సాక్షి, ముంబై: దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ అతి భారీ వాటా విక్రయానికి ఆమోదముద్ర పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రీటెయిలర్‌గా పేరున్న వాల్‌మార్ట్‌కు 75 శాతం వాటా విక్రయానికి ఫ్లిప్‌కార్ట్‌బోర్డు అంగీకరించినట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అంచనాలకుమించి సుమారు 15 బిలియన్ డాలర్లకు (లక్షకోట్ల రూపాయలకు) ఈ డీల్ కుదిరింది.
ప్రతిపాదిత ఒప్పందంలో సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ కింద దాదాపు 20 మిలియన్ డాలర్ల వాటాను విక్రయించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే గూగుల్-పేరెంట్ ఆల్ఫాబెట్ సంస్థ వాల్‌మార్ట్ పెట్టుబడిలో పాల్గొనే అవకాశం ఉంది. మరో 10 రోజుల్లో తుది డీల్ పూర్తి కావచ్చని అంచనా. మరోవైపు ఈ వార్తలపై స్పందించడానికి వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్ బ్యాంక్ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా దేశీయంగా ఆన్‌లైన్ సంస్థలపైకన్నేసిన వాల్‌మార్ట్ చివరకు ఫ్లిప్‌కార్ట్‌లోమెజారిటీ వాటాపై కొనుగోలుకు పథకం వేసింది. గ్లోబల్ ఇ-కామర్స్ వ్యూహంలో ఫ్లిప్‌కార్ట్ డీల్ కీలకమని న్యూఢిల్లీ ఆధారిత రిటైల్ కన్సల్టెన్సీ అడ్వైజర్ల ఛైర్మన్ అరవింద్ సింఘాల్ అన్నారు.
కాగా ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ భారత రిటైల్ మార్కెట్లో ప్రవేశించేందుకు సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తోంది. తాజా డీల్ సాకారమైతే శరవేగంగా పరుగులుపెడుతున్న భారత ఈకామర్స్ మార్కెట్లో వాల్‌మార్ట్ భారీ స్థాయిలో పాగా వేయడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ప్రత్యర్ధి సంస్థ అమెజాన్‌కు గట్టి పోటీ తప్పదు. ముఖ్యంగా చైనాలో అమెజాన్‌కు ఎదురుదెబ్బ నేపథ్యంలో ఇండియాలో విస్తరించాలని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment