American Toddler accidentally purchases 2000 Dollars worth of items: కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలంతా మొబైల్ ఫోన్స్‌కే అతుక్కుపోతున్నారంటూ కంప్లైంట్ చేస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఆన్‌లైన్ క్లాస్ లేదంటే గేమ్స్ మొత్తానికి ఫోన్ వదలడం లేదు. అయితే అమెరికాకు చెందిన 20 నెలల చిచ్చర పిడుగు స్మార్ట్‌ఫోన్‌తో చేసిన పని ఇప్పుడు యూస్‌తో పాటు ఇండియాలోనూ వైరల్‌గా మారింది.
అమెరికన్ ఇండియన్ దంపతులు ప్రమోద్ , మధుకుమార్‌లు న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారుంట ఇంటికి వరుసగా కొరియర్లు వచ్చి చేరుతున్నాయి. కొత్తగా తీసుకున్న ఇంటికి సంబంధించిన ఫర్నీచర్ వస్తువులు ఒక్కొక్కటిగా వాల్‌మార్ట్ బృందం ఇంటికి చేరవేస్తోంది. తాను ఆ వస్తువులు కొనాలని అనుకున్న మాట వాస్తమేనని, అయితే తాను ఆర్డర్ చేయలేదంటూ మధుకుమార్ డెలివరీ బాయ్స్‌తో వాదనకు దిగింది.
అయితే వాల్‌మార్ట్ ప్రతినిధులు ఆర్డర్‌కి సంబంధించిన వివరాలను మధుకుమార్ ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యింది. ఎందుకంటే విలువైన వస్తువులు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసింది మరెవరో కాదు.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే ఇరవై నెలల బాబు ఆయాన్ష్. తల్లి ఫోన్‌లో వాల్‌మార్ట్ యాప్‌లో కార్ట్‌లో పిక్ చేసి ఉన్న వస్తువలను అతను సునాయాసంగా ప్లేస్ ఆర్డర్ చేసేశాడు. ఇలా అమెరికన్ కరెన్సీలో 2000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1.49 లక్షలు) విలువైన వస్తువులు బుక్ చేశాడు.
ఇంట్లో ఉన్నప్పుడు ఆయాన్ష్ ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడని, కానీ ఫేస్ రికగ్నేషన్, పాస్‌కోడ్ ఉన్న ఫోన్‌ను ఆయాన్ష్ ఎలా ఓపెన్ చేశాడన్నది మిస్టరీగా మారింది. వెంటనే ఆయన్ష్ చేతికి కొన్ని ఫోన్లు ఇవ్వగా ఈ మెయిల్స్ పంపడం, కాంటాక్ట్ లిస్ట్ చెక్ చేయడం, క్యాలెండర్ క్లోజ్ చేయవం వంటి పనులు పక్కా చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా అమెరికా మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో 20 నెలల చిచ్చర పిడుగు ఆయాన్ష్ ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్ సిసింద్రీగా మారాడు. పొరపాటున ఆర్డర్ చేసినట్టుగా తెలపడంతో.. సదరు ఫర్నీచర్‌ని వెనక్కి తీసుకునేందుకు వాల్‌మార్ట్ అంగీకరించింది.
చదవండి: రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం?
Comments
Please login to add a commentAdd a comment