సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్‌డీల్‌కు వ్యతిరేకంగా రీటైల్ దుకాణదారులు, ఆన్‌లైన్ ట్రేడర్లు త్రీవ నిరసన వ్యక్తంచేశాయి. దేశవ్యాప‍్తంగా 500 నగరాల్లో ఆందోళన నిర్వహించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మంది వ్యాపారులు దేశవ్యాప్త నిరసనకు దిగారు. ఈస్టిండియా కంపెనీ లాంటి వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కారణంగా తమ వ్యాపారం భారీగా దెబ్బతింటుందని ఆరోపించారు. తమ వ్యాపారాలను ఆదుకోవాలని కోరారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో సియాట్ సోమవారం ధర్నాలకు దిగింది. ఈ డీల్ కారణంగా రిటైల్ మార్కెట్లో గుత్తాధిపత్యం వస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు నాణ్యత లేని వస్తువులను భారత మార్కెట్‌లో చొచ్చుకు రానున్నాయని వాదించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యపరిశ్రమల శాఖ కల్పించుకోవాలని డిమాండ్‌చేశారు. తక్షణమే ఈ కామర్స్ విదానాన్ని , ఈ కామర్స్‌రెగ్యులేటరీ బాడీని నియమించాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు ఈడీకి, సీసీఐకి ఫిర్యాదు దాఖలు చేసినట్టు చెప్పారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే.. సుప్రీకోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు.ఇది తమ నిరసన లో మొదటి దశ మరియు ప్రభుత్వం వినకపోతే, ఈ నెలలో ఢిల్లీలో ఒక జాతీయ సదస్సు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని సియాట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment