
డెట్రాయిడ్: వచ్చే ఏడాది న్యూజెర్సీలో జరగబోయే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సమావేశాలను విజయవంతం చేసేందుకు సభ్యులందరూ కృషి చేయాలని టీటీఏ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి కోరారు. టీటీఏ బోర్డు సమావేశం ఆగష్టు 14l డెట్రాయిట్‌లోని మారియట్‌లో జరిగింది. అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, సమావేశాన్ని ప్రారంభించారు.
టీటీఏ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి మాట్లాడుతూ టీటీఏకు సంబంధించి ప్రతీ చాఫ్టర్‌ను బలోపేతం చేయాలన్నారు. ఇందుకు స్థానిక నాయకత్వం బాధ్యత తీసుకోవాలని సూచించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ 60కి పైగా కార్యక్రమాలను చేపట్టిన పాత కార్యవర్గాన్ని ప్రశంసించారు. 2022లో న్యూజెర్సీలో జరిగే టీటీఏ సమావేశాలను విజయవంతం చేయడానికి మరింత ఉత్సాహంతో పని చేయాలని సభ్యులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment