, మూడు స్థానాలు చైనా కంపెనీల సొంతం ♦ ఆదాయాన్ని బట్టి కంపెనీల్ని వర్గీకరించిన ఫార్చ్యూన్ న్యూయార్క్: భారత్‌కు చెందిన ఏడు కంపెనీలు తాజాగా ఫార్చ్యూన్-500 ‘ప్రపంచపు అతిపెద్ద కంపెనీల’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిల్లో నాలుగు ప్రభుత్వానివైతే.. మిగతావి ప్రైవేట్ రంగానివి. ఆదాయం పరంగా కంపెనీల ఎంపిక జరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’ 4,82,130 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానాన్ని సాధిం చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 54.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో 161వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆయిల్ తర్వాతి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇక యాపిల్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది జాబితాలో స్థానం పొందిన చమురు-గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ ఈ సారి చోటు కోల్పోయింది. కొత్తగా ఈసారి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్థానం దక్కించుకుంది. ఫార్చ్యూన్-500 జాబితాలోని కంపెనీలు 6.7 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ.. 33 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటి మొత్తం ఆదాయం గతేడాది 27.6 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
భారత్‌లో అమెజాన్, వాల్‌మార్ట్ బిగ్ ఫైట్
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎఫ్ డీఐ పాలసీతో అమెరికన్ దిగ్గజాలు అమెజాన్, వాల్ మార్ట్ ల మధ్య ఇండియన్ వర్షెన్ లో బిగ్ ఫైట్ ప్రారంభం కాబోతోంది. ఈ-కామర్స్ వేదికలు సహా ఇతర మార్గాల్లో ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్‌కు సంబంధించి కూడా నూరు శాతం ఎఫ్‌డీఐలకు సర్కారు ద్వారాలు తెరిచింది. దీంతో అమెరికన్ సూపర్ సెల్లర్స్ గా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, రిటైల్ సంస్థ వాల్ మార్ట్ లు భారత్ లో తమ వ్యాపారాలను పెంచుకోవడానికి మార్గం సుగుమమైంది. ఈ రెండు సంస్థలు ఆహార ఉత్పత్తులను కస్టమర్లకు అందించేందుకు కొత్త మోడల్స్ ను ఎంచుకుని, మార్కెట్లో తమ స్థానాలను బలపర్చుకోవడానికి తీవ్రంగా కృషిచేయనున్నాయి... ఆహారోత్పత్తులను డైరెక్టుగా కస్టమర్లకు విక్రయించేందుకు ఈ పాలసీ దోహదపడనునడంతో, ఆఫ్ లైన్, ఆన్ లైన్ ఏ మార్గంలోనైనా డైరెక్ట్ గా ఆహారోత్పత్తులను వినియోగదారులకు విక్రయించేందుకు ఈ దిగ్గజాలు పోటీపడనున్నాయి.. అమెజాన్ ప్రస్తుతం థర్డ్ పార్టీ అమ్మకదారులతో మార్కెట్ ప్లేస్ ను కలిగి ఉండగా.. వాల్ మార్ట్ చిల్లర వర్తకులకు అమ్మడం ద్వారా క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నడుపుతోంది. గ్రోసరీ, ఫ్రూట్, వెజిటేబుల్స్ ను తన మార్కెట్ ప్లేస్ ద్వారా ఆన్ లైన్ లో డైరెక్టుగా అమ్మేందుకు అమెజాన్ ఆసక్తికనబరుస్తుందని కంపెనీకి చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా తనుకు తానుగా అమ్మకందారుడిగా అమెజాన్ వ్యవహరించాలనుకుంటోంది. ఈ ప్రోగ్రామ్ ను ఇప్పటికే అమెరికాలో అమెజాన్ ఫ్రెష్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. వ్యవసాయదారులతో జతకట్టి ఈ అమ్మకాలను అమెజాన్ చేపడుతోంది. దీంతో అక్కడ వాల్ మార్ట్ కోర్ గ్రోసరీ బిజినెస్ లకు అమెజాన్ గట్టి పోటీని ఇస్తోంది. ఇదే మాదిరి ఇండియాలో కూడా చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత వినియోగదారులకు డైరెక్టుగా ఆహార ఉత్పత్తులు అమ్మేందుకు ఆసక్తి ఉన్నట్టు వాల్ మార్ట్ కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటివరకూ ఆన్ లైన్ కంపెనీలు డైరెక్ట్ గా కస్టమర్లకు మల్టీ బ్రాండ్లను అమ్మడానికి అనుమతి లేదు. థర్డ్ పార్టీ అమ్మకాలు చేపట్టానికే మాత్రమే ఇవి ప్లాట్ ఫామ్ లా ఉన్నాయి. ఎఫ్ డీఐ వేదికలుగా జరిగే ఆహార ఉత్పత్తులకు 100 శాతం ఎఫ్ డీఐలను అనుమతి ఇవ్వడం, ఈ ఉత్పత్తుల పరిశ్రమలపై పాజిటివ్ ప్రభావం చూపుతాయని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తంచేశారు. -
269 వాల్ మార్ట్ స్టోర్స్ మూసివేత
వాషింగ్టన్: అమెరికా రిటైల్ మార్కెటింగ్ దిగ్గజం వాల్‌మార్ట్ తాజా ప్రకటనతో ఆ కంపెనీ ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. 269 వాల్‌మార్ట్ స్టోర్లు మూసివేయాలని భావిస్తున్నట్లు ఆర్కాన్సస్ కు చెందిన ఓ కంపెనీ తెలిపింది. స్టోర్స్ మూసివేతతో పదహారు వేలమంది వాల్‌మార్ట్ సిబ్బంది రోడ్డున పడనున్నారు. ఇందులో ఆరు వేల మంది విదేశీ సిబ్బంది ఉన్నారు. అమెరికాలోని 154 స్టోర్స్, విదేశాల్లోని (బ్రెజిల్)115 స్టోర్లను మూసివేయనుంది. బ్రెజిల్లో ఇప్పటికే 60 వాల్ మార్ట్ స్టోర్స్ బంద్ అయ్యాయి. బ్రెజిల్ దేశవ్యాప్తంగా వాల్‌మార్ట్ స్టోర్ల ఆదాయం 5 శాతం పడిపోయిందట. వీలైనంత వరకు కొందరు ఉద్యోగులను తమ అనుబంధ కంపెనీల్లోకి బదిలీ చేశారు. జనవరి చివరికల్లా ఈ తతంగం పూర్తవుతుందని వాల్‌మార్ట్ సీఈవో డౌగ్ మెక్‌మిలన్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏం అవుతుందోనని స్టోర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2011లో యుద్ధప్రాతిపదికన వాల్‌మార్ట్ రిటైల్ మార్కెట్లో స్టోర్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. లాటిన్ అమెరికాలోని వాల్‌మార్ట్ స్టోర్స్ ప్రస్తుతం అంత లాభదాయకంగా పనిచేయడం లేదు. దీంతో ఆయా స్టోర్లను మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అమెరికా వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు మరో 405 స్టోర్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సీఈవో చెబుతున్నారు. -
భారత్‌లో కోట్ల కొద్దీ లంచాలిచ్చిన వాల్‌మార్ట్
వాషింగ్టన్: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో తమ వ్యాపార అవసరాల రీత్యా స్థానిక అధికారులకు భారీ ఎత్తున కోట్ల కొద్దీ లంచాలిచ్చి పనులు జరిపించుకుందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. రియల్ ఎస్టేట్ అనుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్ మొదలైన వాటి కోసం కింది స్థాయి సిబ్బందికి స్వల్ప మొత్తాలు చెల్లించిందని పేర్కొంది. సందేహాస్పద చెల్లింపుల్లో చాలా మటుకు 200 డాలర్ల కన్నా(సుమారు రూ. 13,000) తక్కువే ఉన్నాయని, కొన్ని సందర్భాల్లో అత్యంత తక్కువగా 5 డాలర్ల(దాదాపు రూ. 350) చెల్లింపులు కూడా ఉన్నాయని పత్రిక తెలిపింది. ఇవన్నీ కలిపితే మిలియన్ల కొద్దీ డాలర్లవుతాయని, దర్యాప్తు సంస్థలకు ఇందుకు సంబంధించి ఆధారాలు లభించాయని వివరించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆయా సంస్థలు ఆర్జించిన లాభాలను బట్టి పెనాల్టీ ఉంటుందని పేర్కొంది. అయితే, భారత్‌లో వాల్‌మార్ట్‌కి ఇప్పటిదాకా లాభాలేమీ రానందున కంపెనీపై జరిమానా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సమాచారం. లంచాల వ్యవహారంపైనే 2012లో సంస్థ సీఎఫ్‌వో సహా అయిదుగురిపై వేటు పడిన సంగతి తెలి సిందే. మరోవైపు, దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని వాల్‌మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్ చెప్పారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జాయింట్ వెంచర్ ద్వారా 2007లో వాల్‌మార్ట్ భారత మార్కెట్లో ప్రవేశించింది. ఆ తర్వాత రిటైల్ స్టోర్స్ ఏర్పాటు యోచనను విరమించుకుని, హోల్సేలర్గానే కొనసాగాలని నిర్ణయించుకున్న వాల్‌మార్ట్.. 2013లో భాగస్వామ్యం నుంచి తప్పుకుంది. అయితే, మెక్సికో, చైనా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ అక్కడి అధికారులకు లంచాలిచ్చి పనులు జరిపించుకుందని వాల్‌మార్ట్‌పై అభియోగాలు వచ్చాయి. -
వాల్‌మార్ట్... ట్రాన్స్ఫార్మర్స్
వాషింగ్టన్: ట్రాన్స్ఫార్మర్స్ సినిమా చూశారా! అందులో అత్యాధునిక కార్లు, ట్రక్కులు సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు తీస్తూ.. అంతలోనే భారీ రోబోలుగా మారిపోతుంటాయి. ఈ రోబోల భాగాన్ని పక్కన పెడితే అచ్చం ఆ తరహాలో భారీ ట్రక్కులను తయారు చేయించుకుంటోంది అమెరికన్ రిటైలింగ్ దిగ్గజం వాల్‌మార్ట్. అమెరికాలో 4,700 పైచిలుకు ఉన్న తమ స్టోర్స్‌కి సరుకులను చేరవేసేందుకు వీటిని వినియోగించనుంది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో పీటర్‌బిల్ట్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఉపయోగించే ట్రక్‌లతో పోలిస్తే ఇవి 4,000 పౌండ్ల మేర తేలికగా ఉంటాయి. స్లైడింగ్ డోర్లు, స్పేస్‌షిప్‌లో కెప్టెన్ చెయిర్ తరహా డ్రైవరు సీటు, వాహనానికి అన్ని వైపులా ఏం జరుగుతోందన్నది తెలుసుకోవడానికి డాష్‌బోర్డ్‌కి రెండు వైపులా మానిటర్లు .. ఒకటేమిటీ అనేక హంగులు ఈ ట్రక్‌లో ఉంటాయి. ఈ ట్రక్‌లలో ఏకంగా 18 చక్రాలు ఉంటాయి. ఇలాంటి భారీ ట్రక్కులు ఒకదాని వెనుక మరొకటి నిర్దిష్ట దూరంలో వెడుతుంటే రోడ్డు మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఏకకాలంలో ముందుకు దూసుకెడుతూ, ఒకేసారి బ్రేకులు వేస్తూ ప్లాటూనింగ్ విధానంలో ఈ వాహనాలు ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గడం, రోడ్డుపై రద్దీ తగ్గడం.. భద్రత పెరగడం, సరైన సమయానికి డెలివరీ చేయగలగడంతో వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయంటున్నారు రూపకర్తలు. మనుషుల ప్రమేయం లేకుండా పరస్పరం సమన్వయపర్చుకునేలా వీటిని తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో అసలు డ్రైవర్ల అవసరమే లేకుండా పోతుంది. ఇప్పటికే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్న పీటర్‌బిల్ట్ సంస్థ.. డ్రైవర్ల పనిని మరింత సులువు చేసే టెక్నాలజీలను రూపొందించే పనిలో ఉంది. ఆన్లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే కస్టమర్లకు ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. -
ఐదేళ్లలో 50 హోల్‌సేల్ స్టోర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో సొంతంగా కార్యకలాపాల విస్తరణకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంపై దృష్టిసారించిన ఈ సంస్థ... వచ్చే 4-5 ఏళ్లలో 50 వరకూ ఈ తరహా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారతీ గ్రూప్‌తో భాగస్వామ్యంతో దేశంలోకి ప్రవేశించిన వాల్‌మార్ట్.. బెస్ట్‌ప్రైస్ మోడల్ హోల్‌సేల్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల క్రితం భారతీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాల కోసం ముడుపులు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ వ్యాపార విధానాల నిబద్ధతను మరింత పటిష్టం చేయనున్నట్లు కూడా పేర్కొంది. ఆరేళ్లపాటు భారతీతో కలిసి దాదాపు 20 స్టోర్లను నిర్వహించిన వాల్‌మార్ట్... ఆ సంస్థతో విడిపోయాక ప్రకటించిన కీలక వ్యాపార వృద్ధి ప్రణాళికలు ఇవే కావడం గమనార్హం. మల్టీబ్రాండ్ రిటైల్ ప్రణాళికలపై మౌనం... ‘భారత్‌లో పెట్టుబడులకు మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ వ్యాపార వృద్ధి ప్రణాళికల విషయంలోనూ చాలా ఉత్సుకతతో ముందుకెళ్తున్నాం. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో మా ప్రస్థానం కొనసాగుతుంది. గడిచిన కొన్నేళ్లలో ఇక్కడ రిటైల్ రంగంలో వచ్చిన మార్పుల పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విభాగంలో మరింత భారీ వృద్ధికి అవకాశాలున్నాయి. అందుకే రానున్న 4-5 ఏళ్లలో కొత్తగా 50 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. మా కస్టమర్లకు మరింత చేరువయ్యేలా... వర్చువల్ షాపింగ్ అవకాశాన్ని కల్పించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తరించనున్నాం’ అని వాల్‌మార్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ స్కాట్ ప్రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరఫరా మౌలికవసతులు, సరఫరాదారుల అభివృద్ధికి సంబంధించి కూడా పెట్టుబడులపైనా కంపెనీ దృష్టిసారిస్తోంది. అయితే, భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ విభాగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై వివరాలను మాత్రం వాల్‌మార్ట్ వెల్లడించలేదు. -
వాల్‌మార్ట్ ఇండియా సీఈవోగా క్రిష్
వాల్‌మార్ట్ ఇండియా విభాగానికి క్రిష్ అయ్యర్ ముఖ్యకార్యనిర్వహాణాధికారి(సీఈఓ)గా నియమించారు. ఈ మేరకు యూఎస్‌లో చిల్లర మార్కెట్ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యం శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. 2014, జనవరి 20న క్రిష్ బాధ్యతలు చేపడతారని తెలిపింది.భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత పురోగతి సాధించేందుకు క్రిష్ కీలక పాత్ర పోషిస్తారని వాల్‌మార్ట్ చెప్పింది. ప్రస్తుత సీఈఓ రామ్నిక్ నర్సీ స్థానంలో ఆయన నియమించినట్లు పేర్కొంది. -
వాల్‌మార్ట్ తప్పు చేయలేదు
న్యూఢిల్లీ: భారత్‌లో సూపర్ మార్కెట్ చైన్ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెరికా రిటైల్ దిగ్గజ కంపెనీ వాల్‌మార్ట్‌కు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను వాల్‌మార్ట్ ఉల్లంఘించలేదని తేల్చింది. వాల్‌మార్ట్ భారత్‌లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత ఈడీ ఈ నిర్థారణకు వచ్చింది. ప్రభుత్వం ఇటీవల సవరించిన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా), బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ నియంత్రణల మార్గదర్శకాలను వాల్‌మార్ట్ ఉల్లంఘించినట్లు రుజువుకాలేదని ఈడీ పేర్కొంది. ఆర్బీఐ నుంచి తాజా మార్గదర్శకాలు వస్తే తప్ప.. ఈ దర్యాప్తు విషయంలో ముందుకు వెళ్లేందుకు బలమైన ఆధారాలు లేవని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. సీపీఐ ఎంపీ అచ్యుతన్ వాల్‌మార్ట్ పెట్టుబడులపై ఆరోపణలు చేస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాసిన తర్వాత ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు నిర్వహించింది. 2010లో వాల్‌మార్ట్ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సెడార్ సపోర్ట్ సర్వీసెస్‌లో కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 10 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టిందని అచ్యుతన్ పేర్కొన్నారు. భారతీ సెడార్ ద్వారా ‘ఈజీ డే‘ పేరుతో బహుళ బ్రాండ్ల చిల్లర రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడులు అక్రమమని, ఈ నిధులను భారతీ సూపర్ మార్కెట్ల కోసం వినియోగిస్తోందని అచ్యుతన్ ఆరోపించారు. వాల్‌మార్ట్ పెట్టుబడుల సమయానికి బహుళబ్రాండ్ల చిల్లర వర్తకంలో ఎఫ్డీఐకు అనుమతి లేదు. దర్యాప్తులో తాను గుర్తించిన విషయాలను ఈడీ ఆర్బీఐకి నివేదించింది. భారతీ రిటైల్‌లో సెడార్ పెట్టుబడులు ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ఆదేశాలు, నోటిఫికేషన్‌కు లోబడే ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక, సెడార్లో 10కోట్ల డాలర్ల కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను సరైన సమయంలో 49శాతం ఈక్విటీ కింద మార్చుకోనందుకు వాల్‌మార్ట్‌తోపాటు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్బీఐ జరిమానా విధించడం లేదా హెచ్చరించడం చేయవచ్చని చెప్పాయి.