Traders
-
ధరలు ధగధగ.. వ్యాపారం వెలవెల!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సందడి పెద్దగా కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ వ్యాపారాలు అంతంత మాత్రమేనని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సంతోషంగా పండుగ ఎలా చేసుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వస్త్ర, బంగారు, ఇతర వ్యాపారాలన్నీ దాదాపు సగానికి సగం పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పూట పిండి వంటలు చేసుకునేందుకు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ పూట ఇంటికి వచ్చే బంధువులకు నాలుగు రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. గతేడాది జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల నుంచి బియ్యం వరకు మండుతున్న ధరలను చూసి గగ్గోలు పెడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయలేని టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో వైపు ఎన్నికల్లో ఇచి్చన హామీలు అమలు చేయకపోగా, చంద్రన్న సంక్రాంతి కానుక సైతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో ఏ విధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 20–40 శాతం మేర పెరిగిన ధరలు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. పండుగ నాలుగు రోజులు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకే కాదు.. బంధువులు, స్నేహితులకు ఘుమ ఘుమలాడే పిండి వంటలు వండి వడ్డించడం మన తెలుగువారి సంప్రదాయం. బూరెలు, గారెలు, అరిసెలు, సున్నుండలు, పొంగడాలు, పాకుండలు, కజ్జి కాయలు, పులిహోర ఇలా ఎవరికి వారు తమ స్థాయికి తగ్గట్టుగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నిత్యావసరాల ధరలు షేర్ మార్కెట్లా దూసుకెళ్లాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ అండదండలతో అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. గతేడాది సంక్రాంతికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం సగటున 20 నుంచి 40 శాతం మేర పెరిగాయి. నిత్యావసర వస్తువులే కాదు.. కాయగూరల ధరలు సైతం పెరిగాయి. వెల్లుల్లి అయితే రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగింది. పిండి వంటల్లో ఉపయోగించే పప్పులు, బెల్లం, నెయ్యి ధరలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. పప్పన్నానికీ దూరం పండుగ పూట పప్పన్నం వండుకునేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధర సామాన్య, నిరుపేదలను బెంబేలెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కిలో రూ.84.50 ఉన్న శనగపప్పు ప్రస్తుతం రూ.100–140 పలుకుతోంది. గత ఏడాది రూ.150 ఉన్న కందిపప్పు అయితే నేడు ఏకంగా రూ.160–224తో అమ్ముతున్నారు. గతేడాది రూ.126 పలికిన పెసరపప్పు నేడు రూ.140–170 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.10 నుంచి రూ.20 తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం గతేడాది కిలో రూ.50 పలుకగా, నేడు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. బియ్యం ధర గురించి అయితే చెప్పనవసరం లేదు. గతేడాది ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో రూ.57 ఉండగా, నేడు సాధారణ రకమే ఆ ధరతో విక్రయిస్తున్నారు. ప్రీమియం రకాలు రూ.64–75 మధ్య పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం ధర కిలో రూ.120కి పైగానే ఉంది. నూనెల ధర ధగధగ దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకు రూ.30–50 వరకు ఎగబాకాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకు రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10–30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.20 అదనంగా ఉన్నాయి. గతేడాది జనవరిలో లీటర్ 88.60 ఉన్న పామాయిల్ ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. రూ.112.80 పలికిన సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ప్రస్తుతం రూ.150–160 చొప్పున అమ్ముతున్నారు. నెయ్యి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగింది. పాల ధరలు గతంతో పోలిస్తే లీటర్‌కు రూ.10–20 మేర పెరిగాయి. ఇలా బెంబేలెత్తిస్తున్న నిత్యావసర ధరల ప్రభావం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సగటున ఒక్కో కుటుంబంపై రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు భారం పడుతోంది.ముందస్తు ఆర్డర్లు లేవు.. సంక్రాంతి గతంలో ఉన్నట్టు ఈ ఏడాది లేదు. ముందస్తు ఆర్డర్లు తగ్గిపోయాయి. కార్పొరేట్ గిఫ్టుల కోసం తప్పితే ప్రజల నుంచి వచ్చే ఆర్డర్లు లేవు. చిన్న కుటుంబం రూ.1,500 ఖర్చు చేస్తే 10 రకాల పిండి వంటలు అందించేవాళ్లం. అవి దాదాపు 11–12 కిలోలు ఉండేవి. గతంలో పెట్టిన డబ్బులకు ఇప్పుడు 8 కిలోలు కూడా ఇవ్వలేకపోతున్నాం. శనగపిండి, వంట నూనెల రేట్లు పెరగడంతో తక్కువ పిండి వంటలు కొనుక్కుంటున్నారు. నెయ్యి క్వాలిటీదైతే రూ.వెయ్యి పలుకుతోంది. కంపెనీ నెయ్యి హోల్‌సేల్‌లోనే గతంలో కిలో రూ.500–550 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగా అల్లుళ్లు, కోడళ్లకు సారె పెడితే 100 మందికి పంచుకునే వాళ్లుŠ. ఇప్పుడు 20–30 మందికే పరిమితం అయ్యేలా పెడుతున్నారు. ఫలితంగా మాకు ఆర్డర్లు తగ్గిపోయాయి. – కె.సందీప్, పిండి వంటల వ్యాపారం, రావులపాలెంమూడొంతుల వ్యాపారం పడిపోయింది సాధారణ రోజుల్లో రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వ్యాపారం జరిగేది. పండుగ సీజన్లో రోజుకు రూ.19 వేల వరకు జరిగేది. సంక్రాంతి పండుగకు 15 రోజుల ముందు నుంచి షాపు కిటకిటలాడేది. ఇంటిల్లిపాది కొత్త చెప్పులు కొనుగోలు చేసేవారు. కానీ ఆరు నెలల నుంచి వ్యాపారం బాగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో రూ.2 వేలు దాటడం లేదు. ఈ పండుగ సీజన్లోనూ రూ.4 వేలకు మించడం లేదు. మూడొంతుల వ్యాపారం పడిపోయింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. – ఇమ్రాన్, చెప్పుల వ్యాపారి, అనంతపురంరూ.50 లక్షల నుంచి రూ.25 లక్షలకు.. చాలా రోజులుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నా. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నగలు తయారీ చేయించి విక్రయిస్తుంటాను. పలువురు మహిళా కస్టమర్లకు వాయిదాల పద్ధతిలో కూడా నగలు చేయించి ఇస్తున్నా. గతేడాది వరకు సంవత్సరానికి రూ.50 లక్షల మేరకు వ్యాపారం సాగుతుండేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఈ ఏడాది రూ.25 లక్షలకు మించి వ్యాపారం జరగలేదు. ప్రస్తుతం తమ చేతులో డబ్బుల్లేవని కస్టమర్లు చెబుతున్నారు. – వి.శేషగిరిరావు, శ్రీ మహేశ్వరి జ్యూయలర్స్, ఆత్మకూరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ సంక్రాంతి పండుగ వ్యాపారుల పాలిట శాపంగా మారింది. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రధాన పట్టణాల నుంచి నిత్యావసర సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చాం. కనీసం సాధారణ రోజుల్లో జరిగినంత వ్యాపారం కూడా జరగడం లేదు. గత ఏడాది సంక్రాంతికి పది రోజుల నుంచి పండుగ వరకు మా దుకాణంలో సుమారు రూ.25 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ఈ ఏడాది జనవరి 12 వస్తున్నా కనీసం రూ.3 లక్షల వ్యాపారం జరగలేదు. ఇలాంటి పరిస్థితి గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు. – శ్రీరాములు, జనరల్ స్టోర్ యజమాని, తిరుపతి ఇప్పుడే ఈ పరిస్థితి పెద్ద పండుగ వేళ అస్సలు వ్యాపారం లేకపోవడం ఇప్పుడే చూస్తున్నాం. ఎవరిని అడిగినా డబ్బులేదంటున్నారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఆఫర్లు మంచిగా ఇస్తున్నాం. కానీ ఎవ్వరూ కొనడం లేదు. కాలానికి తగ్గట్టు టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లలో కొత్త కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. బాగానే సేల్ అవుతాయని ఆశించాం. కానీ ఎల్రక్టానిక్స్ రంగం మొత్తం పండుగ వేళ పడిపోయింది. – బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారి, నగరి ఇలా అయితే పండుగ చేసుకునేదెలా? నేను వ్యవసాయ పనులకు వెళ్తాను. నెలకు రూ.10 వేలు కూడా రావట్లేదు. నిత్యావసరాలకు గతంలో రూ.3 వేలయ్యేది. ప్రస్తుతం రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. కందిపప్పు రూ.180 పైగానే ఉంది. వంట నూనె ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలు ఇలా మండిపోతుంటే పండుగలెలా చేసుకుంటాం? ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భయపడే పరిస్థితి కన్పిస్తోంది. – ద్వారపూడి సత్యారావు, సీతారాంపురం, విజయనగరం జిల్లావ్యాపారాలు తగ్గిపోయాయి ప్రస్తుతం వ్యాపారాలు 75% తగ్గిపోయాయి. చాలా ఏళ్లుగా సామర్లకోటలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. గత సంక్రాంతి సీజన్లో రోజూ రూ.20,000 వ్యాపారం జరిగేది. ఈ సీజన్లో రూ.5,000 కూడా జరగడం లేదు. ప్రజల చేతిలో సొమ్ములు లేకపోవడం వల్ల కొనేవారు తగ్గిపోయారు. – గ్రంథి సత్యనారాయణమూర్తి, వస్త్ర వ్యాపారి, సామర్లకోట, కాకినాడ జిల్లా -
సన్న ధాన్యంపై వ్యాపారుల కన్ను
నిజామాబాద్ జిల్లాలోని వర్ని, బోధన్, మోస్రా, చందూర్ తదితర కొన్ని మండలాల్లో వరి కోతలు 100 శాతం పూర్తయ్యాయి. ఈ మండలాల్లో రైతులు పండించే హెచ్ఎంటీ, జై శ్రీరాం, బీపీటీ లాంటి మంచి రకం (ఫైన్ వెరైటీ) సన్న ధాన్యాన్ని ఇప్పటికే దళారులు, వ్యాపారులు పొలాల నుంచే కొనుగోలు చేశారు. తరుగు, తాలు, తేమ శాతంతో సంబంధం లేకుండా పచ్చి వడ్లను కొన్నారు. నెలరోజుల క్రితం ఇక్కడ కోతలు షురూ కాగా, మొదట్లో క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320కి మించి రూ.2,600 వరకు చెల్లించిన వ్యాపారులు, ప్రస్తుతం రూ.2,100 నుంచి రూ.2,300 వరకు చెల్లిస్తున్నారు. పైగా తాలు, తరుగు, తేమ శాతాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ధాన్యం కొని, డబ్బులు చెల్లిస్తుండడంతో.. రైతులు కూడా వారికే విక్రయిస్తున్నారు. ఫైన్ వెరైటీ సన్న ధాన్యం అధికంగా పండించే నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రంలో వ్యాపారులు, మిల్లర్లు పల్లెలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో పెరిగిన సన్నాల సాగును తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో సన్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కోతలు ప్రారంభమైన వెంటనే కల్లాల నుంచే ధాన్యాన్ని ఏకమొత్తంగా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో సెపె్టంబర్ చివరి వారం నుంచే వరికోతలు మొదలై అక్టోబర్‌లో పెద్ద ఎత్తున సాగుతాయి. మిగతా జిల్లాల్లో అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం నుంచి మొదలై జనవరి దాకా సాగుతాయి. సన్న ధాన్యానికి డిమాండ్ రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల నేపథ్యంలో ఈసారి ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చేంత వరకు ఆరబెట్టి, తరుగు, తాలు లేకుండా తూర్పారబట్టి కొనుగోలు కేంద్రానికి తెస్తేనే సేకరిస్తామని మిల్లర్లు చెబుతుండటం.. ఆ బాధలేవీ లేకుండా వ్యాపారులు పచ్చి వడ్లనే కొంటుండడం, డబ్బులు వెంటనే చేతికి వస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వరకు వెళ్లడం లేదు. తమ వద్దకే వచ్చే వ్యాపారులకు ధాన్యం అమ్మేసుకుంటున్నారు.ప్రస్తుతం కోతలు సాగుతున్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో సన్న ధాన్యాన్ని వ్యాపారులు కొంటున్నారు. ఫైన్ రకాలైన జైశ్రీరాం, సాంబ మసూరి (బీపీటీ 5204), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), హెచ్ఎంటీ సోనా రకాలకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ రకాలకు క్వింటాలుకు రూ.2,600 వరకు చెల్లిస్తున్నారు. మిగిలిన సన్న రకాలకు రూ.2,000 వరకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కిలో సన్న ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం. కాగా రాష్ట్రంలో సన్న ధాన్యం కోసం కేటాయించిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 33 వరి రకాలను వ్యవసాయ శాఖ సన్నాలుగా గుర్తించింది. వీటికే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తుంది. సర్కారు అంచనా సాధ్యమయ్యేనా? రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారుల కు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని సుమారు 90 లక్షల కార్డుదారులకే కాకుండా ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్న స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీలు, గురుకుల పాఠశాలలకు కలిపి ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) సన్న బియ్యం అవసరం. 24 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలంటే 36 ఎల్ఎంటీల సన్నవడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో 50 ఎల్ఎంటీల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారులే చెపుతున్నారు.వ్యవసాయ శాఖ గుర్తించిన సన్న ధాన్యం రకాలు ఇవే.. సిద్ది (వరంగల్ 44), కంపాసాగర్ వరి–1 (కేపీఎస్ 2874), సాంబ మసూరి (బీపీటీ 5204), జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356), జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545), వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14), వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100), జగిత్యాల్ మసూరి (జేజీఎల్ 11470), పొలాస ప్రభ (జేజీఎల్ 384), కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458), మానేరు సోనా (జేజీఎల్ 3828), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), వరంగల్ వరి–1119, కునారం వరి–2 (కేఎన్ఎం 1638), వరంగల్ వరి–2 (డబ్ల్యూజీఎల్ 962), రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278), కునారం వరి–1 (కేఎన్ఎం 733), జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798), జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844), కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855), అంజన (జేజీఎల్ 11118), నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్ 34 449), ప్రద్యుమ్న (జేజీఎల్ 17004), సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465), శోభిని (ఆర్ఎన్ఆర్ 2354), సోమనాథ్ (డబ్ల్యూజీఎల్ 34 7), ఆర్ఎన్ఆర్ 31479 (పీఆర్సీ), కేపీఎస్ 6251 (పీఆర్సీ), జేజీఎల్ 33124 (పీఆర్సీ), హెచ్ఎంటీ సోనా, మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), మారుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271. -
వ్యాపారిపై జనసేన నేతల అరాచకం
నరసరావుపేట టౌన్: ఓ దుకాణంలోకి చొరబడి వ్యాపారిపై జనసేన నాయకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కోట సెంటర్లోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని ఓ షాపులో రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్ (జనసేన కార్యకర్త)తో దుకాణ యజమానికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో జనసేన నేతలు నాని, సాంబలను వెంటబెట్టుకొని వచ్చిన జనసేన కార్యకర్తలు దుకాణంలో ఉన్న నాగేశ్వరరావు, అతని కుమారుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.పిడిగుద్దులతో వీరంగం సృష్టించారు. కేసు పెడితే మరో మారు దాడి చేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్ సీఐ హైమారావు తెలిపారు. కాగా, ఇటీవలే నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు మద్యం దుకాణాల్లో వాటా ఇవ్వలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ పై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు 2 రోజుల క్రితం తన అనుచరులతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇలా..టీడీపీ, జనసేన నేతల వరుస దాడులతో నరసరావుపేటలోని వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
వ్యాపారులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్)/కడప కల్చరల్/తణుకు అర్బన్: కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెంలో వర్తక వ్యాపారులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు, ఇతర వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖండించగా, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య మండిపడ్డారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు మీడియాతో మాట్లాడారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, కిరాణా వ్యాపారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ఎక్కడైనా కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని ప్రశి్నంచారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారులకు దాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం బాబుకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ బాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తీరును ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఈమని దామోదర్‌రావు, మద్దాల సుధాకర్, శేగు వెంకటేశ్వర్లు, పోకూరి రమేశ్, ఎస్.వెంకటేశ్వరరావు, నాళం నాగేశ్వరరావు, మద్ది బాలు పాల్గొన్నారు. వైశ్యుల ఆత్మగౌరవాన్ని కించపరచకండి కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైశ్యుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. తక్షణమే ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మధ్యాహ్నం గంటపాటు కిరాణా దుకాణాలను మూసివేశారు. అంత చులకనా?: కారుమూరి కిరాణా వ్యాపారులను గంజాయి అమ్మకందారులుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు దుర్మార్గుడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ వ్యాపారులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అధికారంలో ఉండగా ఎస్సీలు, బీసీలపై, ఈ మధ్య టిప్పర్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటా? అంటూ అవహేళన చేసి, తాజాగా ఆర్యవైశ్యులపై వ్యాఖ్యలు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే పేద వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసిన సీఎం వైఎస్ జగన్ సేవా రాజకీయాలు మాత్రమే చేస్తారని చెప్పడానికి గర్వపడుతున్నానని కారుమూరి అన్నారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. -
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన (సెప్టెంబర్ 8-10) జీ20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ సందర్భంగా విధించిన ఆంక్షలు కారణంగా ట్రాఫిక్ నియంత్రణల కారణంగావ్యాపారులు భారీగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల వర్షాలు, వరదలతో కుదేలైన వ్యాపారాలు ఇది మరింత నష్టాన్ని మిగిల్చిందని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి. అంతేకాదు దాదాపు 9,000 మంది డెలివరీ కార్మికులను కూడా ప్రభావితం చేసిందట జీ20 సదస్సు నిర్వహణకు సంబంధించిన ఆంక్షలతో వ్యాపారులకు సుమారు రూ.300-400 కోట్ల నష్టం వాటిల్లిందని న్యూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ భార్గవ వెల్లడించారు. షాపింగ్, డైనింగ్లకు ప్రసిద్ధి చెందిన ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, జన్‌పథ్ వంటి అగ్ర మార్కెట్లలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో సంబంధి జోన్ బయట ఉన్న వ్యాపారాలు సైతం నష్టపోయాయని వెల్లడించారు. ఎక్కువగా వారాంతపు షాపింగ్ వల్ల వచ్చే ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. VIDEO | Glimpses from day one and day two of Delhi G20 Summit 2023. (Source: Third Party) pic.twitter.com/md9j3F7rmq — Press Trust of India (@PTI_News) September 11, 2023 ఢిల్లీలో డైన్, డెలివరీ సంఖ్యలు రెండూ కనీసం 50శాతం తగ్గాయనీ ఎన్‌సిఆర్‌లో అమ్మకాలు 20శాతం వరకు క్షీణించాయని స్పెషాలిటీ రెస్టారెంట్ల ఛైర్మన్ అంజన్ ఛటర్జీ తెలిపారు. లాంగ్ వీకెండ్లో (సెప్టెంబర్ 8-10) వ్యాపార అవకాశాలను కోల్పోయామని పంజాబ్ గ్రిల్, జాంబర్ అండ్ యూమీ చైన్లను నిర్వహిస్తున్న లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ వెల్లడించారు. జీ20 ఖర్చు .4,100 కోట్లు :బడ్జెట్లో కేటాయించింది రూ.990కోట్లే G20 సమ్మిట్ ఈవెంట్‌కు సంబంధించిన మొత్తంగా రూ. 4,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రకటించిన 2023-24 బడ్జెట్లో G20 అధ్యక్ష పదవికి రూ.990 కోట్లు కేటాయించారు. అంటే ఈ మొత్తం బడ్జెట్లో కేటాయించిన మొత్తానికి నాలుగు రెట్లు ఎక్కువ. ఈ ఈవెంట్ జరిగిన సెప్టెంబర్ 8 - 10 మధ్య ఢిల్లీ చుట్టుపక్కల ఆంక్షలతోపాటు, అన్ని వాణిజ్య , ఆర్థిక సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్‌సేల్‌గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్‌రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
నెట్టింట.. లాభాల పంట
సాక్షి, కర్నూలు డెస్క్: రైతులు తాము పండించిన ఉత్పత్తుల్ని అమ్ముకోవాలన్నా.. వ్యాపారులు సరుకు విక్రయించాలన్నా సవాలక్ష సమస్యలు. పంట బాగా పండినా కోత కోయడం.. మార్కెట్‌కు తరలించడం.. అమ్ముకోవడం.. తీరా లెక్కలు వేసుకుంటే పెట్టుబడి కూడా దక్కలేదని నిట్టూరుస్తూ ఇంటికి చేరుకోవడం రైతులకు మామూలైపోయింది. ఈ కోవలోనే వ్యాపారులు కూడా. ఎంత నాణ్యమైన సరుకును దుకాణంలో ఉంచినా మాటల గారడీ చేయలేక.. వినియోగదారులను మోసగించలేక సతమతమయ్యే వ్యాపారులు లేకపోలేదు. ఇలాంటి వారికి సోషల్ మీడియా చక్కటి పరిష్కారం చూపుతోంది. ఏ మార్కెట్‌కు తీసుకెళ్లాలనే బెంగ లేదు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందుతుందనగానే రైతును సవాలక్ష ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దిగుబడిని ఎక్కడ అమ్మాలి. ఏ మార్కెట్లో ఎక్కువ ధర వస్తుంది. కొన్ని రోజులు ఆగితే ధరలో మార్పు ఉంటుందా? ప్రస్తుత ధరకు అమ్మితే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందా? ఇలా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపే రైతులకు ఇప్పుడా బెంగ లేదు. ఉత్పత్తులను నేరుగా రైతులే విక్రయించుకునే అవకాశం ఏర్పడింది. వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి.. ధర కూడా రైతులే నిర్ణయించే రోజులు వస్తుండటం విశేషం. దళారుల ప్రమేయం లేకుండా సొంతంగా విక్రయాలు చేపట్టాలంటే నాణ్యత తప్పనిసరి. వినియోగదారుడు ఒక్కసారి ఇష్టపడితే.. ఆ తర్వాత ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ కొనుగోలు చేస్తారు. ఫోన్ చేస్తే చాలు.. ఒకప్పుడు ఫలానా వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడ దొరుకుతుందో.. నాణ్యంగా ఉంటుందో లేదో.. ధర కరెక్టుగానే చెబుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు ఏది కావాలన్నా నెట్లో వెతికితే.. వివరాలు అరచేతిలో వచ్చి వాలతాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తున్న రోజులు. వ్యాపారంలో పోటీ పెరగడంతో ఇప్పుడు విక్రయదారులు ఒక అడుగు ముందుకేసి, ఫోన్ చేస్తే చాలు ఎక్కడికైనా పార్సిల్ చేస్తున్నారు. ఒకటి రెండు రూపాయలు తక్కువ లాభం వచ్చి నా.. ఫోన్ చేసిన వినియోగదారులు సంతృప్తి చెందితే ఆ తర్వాత తమ వ్యాపార ఖాతాలో చేరిపోతారనే భావన కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దెకు దుకాణం సంగతి పక్కనపెడితే.. అడ్వాన్సుల పేరు వింటేనే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. వ్యాపారం జరుగుతుందో లేదో కానీ.. దుకాణం దక్కించుకోవడమే గగనం అవుతోంది. ఆ తర్వాత వ్యాపారానికి అనుగుణంగా ఫరి్నచర్, సిబ్బంది నియామకం కలిపి లెక్కలేస్తే తడిసి మోపెడవుతుంది. అదే నెట్టింట్లో వ్యాపారం చేస్తే ఇవన్నీ మిగులుబాటే. మామిడి పండ్ల ప్రేమికులకు నమస్సులు.. మూడేళ్లుగా మా తోటలో రసాయన మందులు వాడకుండా మామిడి పండిస్తున్నాం. రసాయనాలు వాడకుండా మగ్గించిన పండ్లను అమ్మకాలను ఈ నెల 23 నుంచి కర్నూలు కృష్ణానగర్‌లోని రామకృష్ణ స్కూల్ వద్ద ప్రారంభిస్తున్నాం. కిలో ధర కవర్లలో అయితే రూ.120, కవర్లు లేకుంటే కిలో రూ.100. కవర్లు లేకుండా చిన్న సైజు మామిడి ధర రూ.80. – సోషల్ మీడియాలో ఓ రైతు చేసిన పోస్ట్ అందరికీ నమస్కారం మేం స్వచ్ఛమైన వేరుశనగ (పల్లీ) నూనె గానుగ ఆడించి అమ్ముతున్నాం. కేజీ రూ.280. ప్రత్యేకంగా పండించిన తెల్ల నువ్వుల నూనె (గానుగ ఆడించినది) కేజీ రూ.500, పొద్దుతిరుగుడు గింజల నూనె రూ.380, కుసుమ నూనె రూ.400, కొబ్బరి నూనె రూ.460 చొప్పున అమ్ముతున్నాం. ఆర్డర్లపై ఏ ప్రాంతానికైనా పంపుతాం. – సామాజిక మాధ్యమాల్లో తన ఇంటినుంచి ఓ వ్యాపారి చేసిన పోస్ట్ నిరసన కూడా తెలపొచ్చు కర్నూలు చెక్ పోస్ట్ సమీపంలోని ఓ బడా స్మార్ట్ దుకాణంలో ఓ వ్యక్తి 25 కేజీల బియ్యం బ్యాగు కొన్నాడు. అన్నం వండి తినబోతే ముక్కిన వాసన రావడంతో అన్నమంతా వదిలేయాల్సి వచ్చి ంది. సాయంత్రం ఆ స్టోర్‌కు వెళ్లి అడిగితే.. ‘రేపు తీసుకురండి. మరో బ్రాండ్ ఇస్తాం’ అన్నారు. తీసుకెళ్లాక ఒరిజినల్ రశీదు కావాలన్నారు. బ్యాగ్ చూపించి మీ వద్ద కొన్నదేనని, కావాలంటే మీ సిస్టంలో చూడమని కోరితే మేనేజర్ కోపగించుకుని మాకు సంబంధం లేదన్నాడు. దీంతో ఆ బియ్యాన్ని ఆ దుకాణం ఎదుటే పారబోసి.. అదే విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ విషయం క్షణాల్లోనే సిటీ అంతా తెలిసింది. ఆ తరువాత సదరు వినియోగదారుడికి ఆ స్టోర్ మేనేజర్ ఫోన్ చేసి.. నష్టనివారణ చర్యలు చేపట్టాడు. -
చింతపల్లి మాక్స్ కాఫీకి రికార్డు ధర
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ది విశాఖ చింతపల్లి ట్రైబల్ కాఫీ ప్రొడ్యూసర్స్ మాక్స్ ఉత్పత్తి చేసిన కాఫీ గింజలు బహిరంగ వేలంలో రికార్డు ధర పలికాయి. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో 135.25 మెట్రిక్ టన్నుల పాచ్మెంట్ కాఫీ గింజలు, 17.60 మెట్రిక్ టన్నుల ప్లోట్ చెర్రీ కాఫీ గింజల అమ్మకాలకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి తొమ్మిది ట్రేడర్లకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ సమక్షంలో వ్యాపారులు కొనుగోలు ధరలను ప్రకటించారు. పాడేరుకు చెందిన మోదమాంబ ట్రేడర్స్ అత్యధికంగా ధర ప్రకటించి బిడ్ దక్కించుకుంది. పాచ్మెంట్ కాఫీ గింజలకు కిలో రూ.312, చెర్రీ రకానికి కిలో రూ.142 చొప్పున రికార్డు ధర లభించింది. గతేడాది పాచ్మెంట్కు కిలో రూ.294, చెర్రీకి కిలో రూ.116 ధర మాత్రమే లభించింది. -
ప్రముఖ స్టాక్‌మార్కెట్ విశ్లేషకుడు ఇకలేరు!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్వనీ గుజ్రాల్ (52) ఇకలేరు. సోమవారం (ఫిబ్రవరి 27న) ఆయన కన్నుమూశారు. భారతీయ స్టాక్ మార్కెట్లో సాంకేతిక విశ్లేషణలో విశేష నైపుణ్యంతో పాపులర్ ఎనలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సీఎన్‌బీసీ టీవీ 18లో,ఈటీ నౌ లాంటి బిజినెస్ చానెళ్లలో రోజువారీ మార్కెట్ ఔట్లుక్, ఇంట్రాడే ట్రేడింగ్ సూచనలు, సలహాలతో ట్రేడర్లను ఆకట్టుకునేవారు. మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ(ఫైనాన్స్) పట్టా పొందిన గుజ్రాల్ 1995 నుండి తన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వృత్తిని ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్లో మనీ సంపాదించాలి, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎలా చేయాలి అనే అంశాపై మూడు పుస్తకాలను కూడా రాశారు గుజ్రాల్. అలాగే యూఎస్ ఆధారిత మ్యాగజైన్లు , జర్నల్స్‌లో ట్రేడింగ్ , టెక్నికల్ అనాలిసిస్‌పై రాశారు. -
నిత్యవసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ.. అమలు చేయని వ్యాపారస్తులు
సాక్షి, సిటీబ్యూరో: జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి...వినియోగదారుడిపై భారం తగ్గుతుందని భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. జీఎస్టీ అమలు నుంచి నేటి వరకు దాదాపు 210 నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించారు. జీఎస్టీ ప్రారంభంలో పలు వస్తువులపై 28 శాతం ఉన్న పన్నును.. ప్రస్తుతం 18 శాతానికి, 18 శాతం పన్ను ఉన్న వస్తువులకు 12 శాతానికి తగ్గించారు. గతేడాది 12 శాతం పన్ను పరిధిలో వచ్చే నిత్యావసర వస్తువుల పన్నును 5 శాతానికి తగ్గించారు. కానీ వ్యాపారులు తగ్గిన పన్నుల ప్రకారం నిత్యావసర వస్తువులను విక్రయించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ►పన్ను తగ్గించినా వినియోగదారుడికి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తగ్గిన పన్నును వ్యాపారులు ధరల్లో కలుపుకొని విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారుడికి లబ్ధి చేకూరడం లేదు. ►పన్ను తగ్గించినా ఇప్పటికే పాత ధరల్లోనే వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉంచారు. పన్నులు తగ్గినట్లు ధరలు కూడా తగ్గాయా లేదా? ధరలు యథాతథంగా వ్యాపారులు విక్రయిస్తున్నారా? అవే విషయాలను పర్యవేక్షించడానికి యాంటీ ప్రాఫెటింగ్ కమిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ కమిటీ పర్యవేక్షణ కొరవడటంతో పన్ను తగ్గించకుండా వస్తువులు విక్రయిస్తూ అక్రమాలకు పాలుపడుతున్నారు. 28 నుంచి 18 శాతానికి తగ్గిన పన్ను జీఎస్టీ ప్రారంభంలో 28 శాతం పన్ను రేటు ఎక్కువగా ఉన్న వస్తువులపై వ్యాపారులు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా జీఎస్టీ కౌన్సిల్లో చర్చించి చాలా వస్తువులకు 18 శాతం పన్ను పరిధిలోకి మార్చారు. ► గతేడాది మరికొన్ని 18–12 శాతానికి, 12–5 శాతానికి తగ్గించారు. దీని ద్వారా వినియోగదారుడికి ఎంతో ఉపశమం కలుగుతుందని భావించారు. కానీ పన్ను రేటు తగ్గిచడంతో కలిగే భారాన్ని వినియోగదారునికి బదలాయించక పోతే అది నేరంగా పరిగణించబడుతుంది. ►దీన్ని పర్యవేక్షించడానికి కమిటీలు ఏర్పాటు చేశారు. పన్ను తగ్గించడం వల్ల కలిగిన లాభాన్ని తమకు ఇవ్వడం లేదని వినియోగదారుడు వ్యాపారస్తులపై కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ►తగ్గిన పన్ను ప్రకారం ధరలు తగ్గించకుండా అసలు ధరలో కలిపేసి అమ్ముతున్నారు. దీంతో తగ్గిన జీఎస్టీ వినియోగదారుడికి అందడం లేదు. ఎక్కువ పన్ను రేటు ఉన్నప్పుడు ఉన్న ధర తక్కువ పన్ను భారాన్ని వ్యాపారస్తులు వినియోదారుడికి బదలాయించాలి. ►లేని పక్షంలో దీన్ని నేరంగా పరిగణించి వ్యతిరేక లాభం కమిటీ విచారణ జరిపి కేసులు నమోదు చేస్తోంది. -
కుళ్లిన కొబ్బరికీ కోట్లు
కొబ్బరి కాయ కుళ్లిపోయింది కదాని పక్కన పాడేయకండి. ఎందుకంటే.. కుళ్లిన కాయలు సైతం రూ.కోట్లు కురిపిస్తాయట. కుళ్లిన కురిడీల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటే.. కుళ్లిన కాయలను కాశీలో శవ దహనాలకు వినియోగిస్తున్నారట. ఒక్క ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కుళ్లిపోయిన కొబ్బరి కాయలతో రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయట. అక్షరాలా ఇది నిజమని చెబుతున్నారు ఇక్కడి కొబ్బరి వ్యాపారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల కల్పతరువు కొబ్బరి. ఇప్పటివరకు కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, తెలగపిండి, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, పీచులోంచి వచ్చే పౌడర్, కొబ్బరి తాడు, ఆకుల నుంచి ఈనెలు, కమ్మలు ద్వారానే డబ్బొస్తుందని అందరికీ తెలుసు. కుళ్లిపోయిన కొబ్బరి కాయలకు సైతం డిమాండ్ ఉందనే విషయం ఎందరికి తెలుసు. కుళ్లిన కొబ్బరితో ఏటా రూ.కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కొబ్బరి కాయల దింపు సమయంలోను, రాశుల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలను ఏరి పక్కన పడేస్తుంటారు. నాణ్యమైన కాయలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఏరివేసే ప్రక్రియను నాడెం(నాణ్యత పరిశీలకులు) చేసేవారు నిర్వహిస్తారు. కొబ్బరి రాశుల నుంచి నూటికి 5 కొబ్బరి కాయలు కుళ్లిపోయినవి వస్తుంటాయి. వీటిని ఏరివేసి పక్కన పడేస్తుంటారు. వీటిని కూడా కొనుగోలు చేసే వ్యాపారులు ప్రత్యేకంగా ఉంటారు. వీరు ఒక్కో కాయకు రూపాయి లేదా రెండు రూపాయల చొప్పున (కుళ్లిన కొబ్బరి పరిమాణాన్ని బట్టి) కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కుళ్లిన కొబ్బరి కాయలను ప్రాసెసింగ్, రవాణా చార్జీలతో కలిపి ఉత్తరాదిలో ఒక్కో కాయ రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. వాటి నుంచి నూనె తీసి.. కుళ్లిన కొబ్బరి కాయల్లో వచ్చే కొబ్బరి గుజ్జును తీసి నాలుగైదు వారాలపాటు ఎండబెట్టి కొబ్బరి నూనె తీస్తారు. ఇలా తీసిన నూనె కోనసీమలోని అంబాజీపేట కేంద్రంగా వ్యాపారులు సేకరిస్తారు. ఇలా సేకరించిన కుళ్లిన కొబ్బరి నూనెను యానాం, తణుకు, విజయవాడ, పుణె, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సబ్బుల తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. టన్నుల కొద్దీ కుళ్లిన కొబ్బరి నూనె అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నూనె కిలో రూ.30 నుంచి రూ.40 చొప్పున అమ్ముడుపోతుంది. కుళ్లిన కొబ్బరి కాయల చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ తణుకు, విజయవాడ రవాణా చేస్తున్నారు. ఈ చిప్పలు టన్ను రూ.5 వేల ధర పలుకుతోంది. ఎగుమతికి సిద్ధమైన కుళ్లిన కొబ్బరి చిప్పలు శవ దహనాలకు కుళ్లిన కొబ్బరి కాయలు కాశీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో శవాల దహనానికి కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి వినియోగిస్తున్నారు. కుళ్లిన కొబ్బరి కాయలను నాణ్యమైన కొబ్బరి కాయల మాదిరిగా సంచులలో నింపి లారీల ద్వారా కాశీ, మధుర తదితర క్షేత్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్యం వస్తుందని ఉత్తరాది రాష్ట్రాల వారి నమ్మకం. ఇందుకు నాణ్యమైన కొబ్బరి కాయలు వినియోగించాలంటే కాయ రూ.20 పైనే ఉంటుంది. అంత ధర భారమనే ఉద్దేశంతో కుళ్లిన కొబ్బరి కాయలను శవ దహనానికి వినియోగిస్తున్నారని గోదావరి జిల్లాల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతిచేసే వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు మూడు లారీలు (సుమారు లక్ష కాయలు) కాశీకి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. కార్తీక మాసంతో పాటు పూజల సమయాలలో హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదులలో వదిలేందుకు ఉత్తరాది భక్తులు ఈ కొబ్బరి కాయలను బస్తాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెట్టింపు ధర పలుకుతున్నాయి. రూ.వంద కోట్ల వరకు లావాదేవీలు కుళ్లిన కొబ్బరి కాయలను ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఆచంట, అంబాజీపేట, పాశర్లపూడి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా కుళ్లిన కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తుండటంతో పోటీ నెలకొంది. కుళ్లిన కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, చిప్పలు అన్నీ కలిపి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరిగే లావాదేవీలు ఏటా రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఉత్తరాదిలో మంచి గిరాకీ కుళ్లిన కొబ్బరి కాయల్ని చాలా కాలంగా ఎగుమతి చేస్తున్నాం. ఈ కొబ్బరికి ఉత్తరాదిలో మంచి గిరాకీ ఉంటుంది. ఆరేడు నెలల ముందుగానే ఆర్డర్లు బుక్ చేసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఒబ్బిడి చేసిన కుళ్లిన కొబ్బరి కాయల నూనె, చిప్పలను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. సబ్బులు, దోమల కాయిల్స్ తయారీ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. శవ దహనాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. – దాసింశెట్టి రామారావు, పెదతిప్ప, వ్యాపారి -
షాపుల కేటాయింపులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు
సాక్షి, అమరావతి: శ్రీశైలంలోని వ్యాపారులకు లలితాంబిక వ్యాపార సముదాయంలో షాపులు కేటాయించే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ దశలోనూ ఉల్లంఘించలేదని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న మంగళవారం హైకోర్టుకు నివేదించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు ఎనలేని గౌరవం అని లవన్న తరఫు న్యాయవాది అశోక్ రామ్ కోర్టుకు విన్నవించారు. షాపుల కేటాయింపుపై రాద్ధాంతం చేస్తున్న పిటిషనర్లు, అసలు షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనలేదని, అందువల్ల వారు షాపులు పొందలేకపోయారని తెలిపారు. షాపుల కేటాయింపు కోసం వారు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిగణనలోకి తీసుకుని మరోచోట షాపులు కేటాయిస్తామన్నారు. 8 నెలల కాలంలో 24 పిటిషన్లు దాఖలు చేసి, షాపుల కేటాయింపు విషయంలో ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. షాపుల కేటాయింపు కోసం నిర్వహించిన వేలంలో గరిష్ట ధర రూ.24 లక్షలకు చేరిందని తెలిపారు. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించే నాటికే షాపుల కూల్చివేత పూర్తయిందన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా ఈవో ఆదేశాల మేరకు పిటిషనర్ల షాపులను అధికారులు కూల్చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్.. షాపుల కేటాయింపు కోసం ఈవోకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ వినతి ఆధారంగా షాపుల కేటాయింపులో నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని ఈవోకు స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
పండుగ సీజన్ అదిరింది.. రిటైల్ వ్యాపారులకు లక్ష కోట్లకు పైగా విక్రయాలు!
దీపావళి వస్తే వ్యాపారాలకు పండగే. ఎందుకంటే గృహాలంకరణ, దుస్తులు, టపాకాయలంటూ ప్రజలు భారీగా షాపింగ్ చేస్తుంటారు. అందుకే వ్యాపారులు ఈ సమయాన్ని ముఖ్యంగా భావిస్తారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా తెరపైకి వచ్చేస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, స్థానికంగా ఉన్న వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు మొదలైన వారికి విక్రయాలకు పండగ సీజన్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ ఏడాది పండగ సందర్భంగా సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, దేశంలో ఇప్పటికే 1.25 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) తెలిపింది. అయితే దీపావళి సేల్‌లో మొత్తం వ్యాపారం 1.50 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. శతాబ్దాలుగా భారతదేశంలోని వ్యాపారులు దీపావళి సందర్భంగా వారి వ్యాపార సంస్థలలో దీపావళి పూజను సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు చాలా వ్యాపారాలు డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పోర్టల్ కూడా తోడవడంతో ఇప్పుడు అన్ని వ్యాపారాలు జీఎస్టీ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులు దీపావళి పూజలో.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లను పూజిస్తారు. మరోవైపు బయోమెట్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ నగదు టెల్లర్లు, డిజిటల్ చెల్లింపులను మొదలైనవాటిని కూడా దీపావళి పూజలో చేర్చారు. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ట్రేడింగ్‌లో లాభాలే లాభాలా?
సాక్షి,ముంబై: దీపావళి వచ్చిందంటే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, ముహూరత్ ట్రేడింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు. దివాలీ రోజు గంట సేపు ముహూరత్ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించటం ఆనవాయితీ. అంతేకాదు ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం భారతదేశం. దీపావళి పర్వదినం రోజు లక్ష్మీ పూజ తరువాత ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించి సంవత్ 2079 సాంప్రదాయంగా ప్రారంభిస్తారు.(ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్‌యూ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా’) ముహూరత్ ట్రేడింగ్ చరిత్ర ఈ ఏడాది అక్టోబర్ 24, 2022న దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించ నున్నారు. ఈ సాంప్రదాయ చర్రితను ఒక సారి పరిశీలిస్తే 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించగా, 1992లో ఎన్ఎస్ఈ దీనిని దీపావళి రోజున ప్రారంభించింది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించిన నిర్వహించే శుభ ముహూర్తం. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్' క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ 24, 2022న జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. అలాగే దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్ 26న ఎక్స్ఛేంజీలు పనిచేయవు. దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలు మార్కెట్ సాయంత్రం 6:15 కు ఓపెన్ అవుతుంది. మార్కెట్ సాయంత్రం 7:15 ముగుస్తుంది. ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ
సాక్షి అనంతపురం : రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యాపారులది కీలక పాత్ర అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే వారితో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటోందన్నారు. అనంతపురం వాణిజ్య సలహా కమిటీ సమావేశం తొలిసారిగా జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడీసీసీబీ చైర్ పర్సన్ లిఖిత, నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, పాలసీ కమిషనర్ రవిశంకర్, సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, వ్యాపార సంస్థలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ గతంలో జై జవాన్ – జై కిసాన్ వంటి నినాదాలతో సైనికులు, రైతులను సమాజంలో ఉన్నతంగా చూసినట్లుగానే తమ ప్రభుత్వం వ్యాపారులనూ అంతే ఉన్నతంగా చూస్తోందన్నారు. రాజుల కాలం నుంచి పన్నుల వసూలు ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానపర నిర్ణయాలతో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా రాష్ట్రాన్ని మూడేళ్లుగా నంబర్–1 స్థానంలో నిలుపుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఎగుమతుల్లో ఏడో స్థానం నుంచి 4వ స్థానానికి తేవడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించాలన్న సంకల్పంతో నియోజకవర్గానికో స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో 66 స్కిల్ డెవలప్మెంట్ హబ్‌లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పన్నుల భారం మోపం వ్యాపారులపై పన్నుల భారం ఎట్టి పరిస్థితుల్లోనూ మోపేది లేదని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న పన్నుల భారాన్ని సైతం తగ్గించాలన్న పట్టుదలతో సీఎం జగన్ ఉన్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన 35వ జీఎస్టీ మీటింగ్‌లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనగా.. కేంద్రంతో మాట్లాడి చింతపండు, నాపరాయి, మామిడి గుజ్జుపై జీఎస్టీ లేకుండా చేసుకోవడంలో విజయం సాధించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, పెద్ద పన్ను చెల్లింపుదారుల కోసం రాష్ట్ర స్థాయిలో, డివిజినల్ స్థాయిలో ఎల్టీఓలను నియమించామని తెలిపారు. ఆడిటింగ్ విభాగాన్ని వేరు చేసి, నూతన సర్కిళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి వాణిజ్య సలహా మండలి సమావేశాలు నిర్వహించి, పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతామన్నారు. ‘అనంత’పై జగన్‌కు ప్రత్యేక అభిమానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అనంతపురం – కర్నూలు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను జిల్లాకు తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో కేవలం రెండు జిల్లాల కోసం ఏర్పాటవుతున్న పారిశ్రామిక కారిడార్ ఇంకెక్కడా లేదని వెల్లడించారు. ఇప్పటికే అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో కియా, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు ఉండగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్ తరహాలో పారిశ్రామిక అభివృద్ధి కనిపించనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి ‘మా ప్రభుత్వం వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొచ్చి, విజయవంతంగా అమలు చేస్తోంది. వ్యాపారులకు పన్నుల భారం తగ్గించడం మొదలు, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సూచికలే నిదర్శనమని’ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అయినా రాష్ట్రంలోని ప్రతిపక్షానికి ఇవేవీ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని చానళ్లు, పత్రికల్లో ప్రతికూల వార్తలు రాయిస్తూ, ప్రసారం చేయిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇది మంచిది కాదంటూ హితవు పలికారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యాపారులను భాగస్వాములుగా తమ ప్రభుత్వం చూస్తోందన్నారు. నాసిన్ అభివృద్ధికి సహకారం గోరంట్ల : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. నాసిన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన గిరిజాశంకర్, ఇతర ఉన్నతాధికారులతో కలసి పరిశీలించి..పురోగతిపై సమీక్షించారు. ఈ అకాడమీలో భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇబ్బంది పెట్టొద్దు గార్మెంట్స్ పరిశ్రమకు రాయదుర్గం ప్రసిద్ధి చెందింది. అనంతపురం 100 కిలోమీటర్ల దూరం ఉండగా, కర్ణాటకలోని బళ్లారి కొద్ది దూరంలోనే ఉంది. రాయదుర్గం వాసులందరూ బళ్లారి నుంచి ముడి వస్త్రం తెచ్చుకొని కూలికి బట్టలు కుట్టి, తిరిగి బళ్లారికి తీసుకెళ్తారు. బట్ట తెచ్చేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వారిపై దాడులు చేసి, పెద్ద ఎత్తున జరిమానా విధిస్తున్నారు. ఉప్పు, పప్పు వంటి కిరాణా సరుకులు తెచ్చుకునే వారిపైనా దాడులు ఆపడం లేదు. ఇలాగైతే సామాన్యులు ఎలా బతకాలి? అటువంటి వారిపై అధికారులు దాడులు చేయడం గానీ, కేసులు పెట్టడం గానీ చేయకుండా చూడండి. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, పన్నులు తక్కువ ఉంటేనే చెల్లింపులు పామిడిలో జీన్స్, నైటీలు కుట్టి అమ్ముకునే కూలీలు ఎక్కువ. ఉరవకొండలో నేత కారి్మకులు ఎక్కువ. వీరందరూ కూలికి వస్త్రం తెచ్చుకొని కుట్టి, మళ్లీ కర్ణాటకకు తీసుకెళ్లి యజమానులకు ఇస్తుంటారు. కొందరు అతి తక్కువ ధరకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వారు ఈ పని తప్ప మరే పనీ చేయలేరు. అటువంటి వారిని అధికారులు పన్నులు కట్టాలంటూ వేధిస్తున్నారు. పన్నులను విపరీతంగా పెంచి ఆదాయం పెంచుకోవాలనుకుంటేనే సమస్యలొస్తాయి. పన్ను భారం తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా పన్ను కట్టేందుకు మొగ్గు చూపుతారు. – వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ (చదవండి: పరిటాల పాపం.. రైతులకు శాపం) -
ప్లాస్టిక్ కొనం.. అమ్మం.. ప్రోత్సహించం
సాక్షిప్రతినిధి, కాకినాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్చందంగా అమలు చేసేందుకు కాకినాడ వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తాము సైతం అంటూ నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను కాకినాడ నగరపాలక సంస్థకు స్వచ్చందంగా అప్పగించారు. తొలి ప్రయత్నంగా 35 మంది వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.7 లక్షలు విలువైన 75 మైక్రానులకన్నా తక్కువ మందం కలిగిన క్యారీబ్యాగ్‌లు, థర్మా కోల్‌ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు తదితర ప్లాస్టిక్ వస్తువులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్ రమేష్‌కు అప్పగించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ‘కొనేది లేదు–అమ్మేది లేదు–ప్రోత్సహించేది లేదు’ అంటూ వ్యాపారులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేసి వ్యక్తిగతంగా రూ.10 స్టాంప్ పేపర్స్‌పై హామీ పత్రాలు రాసి కార్పొరేషన్‌కు అందజేశారు. -
అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే?
కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): అమ్మో... అరటిపండు!.. ఆ మాటెత్తితే సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. మొన్నటివరకు సామాన్యుడి పండుగా పేరుగాంచిన అరటి ధర నేడు చుక్కలనంటుతోంది. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు, పూజల్లో అరటి పండు ప్రధానపాత్ర వహిస్తోంది. విందు భోజనాల్లో ఎన్ని రకాలు వడ్డించినా చివరగా అరటిపండు లేకపోతే తృప్తిగా ఉండదంటారు. చదవండి: సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్ అలాంటి పండు ధర క్రమంగా రెండు నెలలుగా కొండెక్కి కూర్చొంది. డజన్ రూ. 20గా ఉన్న పండ్లు నేడు రూ. 80 లకు పైగా అమ్ముతున్నారు. కాస్త పెద్ద సైజు పండైతే రూ. 100 వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోయినా అరటిపండ్ల ధర ఈ స్థాయిలో ఉంటే ఈనెల 29వ తేది నుంచి శ్రావణమాసం రావడం, నెలాఖరు వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. ధర ‘పండు’తోంది ఏప్రిల్ వరకు డజన్ రూ. 20గా ఇంటింటికి తిరిగిన అరటిపండ్ల వ్యాపారులు మే నుంచి క్రమంగా కనుమరుగయ్యారు. కేవలం కడప నగరంలోనే 400కు పైగా ఉన్న అరటిపండ్లు విక్రయించే బండ్లు నేడు నాలుగో శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా కూడళ్లలో అరటి పండ్ల వ్యాపారాలే అధికంగా కనిపించేవి. ప్రస్తుతం బండ్లు కిక్కిరేసి ఉండే పాత బస్టాండు లాంటి ప్రాంతంలో కూడా నాలుగైదుకు మించి అరటిపండ్ల బండ్లు కనిపించడం లేదు. కొనుగోలుదారుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా కూడా పండ్లలో నాణ్యత కనిపించదు. ఇంతకుమించి మంచి సరుకు రావడం లేదని, అసలు తోటల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఒకటి, రెండు మినహా సాగు, తోటలు తగ్గాయని విక్రయదారుడు పేర్కొంటున్నారు. ఈ పాతికేళ్లలో రూ.50కి మించి అరటిపండ్ల ధర లేదని, ఇప్పుడు ఒక్కసారిగా రూ. 80లుగా తిష్ట వేసుకుని కూర్చొవడం తమకు కూడా ఇబ్బందిగా ఉందని, రోజూ 200–400 డజన్ల పండ్లు అమ్మే తాము ఇప్పుడు 25 డజన్లు కూడా అమ్మలేక పోతున్నామని, అమ్ముదామన్నా బండి నిండుగా కూడా సరుకు లభించడం లేదని వాపోతున్నారు. వ్యాపారం మానేశాం ! గత 20 ఏళ్లుగా హౌసింగ్‌బోర్డు సెంటర్లో అరటిపండ్లను విక్రయిస్తున్నాను. ఒకటిన్నర నెలగా సరుకు లేక ఉన్నా...అంత ధర పెట్టి కొనేవారు రాకపోవడంతో ఈ వ్యాపారం మానేశాను. పరిస్థితి ఇంకా ఒకటి, రెండు నెలలు ఇలాగే కొనసాగితే అందరికీ కష్టమే. – విజయుడు, అరటిపండ్ల వ్యాపారి, కడప -
ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్స్చేంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గమనించాల్సిన ముఖ్య విషయాలు ► ఫండమెంటల్స్ లేని సాధనాలు ►స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ ►నియంత్రణల్లేని చోట రిస్క్ అపరిమితం ►అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ►ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు ►నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం ►అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన -
అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో మంగళవారం నుంచి లావాదేవీలు మొదలయ్యాయి. నల్లబెల్లంపై ఎక్సైజ్ పోలీసులు పెడుతున్న కేసులకు నిరసనగా వర్తకులు ఆరురోజుల క్రితం లావాదేవీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ప్రధానంగా ఇబ్బంది పడే వర్తకులు జిల్లాస్థాయి అధికారులతోపాటు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను కలిసి తమ గోడును వినిపించుకున్నారు. వేధింపులవీ ఉండవని, అపోహలు వీడాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలో మార్కెట్లో మంగళవారం నుంచి లావాదేవీలు జరపాలని సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం నుంచి లావాదేవీలు ప్రారంభం కావడంతో మార్కెట్ వర్గాలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మరాఠీ బోర్డులపై మొదలైన వివాదం
సాక్షి, ముంబై: దుకాణాల బోర్డులు మరాఠీలోనే రాయాలని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం రాజుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవైపు ఈ ఘనత తమదేనంటూ, ఇతరులు దక్కించుకునే ప్రయత్నం చేయవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) స్పష్టం చేసింది. మరోపక్క పెద్ద అక్షరాలతో మరాఠీలో రాయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంఘటనలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఇటు వ్యాపార పరంగా అటు రాజకీయంగా మరాఠీ బోర్డుల వివాదం రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో మరాఠీలో రాయాలని, ఆ తర్వాత వాటికింద ఇతర భాషల్లో లేదా మీకు నచ్చిన భాషల్లో రాయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తేమి కాదని, గతంలోనే తమ పార్టీ మరాఠీ బోర్డుల అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. అంతటితో ఊరుకోకుండా 2008, 2009లో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు ఇతర భాషల్లో రాసిన బోర్డులపై నల్లరంగు లేదా తారు పూసి ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలో భాగంగా ఎమ్మెన్నెస్ కార్యకర్తలు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లి శిక్ష అనుభవించారు. దీంతో దిగివచ్చిన అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. కానీ, వంద శాతం అమలుకు మాత్రం నోచుకోలేకపోయింది. ఇప్పుడు అదే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి కీర్తి దక్కించుకునే ప్రయత్నం మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం చేస్తోందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. మరాఠీ బోర్డుల ఘనత కేవలం తమదేనని, ఇతరులు దీన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి రాసిన లేఖలో హెచ్చరించారు. ఇతరులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తే తమ కార్యకర్తలు మళ్లీ రోడ్డుపైకి వస్తారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న మరాఠీ భాషలోనే బోర్డుల నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. బీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆఘాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. వ్యాపార సంఘటనల వ్యతిరేకత... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంఘటనలు వ్యతిరేకిస్తున్నాయి. దుకాణాల బోర్డులు మరాఠీలో రాయాలనే అంశాన్ని తము వ్యతిరేకించడం లేదని, మరాఠీ అక్షరాలు పెద్దగా ఉండాలని, దాని కింద ఇతర భాషల్లో రాయాలని ఆదేశాలు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఫెడెరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విరేన్ షా పేర్కొన్నారు. ముంబైలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలకు చెందిన ప్రజలుంటారు. ముఖ్యంగా కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు షాపులున్న ప్రాంతాల్లో ఎక్కువశాతం ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలుంటారో ఆ భాషలో బోర్డులు రాయాల్సి ఉంటుంది. పెద్ద అక్షరాలతో పైన మరాఠీలో రాసి, చిన్న అక్షరాలతో కింద రాస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులంటున్నారు. మరాఠీ భాష అంటే తమకు అభిమానమే, కానీ, మరాఠీ అక్షరాలకంటే ఇతర భాషల అక్షరాలు చిన్నగా ఉండాలనే నియమాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తాజాగా అమలుచేసిన ఆంక్షల ప్రభావం వ్యాపార లావాదేవీలపై తీవ్రంగా చూపుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దుకాణాల బోర్డు మార్చాలంటే కనీసం రూ.20–30 వేల వరకు ఖర్చవుతుంది. దీంతో ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే వరకు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యాపార సంఘటనలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకులు, రైల్వే, ఎయిర్ పోర్టు, బీమా సంస్థల సంగతేంటి? గత బుధవారం జరిగిన మంత్రి మండలిలో దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డు మరాఠీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, బ్యాంకులు, ఎయిర్ పోర్టు, రైల్వే, గ్యాస్, పెట్రోలియం, పోస్టల్, మెట్రో, మోనో, టెలిఫోన్, బీమా కంపెనీల బోర్డుల గురించి వెల్లడించలేదు. వీటి సంగతేంటనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలున్నాయి. నియమాల ప్రకారం కేంద్రం, కేంద్రానికి అనుబంధంగా ఉన్న సంస్థల బోర్డులు తొలుత హిందీలో, ఆ తరువాత స్థానిక భాషను బట్టి ఆ భాషలో రాయాల్సి ఉంటుంది. కానీ, మహరాష్ట్రలో మరాఠీ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని దుకాణాలు, వ్యాపారం, వాణిజ్య సంస్థల బోర్డులన్నీ మరాఠీలో రాయాలని మొన్నటి వరకు ఎమ్మెన్నెస్, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తునేది వేచిచూడాలి. -
యూపీ అత్తరు వ్యాపారులపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సహా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పలువురు అత్తరు వ్యాపారుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై వీరి నివాసాలను సోదా చేశామని ఐటీ అధికారులు తెలిపారు. కనౌజ్, కాన్పూర్, ఎన్సీఆర్, సూరత్, ముంబై సహా దాదాపు 40 నివాసాలను సోదా చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 150 కోట్ల మేర పన్నుఎగవేతకు సంబంధించిన పత్రాలు దొరికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ నివాసంపై ఐటీ దాడులు చేస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ఒక ట్వీట్లో వెల్లడించింది. ఈ దాడులు బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న దాడులుగా విమర్శించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. ఇటీవలే పుష్పరాజ్ జైన్ తయారీ సమాజ్‌వాదీ ఇత్రా అనే అత్తరును అఖిలేశ్ ఆవిష్కరించారు. పుష్పరాజ్‌తో పాటు కనౌజ్, కాన్పూర్‌కు చెందిన వ్యాపారుల నివాసాలపై సోదాలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యాపారుల వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) వివరాలను పరిశీలించిన అనంతరం వీరు పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు భావించి ఐటీ శాఖ దాడులు జరిపిందన్నారు. ఇటీవలే పీయూశ్ జైన్ అనే బడా వ్యాపారిపై ఐటీ దాడులు జరిపి రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, భారీగా చందన తైలం నిల్వలను స్వాధీనం చేసుకుంది. చదవండి: (కొత్త సంవత్సరం వేళ విషాదం.. ప్రధాని మోదీ సంతాపం) అది బీజేపీ సొమ్ము కాదు పియూష్ జైన్ వద్ద ఇటీవల ఐటీ దాడుల్లో లభించిన రూ. 200 కోట్ల సొత్తు బీజేపీది కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పలువురు భావిస్తున్నట్లు తప్పుడు చిరునామాలో దాడులు జరపలేదని, ముందుగా నిర్ధారించుకున్న వ్యక్తులకు సంబంధించిన స్థలాల్లోనే సోదా జరిగిందని తెలిపారు. ఇంత సొమ్ము తన సన్నిహితుడి వద్ద బయటపడేసరికి అఖిలేశ్‌కు వణుకుపుడుతోందని విమర్శించారు. పుష్పరాజ్ జైన్ బదులు ఐటీ శాఖ పీయూష్ జైన్‌పై దాడులు జరిపిందని, తెలియకుండా బీజేపీ తన సొంత సొమ్మును స్వాధీనం చేయించిందని విపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి నిర్మల ఈ వివరణ ఇచ్చారు. అది బీజేపీ సొమ్మేనని అఖిలేశ్ ఆరోపిస్తున్నారని, ఆ విషయం అఖిలేశ్‌కు ఎలా తెలుసని, భాగస్వామ్యం లేకపోతే పీయూష్‌పై దాడులకు అఖిలేశ్ ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. తప్పుడు చిరునామాలో దాడులు జరిగితే పీయూష్ వద్ద ఇంత సొత్తు ఎలా దొరుకుతుందన్నారు. -
కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?
James & Jewellery International Exhibition: ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో సూరత్‌కు ప్రత్యేకస్థానం ఉంది. ఈసారి జరిగిన జేమ్స్ అండ్ జ్యువెలరీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో సూరత్ వజ్రాల వ్యాపారులు తయారు చేసిన అరుదైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూరత్ వ్యాపారులు వజ్రాలతో తయారు చేసిన గొడుగు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ విశేషాలు మీకోసం.. ఈ డైమండ్ గొడుగును తయారు చేసిన చేత్న మంగూకియా మాటల్లో.. ‘175 క్యారెట్ల డైమండ్‌ను ఈ గొడుగులో ప్రత్యేకంగా అమర్చాం. అంతేకాకుండా 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో తయారుచేశాం. దాదాపు 25 నుంచి 30 మంది వర్కర్లు 25 రోజులపాటు దీనిని తయారు చేశారు. డైమండ్ మార్కెట్లో దీని ధర 25 నుంచి 30 లక్షల వరకు పలకొచ్చు. సాధారణంగా అమెరికా, యూరప్, హాన్‌కాంగ్ వంటి దేశాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయని’ మీడియాకు వెల్లడించారు. చదవండి: Smart Phone Addiction: స్మార్ట్ ఫోన్‌కు అడిక్టయి.. గతం మర్చిపోయిన యువకుడు ఈ ఎగ్జిబిషన్‌ను చూసిన గ్రేసీ అనే మహిళ ‘ఒకటికంటే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటికంటే వజ్రాల గొడుగు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంద’ని పేర్కొంది. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడుతుంటే.. వజ్రాల పరిశ్రమ మాత్రం రెక్కలు విప్పుకుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
మార్కెట్ యార్డులో దగా
-
భారత్‌లో అమెజాన్ ‘ధన’బలం!
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కార్యకలాపాలు పటిష్టంకావడానికి ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు దేశంలో కేవలం రెండేళ్లలో రూ.8,646 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) న్యాయపరమైన వ్యయాలు (లీగల్ ఫీజులు) చేసినట్లు వచ్చిన వార్తా కథనాలు సంచలనం రేపుతున్నాయి. దేశంలో అమెజాన్ పబ్లిక్ అకౌంట్ ఫైలింగ్స్ గురించి సమాచారం తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ వెలువడిన వార్తల ప్రకారం, అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ సెల్లర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ హోల్‌సేల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ఇంటర్నెట్సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌సహా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఈ–కామర్స్ దిగ్గజ విభాగాలు 2018–19లో 3,420 కోట్ల లీగల్ ఫీజులు చెల్లించగా, 2019–20లో ఈ విలువ రూ. 5,126 కోట్లుగా ఉంది. ఈ రెండేళ్లలో అమెజాన్ మొత్తం ఆదాయంలో ఇది దాదాపు 20 శాతమని కూడా సంబంధిత వర్గాలు అంచనా. అవినీతి మయం: సీఏఐటీ కాగా ఈ వార్తాకథనాలపై అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా స్పందించింది. ఈ స్థాయి వ్యయాలు ప్రశ్నించదగినవిగా పేర్కొంది. ‘‘భారత్‌లో తన కార్యకలాపాల కొనసాగింపు, పటిష్టత లక్ష్యంగా భారత్ ప్రభుత్వ అధికారులను అమెజాన్, దాని అనుబంధ సంస్థలు ఎలా మభ్యపెడుతున్నాయి, లంచాలు ఇవ్వడానికి తమ ఫైనాన్షియల్ బలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాయి అన్న అంశాన్ని ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు చెల్లించిన న్యాయపరమైన భారీ ఫీజులు తెలియజేస్తున్నాయి’’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ మంత్రి పియూష్ గోయెల్‌కు రాసిన ఒక లేఖలో సీఏఐటీ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. అయితే తన ఆరోపణలకు ఆయన ఎటువంటి సాక్ష్యాలను చూపించని ఆయన, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు విభాగం (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో వచ్చిన దాదాపు రూ.45,000 కోట్ల టర్నోవర్‌పై రూ.8,500 కోట్లు న్యాయపరమైన వ్యయాలు చేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. కథనాలపై స్వయంగా విచారణ ప్రారంభించిన అమెజాన్ కాగా, ఈ వ్యవహారంపై అమెజాన్ స్వయంగా విచారణ ప్రారంభించింది. ఈ అంశంలో సీనియర్ కార్పొరేట్ న్యాయవాదిని ఒకరిని సెలవుపై పంపినట్లు కూడా తెలుస్తోంది. ఆరోపణలను ధృవీకరించడంకానీ లేదా ఖండించడంకానీ చేయని అమెజాన్, ఆరోపణలపై పూర్తి స్థాయిలో తగిన విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. అవినీతి ఏదైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇందుకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయ వివాదాలు ఇవీ.. ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ కొనుగోలు (రూ.24,713 కోట్ల ఒప్పందానికి సంబంధించి) వ్యవహారాన్ని సవాలుచేస్తూ, దేశంలో అమెజాన్ అతిపెద్ద న్యాయపరమైన వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యాయ వివాదం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్ర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో నలుగుతోంది. దేశంలో దాదాపు రూ.లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని చేజిక్కించుడానికి జరుగుతున్న వాణిజ్య యుద్ధంగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు. ఇక ప్రత్యర్థుల వ్యాపారాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలను విచారించరాదని కోరుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీంకోర్టులో ఇటీవలే ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణను నిలువరించాలన్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీల అప్పీలేట్ పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ అంశం విషయంలో కర్ణాటక హైకోర్టులో ఓడిపోయిన రెండు ఈ–కామర్స్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అమెరికా సంస్థలు తమ ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంపిక చేసిన విక్రేతలను ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పోటీని అణిచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ‘‘క్రిమినల్ చట్టం కింద ఏదైనా ఫిర్యాదు దాఖలైతే ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారు. ఆ నమోదుకు ముందే నోటీసు ఇవ్వండి అన్నట్లు ఉంది మీ వాదన’’ అని కూడా త్రిసభ్య ధర్మాసనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ– కామర్స్ కంపెనీలు ఈ తరహా ఆరోపణలపై విచారణను అడ్డుకుంటూ కోర్టుల్లో సవాలు చేయడం తగదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ కూడా తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. -
ఏపీ: నాలుగు లక్షలు దాటిన జీఎస్టీ ట్రేడర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా వ్యాపారం చేస్తూ పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న వారిని గుర్తించి వారిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. గత ఐదు నెలల్లో నికరంగా జీఎస్టీ ట్రేడర్ల సంఖ్య 21 వేలకుపైగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 3.90 లక్షలుగా ఉన్న జీఎస్టీ ట్రేడర్ల సంఖ్య ఆగస్టు నాటికి 4.11 లక్షలకు దాటినట్లు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్.శేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరలోనే ఈ సంఖ్యను 5 లక్షలకు చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన తర్వాత ప్రతి నెలా నికరంగా 4,600 వరకు ట్రేడర్ల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జీఎస్టీ ఆదాయం తగ్గడంతో రాష్ట్రంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వార్షిక వ్యాపారం రూ.40 లక్షలు దాటిన వారు జీఎస్టీ ట్రేడరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రేడర్లుగా నమోదు చేసుకున్న వారిలో 90 శాతం మందికిపైగా రిటర్నులు దాఖలు చేస్తున్నారు. అత్యధిక రిటర్నులు దాఖలు చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒకటిగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇవీ చదవండి: ప్రియుడు మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై! అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
పోలీసులమంటూ బురిడీ: పక్కా స్కెచ్.. రూ.50 లక్షలు దోపిడీ
గుడ్లూరు(ప్రకాశం జిల్లా): పోలీసులమంటూ బంగారు వర్తకులను బురిడీ కొట్టించి వారి నుంచి రూ.50 లక్షలను దోచుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఆగస్టు 31న జరిగింది. బాధితులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరుకు చెందిన బంగారం వర్తకులు చిరంజీవి, హరి, వెంకటేష్ విజయవాడలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆగస్టు 31న రూ.85 లక్షలతో కారులో బయలుదేరారు. ఈ కారు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ వద్దకు రాగానే పోలీస్ యూనిఫాంలో ఉన్న నలుగురు కారును ఆపారు. తాము డీఎస్పీ ఆఫీసు నుంచి వచ్చామని, బ్లాక్ మనీ తరలిస్తున్నట్టుగా సమాచారం అందిందంటూ వారిని బెదిరించారు. నలుగురిలో ముగ్గురు వారి కారులో కూర్చుని దానిని జాతీయ రహదారి మీదుగా నడపాలని చెప్పారు. నాలుగో వ్యక్తి వారు తెచ్చిన కారులో వారి వెనకాలే వచ్చాడు. మీ మీద కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని ముగ్గురు దొంగలు వారితో బేరమాడుతూ శింగరాయకొండ వరకూ వచ్చి కందుకూరు రోడ్డులో కారును ఆపించారు. వర్తకులు వారికి నగదు ఇచ్చేందుకు బ్యాగులోంచి రూ.50 లక్షలు ఉన్న పార్శిల్‌ను బయటకు తీశారు. ఆ వెంటనే దొంగలు మొత్తం నగదును లాక్కుని వెనుక వచ్చిన కారులో ఎక్కి పరారయ్యారు. అనంతరం వర్తకులు తాము మోసపోయామని గ్రహించి.. గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురు దొంగలూ నెల్లూరు నుంచే పక్కా ప్రణాళికతో వర్తకుల కారును వెంబడించి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కందుకూరు సీఐ శ్రీరామ్ చెప్పారు. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. -
గిరిజనులకు ఆర్థిక వికాసం
సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆర్థిక వికాసానికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. వారు దళారుల చేతుల్లో మోసపోకుండా.. కష్టానికి తగిన ఫలితం లభించేలా చూస్తోంది. అటవీ ప్రాంతంలో చెట్ల నుంచి గిరిజనులు సేకరించి తెచ్చిన చింతపండుకు దళారులు, వ్యాపారులు నిర్ణయించిన ధర కిలోకు రూ.35 మించలేదు. దాన్ని పిక్కతీసి, కాస్త శుభ్రం (ప్రాసెసింగ్) చేసి దుకాణాల్లో వ్యాపారులు విక్రయించే కిలో ప్యాకెట్ ధర రూ.150 వరకు ఉంటోంది. ఇక సూపర్ మార్కెట్లలో, మాల్స్‌లో రూ.200 ఉంటోంది. ఈ వ్యత్యాసం తగ్గించడానికి, గిరిజనులే స్వయంగా గిట్టుబాటు ధర సాధించుకునేలా చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. వన్‌ధన్ వికాస్ కేంద్రాల (వీడీవీకేల) ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో సుమారు 3.63 లక్షల గిరిజన కుటుంబాలున్నాయి. వీరు అటవీ ప్రాంతంలో తేనె, సీకాయ, కుంకుడుకాయలు, చింతపండు, ఉసిరికాయలు, కరక్కాయలు, కొండచీపుళ్లు తదితర అటవీ ఉత్పత్తులను సేకరించి స్థానిక సంతల్లో విక్రయిస్తుంటారు. ప్రైవేట్ వ్యాపారులు, దళారుల ప్రమేయం వల్ల ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటంలేదు. గిరిజన రైతులు పండిస్తున్న పసుపు, రాజ్మా, బొబ్బర్లు, సజ్జలు, రాగులు, కంది, మిరప, జీడిపిక్కలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రభుత్వం మద్దతు ధర కల్పించినవి మినహా మిగతా పంటల పరిస్థితి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో వీడీవీకేల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఏడాది రాష్ట్రంలో 75 వీడీవీకేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి పరిధిలోని 8 ఐటీడీఏలు, గిరిజన సహకారసంస్థ (జీసీసీ), ట్రైఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటిద్వారా ప్రభుత్వం వీడీవీకేలకు రూ.10.64 కోట్లు మంజూరు చేసింది. ప్రాసెసింగ్‌కు ఉపయోగపడే పరికరాలు, ఇతరత్రా సరంజామా కొనుగోలుకు ఈ నిధులను గిరిజనులు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మరో 188 వీడీవీకేలను మంజూరు చేసింది. వాటికి అడ్వాన్స్‌గా రూ.14 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వీడీవీకేల సంఖ్య 263కు చేరింది. వీటన్నింటికీ మొత్తం రూ.38.83 కోట్ల వరకు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.24.64 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉత్పత్తులకు అదనపు విలువ దాదాపుగా ఒకటి లేదా పక్కపక్కనుండే రెండు, మూడు గ్రామాల గిరిజనులే సభ్యులుగా వీడీవీకేలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది సభ్యులతో ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి 15 గ్రూపులను ఒక వీడీవీకే పరిధిలోకి చేరుస్తున్నారు. ఇలా ఒక్కో వీడీవీకేలో మొత్తం 300 మంది చొప్పున 263 వీడీవీకేల్లో 78,900 మంది సభ్యులు కానున్నారు. వీడీవీకేకి రూ.15 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రాసెసింగ్, ప్యాకింగ్‌కు ఉపయోగపడే పరికరాలను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గిరిజనులు తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను, పండించిన పంటలను గ్రామాల్లోనే సొంతంగా వ్యాపార తరహాలో శుద్ధి (ప్రాసెసింగ్) చేస్తున్నారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ ఎడిషన్) సమకూరుతోంది. ఆ ఉత్పత్తులను జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీకే కాకుండా లాభం ఉంటే ఇతర వ్యాపారులకు అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. సొంత వ్యాపారంతో మంచి ధర.. ఇప్పటివరకు వీడీవీకేల ద్వారా గిరిజనులు రూ.21.19 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. ఇది ప్రారంభం మాత్రమే. అన్ని అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా విలువను జోడించేలా ప్రణాళికను రూపొందించాం. దీనివల్ల ఆయా ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. ట్రైఫెడ్, జీసీసీ మార్కెట్ సపోర్టు కల్పిస్తున్నాయి. ఈ విధానం వల్ల మరికొంతమంది గిరిజనులకు ఉపాధి కలుగుతుంది. – సురేంద్రకుమార్, జనరల్ మేనేజరు (మార్కెటింగ్), జీసీసీ -
రైతుల పొట్టగొట్టి.. జనాల జేబుకొట్టి
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రాజు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గోవర్ధనగరి గ్రామం. ఎకరం పొలంలో టమాటా సాగు చేశాడు. మంగళవారం 18 బాక్సులు ఆటోలో వేసుకుని సిద్ది పేట కూరగాయల మార్కెట్‌కు వచ్చాడు. వ్యాపారులు 24 కిలోలు ఉండే ఒక్కో బాక్స్‌ను రూ.60 నుంచి రూ.70 మధ్య అడిగారు. రూ.60కి ఇస్తే కూలీ కూడా రాదని ఆవేదన చెందాడు. మూడు బాక్స్‌లను రూ.100 చొప్పున అమ్మగలిగాడు. మిగిలిన 15 బాక్స్‌లు తక్కువ ధరకు అమ్మేం దుకు మనసొప్పక తిరిగి తీసుకెళ్లిపోయాడు. ఇదే మార్కెట్లో వ్యాపారులు కిలో టమాటా రెండింతల ధరకు విక్రయిస్తూ లాభం పొందడం చూసి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ►ఈ ఏడాది కూరగాయల దిగుబడి బాగానే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మార్కెట్‌కు సుమారు 2లక్షల క్వింటాళ్లు అధి కంగా దిగుబడి వచ్చింది. ►మొదట్లో బాగానే ఉన్నా, రైతుల ఆశలపై లాక్డౌన్ నీళ్లు చల్లింది. కూలీల కొరత, రవాణా సమస్యగా మారితే, వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు తరలిస్తున్న రైతు లను హోల్‌సేల్ వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ►లాక్‌డౌన్‌ను సాకుగా చూపుతూ డిమాండ్ లేదని, ధర లేదని చెబుతూ రైతులకు నామమాత్రపు ధరనే చెల్లిస్తు న్నారు. లాక్డౌన్ సడలింపు సమయం తక్కువగా ఉండ టంతో రైతులూ అయినకాడికి అమ్ముకుంటున్నారు. ► రైతులకు కుచ్చుటోపీ పెడుతూ తక్కువ ధరకు కొంటున్న హోల్‌సేలర్లు.. మళ్లీ అదే లాక్డౌన్ కారణంగా కూరగాయలు రావడం లేదంటూ, రెండు మూడింతల అధిక ధరలకు ప్రజలకు విక్ర యాలు జరుపుతున్నారు. ►ఇక రిటైల్ మార్కెట్లో స్థానిక వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి అమ్ముతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ►కనీసం పెట్టుబడి కూడా దక్కని విధంగా తన పంటను అమ్ముకుంటున్న రైతు, బయటి మార్కెట్లో మండి పోతున్న రేట్లు, వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్న తీరు చూసి దిగులుపడుతున్నాడు. అమ్మబోతే అలా.. కొనబోతే ఇలా.. ఇతని పేరు కానుగంటి రాజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన రైతు. ఇతను ఇరవై ఐదు గుంటల భూమిలో వంకాయ, సొరకాయ, ఇతర కూరగాయలు సాగు చేస్తున్నాడు. రూ.52 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. భార్యాభర్తలిద్దరూ కూరగాయల సాగులో పని చేస్తుంటారు. పంట దిగుబడి మంచిగా వస్తుందనుకున్న సమయంలో లాక్డౌన్ వచ్చి పడింది. రోజూ వంకాయలను తెంపుకొని కురవి, మరిపెడ మార్కెట్లకు వెళ్లి అమ్మబోతే కిలో పది రూపాయలకు అడుగుతున్నారు. సొరకాయ రూ.5కే అడుగుతున్నారు. చేసేదేమీ లేక ఆ రేటుకే వేసి వస్తున్నామని రాజు వాపోయాడు. అదే వ్యాపారి రిటైలర్లు, ప్రజలకు కిలో వంకాయలు రూ.40కి, సొరకాయ రూ.20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: దిగుబడి ఎక్కువ అయితే ధరలు తగ్గుతాయన్న మార్కెట్ సూత్రం రాష్ట్రంలోని కూరగాయల వ్యాపారులకు వర్తించడం లేదు. రాష్ట్రంలో అటు హోల్‌సేల్ మార్కెట్లలో, ఇటు రిటైల్ వ్యాపారుల వద్ద కూరగాయల ధరలు మండి పోతున్నాయి. లాక్‌డౌన్‌ను సాకుగా చెబుతూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి విక్ర యిస్తున్నారు నేరుగా రైతు దగ్గరి నుంచి కొనుగోలు చేసి అమ్మే హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగాయని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ముఖ్యమైన కూరగాయల్లో 95% రకాల ధరలు పెరిగాయని, ఇందులో కొన్ని 30 శాతం పెరిగితే, మరికొన్ని 100 శాతం పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిగుబడి పెరిగినా.. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 23 వరకు మొత్తం అన్ని రకాల కూరగాయలు కలిపి 5,75,268 క్వింటాళ్లు హోల్‌సేల్ మార్కెట్ల ద్వారా బహిరంగ మార్కెట్లోకి వెళ్లాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి మే 23 వరకు 7,53,987 క్వింటాళ్లు వెళ్లాయని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2 లక్షల క్వింటాళ్ల కూరగాయలు ఎక్కువగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ ధరలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం గమనార్హం. లాక్డౌన్ విధించినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకు రవాణాకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా వ్యాపారులు లాక్డౌన్ పేరిట అటు రైతుల్ని, ఇటు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు. హోల్‌సేల్‌కు, రిటైల్‌కు పొంతనే లేదు మరోవైపు హోల్‌సేల్ మార్కెట్ ధరలకు, రిటైల్ మార్కెట్ ధరలకు పొంతనే లేకుండా పోతోంది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఏడు రూపాయలు పలుకుతున్న టమాటా బహిరంగ మార్కెట్లో 15–20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు ప్రాంతాన్ని బట్టి, వ్యాపారిని బట్టి మారిపోతుండడం గమనార్హం. రేట్ల పట్టికలు పెట్టరా? హోల్‌సేల్ మార్కెట్లలో కానీ, రిటైల్ వ్యాపారాలపై కానీ ఎక్కడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. గత ఏడాది మాదిరి మొబైల్ వాహనాల ద్వారా విక్రయం వంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి లాక్డౌన్ కాలంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయన్న విషయం ప్రభుత్వ వర్గాలకు కూడా తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ, కూరగాయల దుకాణాల వద్దా రేట్ల పట్టికలు పెట్టాలని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా పలుమార్లు ప్రకటనలు చేశారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడటంతో ఎక్కడో ఒక చోట తప్ప రేట్ల పట్టికలే కనిపించక పోవడం గమనార్హం. అసలే కరోనా.. ఆపై ధరల దడ ఓ పక్క కరోనాతో బతుకు భయం భయంగా మారింది. ఇళ్లలోనే ఉంటూ సరైన ఆహారమన్నా తీసుకుందామంటే పెరిగిన కూరగాయల ధరలతో దడ పుడుతోంది. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే ఇప్పుడు కూరగాయలు ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలో కొనుగోలు చేద్దామంటే మార్కెట్లలో రద్దీతో భయమేస్తోంది. ఇక కాలనీల్లో ఉండే చిన్నపాటి షాపుల్లో కొనుగోలు చేయాలంటే ధరలు విపరీతంగా ఉంటున్నాయి. ఇదేమిటని అడిగితే కరోనాతో పెద్ద మార్కెట్లోనే ధరలు పెరిగాయని చెబుతున్నారు. లాక్డౌన్ ముందు కిలో రూ.60 ఉన్న క్యారెట్, కాకరకాయ వంటివి ఇప్పుడు రూ.80కి చేరాయి. ఇక అన్ని కూరల్లో వాడే మిర్చి ధరలైతే చెప్పక్కర్లేదు. అప్పట్లో పావు కిలో రూ.10 ఉన్న మిర్చికి ఇప్పుడు రూ.20 పెట్టాల్సి వస్తోంది. జి.సుజాత,రామకృష్ణా కాలనీ, హన్మకొండ -
కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటలలో 24వేల కొత్త కేసులు నమోదయ్యాయని ట్రేడర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. ఈ చైన్‌ను అరికట్టాలంటే.. కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలని లేఖలో కోరారు. అదేవిధంగా, ఢిల్లీకి చేరుకునే అన్నిరకాల మార్గాలను మూసివేయాలని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ లేఖలో కోరింది. అయితే, కోవిడ్ విజృంభన వలన ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చదవండి: కరోనా కల్లోలం: ఒక్కరోజే 1501 మంది మృతి -
టోల్ ఫ్రీతో మోసాలకు చెక్!
సాక్షి, అమరావతి : వ్యాపారుల మోసాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 18004254202 వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. తూకాల్లో తేడా వచ్చినట్లు గుర్తించినా, నాసిరకం వస్తువులు ఇస్తున్నట్లు తెలిసినా, ధరల్లో తేడా ఉన్నట్లు అనుమానం వచ్చినా వినియోగదారులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 10,041 కాల్స్ వచ్చాయి. వీటి ఆధారంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు. అలాగే మరికొందరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.13.14 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశారు. ఎమ్మార్పీ కాకుండా ఎక్కువకు విక్రయించడం, ధరల పట్టిక షాపుల్లో అందుబాటులో ఉంచకపోవడం తదితర వాటికి సంబంధించి అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. తూనిక యంత్రాలకు సంబంధించి ప్రమాణాలు పాటించని వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత సరుకుల పంపిణీకి సంబంధించి కొందరు రేషన్ డీలర్లు సరైన తూకం ఇవ్వకుండా మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఒక్కో వస్తువుకు ఒక్కోసారి బయోమెట్రిక్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థలో గానీ లేదా బయట వ్యాపారస్తులు గానీ మోసం చేస్తే తప్పనిసరిగా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.కాంతారావు వినియోగదారులకు సూచించారు. లైసెన్స్ లేకుండా ఎవరైనా తూనిక యంత్రాలను రిపేరు చేస్తే వ్యాపారులతో పాటు రిపేరు చేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ పంపులకు సంబంధించి యంత్రాలను రిపేర్ చేసేందుకు రాష్ట్రంలో 727 మందికి మాత్రమే లైసెన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వ్యాపారుల నుంచి అపరాధ రుసుం రూపంలో జిల్లాల వారీగా వసూలు చేసిన మొత్తం... జిల్లా అపరాధ రుసుంగా వసూలు చేసిన మొత్తం(రూపాయల్లో విశాఖపట్నం 1,72,75,407 తూర్పు గోదావరి 1,61,06,135 కృష్ణా 1,50,99,741 గుంటూరు 1,34,18,585 చిత్తూరు 97,16,560 పశ్చిమ గోదావరి 96,58,665 అనంతపురం 95,94,610 ప్రకాశం 85,57,380 నెల్లూరు 74,11,975 కర్నూలు 69,22,750 వైఎస్సార్ 59,13,185 శ్రీకాకుళం 54,81,220 విజయనగరం 49,00,300 రాష్ట్ర స్థాయి ఎన్ఫోర్స్మెంట్ 14,22,000 మొత్తం 13,14,78,513 -
చిరుద్యోగికి గడ్డుకాలం!
అంబర్‌పేట్‌కు చెందిన రాఘవేందర్ బషీర్‌బాగ్‌లోని ఓ జ్యువెలరీ దుకాణంలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. సోమవారం (జూలై 27న) రాత్రి షాప్ యజమాని తనను పిలిచి ఈ నెల 31 నుంచి పనిలోకి రావొద్దని, బిజినెస్ బాలేనందున పనిలో నుంచి తీసేస్తున్నట్లు చెప్పాడు. కోవిడ్–19 పరిస్థితి చక్కబడ్డాక తిరిగి విధుల్లో చేరొచ్చని సూచించాడు. ఈ వార్త విన్న రాఘవేందర్‌కు గుండెలో రాయి పడినంత పనైంది. 3 రోజుల తర్వాత తన పరిస్థితి ఏమిటనే ఆందోళనలో పడ్డాడు. ఘట్కేసర్కు చెందిన విజయ్ ఉప్పల్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం వేతనాలిచ్చిన షాప్ యజమాని ఇకపై పనిలోకి రావొద్దని తనతో పాటు మరో ఆరుగురికి చెప్పాడు. దీంతో విజయ్, అతని సహోద్యోగులు తెల్లముఖం వేశారు. ఉన్నట్టుండి ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలాగంటూ లబోదిబోమంటున్నారు. మొత్తం 18 మంది పనిచేస్తున్న ఆ షాపింగ్ మాల్లో ఒకేసారి ఆరుగురిని పనిలో నుంచి తీసేశారు. సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే చిరుద్యోగి సంకటంలో పడ్డాడు. లాక్డౌన్, అనంతర పరిణామాలతో వారి ఉద్యోగ భద్రత సంక్షోభంలో చిక్కుకుంది. కరోనాతో వివిధ రకాల వ్యాపారాలు డీలా పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఆయా యాజమాన్యాలు ఉద్యోగుల సర్దుబాటు చేస్తూ వారి సంఖ్యను తగ్గిస్తున్నాయి. వ్యాపారం పుం జుకున్నాక తిరిగి రావాలని సూచిస్తూ వారిని ఇంటికి పంపించేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూలై 1 నుంచి 15వ తేదీ నాటికే ఏకంగా 38 వేల మంది ఇదే తరహాలో ఉద్యోగం కోల్పోయినట్లు అబిడ్స్‌లోని మార్కెటింగ్ రీసెర్చ్ బ్యూరో పరిశీలనలో తేలింది. గ్రేటర్ పరిధిలోనే కాకుండా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు చర్యలు జరుగుతున్నట్లు పేర్కొంది. దీంతో నిరుద్యోగిత మ రింత పెరిగే అవకాశమున్నట్లు ఆ సంస్థ అభిప్రాయపడింది. హఠాత్తుగా తొలగిస్తే... కోవిడ్–19 వ్యాప్తితో పలు వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో వ్యాపారులు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. తక్షణ చర్యలతో వారికి కొంత లాభం కలిగినప్పటికీ మళ్లీ వ్యాపారం పుంజుకుంటే ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిందే. కానీ ఇప్పటికే ఆయా వ్యాపారులను నమ్ముకుని పనిచేస్తున్న వారిని హఠాత్తుగా పనిలో నుంచి తొలగించడంతో ఆయా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ సంక్షోభ పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సాహసం ఏ వ్యాపారి చేయకపోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవనం మరింత దుర్భరంగా మారుతుందని వ్యాపార విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తొలగించడం కంటే వేతనాల్లో సర్దుబాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలని, పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పాత పద్ధతిలో కొనసాగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇదే తరహాలో తొలగింపులు జరిగితే ఆగస్టు నెలాఖరు నాటికి పరిస్థితి మరింత దారుణమవుతుందని, చిరుద్యోగులు మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు బిజినెస్ అనలసిస్ట్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
జూలై సీరీస్‌లో ఈ 4షేర్లపై ట్రేడర్ల ఆసక్తి..!
జూలై డెరివేటివ్ సీరీస్ తొలిరోజైన శుక్రవారం టెలికాం, ఐటీ, ఫార్మా, హాస్పిటల్ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. రానున్న రోజుల్లో నిఫ్టీ లాభాలు పరిమితం అవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు వృద్ధి కలిగిన కంపెనీల షేర్లపై దృష్టిని సారించారు. యాక్చెంచర్ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావవడంతో శుక్రవారం టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్స్ విభాగపు విశ్లేషకుడు చందన్ తపారియా జూలై సీరిస్‌లో ట్రేడర్లు ఈ 4షేర్లపై అధిక దృష్టి నిలిపినట్లు పేర్కోంటూ సూచనలు ఇచ్చారు. ఇప్పుడు 4 షేర్లను గురించి తెలుసుకుందాం... 1. షేరు పేరు: వోడాఫోన్ ఐడియా ప్రస్తుత ధర: రూ.10.50(29-6-2020 నాటికి) విశ్లేషణ: గడచిన కొద్దిరోజులుగా ఇతర టెలికాం రంగ షేర్లలో నెలకొన్న ర్యాలీలో భాగంగా ఈ షేరు పెరిగింది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ వోడాఫోన్ ఐడియా కంపెనీలో వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలతో ఈ కౌంటర్లో సెంటిమెంట్ మెరుగుపడింది. అలాగే ఏజీఆర్ బకాయిల నుంచి ఉపమశమనం లభించవచ్చనే ఆశావహ అంచనాలతో ఈ షేరు మార్చి నుంచి ఏకంగా 218శాతం ర్యాలీ చేసింది. శుక్రవారం షేరు సగటు వ్యాల్యూమ్స్ కంటే అధిక ట్రేడింగ్ పరిమాణంతో 6శాతం లాభంతో ముగిసింది. 2. షేరు పేరు: మైండ్ ట్రీ ప్రస్తుత షేరు ధర: రూ. 941 (29-6-2020 నాటికి) విశ్లేషణ: యాక్చెంచర్ క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐటీ షేర్లు లాభపడ్డాయి. అందులో భాగంగా ఈ మైండ్ ట్రీ షేరు కూడా పెరిగింది. ఈ షేరు ప్రస్తుత ధర(రూ.941) నుండి ఈ జూలై సీరీస్‌లో రూ. 1,000- రూ.1,020కి ర్యాలీ చేయవచ్చు. అలాగే డౌన్‌ట్రెండ్‌లో రూ.910 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. 3. షేరు పేరు: యూనైటెడ్ బేవరేజెస్ ప్రస్తుత షేరు ధర: రూ.1,011 (29-6-2020 నాటికి) విశ్లేషణ: కోవిడ్-19 లాక్‌డౌన్‌తో ఏర్పడిన అంతరాయాలతో మార్చి క్వార్టర్లో కంపెనీ నికరలాభం 39శాతం క్షీణించింది. ఫలితంగా షేరులో బేరిష్ పొజిషన్లు ఏర్పడ్డాయి. స్వల్పకాలం పాటు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ.., బలమైన బ్యాలెన్స్ షీట్‌తో రానున్న రోజుల్లో రాణించవచ్చు. షేరు పతనమైన ప్రతిసారి పొజిషన్లను తీసుకోవచ్చు. 4. షేరు పేరు: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత షేరు ధర: రూ.560 (29-6-2020 నాటికి) విశ్లేషణ: యాక్చెంచర్ క్యూ4 లాభాల ప్రకటన ఈ షేరుకు కూడా కలిసొచ్చింది. గత ఐదు సెషన్లలో ఈ షేరు 50రోజుల మూవింగ్ యావరేజ్ వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఈ షేరుకు రూ.545 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. ఈ జూలైలో సీరీస్‌లో రూ.600 వరకు లాభపడవచ్చు. -
ఈ 4నియమాలతో నష్టాలకు దూరం
స్టాక్‌మార్కెట్ అనేది అవకాశాలకు స్వర్గధామం. ప్రతి ట్రేడర్ మంచి రాబడుల్ని ఆశిస్తూ ట్రేడ్ చేస్తారు. అయితే అందరూ అందులో విజయాల్ని సాధించలేరు. మార్కెట్ ట్రెండ్‌ను గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఓర్పు అవసరం. గట్టి పట్టుదల ఉండాలి. అన్నింటిని అలవరుచుకొని సురక్షితంగా ట్రేడింగ్ చేస్తేనే లాభాలు సమకూరుతాయి. ఈ క్రమంలో ప్రతి ట్రేడరు 4నాలుగు నియమాలను అలవరుచుకుని నష్టాలకు దూరంగా ఉండచవచ్చని క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ జష్న్ అరోరా తెలిపారు. 1.రిస్క్‌ను ముందుగానే అంచనా వేసుకోవాలి: స్టాక్ మార్కెట్లో వైఫల్యానికి ‘‘మేనేజ్మెంట్ నైపుణ్యం లేకపోవడం’’ అతిపెద్ద కారణం. కాబట్టి ట్రేడింగ్ విఫలమైతే సంభవించే నష్టాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. సాధారణంగా ట్రేడర్లు తమ డబ్బులన్నింటినీ ఒకే స్టాక్‌లో ఉంచి నష్టాలను చవిచూస్తారు. 2.మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి: మార్కెట్ అర్థం చేసుకోవడం చాలా అవసరం. స్టాక్ మార్కెట్‌ను ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు అనేది వాస్తవమే. అయితే మార్కెట్‌ను అర్థం చేసుకోకుంటే భారీ నష్టాలను నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే భారీ నష్టాలు తప్పవు. 3.స్టాప్ లాస్ పెట్టుకోవాలి ట్రేడర్లు ఎల్లప్పుడూ ‘‘స్టాప్ లాస్’’ ఆప్షన్ వినియోగించాలి. ఈ ఆప్షను ఉపయోగించక పోతే స్టాక్‌లో రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ షేరు ధర ట్రేడర్ ఊహించిన దానికి అనుకూలంగా కదలకపోతే భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. 4.భావోద్వేగాలకు దూరంగా ఉండాలి స్టాక్ మార్కెట్లో భావోద్వేగాలకు స్థానం లేదు. షేరు మరింత నష్టాన్ని చవిచూడవచ్చనే భయాలు లేదా మరింత ర్యాలీ చేస్తుందనే ఆత్యాశ లాంటి భావోద్వేగాలు పనికిరావు. ఒకవేళ ఇలా చేస్తే ఎక్కువ మొత్తంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. నిఫ్టీకి 10,325-10,410 శ్రేణి కీలకం: ఈ వారంలో జూన్ కాంట్రాక్టు డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడకులకు లోనయ్యే అవకాశం ఉందని అరోరా అభిప్రాయపడ్డారు. అప్‌సైడ్‌లో నిఫ్టీ 10,325-10,410 శ్రేణిలో కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుందని ఆయన అన్నారు. ఒకవేళ ఇండెక్స్ 10,400 స్థాయిని అధిగమించగలిగితే దాని తదుపరి నిరోధ శ్రేణి 10,530-10,650 ఉండొచ్చు. ఇప్పటికీ నిఫ్టీ 200 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్ స్థాయిని ఎదుర్కోంటుందన్నారు. డౌన్‌ట్రెండ్‌లో 10070 దిగువుకు చేరితే ఇండెక్స్ మరింత బలహీనపడి 9,950-9,840 స్థాయికి చేరుకుంటుదన్నారు. ఈ స్థాయికి కోలో్పతే తదుపరి కీలక మద్దతు 9,725-9,700 స్థాయిని పరీక్షిస్తుంది. -
చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో డ్రాగన్ దుశ్చర్య, తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీవాసులు చైనా వస్తువులపై ఏకంగా "యుద్ధం" ప్రకటించారు. ఇంట్లోని ప్రతి చైనా వస్తువును రోడ్డుపైకి విసిరేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ రంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు తుపాకులు, బుల్లెట్లతో ప్రత్యక్షంగా చైనాపై యుద్ధానికి దిగలేకపోయినా వస్తువులు బహిష్కరణ ద్వారా చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. అయితే ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని యుద్ధ నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ డిఫెన్స్ కాలనీకి చెందిన భవ్రీన్ కంధారి విమర్శించారు. (చైనా ఉత్పత్తులపై నిషేధం) మరోవైపు ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన సదర్ బజార్ వ్యాపారులు భిన్నంగా స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణకు సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కొన్ని షరతులతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ శర్మమాట్లాడుతూ, తాము కూడా చైనా ఉత్పత్తుల నిషేధానికి సిద్ధమే. 'హిందీచీనీ బైబై' నినాదానికి తమ మద్దతు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలతోపాటు, అధికారుల దాడులు, ఇతర వేధింపులనుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. (చైనాకు షాక్ : చైనా పరికరాల వాడకం తగ్గించండి!) దాదాపు 70 శాతం ఎలక్ట్రికల్ వస్తువులు చైనానుంచే వస్తాయనీ మరో వ్యాపారి తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతామని వెల్లడించారు. అనేక మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు సంబంధించిన విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతి అవుతాయన్నారు. దాదాపు 40 వేల దుకాణాలను కలిగి ఉన్న సదర్ బజార్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, గడియారాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇలా దాదాపు ప్రతీది చైనానుంచి దిగుమతి అయినవే ఉంటాయన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల బహిష్కరణ, దిగుమతులపై నిషేధం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కాగా దేశీయంగా 7 కోట్ల మంది వ్యాపారులు, 40 వేల ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) చైనా దిగుమతులను బ్యాన్ చేయాలని పిలుపు నిచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి చైనా దిగుమతులు 13 బిలియన్ డాలర్లు తగ్గించాలంటూ ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని కోరింది. ప్రస్తుతం, ప్రతి ఏటా చైనా నుంచి దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విలువ 70 బిలియన్ డాలర్లకు పై మాటే. -
‘ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుంది’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉండి వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరను ఇప్పించేందుకు కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన పోగాకు రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పొగాకు వ్యాపారులు, ట్రేడర్లతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పొగాకు సాగు వచ్చే ఏడాది నుంచి తగ్గించేలా అందరూ సహకరించాలన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ట్రేడర్లు, వ్యాపారులు పోటీతత్వంతో మార్కెట్లో పాల్గొనాలని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పొగాకు సాగుకు బదులుగా ప్రత్యాన్మయ పంటల సాగు చేసేందుకు ప్రయత్నం చేయాలని రైతులను కోరుతున్నామన్నారు. దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సంప్రదించి రాయితీలను అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. బ్రైట్ గ్రేడ్‌తో పాటు మీడియం, లోయర్ గ్రేడ్ ఉత్పత్తులను కూడా రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ వేళ లాభాల సూత్రాలు!
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లు కరోనా దెబ్బకు కకావికలం అవుతున్నాయి. మార్చి పతనాల తర్వాత కొంత రికవరీ చూపినా, ఏ దేశపు మార్కెట్ కూడా ఇంకా బేస్‌ను ఏర్పరుచుకోలేదు. నిఫ్టీ సైతం 7500 పాయింట్ల కనిష్ఠాన్ని చూసి తిరిగి కోలుకొని 8800- 9800 పాయింట్ల మధ్య కదలాడుతోంది. 8900-9000 పాయింట్ల వద్ద ప్రస్తుతం నిఫ్టీకి మంచి మద్దతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయి గత బుల్ ర్యాలీ(9000-12400)కి బేస్‌గా వ్యవహరించింది. ఈ స్థాయి కోల్పోనంతవరకు రిస్కుతీసుకునే ట్రేడర్లు పొజిషన్లను కొనసాగిస్తూనే ఉంటారు. కొత్త పెట్టుబడులకు కూడా ఈ స్థాయి మంచిదేనని కొందరిసలహా. అయితే వీరంతా పెట్టుబడులు పెట్టేముందు తప్పక కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.... ఒక ట్రేడ్ చేసే ముందు అందులోని రిస్కును కచ్ఛితంగా అంచనా వేయాలి. పెట్టుబడి మొత్తాన్ని సరైన రీతిలో వివిధ షేర్లలో పెట్టాలి.(డైవర్సిఫికేషన్). సాధ్యమైనంత వరకు ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. నిఫ్టీలో ఒక దఫా 200- 300 పాయింట్ల మేర మాత్రమే ట్రేడ్ చేయాలి. (భారీ పతనం, భారీ ర్యాలీ కోసం పొజిషన్లు తీసుకోవద్దు). హెడ్జింగ్ మర్చిపోవద్దు, ప్రతి షేరుకు ట్రైలింగ్ స్టాప్‌లాస్‌ను తప్పక పాటించాలి. సిప్స్ తీసుకోవడం లేదా ఆప్షన్ రైటింగ్‌కు ఎక్కువ ప్రాధానమివ్వాలి. ట్రెండ్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలి. ట్రెండ్‌కు ఎదురీదే యత్నాలు వద్దు. నిఫ్టీ 9200 పాయింట్ల పైన ఉంటే బుల్లిష్‌గా, దిగువన ఉంటే బేరిష్‌గా ట్రెండ్ ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగువన నిఫ్టీకి 8200- 8500 పాయింట్ల వద్ద మరో మద్దతుంది. బేర్ మార్కెట్లో వచ్చే ఆరు నెలలు ఎలా గడుపుతామనేదాని ఆధారంగా వచ్చే ఆరు సంవత్సరాల ట్రేడింగ్ భవితవ్యం ఆధారపడిఉంటుందని మార్కెట్ పండితులంటారు. అందువల్ల సరైన జాగ్రత్తలు తీసుకొని ట్రేడింగ్ చేయాలని సలహా ఇస్తున్నారు. -
‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ పేరుతో మిర్చి వ్యాపారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో మిర్చి ధరను సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం దాకా క్వింటాల్ రూ.22 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.13,500లకు కొంటున్నారు. మరో మార్గం లేక రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వ్యాపారులు ఆ మిర్చిని ఇతర రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ కోల్డు స్టోరేజీల్లో మిర్చీని నిల్వ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ప్రతి సంవత్సరం గుంటూరు నుంచి చైనాకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది సీజను ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో 20 వేల మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కోవిడ్ వైరస్ కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. క్వింటాల్ రూ.22 వేలు పలికిన మిర్చీ ధర రూ.8 వేలకు పడిపోయింది. ఎటువంటి తాలు లేని మిర్చి గుంటూరు మార్కెట్ యార్డులో రూ.13,500 పలుకుతోంది. చైనాకు ఎగుమతులు నిలిచినా ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మంచి మిర్చికి డిమాండ్ ఉంది. చైనాకు ఇప్పట్లో ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదంటూ వ్యాపారులు మాయ మాటలు చెబుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు ప్రతిఏటా 30 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులంతా రోజుకు 500 నుంచి 1,000 టన్నులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ అధికంగానే ఉందన్న విషయాన్ని మార్కెటింగ్ శాఖ ప్రచారం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు ‘‘గుంటూరు మిర్చి యార్డులో మంచి ధర లభిస్తుంది. జనవరి నెలాఖరు వరకు గుంటూరు యార్డుకు రోజుకు 1.20 లక్షల బస్తాల (ఒక బస్తా 40 కిలోలు) మిర్చీ వచ్చింది. ప్రస్తుతం చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుండటంతో రోజుకు దాదాపు 70 వేల బస్తాలే యార్డుకొస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను తెలుసుకుంటూ పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు’’ – వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ, గుంటూరు మిర్చి యార్డు -
మరింత సరళంగా జీఎస్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాపారులకు శుభవార్త అందించారు. జీఎస్టీకి సంబంధించి వ్యాపారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే జీఎస్టీ వ్యవస్థను మరింత సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాలనుంచి వచ్చిన సూచనల ఆధారంగా పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి, నిజమైన పన్ను చెల్లింపుదారుల వేధింపులను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి మంగళవారం చెప్పారు. ఒక సాధారణ వ్యాపారి కూడా జీఎస్టీ నిబంధనలు పాటించేలా జీఎస్టీ నిర్మాణాన్ని మరింత హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒక సాధారణ వ్యాపారి కూడా జీఎస్టీ నిబంధనలుపాటించేలా జీఎస్టీ నిర్మాణాన్నిమరింత హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందుకు రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన, ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఆర్థికమంత్రి వెల్లడించారు అంతేకాదు వ్యవస్థను సరళీకృతం చేయడానికి కృషి చేసేందుకు సలహాలను ఆహ్వానిస్తున్నామన్నారు. న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) నిర్వహించిన రెండవరోజు కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడారు. సీఏఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ జీఎస్టీ నమోదు చేసుకున్న వ్యాపారుల సంఖ్యను 2 కోట్లకు పెంచాలని శరీరం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మూడు రోజుల నేషనల్ ట్రేడర్స్ కన్వెన్షన్ (సిఐఐటి)కు దేశవ్యాప్తంగా వ్యాపారులు హాజరవుతున్నారు. -
ట్రేడింగ్‌లో అవకతవకలు.. ఐటీ దాడులు
న్యూఢిల్లీ : ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ పలువురు షేర్ బ్రోకర్స్, ట్రేడర్స్‌పై దాడులు జరిపింది. దేశ వ్యాప్తంగా ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ సహా 39 చోట్ల సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ శనివారం తెలిపింది. రివర్సల్ ట్రేడ్స్ ద్వారా కృత్రిమంగా లాభం/నష్టం వచ్చేలా చేశారని వీరిపై ఆరోపణలున్నాయి. దీని ద్వారా వీరు రూ. 3500 కోట్ల వరకూ లాభాలు/నష్టాలు వచ్చేలా చేశారని ఐటీ శాఖ తెలిపింది. -
సీఎం ప్రకటనతో ఆనందంలో అన్నదాతలు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి రైతులకు అండగా ఉంటామని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా రైతుల నుంచి ట్రేడర్స్ వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజు చెల్లించనవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి దాకా రైతుల పండించి తీసుకొచ్చిన వివిధ రకాల పండ్లను, కూరగాయలను కొందరు 4 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఇక నుంచి కమీషన్ పద్ధతి ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రధాన పంట వరి సాగు. ఆ తరువాత వివిధ రకాల పంటలు ఉన్నాయి. వీటికిగాను పండ్లు, కూరగాయల విక్రయాలపై మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కాకర, దొండ, బీర, వంగ తదతర కూరగాయల సాగు 17 వేల ఎకరాల్లో, నిమ్మ 42 వేలు, మామిడి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు కలసి మొత్తం 84 వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ఏటా 65 లక్షల క్వింటాల్ కూరగాయలు, పండ్లు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వీటికి ఏటా మార్కెట్లోని ట్రేడర్స్, కొనుగోలుదారులు మార్కెట్ ఫీజు కింద సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏడాదికి రూ.కోటి వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ సెస్‌ను జిల్లాలోని 11 మార్కెట్ కమిటీలు ఉంటే ఆయా కమీటీలకు చెల్లిస్తారు. అయితే ట్రేడర్స్, కొనుగోలుదారులు చెల్లించే సెస్‌ను రైతుల వద్ద వసూలు చేస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ట్రేడర్స్ చెల్లించాల్సిన దానికి కూడా రైతులపై భారం మోపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులపై భారం పడకుండా ఉండే విధంగా సెస్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్పష్టమైన ఆదేశాలు జారీ లైసెన్స్‌లు కలిగిన ట్రేడర్స్‌కు కూడా మార్కెట్ఫీజు కట్టనవసరం లేదని తెలిపారు. కొనుగోలు దారులు, ట్రేడర్స్ వారి లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ నామ్ ప్లాట్ఫారం ద్వారా వలంటరీగా చేయాలనుకునేవారు కూడా లైసెన్స్‌లు పొందాలని పేర్కొన్నారు. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలనుకుంటే ట్రేడర్స్‌గా మారి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రైతుల వద్ద నుంచి కమీషన్ తీసుకునే పద్ధతి పూర్తిగా తొలగనుంది. ఈ నిర్ణయం రైతులు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫీజు వసూలు చేయడం లేదు జిల్లాలోని 11 మార్కెట్ కమిటీ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పండ్లు, కూరగాయలకు, వీటిలో నిమ్మ కూడా వస్తుంది, వీటికి ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మార్కెట్కమిటీలకు ఆదేశాలు కూడా జారీ చేశాం. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అమలు చేస్తాం. – రావమ్మ, ఏడీఎం, మార్కెట్ శాఖ -
సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: రాజధాని కేంద్రంగా మరో నకిలీ ఇన్వాయిస్ రాకెట్ వెలుగులోనికి వచ్చింది. సరుకులు తయారీ, రవాణా చేయకుండానే రూ.133 కోట్ల వ్యాపారం చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన 5 కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడటంతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో రూ.22.64 కోట్లను ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందాయి. ఈ బాగోతాన్ని మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. నకిలీ ఇన్వాయిస్ల సృష్టికి కలకత్తా పెట్టింది పేరు. బోగస్ వ్యాపారులకు అవసరమైన నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి ఇవ్వడానికి అక్కడ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు ఉంటాయి. ఇలాంటి ఓ సంస్థ నుంచి మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్‌కు ఓ సమాచారం అందింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు ఐదు కంపెనీల అక్రమాలను గుర్తించారు. కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన హిందుస్తాన్ ఏఏసీ ప్రొడక్ట్స్, ఐత్రి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్, శ్రీకృష్ణా క్యాస్టింగ్స్, శ్రీ మెటల్స్, ఆవ్యా ఎంటర్ ప్రైజెస్‌లు ఎంఎస్, కాపర్, మెటల్ తుక్కు పదార్థాల తయారీ, రవాణా వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ ఐదూ 2017 జూలై నుంచి నకిలీ ఈ–వే బిల్లులు సృష్టించడం మొదలెట్టాయి. నకిలీ ఇన్వాయిస్ల సాయంతో ఈ కాలంలో మొత్తం రూ.131 కోట్ల మేర వ్యాపారం చేశామని రికార్డులు సృష్టించాయి. దీనికి సంబంధించి చెల్లించాల్సిన రూ.22.64 కోట్ల జీఎస్టీని ఐటీసీ కింద చూపిస్తూ వచ్చాయి. ఫలితంగా ఆయా సంస్థలు చేస్తున్న వ్యాపారానికి రూ.131 కోట్ల అదనంగా చేసినట్లు రికార్డులు తయారుచేశాయి. దీనికితోడు చెల్లించాల్సిన పన్నులో రూ.22.64 కోట్లు ప్రభుత్వం నుంచే తీసుకున్నాయి. అయితే కలకత్తా నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారని, అసలు సరుకు తయారీ రవాణా కాలేదని నిర్థారించారు. దీంతో ఆ ఐదు సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ సంస్థలను నలుగురు నిర్వహిస్తున్నారని తేలింది. ప్రాథమికంగా నేరం నిరూపణ కావడంతో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. స్కూటర్లపై సరుకు రవాణా చేశారట! జీఎస్టీ అధికారులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి. సాధారణంగా సరుకు తయారీ సంస్థలు వాటి రవాణా కోసం ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ వాడుతాయి. అయితే నకిలీ ఈ–వేబిల్స్ సృష్టించిన ఈ ఐదు సంస్థల్లో వాటిపై సరుకు రవాణా వాహనాల నంబర్లు అంటూ కొన్నింటిని పొందుపరిచాయి. అయితే అసలు సరుకే లేనప్పుడు ఇక రవాణా ఏమిటని అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు ఆ కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయా రిజిస్ట్రేషన్ నంబర్లతో సరుకులు రవాణా చేసే వాహనాలు లేవని, ప్రయాణికులను చేరవేసే వాహనాలు, స్కూటర్లు, ట్రాక్టర్ల నంబర్లను వినియోగించారని బయటపడింది. రూ.20 లక్షల నగదుతో పాటు 4,150 అమెరికన్ డాలర్లు, ఇతర నకిలీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు మేడ్చల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. -
ఫ్లిప్‌కార్ట్ డీల్ : నేడు భారత్ బంద్‌కు పిలుపు
పుణే : అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడాన్ని మొదట్నుంచి దేశీయ వర్తకులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ప్రభావం వర్తకులపై, చిన్న వ్యాపారాలపై తీవ్ర చూపనుందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్లు(సియాట్) నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది. ఈ డీల్‌తో మల్టి-బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బ్యాక్‌డోర్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తాయని ట్రేడర్లు చెబుతున్నారు. ‘ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ దేశీయ ఎఫ్‌డీఐ పాలసీకి వ్యతిరేకంగా ఉంది. ఇది ఏడు కోట్ల ట్రేడర్లు, దేశంలోని చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని సియాట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల చెప్పారు. భారత్‌లోకి ఎఫ్‌డీఐల ప్రవేశాన్ని తాము అడ్డగించడం లేదని, కానీ వాల్‌మార్ట్, అమెజాన్‌తో పోటీపడేలా బలవంతం చేసేముందు, భారతీయ ట్రేడర్లకు కూడా ఆ స్థాయిలో మైదానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు సియాట్ కోఆర్డినేటర్ అజిత్ సేథియా అన్నారు. స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా మల్టి-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐను వ్యతిరేకిస్తోంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తోంది. నేషనల్ కంపెనీ లా అప్పీలెంట్ ట్రిబ్యునల్‌లో వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు చెందిన కేసు విచారిస్తున్న సందర్భంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వాల్‌మార్ట్ ట్రిబ్యునల్ ముందు తన స్పందనలు కూడా తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఈడీని, ఆర్బీఐని, సీసీఐని డిమాండ్ చేస్తున్నామని స్వదేశీ జాగ్రన్ మంచ్ కో-కన్వీనర్ అశ్వాని మహాజన్ అన్నారు. మల్టి బ్రాండులో ఎఫ్‌డీఐలు, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ను దెబ్బతీస్తాయని, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా ఉంటాయని, ఉద్యోగాల సృష్టిని కూడా హరింపజేస్తాయని స్వదేశీ జాగ్రన్ మంచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
వాల్‌మార్ట్-ఫ్లిప్కార్ట్డీల్కు సియాట్ సెగ
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ వాల్మార్ట్డీల్కు వ్యతిరేకంగా రీటైల్ దుకాణదారులు, ఆన్లైన్ ట్రేడర్లు త్రీవ నిరసన వ్యక్తంచేశాయి. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఆందోళన నిర్వహించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మంది వ్యాపారులు దేశవ్యాప్త నిరసనకు దిగారు. ఈస్టిండియా కంపెనీ లాంటి వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కారణంగా తమ వ్యాపారం భారీగా దెబ్బతింటుందని ఆరోపించారు. తమ వ్యాపారాలను ఆదుకోవాలని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో సియాట్ సోమవారం ధర్నాలకు దిగింది. ఈ డీల్ కారణంగా రిటైల్ మార్కెట్లో గుత్తాధిపత్యం వస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు నాణ్యత లేని వస్తువులను భారత మార్కెట్లో చొచ్చుకు రానున్నాయని వాదించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యపరిశ్రమల శాఖ కల్పించుకోవాలని డిమాండ్‌చేశారు. తక్షణమే ఈ కామర్స్ విదానాన్ని , ఈ కామర్స్రెగ్యులేటరీ బాడీని నియమించాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు ఈడీకి, సీసీఐకి ఫిర్యాదు దాఖలు చేసినట్టు చెప్పారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే.. సుప్రీకోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు.ఇది తమ నిరసన లో మొదటి దశ మరియు ప్రభుత్వం వినకపోతే, ఈ నెలలో ఢిల్లీలో ఒక జాతీయ సదస్సు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని సియాట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ స్పష్టం చేశారు. -
పన్నుల వసూళ్ల జోరు
విశాఖసిటీ: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుచేసిన మొదటి నెలలో తడబడ్డ రాష్ట్రం.. ఏడాది తిరిగేనాటికి వసూళ్లలో వేగం పుంజుకుంది. జూలైలో అన్ని రకాల జీఎస్టీలు రూ.9 కోట్లు మాత్రమే వసూలు కాగా.. తర్వాత నెల నుంచి సరాసరి రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. ఓ వైపు.. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు మందగమనంలో ఉండగా ఏపీలో మాత్రం వృద్ధి చెందుతున్నాయి. 11 నెలల్లో సెంట్రల్ జీఎస్టీ ఖజానాకు రూ.22,733 కోట్లు చేరాయి. క్రమంగా వేగం జీఎస్టీ అమలుచేసిన తొలి నెలలో వ్యాపారులు, రాష్ట్ర పన్నుల శాఖ మధ్య అవగాహన లేమి, ఇతర కారణాలతో పన్నుల వసూళ్లలో వెనుకబడిన రాష్ట్రం.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. రిటర్న్స్, పన్ను వసూళ్లపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖాధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు, కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో గతేడాది ఆగస్ట్ నుంచి ఈ ఏడాది మే వరకూ వరుసగా పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2017 జూలై నుంచి 2018 మే నెల వరకు సెంట్రల్ ట్యాక్స్ (సీజీఎస్టీ) రూ.5,330.39 కోట్లు వసూలుకాగా.. ఐజీఎస్టీ రూ.7,950.23 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.9,028.52 కోట్లు వసూలైంది. ఈ 11 నెలల కాలంలో కొన్ని వస్తువులపై ప్రత్యేకంగా విధిస్తున్న సెస్ రూ.209.65 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమలైన 2017 జూలైలో అన్ని పన్నులు కలిపి రాష్ట్రంలో రూ.9.9 కోట్లు ఆదాయం రాగా.. 2018 మే నెలాఖరునాటికి 11 నెలల కాలంలో రూ.22,733.81 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుకున్నాయి. రిటర్న్స్ ఫైలింగ్‌లోనూ ముందంజ పన్నుల వసూళ్లలో టాప్‌గేర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. జీఎస్టీకి సంబంధించిన రిటర్న్స్ ఫైలింగ్‌లోనూ అదే జోరుతో ముందుకెళ్తోంది. దేశ సగటు కంటే ఏపీ సగటు అధికంగా ఉండటం గమనార్హం. కాంపోజిషన్ డీలర్లు ఫైల్ చేసే జీఎస్టీఆర్4 రిటర్న్స్ దేశవ్యాప్తంగా 70.03శాతం కాగా.. రాష్ట్రంలో ఈ సగటు 74.62 శాతం నమోదైంది. 3బీ రిటర్న్స్‌లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా 67.85 శాతం 3బీ రిటర్న్స్ దాఖలు శాతం ఉండగా.. ఏపీలో 66.58 శాతం ఉంది. అంతర్రాష్ట్ర పన్నులకు సంబంధించిన ఐజీఎస్టీ రీఫండ్‌లోనూ రాష్ట్రం చురుగ్గా వ్యవహరిస్తోంది. 2018 మే నెలాఖరు వరకూ రూ.947.53కోట్ల రీఫండ్‌కు చెందిన 8,282 బిల్లులు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన కార్యాలయాలకు రాగా.. 5,242 బిల్లులకు సంబంధించిన రూ.812.90 కోట్లు వ్యాపారులకు రీఫండ్ ఇచ్చారు. వ్యాపారులకు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీపై ప్రతి నెలా అవగాహన కల్పిస్తుండటంతో ఈ వృద్ధి సాధ్యమైందని సెంట్రల్ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సృజన్‌కుమార్ చెప్పారు. ఇప్పటికీ పలువురు వ్యాపారులు కొన్ని ఇబ్బందుల కారణంగా రిటర్న్స్ దాఖలు చెయ్యడం లేదనీ, త్వరలోనే అన్ని వర్గాల వ్యాపారులూ రిటర్న్స్ దాఖలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. -
రైతుకు దుఃఖం, దళారికి రొక్కం
విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నంలో చిరుద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన గతేడాది కిలో బియ్యాన్ని రూ.42కు కొన్నాడు, ఇప్పుడు అదే రకం బియ్యాన్ని రూ.50కి కొనాల్సి వచ్చింది. అంటే ఏడాదిలో ధర కిలోకు రూ.8 పెరిగింది. ఇదే సమయంలో రైతుల నుంచి క్వింటాల్ ధాన్యాన్ని(వడ్లు) కేవలం రూ.1,100కు దళారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ ధాన్యాన్ని మరాడిస్తే 70 కిలోల బియ్యం వస్తాయి. కిలోకు రూ.50 లెక్కన 70 కిలోల బియ్యం ధర రూ.3,500. మర ఆడించినందుకు, రవాణాకు రూ.1,500 పోగా దళారికి నికరంగా రూ.2,000 లాభమన్నమాట! అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతుకు దక్కింది కేవలం రూ1,100. ఇందులో అన్ని ఖర్చులూ పోను అతడికి మిగిలేది ఉత్త చిల్లరే. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగిరాని పరిస్థితి. రైతు నష్టపోయినా వినియోగదారుడికైనా మేలు జరుగుతోందా? అంటే లేదనే చెప్పాలి. చివరకు లాభపడేది మధ్యలో ఉన్న దళారే. బహిరంగ మార్కెట్లో బియ్యం ధర ఏటా పెరిగిపోతూనే ఉంది. వ్యాపారులు, దళారుల మాయాజాలం వల్ల అన్నదాతలకు మాత్రం ఆ స్థాయిలో ధర రావడం లేదు. సాక్షి, అమరావతి: కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు కుంగిపోతుండగా, మరోవైపు వినియోగదారులు అవే పంటలను అధిక ధరలు పెట్టి కొనలేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారులు రైతుల నుంచి పంటలను తక్కువ ధరకు కొంటూ, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ కందులను గరిష్టంగా రూ.4,000కు రైతుల నుంచి కొనుగోలు చేస్తుండగా, బయటి మార్కెట్లలో, సూపర్ బజార్లలో కంది పప్పు ధర రూ.100కు తగ్గడం లేదు. మార్కెట్లలో కిలో మినప పప్పు ప్రస్తుతం రూ.110 పలుకుతుండగా, క్వింటాల్ మినుముల ధర రూ.4,500కు మించడం లేదు. ముడి సరుక్కి వ్యాపారులు అదనపు విలువ జోడించారనుకున్నా ప్రస్తుతం ఉన్న ధరలో సగానికే వినియోగదారునికి దక్కాలి. కానీ, అపరాల మార్కెట్‌పై వ్యాపారులు, దళారుల గుత్తాధిపత్యం రైతులను, వినియోగదారులను నట్టేట ముంచుతోంది. డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసాల వల్ల ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా అందులో ఏమాత్రం పస లేదని ప్రస్తుత ధరలు తెలియజేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించి, వినియోగదారులకు ఊరట కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అది తనకు సంబంధం లేని విషయమన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నదాతలకు గిట్టుబాటు ధరలేవీ? చింతపండు సేకరణ ధరకు, రిటైల్ ధరకు మధ్య అసలు పొంతనే ఉండడం లేదు. సేకరణ ధర కిలోకి గరిష్టంగా రూ.20 మించడం లేదు. కానీ, మార్కెట్లో మాత్రం వినియోగదారుడు కిలోకు రూ.150 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పసుపు పరిస్థితి మరింత దారుణం. కొన్నేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.10,000 దాకా పలికిన పసుపు కొమ్ములను వ్యాపారులు ఇప్పుడు రైతులకు కేవలం రూ.4,000 ఇచ్చి కొంటున్నారు. మార్కెట్లో పసుపు ధర మాత్రం తగ్గకపోవడం గమనార్హం. రాష్ట్రంలో నీటి కొరత నేపథ్యంలో జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. తెల్ల జొన్నలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.1,725గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాపారులు తెల్ల జొన్నలకు క్వింటాల్‌కు రూ.1,100 మాత్రమే ఇస్తున్నారు. మామిడి రైతుల దిగాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర స్వల్పంగా పెరిగినా మామిడి రైతులు నష్టాలే చవిచూడాల్సి వస్తోంది. ఈసారి దిగుబడి 20 శాతం వరకు తగ్గిపోయింది. మార్చి నెలలో అకాల వర్షాల వల్ల పూత, పిందె రాలిపోయాయి. ఈ నేపథ్యంలో టన్ను మామిడి కనీసం రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఉంటుందని రైతులు భావించారు. కానీ, దళారులు ఏకమై ఆ ధరను రూ.18 వేలకు తగ్గించారు. వినియోగదారులు కిలో మామిడిపండ్లు కొనాలంటే రూ.90 నుంచి రూ.110 దాకా వెచ్చించాల్సి వస్తోంది. -
వర్తకులకు జీఎస్టీ వల్ల ఇబ్బందులు : ఈటెల
న్యూఢిల్లీ : వర్తకులు జీఎస్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలు చాలా కఠినతరంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సుశిల్ మోదీ నేతృత్వంలో నియమించిన కమిటీ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ సమస్యలపై చర్చించారు. 3జీ అనే కొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టి, జీఎస్టీని సరళీకరిస్తారని ఈటెల పేర్కొన్నారు. ట్రేడింగ్‌కు ఇబ్బంది లేకుండా జీఎస్టీని అమలు చేస్తారని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్లో కొత్త ప్రతిపాదనలు వస్తాయని తెలిపారు. గ్రౌండ్లో వచ్చిన సమస్యలను ఎప్పడికప్పుడు పరిష్కరిస్తూ.. ప్రజలకు కష్టం లేకుండా పన్ను కట్టే వారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలన్నారు. తెలంగాణ మొదటి నుంచి ప్రగతిశీల రాష్ట్రంగా ఉందని, ఎఫ్ఆర్బీఎస్ రుణాలను తగ్గించడానికి వీల్లేదని ఈటెల అన్నారు. ఈ రుణాలను 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయని, ఈ ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. 42 శాతం పన్నుని వెనక్కి ఇస్తున్న నిబంధనను సమీక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయని, తగ్గిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాలు కూడా చాలా పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రానికి ఒక నిబంధన, రాష్ట్రానికి ఒక నిబంధన అంటే సరికాదని పేర్కొన్నారు. పన్ను పంపిణీలో దక్షిణాదికి అన్యాయం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 2011 జనాభా ప్రాతిపదికనే నిధులను ఇస్తామనడం సరికాదని, జనాభాను తగ్గించి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలన్నారు. కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తున్నాయని, అందువల్లే నగదు కొరత ఏర్పడుతుందన్నారు. దేశంలో 7.3 లక్షల కోట్ల ఎన్పీఏలు ఉన్నాయని తెలిపారు. నగదు కొరత లేకుండా చేయాలని అరుణ్‌జైట్లీని కోరినట్టు ఈటెల్ చెప్పారు. బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై, ఆర్బీఐపై ఉందన్నారు. -
మరింత సరళంగా జీఎస్టీ రిటర్నులు
సాక్షి, అమరావతి: జీఎస్టీ రిటర్నుల విధానాన్ని మరింత సరళంగా, సులభలతరం కానుంది. ఈనెల 10న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా చర్చజరగనుంది. రిటర్నుల విధానాన్ని మరింత సరళంగా చేయడం ద్వారా మరింత మందిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను ఇప్పటికే రూపొందించింది. వ్యాపారులు రిటర్నులు దాఖలు చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీఆర్3 స్థానంలో తాత్కాలికంగా జీఎస్టీఆర్3(బీ)ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో వ్యాపారులు ఇన్వాయిస్లు జత చేయనవసరం లేకుండా ఎంత వ్యాపారం చేశారు, ఎంత ఐటీసీ రావాలి అన్న విషయాలు పేర్కొంటే సరిపోయేది. కానీ ఈ విధానంలో వ్యాపారులు మోసం చేయడానికి అవకాశాలు ఉండటంతో పాటు పన్ను వసూళ్లు కూడా భారీగా తగ్గుతున్న విషయంపై కూలకంషంగా చర్చించి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు కమిటీలోని సభ్యుడు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చే విధంగా వచ్చే కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆదాయంలో 21 శాతం వృద్ధి జనవరి నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో 21 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది జనవరి నెలలో జీఎస్టీ రాకముందు రూ.1,286.77 కోట్లుగా ఉన్న ఆదాయం జీఎస్టీ వచ్చిన తర్వాత 20.84 శాతం పెరిగి రూ.1,554 .98 కోట్లకు చేరింది. సగటున నెల ఆదాయం రూ. 1,457 కోట్ల ఆదాయం దాటితే కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం రాదు. ఇప్పటి వరకు రాష్ట్రం నష్టపరిహారం కింద కేవలం రూ. 382 కోట్లు మాత్రమే వచ్చింది. దేశమొత్తం మీద జీఎస్టీ ఆదాయంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని అధికారులు చెపుతున్నారు. -
వేలం పాట గోవిందా?
జమ్మికుంట(హుజూరాబాద్): ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ జమ్మికుంటలో నిబంధనలకు నీళ్లు వదిలారు. పత్తి కొనుగోలు వేలంలో పోటీపడుతున్న వ్యాపారులు చివరి బండి వరకు మాత్రం మద్దతు ధర చెల్లించడం లేదు. మొదటి ఒక్కటి, రెండు వాహనాల్లోని పత్తికి మాత్రమే వేలంలో పాడిన ధర చెల్లిస్తూ..తర్వాత వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిగా ధర నిర్ణయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పత్తి కొనేదిలేదంటూ మొండికేస్తున్నారు. వారి చెప్పిందే ధరగా చెల్లుబాటు అవుతుంది. పేరుకే వేలం! జమ్మికుంట మార్కెట్లో ప్రతి రోజు పత్తి కొనేందుకు వ్యాపారులు పోటీపడి వేలంపాట పాడుతున్నారే తప్ప అన్ని వాహనాల్లోని పత్తికి అదే ధర చెల్లించడం లేదు. ఇదంతా అధికారుల సాక్షిగానే జరుగుతున్నా స్పందించినా పాపానపోవడం లేదు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 184 వాహనాల్లో 1,899 క్వింటాళ్ల లూజ్ పత్తి వచ్చింది. పాలకవర్గం, అధికారుల సమక్షంలో రెండు వాహనాలకే వ్యాపారులు వేలం పాడారు. మొదటి వాహనానికి క్వింటాల్‌కు రూ.4,400 ధర పెట్టిన వ్యాపారులు, రెండో వాహనానికి రూ.4,510 చెల్లించారు. తర్వాత వాహనాలకు మాత్రం వ్యాపారులకు ఎవరికి నచ్చిన ధరలు వారు చెల్లించారు. సేటు చెప్పిందే ధరగా పరిస్థితులు మారిపోయాయి. వేలం అన్ని వాహనాలకు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తే పట్టించుకునే వారు కరువయ్యారు. ఇష్టారీతిన కొనుగోళ్లు మొదటి ఒకట్రెండు వాహనాలకే వేలం పాట పాడుతున్న వ్యాపారులు తర్వాత ఇష్టారీతిన కొనుగోళ్లు చేస్తున్నారు. నాణ్యమైన పత్తికి సైతం క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4,200 చెల్లించారు. గతంలో ప్రతీ వాహనానికి వేలం పాడిన వ్యాపారులు ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊరట: ఆ స్టాక్‌ను మరో మూడు నెలలు అమ్ముకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమల్లోకి వచ్చే కొన్ని రోజుల ముందు వర్తకులు హడావుడిగా తన స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్లతో తమ పాత స్టాక్‌ను అమ్ముడుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మిగిలిపోయే స్టాక్‌కు కొత్త ఎంఆర్పీ రేట్లను ముద్రించి విక్రయించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ప్రభుత్వం కఠిన చర్యలే ఎదుర్కొంటారని వర్తకులను హెచ్చరించింది కూడా. చాలా మంది వర్తకులు వద్ద ఇంకా జీఎస్టీ ముందున్న స్టాక్ మిగిలిపోయే ఉంది. వాటికి కొత్త ఎంఆర్పీలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రీ-జీఎస్టీ స్టాక్‌పై వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రీ-జీఎస్టీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తుది గడువును మూడు నెలల పాటు అంటే డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ గడువు పొడిగింపుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. -
నిషాకూ కల్తీ!
మద్యం బాటిళ్లలో నీళ్లు కలుపుతున్న డిస్టిలరీలు, వ్యాపారులు - మొలాసిస్ ధర పెరగడంతో డిస్టిలరీలపై వ్యయ భారం - భారం తగ్గించుకునేందుకు ఆల్కహాల్ శాతాన్ని తగ్గిస్తున్న వైనం పెగ్గు మీద పెగ్గు కొడితే.. నిషా నింగినంటాలె.. చుక్కలు నేలకు దిగి రావాలె.. కానీ ఒకటి.. రెండు.. మూడు.. నాలుగో పెగ్గు వేసినా ‘కిక్కు’ ఎక్కడం లేదు.. తాగీ తాగీ నాలుక మందమైందా లేక ‘మందు’కు శరీరం పూర్తిగా అలవాటు పడిపోయిందా తెలియక మందు బాబులు జుట్టు పీక్కుంటున్నారు.. కానీ అసలు కారణం మాత్రం మందు ‘పలుచబడి’పోవడమే! ఇటు డిస్టిలరీలు మద్యంలో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి నీళ్లు కలుపుతుండటం... అటు మద్యం వ్యాపారులు బాటిళ్ల నుంచి మద్యం తీసి నీళ్లు కలిపేస్తుండటంతో మందు బాబులకు ‘కిక్కు’ ఎక్కడం లేదు. వ్యాపారులు మీడియం, ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిళ్ల మూతల నుంచి సిరంజి గుచ్చి మద్యాన్ని లాగేస్తున్నారు.. ఆ మేరకు నీటితో, చీప్ లిక్కర్‌తో నింపేస్తున్నారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ పర్యవేక్షణ కొరవడటం, నిఘా తగ్గిపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. మొలాసిస్ దొరకడం లేదని.. డబ్బు మిగిలించుకోవడం కోసం డిస్టిలరీలు మద్యంలో ఆల్కహాల్ శాతం తగ్గించి నీటి శాతం పెంచుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలు లేకపోవటంతో చెరుకు నుంచి ఉత్పత్తయ్యే మొలాసిస్ కొరత ఉంది. దాంతో మద్యం ఉత్పత్తికి డిస్టిలరీలు గ్రెయిన్ మొలాసిస్ వాడుతున్నాయి. చెరుకు మొలాసిస్ ఈఎన్ఏ లీటర్‌కు మార్కెట్లో ధర రూ.35 ఉండగా... గ్రెయిన్ మొలాసిస్ ఈఎన్ఏ లీటర్‌కు రూ.45 నుంచి రూ.48 వరకు ఉంది. గ్రెయిన్ మొలాసిస్ నుంచి మద్యం నాణ్యంగా ఉత్పత్తికాదు. దాంతో వివిధ రకాల ఫ్లేవర్లు, రసాయనాలు కలిపి మద్యాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తారు. ఇదంతా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇలా పెరిగిన ఖర్చును సర్దుబాటు చేసుకునేందుకు డిస్టిలరీల యాజమాన్యాలు మద్యంలో నీటి శాతం పెంచుతున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. లిక్కర్ తయారీలో ఈఎన్ఏ(ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్) వాడతా రు. నిబంధనల ప్రకారం ఇది 42.8 శాతం, మిగతా శాతం నీళ్లుండాలి. కానీ డిస్టిలరీలు నీటిని పెంచి, ఈఎన్ఏను తగ్గిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని డిస్టిలరీలు రోజుకు 10వేల కేసులకుపైగా మద్యం ఉత్పత్తి చేయగలవు. అందులో ఒక శాతం నీళ్లు కలిపినా 5,000 లీటర్ల ఈఎన్ఏ మిగులుతుంది. దీంతో అదనంగా 550 కేసుల మద్యం ఉత్పత్తి అవుతుంది. తద్వారా రూ.3.20 లక్షల అదనపు ఆదాయం సమకూరుతుంది. చాలా ఏళ్ల నుంచి దందా.. వ్యాపారులు మద్యంలో నీళ్లు కలుపుతూ సొమ్ము దండుకుంటున్న దందా చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. డిస్టిలరీలు, వ్యాపారులు మద్యంలో నీళ్లు కలిపి విక్రయించడంపై నాలుగేళ్ల కింద పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దానిపై పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దాంతో అప్పటి సికింద్రాబాద్ ఎక్సైజ్ సీఐ అంజిరెడ్డి (ప్రస్తుతం ఏఈఎస్) తన పరిధిలోని మద్యం దుకాణాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. దాంతో ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్ర్రోకాట్, అశోక విస్కీ బ్రాండ్లలో కల్తీ జరిగినట్లు తేలింది. ఈ మూడు బ్రాండ్లు కూడా హైదరాబాద్ శివార్లలోని ఒకే డిస్టిలరీ సంస్థ నుంచి ఉత్పత్తి అయినట్లు గుర్తించి, నోటీసులు కూడా జారీ చేశారు. అంతకు ముందు సీగ్రామ్ బ్రాండ్లలోనూ నీళ్ల శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. సిరంజి వేసి.. మద్యం గుంజి.. ఇక నెల రోజుల్లో మద్యం దుకాణాల లీజు సమయం ముగుస్తుండటంతో వ్యాపారులు అడ్డగోలు వ్యవహారానికి తెరలేపారు. బాటిళ్ల నుంచి మద్యం తీసి.. నీళ్లు కలిపేసి అమ్ముతున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో బిజీగా ఉండి.. పర్యవేక్షణను వదిలేయడం కూడా వారికి కలసి వచ్చింది. ముఖ్యంగా ప్రీమియం, మధ్యస్థాయి ధర ఉన్న బ్రాండ్ల ఫుల్ బాటిళ్ల నుంచి మద్యాన్ని తీసి.. అంతే మోతాదులో నీళ్లు కలుపుతున్నారు. వాటి మూతల ద్వారా సిరంజిలు గుచ్చి.. ఒక్కో బాటిల్ నుంచి 90 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల దాకా లాగేస్తున్నారు. ఈ మద్యాన్ని ఖాళీ క్వార్టర్ బాటిళ్లలో నింపి సీలు వేసి విక్రయిస్తున్నారు. పలు చోట్ల విడిగా గ్లాసుల్లో పోసి అమ్ముతున్నారు. కొందరు వ్యాపారులు ప్రీమియం బ్రాండ్ల బాటిళ్ల నుంచి మద్యాన్ని తీశాక.. ఆ స్థానంలో చీప్‌లిక్కర్‌ను నింపుతున్నారు. ఒకప్పుడు బార్లకే పరిమితమైన ఈ దందా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా దుకాణాలకు పాకింది. ఈ నీళ్లు కలిపే వ్యవహారమంతా రాత్రికి రాత్రే సాగుతోంది. మద్యం దుకాణం మూసేశాక.. లోపల కొందరు పనివాళ్లను ఉంచి ఉదయం దాకా కల్తీ పని కానిచ్చేస్తున్నారు. -
కొత్త చట్టాలపై అవగాహన అవసరం
ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఫల్గుణకుమార్ రాజమహేంద్రవరంలో వర్తకులకు అవగాహన సదస్సు దానవాయిపేట (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అదాయ పన్ను శాఖలో చేసిన మార్పులు చేర్పులు, ఇతర పన్నులపై వర్తకులందరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇ.ఫల్గుణకుమార్ వర్తకులకు సూచించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వరంలో అదివారం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గల చాంబర్ ఫంక్షన్ హాలులో ఆర్థికక లావాదేవీలు, పన్ను చెల్లింపులపై వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇ.ఫల్గుణకుమార్, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో అర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తకులు తమ వ్యాపార లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు . ఒక సంవత్సరానికి రూ.10 లక్షలు మించిన వ్యాపార లావాదేవీలపై ప్రభుత్వానికి 15 శాతం సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.మూడు లక్షలకు మించి ఎవరైనా నగదు లావాదేవీలను నిర్వహిస్తే ఆదాయపన్ను శాఖ ద్వారా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని లావాదేవీలకు తగిన రశీదులు తప్పనిసరిగా ఏడు సంవత్సరాల పాటు భద్రపరచాలని సూచించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పన్ను చెల్లించడానికి ఏ వర్తకుడికి ఇబ్బంది ఉండదని , ఐతే కొందరు అధికారులు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని వర్తకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అటువంటి అధికారులపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ చట్టాలు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ సమావేశానికి చాంబర్ నగర అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షత వహించగా, ఏపీ ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కన్వీనర్ అశోక్‌కుమార్‌జైన్, జిల్లా అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, క్రైడాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కాకినాడ చాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, చాంబర్ కార్యదర్శి కాలెపు రామచంద్రరావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వలవల దుర్గప్రసాద్(చిన్ని), టి.వీరభద్రరావు, వి.సత్యనారాయణ, కె.లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దుకాణదారులపై ముప్పేట దాడి
ఆకస్మికంగా అధికారుల రాకతో తీరంలో ఉద్రిక్తత 20వ తేదీలోగా దుకాణాలు ఖాళీ చేయాలని ఆదేశాలు ససేమిరా అంటున్న రుషికొండ బీచ్ వర్తకులు సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : రుషికొండ బీచ్‌ను నమ్ముకుని వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న చిల్లర వరక్తలపై వివిధ శాఖల అధికారులు మంగళవారం ముప్పేట దాడి చేశారు. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా కారు పార్కింగ్ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ చిల్లర వర్తకులపై విరుచకుపడ్డారు. ఈ నెల 20లోగా ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఏపీ టూరిజం సంస్థ నేతృత్వంలో జీవీఎంసీ చీఫ్ టౌన్ ప్లానింగ్, జోనల్ కమిషనర్, మెరైన్ పోలీస్, బీచ్ పెట్రోలింగ్ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఇలా మొత్తం 15మందికి పైగా అధికారులు అకస్మాత్తుగా విచ్చేశారు. దీంతో ప్రశాంతంగా వ్యాపారం సాగిస్తున్న వర్తకులు కంగుతిన్నారు. బీచ్‌లో వ్యాపారం చేసుకుంటున్న వారందరికీ న్యాయం చేసే వరకు ఖాళీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. దీంతో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆధునికీకరణలో భాగంగా తరలింపు రుషికొండ తీరంలో పదేళ్లుగా çరుషికిండ, వాడపాలెం మత్స్యకార గ్రామాలకు చెందిన 76మంది గవ్వలు, పాన్‌షాపు, ఫుడ్‌కోర్టులు, మొక్కజొన్న, కొబ్బరి వంటి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పర్యాటక రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రుషికొండ తీరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఏపీ టూరిజం సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే రూ.3.44కోట్లు వ్యయంతో ఆధునికీకరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా మెరైన్ వాచ్ టవర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కారు పార్కింగ్‌కు కేటాయించారు. అదే స్థలంలో చిల్లర దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ తీరం చిల్లర వర్తకుల జీవన స్థితిగతులపై ఏపీ టూరిజం సంస్థ 2014లో సర్వే చేపట్టింది. ఆ సర్వేలో 30 మంది దుకాణాలు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం అటవీ సామూహిక వనం పక్కన 25 షాపులు, విలేజ్ బీచ్ హట్స్ పక్కన మరో 30 షాపులు మొత్తం 55 దుకాణాలు కొత్తగా నిర్మించారు. అయితే సర్వేలో గుర్తించిన 30 మందికి మాత్రమే దుకాణాలు కేటాయిస్తామని, మిగిలినవి అద్దెలకు ఇచ్చుకుంటామని అధికారులు చెప్పడంతో వర్తకులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఈ దుకాణాలు నిర్మిస్తున్నట్టు చిల్లర వర్తకులకు సమాచారం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జేఏసీ ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం సంస్థ ప్రాంతీయ సంచాలకులు శ్రీరాములు నాయుడు జిల్లా కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్‌ను ఆశ్రయించి ఇక్కడి వివాదాన్ని వివరించారు. దీనిపై కలెక్టర్ ఓ జాయింట్ యాక్షన్ కమిటీని నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, మెరైన్ పోలీస్, మధురవాడ జోనల్ కమిషనర్, ఏపీ టూరిజం సంస్థ అధికార యంత్రాంగం దుకాణాలను ఖాళీ చేయించడానికి మంగళవారం వచ్చారు. వచ్చీ రాగానే దుకాణాలు ఖాళీ చేయాలని వర్తకులను బెదరించారు. దీంతో వారంతా ఏకమై ఆకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే ఎలా చేస్తాం... ఇక్కడ 76 మంది వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాం. మాకందరికీ సరిపడా దుకాణాలు కేటాయిస్తేనే ఖాళీ చేస్తామని, లేకుంటే కదలమని తేల్చి చెప్పారు. కొద్దిసేపు అధికారుల ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు. దీనిపై టూరిజం రీజినల్ సంచాలకులు శ్రీరాములు నాయుడు, తదితర అధికారులు ఎంత సర్దిచెప్పినా వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ నెల 20వ తేదీలోగా దుకాణాలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పి.ఎం.సత్యవేణి, ఏపీ టూరిజం జిల్లా అధికారి కె.జ్ఞానవేణి, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ చీఫ్ సురేష్, ఇన్చార్జి తహసీల్దార్ లాలం సుధాకర్‌నాయుడు, మెరైన్ పోలీస్ సీఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
అయ్య బాబోయ్
⇒ జిల్లాలో చెలరేగిపోతున్న ‘బిగ్‌బాస్’ ⇒ ‘చినబాబు’ ఆశీస్సులే వెన్ను దన్ను ⇒ తీవ్ర వేధింపులతో అధికారులు బెంబేలు ⇒ జిల్లాలో ఉద్యోగమంటేనే గుండె గుభేల్ ⇒ బడా బాబులతో మిలాఖత్ ⇒ దేవాలయాల కూల్చివేత సూత్రధారి ఆయన జిల్లా బిగ్‌బాస్.. అధికార టీడీపీ ‘చినబాబు’ ఆశీస్సులతో జిల్లాలో 2015లో బాధ్యతలు స్వీకరించారు. రాజధాని ప్రాంతంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం చినబాబు ఆయన్ను జిల్లాలో నియమించుకున్నారు. ఇంకేముందీ!. ఆ ఉన్నతాధికారి అడ్డగోలు అవినీతికి అడ్డే లేకుండాపోతోంది. జిల్లాలో అధికార యంత్రాంగాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న బిగ్‌బాస్ వైఖరితో ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆయన తన అనుకూల అధికారులతో ఓ కోటరీ ఏర్పాటు చేసుకుని మరీ చెలరేగిపోతున్నారు. ఆయనకు మామూళ్లు ఇచ్చుకోలేక కొందరు, ఆయన చెప్పినట్లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేక మరికొందరు మనో వేదనకు గురవుతున్నారు. సత్తా ఉన్న వాళ్లు జిల్లా వదిలిపోతుండగా, ఆ పని చేయలేని ఉద్యోగులు దినమొక గండంగా నెట్టుకొస్తున్నారు. జిల్లా చరిత్రలో ఇంతటి వివాదాస్పద ఉన్నతాధికారిని తాము చూడలేదని ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్న ఆయన వైఖరికి కొన్ని మచ్చుతునకలు ఇవిగో... వేధింపులే..వేధింపులు ► 2015లో హౌసింగ్ పీడీగా పనిచేస్తున్న సీహెచ్ ప్రతాపరావుపై జిల్లా ఉన్నతాధికారి తన ప్రతాపం చూపించారు. దాంతో పీడీకి గుండెపోటు వచ్చింది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. కొన్ని నెలలపాటు ఆయన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ► 2015లో అప్పటి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ. కృష్ణారావు జిల్లా ఉన్నతాధికారి వేధింపులు తాళలేక రెండునెలలపాటు సెలవుపై వెళ్లిపోయారు. ► జాయింట్ కలెక్టర్–2గా ఉన్న ఒంగోలు శేషయ్యను ఆయన వయసు చూసైనాసరే జిల్లా ఉన్నతాధికారి కనీసం గౌరవం ఇవ్వలేదు. తీవ్రంగా వేధించడంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాల్సి వచ్చింది. ► 2016లో వ్యవసాయశాఖ జేడీగా ఉన్న వి. నరసింహారావుపై జిల్లా ఉన్నతాధికారి తరచూ విరుచుకుపడేవారు. దాంతో ఆయన మనస్తాపానికిగురై బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ► ఇటీవల డ్వామా పీడీ మాధవీలత ఉన్నతాధికారి ఒత్తిళ్లు భరించలేక మాతృశాఖ అయిన బీసీ సంక్షేమ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ► జిల్లా ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కృష్ణమోహన్‌ను గత ఏడాది ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారిగా ప్రభుత్వం నియమించింది. కానీ ఉన్నతాధికారి ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా రెండు నెలలు తిప్పించుకున్నారు. అలా చేస్తే ‘మామూళ్ల’ విషయం తేలుస్తారని ఉన్నతాధికారి భావించినట్లు స్పష్టమవుతోంది. చేసేది లేక ఆయన ఆడిట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ► పట్టిసీమ పనుల సందర్భంగా వివిధ శాఖల అధికారుల్ని అర్ధరాత్రి వరకు పనులు చేయమని జిల్లా ఉన్నతా«ధికారి తీవ్ర ఒత్తిడి చేశారు. రెవెన్యూ ఉద్యోగులను అసభ్యంగా దూషించడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ► ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సంబంధించి కాంప్రహెన్సివ్ పెన్షన్ మేనేజ్మెంట్ విధానంపై కూడా జిల్లా ఉన్నతాధికారి ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. ► జిల్లా ట్రెజరీలో ఉద్యోగులకు ఐడీ కేటాయింపు 15 రోజుల్లో పూర్తి కావాలని డెడ్‌లైన్ విధించారు. ఆ ప్రక్రియ అంత త్వరగా జరగదని చెప్పినా వినిపించుకోకుండా ఏకంగా ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేయించారు. దీంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. క్వారీ అనుమతుల్లో రూ. కోట్ల మామూళ్లు ..! పుష్కర పనుల ముసుగులో జిల్లా ఉన్నతాధికారి యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. విజయవాడ శివారులోని క్వారీలకు ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారు. ఘాట్ పనులు త్వరగా చేయాలనే నెపంతో కొందరు బినామీ కాంట్రాక్టర్లతో క్వారీలను కొల్లగొట్టారు. దాదాపు రెండు నెలలపాటు క్వారీలను గుల్ల చేసి కోట్ల రూపాయలను జేబులో వేసుకున్నారని గనుల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దేవాలయాల కూల్చివేత సూత్రధారి .. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పుష్కరాల సందర్భంగా జిల్లా ఉన్నతాధికారి హిందువుల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీశారు. విజయవాడలో దాదాపు 60 దేవాలయాలను దగ్గరుండి మరీ కూల్చివేయించారు. భక్తులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపినప్పటికీ జిల్లా ఉన్నతాధికారి ఏమాత్రం వెనక్కితగ్గకుండా దేవుళ్ల విగ్రహాలపట్ల కూడా మహాపరాధం చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బడాబాబులకు పెద్దపీట... పేద వ్యాపారులపై ప్రతాపం ... విజయవాడలో ఫుడ్‌కోర్టు వివాదానికి జిల్లా ఉన్నతాధికారే ప్రధాన కారణం. ఆయన నగరం లోని కొన్ని పెద్ద రెస్టారెంట్ల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారు. బడాబాబుల వ్యాపార ప్రయోజనాల కోసం ఫుడ్‌కోర్టులను తొలగించాలని ఆయన ఆదేశించారు. కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ ఫుడ్‌కోర్టులను అర్ధరాత్రి బలవంతంగా తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వీరపాండియన్ ఏకంగా తినుబండారాల్లో ఫినాయిల్ పోయడం వివాదాస్పదమైంది. వ్యాపారులు తీవ్ర ఆందోళన చేయడంతో తాత్కాలికంగా వెనక్కితగ్గారు. -
రైతుల ముసుగులోని వ్యాపారులపై కేసులు
⇒ కొనుగోలు కేంద్రాల్లో కందులు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని హరీశ్ ఆదేశం ⇒మరో 5 లక్షల క్వింటాళ్ల కందుల కొనుగోలుకు నాఫెడ్ అంగీకరించినట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో ఎవరైనా వ్యాపారులు ప్రభుత్వ ఏజెన్సీలకు కనీసమద్దతు ధర(ఎంఎస్పీ)కు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీ లు చేసి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. కందుల కొను గోళ్లపై మంత్రి బుధవారం ఇక్కడ మార్కె టింగ్ ఎం.డి. జగన్మోహన్, ఎఫ్‌సీఐ, నాఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 93 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.17 లక్షల మంది రైతుల నుంచి రూ.628 కోట్ల విలువైన 12.64 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా 14 లక్షల క్వింటాళ్లకు మాత్రమే అనుమతించినందున ఇంకా రైతుల వద్ద కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో అదనంగా నాఫెడ్ ద్వారా 5 లక్షల క్వింటాళ్లు, ఎఫ్‌సీఐ ద్వారా 2.5 లక్షల క్వింటాళ్ల కొను గోలుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్, నాఫెడ్ ఎం.డి. సంజయ్ కుమార్ చందాను కోరినట్లు మంత్రి తెలి పారు. ఈ మేరకు నాఫెడ్ ద్వారా 5 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతి లభించి నట్లు వివరించారు. కందుల కొనుగోలులో ఎదురవుతున్న ఖాళీ బస్తాల సమస్యను పరిష్కరించాలని కోరగా రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని నాఫెడ్ ఎండీ హామీ ఇచ్చారని హరీశ్ వెల్లడించారు. -
మార్కెట్ యార్డులో మాయాజాలం
డీపీసీలో తక్కువ ధర కోట్ చేసిన వ్యాపారులు పంట విక్రయించబోమన్న అన్నదాతలు అసిస్టెంట్ కలెక్టర్ వాహనం అడ్డగింత కలెక్టర్ చెంతకు చేరిన వివాదం అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన వ్యాపారులు రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకారం సుభాష్‌నగర్: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మాయజాలం కొనసాగుతోంది. నేరుగా కొనుగోలు కేంద్రం (డీపీసీ)లో కొనుగోలుదారులు నాణ్యమైన పంటకు తక్కువ ధర కోట్ చేయడంపై అన్నదాతలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ ఏజెంట్ల వద్ద మామూలు సరుకుకు ఎక్కువ ధర పలకడం, డీపీసీలో మేలైన సరుకుకు తక్కువ ధర కోట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరుకు అమ్మబోమంటూ భీష్మించారు. ఈ విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ద్వారా తెలుసుకున్న కలెక్టర్ కొనుగోలుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన వ్యాపారులు తాము కోట్ చేసిన ధర కంటే రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 14 మంది రైతులు సోమవారం దాదాపు 200 పసుపు బస్తాలను డైరెక్ట్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కమీషన్ ఏజెంట్లు.. డీపీసీలోకి వచ్చిన పసుపునకు ధర తక్కువగా కోట్ చేయాలని కొనుగోలుదారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో, బయట మామూలు పసుపునకే మంచి రేటు పలగా, డీపీసీలో నాణ్యమైన పంటకు రూ.6,600 పలకడంపై రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య దృష్టికి తీసుకెళ్లి, ఇదే ధరకైతే అమ్మేది లేదని రైతులు భీష్మించారు. దీంతో సంగయ్య అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు సమాచారమివ్వగా, ఆయన వచ్చి తక్కువ ధర కోట్ చేసిన దుకాణం వద్దకు వెళ్లి పసుపును పరిశీలించారు. ఎంతో కష్టపడి పండిస్తున్నామని, తమ శ్రమను దోచుకోవడంపై రైతులు ఆయనతో మొర పెట్టుకున్నారు. లైసెన్సులు రద్దు చేస్తాం.. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, వారిని మోసం చేస్తే సహించబోమని అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఖరీదుదారులను హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖరీదుదారులతో ఆయన మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు కుట్ర పన్నుతున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల లైసెన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. కొనుగోలుదారులందరూ డీపీసీకి వచ్చి ధరలు కోట్ చేయాలని ఆదేశించారు. ధర ఎందుకు తక్కువగా కోట్ చేశారని కొనుగోలుదారులను ప్రశ్నించగా, డబ్బులు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, నాణ్యత లేదని చెప్పడంతో అసిస్టెంట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రకాల పసుపును తీసుకొచ్చి వారికి చూయించండంతో వారు నోరెళ్లబెట్టారు. డీఎంవో రియాజ్, అసిస్టెంట్ సెక్రటరీలు నరేందర్, వజీరుద్దీన్, డీపీసీ ఇన్చార్జీలు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం, మార్కెట్లో జరుగుతున్న మోసాన్ని గ్రహించిన అసిస్టెంట్ కలెక్టర్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన తర్వాతే వెళ్లాలని, లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. దిగొచ్చిన వ్యాపారులు తాజాగా మార్కెట్లో జరిగిన మోసాలపై అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్ కలెక్టర్ యోగితారాణాకు వివరించారు. ఎలాగైనా రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెట్ అధికారులను ఆదేశించారు. ధరలో ఇంత వ్యత్యాసం ఉంటే మీరేం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారు హుటాహుటీన మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకొని ఖరీదుదారులను పిలిపించారు. కమీషన్ ఏజెంట్ల వద్ద ఉన్న పసుపునకు ధర కోట్ చేసి, డీపీసీలో కోట్ చేయని ఖరీదుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీసీకి వచ్చిన పసుపులో దాదాపు 120 క్వింటాళ్లకు రూ.7800 ధర చెల్లించి తీసుకోవాలని ఖరీదుదారులను ఆదేశించారు. డీపీసీలో కోట్ చేయని ఖరీదుదారులకు నోటీసులు జారీ చేస్తామని సెక్రటరీ సంగయ్య తెలిపారు. త్వరలో కలెక్టర్‌తో వ్యాపారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
దోపిడీ రాజ్యం
భైంసా :ఎలాంటి పరిస్థితులైనా వ్యాపారులకే కలిసి వస్తున్నాయి. అవకాశాలను తమవైపు తిప్పుకుని డబ్బులను సంపాదించడంలో ఆరితేరిన వారు భైంసా మార్కెట్లో తమదైన శైలిలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ రోజు బ్యాంకు గడప తొక్కని వారికి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చిన సమయంలోనే ఈ పరిస్థితి వచ్చింది. దీంతో అమాయక రైతులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు అవసరం ఉన్న నగదును ఇవ్వాలంటే దానికి వ్యాపారులు అడత్(కమీషన్ ) ధరను మరింతగా పెంచేశారు. కూలీలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రైతులు చేసేది లేక వ్యాపారులు ఎలాచెబితే అలా ఒప్పుకుంటున్నారు. పలువురు వ్యాపారులు ఎంచక్కా చేతి నిండా నగదు ఉంచుకుని ప్రతీ రోజు మార్కెట్‌కు వెళ్లి డబ్బు అవసరం ఉన్న రైతులతో బేరం కుదుర్చుకుని తమ వ్యాపారం కానిచ్చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచే... రైతులకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా ఇప్పటి వరకు అందులో లావాదేవీలు జరుపలేదు. ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు లేవు. నిరక్ష్యరాస్యులైన రైతులకు బ్యాంకు అధికారులు చెక్కులు కూడా ఇవ్వలేదు. సగానికి పైగా రైతులకు బ్యాంకు ఖాతాలే లేవు. నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ రైతులకు ఇప్పటి వరకు ఏ పంట అమ్మినా చెక్కు తీసుకున్న పరిస్థితులు కూడా తలెత్తలేదు. అలాంటి ఈ ఏడాది సీజన్ ప్రారంభంతోనే నగదు కష్టాలు ఆరంభమయ్యాయి. భైంసా మార్కెట్లో సోయా, కందులు, మినుము, పెసర, పత్తి పంటలు విక్రయానికి తీసుకువెళ్తున్నారు. సీజను ప్రారంభం నుంచే నగదు ఇవ్వమని వ్యాపారులు చెప్పేస్తున్నారు. అమ్మిన పంటకు చెక్కులు ఇచ్చేస్తామని చెప్పడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలు లేక... పంట పొలంలో కూలీలతో పని చేయించి వారికి ఇచ్చేందుకు కూడా రైతుల చేతిలో చిల్లిగవ్వ ఉండడంలేదు. ఏడాదిలో ఒక్కసారే పంట అమ్మకంతో డబ్బులురైతుల చేతుల్లోకి వస్తాయి. ఇలాంటి తరుణంలో వచ్చే డబ్బులు కూడా చెక్కుల రూపంలో అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఖాతాలు ఉన్న అధికారులు చెక్కు ట్రాన్స్ ఫర్ చేసేందుకు పక్షం రోజులు చేస్తున్నారు. రైతులు చెక్కులను పట్టుకుని బ్యాంకుల్లో నిరీక్షిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులైతే ప్రతీ రోజు దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు. కొత్తగా ఖాతాలు ఇవ్వక చెక్కులు వేసుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సొమ్ము చేసుకుంటూ... బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు నగదు కావాలని వ్యాపారుల వద్ద ప్రాధేయ పడుతున్నారు. ఈ పరిస్థితిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాగైనా రైతులకు డబ్బు అవసరం రావడంతో పంట అమ్మితే వచ్చే డబ్బులపై ఒక్కసారిగా అడత్(కమీషన్ ) పెంచేశారు. కొంతమంది ఇదే వ్యాపారాన్ని చేస్తున్నారు. నూటికి ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అడత్ రూపంలో కట్ చేసుకుని రైతులకు డబ్బులు ఇస్తున్నారు. క్వింటాలు పత్తి అమ్మితే రైతు చేతికి రూ.5 వేలు అందుతాయి. నగదు కావాలంటే రైతు వ్యాపారుల వద్ద రూ.300 నుంచి రూ.350 వరకు అడత్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అడత్ రూపంలో డబ్బులు ఇచ్చిన వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన పంటను తమ పేరిట విక్రయించి చెక్కులు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో తిరగలేక చెక్కులు ఇచ్చిన డబ్బులు సమయానికి అందక రైతులు వచ్చినకాడికి సరేనని వ్యాపారులకే ఎక్కువ మొత్తం అడత్కు పంటను విక్రయించి నగదు పట్టుకువెళ్తున్నారు. ఈ వ్యాపారం అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోవడంలేదు. రైతులు వెళ్తే కసురుకునే బ్యాంకు సిబ్బంది వ్యాపారులకైతే అడిగినంత డబ్బులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దృష్టి సారిస్తే... ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రైతులు పడుతున్న నగదు ఇక్కట్లను తీర్చాలి. ఆరుగాలం శ్రమించి వచ్చిన పంటను అమ్ముకునే సమయంలో తలెత్తుతున్న పరిణామాలతో రైతన్నకు అండగా నిలబడాలి. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది రైతులకు పంట అమ్మే సమయంలో తలెత్తుతున్న పరిస్థితులను చక్కదిద్దాలి. బ్యాంకుల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. పట్టాపాసు పుస్తకాలతో వెళ్తున్న బ్యాంకు ఖాతాలు లేని రైతులకు తక్షణమే ఖాతాలు ఇచ్చేయాలి. పంట అమ్మిన రోజునే చెక్కు ఇస్తే అలాంటి రైతులకు కొంతమేర నగదు అదే రోజున ఇప్పించాలి. ఇలా చేస్తే రైతులు ఇంటికి వెళ్లి పంట కోసం కూలీలకు కొంత మేర నగదును ఇవ్వగలుగుతారు. అధికారులు రైతుల పక్షాన నిలబడి వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో రైతుల పేరిట అధిక మొత్తంలో జరిగిన పంట లావాదేవీలపైన దృష్టి సారించాలి. అలాంటి ఖాతాలపైన దృష్టిపెట్టి పెద్ద మొత్తంలోనే నగదు కోసం అడత్ రూపంలో రైతులు నష్టపోయిన డబ్బులను ఇప్పించాలి. లేనిపక్షంలో ఈ ఏడాది కూడా రైతులు నగదు లావాదేవీలు లేక పంట అమ్మిన పూర్తిస్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. -
బస్టాండ్‌లో బోణీలు లేవు..
• వ్యాపారాలు ఢమాల్ • నెల వారీ అద్దె కట్టలేని స్థితిలో దుకాణ దారులు • పండుగ సీజన్లోనూ పుంజుకోని కొనుగోళ్లు సాక్షి, అమరావతి బ్యూరో : పండుగ సీజన్లో కళకళలాడాల్సిన వ్యాపారులు వెలవెలబోతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. నోట్ల కష్టాలతో ప్రయాణాలు తగ్గిపోయారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వ్యాపారాలు పడిపోయాయి. దుకాణాదారులు నెలవారీ అద్దెలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. పండుగ సీజన్లోనూ.. సంక్రాంతి సీజన్ ప్రారంభమైనా బస్టాండ్ సందడి కనిపించడం లేదు. ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో నిత్యం 2900 పైగా బస్సులు ద్వారా సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుం టారు. పెద్ద నోట్ల రద్దుతో ఆ సంఖ్య సుమారు 30 వేలకు తగ్గిందని ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు. సహజంగా పండుగ సీజన్లో ప్రయాణికులు సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా వ్యాపారాలకు అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది పండుగ కళ కనిపించడం లేదు. 126 దుకాణాల్లో.. ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో మొత్తం 126 దుకాణాలు ఉన్నాయి. నెలవారీ రూ.10 వేలు చెల్లించే షాపు నుంచి రూ.10 లక్షలు చెల్లించే షాపులున్నాయి. ఆయా షాపుల నుంచి నెలకు సుమారు రూ.7 కోట్ల రుపాయల వరకు అద్దెలు రూపంలో ఆర్టీసీ ఖజానాకు జమ అవుతోంది. 126 షాపులకు గాను అద్దెలు చెల్లించలేక 11 స్టాల్స్‌ను మూసివేశారు. మరో 11 షాపుల వారు రెండు నెలలుగా అద్దె చెల్లించలేక బకాయి పడ్డారు. నాలుగు షాపుల వారు మూడు నెలల పాటు అద్దె బకాయిలున్నారు. మూడు నెలలు అద్దె చెల్లించకుంటే షాపుల అగ్రిమెంట్ రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ఆదుకునే వారు లేరని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వినోదానికి చిల్లే.. ఆర్టీసీలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టి నిర్వహిస్తున్న వై స్కీన్ సినిమా హాళ్లల్లో ప్రేక్షకులు లేక డిస్ట్రీబ్యూటర్లు నష్టాల బారిన పడుతున్నారు. బేరాలు లేక ఇబ్బంది నోట్ల రద్దు తర్వాత బస్టాండ్‌లో పరిస్థితి మారిపోయింది. ఆదాయం వస్తేనే ఆర్టీసీకి అద్దె కట్టగలను. ప్రయాణికులు అవసరమైతే తప్ప ఖర్చు చేయడం లేదు. దీంతో మా వ్యాపారాలు పడిపోయాయి. బేరాలు లేక ఇబ్బందిపడుతున్నా. బేరాలు ఉన్నా లేకపోయినా సిబ్బందికి జీతాలు, ఆర్టీసీకి అద్దె, విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది. –ప్రసాద్, స్టాల్ నిర్వాహకుడు, విజయవాడ బస్‌స్టేషన్ అప్పుల ఊబిలో పడిపోతున్నాం.. బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. మా వ్యాపారాలు పడిపోతున్నాయి. మాకు ఖర్చులు మాత్రం తగ్గలేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే అప్పులు చేసి వ్యాపారాలు పెట్టాం. మరింత అప్పుల ఊబిలో పడిపోతున్నాం. బస్టాండ్‌లోని వ్యాపారాల పరిస్థితి అధ్వానంగా ఉంది. –అశోక్ స్టాల్ నిర్వాహకులు, బస్‌స్టేషన్, విజయవాడ -
బిచ్చమెత్తుకుంటూ వ్యాపారుల నిరసన
ముజఫర్‌నగర్: నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు నగదు చెల్లింపులపైనే ఆధారపడిన వ్యాపారాలు ఒక్కసారిగా కుంటుపడటంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని వ్యాపారులు నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ గురువారం బిచ్చమెత్తుకుంటూ నిరసన తెలిపారు. స్థానిక ఉద్యోగ వ్యాపార్ సంఘటన్ ఆధ్వర్యంలో భారీగా వర్తకులు గిన్నెలు పట్టుకొని శివ చౌక్‌లో రోడ్డుపై అడుక్కుంటూ నిరసన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు మూలంగా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయని అందుకే ఇలా నిరసన తెలుపుతున్నామని సంఘం ఉపాధ్యక్షుడు గోపాల్ మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ వారు తమ నిరసనను తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పలు చోట్ల బ్యాంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలక్నొన్నాయి. -
వ్యాపారుల్లో నోటీసులదడ
సిక్కిం: ‘‘రూ.2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా... సక్రమమైతే వారికి ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి నోటీసులు కానీ వేధింపులు కానీ ఉండవు. నిరభ్యంతరంగా మీ డబ్బును ఖాతాలో జమ చేసుకోవచ్చు’’..ఇదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రోజున స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. కానీ, వాస్తవానికి జరుగుతున్న సినిమా వేరు. సిక్కిం గ్యాంగ్‌టక్‌లోని డెన్‌జోంగ్ సినిమా రోడ్‌లోని సీతారాం ఎంటర్ప్రైజెస్ ఈనెల 13న గ్యాంగ్‌టక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.4.51 లక్షలు డిపాజిట్ చేసింది. దీంతో ఆ సంస్థకు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులందారుు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో ‘పెద్ద’ల కంటికి కునుకులేకుండా చేసిన కేంద్రం.. తాజాగా మరింత భయపెట్టిస్తోంది. బ్యాంక్ ఖాతాలో ఎంతైనా డిపాజిట్ చేసినా ఎలాంటి దిగులు వద్దన్న ప్రధాని, ఆర్థిక మంత్రి మాటలతో హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్న వారికి.. ఇప్పుడు రూ.2.5 లక్షల కంటే చిల్లిగవ్వ ఎక్కువ డిపాజిట్ చేస్తే నోటీసులు తప్పవన్న భయాలు మొదలయ్యారుు. ఈ నేపథ్యంలో సీతారాం ఎంటర్‌ప్రెజైస్ నోటీసుల వ్యవహారంలో నిజానిజాలను తెలుసుకునేందుకు ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నించారు. సీతారాం ఎంటర్ప్రైజెస్ ఉందా?: నోటీసుల్లో పేర్కొన్నట్టు గ్యాంగ్‌టక్‌లో అసలు సీతారాం ఎంటర్ప్రైజెస్ లేదని కొందరి వాదన. చుట్టుపక్కల వ్యాపారుల్ని సంప్రదించగా.. సీతారాం ఎంటర్ప్రైజెస్ ఆ భవనంలోనే ఉన్నా దానికి తాళం వేసినట్లు తెలిసింది. చుట్టుపక్కల వారిని సంప్రదించి సంస్థ యజమాని ఫోన్ నంబర్ సంపాదించి.. మాట్లాడే ప్రయత్నం చేసింది సాక్షి.. ఆ ప్రయత్నాలూ ఫలించలేదు. సీతారాం ఎంటర్ప్రైజెస్ సంగతి ఎలా ఉన్నా గ్యాంగ్‌టక్‌లో మార్కెట్ పరంగా లాల్మార్కెట్, ఎంజీ రోడ్లు ఆయువు పట్టుల్లాంటివి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఇక్కడికొచ్చి వ్యాపారం చేస్తుంటారు. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా వ్యాపారం పడిపోరుుందని స్థానిక వ్యాపారులు చెప్పారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో వ్యాపారం సాగించొచ్చు కదా! అని సూచించగా.. తమ దగ్గర క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకునేందుకు సదుపాయాలూ లేవని వెల్ల డించారు. కొద్ది మంది వ్యాపారులు కార్డు ద్వారా లావాదేవీలు జరపాలంటే వెనకాడుతున్నారు. కార్డులకు కూడా లిమిట్ పెట్టుకొని వ్యాపారం చేయడమే అందుకు కారణం. సీతారాం ఎంటర్ప్రైజెస్ నోటీసుల విషయాన్ని స్థానిక వ్యాపారుల వద్ద ప్రస్తావించగా.. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, వేరేవారి సంగతి తెలియదని చెప్పారు. నోటీసులొస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా ‘‘మేం వ్యాపారులం. నోట్లు రద్దు అనంతరం రెండు రోజులు పాత నోట్లు తీసుకున్నాం.. ఆ నోట్లనే బ్యాంకులో డిపాజిట్ చేశాం’ అని చెప్పారు. మొత్తంమ్మీద సీతారాం ఎంటర్ప్రైజెస్ వ్యవహారం వాస్తవమే అరుునా ఆ ప్రాంతంలోని ఇతర వ్యాపారుల్లో మాత్రం భయం నెలకొంది. నోటీసులొస్తే పన్ను కట్టాల్సిందేనా? నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందేనా? అంటే అలాంటిదేంలేదన్నది ఆదాయ పన్ను శాఖ అధికారుల సమాధానం. రూ.2.5 లక్షల లోపు డిపాజిట్ చేస్తే నోటీసులు రావనుకోవటం కూడా పొరపాటే. రూ.2.5 లక్షలు, ఆపై ఎంతైనా సరే డిపాజిట్ చేసుకునే వీలుంది. ఆ అదాయానికి సరైన లెక్కలు చూపాలి. సక్రమ ఆదాయమైతే ఎలాంటి భయాలు అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. - సిక్కిం నుంచి మంథా రమణమూర్తి -
బేరాల్లేవ్!
గణనీయంగా పడిపోయిన మార్కెట్ దుకాణాలు తెరిచినా ఉపయోగం లేదంటున్న బంగారం వ్యాపారులు పాడైపోతున్న పండ్లు, కూరగాయలు కిరాణ, వస్త్ర దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి హన్మకొండ : పెద్ద నోట్ల రద్దుతో ఢిల్లీ నుంచి గల్లీస్థారుు వరకు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడి లావాదేవీలు గణనీయంగా పడిపోయారుు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట డివిజన్లతో పాటు పాటు మండలాల్లో వ్యాపార లావాదేవీలు 20నుంచి 30శాతానికి పడిపోగా వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రజలు, రైతులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు, రబీకి రైతులు సన్నధ్ధమవుతున్న నేపథ్యంలో గగ్గోలు పెడుతున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు రాగా అడ్తిదారులు చెక్కులు ఇస్తుండడంతో తీసుకునేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సినిమా థియేటర్లలో టికెట్ల అమ్మకం ఐదోవంతుకు పడిపోరుుంది. పరకాల మార్కెట్లో వ్యాపారం సున్నా స్థారుుకి చేరుకుంది. చిరువ్యాపారులు, తోపుడుబండ్ల వారు వ్యాపారం లేక దిగాలుగా ఉన్నారు. పాత నోట్లు తీసుకోలేక బంగారం వ్యాపారులు దుకాణాలు పూర్తిస్థారుులో తెరవడంలేదు. కిరాణ దుకాణాల్లో వ్యాపారం 20శాతానికి పడిపోగా, వస్త్ర దుకాణాల్లో రోజుకు రూ.15వేలు నడిచే పరకాల, నర్సంపేటల్లో రూ.1500కు మించి నడవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు చోరీలు చోటుచేసుకుంటున్నారుు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో కిరాణా దుకాణంలో సుమారు రూ.50వేల విలువైన రీచార్జి కూపన్లు, సిగరెట్లు చోరీకి గురయ్యారుు. ఐరన్ దుకాణంలో రూ.60వేల నగదు చోరీకి గురైంది. -
ఢిల్లీ గల్లీలో రేపు కేజ్రీవాల్ ఫైట్
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గురువారం వ్యాపారులు, శ్రామికులు, రైతులతో ఆజాద్ పూర్ మండిలో ఉదయం 11గంటలకు బహిరంగ సమావేశం అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రజానీకమంతా రేపు ఆ సమావేశానికి హాజరవుతారని కేజ్రీవాల్ ట్విట్టర్ లో తెలిపాడు. అంతకుముందు రోజు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా సూచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఒక తీర్మానం ఇప్పటికే చేశారు కూడా. మరోపక్క, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జట్టు ఏర్పాటుచేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో శివసేన పార్టీ కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో తాను నేరుగా పాల్గొనని, మద్దతు మాత్రం ఇస్తానని కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు. -
మద్యం వ్యాపారుల నయా ట్రెండ్
మందుబాబులకు కాంబో సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో గిరాకీ తగ్గిన మద్యం వ్యాపారులు సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. రూ.500, వెయ్యి నోటుతో మద్యం దుకాణాలకు వస్తున్న వారిని ఆకర్షించేందుకు సరికొత్త కాంబో ఆఫర్‌ను అందిస్తున్నారు. ఉదాహరణకు రూ.500 నోటుతో వచ్చేవారికి అరసీసా ప్రీమియం బ్రాండు మందు (375ఎంఎల్), ఒక లీటరు వాటర్ బాటిల్, మరో లీటరు సోడా అందిస్తుండటం గమనార్హం. ఇక రూ.వెయ్యి నోటుతో వచ్చినవారికీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. వీరికి ఫుల్బాటిల్తోపాటు రెండు లీటర్ల నీళ్ల బాటిల్, ఒక లీటరు సోడా, తినేందుకు స్నాక్స్ చేతిలో పెట్టడం గమనార్హం. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, 570 వరకు బార్లున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వీటికి గిరాకీ ఇటీవల సుమారు 50 శాతం మేర పడిపోరుుంది. పలు దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇక దినసరి కూలీలు, చిరుద్యోగులు కొనుగోలు చేసే చీప్‌లిక్కర్ గిరాకీ అమాంతం పడిపోయినట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. -
పెద్ద నోట్లు.. జనం పాట్లు
జిల్లాలో స్తంభించిన వ్యాపార లావాదేవీలు రూ.500, 1000 నోట్లు తీసుకోని వ్యాపారులు {పయాణికులు, రోగులకు నానా ఇబ్బందులు రంగంలోకి దిగిన దళారులు తిరుపతి: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజానీకాన్ని పరుగులు తీరుుస్తోంది. జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ధనిక, వ్యాపార, ఉద్యోగ వర్గాల జనమంతా బుధవారం వివిధ రకాల ఇక్కట్లను ఎదుర్కొన్నారు. జిల్లా అంతటా ముఖ్యమైన వ్యాపార లా వాదేవీలు 50 శాతం పైగా స్తంభిం చారుు. సినిమా హాళ్లు, హోటళ్లు, చికెన్, మటన్ సెంటర్లు, చిల్లర దుకాణాలు, సూపర్ మార్కెట్లు వెలవెలబోయారుు. వైన్‌షాపులు, పెట్రోలు బంకులు కిటకిటలాడినా చిల్లర సమస్య జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది. చాలా పట్టణా ల్లో దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారానికి తెరలేపారు. రూ.500కి రూ.400, రూ.1000కి రూ.800 చొప్పున చెల్లింపులు జరి పారు. పెద్ద నోట్లను ఏదో విధంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకుంటామనే భరోసా ఉన్న వ్యాపారు లు, కమీషన్ ఏజెంట్లు, కుదువ వ్యాపారులు నోట్లు తీసుకున్నారు. పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, నారాయణవనం, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురంలో బుధవారం భక్తుల తాకిడి తగ్గింది. నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నో రద్దరుున నోట్లను తీసుకునేందుకు వ్యాపారాలు ససేమిరా అన్నారు. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాలతో పాటు పుణ్యక్షేత్రాలైన తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిల్లోని పూజా సామగ్రి విక్రేతలు కొనుగోలుదారుల నుంచి రూ.500, 1000 నోట్లను తీసుకోలేదు. చిల్లర లేదని కొందరు, చెల్లని నోట్లు వద్దని మరికొందరు నిరాకరించారు. నోట్లు తీసుకోవాలని తిరుపతి, చిత్తూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టినా వ్యాపారులు సానుకూలంగా స్పందించలేదు. పాలు, కూరగాయలు, చికెన్ సెంటర్ల నుంచి అన్ని రకాల దుకాణాలు, సూపర్ మార్కెట్లు నోట్లు తీసుకునేందుకు విముఖత చూపారుు. దీంతో జిల్లా అంతటా వ్యాపారాలు 50 శాతం తగ్గారుు. రోజుకి రూ. 250 కోట్ల వ్యాపార లావాదేవీలు నమోదయ్యే జిల్లాలో బుధవారం రూ.100 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగడం గగనమైందని వ్యాపార వర్గాలు వెల్లడించారుు. కిటకిటలాడిన పెట్రోలు బంకులు.. రద్దరుున నోట్లు మారింది ఇక్కడొకచోటే. జిల్లాలోని పెట్రోలు బంకుల యజమానులందరూ నోట్లు స్వీకరించారు. అరుుతే రూ.100, 200లకు కొట్టకుండా రూ.500 మొత్తానికీ పెట్రోలు కొడతామని షరతు పెట్టారు, చేసేది లేక వాహనచోదకులు మొత్తానికీ పెట్రోలు పట్టుకున్నారు. ఇదే అదునుగా బంకుల యజమానులు స్పీడ్, సూపర్ మైలేజ్ పెట్రోలు లక్ష్యాలను కూడా అధిగమించారు. ఒక్కో పెట్రోలు బంకు గతంలో 3000 నుంచి 4000 లీటర్ల పెట్రోలు విక్రరుుంచేది. అరుుతే బుధవారం మాత్రం రెట్టింపు అమ్మకాలు జరిగారుు. జిల్లాలోని వైన్, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ అమ్మకాలు బాగున్నారుు. పెద్ద నోట్ల మార్పిడికి మందుబాబులు వైన్‌షాపులను ఎంచుకున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రెట్టింపు అమ్మకాలు జరిపారు. ఇష్లారాజ్యంగా దళారులు... చిల్లర సమస్యను ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారం చేయడం ప్రారంభించారు. తిరుపతి తుడా సర్కిల్, టీటీడీ ఏడీ బిల్డింగ్, అలిపిరి, బస్టాండ్, రైల్వే సెంటర్లను అడ్డాగా చేసుకుని వ్యాపారం చేశారు. రూ.500 నోటుకు బదులుగా రూ.400 మాత్రమే ఇచ్చి కమీషన్ కింద రూ.100 మినహారుుంచుకున్నారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన యాత్రికులు చిల్లర కోసం వీరిని ఆశ్రరుుంచి నష్టపోయారు. -
కన్నీరు మిగిల్చిన ఉల్లి
- మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యం –లాట్లు సరిగా లేవంటూ వేలంపాట నిలిపేసిన వైనం – ధరలేక పంటను మార్కెట్లోనే వదిలేసిన రైతులు –మంగళవారం ఒక్క రోజే 20 మందిది ఇదే పరిస్థితి కర్నూలు(అగ్రికల్చర్): నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చెందిన శేషారెడ్డి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 250 బస్తాల ఉల్లిని తీసుకొచ్చారు. నాణ్యత బాగానే ఉన్నా వ్యాపారులు క్వింటాకు రూ.100కు మించి ధర పెట్టలేదు. రైతు మాత్రం రెండు ఎకరాల్లో సాగు చేసి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు.మార్కెట్లో కొనుగోలు దారులు కేవలం రూ100 కే అడగడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రవాణ చార్జీలు, ఉల్లిని తెంపడానికి అయిన ఖర్చులు కూడ గిట్టుబాటు కాకపోతుండటంతో మానసిక వేదనకు గురైన రైతు తెచ్చిన ఉల్లిని మార్కెట్లోనే వదిలేసి వెల్లాడు. – సి.బెళగల్ మండలం పొన్నకల్‌కు చెందిన నాగన్న తెచ్చిన ఉల్లిని వ్యాపారులు కేవలం క్వింటా రూ.120 ప్రకారమే కొనుగోలు చేశారు. ఎకరాలో సాగు చేయగా దాదాపు 50వేలు పెట్టుబడి పెట్టారు. పంటను అమ్మితే రూ.10వేలు కూడా రాలేదు. దీంతో ఆ రైతు అందోళన అంతా, ఇంతా కాదు. ఇలాంటి రైతులు జిల్లావ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఒకవైపు ధరలు పూర్తిగా పడిపోవడం, మరోవైపు అసలు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తెచ్చిన ఉల్లిని వదిలేసి వెళ్తున్నారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి భారీగా వచ్చింది. అయితే కొనుగోలులో నిర్లక్ష్యం నెలకొంది. జంబోషెడ్‌లో ఉల్లి బస్తాలను అస్తవ్యస్తంగా వేశారనే కారణంతో వ్యాపారులు వేలం పాట నిర్వహించలేమని చేతుతెత్తేశారు. ఇలా అడ్డదిడ్డంగా బస్తాలు వేస్తే ఉల్లి కొనేది లేదంటూ వేలంపాట బంద్ చేశారు. ధరలు పూర్తిగా పడిపోవడం, ఏదో ఒక ధరకు అమ్మకొనివెళ్లిపోదామంటే వేలంపాట నిర్వహించకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు రైతులు ఉల్లిని మార్కెట్లోనే వదిలేసి వెల్లిపోయారు. మంగళవారం ఒక్క రోజే దాదపు 20 మంది రైతులు ఉల్లిని వదిలేసి వెల్లిపోయారు. మార్కెట్ కమిటీ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అధిక ధరలను చూపుతున్న మార్కెట్ కమిటీ.... కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ధరలను ప్రకటించడంలో రైతులను దగా చేస్తోంది. ధరలు పూర్తిగా పడిపోయి అల్లాడుతున్నా అధిక ధరలున్నట్లు ప్రకటిస్తోంది. వ్యాపారులు రూ.50 నుంచి వేలంపాట ప్రారంభంచి అనేక లాట్లకు రూ.100. 120, 150 మాత్రమే ధర లభిస్తున్నా దీనిని అధికారులు మరుగున పెడుతున్నారు. కనిష్ట ధర రూ.300, 310గా ఉన్నట్లు చూపుతున్నారు. తక్కువ ఎక్కువ ధరలను ప్రకటించడంలో మార్కెట్ కమిటీ రైతులను దగా చేస్తుందనే విమర్శలున్నాయి. అధిక ధర రూ.700, రూ. 800గా ఉంది. అది కూడా కేవలం ఒక లాట్‌కు మాత్రమే అభిస్తున్నా దానిని అధికంగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. -
జోరుగా క్యాట్ ఫిష్ అమ్మకాలు
కౌడిపల్లి : ప్రజారోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే నిషేధిత క్యాట్ ఫిష్ (మార్పులు)ను జోరుగా అమ్ముతున్నారు. కౌడిపల్లిలో గురువారం జరిగిన అంగడిలో మంజీర నది పరివాహక ప్రాంతం జోగిపేట, కొల్చారం, పాపన్నపేట ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి విక్రయించారు. అత్యంత కుళ్లిపోయిన జీవరాసుల కళేబరాలను సైతం తిని జీర్ణించుకునే శక్తి క్యాట్‌ఫిష్‌లకు ఉంటుంది. దీంతో వాటిలోని విష పదార్థాలు అలాగే ఉండటం వల్ల వాటిని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో వ్యాధుల బారిన పడతారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కౌడిపల్లి అంగడిలో నాలుగైదు వారాలుగా ఒకరిద్దరుగా వచ్చిన వ్యాపారులు అమ్మకాలు నిర్వహించారు. కాగా గురువారం మాత్రం ఏకంగా ఏడుగురు వ్యాపారులు సంచుల్లో క్వింటాళ్లకొద్ది క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి అంగడిలో అమ్మారు. ఒక్కో చేప సుమారు 3 నుండి 5 కిలోల వరకు ఉండగా రూ. 200 నుండి 300 వందలకు గుత్త లెక్కన అమ్మకాలు చేపట్టారు. ఈ చేపల వల్ల కలిగే దుష్పభ్రావాల గురించి తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు చెబుతున్నారు. కాగా క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న గ్రామానికి చెందిన యువజన సంఘం సభ్యులు దుర్గేష్, సుధాకర్, కిషోర్‌గౌడ్‌లు తాము పోలీస్, రెవెన్యూ అధికారు ఆ చేపలపై కొనసాగుతున్న నిషేధం అధికారులు పట్టించుకోవడం లేదని యువజన సంఘాల ఆరోపణలకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చేపల వ్యాపారులు కౌడిపల్లితోపాటు నర్సాపూర్, పోత¯ŒSషెట్టిపల్లి, జోగిపేట, రంగంపేట తదితర అంగళ్లలో క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు సమాచారం. -
మంత్రిగారికి చేదు అనుభవం
శ్రీనగర్: ఇప్పటికి 45కు చేరిన మరణాలు.. 2000 మందికిపైగా గాయాలు.. రెండు వారాలుగా కర్ఫ్యూ.. కనీస అవసరాలకు ఇబ్బందులు.. ఇదీ కశ్మీర్ లోయలో పరిస్థితి. వీటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం శనివరాం కశ్మీర్ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం మధ్యాహ్నం స్థానిక వ్యాపారులతో భేటీ కావాలనుకున్నారు. కానీ అందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయలేదు. 'మేం ఆయనతో మాట్లాడబోమ'ని అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక రాజ్ నాథ్ మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు. రెండు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా శనివారం లోయకు వెళ్లిన హోం మంత్రి పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పారమిలటరీ,సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్ గవర్నర్ నరీంద్రనాథ్ వోరా, సీఎం మొహబూబా ముఫ్తీలతో భేటీ అనంతరం ఆదివారం మధ్యాహ్నం రాజ్ నాథ్ తిరిగి ఢిల్లీ బయలుదేరతారు. చొరబాటుదారుల కాల్పుల్లో జవాన్ మృతి ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ) వద్ద చొరబాటుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముష్కరులు చొరబాటుకు యత్నించారని, దీనిని గమనించిన పహారా బృందం ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని, ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి చెందాడని ఆర్మీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. -
వ్యాపారులకు ని‘బంధనాలు’
* ఆన్లైన్ విధానంతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులు * వివరాలు నమోదు చేసుకునేందుకు జూలై 15 వరకు గడువు * తరచూ మొరాయిస్తున్న సర్వర్ * గడువు పెంచాలని కోరుతున్న వ్యాపారులు శ్రీకాకుళం: వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రవేశ పెడుతున్న కొత్త నిబంధనలు వ్యాపారుల కాళ్లకు బంధనాలేస్తున్నాయి. వ్యాపారులంతా ఆన్లైన్లోనే వే బిల్లులు, ‘సి’ ఫారాలు, ఆర్సీ (రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం) తీసుకోవాలని, అది కూడా వాణిజ్య పన్నుల శాఖ వెబ్సైట్లో మాత్రమే తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యాట్ డీలర్లు ప్రతినెలా రిటర్న్స్ దాఖలు పరచాలనే నూతన నిబంధన విధించారు. ఈ విధానంపై తొలినాళ్లలో వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఇప్పుడిప్పుడే దీనికి అలవాటు పడుతున్నా రు. అయితే ఇప్పుడు వ్యాట్ డీలర్లకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఇంతకు ముందు ఆన్లైన్లో వివరాలు పొందుపరిచేటపుడు చాలా మంది అవగాహన లోపం తో తప్పులు నమోదు చేశారు. ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం కల్పించినా సమయం చాలక, సర్వర్ పనిచేయక డీల ర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యాట్ డీలరు మరో డీలరు నుంచి కొనుగోలు చేసిన సరుకుల బిల్లు నం బరు, సరుకుల వివరాలు, ఇన్వాయిస్ నంబరు, కొనుగోలు తేదీ తదితర వివరాల్ని ఇంతకుముందు ఆన్లైన్లో పొందుపరిచారు. అయితే కొందరు కొత్త విధానంపై అవగాహన లేక తప్పుడు వివరాలు పొం దుపరిచారు. దీంతో వ్యాపారులకు లక్షలాది రూపాయల పన్నులు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఒక వ్యాట్ డీలరు మరో డీలరు నుంచి సరకులు కొనుగోలు చేసిన సందర్భాల్లో కొనుగోలుదారుడు ఆన్లైన్లో వివరాల్ని పొందుపర్చకుంటే అమ్మకపుదారుడికి సీటీ శాఖ చెల్లించాల్సిన ఐటీసీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్)ను నిలుపుదల చేస్తున్నారు. అయితే ఇటీవల వ్యాపారుల కోరిక మేరకు ఆన్లైన్లో తప్పులు పడిన వ్యాపారులకు వాటిని సవరించుకొనే సౌలభ్యాన్ని కల్పించారు. కానీ ఆ తప్పుల సవరణను సీటీ శాఖ వెబ్సైట్లోనే మాత్రమే చేయాలని మెలిక పెట్టారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు ఆన్లైన్లో పొందుపరచిన తప్పుల్ని సవరించుకోవచ్చని తెలి పారు. కానీ గడువు తక్కువగా ఇచ్చి పరీక్ష పెడుతున్నారు. ఇంత తక్కువ సమయంలోనా...? ఒక్కో వ్యాపారి తమ వ్యాపార సంస్థలో నెలకు 30 నుంచి 40 బిల్లుల మేర తప్పుల సవరణ వివరాల్ని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. పురుగు మందులు, హోల్‌సేల్ ఫ్యాన్సీ, టింబరు, ఆటోమొబైల్ తదితర వ్యాపార వర్గాలకు ప్రతి నెలా బిల్లులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రతి వ్యాట్ డీలరు గత ఏడాది జూన్ నెల నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు జరిగిన తప్పుల తాలూకు బిల్లుల్ని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. అంటే సగటున ఒక్కో వ్యాపారి 10 నెలల తాలూకు బిల్లుల్ని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. ఇక్కడే వ్యాట్ డీలర్లకు కష్టాలు మొదలవుతున్నాయి. 13 జిల్లాల్లోని వ్యాపారులంతా ఒకేసారి ఆన్లైన్లో తప్పుల సవరణకు ఉపక్రమించిన సందర్భాల్లో సర్వర్ పనిచేయడం లేదు. తప్పుల సవరణకు ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. సర్వర్ స్తంభించడంతో అసలు వెబ్సైట్ పనిచేయడం లేదని వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల వ్యాపారులు, ఆడిటర్లు, అకౌంటెంట్లు, సీటీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. -
తిరుపతమ్మ చెంత.. భక్తుల చింత
* భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు * పట్టించుకోని అధికారులు పెనుగంచిప్రోలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం అధిక ధరలు వసూలు చేయకూడదని ఉన్నా కాంట్రాక్టర్లు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. భక్తుల మనోభావాలను ఆసరాగా తీసుకొని వారు సొమ్ము చేసుకుంటున్నారు. పుణ్యం కోసం దేవుని వద్దకు వస్తే జేబుకు చిల్లులు పడుతున్నాయని భక్తులు వాపోతున్నారు. వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెట్టింపు పార్కింగ్ ఫీజు ఆలయ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ చేసుకున్నందుకు కాంట్రాక్టర్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, ఆదివారాల్లో వేల సంఖ్యలో వాహనాలు వస్తాయి. ఆలయం వారు ద్విచక్ర వాహనానికి రూ.5లు వసూలు చేయాలని నిర్ణయించగా రూ. 10 , కారుకు రూ.20, ఆటోకు రూ.10 నిర్ణయించగా వాటికి మరో రూ.10 అదనంగా వేసి వసూలు చేస్తున్నారు. పొంగళ్ల షెడ్డు వద్ద అధిక వసూళ్లు.... అమ్మవారికి కుండలో పొంగళ్లు చేయడం భక్తుల ఆనవాయితీ. ఆలయానికి వచ్చిన భక్తుల్లో 90 శాతం మంది పొంగళ్లు చేస్తారు. అయితే పొంగలి వండుకునేందుకు చిన్నకుండ అయితే రూ.20లు తీసుకోవాల్సి ఉండగా రూ.30, పెద్దకుండకు రూ.30 తీసుకోవాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.50లు.... నిబంధన ల ప్రకారం కొబ్బరికాయ రూ.20లకు విక్రయించాల్సి ఉండగా కొబ్బరికాయతో పాటు జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ కలిపి రూ.50లు వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో కొబ్బరికాయ ఒక్కటి రూ.25లు అమ్ముతున్నారు. అయినా రూ.5లు అధికంగానే తీసుకుంటున్నారు. గడ్డి కట్ట రూ.5లు.... ఆలయం ముందు గోశాలలో గోవులకు భక్తులు పచ్చి గడ్డి పెట్టేందుకు ఆలయ అధికారులు కట్టకు రూ.2లు నిర్ణయించగా రూ.5లు వసూలు చేస్తున్నారు. ఒకోసారి రూ.10లకు 3కట్టలు ఇస్తున్నారు. భక్తులు టెంకాయలు కొట్టే వద్ద కూడా కాంట్రాక్టరు ఏర్పాటు చేసుకున్న సిబ్బంది కొబ్బరికాయ కొట్టాలంటే డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ప్రసాదాలు పెట్టుకునేందుకు కవర్లు విక్రయం కూడా దారుణంగా ఉంది. నిబంధనల ప్రకారం కవరు రూ.2లు విక్రయించాల్సి ఉండగా రూ.5వసూలు చేస్తున్నారు. లక్షలు పలుకుతున్న వేలం పాటలు... భక్తుల నుంచి అధికంగా వసూలు చేసుకోవచ్చనే భావనతో కాంట్రాక్టర్లు లక్షలు వెచ్చించి పాటలను కైవసం చేసుకుంటున్నారు. ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరికాయలు విక్రయించుకునేందుకు రూ.42 లక్షలు, వస్త్రాలు పోగు చేసుకునేందుకు రూ.32.30లక్షలు, పొంగళ్ల షెడ్ల నిర్వహణకు రూ.20 లక్షలు, వాహనాల పార్కింగ్‌కు రూ.13.55 లక్షలు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు రూ.25లక్షలకు కాంట్రాక్టర్లు పాటలు సొంతం చేసుకున్నారు. -
ప్రకృతి హననం
♦ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ♦ పగలు నరికివేత.. రాత్రి హైదరాబాద్‌కు తరలింపు ♦ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం ♦ అప్పుడప్పుడు అధికారుల తనిఖీలు ♦ నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్న వైనం ♦ పెద్దపెద్ద వృక్షాలను నరికి అమ్ముకుంటున్న వ్యాపారులు ♦ అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్న కలప దందా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు మానవుడు. దెబ్బతింటున్న పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మొక్కలు నాటాల్సిందిపోయి.. ఏళ్లుగా పర్యావరణానికి ప్రాణం పోస్తున్న చెట్లను నిలువునా కూల్చేస్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి నేలకూలేవి కొన్నయితే.. మనిషి అజ్ఞానానికి బలవుతున్నవి కొన్ని. జిల్లా వ్యాప్తంగా ‘రియల్’ మైకంలో ఇప్పటికే పచ్చదనం కనుమరుగైంది. ప్రకృతిని హరించి కాంక్రీట్ జంగల్‌ను నిర్మించేస్తున్నారు. పెద్దపెద్ద వృక్షాలను కూల్చి సామిల్స్‌కు తరలిస్తున్నారు. దీనికి తోడు కలప వ్యాపారులు చిన్నాపెద్ద వృక్షాలను చెరబడుతున్నారు. పగలంతా నరికేయడం.. రాత్రిళ్లు తరలించుకుపోవడం. జిల్లా నుంచి రోజూ పదుల సంఖ్యలో కలప లారీలు హైదరాబాద్‌కు చేరుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దందా అధికారులు కనుసన్నల్లో జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. - పరిగి రైతుల నుంచి తక్కువ ధరలకు చెట్లు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెట్లు నరకడం మొదలు.. కలప రవాణా.. విక్రయాలను అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారి కనుసన్నల్లోనే అక్రమ దందా జరుగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చెట్లను నరికే సమయంలో ప్రతిఒక్కరు రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కాని అదేమి జరగడం లేదు. ఇటీవల పరిగికి చెందిన సామిల్లుకు తరలిస్తున్న అక్రమ కలప ట్రా క్టర్ పట్టుబడటంతో పలు విషయాలు వెలుగుచూశాయి. నామమాత్రపు తనిఖీలు.. అక్రమ కలప దందాలో అటు పోలీసులు, ఇటు అటవీశాఖ అధికారులకు సైతం మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తూతూ మంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతరులెవరైనా కలప లారీలను పట్టించడమో.. లేదా పోలీసుల సాధారణ తనిఖీలు, పెట్రోలింగ్‌లో అప్పుడప్పుడు పట్టుకోవడమో తప్పిస్తే చెట్లు నరకడం, విక్రయాలపై సంబంధిత యంత్రాంగం నిఘానే కరువైపోయింది. అడ్డాలుగా కట్టెల మిషన్లు.. పరిగి ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా వెలుస్తున్న సా మిల్లులు(కట్టెల మిషన్లు), కార్పెంటర్ దుకాణాలు అక్రమ కలప వ్యాపారానికి అడ్డాలుగా మారుతున్నాయి. ఈ వ్యాపారంపై నిఘా కొరవడడంతో నిత్యం ఈ దందాకు సంబంధించి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క ప్రభుత్వం చెట్లను పెంచేందుకు హరితహారం వంటి కార్యక్రమాలు చేపడుతుంటే అక్రమార్కులు మాత్రం ఉన్నచెట్లను నరికివేస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. చెట్లను కాపాడాల్సిన యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అంతా వారి కనుచూపుల్లోనే జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్ల నరికివేతను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
స్థానిక వర్తకులకూ ఆన్ లైన్!
♦ సేవలను ప్రారంభించిన యాడ్రోబ్ స్టార్టప్ ♦ ఇప్పటికే వెయ్యి మంది వ్యాపారుల నమోదు ♦ ఈ ఏడాది ముగింపు నాటికి 5 పట్టణాలకు విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా హైపర్ లోకల్ మార్కెట్ సేవలందిస్తున్న యాడ్రోబ్... స్థానిక వర్తకులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకోవటంతో పాటు వాటిని వినియోగదారులకు అందించే వీలు కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం యాడ్రోబ్లో జంట నగరాల నుంచి వెయ్యి మందికి పైగా స్థానిక వ్యాపారులు నమోదు చేసుకున్నట్లు యాడ్రోబ్ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజిరెడ్డి కేశిరెడ్డి చెప్పారు. వీటి ద్వారా 3 వేల ఉత్పత్తులను ఎంచుకునే వీలుందని తెలియజేశారాయన. సోమవారమిక్కడ యాడ్రోబ్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. యాడ్రోబ్లో గ్రాసరీ నుంచి గాడ్జెట్స్ వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకూ వందకు పైగా కేటగిరీలున్నాయన్నారు. ఆర్డరిచ్చిన రోజే సరుకులను డెలివరీ చేసేందుకు గాను 18 మంది ఉద్యోగులను నియమించుకున్నామని ఇంతకుముందు పాత్రికేయుడిగా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా మారిన రాజిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాడ్రోబ్ ఆండ్రాయిడ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశముంది. ఇప్పటికే 5 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు రాజిరెడ్డి తెలియజేశారు. రెండు నెలల్లో స్థానికంగా 5 వేల మంది వెండర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం ఐఓఎస్, విండోస్ వెర్షన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ ఏడాది ముగింపు నాటికి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి పట్టణాలకు విస్తరించనున్నామని, ఇందుకోసం తొలిసారిగా నిధుల సమీకరణ కూడా చేయాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కోసం పలువురు వీసీ, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు. రెండు నెలల్లో సినిమా టికెట్లు , కూపన్స్ విధానాన్ని కూడా ప్రారంభిస్తామని, దీంతో ఆఫ్‌లైన్ మార్కెట్లో అదనపు రాయితీ పొందే వీలుంటుందని రాజిరెడ్డి చెప్పారు. -
ఎక్సైజ్ తీరు ‘మామూళ్లే’!
మద్యం వ్యాపారులు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికారులు ‘మామూళ్ల’ పేరిట ప్రోత్సహిస్తుండడంతో దుకాణాల వద్ద నిబంధనలకు తూట్లుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం విక్రయించడం లేదు. పొరుగు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ తాను ఎమ్మార్పీకి మించి రూపాయి కూడా అదనంగా అమ్మేది లేదని ఖరాఖండిగా చెప్పేసినా అధికారులు అంగీకరించలేదు. ఎమ్మార్పీపై రూ. ఐదు నుంచి రూ. 10 వరకు విక్రయిస్తేనే దుకాణం ఉంటుందని.. లేకపోతే కేసులు తప్పవని బెదిరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులను తమ దారికి తెచ్చుకునేందుకు ఎక్సైజ్ అధికారులు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. దుకాణాలు, బెల్ట్ షాపులు, జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలు, బార్ల నుంచి నెలవారీ వసూళ్లకు జిల్లా వ్యాప్తంగా ఒక సీఐని నియమించినట్టు సమాచారం. ఎక్సైజ్‌శాఖ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నా వారిలో మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే తమకేమిటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చిన ఓ మద్యం వ్యాపారి జిల్లాలో ఇప్పుడు హవా చలాయిస్తున్నారు. రాజకీయంగా మంత్రి సన్నిహితుడిగా పేరొందిన ఆ వ్యక్తి చక్రం తిప్పుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని దుకాణాలను చేజిక్కించుకొని తాను చెప్పిందే వేదం అంటూ వ్యాపారుల్ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి చెప్పారు అంటూ తనకు కావాల్సినట్టుగా పనులు చేయించుకున్నట్టు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 238 దుకాణాలతోపాటు 15 బార్లు, సుమారు ఐదు వేల బెల్ట్ దుకాణాలు, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 58 దుకాణాలను లెక్కించి పద్దులు రాసే పనిని ప్రారంభించారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు అర్బన్ ప్రాంతాల్లో రూ. 57,500, రూరల్ ప్రాంతాల్లో రూ. 37,500 వసూలు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా మంత్రికి కూడా పంపకాలు చేయాలంటూ ఓ వ్యాపారి సమాచారం పంపిస్తున్నట్టు భోగట్టా. రానున్న జూలైలో మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వ్యాపారులు కూడా అధికారులు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా జిల్లా మంత్రి కూడా తాను మంత్రిగా ఉన్నంతకాలం ధీమాగా ఉండొచ్చని, ఎలాంటి ఇబ్బందులూ రావని చెబుతున్నట్టు తెలిసింది. ఎన్ఫోర్స్మెంట్ ఏదీ?జిల్లాలో అడపాదడపా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నా బయటకు రావడం లేదు. కేసులు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులంతా ఏపీ-ఒడిశా సరిహద్దులో నల్లబెల్లం, నాటుసారా తయారీపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల మద్యం దుకాణదారుల నుంచి మామూళ్ల పేరిట రూ. 85 వేలు వసూలు చేసి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. దీంతో కొన్నాళ్లపాటు స్థబ్దుగా ఉండిపోవాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్పుడప్పుడూ తనిఖీలకు వస్తున్నా ఫలితం లేకుండా పోయింది. స్థానిక సిబ్బంది ముందుగానే అధికారుల రాకను పసిగట్టి మద్యం వ్యాపారులకు సమాచారం ఇచ్చేస్తుండడంతో కేసుల నమోదుపై ప్రభావం పడింది. ఒకవేళ కేసు నమోదు చేసినా రూ. లక్ష అపరాధ రుసుము చెల్లించేస్తే వెంటనే మాఫీ అయిపోతుందన్న ధీమా వ్యాపారుల్లో ఉంది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సిబ్బంది జాడ కనిపించకపోవడం, టాస్క్‌ఫోర్స్ సేవలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనినే ఆసరాగా తీసుకున్న స్థానిక ఎక్సైజ్ సిబ్బంది మామూళ్లు పెంచేశారని తెలిసింది. వ్యాపారులు తమకు నచ్చినట్టుగా విక్రయాలు చేసుకోవచ్చని మౌకిక ఆదేశాలిచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. -
అండగా ఉండే నేతలు కావాలి..
కామన్ మ్యాన్ Voice నగరంలో ప్రతి కూడలిలోను చిరు వ్యాపారులు జీవిస్తుంటారు. వారికి సరైన దుకాణం ఉండదు. రోడ్డుపక్కన, ఫుట్‌పాత్ పైన చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. అలాంటివారికి ప్రభుత్వం గాని, అధికారులు గాని తగిన భరోసానివ్వరు. మార్గానికి అడ్డంగా ఉందని ఉన్న ఆధారాన్ని తొలగించాలని చూస్తారు. బాగ్ లింగంపల్లిలో బండిపై కొబ్బరి బొండాలు అమ్మే యాదయ్యకు 10 ఏళ్లుగా ఇదే వ్యాపారం బతుకుదెరువు. ఎన్నికలప్పుడు ఓట్లడిగే నేతలు.. తమలాంటి వారి కోసం ప్రభుత్వ పథకాలు ఉన్నట్టు చెప్పరని, వారి అవసరం తీర్చుకున్నాక తమను పట్టించుకోరని వాపోయాడు. ‘ఎన్నికలప్పుడు వస్తారు.. మంచిగ మాట్లాడతారు. ఆనక కనిపించరు. ఏమన్నా చెప్పుకుందామంటే ముఖం చాటేస్తారు’ అని ఆవేదన చెందాడు. ‘ఎన్నికలప్పుడు గల్లీ గల్లీలో తిరిగే నేతల సందడి సినిమాలా ఉంటది. గెలిసాక వారిని కలవడం మాలాంటోరికి కష్టమే. మాలాంటోళ్లకు దుకాణాలు తీసేయాలని వేధింపులు లేకుండా భరోసా ఇస్తే అదే పదివేలు’ అని పేర్కొన్నాడు. - అంబర్‌పేట -
ఇసుక బుకింగ్‌కు అనుమతి
పెదపులిపాక(పెనమలూరు) : పెదపులిపాక క్వారీలో తిరిగి ఇసుక బుకింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వ్యాపారులు మీ సేవలో హడావిడిగా బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో 2.22లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇసుక క్వారీలకు నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఇంకా లక్షా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండగానే అమ్మకాలు నిలిపివేసింది. మీసేవాలో గత 6వ తేదీ నుంచి ఇసుక బుకింగ్ నిలుపుదల చేశారు. ఇసుక కొరత ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం పెదపులిపాక క్వారీలో 50 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చింది. రెండు రోజుల్లోనే 22వేల క్యూబిక్ మీటర్లకు బుకింగ్ జరిగింది. ఇంకా 28 వేల క్యూబిక్ మీటర్ల బుకింగ్ జరగాల్సి ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఈ క్వారీ నుంచే వెళ్లటంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.550 చొప్పున లారీకి రూ.3300 వసూళ్లు చేస్తున్నా బహిరంగ మార్కెట్లో ఇసుక లారీ రవాణాతో కలిపి ధర రూ.6 వేల నుంచి ఆరున్నర వేలు ధర పలుకుతుంది. ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించక పోతే ఇసుక సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. -
చికెన్, మటన్‌కు తగ్గిన డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ తగ్గిపోయింది. శ్రావణ మాసంలో పడిపోయిన విక్రయాలు ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం దుర్గామాత నవరాత్రి పూజలు, వ్రతాల వల్ల చికెన్, మటన్, చేపలకు అంతగా గిరాకీ లేకుండా పోయిందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు... చాలామంది అది మాంసాహార దినంగా పరిగణిస్తుంటారు. అయితే... ఈ ఆదివారం మాత్రం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. అమ్మకాలు 30-35శాతం మేరకు పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 600-650 టన్నులకు పైగా చికెన్, 250-300 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయాలు సాగుతుంటాయి. అయితే... ఈ ఆదివారం చికెన్ 400టన్నుల లోపు అమ్ముడుపోగా, మటన్ సుమారు 180 టన్నులు, చేపలు 20 టన్నుల వరకు అమ్మకాలు సాగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు దుర్గానవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో చాలామంది పూజలు, వ్రతాలతో నియమ నిష్టలు పాటిస్తూ మంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే చికెన్, మటన్, చేపలకు డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నాయి. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కు ఆదివారం 50-60 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే... ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దిగివచ్చిన చికెన్.. చికెన్ ధరలు ఆదివారం బాగా దిగివచ్చాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.50లు ధర పలకగా... హోల్‌సేల్‌గా రూ.56లకు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.65ల ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.90లకు విక్రయించగా, స్కిన్‌లెన్ రూ.110ల ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.450-500, బోన్ లెస్ రూ.650-700లకు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.130, బొచ్చె రూ.120, కొరమీన్ రూ.150-800, గోల్డ్ ఫిష్ రూ.100, రొయ్య, రూ.200-250ల ప్రకారం విక్రయించారు. అయితే... నగరంలో అన్నిచోట్ల ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. ఒకచోట కిలో మటన్ రూ.450 ఉండగా, మరో చోట రూ.500లకు విక్రయించారు. -
పత్తి రైతు చిత్తు!
♦ నిండా ముంచుతున్న వ్యాపారులు, దళారులు ♦ ఇష్టారీతిన ధర నిర్ణయం.. ట్రాక్టర్ పత్తిలో 40 కిలోలు కోత ♦ మార్కెట్ కాంటాతో పనిలేకుండా సొంతంగా తూకం ♦ నూటికి రూపాయిన్నర అదనపు కమీషన్ ♦ సాక్షి కథనాలతో స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ♦ జమ్మికుంట మార్కెట్లో ఆకస్మిక తనిఖీ ♦ అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /జమ్మికుంట: వర్షాభావం నుంచి ఎరువుల కొరత దాకా ఎన్నో ఎదురుదెబ్బల్ని తట్టుకున్న రైతన్న... చివరకు వ్యాపారులు, దళారుల చేతిలో చిత్తయిపోతున్నాడు. అంతో ఇంతో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని మార్కెట్ కేంద్రాలకు వెళితే.. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. తూకం మొదలు కమీషన్ వరకు, మద్దతు ధర మొదలు తరుగు వరకు.. వ్యాపారుల మాయాజాలంలో నిండా మునిగిపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ అధికారులే ఈ మోసానికి సహకరిస్తున్నారు. ఈ బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం జమ్మికుంట పత్తి మార్కెట్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. దళారులకు అప్పగించేశారు! కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను చేపట్టాల్సి ఉన్నా... ఇప్పటివరకు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుస్నాబాద్ మార్కెట్లలోనే ప్రారంభించారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలియగానే రైతులు ఆరు రోజులుగా రోజూ దాదాపు 10 వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కానీ సీసీఐ అధికారులు ఏదో ఒక సాకు చెబుతూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విధిలేక వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. నిండా మోసం..: నిబంధనల ప్రకారం మార్కెట్ కార్యాలయాల్లోని వేబ్రిడ్జ్‌ల వద్దే తూకం వేయాలి. పత్తి తేమ శాతం, నాణ్యత, ధర నిర్ధారణ విషయంలో మార్కెటింగ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించాలి. ఎంత తూకం వేస్తే అంత బరువుకు ధర చెల్లించాలే తప్ప బరువులో కోత విధించడానికి వీల్లేదు. అలాగే 2 శాతం కమీషన్ మాత్రమే తీసుకోవాలి.కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో ఇవేవీ అమలుకావడం లేదు. మార్కెట్లో వేబ్రిడ్జ్ ఉన్నా... వ్యాపారులు అక్కడ తూకం వేయనీయడం లేదు. తమకు అనుకూలమైన కాటన్ మిల్లుల వద్ద తప్పుడు తూకం వేస్తూ దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు ట్రాక్టర్లో పత్తిని తెస్తే 40 కిలోలు, ట్రాలీలో తెస్తే 20 కిలోల చొప్పున కోత విధిస్తూ మిగతా బరువుకు మాత్రమే సొమ్ము చెల్లిస్తున్నారు. ఇక 2 శాతం కమీషన్‌కు అదనంగా ‘క్యాష్ కటింగ్’ పేరిట ప్రతి రూ.వందకు మరో రూపాయిన్నర మినహాయించుకుంటున్నారు. ఇలా రూ.లక్షకు రూ.1,500, ప్రతి ట్రాక్టర్‌కు 40 కిలోల పత్తి కోతతో మరో రూ.1,600 రైతు నష్టపోతున్నాడు. తప్పుడు తూకం, తక్కువ ధర తో నిండా మునిగిపోతున్నాడు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో గత ఆరు రోజులుగా రూ.20 కోట్లకుపైగా పత్తి వ్యాపారం జరగగా.. అందులో రైతులు రూ.5 కోట్లదాకా నష్టపోయినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పత్తి కొనుగోళ్లలో మోసాలపై ‘సాక్షి’లో రెండు రోజుల పాటు వరుస కథనాలు రావడంతో.. కరీంనగర్ జిల్లా పాలనా యంత్రాంగంలో కదలిక వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆకస్మికంగా జమ్మికుంట మార్కెట్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రకాష్, తహసీల్దార్ రజనితో కలిసి రైతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులంతా మూకుమ్మడిగా తమ బాధను వెళ్లగక్కారు. ‘‘మేం తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రూ.2,500 నుండి రూ.3,750 దాకా మాత్రమే ఇస్తున్నారు తప్ప ఒక్కరికి కూడా సీసీఐ నిర్ణయించిన ధర చెల్లించడం లేదు. పైగా ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. మార్కెట్ వేబ్రిడ్జ్‌పై కాకుండా సొంత కాంటాలపై తూకం వేస్తున్నారు. కాస్ట్ కటింగ్ పేరిట రూ.వందకు రూపాయిన్నర చొప్పున మినహాయించుకుంటున్నారు. మీరేమో ఆత్మహత్య చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండని చెబుతున్నారు. అసలే కాలంలేక బాధపడుతున్నం. ఇక్కడికొస్తే అడ్తిదారులు, వ్యాపారుల దోపిడీతో చస్తున్నాం. ఇట్లయితే మేం బతికేదెట్లా..?’’అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నీతూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘కాస్ట్ కటింగ్, సొంతంగా తూకం వేసుకోవడం, ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున పత్తిని మినహాయించుకోవడం వంటివి నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇకపై అలా జరిగితే లెసైన్సు రద్దు చేస్తాం. క్రిమినల్ కేసు పెడతాం. గతంలో ఇక్కడ సీబీఐ దాడులు చేసి విచారణ జరుపుతున్న విషయాన్ని మర్చిపోవద్దు..’’ అని వ్యాపారులను హెచ్చరించారు. -
ఆత్మహత్యలొద్దు..ఆదుకుంటాం
-
బువ్వ తినగలమా...?!
- రోజురోజుకు కొండెక్కుతున్న బియ్యం ధర - క్వింటాల్‌కు రూ.350కి పైగా అప్ - బెంబేలెత్తుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు చెన్నూర్ : మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు బియ్యం కొనాలంటేనే భయపడుతున్నారు. ఈ ఏడా ది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ వరి సాగు తగ్గిన నేపథ్యంలో మరికొద్ది నెలల్లో బియ్యం ధరలు ఇంకా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు పైపైకి... వారం వ్యవధిలో బీపీటీ సన్న రకం బియ్యం క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.350 వరకు పెరగగా, హెచ్ఎం టీ, జైశ్రీరాం రకం ధరలు రూ. 350 నుంచి 400 వరకు పెరిగారుు. దీనికి తోడు వంట నూనెలు, కూరగాయలే కాకుండా రోజూ వాడే ఉల్లిగడ్డల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు స్థాయిని దాటిపోయూయి. సామాన్యులపై పెనుభారం... సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెరిగిన బియ్యం ధరలతో పెనుభారం పడుతోంది. రోజంతా పని చేస్తే రూ.200 కూడా గిట్టుబాటు కావడంలేదు. ఈ నేపథ్యం లో బియ్యం, ఉల్లితో పాటు నిత్యావసర వస్తువులు, కూ రగాయల ధరలు మండిపోతుండగా ప్రజలకు ఏం చే యూలో అర్థం కావడం లేదు. తగ్గిన ఖరీఫ్ సాగు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో జి ల్లాలో 50 శాతం వరి సాగు తగ్గిందని అంచనా. వర్షాలు లేని కారణంగా రబీ సాగు సైతం అంతంత మాత్రంగా నే ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో సాగు గణనీయంగా పడిపోరుు వచ్చే ఏడాది బియ్యం అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం కిలో రూ.45 ఉన్న సన్న రకం బియ్యం ధర మరింత పెరిగే అ వకాశముందని వ్యాపారులు అంటున్నారు. ఖరీఫ్‌లో వరి సాగు తగ్గింది. ఈ లెక్కన చూస్తే వచ్చే రోజుల్లో కిలో బియ్యం రూ.60కి చేరినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని వ్యాపారులు చెబుతున్నారు. ‘మధ్య తరగతి’కి కష్టమే... బియ్యం ధరలు చూస్తే కన్నీరోస్తుంది. ఇలాగే ధరలు పెరుగుతే మధ్య తరగతి ప్రజలు బతకడం కష్టమే. రోజంతా పని చేస్తే వచ్చే రూ. 200 ఎలా బతకడం? ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. - మారుపాక పోచం, ప్రైవేట్ ఉద్యోగి, కిష్టంపేట ప్రభుత్వం చొరవ చూపాలి.. బియ్యం ధరలు ఇలా పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టమే. ప్రజలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తుంది. బియ్యం ధరలు పెరగడానికి గల కారణాలను ఆరా తీసి నియంత్రణకు ప్రభుత్వం చొరవ చూపాలి. - గుర్రం శ్రీనివాస్, ఎల్ఐసీ ఏజెంట్, చెన్నూర్ ఇప్పుడే ఇట్లా ఉంటే... బియ్యం ధరలు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌లో వరి అన్నం పరమాన్నంగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతోంది. సామాన్యు ల ఇబ్బందులను పట్టించుకోకపోవడం లేదు. - సురేష్, సెల్ వ్యాపారి, చెన్నూర్ -
ఆంధ్రా బ్యాంక్ ‘ముద్రా’ కార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారస్తుల కోసం ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షలోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. ఇలా మంజూరైన రుణాలను వారి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి డెబిట్ కార్డుల రూపంలో అందిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె.కల్రా తెలిపారు. రూ. 50 వేలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు విభాగాల్లో మొత్తం మూడు రకాల కార్డులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారాలకు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేయడానికి కేంద్రం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకులు కనీసం రూ. 70,000 కోట్ల విలువైన చిన్న మధ్యస్థాయి రంగాలకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు సుబ్బారావు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు వారీ లక్ష్యాలను విడుదల చేయనున్నట్లు చెపాప్రాఉ. అంతక్రితం జరిగిన కార్యక్రమంలో ముద్రా కార్డును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది ఆంధ్రాబ్యాంక్ ఈ విభాగంలో రూ. 700 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది రూ. 1,600 కోట్లు మంజూరు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించవచ్చని అంచనా వేస్తున్నట్లు కల్రా తెలిపారు. -
ఎరువు.. బరువు!
- గోడౌన్లలో 24 వేల మెట్రిక్ టన్నులు నిల్వ - వర్షాభావంతో భారీగా తగ్గిన వినియోగం - ఆందోళలో వ్యాపారులు, రైతులు కడప అగ్రికల్చర్ : ఎరువుల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చోవడం, సరిగా పంపిణీ కాలేదని రైతుల ధర్నాలు.. రాస్తారోకోలు, వ్యవసాయాధికారుల సంజాయిషీలు.. ప్రతి ఏడాది ఖరీఫ్‌లో కనిపించే దృశ్యాలు. ఈ ఏడాది వైఎస్ఆర్ జిల్లాలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. రైతుల నుంచి ఎరువుల కొరతనే మాటే వినపడటం లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో ఎరువులు భారంగా మారిపోయాయి. వ్యాపారం లేకపోవడంతో అటు మార్క్‌ఫెడ్, ఇటు ప్రయివేటు డీలర్లు ఎరువులు కొనుగోలు చేయలేమని చేతులెత్తేశారు. జిల్లాలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. దీంతో ఎక్కడి ఎరువులు అక్కడే నిలిచిపోయాయి. కంపెనీల నుంచి దుకాణాల వారు ముందుగా కొనుగోలు చేసిన ఎరువులను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు కూడా ఖరీఫ్ పంటల సాగు కోసం ముందుగా కొనుగోలు చేసి విత్తన సమయంలో వాడటానికి తెచ్చి పెట్టుకున్న ఎరువులు కూడా ఇళ్లలో నిల్వ ఉండిపోయాయి. ఎరువుల దుకాణాల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో మార్కెఫెడ్, ఇతర గోడౌన్లలో కూడా ఎరువుల నిల్వలు మూలుగుతున్నాయి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ మొదలైందంటే అటు వ్యవసాయాధికారులు, ఇటు దుకాణదారుల్లో వణుకుపుట్టేది. కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా ఇతర ఎరువులు దొరకని పరిస్థితి నెలకొనేది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి బలమైన వ ర్షాలు కురవక పోవడంతో ఎరువులను అడిగే వారే కరువయ్యారని వ్యాపారులు అంటున్నారు. ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి పంటల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1.60 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా కేవలం 25,743 హెక్టార్లలోనే సాగయ్యాయి. 75 శాతం తగ్గిన ఎరువుల విక్రయాలు సాధారణంగా ఈ పాటికి పంటల సాగు బాగా ఊపందుకుని ఎరువుల వినియోగం పెరిగేది. మరీ జూలై నెలలో ఎరువుల కొరత పట్టిపీడించేది. జూన్ ప్రారంభంలో విత్తనాలు వేసిన అనంతరం కలుపు తీసి పై పాటుగా ఎరువులను, రెండో విడత పంటల సాగును రైతులు చేపడితే ఎరువులు అందించడం భారంగా ఉండేది. ఈ సమయంలో కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా, పొటాష్‌ను ఎక్కువగా వినియోగించేవారు. మొత్తంగా ఈ సారి ఎరువుల వినియోగం దాదాపు 75 శాతం తగ్గిందని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. తక్కువ పదును వల్ల విత్తిన విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తినవి ఎండిపోతుండటం వల్ల ఎరువుల గురించి రైతులు ఆలోచించడం లేదు. మార్క్‌ఫెడ్‌లో భారీగా నిల్వలు ఎరువులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం, అవసరం మేరకు ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీ)కు సరఫరా చేయడం మార్క్‌ఫెడ్ బాధ్యత. అయితే ఇప్పటికే కొనుగోలు చేసి ఉంచిన నిల్వలు గోడౌన్లలో పేరుకుపోయాయి. అయినా కూడా ఇండెంట్ మేరకు ఎరువుల కంపెనీలు అమాంతం పంపుతూనే ఉన్నాయి. గోడౌన్లు నిండిపోతుండడంతో ఎక్కడ పెట్టాలో దిక్కుతోచడం లేదని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు వెంకటసుబ్బారెడ్డి తలపట్టుకుంటున్నారు. ఇప్పటికీ జిల్లాలోని 12 ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రూ.19 లక్షల బకాయిలున్నాయని జీఎం తెలిపారు. అటు పాతబకాయిలు రాక, ఇటు ఉన్న ఎరువులు అమ్ముడుపోక దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువులు అమ్ముడుపోవడం కష్టమని సంస్థ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
కరువు నేలకు జలకళ
కరువునేల కళకళలాడనుంది.. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మాగాణి భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీయనుంది.. వలసలకు పేరొందిన పాలమూరు దశ మారనుంది..!జిల్లాలో ఏడులక్షల ఎకరాలతో పాటు మరోరెండు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రతిష్టాత్మక పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొదటి అడుగుపడింది. మొదటి రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు మొదటివారంలో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. జూరాల: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి అడుగుపడింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటిపంపు ద్వారా నీటిని పంపింగ్ చే సి నిల్వచేసే నార్లాపూర్ రిజర్వాయర్ సమగ్ర నివేదిక పనులు పూర్తిచేశారు. ఇందుకోసం అవసరమైన 2625 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. నెలాఖరులోగా ప్రాజెక్టు సమగ్ర నివేదికను సిద్ధంచేసే విధంగా నీటిపారుదలశాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆగస్టు మొదటివారంలో పథకం పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సి ద్ధంచేస్తున్నారు. మొదటి రిజర్వాయర్ ప రిధిలో ముంపునకు గురయ్యే అంజన్గిరితండా వాసులను జిల్లామంత్రి కలిసి ప్రా జెక్టు పనులకు సహకరించేలా అంగీకరింపజేశారు. దీంతో ప్రాజెక్టు పనులకు సం బంధించిన మొదటిదశకు అడ్డంకులు తొ లగినట్లయింది. ప్రాజెక్టును మూడు జి ల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి 20టీఎంసీల తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి మూడేళ్లలోనే పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. జిల్లా నేతలతో సీఎం సమీక్ష గురువారం రాత్రి జిల్లా ఎంపీ ఏపీ జి తేందర్‌రెడ్డి ఇంట్లో సీఎం కేసీఆర్, నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పాటు ముఖ్యఅధికారులతో కలిసి పాల మూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై సమీక్షించారు. వచ్చేనెలలో టెండర్లు పిలచి పనులను ప్యాకేజీలుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వలసలకు నిలయమైన జి ల్లాలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణానది జలాలను కరువునేలకు అందించే పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ గ్రామానికి సమీపంలో మొదటి పంప్‌హౌస్ ఏర్పాటుచేస్తారు. ఇక్కడి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. ఇక్కడినుంచి ఏదుల రిజర్వాయర్‌కు, అక్కడినుంచి వట్టెం రిజర్వాయర్ లో 14.37టీఎంసీల నీటిని నిల్వచేస్తారు. వట్టెం రిజర్వాయర్ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. అనంతరం ఇక్కడినుంచి ప్రధానకాల్వ ద్వారా లోకిరేవు రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. తద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇక్కడినుంచి రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. రిజర్వాయర్ నుంచి నాలుగు ప్రధానకాల్వల ద్వారా సాగునీరందేలా డిజైన్‌చేశారు. దక్షిణ బ్రాంచి కాల్వ ద్వారా 20వేల ఎకరాలకు, తూర్పు కాల్వ ద్వారా 30వేల ఎకరాలకు, ఉత్తరకాల్వ ద్వారా 1.65లక్షల ఎకరాలకు, పడమర కాల్వ ద్వారా 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చేనెలలోనే పాలమూరు టెండర్ల ప్రక్రియ ఈనెలాఖరులోగా పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ సిద్ధం చేసి డిజైన్‌ను ఈఎస్సీ డిజైన్స్ విభాగానికి పంపి అనుమతి రాగానే వచ్చేనెలలోనే టెండర్లను పిలిచేలా పనులను వేగంగా కొనసాగిస్తున్నాం. పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వీలైనంత త్వరగా పనులు చేపట్టేలా అన్నిదశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయి. - ఖగేందర్, చీఫ్ ఇంజనీర్ -
కిక్కే...కిక్కు
- మద్యం షాపులకు వెల్లువెత్తిన దరఖాస్తులు - చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు - నగర పరిధిలో షాపులకు యమగిరాకీ - ఏజెన్సీ షాపులకు స్పందన శూన్యం సాక్షి, విశాఖపట్నం: ఊహించని రీతిలో మద్యం షాపు లవేలం కాసుల వర్షం కురిపిస్తోంది. దరఖాస్తు చేసేందుకు చివరిరోజు కావడంతో శనివారం వ్యాపారులు క్యూకట్టారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని షాపుల కోసం పోటీపడిన వ్యాపారులు ఏజెన్సీ పరిధిలోని షాపుల వైపు కన్నెత్తి చూసేపరిస్థితి కన్పించడం లేదు. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా, వీటిలో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 367 షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకోసం స్థానిక శివాజీపాలెంలో ఉన్న సవేరా ఫంక్షన్‌హాలులో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభం కాగా, తొలి మూడు రోజులు అంతంతమాత్రంగా ఉన్న స్పందన శుక్రవారం సాయంత్రానికి 134 షాపులకు 404 దరఖాస్తులు వచ్చాయి. 233 షాపులకు శుక్రవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. చివరి రోజైన శనివారం ఊహించని రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి మొదలైన తాకిడి అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు సుమారు 315షాపుల కోసం 2,586 దరఖాస్తులు వచ్చాయి. మరో 500 మంది వరకు దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీపరిధిలో 25 షాపులతో పాటు గ్రామీణ జిల్లాలోని మరో 25 షాపులకు దరఖాస్తులు పడలేదని తెలుస్తోంది. సిటీ పరిధిలోని 62 షాపులతో పాటు జీవీ ఎంసీ పరిధిలోకి వచ్చిన పెందుర్తి, భీమిలి, గాజువాక, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఈ షాపుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. నగర పరిధిలోని జ్ఞానాపురం, ఓల్డ్ పోస్టాఫీస్, ఆర్టీసీ బస్టాండ్, ఎన్ఎడీ జంక్షన్ వంటి ప్రాంతాల్లోని మద్యం షాపులకు 50 నుంచి 100 వరకు దరఖాస్తులు పడినట్టు తెలుస్తోంది. ఒక్క జ్ఞానాపురం షాపుకే అత్యధికంగా 110 దరఖాస్తులు దాఖలైనట్టుగా చెబుతున్నారు. లెసైన్సింగ్ ఫీజుల రూపంలోనే సుమారు రూ.పాతికకోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలు కన్పిస్తన్నాయి. ఆదివారం ఉదయానికి గానీ ఏ షాపునకు ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి.ఏఏ షాపులకు దరఖాస్తులు పడలేదో చెప్పలేమని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
‘మత్తు’ దిగుతోంది..!
తణుకు/తణుకు అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్‌పాలసీ మద్యం వ్యాపారుల్లో గుబులు పుట్టిస్తోంది. నిబంధనలు కఠినతరం చేయడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు. రెండేళ్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధనతో పాటు ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లోని అత్యధికంగా అమ్మకాలు జరిపే దుకాణాలను తన వద్ద ఉంచుకోవడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లెసైన్‌స ఈ నెలాఖరుతో ముగియనుండగా జులై 1 నుంచి నూతన పాలసీ ప్రకారం కొత్త షాపులు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణకు అధికారులు తెరతీశారు. తొలుత స్పందన అంతంతమాత్రంగానే ఉన్నా శుక్రవారం భారీగానే దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మంది కొత్తవారు కావడం గమనార్హం. జిల్లాలో 428 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించనుండగా వీటిలో పది శాతం షాపులను మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వం నిర్వహించనుంది. ఇదిలా ఉంటే నూతన పాలసీ, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటుతో ఇకపై తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు, లెసైన్సు ఫీజులు, అద్దెలు పెరిగిపోవడంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు కొత్త దుకాణాల ఏర్పాటుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. గతంలో దరఖాస్తుతో పాటు కేవలం పాన్ ఖాతా నంబర్ పేర్కొనే నిబంధన సడలించి ఐటీ రిటర్న్స్ సమర్పించాలని కోరుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు గతంలో రూ. 25 వేలు ఉన్న నాన్ రిఫండబుల్ (తిరిగిరానిది) ప్రస్తుతం గ్రామాల్లో రూ.30 వేలు, పట్టణాల్లో రూ.40 వేలు, కార్పొరేషన్లో రూ. 50 వేలు నిబంధన కూడా ఇబ్బందిగానే మారింది. సర్కారీ నిర్ణయం ఫలితాలనిచ్చేనా? మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ దోపిడీని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఎమ్మార్పీకే అమ్మకాలు చేపట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల నిర్వహణ విధానం ప్రైవేట్ షాపులను ప్రోత్సహించేలా ఉంటే ఫలితం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇలాంటి విధానం అమలు చేశారు. అయితే కేవలం చీప్ లిక్కర్‌కు సంబంధించిన నిల్వలు మాత్రమే అందుబాటులో ఉండటంతో పాటు అధిక ధరలున్న మద్యం నిల్వలు ఉండేవి కావు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధానం ఫలితాలు ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అప్రమత్తంగా ఉండాలి
రవివర్మ, డిఐజీ, క్రైమ్ నాంపల్లి: రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని క్రైమ్స్ డీఐజీ రవి వర్మ అన్నారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఫ్యాప్సీ, సీసీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సైబర్ క్రైమ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధే సైబర్ నేరాల పెరుగుదలకు కారణమని, ప్రతి రోజూ 20 మంది బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్తో చెడే ఎక్కువగా జరుగుతున్నదని, వ్యాపారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లకు వచ్చే లాటరీ ఎస్ఎంఎస్లపై ఎట్టి పరిస్థితుల్లో స్పందించరాదని సూచించారు. నైజీరియన్లే సైబర్ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆన్లైన్ షాపింగ్, హోటల్స్, పెట్రోలు బంకుల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు అకౌంట్ నంబరు, క్రెడిట్‌కార్డు, డిబిట్ కార్డులను విచ్చలవిడిగా వినియోగించరదని సూచించారు. ఫ్యాప్సీ అధ్యక్షులు వెన్నం అనీల్రె డ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు బ్యాంకులతో జరిపే లావాదేవీల పట్ల నిర్లక్ష్యం వ హించవద్దని, ఎప్పటికప్పుడు మీ అకౌంట్లలో నిల్వ ఉన్న మొత్తాలను సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ బ్యాంకింగ్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గౌర శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్టల్లో... గుట్టుగా
ఏటా కొండలను గుల్లచేస్తూ సాగించే రంగురాళ్ల తవ్వకాలు సాలూరు ఏజెన్సీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా పట్టించుకోకుండా ఎప్పటిలాగే పలుగుపార పట్టుకుని కొండలను తొలిచేస్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారం సాగుతుండడంతో వ్యాపారులే కూలీలను నియమించి తవ్వకాలు సాగిస్తున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా కూలీలు, వ్యాపారులు వెరవడంలేదు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన వర్తకులు వెనక ఉండి చక్రం తిప్పుతున్నారు. సాలూరు/సాలూరు రూరల్: చినుకుపడితే చాలు ఏజెన్సీలో రంగురాళ్ల జాతర ప్రారంభమవుతుం ది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండప్రాం తంలో మట్టి వదులుగా మారడంతో రంగరాళ్ల కోసం తవ్వకాలు ప్రారంభించారు. సాలూరు ఏజెన్సీతో పాటు ఒడిశా రాష్ట్రంలోని సుంకి వద్ద ఈ తవ్వకాలు జోరుగా సాగుతు న్నాయి. మట్టిపెళ్లలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నా కూలీలు భయపడడం లేదు. మండలంలోని సారిక పంచాయతీలోని సొంపిగాం స మీపంలోనున్న బంగారుగుడ్డి, సంపంగిపాడు పంచాయతీలోని పుల్లమామిడి సమీపంలోనున్న తండికొండ, రూడి గ్రామం సమీపంలోని హనుమాన్‌కొండ, దండిగాం కొత్తూరు సమీపంలోని సూరన్నకొండలతోపాటు బట్టివలస సమీపంలోని ఎత్తై కొండలతోపాటు దొరలతాడివలస సమీపంలోని గుట్టల్లోనూ, దుగ్దసాగరం డిపట్టా భూముల్లో కూడా విలువైన రంగురాళ్లున్నాయి. ప్రస్తు తం తండికొండ, హనుమాన్‌కొండ, దొరలతాడివలస, బట్టివలస ప్రాంతాలలో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ రాకను గమనించిన తవ్వకందారులు పరుగందుకుని కొండలెక్కారు. రూ కోట్లలో వ్యాపారం రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా బేఖాతరుచేస్తున్నారు. కేట్ ఐ, మూన్ స్టోన్ తదితర రకాల రంగురాళ్లు ఎక్కువగా లభ్యమవుతుండడంతో ఈ ప్రాంతంపై వ్యాపారులు దృష్టి పెట్టారు. వీటి పరిమాణం, నాణ్యతనుబట్టి వేల రూపాయల నుంచి రూ. లక్షల్లో ధర పలుకుతున్నాయి. స్థానిక వ్యాపారులు తవ్వకందారుల నుంచి రంగురాళ్లను కొనుగోలుచేసి బడావ్యాపారులకు చేరవేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కోటి రూపాయలకు పైనే వ్యాపారం జరిగినట్టు తెలిసింది. బయటకుమాత్రం ఇదో కక్కుర్తి వ్యాపారంలా, గిరిజనులకు ఉపాధి మార్గంలా కనిపిస్తున్నా, అక్రమ వ్యాపారుల పాలిట కామథేనువుగా మారింది. నర్సీపట్నం వ్యాపారులే కీలకం స్థానికంగా లభ్యమవుతున్న రంగురాళ్ల కొనుగోలులో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ఇద్దరు వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకవ్యాపారి గతంలో లాడ్జిలో మకాంవేసి లావాదేవీలు నిర్వహించేవాడు. కానీ గత రెండేళ్లగా పోలీసులు నిఘా అధికమవడంతో తన సమీప బందువు ఇంట్లో తిష్టవేసి చక్రం తిప్పుతున్నాడు. అలాగే మరోవ్యాపారి సాలూరు, రామభద్రపురం తదితర ప్రాంతాల లాడ్జీలలో ఉంటూ స్థానిక వ్యాపారుల నుంచి రంగురాళ్లను కొనుగోళు చేస్తున్నాడు. విఫలమవుతున్న పోలీసు రంగురాళ్ల తవ్వకాలను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమతున్నారు. ఏజెన్సీప్రాంతంలోని ఎత్తై కొండలపై తవ్వకాలు జరగుతుండడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నారు. ప్రయాసపడి వెళ్లినా వీరి రాకను పై నుంచి గమనించి, కూలీలు పారిపోతుండడం పరిపాటైంది. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. -
తూనికలు, కొలతల శాఖ దాడులు
- ఒంగోలు బాస్టాండ్‌లోని ఆరుషాపులపై కేసులు నమోదు - ఆర్టీసీ ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామన్న ఒంగోలు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఒంగోలు: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్న పలువురు వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముందుగా వినియోగదారుల మాదిరిగా పలు షాపుల్లో శీతల పానీయాలు కొనుగోలుచేసేందుకు వెళ్లారు. అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేశారు. షాపు నెంబర్లు 5,11,13,22,41 లతో పాటు ఆర్టీసీ బస్టాండు ఆవరణలోనే ఉన్న నియోస్ ఫుడ్ కోర్టుపై కూడా కేసులు నమోదుచేసినట్లు తూనికలు కొలతల శాఖ ఒంగోలు ఇన్ స్పెక్టర్ కేవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. షాపు నెంబర్ 11లో అయితే శీతలపానీయాల అన్ని బాటిల్స్‌పై ఎంఆర్పీ ధరలు కనపడకుండా చేశారని తెలిపారు. వినియోగదారులు ప్రశ్నించకుండా ఉండేందుకు చేసిన మోసపూరితమైన చర్యగా భావిస్తున్నామన్నారు. వీరందరిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు పంపనున్నామన్నారు. ఒక్కో బాటిల్‌కు రూ. 5 నుంచి 15 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రుజువైందన్నారు. సాంకేతిక నిపుణులు ఆలీబేగ్, అనీల్, సిబ్బంది సుబ్రహ్మణ్యం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత పేరుతో దోపిడీ!
- వరి ధాన్యానికి దక్కని ‘మద్దతు’ - క్వింటాలుకు సగటు ధర రూ.1,250 - తాండూరు మార్కెట్లో వ్యాపారుల మాయ! తాండూరు: సాధారణ రకం వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. నాణ్యతాప్రమాణాల పేరుతో అన్నదాతలను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘మద్దతు’ లభించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఊదాసీన వైఖరితో యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా పంటకు ధర నిర్ణయించడం వల్ల రైతాంగానికి మేలు జరగడం లేదు. ఈనెల మొదటి వారం నుంచి మార్కెట్ యార్డులో రబీ ధాన్యం కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. తాండూరు నియోజకవర్గం పరిధిలోని యాలాల, బషీరాబాద్, తాండూరు,పెద్దేముల్ మండలాలతోపాటు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు తాండూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. పట్టణంలోని పౌరసరఫరాల గోదాంలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందనే కారణంతో చాలా మంది రైతులు మార్కెట్ యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. సాధారణ వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,360 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు సుమారు 13,463 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నారు. క్వింటాలుకు గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200, సగటు ధర రూ.1,250 మాత్రమే పలికింది. ఈ మూడు ధరలను పరిశీలించినా కనీస మద్ధతు ధర రైతులకు లభించలేదని స్పష్టమవుతోంది. ఈ ధరల ప్రకారం రైతులు క్వింటాలుకు రూ.60 నుంచి రూ.160 వరకు నష్టపోయారు. నాణ్యతాప్రమాణాలు లేనందుకే మద్దతు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత పేరుతో రైతన్నల శ్రమ దోపిడీకి గురవుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. -
మార్కెట్లో ‘రిటైల్’ మోసం
- భారీగా పెరిగిన కూరగాయల ధరలు - హోల్‌సేల్ ధరకు రెట్టింపుగా రిటైల్‌లో.. సాక్షి, ముంబై: నగరంలోని కూరగాయల ధరలు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్ రేటుకు రిటైల్ మార్కెట్ రేటుకు చాలా వ్యత్యాసం ఉంటోందని చెబుతున్నారు. ఆదివారం రిటైల్ మార్కెట్లో కిలో మిరప ధర రూ. 100- 120 పలకగా.. హోల్‌సేల్ మార్కెట్లో రూ.70 మాత్రమే ఉంది. బీన్స్ , పచ్చి బఠాణీ ధరలు కూడా ఇలాగే ఉన్నాయి. ఏపీఎంసీ హోల్‌సేల్ మార్కెట్లో పచ్చి బఠాణీ కి.లో ధర రూ.50 పలకగా, బీన్స్ కి.లో రూ. 60 వరకు ధర పలకగా.. రిటైల్‌లో రూ.100 దాటాయి. అయితే దీనిపై కూరగాయల వ్యాపారులు వేరే విధంగా స్పందిస్తున్నారు. రిటైల్ ధరలు హోల్‌సేల్ ధరలకు రెట్టింపుగానే ఉంటాయని పేర్కొంటున్నారు. ‘మామూలుగానే రిటైల్ ధరలు హోల్‌సేల్ ధరల కంటే రెట్టింపుగా ఉంటాయి. అకాల వర్షాలు, కూరగాయల సరఫరా తగ్గిపోవడం, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, గుంటూరు, హవేరి నుంచి కూరగాయల సరఫరా గణనీయంగా తగ్గడంతో ముంబై మార్కెట్లో కూరగాయల డిమాండ్ పెరిగింది’ అని హోల్ సేల్ వ్యాపారి బాలాసాహెబ్ బోండ్లే తెలిపారు. ప్రస్తుతం రాయ్‌పూర్ నుంచి వచ్చే పచ్చిమిరప ఎక్కువ ధర పలుకుతోందని, డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. పచ్చిబఠాణీ, కాలీఫ్లవర్, బీన్స్, వంకాయలకు అన్‌సీజన్ కావడంతో ధరలు పెరిగాయని వ్యాపారి మోహిత్ యాదవ్ పేర్కొన్నారు. టమోటా, క్యాబేజీ, కీరదోస ధరలు నిలకడగానే ఉన్నాయి. -
మిషన్ స్పీడ్ పెంచాల్సిందే
బోయినపల్లి : జిల్లాలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది 1188 చెరువులు అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు లక్ష్యం విధించుకోగా ఇప్పటివరకు 355 చెరువుల్లో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభంలోపు పనులు పూర్తికావాల్సి ఉండగా కొన్ని చెరువుల అంచనాలే పూర్తి కాలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం జిల్లాలో 1088 చెరువుల సర్వే పూర్తికాగా, 571 చెరువులకు టెండర్లు పిలిచారు. వీటిలో ఆర్ఆర్ఆర్ (రిజిస్ట్రేషన్, రెనోవేషన్) పథకం చెరువులు 113 ఉన్నాయి. మరో నెలన్నర, రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఇంకా 733 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.262 కోట్లతో 721 చెరువులకు పరిపాలన అనుమతి లభించింది. పరిపాలన అనుమతి పొందిన చెరువుల ఆయకట్టు 71,158 ఎకరాలు. ఇందులో 571 చెరువులకు అధికారులు టెండర్లు పిలిచారు. అంచనాలు పూర్తయి రూ.376 కోట్లతో 933 చెరువులు సీఈ ఆమోదం కోసం ఉన్నాయి. వీటి ఆయకట్టు లక్షా 8 వేల ఎకరాలు. ఇందులో ఆర్ఆర్ఆర్ పథకం కింద 60 చెరువు పనులు ఉన్నాయి. ఇంకా జిల్లాలో దాదాపు 319 చెరువులకు అధికారులు టెండర్లు పిలవాల్సి ఉంది. తీసిన పూడిక 6 లక్షల క్యూబిక్ మీటర్లపైనే... జిల్లాలో ఇప్పటివరకు పనులు ప్రారంభించిన 355 చెరువులనుంచి ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టిని తీశారు. ఈ మట్టిని కొంతమంది రైతులు పొలా ల్లో పోసుకోగా, కొన్ని చోట్ల ఇటుక బట్టీలకు, మరికొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారు. చెరువు పనుల కోసం జిల్లాలో కొత్తగా 50 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను అధికారులు నియమించారు. వీరు నిత్యం చెరువుల పూడికతీత జరుగుతున్న ప్రదేశాల్లో సర్వే పనులు, క్షేత్రస్థారుులో పనుల పరిశీలన చేపడుతున్నా రు. పనులు ఇలాగే ఆలస్యమైతే వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తవడం కష్టం కావడంతో పనులు వేగవంతం చేయూలని నీటిపారుదల శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కష్టమవుతున్న సర్వే జిల్లాలో అధికారులు గుర్తించిన చెరువుల్లో సర్వే చేసి అంచనాలు తయారు చేయడానికి అధికారులకు చాలా సమయం పట్టినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ముళ్ల చెట్లు, పిచ్చిచెట్లతో చెరువుల్లో కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. అటువంటి చెరువులను గుర్తించి వాటిలో ఉన్న ముళ్ల, పిచ్చి చెట్లలో సర్వే చేసే సరికి అధికారులకు తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది. పూడిక మట్టిపై అవగాహన కరువు జిల్లాలోని చెరువుల నుంచి తీస్తున్న పూడిక మట్టి సారవంతమైనదని ఇక్రిశాట్ వారు గుర్తించారని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ ఈ నెల 10న కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మిషన్ కాకతీయ అమలు, పర్యవేక్షణ కమిటీ సమీక్షలో వెల్లడించారు. రైతులు చెరువుల పూడిక మట్టి తీసుకునేలా 2 లక్షల కరపత్రాలు ముద్రించి ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు, ఎంపీడీవోలు, ఏఈలు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. పూడిక మట్టి వేస్తే నేల సారవంతమవుతుంది. కానీ, చాలా చోట్ల రైతులు ఈ మట్టిని పొలాల్లోకి తరలించుకోవడం లేదు. -
నకిలీ రసీదులు.. రెట్టింపు వసూళ్లు!
- ఆశీలు వసూలులో కాంట్రాక్టర్ నిర్వాకం - రాజాం నగర పంచాయతీలో దందా - నిత్య దోపిడీకి గురవుతున్న వ్యాపారులు, వాహనదారులు - కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం - దాంతో కలెక్టర్‌ను ఆశ్రయించిన స్థానికులు రాజాం : కాంట్రాక్టర్ అత్యాశకు పోతున్నాడు. కమిషనర్ స్పందించడం లేదు. ఇంకేముంది.. వ్యాపారులు, వాహనాల యజమానులు నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఇదంతా రాజాం నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లలో జరుగుతున్న తంతు. ఆశీలు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు ముద్రించి వాహనాలు, షాపుల నుంచి నిర్ణీత రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ మార్కెట్లలో షాపులు, వాహనాలు, వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. నగర పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి రూ.6 లక్షల వరకు పాట వెళ్లేది. అయితే ఆదాయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు పార్కింగ్, షాపుల ఫీజులను 100 నుంచి 150 శాతం వరకు పెంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన ముతికి వెంకట్రావు అనే వ్యక్తి రూ.15 లక్షలకు ఆశీలు కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తక, వ్యాపార సముదాయాలు, వాహనదారుల నుంచి ఆశీలు వసూలు ప్రారంభించారు. అయితే నగర పంచాయతీ గెజిట్‌లో పేర్కొన్న రేట్ల ప్రకారమే వసూలు చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ రసీదులు ముద్రించారు. రసీదులపై నగర పంచాయతీ సీలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈయన ఇస్తున్న రసీదులపై దొంగ ముద్రలు కనిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక లారీకి గెజిట్ ప్రకారం రూ.83 ఆశీలు వసూలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు రసీదులు కూడా చూపించారు. అదేవిధంగా షాపులు, ఇతర తోపుడు బళ్లు, చిరువ్యాపారుల నుంచి నిర్ణీత ఫీజు కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ సంపాదనే తక్కువని.. అందులోనూ దోపిడీకి పాల్పడితే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తీరుకు నిరసనగా పారంకోటి సుధ, ఆశపు సూర్యం, పల్ల అప్పలనాయుడు, వంజరాపు రాము తదితరులు ఇటీవల నగర పంచాయతీ కమిషనర్ సింహాచలాన్ని కలిసి పిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని కమిషనర్ వారికి చెప్పారు. అయినా వసూళ్లు ఆగకపోవడంతో బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
ఖాళీ చేయండి
లెనిన్సెంటర్లోని షాపుల యజమానులకు నోటీసులు కాలువగట్ల సుందరీకరణలో భాగమే.. {పత్యామ్నాయం చూపాలంటున్న వ్యాపారులు చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు విజయవాడ సెంట్రల్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది చిరు వ్యాపారుల పరిస్థితి. నగర సుందరీకరణలో భాగంగా కాల్వగట్ల పక్కన ఆక్రమణల తొలగింపుపై అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని బందరు, ఏలూరు, రైవస్ కాల్వగట్లపై ఆక్రమణల్ని ఖాళీ చేయాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఏళ్ల తరబడి అక్కడ వ్యాపారాలు చేస్తున్నవారు బెంబేలెత్తిపోతున్నారు. లెనిన్ సెంటర్లో కాల్వగట్టుపై 46 వస్త్ర దుకాణ షాపులు, 34 పుస్తకాల దుకాణాలతో పాటు మరో 30కిపైగా చెప్పులు, వెల్డింగ్, మోటారు రిపేరింగ్ వర్క్స్ వంటివి ఉన్నాయి. ఉన్న పళంగా వీటిని తొలగించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అకస్మాత్తుగా ఖాళీ చేయమనడంతో లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నవారు భవిష్యత్ అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా తమను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే వాదనతో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ పొట్టకొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలోనే తాము నోటీసులు జారీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేయడంతో ఏం చేయాలో పాలుపోక ప్రజాప్రతినిధులు కంగుతింటున్నారు. ప్రస్తుతం నోటీసులే వచ్చాయి కాబట్టి వేచిచూద్దామనే ధోరణిలో వ్యాపారులు ఉన్నారు. పరిస్థితి చేయి దాటితే ఆందోళనకు సన్నద్ధం కావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీ చేయాల్సిందే : ఇరిగేషన్ ఎస్ఈ నగర సుందరీకరణలో భాగంగా కాల్వగట్లపై ఆక్రమణల్ని తొలగించమని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకే నోటీసులు ఇచ్చామని ఇరిగేషన్ ఎస్ఈ సీహెచ్ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణలు ఎలా వచ్చాయనేది తనకు తెలియదని, నోటీసులు అందుకున్న వ్యాపారులు ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు. -
ఆశలు ఎగిరేనా..!
విమానాశ్రయ ఏర్పాటుకు గనుల దెబ్బ! సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విమానాశ్రయానికి పదే పదే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట్లో విమానాశ్రయ ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే ఒక్కరూ ముందుకు రాలేదు. తాజాగా విమానాశ్రయానికి ఇవ్వాల్సిన భూముల్లో అపారమైన ఖనిజాల నిల్వలు ఉన్నాయని గనులశాఖ అంటోంది. ఇంత విలువైన భూములు కేటాయించడం సరికాదని గనులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశంలో విమానాశ్రయ ఏర్పాటు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతంలో ఖనిజ నిల్వలున్న భూములను ఇవ్వలమేని ఆ శాఖ తేల్చిచెబుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములను ఇవ్వాల్సిందేనని అంటోంది. మరోవైపు కర్నూలు జిల్లాలో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ప్రభుత్వం.. నిధుల కేటాయింపులో మాత్రం మొండిచేయే చూపింది. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చలేదు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ కాస్తా ఒక్క అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. ఖనిజ నిల్వలున్నాయి...! కర్నూలుకు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో సుమారు 2,760 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేతవరం, పుడిచెర్ల, ఒర్వకల్లు, కన్నమదకల గ్రామాల పరధిలో ఏర్పాటు కానున్న పారిశ్రామిక హబ్‌లో భాగంగా ఈ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. అయితే, విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన భూముల్లో ఖనిజ నిల్వలు ఉన్నాయని భూగర్భ గనులశాఖ అధికారులు ఒక నివేదిక తయారుచేశారు. ఖనిజ సంపద ఉన్న భూములను విమానాశ్రయ ఏర్పాటుకు కేటాయించడం సరికాదని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో గనులశాఖ స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. విమానాశ్రయ ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ భూములను చూసుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడినట్టు సమాచారం. మరోవైపు ఈ భూముల్లో ఖనిజాల అన్వేషణకుగానూ లెసైన్సు కోసం ఎవరైనా దరఖాస్తు చేస్తే సమస్యలు కూడా తప్పవన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ఇవే భూములు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఆదీ నుంచి అడ్డంకులే...! కర్నూలు విమానాశ్రయానికి మొదటి నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. వాస్తవానికి జిల్లాకో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారు. ఇందులో భాగంగా ఆయన హయాంలోనే కర్నూలు జిల్లాలో ప్రాంతీయ విమానాశ్రయ ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. ఇందుకోసం ఆయన టెండర్లు కూడా పిలిచారు. అయితే, మొదటిసారి టెండర్లు పిలిచినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. టెండరులో పేర్కొన్న మేరకు రాయితీలు ఇస్తే తమకు పెద్దగా లాభసాటి కాదని భావించినందువల్లే ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు అదనపు రాయితీలు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఈ అదనపు రాయితీలతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు కూడా ప్రక్రియ ముందుకుసాగింది. ఈ పరిస్థితుల్లోనే వైఎస్సార్ మరణించారు. ఫలితంగా విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ కాస్తా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. బడ్జెట్లో నిధులూ లేవు...! కర్నూలు జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానని తాజాగా తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో చూపిన కరుణ అంకెల్లో మాత్రం ఆయన చూపలేకపోయారు. అటు విజయవాడ గన్నవరంతో పాటు ఇటు తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా విస్తరణ కోసం బడ్జెట్లో నిధులను కేటాయించిన ప్రభుత్వం.. కర్నూలు విమానాశ్రయానికి మాత్రం తాజా బడ్జెట్లో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మొత్తం మీద కర్నూలు విమానాశ్రయం మీద ప్రభుత్వం శీతకన్ను వేసిందన్న అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. -
బైండోవరా.. బేఫికర్!
యథేచ్ఛగా గుట్కావ్యాపారుల దందా దాడులతో తాత్కాలిక విరామం దొరికినవి చిన్న చేపలే! విజయవాడ సిటీ : పోలీసులు బైండోవర్ కేసులు పెట్టినా కొందరు వ్యాపారులు అదురు, బెదరు లేకుండా నిషేధిత ఖైనీ, గుట్కా వ్యాపారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నగరంలోని పాతబస్తీకి చెందిన గుట్కా వ్యాపారులపై కొద్ది రోజల కిందట వన్‌టౌన్ పోలీసులు బైండోవర్ కేసులు పెట్టినట్టు విశ్వసయంగా తెలిసింది. ఇకపై తాము చట్టవిరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించబోమని, ఒక వేళ ఆ విధంగా చేసిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అనేది బైండోవర్ కేసుల సారాంశం. ఆ వ్యాపారులు గతంలో చట్ట విరుద్ధంగా గుట్కా, ఖైనీ అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల రికార్డుల్లోకి ఎక్కడం వలనే పోలీసులు బైండోవర్ చేసినట్టు తెలిసింది. పాత నేరస్తులు మరోసారి ఆ తరహా నేరాలకు పాల్పడకుండా కొన్ని సందర్భాల్లో బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. పాతబస్తీలో పలువురు గుట్కా వ్యాపారులపై బైండోవర్ కేసులు పెట్టారు. బైండోవర్ కేసుల్లో నిందితుల రోజువారీ చర్యలను పోలీ సులు నిరంతరం పరిశీలిస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు తిరిగి గుట్కా వ్యాపారం చేసేందుకు సాహసించే అవకాశం లేదు. అయితే మొక్కుబడిగా బైండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు ఆపై మామూళ్లకు తెరలేపినందునే గుట్కా వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు అందుతున్నందున పోలీసులు వారిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక విరామం పత్రికల్లో వరుస కథనాలతో గుట్కా హోల్‌సేల్ వ్యాపారులు తాత్కాలికంగా వ్యాపారాలు ఆపినట్టు తెలిసింది. మంగళవారం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పలువురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన వారిలో ప్రముఖులైన హోల్‌సేల్ వ్యాపారులు లేరని సమాచారం. ముందుగానే వారు షాపులు మూసేయడంతో పోలీసుల దాడులకు చిన్న చేపలే దొరికినట్టు తెలిసింది. -
బడ్జెట్ రోజు మరింత అప్రమత్తం
- స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు అవకాశం - మరింత పటిష్టంగా నిఘా వ్యవస్థ న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా నేడు(శనివారం) స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ప్రత్యేక ట్రేడింగ్ జరుగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండొచ్చన్న అంచనాలతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నాయి. లావాదేవీలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారొకరు చెప్పారు. బడ్జెట్ అంచనాలను అవకాశాలుగా తీసుకొని కొంతమంది ట్రేడర్లు మోసపూరితంగా వ్యవహరిస్తారేమోన్న అంచనాలతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సహా పలు దేశీయ సంస్థలు ట్రేడింగ్‌లో పాల్గొంటాయని, భారీ టర్నోవర్ నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎలాంటి అకస్మాత్తు ఒడిదుడుకునైనా ఎదుర్కొనేలా సిస్టమ్‌లను, మౌలిక సదుపాయాలను అప్రమత్తం చేసుకోవాలని వివిధ మార్కెట్ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయనే అంచనాలతో ట్రేడింగ్ మార్జిన్‌ను పెంచుతున్నామని పలువురు బ్రోకర్లు ఇప్పటికే తమ తమ క్లయింట్లకు సమాచారమందించారు. విదేశాల్లో శనివారం స్టాక్ మార్కెట్లు సెలవు కాబట్టి, పలువురు విదేశీ ఇన్వెస్టర్లు నేరుగా ట్రేడింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. -
రియల్ దెబ్బ
స్థిరాస్తి వ్యాపారం స్తంభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పట్లో పుంజుకునేలా కనిపించడం లేదు. మూడేళ్లకు పైగా స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎంతో మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్ర విభజన జరిగినా..రియల్ బూమ్ పుంజుకోలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒంగోలు టూటౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అనతి కాలంలోనే కోట్లు కూడబెట్టుకోవచ్చన్న ఆశతో.. అందులో దిగిన వారికి చుక్కలు కనపడుతున్నాయి. సరైన ధరలు..కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు. నాడు ఇలా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం జిల్లాలో 2006 నుంచి మూడు పూవులు..ఆరు కాయలుగా సాగింది. దేనికీ పనికి రాని భూములకు సైతం రెక్కలొచ్చాయి. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్ను ప్రభుత్వ ఖాళీ స్థలాలపై పడింది. రాజకీయ నాయకులు సైతం ప్రభుత్వ భూములపై డేగ కన్ను వేశారు. అవకాశం ఉన్న మేర దోచేశారు. ఆక్రమించుకున్న స్థలాలకు సైతం అధిక ధరలు పలికాయి. రూ.10 వేలకు కూడా కొనని ఎకరం భూమి ప్రాంతాన్ని బట్టి లక్షల నుంచి కోట్లకు పలికింది. భూదందా విపరీతంగా పెరిగింది. పచ్చని పొలాలు సైతం ప్లాట్లుగా మారిపోయాయి. గ్రామ శివారు ప్రాంతాల్లో సైతం వెంచర్లు వెలిశాయి. పట్టణ, నగరాలకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములకు ఎక్కడ లేని ధరలు వచ్చాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట ప్రాంతంలో ఎకరా రూ.2.40 లక్షల నుంచి రూ.1.70 కోట్లకు పెరిగింది. దర్శి డివిజన్లో రెండు, మూడు లక్షలు అమ్మిన ఎకరా పొలం రూ.2.50 కోట్లు పలికి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైయింది. జిల్లాకు పశ్చిమ ప్రాంతమైన దొనకొండ మండలంలో సెంటు స్థలం లక్ష పలికి ఔరా అనిపించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రహదారుల వెంట ఉన్న వ్యవసాయ భూముల్లో ఇంటి స్థలాల కోసం ప్లాట్లు వేయడం మొదలెట్టారు. ఒంగోలు నుంచి మార్కాపురం వరకు రోడ్ల వెంబడి వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తీరప్రాంతమైన కొత్తపట్నం, చీరాల, వేటపాలెం, ఇటు నెల్లూరు వరకు రెండొంతుల పొలాలు ప్లాట్లుగా మారాయి. ఒంగోలు నుంచి కొత్తపట్నం వరకు కుప్పలు, తెప్పలుగా వేసిన వెంచర్లకు ఆకర్షణీయమైన అందాలు అద్దారు. మధ్యవర్తులకు పూర్తిగా పని దొరికింది. వీరిలో కొంతమంది లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు. కొంతమంది ప్రైైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పెట్టి బాగా సంపాదించారు. అన్ని రంగాల వారు ప్రత్యక్షంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. అపార్ట్మెంట్ వ్యాపారాలు జోరుగా చేశారు. ఇలా 2010-11 వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బంగారు బాతులా మారింది. నేడు ఇలా... ఆ తరువాత రాష్ట్ర విభజనపై కేంద్రం నాన్చుడి ధోరణి చివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పూర్తిగా ముంచింది. ఇక రాను,రాను స్థిరాస్తి వ్యాపారం మందగించింది. చివరకు తెలంగాణా ఇచ్చినా స్థిరాస్తి వ్యాపారం ముందుకు సాగలేదు. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. స్థలం అడిగే నాథుడు లేకుండా పోయాడు. వేసిన వందలాది వెంచర్లలో చిల్లచెట్టు మొలిచాయి. కనిగిరి, పామూరు రోడ్లలో సెంటు లక్ష అమ్మితే నేడు సగానికి సగం విలువ పడిపోయింది. పొదిలి, మార్కాపురంలలో ఎకరా రూ.7 లక్షల విలువైన స్థలం నేడు రూ.3 లక్షలకు కూడా కొనని పరిస్థితి వచ్చింది. బహుళ అంతస్తుల్లో ప్లాట్లు సైతం అమ్ముడుపోక వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న వారి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. భూములు కొనేవారు లేక వడ్డీ భారం పెరిగిపోయి చివరకు వడ్డీ వ్యాపారులకే ఆ భూములు స్వాధీనం చేస్తున్నవారున్నారు. గుంటూరు- విజయవాడను రాజధానిగా ప్రకటించినా.. రియల్‌బూమ్ అక్కడికే పరిమితమైంది. ఇతర జిల్లాలకు పాకలేదు. అయితే ముందు ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందన్న ఆశలు చాలా మందిలో ఇంకా సజీవంగా ఉన్నాయి. -
పప్పు కూడుకూ కరువే..?
రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. సాధారణ ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. వర్షాభావంతో సాగు తగ్గడం, దిగుబడి తగ్గిపోవడంతో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడింది... వ్యాపారుల ‘నిల్వల’ మాయాజాలం మరింత కరువు తెచ్చిపెట్టింది. దీంతో పెసరపప్పు ధర ఇప్పటికే ‘వంద’ మార్కును దాటి దూసుకుపోతుండగా... మినపపప్పు, కందిపప్పుల ధరలు దాని దగ్గరికి చేరుకుంటున్నాయి. ఇక వేసవి ముదిరే సమయానికి పప్పుల ధరలు అందనంత ఎత్తుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో చుక్కలను తాకుతున్న పప్పుల ధరలు ⇒ రూ. 112కు చేరిన పెసరపప్పు.. ⇒ రూ. 100కు చేరువలో కందిపప్పు, మినపపప్పు ⇒ వర్షాభావంతో తగ్గిన సాగు.. పడిపోయిన దిగుబడి ⇒ దీనిపై ఎప్పుడో హెచ్చరించిన అసోచామ్ ⇒ ఏకంగా 32 శాతం తగ్గిన పప్పు ధాన్యాల సాగు ⇒ భారీగా నిల్వలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ⇒ రంగంలోకి దిగిన ప్రభుత్వం.. నిల్వలపై నిఘా సాక్షి, హైదరాబాద్:- సాగు తగ్గింది.. దిగుబడీ పోయింది.. సాధారణంగా రాష్ట్రంలో 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగుచేశారు. పెసర 48 శాతం, మినుములు 45 శాతం, కందులు 87 శాతం మేర మాత్రమే సాగయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోయింది. ఒక్క కందుల ఉత్పత్తి పరిస్థితి మాత్రమే కొంతవరకూ మెరుగ్గా ఉంది. పెసరపప్పు అయితే ఏకంగా 1.07 లక్షల టన్నుల ఉత్పత్తికిగానూ కేవలం 24 వేల టన్నులకు తగ్గిపోయింది. మినుముల ఉత్పత్తి 46 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి చాలా దూరంగా.. కేవలం ఆరు వేల టన్నులకు పరిమితం కావడం ఆందోళనకరం. ముందే హెచ్చరించినా.. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిపై పారిశ్రామిక మండలి ‘అసోచామ్’ గత ఖరీఫ్ సీజన్ మొదట్లోనే ప్రభుత్వాలను హెచ్చరించింది. రుతుపవనాలు సరిగా ఉండని నేపథ్యంలో వర్షపాతం తగ్గొచ్చని... దానివల్ల పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోయి ధరలు పెరగవచ్చని తమ నివేదికలో పేర్కొంది. అందులోనూ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం వాటా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని స్పష్టంగా తెలియజేసింది. కానీ ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదు. అసోచామ్ చెప్పిన విధంగానే పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. నిల్వలపై ఆంక్షలు.. విజిలెన్స్ నిఘా రాష్ట్రంలో పప్పుల ధరలు మరింతగా పెరిగే అవకాశాన్ని, డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు కృతిమ కొరత సృష్టించే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరానికి ఒక పరిమితిని, ఇతర ప్రాంతాల్లో మరో పరిమితిని విధించింది. హైదరాబాద్‌లో శనగపప్పు మినహా అన్ని రకాల పప్పులను హోల్‌సేల్ వ్యాపారులైతే నాలుగు వేల క్వింటాళ్లు, రిటైల్ వ్యాపారులు 125 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. అదే శనగపప్పును హోల్‌సేలర్ వెయ్యి క్వింటాళ్లు, రిటైలర్ 30 క్వింటాళ్లను మించరాదని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో శనగపప్పు హోల్‌సేలర్ 500 క్వింటాళ్లు, రిటైలర్ 20 క్వింటాళ్లు.. ఇతర పప్పులైతే హోల్‌సేల్ వ్యాపారి 2,500 క్వింటాళ్లు, రిటైలర్ 100 క్వింటాళ్లను మించి నిల్వ ఉంచరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ఇంతకు మించి పప్పులు నిల్వ చేసిన వ్యాపారులపై విజిలెన్స్ దాడులు చేయాల్సిందిగా ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌శాఖ పప్పు ధాన్యాల నిల్వలపై నిఘాను పెంచింది. చుక్కల్ని తాకుతున్న పెసరపప్పు.. పప్పు ధాన్యాల ఉత్పత్తులు తగ్గడంతో రాష్ట్రంలో పెసరపప్పు ధర కిలో రూ. 112 కు చేరింది. గత ఏడాది ధరతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. పలు చోట్ల రిటైల్ మార్కెట్లో పెసరపప్పు ధర కిలో రూ. 120 వరకూ ఉంది. ఇక కందిపప్పు ధర కిలో రూ. 90కి పెరగగా... మినపపప్పు ధర రూ. 94కు చేరింది. సాగు తగ్గిన నేపథ్యంలో భవిష్యత్ డిమాండ్‌ను ముందుగానే ఊహించిన వ్యాపారులు పప్పుల నిల్వలను భారీగా పోగు చేయడం, వాటిని కొద్దికొద్దిగా మార్కెట్లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టారీతిన నిర్ణయిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. దీంతో సామాన్యుడికి మాత్రం ధరాఘాతం తప్పడం లేదు. -
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం టన్నెల్ పనులకు బ్రేక్
రాజంపేట: ఓబులవారిపల్లె- కృష్ణపట్నం మార్గం రైల్వేలైన్‌కు సంబంధించిన టన్నెల్ నిర్మాణ పనులు ఆది నుంచి అడ్డంకులతో ముందుకు సాగడంలేదు. ఈ మార్గంలో టన్నెల్ నిర్మించేందుకు 2007లో చెన్నై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) టెండర్లు పిలిచింది. అప్పట్లో ముంబయికి చెందిన దీపికా నిర్మాణ సంస్థ ఈ పనులను దక్కించుకుని పనులు మొదలుపెట్టింది. ఈ మార్గంలోని వెలుగొండ అడవుల్లో కొండను తవ్వినప్పుడు వచ్చిన మట్టి, ఎర్త్ పనులకు సంబంధించిన విషయంలో ఆర్వీఎన్ ఎల్తో కాంట్రాక్టు సంస్థకు విభేదాలు పొడసూపాయి. దీనికితోడు టెండర్లు పిలిచినప్పటి రేట్లతో తాము పనులు కొనసాగిస్తే నష్టపోతామని అందువల్ల ఈ పనులను చేయలేమని సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఆర్వీఎన్ఎల్ గత ఏడాది చివర్లో ఈ పనులకు తిరిగి టెండర్లు నిర్వహించింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సంబంధించిన హెచ్ఈడబ్ల్యు నిర్మాణ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైలుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం కావాల్సి ఉంది. ఈ దశలో తొలుత టెండర్లు దక్కించుకుని ఆ తర్వాత పనులు నిలిపేసిన దీపికా సంస్థ ఆర్వీఎన్ఎల్ నుంచి తమకు కోట్లాది రూపాయల డబ్బు రావాల్సి ఉందని కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పనులను దక్కించుకున్న హెచ్ఈడ బ్ల్యు సంస్థ పనులు మొదలుపెట్టేందుకు వీలు లేకుండా పోయింది. టన్నెల్ వ్యవహారం కోర్టులో ఉన్నందున పనులకు బ్రేక్ పడిందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టులో కేసు పరిష్కారం కావడంతో పాటు ఈ మార్గంలో పనులకు పూర్తిస్థాయిలో నిధులు విడుదలైతే తప్ప టన్నెల్ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనెల 23న రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా అధిక నిధులు కేటాయిస్తారేమోననే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇతర పనులు ముమ్మరంగా.. ఇదిలా ఉండగా ఈ మార్గంలో ఉన్న మొత్తం మూడు రీచ్‌లలో జర గాల్సిన మిగతా పనులను ఆర్వీఎన్ఎల్ వేగవంతంగా చేపడుతోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని ఎర్త్‌వర్క్ పనులు పూర్తయ్యాయి. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ నుంచి నేతివారిపల్లె వరకు రైలు పట్టాలు వేసేందుకు అవసరమైన ఎర్త్ వర్క్ పనులను 17 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. 38 చిన్న వంతెనలు, 8 పెద్ద వంతెనలు పూర్తి కానున్నాయి. పెరిగిన అంచనా వ్యయం.. కృష్ణపట్నం రైల్వేలైను 2005-06లో మంజూరైనప్పుడు రూ.930 కోట్ల అంచనాతో రైల్వే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. టన్నెల్ నిర్మాణ వ్యయం కూడా రూ.400 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గంలో టన్నెల్ నిర్మాణ పనులకు మోక్షం లభించేదెప్పుడు అనే చర్చ జరుగుతోంది. -
ఇప్పుడేం చేద్దాం?
కామారెడ్డి : పనులు పంచుకుందామనుకున్న కాంట్రాక్టర్లు కంగు తిన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గుత్తేదార్లు రింగయ్యారు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి నియోజకవర్గంలో అధికార,ప్రతిపక్ష పార్టీలకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు కొందరు ‘మిషన్ కాకతీ య’ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే ముం దస్తుగా సమావేశమై పనులను పంచుకున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో వా రంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఏం చేయూలనే వి షయంపై అందరూ కలిసి చర్చించుకున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంట్రాక్టర్లు మాత్రం సిండికేట్‌గా మారుతూ సర్కారు ఆశయూనికి తూట్లు పొడుస్తున్నారు. పనులు నాణ్యతతో జరగాలని ప్రజాప్రతినిధిలు కోరుకుంటుండగా, కాంట్రాక్టర్లు అధిక లాభాలు గడించేం దుకు అడ్డదారులు తొక్కుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఇందుకు తమ పేర్లు వాడుకుంటున్నారని తెలి సిన కొందరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పోటీపడి తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేయడం, లేదం టే కుమ్ముక్కై అధిక ధరలను కోట్ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడినట్టు తెలుస్తోంది. ‘మిషన్ కాకతీయ’ పనులలో ఎలాంటి అక్రమాలు జరుగకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్లైన్లోనే టెండర్లు పిలిచింది.గు త్తేదార్లు దానిని కూడా ఓవర్ టేక్ చేసి, ప్రభుత్వాదాయూనికి గండి కొట్టాలనే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇంటెలిజెన్స్ ఆరా టెండర్లను దక్కించుకునేందుకు ముందస్తుగానే రింగయిన విషయం ‘సాక్షి’లో రావడంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఎవరెవరు ఎన్నెన్ని పనులు పం చుకున్నారు అనే వివరాలను అధికారులు ఆరా తీశారు. పనులను పంచుకోవడానికి కాంట్రాక్టర్లు అసోసియేషన్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ అసోసియేషన్‌లో ఇరు పార్టీలకు చెందినవారు పదవులు కూడా సమానంగా పంచుకున్నట్టు సమాచారం. దీనిపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. -
ముగిసిన బెరైటీస్ రవాణ టెండ ర్లు
ఓబులవారిపల్లె: మంగంపేట ఏపీఎండీసీ నిర్వహించిన బెరైటీస్ రవాణా టెండర్లు మంగళవారం ముగిశాయి. టెండర్లో పాల్గొనేందుకు పన్నెండుమంది ట్రాన్స్పోర్టర్లు షెడ్యూల్‌ను కొనుగోలు చేశారు. స్థానిక రవాణాదారులు పది మంది, ఇద్దరు కడప ట్రాన్స్పోర్టర్లు టెండర్లో పాల్గొన్నారు. ఒకదశలో టెండర్లు ఏకపక్షంగా జరిగేందుకు సన్నహాలు జరిగాయి. రైల్వేకోడూరు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు టెండర్లు ప్రశాంతంగా ముగించాలని పోటీదారులకు సూచించారు. ఏపీఎండీసీ మంగంపేట సీపీఓ కేదార్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3గంటల నుంచి రవాణా టెండర్ షెడ్యూల్‌ను పరిశీలించారు. ఇందులో శ్రీవెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ టన్నుకు రూ.792లు ధరను దాఖలు చేసి ఎల్‌వన్‌గా నిలిచింది. ఏఎస్ లాబిక్స్ రూ.1,050లు ధర దాఖలు చేసి ఎల్త్రీగా నిలిచింది. దీంతో రవాణా టెండర్లు ప్రశాంతంగా ముగిశాయి. ఇదే బెరైటీస్ పౌడర్‌ను గత నెలలో ట్రాన్స్‌పోర్టు కోసం ఏపీఎండీసీ యాజమాన్యం టెండర్లు పిలవగా పల్వరైజింగ్మిల్లుల యజమానులు మిల్లులకు రావాల్సిన బ్యాక్లాగ్ క్వాంటిటీ పై స్పష్టత వచ్చేంత వరకు టెండర్‌ను బాయ్ట్ చేయడంతో ఆగిపోయాయి. తిరిగి ఇదే టెండర్‌ను ఏపీఎండీసీ యాజమాన్యం నిర్వహించడంతో ట్రాన్స్‌పోర్టులు పోటీ పడి టెండర్లో పాల్గొన్నారు. -
ఎదురుదెబ్బ
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా ధనాన్ని కొల్లగొట్టాలనుకున్న వారి ఆశలు సాగలేదు. అధికారపార్టీకి చెందిన ఇద్దరు నేతలకు శృంగభంగం ఎదురైంది. నేషనల్ హైవే-67 రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్లను పోటీ లేకుండా చేసి రూ.26.5కోట్లు దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. మొదట ఎక్సెస్‌కు టెండర్లు దక్కించుకునే ప్రయత్నం చేయగా ఫిర్యాదులు రావడంతో చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం రీ టెండర్లకు ఆదేశించింది. దాంతో కొంత వరకు అడ్డుకట్టపడింది. తాజా టెండర్లలో 17.5 శాతం లెస్‌కు టెండర్లు దాఖలు కావడంతో మొత్తంగా రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. సాక్షి ప్రతినిధి, కడప: నేషనల్ హైవే- 67 రోడ్డు విస్తరణలో భాగంగా జిల్లాలోని బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో రూ.184 కోట్లు పనులకు గత డిసెంబర్లో టెండర్లు పిలిచారు. జిల్లాలోని ఇరువురు టీడీపీ నేతలు వీటిని తమవారికి వచ్చేలా ముమ్మర ప్రయత్నం చేశారు. ఆమేరకు కాంట్రాక్టు సంస్థలను పోటీకి రాకుండా చేశారు. తాము అనుకున్న సంస్థకు 14.5 శాతం అధిక ధరలకు కాంట్రాక్టు పనులు ఖరారు అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమేరకు రూ.26.6 కోట్లు అప్పనంగా ఆర్జించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవాలను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం రీ టెండర్లు ఆహ్వానించింది. 17.5 శాతం తక్కువకు దక్కించుకున్న ఎస్సార్కే.... వైఎస్సార్ జిల్లాలోని ఎన్‌హెచ్-67 రోడ్డు పనుల కోసం చేపట్టిన రూ.184 కోట్ల రీ టెండరులో 17.5 శాతం తక్కువకే ఎస్సార్కే సంస్థ దక్కించుకుంది. రీ టెండర్ల సందర్భంగా టీడీపీ కుయుక్తులను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, సి ఆదినారాయణరెడ్డి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు దాఖలు చేసేలా చూశారు. దాంతో అధికరేట్లకు కోట్ చేస్తే కాంట్రాక్టు పనులు ఏమాత్రం దక్కవని టీడీపీ నేతలు గ్రహించారు. ఎవరి పరిధిలో వారు వారికి అనువైన ధరలకు కోట్ చేశారు. తుదకు ఎస్సార్కే సంస్థ బద్వేల్, మైదుకూరు పరిధిలోని రూ.184కోట్ల పనులు 17.5 శాతం తక్కువకు దక్కించుకుంది. బద్వేల్ నుంచి ఆత్మకూరు వరకూ రోడ్డు కోసం రూ.226 కోట్లుకు నిర్వహించిన టెండర్లలో సైతం అదే సంస్థ 19 శాతం తక్కువ ధరకు దక్కించుకుంది. ఆ మేరకు టెండర్లను ఖరారు చేస్తూ నేషనల్ హైవే ఆథారిటీ ధ్రువీకరించింది. రూ.100 కోట్లు ప్రజాధనం సేఫ్... అధికార పార్టీ అన్న ఏకైక కారణంతో నేషనల్ హైవే రోడ్డు పనుల ద్వారా భారీగా లబ్ధిపొందాలని భావించిన తెలుగు తమ్ముళ్ల వ్యూహం విఫలమైంది. జిల్లాకు చెందిన అధికార పార్టీలోని ఓ ఎంపీ, కాంట్రాక్టర్‌గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన మరోనేత చేపట్టిన ఎత్తుగడలు నిష్ర్పయోజనం అయ్యాయి. రూ.26కోట్ల అదనపు మొత్తాన్ని ఇరువురు పంచుకోవాలనే తలంపుతో రాష్ట్ర ముఖ్యనేత ద్వారా పోటీదారులకు పైరవీలు చేయించారు. అయితే వారి ఆటలు సాగలేదు. దాంతో జిల్లాలోని బద్వేల్, మైదుకూరు రోడ్డు పనులల్లో రూ.32.3 కోట్లు తక్కువకు టెండర్ దక్కింది. అలాగే బద్వేల్ నుంచి ఆత్మకూరు రోడ్డు రూ.43కోట్లు తక్కువకు టెండర్ దక్కింది. దాంతో రూ.75కోట్లు ప్రజాధనం మిగిలింది. మొదట రూ.26కోట్ల అధిక ధరకు కోట్ చేసి టీడీపీ దక్కించుకునేందుకు సన్నద్ధం చేయడం తెలిసింది. మొత్తంగా రూ.100 కోట్లు ప్రజాధనాన్ని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కాపాడగలిగారు. -
కొనే వారేరీ..!
సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి అందరిలో ఆనందం నింపుతుండగా... రాజధానిలోని కూరగాయల రైతులు, వ్యాపారులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సంక్రాంతి సంబరాలు సొంత ఊళ్లలో జరుపుకొనేందుకు జనం తరలి వెళ్లడంతో నగరం సగం ఖాళీ అయింది. ఆ ప్రభావం తొలుత కూరగాయల వ్యాపారంపై పడింది. గ్రేటర్లో 50 శాతం మేర కూరగాయల కొనుగోళ్లు పడిపోవడంతో మార్కెట్లో సరుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ప్రస్తుతం టమాటా స్థానికంగా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వస్తోంది. దీన్ని ఏరోజుకారోజు అమ్ముకోవాల్సి రావడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ధర తగ్గించి మరీ తెగనమ్ముకొని వెనుదిరుగుతున్నారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.15 ధర పలికిన టమాటా ఆదివారం రూ.6లకు, రూ.35 ఉన్న పచ్చిమిర్చి రూ.20లకు దిగివచ్చింది. ఇదే సరుకు రైతుబజార్లో టమాటా రూ.9, రిటైల్‌గా రూ.10లకు, అలాగే మిర్చి రూ.25 ప్రకారం విక్రయించారు. హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని అమ్ముకోలేక కళ్లెదుటే వాడిపోతుండటంతో బావురుమంటున్నారు. గడచిన 4రోజుల నుంచి వ్యాపారం సగానికి సగం తగ్గడాన్ని గమనించిన పలువురు రిటైల్ వ్యాపారులు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకొనేందుకు ధర తగ్గించి అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొనేవారే లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిర్చి, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర, చిక్కుడు, గోకర, దోస వంటివి 3-4 రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా... కొనేనాథుడు లేక మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు అధికంగా ఊళ్లకు వెళ్లడంతో హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు కూడా కూరగాయల కొనుగోళ్లు తగ్గించినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. -
ధరలతో సామాన్యులకు దడ
- నషాలాన్ని అంటుతున్న పచ్చిమిరప ఘాటెక్కిన ఉల్లిపాయ - మార్కెట్లో వ్యాపారుల, దళారుల మాయాజాలం - నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్న ధరల మానిటరింగ్ కమిటీ కడప అగ్రికల్చర్ : మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలిజనానికి ఈ ధరలు కలవరం పుట్టిస్తున్నాయి. నెల క్రితం 10-12 రూపాయాల్లోపు ధర ఉన్న కూరగాయలు నేడు రూ.20 నుంచి 60కి చేరుకున్నాయి. ధరలు రెట్టింపు అవుతుండటంతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి తగ్గడమే కారణం చలిగాలులు పెరగడంతో పురుగులు, తెగుళ్లు విజృంభణ ఎక్కువై కూరగాయల దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు అడుగంటిన భూగర్భజలాల వల్ల నీటి తడులు సక్రమంగా అందకపోవడంతో దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. అలాగే కూరగాయల నాణ్యత కూడా సరిగా ఉండటం లేదు. బోరుబావుల్లో నీరు రోజురోజుకు తగ్గిపోతోందని, ఈనేపథ్యంలో కొత్తగా కూరగాయల సాగు చేపట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. ప్రధానంగా 10 రోజుల కిందట టమాట కిలో రూ.5 నుంచి రూ.10, పచ్చిమిరప రూ.12 ఉండగా నేడు రూ.24 పలుకుతోంది. వంకాయ (నాటు రకం) కిలో రూ.10 ఉండగా నేడు రూ.18, కాకర కిలో రూ.15 నుంచి రూ.20కి చేరుకుంది. చిక్కుడు కిలో 20 రూపాయల నుంచి 35 రూపాయలకు చేరుకుంది. బెండ కిలో రూ.16 నుంచి రూ. 20కు చేరింది. అలాగే క్యాబేజి కిలో రూ.18 నుంచి రూ.24 పలుకుతున్నాయి. అదే విధంగా క్యారెట్ కిలో రూ.20 నుంచి 32కి చేరింది. బంగాళదుంప కిలో రూ.20 ఉండగా నేడు రూ.30, ఉల్లిపాయలు కిలో రూ.15 పలుగా నేడు కిలో. 20-30 మధ్య ధరలున్నాయి. అలాగే బీన్స్ రూ. 20 నుంచి 36, అల్లం రూ. 48 ఉండగా ఇప్పుడు రూ.60 ధర పలుకుతున్నాయి. దళారుల మాయాజాలం.. మార్కెట్‌కు స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 29 లక్షల మంది ప్రజలు ఉండగా రోజుకు వినియోగదారులు అన్ని రకాల కూరగాయలను కలిపి 40 టన్నుల కూరగాయలను వాడుతున్నారని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. చలిగాలుల వల్ల, అడుగంటిన భూగర్భజలాల వల్ల మార్కెట్‌కు కూరగాయలు సరిగా రాలేదని సాకు చూపుతూ ధరలను అమాంతగా పెంచుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూరగాయలు దొరకనందున పొరుగున ఉన్న కర్నూలు, చిత్తూరు జిల్లాలకు, పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి కూడా కూరగాయలు తెప్పిస్తున్నందున కూరగాయ ధరలు కాస్త పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. రవాణా, కమీషన్లు, ఇతర ఖర్చులు మీద పడతాయని వాటిని ఈ ధరల్లో కలుపుతామని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకాస్తా పెరుగుతాయని అంటున్నారు. -
నిషేధం ‘గుట్కా’య స్వాహా
నగరంలో విచ్చలవిడిగా గుట్కా విక్రయాలు రెట్టింపు ధరలతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు కొరవడిన సర్కార్ పర్యవేక్షణ పట్టించుకోని అధికారులు విశాఖ రూరల్ : తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా గుట్కా నిషేధం ప్రకటన చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో నగరంలో ఎక్కడికక్కడ గుట్కాలు విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, నిషేధ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. బ్లాక్ మార్కెట్ పేరుతో రెట్టింపు ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ప్రయోజనాల కోసమే సర్కార్ నిషేధ ప్రకటన చేసిందేమో అనే పరిస్థితి దాపురించింది. విశాఖ కేంద్రంగా గుట్కా రవాణా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాలకు విశాఖ కేంద్రమైంది. అంతకుముందు జిల్లాల వారీగా గుట్కాల ఉత్పత్తుల కేంద్రాల నుంచి సరకును నేరుగా దిగుమతి చేసుకునేవారు. కానీ నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాల ఎగుమతులు, దిగుమతులకు విశాఖే కేంద్రమైంది. ముఖ్యంగా ఒడిశా నుంచి విచ్చల విడిగా రైళ్ల ద్వారా సరుకును విశాఖకు దిగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. గుట్కాల వ్యాపారంలో ఓ కాంగ్రెస్ నేత విశాఖను కేంద్రంగా చేసుకుని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. వారికి పూర్ణా మార్కెట్లో ఉన్న ఓ బడా వ్యాపారి సహకరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిషేధాన్ని సాకుగా చూపి, రిస్క్ చేసుకుని వ్యాపారం చేస్తున్నామంటూ మరింత ఎక్కువ రేట్లుకు విక్రయాలు చేస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్న రిటైల్, చిల్లర వర్తకులు బ్లాక్ మార్కెట్ పేరుతో హోల్‌సేల్ వ్యాపారులు రేట్లు పెంచేయడంతో తామేమి తక్కువ కాదన్నట్టు చిల్లర వర్తకులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. మూడు రూపాయల ఖైనీని రూ.5కు, రెండు రూపాయల పాన్ పరాగ్‌ను రూ.4కు, రూపాయి ఉండే డీలక్స్, సపారీలు రూ.2కు, రెండు రూపాయలుండే ఫైవ్ థౌజండ్ను రూ.4కు విక్రయిస్తున్నారు. ఈ విధంగా మొత్తం రేటులో 50 శాతాన్ని మధ్యవర్తులే తింటున్నారు. నిషేధం అమల్లో ఉన్నా వ్యాపారమేమి తగ్గలేదు. గతంలో రోజుకి రూ.5 కోట్ల టర్నోవర్ జరగగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యాపారమవుతోంది. పట్టించుకోని అధికారులు నగరంలో ప్రతీ చిల్లర దుకాణంలో గుట్కాలు వేలాడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సంబంధిత శాఖలన్నీ తమకేమి పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. సర్కార్ పర్యవేక్షణ కూడా ఎక్కడా కనిపించడంలేదు. అసలు గుట్కాల నిషేధం అమలవుతుందా అనే దానిపై కనీసం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అధికారులకు సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేయడం లేదు. దీంతో ఏ ఒక్క అధికారి సీరియస్‌గా తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు నిషేధించినా.. పొగాకు సంబంధిత ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉందని సుప్రీంకోర్టు గుట్కాలపై నిషేధం విధించింది. పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జనవరి 5వ తేదీన నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. అయితే సర్కా ర్ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోలేదు. ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటున్నారు. నిషేధం పేరుతో బ్లాక్ మార్కెట్లో మరింత ఎక్కువ రేట్లుకు విక్రయిస్తున్నారు. -
పత్తి ‘పక్క’దారి..
ఏఎంఎఫ్, వ్యాట్ ఎగవేస్తూ ఏపీ, మహారాష్ట్రలకు ఎగుమతి రైతుల ముసుగులో ట్రేడర్ల నిర్వాకం గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సరిహద్దు జిల్లాల చెక్పోస్టులపై నిఘా పెంపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండిన పత్తి అక్రమ మార్గాల్లో పక్క రాష్ట్రాలకు మళ్లుతోంది. ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన కోట్ల రూపాయల పన్నులను ఎగవేస్తూ వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా సరిహద్దుల నుంచే ప్రతి రోజూ సుమారు 40 నుంచి 50 లారీల పత్తిని ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి పన్నులు కట్టకుండా తరలిస్తున్నారని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. దీనిద్వారా ఈ పదిహేను రోజుల్లోనే సుమారు రూ.2.40 కోట్ల పన్నును వ్యాపారులు ఎగవేశారని అధికారులు తేల్చారు. దీంతోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇలాంటిదందానే ప్రతినిత్యం జరుగుతోందని తన తనిఖీల్లో తేల్చింది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు కోట్లల్లో గండిపడుతున్న దృష్ట్యా రంగంలోకి దిగిన విజిలెన్స్ సరిహద్దు చెక్పోస్టులపై నిఘాను మరింత పెంచింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పత్తి అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన సుమారు 80 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టిన ప్రభుత్వం కనీస మద్దతు ధరను రూ.4,050గా నిర్ధారించింది. అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికీ పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, నాణ్యతను సాకుగా చూపి ధరను తగ్గించి చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో లాభసాటి ధర కోసం రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్తు చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన పక్క రాష్ట్ర వ్యాపారులు మన రాష్ట్ర రైతుల వద్ద కొనుగోళ్లకు బారులు తీరుతున్నారు. బయటి రాష్ట్రాల వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తే దాన్ని తరలించేందుకు అగ్రికల్చర్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) 1శాతం, వ్యాట్ 5శాతం రాష్ట్రానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ తన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటున్న రైతు ముసుగులో వ్యాపారులే పత్తిని పక్క రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. దీంతోపాటే చట్టపరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరికొంత మంది వ్యాపారులు ఏపీ ఇస్తున్న వే బిల్లులతో ఇక్కడికి వచ్చి సరుకు తీసుకెళుతూ పన్నులు మాత్రం కట్టడం లేదు. పన్నులేవీ చెల్లించకుండా నల్లగొండ జిల్లా కోదాడ, నాగార్జునసాగర్ మీదుగా గుంటూరు జిల్లా మాచర్లకు పెద్దఎత్తున పత్తిని తరలిస్తున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించింది. ఇలా ఒక్క నల్లగొండ జిల్లా నుంచే రోజుకు 40 నుంచి 50 లారీలు తరలివెళుతున్నాయని, దీని ద్వారా ఒక్కో లారీపై రావాల్సిన పన్ను సుమారు రూ.40 వేలు ప్రభుత్వం నష్టపోతోందని అధికారులు లెక్కలుకట్టారు. గడిచిన పది, పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ తంతు ద్వారా ఇప్పటికే వ్యాపారులు రోజుకు రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ. 2.40 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుంచి మహారాష్ట్రకి, నిజామాబాద్ జిల్లా మద్నూర్ సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు, మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మీదుగా కర్ణాటకకు ఈ రీతిలోనే వ్యాపారులు పత్తిని తరలించుకుపోతున్నారని ఈ నష్టం కోట్లలోనే ఉందని విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత నిఘాను పెంచేందుకు వీలుగా రాష్ట్రంలోని ఏడు యూనిట్లను విజిలెన్స్ శాఖ అప్రమత్తం చేసింది. సరిహద్దు చెక్పోస్టులపై నిఘాను పెంచాలని ఆదేశించింది. అధికారులను అప్రమత్తం చేశాం ఈ విషయం మా దృష్టికి వచ్చింది. విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశాం. దీనిపై వాస్తవ నివేదికను ఇవ్వాలని, సమస్య పరిష్కార సూచనలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించాం. ఈ నివేదికలు రాగానే దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం. - టి.వివేక్, ఓఎస్డీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ -
ఆమదాలవలస కమిషనర్‌కు కూర‘గాయం’
ఆమదాలవలస: పెను వివాదం రేపి.. సంచలనం సృష్టించిన ఆమదాలవలస కూరగాయల మార్కెట్ అక్రమ తరలింపు, కూల్చివేతపై అక్కడి వర్తకులు, వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన పోరాటం ఫలించింది. మార్కెట్ తరలింపు విషయంలో తప్పు జరిగిందని మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు స్వయంగా హైకోర్టులో అంగీకరించడంతో కోర్టు ఆయనకు రూ. 10వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు న్యాయవాది వి.సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు వర్తకుల తరఫున పోరాడిన స్థానిక న్యాయవాది చింతాడ సత్యనారాయణ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పొట్ట కూటికోసం దశాబ్దాలుగా ఆమదాలవలస రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న కారగాయల మార్కెట్లో పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ పెద్దలు కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి కూరగాయల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించేందుకు కుట్ర పన్నారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించగా, వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలిచింది. దీనిపై వర్తకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయకుండా, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ పోలీసులను మోహరించి పొక్లెయిన్‌తో మార్కెట్లోని షాపులను కూలగొట్టారు. ఆ మరునాడే హైకోర్టు మార్కెట్ తరలింపుపై స్టే ఇస్తూ, యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగానే ‘వారం రోజులు గడువిచ్చాం.. షాపులు ఖాళీ చేయండి’ అంటూ అక్టోబర్ 10న మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందికి వస్తుందంటూ మళ్లీ వర్తకులు హైకోర్టు తలుపుతట్టారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.రామచంద్రరావు అక్టోబర్ 27న విచారణకు హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. ఆ మేరకు హాజరైన కమిషనర్ తప్పు జరిగిందని అంగీకరిస్తూ, దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దాంతో కేసును ఈ నెల 11వ తేదీ(మంగళవారం)కి వాయిదా వేశారు. మంగళవారం విచారణ సందర్భంగా కమిషనర్ లిఖితపూర్వకంగా తప్పును అంగీకరించారు. వర్తకులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కూడా కోర్టుకు వివరించారు. ఈ తప్పునకు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా, క్షమించాలని వేడుకున్నారు. దాంతో కమిషనర్‌కు రూ. 10 వేల జరిమానా విధిస్తూ.. దాన్ని నష్టపోయిన కూరగాయల వర్తకులకు అందించాలని తుది ఆదేశాలు జారీ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ పోరాట ఫలితం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీడీపీ నేతలు, అధికారులకు బుధ్ధి చెప్పే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. కూరగాయల మార్కెట్లో పొట్టకూటి కోసం కష్టపడుతున్న వారి కడుపులు కొట్టేందుకు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ నూకేశ్వరరావుకు రూ.10 వేల జరిమానా విధించడం హర్షనీయమన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన పోరాట ఫలితమని వ్యాఖ్యానించారు. -
నగరాన్ని శిథిలం కానివ్వను
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారంతా ద్రోహులే ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు (విద్యుత్) : రోడ్ల విస్తరణ పేరుతో నెల్లూరు నగరాన్ని శిథిలం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఏసీ సెంటర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనం మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రజలు, మేధావులు, వ్యాపారులతో చర్చించకుండా రోడ్ల విస్తరణ పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. కార్పొరేషన్ అధికారులు కొలతలు చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ అప్రజాస్వామిక చర్యను అడ్డుకునేందుకు ఈ నెల 6న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. విస్తరణకు ముందస్తు నోటీసులు, గృహస్తులు, వ్యాపారులకు వారు కోరిన మార్కెట్ విలువలను కచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందన్నారు. పరిహారం చెల్లించే విధానంలో వ్యాపార విభాగాలకు మూడు రెట్ల మార్కెట్ విలువను అందించాలని చట్టం సూచిస్తుందన్నారు. ‘ప్రజల్లో నుంచి వచ్చాం కాబట్టి మా కుటుంబానికి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కోట్లు గడించే కార్పొరేట్ అధినేతలకు ప్రజా సమస్యలు ఏం అర్థమవుతాయి’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నగర కార్పొరేటర్లకు, కార్పొరేషన్ అధికారులకు మధ్య తీరని అగాధం ఉందన్నారు. ముందు కింది స్థాయి నుంచి సమావేశాలు నిర్వహించి, కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలే తప్ప మోనార్క్‌లాగా వ్యవహరించడం తగదని ఆయన కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్ బాబుకు చురకలంటించారు. నమ్మక ద్రోహులు పార్టీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందాక టీడీపీలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ద్రోహులేనంటూ ఆనం మండిపడ్డారు. కాంగ్రెస్ పునాదులపై ఈ స్థాయికి వచ్చి నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అంటే తల్లి పాలు తాగి, రొమ్ము గుద్దిన* చందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో వీరంతా పరస్పరం ద్రోహం చేసుకుంటారనడంలో సందేహం లేదన్నారు. సమావేశంలో నగర ఇన్చార్జ్ ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, బర్నా బాస్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా ధరలకు రెక్కలు
అసలు ధర రూ.283.. రూ.400కు విక్రయాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు జిల్లాలో రైతులపై రూ.4 కోట్ల భారం చోద్యం చూస్తున్న అధికారులు మచిలీపట్నం/ చల్లపల్లి : హుదూద్ తుపాను దెబ్బకు యూరియా ధరలకు రెక్కలొచ్చాయి. యూరియాకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వ్యవసాయాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బస్తాకు రూ.100 అదనం ఈ ఏడాది జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఆరువేల ఎకరాల్లో పసుపు సాగును రైతులు చేపట్టారు. ఈ పంటలకు ఎరువుగా వాడేందుకు 1.20 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం వరికి ఎకరాకు 75 కిలోలు మాత్రమే వాడాల్సి ఉండగా, రైతులు 150 కిలోల వరకు వాడుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో వరి పంటకు 1.85 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. ప్రస్తుతం మూడో కోటా, చిగురు కోటా వేసే పనిలో ఉన్నారు. ఈ రెండుసార్లు యూరియా చల్లేందుకు జిల్లా వ్యాప్తంగా 65 వేల టన్నుల యూరియా కావాల్సి ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీ ధర ప్రకారం యూరియా రూ.283కు, వేపనూనె కలిపిన యూరియా రూ.298కి అమ్మాల్సి ఉంది. హుదూద్ తుపాను వల్ల విశాఖపట్నంలో నిల్వ ఉంచిన సుమారు రెండు లక్షల టన్నుల యూరియా నీటిపాలవడంతో యూరియా కొరత ఏర్పడింది. దీనికితోడు అధికారులు సూచించిన దానికంటే రెంటింపు స్థాయిలో యూరియా వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్ల దివిసీమతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రూ.283కు అమ్మాల్సిన 50 కిలోల యూరియా బస్తాను రూ.400 వరకు వ్యాపారులు అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. యూరియాకు డిమాండ్ పెరగడం, కొరత ఏర్పడటంతో హోల్‌సేల్ వర్తకుల నుంచి రూ.283 విలువ గల 50 కిలోల యూరియా బస్తాను రూ.360కి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు, ఎత్తుడు, దింపుడు కూలి, లాభాలు కలుపుకొని అంత రేటుకు అమ్మాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఏదేమైనా బస్తాకు రూ.100 అదనంగా చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా రైతులపై రూ.4 కోట్ల అదనపు భారం పడనుంది. బ్లాక్ మార్కెట్‌కు పీఏసీఎస్ ఎరువులు జిల్లాలో 425 పీఏసీఎస్‌లు ఉండగా వీటిలో 280 చోట్ల మాత్రమే ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయి. వీటిలో చాలా పీఏసీఎస్‌లు రెండుసార్లకు సరిపడా మాత్రమే ఎరువులను నిల్వ ఉంచుకున్నాయి. మిగిలిన రెండు కోటాల ఎరువులను కొద్దిరోజుల నుంచి పీఏసీఎస్‌లకు రప్పించుకుంటున్నారు. దివిసీమలోని ఓ మండలంలో రెండురోజుల క్రితం రెండు సొసైటీలకు రెండేసి చొప్పున యూరియా లోళ్లు రాగా, యూరియాకు ఉన్న డిమాండ్‌తో వాటిని బస్తా రూ.320 చొప్పున రహస్యంగా బయట ఎరువుల షాపులకు అమ్ముకున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం యూరియాకు బాగా డిమాండ్ పెరగడం, కొరత ఉండటంతో చాలాచోట్ల పీఏసీఎస్‌లలో ఇదే తరహా వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి యూరియాను ఎమ్మార్పీ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొరత లేదు జిల్లాలో ఇటీవలే 3,400 టన్నుల యూరి యాను సరఫరా చే శాం. మరికొద్ది రోజుల్లో యూరియా ర్యాక్‌లు జిల్లాకు రానున్నాయి. ఎవరైనా యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఆయా మండలాల ఏవోలతో ఎప్పటికప్పుడు ఎరువుల విక్రయాలపై సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నాం. - నరసింహులు, వ్యవసాయ శాఖ జేడీ -
‘కాఫీ’ నేలపాలు!
కోతదశలో హుదూద్ ధ్వంసం రూ. కోట్లలో గిరిజన రైతులకు నష్టం మొక్కల పెంపకానికి ఏళ్ల సమయం పాడేరు : ఏజెన్సీలోని కాఫీ రైతుకు పెద్ద కష్టమొచ్చింది. హుదూద్ దెబ్బతో కోత దశలో పంటంతా నేలపాలైంది. ప్రస్తుతం లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వీటిలో సగానికి పైగా ధ్వంసమయ్యాయి. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు పెద్ద ఎత్తున కూలడంతో అపార నష్టం సంభవించింది. కాఫీ రైతుకు ఇంతటి కష్టం రావడం ఇదే తొలిసారి. రూ.కోట్ల లో నష్టం వాటిల్లింది. వీటిలో అంతర పంటగా చేపట్టిన మిరియాల పాదులూ ధ్వంసమయ్యా యి. పరిస్థితి కుదుట పడాలంటే ఏళ్లు పడు తుందని అధికారులే అంటున్నారు. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో 90 వేల ఎకరాల్లోని కాఫీ మొక్కలు విరగ్గాశాయి. ప్రస్తుతం ఈ తోటల్లోని కాయలన్నీ పక్వానికి వచ్చి కోతదశకు చేరుకున్నాయి. గతేడాదీ కాఫీ సాగు ఆశాజనకంగా ఉంది. ఆరు వేల టన్నుల క్లీన్ కాఫీ గింజల దిగుబడితోపాటు గిట్టుబాటు ధర కూడా దక్కింది. అప్పట్లో కిలో రూ.150-200ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గిరిజన రైతులు నాలు గు డబ్బులు వెనకేసుకోగలిగారు. ఈ ఏడాది కూడా సుమారు 6,500 నుంచి ఏడు వేల టన్నుల వరకు దిగుబడులు ఉంటాయని కాఫీ బోర్డు అధికారులు భావించారు. ఆదా యం బాగుంటుందని ఆదివాసీ రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు దిగుబడి సగం కూడా రాని పరిస్థితి. సాగుకాలాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐదేళ్లలోపు తోటలకు హెక్టారుకు రూ.10 వేలు, ఆరు నుంచి పదేళ్లలోపు తోటలకు రూ.15వేలు, పదేళ్లు దాటిన తోటలకు రూ.20 వేలు పరిహారం ఇస్తారట. గతేడాది తుపాను నష్టపరిహారం మన్యంలో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. కాఫీ పంట వ్యవసాయ, ఉద్యానవనశాఖల పరిధిలో లేదు. నష్టం అంచనాకు శాస్త్రవేత్తలు రావాల్సిందే. ఎత్తయిన కొండలు ఎక్కి వారు పరిశీలించాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పరిస్థితుల్లో 2019 నాటికి కాఫీ సాగు విస్తీర్ణం 2.44 లక్షలకు ఏ మేరకు చేరుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
అసైన్డ్‌లో ‘రియల్’ దందా
మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రియల్ అక్రమాలు జోరందుకుంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాయాజాలంలో ముగ్గురు కార్పొరేటర్ల ప్రమేయం ఉండడంతో సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైల్వేస్టేషన్ నుంచి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వరకు, బందరు మండలం కరగ్రహారం పరిధి వరకు వందలాది ఎకరాలున్నాయి. ఈ భూముల్లో కొన్నింటిని స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మిగిలిన భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ప్లాట్టుగా మార్చేసి ప్రస్తుతం గజం రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కిన వ్యాపారులు తమ ఇష్టానుసారం ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ భూములన్నీ అసైన్డ్ భూములు అయినప్పటికీ రిజిష్ట్రార్ కార్యాలయంలో తమదైన శైలిలో చక్రం తిప్పుతున్న వ్యాపారులు ఇవి ప్రైవేటు భూములేనని నమ్మిస్తూ విక్రయాలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2006లోనే అసైన్డ్ భూములుగా గుర్తింపు పట్టణంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు రైల్వేస్టేషన్ నుంచి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వరకు ఉన్న భూములను, కరగ్రహారంలోని భూములను 2006లో అధికారులు పరిశీలించారు. రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను తమకు ప్రభుత్వం పోషణ కోసం ఇచ్చిందని వీటిని తీసుకోవద్దని పొలం యజమానులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో అప్పటి జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సురేష్‌కుమార్ ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఇవి అసైన్డ్ భూములుగానే నిర్ధారించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని భూములను ఇళ్లస్థలాలుగా ఇచ్చేందుకు రైతులు అంగీకరించక పోవడంతో కరగ్రహారానికి సమీపంలోని భూములను సేకరించి వందలాది మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశారు. ఈ కాలనీకి నవీన్‌మిట్టల్ కాలనీగా నామకరణం చేశారు. సర్వే నంబర్లు మార్చి ప్రైవేటు భూమిగా చూపి... రాష్ట్ర విభజన అనంతరం రియల్‌భూమ్ ఊపందుకోవడంతో పట్టణానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఈ అసైన్డ్ భూమిపై కన్నేశారు. ఆర్అండ్బీ అతిథి గృహం, బైపాస్‌రోడ్డు సమీపంలో నివశించే ఇద్దరు కౌన్సిలర్లు, మరో కౌన్సిలర్ ఈ భూమిపై కన్నేశారు. ఒక స్వాతంత్ర సమరయోధునికి చెందిన రెండున్నర ఎకరాలు కొనుగోలు చేసి ఇది ప్రైవేటు భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిని ఆధారంగా చేసుకుని మిగిలిన అసైన్డ్ భూములను ప్రైవేటు భూములుగా చూపి ఈ ముగ్గురు కౌన్సిలర్లు భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విడగొట్టి విక్రయిస్తున్నారు. తమదైన శైలిలో భూమికి సంబంధించిన పత్రాలు, గతంలో ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలను చూపుతూ ఇక్కడ ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. డ్రెయినేజీ గట్లే రోడ్లు! ఈ అసైన్డ్ భూమి మొత్తం వ్యవసాయ భూమే. పంటకాలువలు, డ్రెయినేజీలు ఈ భూముల పరిధిలో ఉన్నాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ప్లాట్లలోకి వెళ్లేందుకు ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయలేదు. కరగ్రహారానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న మురుగుకాలువ గట్టుపై రబ్బీసు రోడ్డు నిర్మించారు. అసైన్డ్‌భూమిని ప్లాట్లుగా విడగొట్టి 12 అడుగులకు మించకుండా రబ్బీసు రోడ్లు నిర్మించారు. ఈ ప్లాట్లకు అనుమతులు ఉన్నాయో, లేవో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు దృష్టి సారిస్తే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి... పురపాలక సంఘం పరిధిలోని భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించటంపై మున్సిపల్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఇక్కడ భూమి అధికంగా ఉండటంతో అనుమతులు ఇచ్చే అధికారం తమ పరిధిలో లేదని తెలిపారు. లేఅవుట్ నిబంధన ప్రకారం 40 అడుగుల మేర రోడ్డు నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లయితే గృహనిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌ను మంజూరు చేయబోమని చెప్పారు. -
అయితే.. ఓకే
సాక్షి ప్రతినిధి, కడప: చేయి చేయి కలుపుదాం.. మద్యం వ్యాపారులను ఏకం చేద్దాం.. మందుబాబుల జేబులకు చిల్లులు పెడదాం. అడ్డుగా నిలిచే నాయకులను మచ్చిక చేసుకుందాం.. ఎవరి ఆదాయం వారికి తగ్గకుండా చూద్దాం.. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘన, బెల్ట్‌షాపులపై చూసీ చూడనట్లు వెళదాం.. నెలనెలా అక్రమ ఆదాయానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుందామంటూ ఎక్సైజ్‌శాఖలోని ఉన్నత స్థాయి అధికారి ఉద్బోధ చేశారు. ఇందుకు మద్యం వ్యాపారులు జైకొట్టారు. అడ్డుతగిలిన ఓనాయకుడిని మచ్చిక చేసుకుని మామూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వాటి పరిధిలో సుమారు 2వేలకు పైగా బెల్ట్‌షాపులుండేవి. క్రమం తప్పకుండా ఎక్సైజ్ యంత్రాంగానికి నెలవారీ మామూళ్లు లభించేవి. ఈమారు బెల్ట్‌షాపులు నిర్వహించరాదని ప్రభుత్వం గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం బెల్ట్‌షాపులను నడపొద్దని ఎక్సైజ్ యంత్రాంగం మద్యం వ్యాపారులకు ఆంక్షలు విధించింది. దీంతో నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం. బెల్ట్‌షాపులు లేకుండా ఎలా ఆదాయం వస్తుందని.. మీకెందుకు మామూళ్లు ఇవ్వాలని నిలదీసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ యంత్రాంగమే సలహా ఇచ్చినట్లు సమాచారం. మీకు దండిగా డబ్బులు వస్తేనే మాకు మామూళ్లు ఇవ్వండంటూ ఉపదేశం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు నిబంధనల గేట్లు ఎత్తేశారు. బెల్ట్‌షాపులతో పాటు యధేచ్ఛగా అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నా ఎక్సైజ్ యంత్రాంగం చూసీ చూడనట్లు ఉండిపోతోంది. అధికరేట్లకు మద్యం విక్రయాలు... జిల్లాలోని 269 మద్యం షాపులకుగాను టెండర్లలో 208 కేటాయించారు. 61 షాపులకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రీటెండర్లు ఆహ్వానించారు. రీ నోటిఫికేషన్లో కేవలం ఒక్క షాపును మాత్రమే దక్కించుకున్నారు. ప్రస్తుతం 60 షాపులు మిగిలిపోయాయి. ఒక్కొక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్ల విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.5కు అధికంగా విక్రయించుకుంటే ప్రతి నెలా సుమారు రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని అందులో రూ.50వేలు మాత్రమే తమకు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారి ఒకరు కోరినట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారుల అండ చూసుకున్న మద్యం వ్యాపారులు బాటిల్ మీద రూ.10 అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతినెలా సరాసరి విక్రయాలద్వారా మందుబాబులు అదనంగా సుమారు రూ.9కోట్లు భరించాల్సిన పరిస్థితి కల్గుతోంది. అధికార పార్టీ నేత అడ్డగించడంతో.... అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తుండటంతో అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు అడ్డుపడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయాలు చేపట్టాలని, ఎందుకు మద్యం వ్యాపారులను , బెల్ట్‌షాపులను ప్రోత్సిహ స్తున్నారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం. ఎమ్మార్పీ మేరకు విక్రయాలు నిర్వహిస్తారా? ధర్నాలు చేపట్టాలా అంటూ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని బెదిరించడంతో ఎక్సైజ్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. మాకు లభించే మామూళ్లలో ప్రతినెలా మీకూ సమర్పించుకుంటామని మధ్యస్థంగా పంచాయితీ చేసినట్లు సమాచారం. ఆ మేరకు ప్రతినెలా రూ.8లక్షలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఎక్సైజ్ శాఖ అప్పగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో అధికరేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిని కట్టడి చేయాలని సిబ్బందిని ఆదేశించాను. ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరిపేటట్లు చూడాలని స్పష్టం చేశా..బెల్ట్‌షాపులను కూడా అరికడతాం.. ఎక్కడైనా అధిక రేట్లతో మద్యం విక్రయిస్తుంటే సమాచారం ఇవ్వాలి.. ఇందుకు సంబంధించి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. -
బంగారం కొనుగోళ్లు ఢమాల్
సాక్షి, బళ్లారి : బంగారం ధర తగ్గినా కొనుగోళ్లు భారీగా పడిపోతున్నాయి. బంగారం ధర భారీగా తగ్గుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం పెరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా బంగారం ధరలు స్థిరంగా లేకపోవడంతో రోజు రోజుకీ తగ్గుముఖం పట్టడం లేదా కొంత పెరగడం తరుచూ జరుగుతుండటం వల్ల బంగారం వైపు జనానికి మోజు తగ్గుతోందని వ్యాపారులు భావిస్తున్నారు. బళ్లారి నగరంలోని బెంగళూరు రోడ్డులో బంగారు అంగళ్లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి తోడు మోతీ సర్కిల్ వద్ద టాటా గోల్డ్ ప్లస్ కంపెనీ వారు అతి పెద్ద జువెలరీ షాపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంగారం తగ్గుముఖం పట్టడం వల్ల సగానికి సగం బంగారం కొనుగోళ్లు పడిపోయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. బంగారం పెరిగే సమయంలో కొనుగోళ్లు బాగా జరిగేవని, ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతుండటం వల్ల ఇంకా తగ్గుతుందనే ఆశ వినియోగదారుల్లో ఉండటం వల్ల కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో నిత్యం వ్యాపారులతో కళ కళలాడే బంగారు అంగళ్లు వెలవెలబోతున్నాయి. బంగారం దుకాణాలు ఉండే బెంగళూరు రోడ్డు నిత్యం జనంతో కిటకిటలాడేది. ప్రస్తుతం ఆ రోడ్డులో కూడా జనం తక్కువగా కనిపిస్తున్నారు. నిత్యం రూ.లక్షల వ్యాపారం అయ్యే షాపులు వెలవెలబోతున్నాయి. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతోపాటు పెళ్లిళ్ల సీజన్లు లేకపోవడం కూడా కొనుగోళ్లు పడిపోవడానికి కారణమని వ్యాపారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,000 ఉన్న సమయంలో వ్యాపారం జరిగేదని, ప్రస్తుతం రూ.27,000 ధర ఉన్నప్పటికీ బంగారం జోలికి జనం వెళ్లడం లేదు. ఈ సందర్భంగా బెంగళూరు రోడ్డులోని రాజ్‌మహాల్ బంగారు దుకాణం యజమాని ఎస్.సురేష్ మాట్లాడుతూ బంగారం ధరలు తగ్గుతుండటం వల్ల వ్యాపారాలు పెరుగుతాయని అనుకున్నామని, అయితే తగ్గుముఖం పట్టినప్పటి నుంచి వ్యాపారం మరింత పడిపోయిందన్నారు. -
పేరులోనే గిరాకి ఉంది!
సమ్‌థింగ్ స్పెషల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి పేరు ముఖ్యమైనదని కొందరు వ్యాపారులు బలంగా నమ్ముతున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలలో కొన్ని దుకాణల పేర్లు వింతగా ఉండి, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలో ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పేరు ‘ఫేస్బుక్’. ముంబాయిలోని ఒక ఫాస్ట్‌పుడ్ సెంటర్ పేరు...‘బీటెక్ చాట్ వాలా’ ముంబాయి రైల్వేస్టేషన్ సమీపంలో చెప్పులు కుట్టే ఒక వ్యక్తి తన దుకాణానికి ‘చెప్పుల ఆస్పత్రి’ అని పేరు పెట్టుకున్నాడు. ముంబయిలో లోదుస్తులు అమ్మే ఒక చిన్న షాప్‌కు ‘అందర్ వియర్’ అని పేరు పెట్టారు. కొన్ని నగరాల్లో ‘వాట్సప్’ పేరుతో పండ్లరసాల బండ్లు వీధుల్లో తిరుగుతున్నాయి. -
బెండ ... ధర బెంగ...
రైతుకు రూ. రెండే... రైతుబజారులో రూ.7 బహిరంగ మార్కెట్లో రూ.20 పంట దున్నేస్తున్న వైనం నూజివీడు : ఇప్పటి వరకు టమోటాకు ధర లేక పారబోయడం చూశాం. అయితే నేడు బెండకాయ రైతుల పరిస్థితీ అలాగే తయారైంది. ఒకవైపు రైతుబజారులో కిలో రూ.7, బహిరంగ మార్కెట్లో కిలో రూ.20 చొప్పున వ్యాపారులు విక్రయిస్తుండగా, పండిస్తున్న రైతుకు మాత్రం రూ.2 కంటే ఎక్కువ రావడం లేదు. దీంతో కోత ఖర్చులు రాక బెండతోటలను రైతులు దున్నించేస్తున్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో విఫలం కావడం వల్లనే రైతులు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంటలకు ధర లభించడం లేదు. దీంతో పెట్టుబడులు పెట్టి ఏడాదికేడాదికి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు మాత్రం లాభపడుతున్నారు. నియోజకవర్గంలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో దాదాపు 5వందల ఎకరాల్లో బెండతోటలను సాగుచేశారు. వీరిలో ఎక్కువ శాతం మంది కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నవారే. ఎకరాకు రెండు పంటలకైతే రూ.25వేలు, ఒక పంటకైతే రూ.15వేలకు కౌలుతీసుకుని, కూరగాయలను పండిస్తున్నారు. పెట్టుబడితో సహా రూ. 30 వేలకు చేరుకుంటుంది. కాయ దిగుబడి వచ్చే ముందు వరకు కిలో రూ.15నుంచి రూ.25ల వరకు ధర పలికిన బెండకాయలు, దిగుబడి వచ్చేనాటి నుంచి రోజురోజుకు తగ్గుతూ వచ్చి రెండు రోజులుగా కిలో రూ.2కు పడిపోయింది. దీంతో కోతకూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితిలో ముసునూరు మండలం చింతలవల్లి, నూజివీడు మండలం హనుమంతులగూడెం ప్రాంతాల్లో బెండతోటలను దున్నేస్తున్నారు. -
శిల్పారామంలో అగ్నిప్రమాదం
హస్త కళా స్టాళ్లు దగ్ధం రూ.60 లక్షల ఆస్తి నష్టం మాదాపూర్ : శిల్పారామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏడు స్టాళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 14 స్టాళ్లు పాక్షికంగా కాలిపోయాయి. దాదాపు రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దసరా నేపథ్యంలో హస్తకళా మేళా కోసం శిల్పారామంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. యజమానులు రాత్రి 10 గంటలకే స్టాళ్లను మూసివేసి వెళ్లిపోయారు. 212 స్టాల్ సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పదినిమిషాల్లోనే ఒక స్టాల్ నుంచి మరో స్టాల్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో విలువైన పట్టు చీరలు, ఖాదీ వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. మంటలు విస్తరించడంతో స్థానికులు గుర్తించి ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఐదు నిమిషాల్లో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పండగ కోసం తెచ్చిన సామగ్రిని స్టాళ్లలోనే ఉంచారు. అగ్నిప్రమాదంతో శనివారం శిల్పారామం మూసివే శారు. సాయంత్రం సందర్శకులను అనుమతించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫైర్ ఆఫీసర్... సంఘటన స్థలాన్ని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ సురేందర్ ఆనంద్ సందర్శించారు. కాలిపోయిన స్టాళ్లను పరిశీలించారు. కాలిపోయిన సామగ్రిని వెంటనే అంచనా వేయలేమన్నారు. కాలిపోయిన స్టాళ్లలోని స్టాక్ వివరాలను శిల్పారామం అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం రూ. 60 లక్షల ఆస్తి నష్టం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే.. స్టాల్స్ సమీపంలోని ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు చిందర వందరగా ఉండటంతో షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా ఓ యువకుడు మం టలను చల్లార్చేందుకు యత్నిస్తుండగా అతడి ముఖానికి గాయాలయ్యాయి. ఏసీ బస్సులో మంటలు చాదర్‌ఘాట్: దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఏసీ బస్ (ఏపీ 116 7286) టైర్ నుంచి మంటలు వచ్చాయి. బస్సు శనివారం సాయంత్రం లింగంపల్లి నుంచి దిల్సుఖ్నగర్ వస్తోంది. నల్గొండ క్రాస్‌రోడ్ వద్దకు రాగానే వెనుక టైర్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రీనివాస్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. ఆందోళన చెందిన ప్రయాణికులు కొంతదూరం పరుగుపెట్టగా.. డ్రైవర్ తన వద్ద గల క్యాన్‌లోని నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు గంటపాటు వెనుక టైర్ల నుంచి పొగలు వచ్చాయి. బేరింగ్ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని డ్రైవర్ పేర్కొన్నారు. కారులో .... చైతన్యపురి: కారులో ఒక్కసారిగా మంటలు వచ్చి ఇంజిన్ కాలిపోయింది. శంషాబాద్‌కు చెందిన వ్యాపారి పాషా శనివారం ఎల్బీనగర్లోని తన స్నేహితుడిని కలిసేందుకు శాంత్రో కారులో వచ్చాడు. 3 గంటల ప్రాంతంలో తిరిగి వెళుతుండగా చైతన్యపురి చౌరస్తా సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి. బైక్‌పై వెళుతున్న వ్యక్తి ఈ విషయాన్ని కారు నడుపుతున్న పాషాకు చెప్పటంతో రోడ్డు పక్కన ఆపాడు. మంటలు ఎక్కువై పొగలు వ్యాపించాయి. స్థానికులు కొందరు బకెట్లలో నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. మలక్‌పేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. కారు ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది. -
‘నై’ బజార్..
సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో తై బజార్ నిర్వహణ అధికారులకు గుదిబండగా మారింది. మున్సిపల్‌కు ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా కొత్త సంస్కరణలకు తెరలేపిన అధికారులకు తై బజార్ వేలం పాట కత్తిమీద సాములాగా మారుతోంది. ఆరు నెలలు గా ప్రభుత్వ నిర్ణీత ధరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే తై బజార్ ఫీజు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు తైబజార్ వేలం పాటకు మున్సిపల్ యంత్రాంగం సమాయత్తం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో పోటీ దారులు ముందుకు రావడంలేదు. ఫలితంగా ఆరు నెలల కాలంలోనే ఎనిమిది సార్లు వేలం పాటను వాయిదా వేశారు. కాగా ఈ నెల 29న మరోసారి తైబజార్ వేలం నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో తైబజార్ వసూలు బాధ్యతను కొంత కాలంగా మున్సిపల్ పర్యవేక్షిస్తోంది. గతంలో నామమాత్ర ధరకే తైబజార్ వేలం హక్కులను కైవసం చేసుకున్న వ్యాపారులు పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండికొట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నూతన కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించిన రమణాచారి మున్సిపల్‌కు వచ్చే ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించి వ్యయ భారం నుంచి గట్టేక్కించేందుకు ప్రణాళికను రూపొందించారు. అందుకనుగుణంగానే కొంత కాలంగా నిర్ణీత ధరను నిర్ణయించి వేలం పాట నిర్వహణకు ముందుకు సాగారు. సిద్దిపేటలోని వివిధ ప్రాంతాల్లో తోపుడు బండ్లు, వ్యవసాయ మార్కెట్, వీధి వ్యాపారం చేసే వారి నుంచి తై బజార్ పేరిట రూ. 5 నుంచి రూ.20 వివిధ కేటగిరీలో తై బజార్ ఫీజును నిర్ణయించారు. ఈ క్రమంలోనే 2014-15 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ ఫీజు వసూలుకు సుమారు 4 లక్షల ప్రభుత్వ నిర్ణీత ధరకు వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటకు పోటీ దారులు ముందుకు రాకపోవడంతో 8 పర్యాయాలు వాయిదా వేస్తూ వచ్చారు. చేసేది లేక ఆరు నెలలుగా సిద్దిపేట మున్సిపల్ సిబ్బంది ద్వారానే అధికారులు తై బజార్ వసూలు ప్రక్రియను చేపడుతున్నారు. రోజూ సుమారు 2వేల రూపాయలు తైబజార్ ఫీజు రూపంలో మున్సిపల్‌కు ఆదాయం వస్తుండటంతో వేలం పాటలో నిర్ణీత ధరను మార్చేందుకు నిరాసక్తత చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు వార్షిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోవడంతో ప్రభుత్వ నిర్ణీత ధరతో లాభాలు గడించడం పోటీ దారులకు సమస్యగానే మారింది. -
నకిలీ నోట్లు చలా‘మనీ’
యలమంచిలి కేంద్రంగా సాగుతున్న వ్యవహారం రూ.10వేల అసలుకు రూ.40వేలు నకిలీ నోట్లు యలమంచిలి : యలమంచిలి కేంద్రంగా నకిలీనోట్లు జోరుగా చలామణి అవుతున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను చూస్తేనే ఇక్కడ వ్యాపారులు, ప్రజలు హడలిపోతున్నారు. అంతా ఈ నోట్లను ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటున్నారు. ఇందుకు పరికరాలను కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి గుట్టుగా ఈ వ్యవహారం సాగిస్తున్నారన్న వాదన ఉంది. రూ.10వేలు అసలనోట్లకు రూ.40వేలు నకిలీ కరెన్సీ ఇస్తుండటంతో నేరం అని తెలిసినప్పటికీ ఇందుకు కొందరు యువకులు ఆసక్తి చూపుతున్నారు. యలమంచిలిలో ఏ దుకాణం వద్దకైనా వెళ్లి సరుకులు కొనుగోలు చేసినా రూ.100 నోటు ఉంటే ఇమ్మని అడుగుతున్నారు. వారపు సంతలు, నగల దుకాణాలు, ప్రైవేట్ చిట్టీ వ్యాపారులు, ఫైనాన్సియర్లు, పెట్రోల్‌బంకుల్లో దొంగనోట్లను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్లో టిక్కెట్ బుకింగ్ కార్యాలయం, బ్యాంకులకు నకిలీనోట్లు తరచూ వస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు. మునిసిపాలిటీలోని భవనం వీథిలో ఇటీవల ఒక నగల దుకాణంలో మహిళ దుకాణదారుడికి ఇచ్చిన సొమ్ములో రూ.500 నకిలీ నోటు బయటపడింది. బస్ కాంప్లెక్స్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక ఫైనాన్స్ వ్యాపారికి వచ్చిన రోజువారి కలెక్షన్లో రూ.1,000, రూ.500 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ నోట్ల బెడదతో పాత ఆంధ్రాబ్యాంక్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ఒక మీ-సేవా కేంద్రంలో రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదంటూ ఏకంగా నోటీసు బోర్డు పెట్టడం ఇందుకు తార్కాణం. ఒక ప్రైవేట్ కళాశాల్లో విద్యార్థులు చెల్లించిన ఫీజు సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తే అందులో రూ.500 నోట్లు రెండు నకిలీవిగా సిబ్బంది గుర్తించి జమ చేయడానికి వెళ్లిన కళాశాల ఉద్యోగిని మందలించారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో బయటపడిన నకిలీ నోట్లపై రైల్వేశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఇటీవల రెండు కేసులు నమోదు చేశారు. బ్యాంకులకు వచ్చినవాటిపై అధికారులు ‘ఫేక్రూ. నోట్ అని రాసి ఊరుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఇదే చలామణిదారులకు అవకాశంగా మారుతోంది. -
ధర మురిగి.. గుండె పగిలి
కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన తమ్మారెడ్డి(35) తనకున్న ఆరెకరాల్లో రూ.2.30 లక్షల పెట్టుబడితో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేశాడు. మూడు రోజుల క్రితం 280 ప్యాకెట్ల ఉల్లి దిగుబడిని కర్నూలు మార్కెట్లో విక్రయానికి పెట్టాడు. అనామత్ కొనుగోళ్ల కారణంగా ప్యాకెట్ ధర రూ.250 మాత్రమే పలకడంతో మనస్తాపం చెందాడు. దిగుబడులను మార్కెట్లోనే వదిలేసి వెళ్లాడు. ఈనెల 8న పంటల కోసం తెచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉల్లి రైతు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది మురిపించిన ఈ పంట.. ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో అధిక శాతం దిగుబడులు పొలాల్లోనే మురిగిపోగా.. మిగిలిన సరుకు మార్కెట్లో విక్రయానికి పెట్టగా అనామత్ కొనుగోళ్ల రూపంలో ధర వెక్కిరిస్తోంది. ఇదే సమయంలో వ్యాపారులు.. హమాలీలు.. లారీ ఓనర్లు.. ట్రాన్స్పోర్టర్ల మధ్య వివాదాలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారులకు తెలిసినా అప్పటికప్పుడు హెచ్చరికలు చేసి వదిలేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా రేయింబవళ్లు కష్టించినా.. మార్కెట్లో ఎదురవుతున్న పరిస్థితులతో మట్టి మనిషి చివరకు తనువు చాలించే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో ఉల్లి సాధారణ సాగు 16,904 హెక్టార్లు కాగా.. 20,161 హెక్టార్లలో సాగయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అతి కష్టం మీద పంటలను గట్టెక్కించారు. సాధారణంగా దిగుబడలు తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రోజురోజుకు ధర తగ్గుముఖం పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో లారీ ఓనర్ల అసోసియేషన్, లారీ ట్రాన్స్‌పోర్టు(బ్రోకర్లు) అసోసియేషన్ల మధ్య వివాదం చెలరేగడం వారికి శాపంగా మారింది. మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లి రవాణాకు తమ లారీలనే వినియోగించాలని ఓనర్లు బ్రోకర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. బాడుగ అడిగినంత ఇవ్వాలనే డిమాండ్ విధించారు. దీంతో కొద్ది రోజుల పాటు వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లు నిలిపేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు, వ్యాపారులు ఓ కమిటీ వేసి మార్కెట్ ధరలకు అనుగుణంగా బాడుగలు నిర్ణయించేలా తీర్మానించారు. అయితే అమలుకు నోచుకోలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు హమాలీలు, వ్యాపారుల మధ్య కూలి విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ పరిణామం కూడా ఉల్లి రైతుపై ప్రభావం చూపింది. కొంప ముంచుతున్న అనామత్ వ్యాపారం ఉల్లి విక్రయాలకు తాడేపల్లిగూడెం తర్వాత కర్నూలు మార్కెట్‌యార్డు రాయలసీమ, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాలకు ఏకైక దిక్కు. ఇక్కడ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా వ్యాపారుల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అనామత్ కొనుగోళ్ల కారణంగా రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం క్వింటాకు రూ.1500 నుంచి రూ.2వేల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుంది. అయితే వ్యాపారులు కుమ్మక్కై క్వింటా రూ.800లకు మించి కొనుగోలు చేయకపోవడం రైతులను ఆత్మహత్యలకు ఉసిగొలుపుతోంది. నిబంధనల ప్రకారం వేలంలో కొనుగోలు చేయాల్సి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. మధ్యాహ్నం వరకు నామమాత్రంగా వేలంలో కొనుగోలు చేస్తూ.. ఆ తర్వాత షరామామూలుగా అనామత్ వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లా అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.వానొస్తే అంతే సంగతి కర్నూలు మార్కెట్ యార్డుకు కొద్ది రోజులుగా ఉల్లి దిగుబడి భారీగా వస్తోంది. అయితే అవసరమైనన్ని షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగుబడులు తడిసి ముద్దవుతున్నాయి. ఇలాంటి సరుకు ధర సగానికి పడిపోతోంది. ఇదే సమయంలో పందికొక్కుల బెడద నష్టాన్ని రెట్టింపు చేస్తోంది. -
గాలిలో మేడలు
విజయవాడ చుట్టుపక్కల రియల్టర్ల హల్చల్ చుక్కల్లో భూముల ధరలు జోరుగా జీరో బిజినెస్ కోట్లు ఆర్జిస్తున్న వ్యాపారులు విజయవాడ : రియల్టర్లకు రాజయోగం పట్టింది. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో పరిసర గ్రామాల్లో మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావుడి చేస్తున్నారు. కొత్త రాజధాని పేరుతో గాలిలో మేడలు కడుతూ భూముల విలువను ఆకాశానికి పెంచేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ తదితర ఏరియాల్లో ఇప్పటికే వెంచర్లు ఉన్న రియల్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలు భవిష్యత్తులో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీల మాదిరిగా అభివృద్ధి చెందుతాయని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కొత్తగా వెంచర్లు వేసేందుకు రియల్టర్లు గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లో పొలాల కోసం చక్కర్లు కొడుతున్నారు. వారి హడావుడి కారణంగా తమ పొలాలను ఎంతకు విక్రయించాలో కూడా తేల్చుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం మాగాణి భూముల కన్నా మెట్ట పొలాలకే డిమాండ్ పెరిగింది. మూడు నెలల ముందుగానే లావాదేవీలు.. విజయవాడనే రాజధాని చేస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు మొదటి నుంచి చెబుతుండటంతో మూడు నెలలుగా రియల్టర్లు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ఆగిరిపల్లి ప్రాంతాలపై దృష్టిసారించారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్‌కు ముందే మధ్యవర్తుల సాయంతో చేతులు మార్చి(జీరో బిజినెస్) కోట్లాది రూపాయలను ఆర్జించారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీని చెల్లించకుండా తప్పించుకున్నారు. మూడు నెలల్లో అధికారిక లావాదేవీలు ఇవీ.. గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జూన్‌లో 1,492 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రభుత్వానికి రూ.4.18 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద లభించింది. జూలైలో 1,723 రిజిస్ట్రేషన్లు జరగ్గా, రూ.4.96 కోట్లు, ఆగస్టులో 1,096 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.62 కోట్ల ఆదాయం వచ్చింది. నూజివీడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 834 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.1.59 కోట్ల ఆదాయం లభించింది. జూలైలో 1,170 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.47 కోట్లు, ఆగస్టులో 513 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.1.88 కోట్ల ఆదాయం వచ్చింది. హనుమాన్‌జంక్షన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 320 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోటి రూపాయలు ఆదాయం లభించింది. జూలైలో 420 రిజిస్ట్రేషన్లకు గానూ, కోటి రూపాయలు, ఆగస్టులో 270 రిజిస్ట్రేషన్లకు రూ.92 లక్షలు స్టాంప్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఈ మూడు ప్రాంతాల్లో అధికారిక లావాదేవీల కన్నా మూడు రెట్లు ఎక్కువగా అనధికారికంగా లవాదేవీలు జరిగినట్లు సమాచారం. ఆస్తుల విలువలకు రెక్కలు ఇప్పటికే జిల్లాలో రూ.12వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు నాలుగు వేల ఎకరాలు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ భూములు, ప్లాట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. గన్నవరంలో కొద్దికాలం క్రితం ఎకరం రూ.20 లక్షలు ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెబుతున్నారు. గన్నవరం సమీపం గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు ఎకరా రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. నూజివీడు ప్రాంతంలో కూడా భూముల ధరలు అంతులేకుండా పెరిగాయి. గతంలో నూజివీడులో ఎకరం పొలం రూ. 20 లక్షలు ఉండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి వల్ల ఇప్పుడు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్లకు చేరింది. గన్నవరం పట్టణంలో సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. -
యూరియా కొరత
ఇబ్బందుల్లో రైతులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు సాక్షి, బళ్లారి : జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విస్తారంగా పంటలు సాగు చేయడంతో వ్యాపారులే ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యూరియా కొరత అధికంగా ఉందని చూపుతూ పలువురు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. తుంగభద్ర డ్యాం సకాలంలో నిండటంతో పాటు వర్షాలు బాగా కురవడంతో జిల్లా వ్యాప్తంగా సిరుగుప్ప, కంప్లి, హొస్పేట, హడగలి, హగరిబొమ్మనహళ్లి, సండూరు, బళ్లారి, కూడ్లిగి నియోజకవర్గాల పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. ముఖ్యంగా తుంగభద్ర ఆయకట్టు కింద వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, సూర్యకాంతి తదితర పంటలు సాగు చేశారు. వరినాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. వరి నాట్లు వేసే ముందు, వేసిన తర్వాత 15 రోజుల లోపు యూరియా చల్లితే వరిపైరు బాగా ఏపుగా పెరుగుతుందనేది అధికారులు సూచన.. దీంతో యూరియాను కొనడానికి రైతులు ఎగబడుతున్నారు. అయితే యూరియా కొరత ఉందంటూ కొందరు ఫర్టిలైజర్ షాపు యజమానులు చెబుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తమ వద్ద యూరియాను బ్లాక్ మార్కెట్లో రైతులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పేద రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా ఎంఆర్పీ ధర బస్తాకు రూ.275 నుంచి రూ.285లుగా ఉంది. డిమాండ్‌ను సొమ్ముచేసుకోడానికి ఫర్టిలైజర్ షాపు యజమానులు కొందరు సిండికేట్ అయి రూ.375లకు బస్తాను విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు వ్యాపారులు ముందస్తు ప్లాన్ చేసి యూరియాను పలు ప్రాంతాల్లో నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారి రామణ్ణను వివరణ కోరగా యూరియా తీసుకునే రైతులు బిల్లులు వేసుకుని తీసుకోవాలన్నారు. ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు వేయించుకోకుండా ఎరువులు తీసుకుంటే తామేమి చేయలేమన్నారు. యూరియా కొరత ఉన్నట్లు వ్యాపారులు సృష్టిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే తాము వెంటనే ఆయా రైతులకు యూరియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు ఎరువులు కొరత ఉంటే వెంటనే వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. -
ఇచ్చుకో.. పుచ్చుకో..
మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారుల ఒప్పందం ఒక్కో బాటిల్‌కు రూ.5 పెంచేందుకు ఓకే లెసైన్స్ రెన్యూవల్‌కు రూ.55వేలు సగం ముట్టజెప్పిన వ్యాపారులు! మంత్రాంగం నడిపిన సిండికేట్ నాయకుడు జిల్లా వ్యాప్తంగా అమలు మచిలీపట్నం : ఎక్సైజ్ అధికారులకు, మద్యం వ్యాపారులకు మధ్య ఒప్పందం కుదిరింది. అధికారులు అడిగినంత లంచం ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. వ్యాపారులు ఒక్కో బాటిల్‌పై అదనంగా ఐదు రూపాయలు వసూలు చేసుకునేందుకు అధికారులు సమ్మతించారు. మచిలీపట్నం ప్రధాన కూడలిలో ఒక పేరుతో వైన్ షాపు దక్కించుకుని... పాత పేరుతోనే షాపు నడుపుతున్న టీడీపీ ద్వితీయశ్రేణి నాయకుడు ఒకరు అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు, ఇటు మద్యం దుకాణాల యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరించి మామూళ్ల కథను ఓ కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ఎక్సైజ్ కార్యాలయమే వేదిక..! మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం రిటైల్ షాపు యజమానులతో సమావేశం జరిగింది. ఎక్సైజ్ సర్కిల్ స్థాయి అధికారి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పర్మినెంట్ లెసైన్స్ కావాలంటే ఒక్కో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం దుకాణ యజమానులు రూ.55 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. దుకాణదారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య జరిగిన చర్చల్లో ఏయే అధికారికి ఎంత మేర మామూళ్లు అందజేయాలనే అంశంపైనా స్పస్టత వచ్చినట్లు తెలుస్తోంది. సిండికేట్ నాయకుడు చొరవ తీసుకుని కొంతమంది వ్యాపారులతో మామూళ్ల అడ్వాన్సుగా రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు బుధవారమే ఇప్పించినట్లు సమాచారం. వాటాలు ఇలా... మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో ఆరు రిటైల్షాపులు ఉన్నాయి. మచిలీపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో ఎంఆర్పీ కన్నా ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే పద్ధతిని మచిలీపట్నం ఈఎస్ కార్యాలయ పరిధిలోనూ అమలు చేయవచ్చని, ఇందుకు ఎక్సైజ్ శాఖలో అందరూ సానుకూలంగా ఉన్నారని, సమావేశం ఏర్పాటు చేసిన అధికారి చెప్పినట్లు తెలిసింది. ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల చొప్పున ధర పెంచినా తాము పట్టించుకోమని, ఇది తన మాట కాదని, పై అధికారులు చెప్పారని ప్రకటించినట్లు సమాచారం. రిటైల్ షాపులు, మద్యం దుకాణాలకు పర్మినెంట్ లెసైన్స్‌లు ఇస్తున్నామని, ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఒక్కో షాపునకు రూ.55వేలు లంచం ఇవ్వాలని సిండికేట్ నాయకుడు, సర్కిల్ స్థాయి అధికారి చేసిన సిఫార్సులకు రిటైల్‌షాపుల యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు ద్వారా ఇచ్చే రూ.55 వేలలో ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్‌కు రూ.10 వేలు, ఈఎస్కి, 10 వేలు, సీఐకి రూ.10వేలు, ఎక్సైజ్‌స్టేషన్‌కు రూ.25వేల చొప్పున అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బందరు సీఐ కార్యాలయ పరిధిలోని రిటైల్ దుకాణాల యజమానులతో బుధవారం సమావేశం ముగియగా, గురువారం మద్యం దుకాణ యజమానులతోనూ సమావేశం కానున్నారు. పక్కా వ్యూహంతోనే వసూళ్లు మచిలీపట్నం ఈఎస్ కార్యాలయానికి సోమవారం ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వచ్చారు. అధికారులంతా సమావేశమై మద్యం ధరలు పెంచడం, మామూళ్లు వసూలు చేయడంపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షాపులకు లెసైన్స్‌లు మంజూరు చేసే సమయంలోనే నగదు వసూలు చేయాలని, ఇందుకోసం సిండికేట్ నాయకుల సాయం తీసుకోవాలని ఆ అధికారి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంతోపాటు ఒక్కో మద్యం దుకాణం నుంచి ప్రతి నెలా రూ.15వేలు మామూళ్లు వసూలు చేసే విషయంపై సిండికేట్ నాయకులు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. -
శ్రీకాళహస్తి కేంద్రంగా చౌకబియ్యం వ్యాపారం
రూపాయి బియ్యం కర్ణాటకలో ధర రూ.20 రూ.లక్షలు ఆర్జిస్తున్న వ్యాపారులు కమీషన్లకు దాసోహమైన అధికారులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణం కేం ద్రంగా పలువురు వ్యాపారులు చౌక బియాన్ని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. పట్టణంలోని రాజీవ్‌నగర్, పానగల్ ప్రాం తాల్లో చౌక బియ్యాన్ని నిల్వ చేసి, కర్ణాట క రాష్ట్రంలోని కోలార్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన రూపాయి బియ్యం కోలార్‌లో రూ.20 ధర పలుకుతోంది. బియ్యం వ్యాపారం సాగుతోందిలా... పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు చౌక దుకాణ డీలర్లు రేషన్‌కార్డులకు అందించాల్సిన చౌకబియ్యాన్ని సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రరుుస్తున్నారు. ప్రధానంగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీ పురం, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాలతోపాటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, పెళ్లకూరు, డక్కిలి, రాపూ రు, నాయుడుపేట మండలాల్లోని చౌకదుకాణ డీలర్ల నుంచి 50 కిలోల బస్తా రూ.550కి చిన్నవ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వారు వాటిని పట్టణంలోని బడా వ్యాపారలకు 50 కిలోల బస్తా రూ. 700కు విక్రరుుస్తున్నారు. బడా వ్యాపారులు వాటిని కర్ణాటక రాష్ర్టంలోని కోలార్‌లో రూ.వెరుు్యకి విక్రయిస్తూ బస్తాకు రూ.300 ఆదాయం ఆర్జిస్తున్నారు. ఓ లారీ లోడుకు(300బస్తాలు) సుమారు రూ. 90 వేలు ఆర్జిస్తున్నారు. అయితే లారీ బడుగ రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం తరలింపు కోసం పోలీసులు, చెక్‌పోస్టుల్లో లోడుకు రూ.10 వేలు, అధికారులకు కమీషన్ గా లోడుకు రూ.10 వేలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా అన్ని ఖర్చులు పోను లోడుకు వ్యాపారులకు రూ.20 వేలు మిగులుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు రెండు లారీల చౌక బియ్యాన్ని శ్రీకాళహస్తి నుంచి కోలార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి వ్యాపారులకు నగరికి చెందిన వ్యాపారులతో విభేదాలు ఏర్పడడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి ఇటీవల బియ్యాన్ని పట్టించడం తెలిసిందే. అంతేతప్ప కమీషన్లకు కక్కుర్తి పడిన అధికారులు మాత్రం పట్టుకున్న సందర్భాలు అరుదే. చౌకబియ్యంతో వ్యాపారం చేస్తే చర్యలు చౌకబియ్యంతో వ్యాపారాలు సాగించే వారిపై చర్యలు తప్పవు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎవరైనా వ్యాపారులకు సహకరిస్తే చట్టం వారిని శిక్షిస్తోంది. ఇకపై బియ్యం పంపిణీతోపాటు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. -చంద్రమోహన్, తహశీల్దార్ -
టమాట మార్కెట్లో ధర నాటకం
మండీ నిర్వాహకులు, వ్యాపారుల రింగ్ ఒకే రోజు బాక్సుకు రూ.150 ధర తగ్గించిన వైనం కార్యాలయం వద్ద రైతుల ధర్నా పలమనేరు : పలమనేరు టమాట మార్కెట్లో మండీ నిర్వాహకులు, వ్యాపారులు కలిసి టమాట ధర భారీగా తగ్గించేశారు. చుట్టుపక్కల ఉన్న మార్కెట్లతో పోలిస్తే బాక్సుకు రూ.150 దాకా వ్యత్యాసం వచ్చింది. ఆగ్రహిం చిన రైతులు మండీ యజమానులు, వ్యాపారులను నిలదీశారు. అసలేం జరిగిందంటే.. పలమనేరు మార్కెట్‌కు రోజూ సరాసరి 30 లోడ్ల టమాటాలు వస్తుంటాయి. నెల నుంచి టమాట దిగుబడి పెరిగింది. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా పంట దెబ్బతింది. దీంతో స్థానిక మార్కెట్‌కు వచ్చి టమాటాలు కొనుగోలు చేసేవారు. అందువల్ల మదనపల్లె, కర్ణాటకలోని వడ్డిపల్లె మార్కెట్లతో సమానంగా ఇక్కడ ధర ఉండేది. ఇలా అయితే గిట్టుబాటు కాదని భావించిన స్థానిక మండీ నిర్వాహకులు, పొరుగు వ్యాపారులు కుమ్మక్కై ధరను నియంత్రించారు. రూ.వంద వ్యత్యాసం.. మండీ నిర్వాహకులు, వ్యాపారులు కలిసి అనంతపురం జిల్లా నుంచి పది లోడ్ల టమాటాలు పలమనేరు మార్కెట్‌కు ఓ పథకం ప్రకారం తీసుకొచ్చారు. స్థానికంగా మరో 25 లోడ్లు మార్కెట్‌కు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చిన టమాటాలు ఇక్కడి రైతులకు చూపెట్టి ఉన్నట్టుండి సరుకు భారీగా వచ్చేసిందని, అమాంతం ధర తగ్గించేశారు. సోమవారం కర్ణాటక రాష్ర్టం వడ్డిపల్లె మార్కెట్లో బాక్సు రూ.450 పలికింది. మదనపల్లెలోనూ దాదాపుగా అంతే పలికింది. ఆదివారం కూడా స్థానిక మార్కెట్లో రూ.380 పలికిన ధర వ్యాపారుల రింగుతో రూ.230కు పడిపోవడం తో రైతులు అవాక్కయ్యారు. రైతుల ఆగ్రహం స్థానికంగా ధర తగ్గించేందుకు వ్యాపారులు ఆడిన నాటకాన్ని రైతులు గుర్తించారు. ఏడాది పొడవునా తమ వద్ద కమీషన్లు తీసుకుంటూ ఈ విధంగా అన్యాయం చేయడం తగదంటూ మండీ నిర్వాహకులపై, వ్యాపారులపై మండిపడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గతంలోనూ కొన్నిసార్లు ఇదేవిధంగా ధర తగ్గించేశారని మార్కెట్ కమిటీ కార్యదర్శి సరళకుమారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా నుంచి రైతులు ఇక్కడికొచ్చి అమ్ముకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ధర తగ్గించడానికి నాటకమాడిన వ్యాపారుల లెసైన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
మెట్రో రైలు రూటు మారింది
రెండు చోట్ల స్వల్ప మార్పులు కొత్త మార్గం అసెంబ్లీ వెనుక నుంచి భూగర్భ మెట్రో లేనట్టే సీఎం తాజా ప్రకటనతో చారిత్రక కట్టడాలు సేఫ్ హర్షం వ్యక్తం చేస్తున్న సుల్తాన్‌బజార్ వ్యాపారులు సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో మార్గం (అలైన్మెంట్) మారుతుందని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించడంతో మెట్రో మార్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో వచ్చే సుల్తాన్‌బజార్ మార్కెట్ మీదుగా కాకుండా.. దాని మీపంలోని కోఠి ఉమెన్స్ కళాశాల వెనకవైపు నుంచి బడిచౌడి, తిలక్‌పార్క్, వీరసావర్కార్ విగ్రహం, నారాయణగూడా ఫ్లైఓవర్ మీదుగా మెట్రో మార్గాన్ని మళ్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్-1) రూట్లో అసెంబ్లీ ప్రధాన రహదారి నుంచి కాకుండా నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్‌గార్డెన్, అసెంబ్లీ వెనుక నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో మార్గాన్ని మళ్లించే అవకాశాలున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం రెండు చోట్ల సుమారు వంద మీటర్ల మార్గంలో అలైన్‌మెంట్‌ను మార్చాల్సి ఉందని హెచ్ఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు చోట్ల అలైన్మెంట్ మార్చిన పక్షంలో సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, గన్‌పార్క్ అమరవీరుల స్తూపాలకు ఎలాంటి నష్టం జరగదని అధికారులు భావిస్తున్నారు. నగరంలో మూడు కారిడార్ల పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మార్గంలో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్న విషయం విదితమే. తాజాగా మారిన అలైన్మెంట్ ప్రకారం అధికారులు ఈ ప్రాంతాల్లో సర్వే చేయాల్సి ఉంది. భూగర్భ మెట్రో నిర్మాణం నగరంలో సాధ్యపడదని నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదించినందున ఎలివేటెడ్ మార్గంలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. సీఎం తాజా ప్రకటనపై సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ అసోసియేషన్, హైదరాబాద్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ నాలుగేళ్ల పొరాటం ఫలించిందని వారు పేర్కొన్నారు. నేడు మళ్లీ టెస్ట్ రన్.. నాగోల్-మెట్టుగూడా రూట్లో సోమవారం మెట్రో రైలుకు మరోసారి టెస్ట్ రన్ నిర్వహించనున్నట్టు ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. నాగోల్ మెట్రో డిపోలోని నాలుగు మెట్రో రైళ్లకు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో సదరు పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
మాంసానికి ‘శ్రావణం’ ఎఫెక్ట్
30 శాతం పడిపోయిన విక్రయాలు అమ్మకాల్లేక వ్యాపారులు విలవిల సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఆదివారం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. శ్రావణ మాసం పూజలు కారణంగా మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ పడిపోయింది. ఆదివారం ఒక్కరోజే అమ్మకాలు 30 శాతం మేర పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 550-600 టన్నులకు పైగా చికెన్, 220-280 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయం జరుగుతుంది. అయితే, ఈ ఆదివారం చికెన్ 300 టన్నుల లోపు అమ్ముడు పోగా, మటన్ సుమారు 170 టన్నులు, చేపలు 20 టన్నులు మాత్రమే అమ్మకాలు జరిగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో చాలామంది పూజలు, వ్రతాలతో మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే డిమాండ్ పడిపోయిందని వ్యాపారులంటున్నారు. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కే ప్రతీ ఆదివారం 70-80 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే, ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఈ ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్టు తెలిసింది. దిగిరాని ధరలు.. చికెన్, మటన్, చేపలకు డిమాండ్ తగ్గినా రిటైల్ మార్కెట్లో ధరలు మాత్రం తగ్గలేదు. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.65 పలకగా.. హోల్‌సేల్‌గా రూ. 71కు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.83 ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.116కు, స్కిన్లెస్ రూ.136 ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.400-500, బోన్‌లెస్ రూ.600-650కు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.60-70, బొచ్చె రూ.70-80, కొరమీను రూ.300-400, గోల్డ్ ఫిష్ రూ.70, రొయ్య, రూ.200-250 ప్రకారం అమ్మారు. అయితే, నగరంలో అన్నిచోట్లా ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు.సాయంత్రానికి చేపల రేట్లు కాస్త తగ్గినా చికెన్, మటన్ ధరలు మాత్రం తగ్గలేదు. -
శాంపిల్ ఒకటి.. సరఫరా మరొకటి!
అటవీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన పట్టెడన్నం పెట్టి వారిలో శారీరక స్థితి బాగుపరచడంతోపాటు విద్యావంతులను చేయాలన్న ప్రభుత్వ ఆశయం కొందరు అధికారులు, దళారుల నిర్వాకంతో నీరుగారిపోతోంది.. గిరిజన ఆశ్రమ, సంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కు చెందిన ఉద్యోగులు మాయాజాలం చేస్తున్నారు.. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మన్ననూర్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని 54 పాఠశాలలతో పాటు నల్లగొండ జిల్లాలోని 62గిరిజన ఆశ్రమ, సంక్షేమ, కస్తూర్బా, మినీ గురుకులం పాఠశాల లకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ వస్తువులను మన్ననూర్ జీసీసీ నుంచి సరపరా చేస్తున్నా రు. ప్రతినెలా ఈ రెండు జిల్లాలకు సం బంధించి రూ.90 లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. వసతి గృహా లకు నెలకు సరిపడా సరుకులను సరఫరా చేసేందుకు ఐటీడీఏ టెండర్లు నిర్వహిస్తోంది. ఏటా గుర్తింపు కలిగిన ట్రేడర్స్ ఇందులో పాల్గొంటారు. వీటి ని మన్ననూర్ జీసీసీ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపూర్‌లోని మహాలక్ష్మి, విఘ్నేశ్వర ట్రేడర్స్; నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని రాఘవేంద్రస్వామి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వెంకటదుర్గా ట్రేడర్స్ సరఫరా చేస్తున్నాయి. టెండరు సమయంలో కాంట్రాక్టర్లు శాంపిల్‌గా అధికారులకు నాణ్యత కలిగిన సరుకులు చూపిం చారు. ఆ తర్వాత నాసిరకం, పుచ్చు లు, మక్కినవి, ఎందుకూ పనికి రానివి, తక్కువ తూకాలతో ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తున్నారు. అందుకు గోదాం క్లర్కులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెబుతున్నారు. ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పి డెప్యూటేషన్‌పై వార్డెన్లుగా వచ్చిన వారితో గోదాం క్లర్క్‌కు ఉన్న సంబంధాలు అక్రమాలకు ఊతమిస్తున్నాయి. ట్రేడ ర్ల నుంచి కొన్ని సమయాల్లో వచ్చిన నాణ్యమైన సరుకులను మార్పిడి చేసి అచ్చంపేట నుంచి నాసిరకం సరుకులను తెప్పించి బదలాయించడం వీరికి పరిపాటిగా మారింది. కార్యాలయంలోని ఓ సీనియర్ ఉద్యోగి ఈ తతంగం నడిపిస్తున్నట్లు అరోపణలున్నాయి. గత ఏడాది వచ్చిన సరుకులను కొందరు వార్డెన్లు గోదాం క్లర్క్ ద్వారా డబ్బు రూపేణా తీసుకోవాలనుకున్నా వీలు కాలేదు. దీంతో కార్యాలయం వెనక ఉన్న గదిలో ఏడాది పాటు సరుకులు నిల్వ ఉండటంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి. అప్పట్లో ఆడిట్ అధికారులు వాటి గురించి ప్రస్తావించినా పొంతనలేని సమాధానంతో గుట్టుచప్పుడు కాకుండా వాటిని మాయం చేశారు. అక్రమ లావాదేవీలకు అడ్డుపడకుండా ఉండేందుకు కొందరు నాయకులకు ముందుగానే కొంత మొత్తంలో డబ్బు ముట్టజెప్పి ప్రతినెలా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే విధి నిర్వహణలో ఏమాత్రం పరిజ్ఞానం లేని గోదాం క్లర్క్, మరికొందరు సిబ్బంది తమ విధులను మరొకరితో చేయించుకోవడం గమనార్హం. ఏదిఏమైనా గోదాం క్లర్క్‌ల అక్రమాలతో వసతి గృహాల్లోని విద్యార్థులు నాణ్యమైన భోజనం, వస్తువులు అందడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం కొన్ని సరుకులు తక్కువ ఉన్నప్పుడు అచ్చంపేట నుంచి కొనుగోలు చేయడం నిజమే. ట్రేడర్ల ద్వారానాణ్యతలేని సరుకులు వచ్చినప్పుడు కొన్ని సమయాల్లో తిప్పి పంపిస్తున్నాం. ఓ గోదాంకు సంబంధించి అక్రమాలకు అవకాశం లేకుండా చూస్తున్నాను. మరో దానిలో అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి వస్తే సహించేదిలేదు. ఉన్నతాధికారులకు నివేదించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. -బాలకృష్ణ, జీసీసీ మేనేజర్, మన్ననూర్ -
రంగురాళ్ల క్వారీలపై వ్యాపారుల కన్ను
మన్యంలో విస్తృత సర్వే పాడేరు: మన్యంలో లభించే విలువైన రంగురాళ్ల క్వారీలపై బడా వ్యాపారులు కన్ను పడింది. ఒడిశా, రాజస్థాన్ సహా జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారులు ప్రస్తుతం మన్యంలో అధికంగా సంచరిస్తున్నారు. గొలుగొండ మండలం కరక, జీకే వీధి మండలం గుర్రాలగొంది క్వారీలను అటవీ, పోలీసు శాఖలు మూసివేసాయి. ఈ రంగురాళ్ల క్వారీల్లో రంగురాళ్ల మట్టి తవ్వకాలపై నిషేధం ఉండటంతో వ్యాపారం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారులంతా కొత్త క్వారీల్లో తవ్వకాలపై దృష్టి సారించారు. చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో పలు చోట్ల గతంలో తవ్వకాలు జరిపిన క్వారీల్లో మళ్లీ మట్టి తవ్వకాలకు వ్యాపారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గిరిజనులతో మంతనాలు జరుపుతున్నారు. విలువైన క్యాట్స్ ఐ రకం రంగురాళ్లు లభించే కొత్త క్వారీలను కూడా వ్యాపారులు అన్వేషిస్తున్నారు. అబ్రకం ఖనిజం జాడలు కనిపించిన భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం రంగురాళ్ల వ్యాపారులు పాడేరు, జి.మాడుగుల,చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తున్నారు. నర్సీపట్నం, విశాఖపట్నం కేంద్రాలుగా బడా వ్యాపారులు మకాం వేసి రంగురాళ్ల క్వారీల వేటలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లోని పేరొందిన రంగురాళ్ల ముఠా కూడా ఏజెన్సీలోని రంగురాళ్ల సంపదపై కన్నేసింది. గతంలో వారు పాడే రు మండలం మినుములూరు క్వారీలో అక్రమంగా మట్టిని తవ్వించారు. విలువైన రంగురాళ్లు లభించడంతో రాజకీయ అండదండలతో శ్రీలంకకు తరలించి రూ.కోట్లలో వ్యాపారం చేసారు. అప్పట్లో పోలీసుశాఖ కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురైందనే ఆరోపణలు వినిపించాయి. వ్యాపారుల మధ్య పోటీతత్వం నెలకొనడంతో చివరికి ఫిర్యాదులు అధికమై పోలీసులు, రెవెన్యూ అధికారులు మినుములూరు క్వారీని రెండేళ్ల కిందట మూసివేసారు. వ్యాపారులు మాత్రం ఈ క్వారీలో తవ్వకాలకు నిరంతరం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. క్వారీ ఉన్న ప్రాంతం పట్టా భూమి కావడంతో భూమి యజమాని తవ్వకాలకు అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రంగురాళ్ల వ్యాపారులంతా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలను కూడా వ్యాపారులు ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. -
టమా‘ఠా’
భగ్గుమంటున్న ధరలు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.60-70 నగరానికి దిగుమతులు తగ్గిన ఫలితం సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు టమాటా బాంబులా కన్పిస్తోంది. స్థానికంగా దిగుబడులు లేకపోవడం.. అనుకున్న స్థాయిలో దిగుమతి కాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజురోజుకూ వీటి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. సామాన్యుడు మాత్రం వీటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరల కారణంగా టమాటా కాస్త టమోతగా మారింది. నగర మార్కెట్లో టమాటా ధరలు మోతమోగిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే శనివారం టమాటా కిలో ధర రూ.52, రైతు బజార్లలో రూ.55 పలికింది. రిటైల్ మార్కెట్లో దాని ధర మరింత ఎక్కువగా ఉంది. గిరాకీని బట్టి కేజీ టమాటాను రూ.60 నుంచి 70 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లవద్దకు వచ్చే తోపుడుబండ్ల వ్యాపారులు కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. సరుకు నాణ్యత, గిరాకీని బట్టి వ్యాపారులు ధర నిర్ణయిస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరలు పెరగడంతో వంటింట్లో టమాటాకు స్థానం లేకుండా పోయింది. దీని ధర ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. ముఖ్యంగా పచ్చి మిర్చి ధర ఎగబాకుతోంది. మిగతా కూరగాయల్లోనూ శనివారం కిలోకు రూ.2-3 పెరుగుదల కన్పించింది. ఫ్రెంచి బీన్స్, క్యారెట్, చిక్కుడు, బీర, బెండ, కాప్సికమ్ కిలో ధర రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. వంకాయ, దొండ, దోస, సొర, కాకర, క్యాబేజీ, గోరుచిక్కుడు, బీట్రూట్, పొట్ల, కంద వంటివన్నీ కేజీ రూ.20-36 మధ్యలో లభిస్తున్నాయి. తగ్గిన సరఫరా.. శివార్లలో పండిన మిర్చి, టమాటా దిగుబడులు పూర్తికావడంతో దిగుమతులపైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా, అనంతపూర్, బెల్గామ్ల నుంచి పచ్చి మిర్చి నగరానికి సరఫరా అవుతోంది. ఇప్పుడు అక్కడే మంచి ధరలు లభిస్తుండటంతో హైదరాబాద్‌కు తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి అవుతోంది. నగర డిమాండ్‌కు తగినంతగా సరుకు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగర అవసరాలకు నిత్యం 350-400 టన్నుల టమాటా దిగుమతయ్యేది. శనివారం బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు మదనపల్లి నుంచి కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. రోజుకు 80-100 టన్నులు దిగుమతి అయ్యే పచ్చిమిర్చి శనివారం కేవలం 230 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు గణనీయంగా పడిపోవడంతో ప్రధానంగా మిర్చి, టమాటాకు నగరంలో కొరత ఏర్పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొరతే ధరలు పెరగడానికి దారితీసినట్టు వారు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించి ఉత్పత్తి పుష్కలంగా ఉన్న కూరగాయల ధరలను కూడా పెంచేసి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి.. కూరగాయల ధరలు పెరిగినప్పుడు గృహిణులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. టమాటా, పచ్చిమిర్చిల స్థానే చింతపండు, ఇమ్లీ పౌడర్, ఎండు మిర్చి, కారం పౌడర్‌ను వినియోగించడం శ్రేయస్కరం. స్థానికంగా సాగవుతున్న కొత్తపంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుంది. అప్పటివరకు కూరగాయల ధరలు అస్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం టమాటా, మిర్చి అధికంగా ఉత్పత్తి అవుతున్న ప్రాంతాల నుంచి నగరానికి దిగుమతి చేసుకునేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపడుతోంది. ఉన్నంతలో ధరల నియంత్రణకు గట్టిగా కృషి చేస్తున్నాం. - వై.జె.పద్మహర్ష, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ -
ఈ-బిడ్డింగ్‌పై వ్యాపారుల ఆందోళన
ఖమ్మం వ్యవసాయం: ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో అమలు జరుగుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మం మార్కెట్లో గురువారం కమీషన్ వ్యాపారులు జెండాపాటను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో బాగంగా అమ్మకానికి వచ్చిన పంట ఉత్పత్తిని ఖరీదు దారులు చూసుకొని నాణ్యతా ప్రమాణాల మేరకు ధరను రహస్యంగా బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్‌లో అధిక ధరను కోడ్ చేసిన వ్యాపారికి రైతు సరుకును అమ్మేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ఖరీదుదారులు సరుకుకు తాము పెట్టే ధరను రైతులకు చెబుతూ బిడ్డింగ్ చేసేవారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చి రహస్య విధానం చేపట్టడంతో కమీషన్ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. గతంలో మాదిరిగా ఖరీదుదారులు సరుకుకు పెట్టే ధరను రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విధానం అమలు చేసే వరకు సరుకు కొనుగోలు చేయనీయమని అడ్డుకున్నారు. జెండాపాట నిర్వహించవద్దంటూ పత్తి మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ ఖాదర్‌బాబాను డిమాండ్ చేశారు. దీంతో ఆయనకు, కమీషన్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం అసిస్టెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ కె.సీ.రెడ్డి అక్కడికి చేరుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావుతో చర్చించారు. ఆ తర్వాత జెండా పాట నిర్వహించడానికి వెళ్లగా, వ్యాపారులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులకు-అధికారులకు మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఖమ్మం మార్కెట్లోనే ఈ-బిడ్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కమీషన్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు కూడా ఈ విధానం తమకు అర్థం కావటం లేదని వాపోయారు. వ్యాపారుల ఆందోళన తీవ్రం కావడంతో త్రీటౌన్ సీఐ రహమాన్ మార్కెట్‌కు చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వ్యాపారులు, ఖరీదుదారుల ప్రతినిధులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, మన్నెం కృష్ణ, రమేష్ భద్రం తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌ను అమలు చేస్తున్నారని, రాష్ట్ర మంత్రి, ప్రభుత్వం మెప్పు పొందేందుకు అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ-బిడ్డింగ్ ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు విధానాలను అమలు చేస్తున్నామని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ చెప్పారు. ఇలా వాదోపవాదాల అనంతరం రైతులు ఇబ్బంది పడకుండా తాత్కాలికంగా పాత విధానంతో సరుకు కొనుగోలుకు అధికారులు అంగీకరించారు. దీంతో మద్యాహ్నం 2:45 గంటలకు జెండాపాట నిర్వహించారు. -
గ్రేడింగ్ చెరిపివేతపై రైతుల ఆగ్రహం
కేసముద్రం మార్కెట్లో గంటన్నరపాటు నిలిచిన పసుపు వేలం పాటలు కేసముద్రం : మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పసుపు రాశులకు సెక్యూరిటీ గార్డులు వేసిన గ్రేడింగ్‌లను వ్యాపారులు చెరిపివేసి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో రైతులు గొడవకు దిగారు. దీంతో రైతులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం పెరిగి పసుపు వేలం పాటలు నిలిచి పోయాయి. సోమవారం మార్కెట్‌కు సుమారు 2వేల బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. మొదట సెక్యూరిటీ గార్డులు వచ్చిన పసుపు రాశులకు గ్రేడింగ్ విధానాన్ని సూచిస్తూ ఏ,బీ, సీ, ఇంటూ, ఎం ఇంటూ అనే గుర్తులు వేశారు. వాటి ప్రకారం వేలంపాటలు నిర్వహించాల్సిన వ్యాపారులు గ్రేడింగ్ తప్పు పడిందంటూ పలు రాశుల వద్ద గుర్తులను చెరిపివేసి ధరలను నిర్ణయిస్తూ వచ్చారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మహమూద్‌పట్నం గ్రామానికి చెందిన రైతు వెంకటాచారి నిలదీయగా వ్యాపారులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఇలాగైతే తాము కొనుగోళ్లు జరపలేమంటూ వ్యాపారు లు వేలంపాటలు నిలిపివేసి వెళ్లిపోయారు. అనంతరం మార్కెట్ అధికారులు జోక్యం చేసుకున్నా లాభంలేకుండా పోయింది. దీంతో రైతు లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడంలేదం టూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వ్యాపారులను ఒప్పించి గంటన్నర తర్వాత వేలంపాటలు ప్రారంభించారు. సోమవారం పసుపు క్వింటాలుకు గరిష్ట ధర రూ.5605, కనిష్ట ధర రూ.4300, గోళ రకానికి గరిష్టంగా రూ.5400, కనిష్టంగా రూ.4050 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
ఘాటెక్కిన మిర్చి..
రిటైల్ మార్కెట్లో కిలో రూ.60 విలవిల్లాడుతున్న వినియోగదారులు సరఫరా తగ్గిన ఫలితం సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో పచ్చిమిర్చి ధరల ఘాటు నషాలానికి ఎక్కింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.60కి చేరింది. టోకు మార్కెట్లో కేజీ రూ.38 ఉండగా, రైతుబజార్లో రూ.41 పలుకుతోంది. ఇదే సరుకు తోపుడుబండ్లపై పావు కిలో రూ.20 చొప్పున కేజీకి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. గత నెల వరకు కేజీ రూ.25-30కి లభించిన మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. డిమాండ్- సరఫరా మధ్య అంతరం పెరగడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం రోజుల్లోనే రెండు రెట్లు ధర పెరగడం ఇందుకు నిదర్శనం. మిర్చి ధరకు రెక్కలు రావడంతో ఈ ప్రభావం ఇతర కూరగాయలపైనా పడింది. మొన్నటివరకు కేజీ రూ.20-25 ధర పలికిన టమోట ఇప్పుడు రూ.40కి చేరింది. దోస, వంకాయ, క్యాబేజీ ధరలు మిగతా అన్నిరకాల కూరగాయలు రూ.30-60 మధ్య పలుకుతున్నాయి. మిచ్చితో పాటు బెండ, బీర, కాకర, చిక్కుడు, గోకర, క్యారెట్, బీన్స్, బీట్ రూట్లదీ అదే దారి. వంటింట్లో ప్రధాన నిత్యావసర వస్తువైన మిర్చి ధర పెరగడం గృహిణుల్లో కలవరం మొదలైంది. వర్షాలు మొదలైతే మిర్చి సరఫరా తగ్గి ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంటున్నారు. తగ్గిన సరఫరా నగర అవసరాలకు నిత్యం 90-100 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ఇప్పుడు 30-40 టన్నులకు మించట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా మిర్చి సాగు లేకోవడంతో కర్నూలు, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడా మిర్చికి డిమాండ్ ఉండటంతో నగర అవసరాలకు తగినంత సరుకు సరఫరా కావట్లేదని తెలుస్తోంది. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. -
ఎక్సైజ్ ఖజానాకు రూ.62 కోట్లు
విజయవాడ డివిజన్లో 142 షాపులే కేటాయింపు మిగిలిన 20 షాపులకు మళ్లీ గజిట్ విడుదల 7వ తేదీ లాటరీ సాక్షి, విజయవాడ : వైన్ షాపుల కేటాయింపుల ద్వారా ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా సొమ్ము చేరింది. విజయవాడ డివిజన్ పరిధిలోని వైన్ షాపుల కేటాయింపు ద్వారా రూ 62.13 కోట్లు ఆదాయం లభించింది. డివిజన్లోని 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న 162 వైన్ షాపులకు గత నెలలో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ప్రకియలో తొలి విడత షాపులు కేటాయించారు. 162 షాపులకు గానూ142 షాపులకు మాత్రమే దరఖాస్తులొచ్చాయి. దీంతో 142 షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించారు. గత నెల 22 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ 28న లాటరీ నిర్వహించారు. 142 షాపులకు గానూ 2452 ధరఖాస్తులందాయి. అత్యధికంగా తిరువూరులోని 11 వైన్సాపుల కోసం 479 దరఖాస్తులొచ్చాయి. కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.6.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక వైన్ షాపుల లెసైన్స్ ఫీజుల ద్వారా విజయవాడ డివిజన్లో 62,13,50,000కోట్లు ఆదాయం లభించింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు మూడు విడతలుగా ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో షాపు దక్కగానే ముందు ఒక విడత మొత్తం చెల్లించి షాపును ఖరారు చేసుకోవాలి. దీంతో తొలివిడతగా 20.71 కోట్లు వ్యాపారుల ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు చెల్లించారు. దీనిని ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. రెండో గజిట్ విడుదల ఎన్వి.రమణ విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న 20 వైన్‌షాపులకు సంబంధించి రెండో నోటిఫికేషన్ విడుదల చేశామని విజయవాడ ఎక్సైజ్ సూపరిండెంటెంట్ ఎన్వి. రమణ సాక్షికి తెలిపారు. డివిజన్లో మొదటి గజిట్ ద్వారా 162 షాపులకు గానూ 142 షాపులకు దరఖాస్తులొచ్చాయని వాటిని పరిశీలించి షాపులను కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ అదేశాలతో రెండో విడతలో మిగిలిన 20 షాపులకు గజిట్ విడుదల చేశామని, 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 7వ తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి షాపులు కేటాయిస్తామని చెప్పారు. -
పత్తి మార్కెట్లో ధర దగా
క్వింటాల్‌కు రూ.500 కోత - అధికారులను నిలదీసిన రైతులు - ఒక్కరోజే రూ.2.50లక్షల దోపిడీ జమ్మికుంట: పత్తి ధరల్లో వ్యాపారుల దగాకోరుతనం ఆగడంలేదు. గరిష్ట ధర చెల్లిస్తామని చెప్పి కనిష్ట ధర కూడా పెట్టక రైతులను నిలువునా ముంచుతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సోమవారం ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వరంగల్ జిల్లా నుంచి రైతులు దాదాపు రెండు వేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తెచ్చారు. సుమారు వంద వాహనాల్లో లూజ్ పత్తి తెచ్చారు. బస్తాల్లో వచ్చిన పత్తికి వ్యాపారులు పోటీ పడి జెండా పాటలో క్వింటాల్‌కు రూ.5వేలు గరిష్ట ధర పలికారు. లూజ్ పత్తికి రూ.5180 ధర పెట్టారు. మార్కెటింగ్ శాఖ అధికారులు బస్తాల్లో వచ్చిన పత్తికి క్వింటాల్‌కు రూ.5వేలు ధర పలికిందని వెల్లడించడంతో రైతులు ఒక్కసారిగా బిత్తరపోయారు. మార్కెట్లో ఎక్కడా రైతులకు రూ.5వేల ధర రాలేదని, కేవలం రూ.4350 నుంచి రూ.4500 వరకే ధరలు చెల్లించారని వందలాది మంది రైతులు అసిస్టెంట్ కార్యదర్శికి చెప్పారు. వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తున్నామని చెబుతూ రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోవడంలేదెందుకని ఆయనను నిలదీశారు. చెల్లించే ధరలు ఒకలా ఉంటే అధికారులు ప్రకటించే ధరలు మరోలా ఉన్నాయని మండి పడ్డారు. అందరూ కలిసి రైతులను ముంచుతున్నారన్నారు. రైతుల పక్షాన నిలువాల్సిన అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఒక్క రోజే దాదాపు 500 క్వింటాళ్ల పత్తికి రూ.4500 ధర చెల్లించి రూ.2.50 లక్షల దోపిడీ చేశారన్నారు. మార్కెట్లో జెండా పాట ఒకటి, చెల్లించే ధర మరొకటి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. 17 బస్తాల పత్తి తీసుకువస్తే రూ.5వేలు ధర పెట్టి, రూ.4500 ఇచ్చారని వరంగల్ జిల్లా రాఘవరెడ్డిపేటకు చెందిన జగదీశ్ వాపోయాడు. ఎడ్లబండ్ల కార్మికుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు మార్కెట్‌కు లూజ్ పత్తి వస్తుండడంతో తమకు పని లేకుండా పోతోందని ఎడ్లబండ్ల కార్మికులు విధులు బహిష్కరించడంతో పత్తి కొనుగోళ్లు ఐదు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఎండలో అరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్‌ను నిలదీశారు. ధరల నిర్ణయం అనంతరం మార్కెట్‌కు వాహనాల్లో లూజ్ పత్తి వస్తుండడంతో తమ ఉపాధిపై దెబ్బ పడుతుందని పత్తి రవాణా చేసే ఎడ్ల బండ్ల కార్మికులు నిరసనకు దిగారు. దీంతో బస్తాల్లో వచ్చిన పత్తి తూకాలు నిలిచి పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట కావస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు విసుగెత్తిపోయారు. సహనం కోల్పోయి అసిస్టెంట్ కార్యదర్శి వద్దకు వెళ్లి నిలదీశారు. తాను కార్మికులతో మాట్లాడుతున్నానని, వెంటనే తూకం వేయిస్తానని సముదాయించినా రైతులు వినిపించుకోలేదు. మార్కెట్‌కు సెలవు ప్రకటించి కార్మికుల సమస్యలపై చర్చించుకోవాలి గానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఐదు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు సాయంత్రం పత్తిని తూకం వేయించారు. -
ఇక కిక్కే కిక్కు..
- లక్కీ విజేతలు ఖరారు.. - 149 షాపులకు 974 దరఖాస్తులు - 25 దుకాణాల వైపు చూడని వ్యాపారులు - సింగిల్ టెండర్లపై 35 దుకాణాలు - రాత్రి వరకూ కొనసాగిన లక్కీ డ్రా ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని 174 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్‌రెడ్డి గార్డెన్లో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ రాజ్ లక్కీడ్రా ప్రారంభించగా.. ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. టెండర్ దారులతో సందడి నెలకొంది. ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్‌డేవిస్, టూటౌన్ సీఐ నారాయణ భద్రతను పర్యవేక్షించారు. జిల్లాలోని 174 గాను 149 దుకాణాలకు అధికారులు టెండర్లు ఖరారు చేశారు. నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఈనెల 16 నుంచి దరఖాస్తులు స్వకరించింది. మొత్తం 174 దుకాణాలకు 974 దరఖాస్తులు దాఖలయ్యాయి. 25 దుకాణాల కోసం ఎవరూ ముందుకు రాలేదు. 149 దుకాణాల్లో 35 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా 114 దుకాణాలకు పోటాపోటీగా టెండర్లు వేశారు. ఇదిలా ఉంటే.. మొదటి నుంచీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి కాకుండా కొత్తవారిని ఈసారి అదృష్టం వరించింది. బెజ్జూర్‌లోని మద్యం దుకాణానికి అత్యధికంగా 44 దరఖాస్తులు రాగా.. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌక్‌లోని దుకాణానికి 42 వచ్చాయి. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న దుకాణానికి 32, ధస్నాపూర్లోని మద్యం దుకాణానికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 42 దరఖాస్తులు వచ్చిన ఎన్టీఆర్ చౌక్‌లోని మద్యం దుకాణాన్ని లాటరీ ద్వారా సుధావిలాస్రెడ్డి దక్కించుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా 44 దరఖాస్తులు వచ్చిన బెజ్జూరు దుకాణాన్ని సంతోష్జైస్వాల్ చేజిక్కించుకున్నారు. సింగిల్ టెండర్లు దక్కించుకున్న మహిళలు.. జిల్లాలోని 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. ఇచ్చోడ గెజిట్ నెం.57 షాపును ఎ.పార్వతి, ఆసిఫాబాద్ ఎక్స్‌రోడ్ గెజిట్ నెం.65 షాపును జాదవ్ విమలాబాయిలకు కేటాయించారు. టెండర్‌దారుల ఆందోళన కాగా.. లక్కీ డ్రా ప్రారంభమైన తర్వాత టెండర్‌దారులు ఆందోళనకు దిగారు. టెండర్ దక్కించుకున్న వారందరూ 1/3 వంతు డబ్బులు కట్టాలని అధికారులు ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నిబంధనలు చెప్పలేదని, ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తాము వెంట డబ్బు తెచ్చుకోలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. డబ్బులు తప్పనిసరిగా కట్టాల్సిందేనని తేల్చడంతో టెండర్‌దారులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.అనిత, మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కిక్కుకు నేడే లక్కు
మద్యం దుకాణాలకు లాటరీ సిద్ధం భారీగా విచ్చేయనున్న వ్యాపారులు సాక్షి,సిటీబ్యూరో: మద్యం దుకాణం పెట్టి రెండుచేతులా సంపాదించాలనుకునే వ్యాపారులు లక్కు కోసం సిద్ధమయ్యారు. నగరపరిధిలోని 212 మద్యందుకాణాలకు సోమవార ం లాటరీ నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్ ఆవరణలో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా ఆధ్వర్యంలో డ్రా తీయనున్నట్లు నగర ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. మొత్తం ఇప్పటివరకు 161 దుకాణాలకుగాను 312 మంది దరఖాస్తు చే శారని చెప్పారు. మరో 51 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకోని దుకాణాలకు గడువు పెంచే అంశాన్ని ఎక్సైజ్ కమిషనర్ పరీశీలిస్తున్నారని చెప్పారు. కాగా గ్రేటర్ పరిధిలో ఒక్కో దుకాణానికి రూ.90 లక్షల లెసైన్సు ఫీజు నిర్ణయించిన విషయం విదితమే. లాటరీ ప్రక్రియ కోసం ఎగ్జిబిషన్మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో: రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 390 మద్యం దుకాణాలుండగా..340 దుకాణాలకు ఏకంగా 3368 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఉదయం వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఈ దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. మరో 50 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ దుకాణాలకు లెసైన్సు ఫీజు రూ.90 లక్షలుండడంతో వ్యాపారులెవరూ ముందుకురానట్లు తెలిసింది. ఈ దుకాణాలకు గడువు పెంచే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
అప్పుల్లో ఉప్పు రైతు
అల్లూరు: ఇంటిల్లిపాది ఆరు నెలల పాటు రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసినా చివరకు నష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి ధరల్లో వ్యాపారులు మాయాజాలం చూపుతుండడంతో పెట్టుబడి కూడా చేతికిరాక అప్పుల పాలవుతున్నారు. తీరప్రాంతంలోని ఉప్పురైతుల దుస్థితి ఇది. రెండేళ్లుగా వీరు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అల్లూరు మండలంలోని గోగులపల్లి, ఇస్కపల్లి తీరప్రాంతాలు ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై నెలాఖరు వరకు ఉప్పుకు మంచి గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో రైతు ఇంట్లోని కుటుంబసభ్యులందరూ కష్టపడి ఉప్పు ఉత్పత్తి చేస్తారు. అందరి కష్టానికి ఫలితం లభిస్తే ఎకరానికి 5 లారీల ఉప్పు ఉత్పత్తి అవుతుంది. ఉప్పు ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా ధరలు మాత్రం నిరుత్సాహపరుస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం లారీ ఉప్పు రూ.5 వేలు నుంచి రూ. 6వేలు మాత్రమే పలుకుతోంది. ఈ క్రమంలో రోజుకు రూ.200 కూడా కూలిగిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. రెండేళ్ల క్రితం బస్తా ఉప్పు సీజన్లో రూ.100 పలికేది. ప్రస్తుతం ఆ ధర రూ.60కి చేరింది. ఉప్పు ధర పలకని సమయంలో పెద్ద రైతులు నిల్వ చేసుకుని మార్కెట్ ఆశాజనకంగా ఉన్న సమయంలో విక్రయించుకుని లాభాలు గడిస్తున్నారు. చిన్నసన్నకారు రైతులు మాత్రం ఉప్పును దాచుకునే శక్తి లేక పొలాల్లోనే దళారులు అడిగిన ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. రైతుల నిస్సహాయతను గమనించిన దళారులు కూడా ధరను గణనీయంగా తగ్గించేస్తూ దోచుకుంటున్నారు. కరెంట్ కష్టాలతో మరింత నష్టం ధర గిట్టుబాటు కాక అప్పులపాలవుతున్న ఉప్పు రైతుకు విద్యుత్ కోతలు, బిల్లులు పుండు మీద కారం చల్లినట్లవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టలేక సతమతమవుతున్న ఉప్పు రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఉప్పు ఉత్పత్తికి సంబంధించి వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి వంతున వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది రైతులకు నష్టాల నుంచి విముక్తుల్ని చేసింది. వైఎస్సార్ మరణానంతరం అధికారం చేపట్టిన నేతలు మళ్లీ యూనిట్ ధరకు రూ.4కి పెంచడంతో రైతులకు కష్టాలు పున రావృతమయ్యాయి. కష్టపడి ఉప్పు ఉత్పత్తి చేసినా ఆశించిన ధర లభించకపోవడంతో అసలు పండించాలో లేక బీడు పట్టాల అర్థం కాక రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు ఓ సారి ఉప్పు కయ్యలను సందర్శించి తమ కష్టాలను పరిశీలించి, ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. -
ఎరువుల విక్రయాల్లో అక్రమాలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. వ్యవసాయ సీజన్లో వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఎరువులను దాచి కృత్రిమ కొరత సృష్టించి అధికధరలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 9 దుకాణాలను తనిఖీ చేయగా సంగం, బుచ్చిరెడ్డిపాళెంలోని దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.42 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు. భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనేందుకు స్వాధీనం చేసుకున్న ఎరువులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పెన్నాడెల్టా కింద మాత్రమే లేట్ ఖరీప్‌లో భాగంగా రైతులు వరిసాగు చేస్తున్నారు. దీంతో ఇక్కడ కొంత మేర మాత్రమే ఎరువులకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల దుకాణాలలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందంటే, ఇక సీజన్లో అవి ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా లెసైన్స్డ్ విత్తన దుకాణాలు 350 వరకూ ఉండగా, అనధికార విత్తన దుకాణాలు సైతం చాలా ఉన్నాయి. ఇక లెసైన్స్డ్ ఎరువుల దుకాణాలు 600 వరకూ ఉన్నాయి. అనధికార ఎరువుల దుకాణాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది సీజన్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. స్టాకు రిజిస్టర్‌కు గోదాముల్లో ఉన్న నిల్వలకు పొంతన లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని విత్తన షాపుల్లోనూ సీజన్లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగుమందుల వ్యాపారం సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వీరి అక్రమ వ్యాపారాలకు కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మద్యం షాపులకు క్యూ..
దరఖాస్తుల వెల్లువ చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు రంగంలోకి లిక్కర్ డాన్లు..బినామీలతో అప్లికేషన్లు సగానికి పైగా షాపులను దక్కించుకునే యత్నం 214 దుకాణాలకు 2015కు పైగా దరఖాస్తులు 20 షాపులకు నిల్ రేపు లాటరీ పద్ధతిలో కేటాయింపు వరంగల్ క్రైం : జిల్లాలో మద్యం దుకాణాలకు మందకొడిగా ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ చివరి రోజు శనివారం ఊపందుకుంది. హన్మకొండ హౌసింగ్‌బోర్డులోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం వ్యాపారులు బారులుదీరారు. జిల్లాలోని 234 మద్యం దుకాణాలకు మూడు రోజుల్లో 1,015 దరఖాస్తులు రాగా... చివరి రోజు వెయ్యికి పైగా ఆర్జీలు వచ్చాయి. క్యూలో నిల్చున్న వారికి రాత్రి 10 గంటలకు వరకు కూడా దరఖాస్తు చేసుకునేం దుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. జిల్లాలో మొత్తం 234 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. చివరి రోజు వరకు 210 నుంచి 214 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. సుమారు 20 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు. ప్రభుత్వం వీటికి త్వరలోనే రీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం నాటికి 162 దుకాణాలకు 1,015 దరఖాస్తులు రాగా... శనివారం మరో 52 దుకాణాలకు వెయ్యి అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెప్పారు. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 231 దుకాణాలకు అనుమతి ఇవ్వగా... 12 షాపులపై వ్యాపారులు ఆసక్తి చూపలేదు. పలుమార్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ... ఆయా దుకాణాలను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. కాగా, మద్యం షాపులను దక్కించుకునేందుకు మహిళలు సైతం అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. వరంగల్‌తో పాటు మహబూబాబాద్ యూనిట్‌కు మహిళల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. ఫారాల రూపేణా రూ. 5 కోట్ల ఆదాయం మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యాపారి 10 శాతం ఈఎండీ కింద రూ.3,25,000తోపాటు మరో రూ.25 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. అయితే దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు మొదటి దఫాగా 1/3వ వంతు లెసైన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వారి ఖాతాల్లో ఈఎండీ జమ అవుతుంది. లిక్కర్ షాపులు రాని వారికి ఈఎండీ కింద చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దరఖాస్తు ఫారం ఫీజుగా చెల్లించే రూ.25 వేలు మాత్రం నాన్ రిఫండబుల్‌గా ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వానికి రెండు వేల దరఖాస్తుల పేరిట రూ. 5 కోట్ల ఆదాయం సమకూరింది. హన్మకొండలోని రెడ్డి ఫంక్షన్ హాలులో సోమవారం కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన మద్యం షాపులు కేటాయించనున్నారు. జూలై 1 నుంచి కొత్త పాలసీ రాష్ర్టవ్య్రాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. చిన్న సవరణలతో ముందుకు వచ్చిన ఎక్సైజ్ పాలసీ ఈ దఫా కూడా వ్యాపారులకు లాభసాటిగా లేకుండా పోయింది. దీంతో దుకాణాలను తీసుకునేందుకు వ్యాపారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దఫా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ బార్ కోడింగ్ సిస్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సిస్టం ద్వారా సరుకు కొన్న వినియోగదారులు ప్రతిఒక్కరికీ వైన్ షాపు నిర్వాహకులు ఎలక్ట్రానిక్ బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఆన్లైన్లో పర్యవేక్షణలో ఉండడం, ఎమ్మార్పీని కచ్చితంగా అమలు చేయాల్సి వస్తుండడం.... కల్తీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా పోతుండడంతో ఈ విధానంపై వ్యాపారులు విముఖత చూపుతున్నారు. రంగంలోకి లిక్కర్‌డాన్‌లు దరఖాస్తు తుదిగడువు రోజున లిక్కర్ డాన్లు రంగంలోకి దిగారు. గతంలో ఏసీబీకి పట్టుబడి ఊచలు లెక్కబెట్టిన నలుగురు డాన్లలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. వీరు జిల్లాలో లిక్కర్ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంలో సుమారు 120 దుకాణాలకు బినామీలతో దరఖాస్తు చేయించినట్లు సమాచారం. లిక్కర్ వ్యవస్థను సిండికేట్ చేసి ఎక్సైజ్ శాఖను తమ గుప్పిట్లోకి తీసుకుని ఏడాదిపాటు తాము చెప్పిందే వేదంగా జిల్లాలో నడువాలనే ధోరణితో లిక్కర్ డాన్లు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. -
700 బస్తాల రేషన్ బియ్యుం సీజ్
వరదయ్యుపాళెం: వరదయ్యపాళెం బీసీ కాలనీలోని ఓ ఇల్లు, వురో బియ్యుం గోడౌన్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యూన్ని శనివారం సాయుంత్రం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం 700 బస్తాల్లో వివిధ మోతాదుల్లో ఉండగా, జిల్లాలో ఇంత మొత్తంలో రేషన్ బియ్యం అధికారులకు పట్టుబడడం ఇదే మొదటిసారి. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు...కొంత కాలంగా వరదయ్యుపాళెం నుంచి రేషన్ బియ్యుం తమిళ నాడుకు తరలిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు,రేషన్ షాపుల నుంచి స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు రేషన్ బియ్యూన్ని కొనుగోలు చేసి వరదయ్యుపాళెంలోని ఓ ఇంట్లో, వురో గోడౌన్లో నిల్వ చేసేవారు. సేకరించిన రేషన్ బియ్యూన్ని లారీల్లో తమిళనాడులోని రైస్ మిల్లులకు తరలించేవారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యూన్ని పాలిష్ చేసి గోతాలు వూర్చి సూపర్ ఫైన్ బియ్యుంగా మార్చి తరలించేవారు. వుూడేళ్లుగా రేషన్ బియ్యుం అక్రవు వ్యాపారం గుట్టు చప్పుడుకాకుండా సాగుతోంది. శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యాపారి తెర వెనుక రేషన్ బియ్యుం కొనుగోలు, విక్రయూలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. వరదయ్యుపాళెం బీసీ కాలనీకి చెందిన కొందరు అందించిన సవూచారం మేరకు దాడిచేసి బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యూన్ని గ్రావు రెవెన్యూ అధికారులు వుధుసూదన్ శర్మ, వునోహర్ రెడ్డి, రజనీ కువూర్కు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యుం విలువ సువూరు 5లక్షల రూపాయులకుపైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. -
అవినీతి సరఫరా
పనిని బట్టి రేటు నిర్ణయం దాడులు చేసినా అంతా గోప్యం కేసులు పెట్టడం.. డబ్బులు గుంజడం నిత్యకృత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉన్నతాధికారులు విశాఖ రూరల్ : పౌర సరఫరాల శాఖ అవినీతిమయమైంది. కాసులు దండుకునే పనిలో నిమగ్నమైంది. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు మామూళ్ల మత్తలో జోగుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో ధరను వసూలు చేస్తూ వ్యాపారులు, డీలర్లను పీల్చుకుతింటున్నారు. నెలకు రూ.5 నుంచి రూ.10 లక్షలు వరకు వసూలు చేసి పంపకాలు చేసుకుంటున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఆహారధాన్యాలు, వాటి ఉత్పత్తుల వ్యాపారాలు చేయాలంటే విధిగా పౌర సరఫరా శాఖ అధికారుల నుంచి అనుమతి ఉండాలి. ఈ లెసైన్సుల మంజూరు కోసం భారీగా పౌర సరఫరా అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎఫ్జీఎల్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులను రోజుల తరబడి తిప్పడం, చివరకు వ్యాపార పెట్టుబడిని బట్టి మామూళ్లు వసూలు పరిపాటిగా మారింది. సకాలంలో లెసైన్సు మంజూరుకు చిన్న వ్యాపారానికి రూ.3,500 నుంచి రూ.6 వేలు, పెద్ద వ్యాపారానికి రూ.15 వేలు నుంచి రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అమావాస్య, పున్నమికి ఒకసారి దాడులు నిర్వహించే సమయంలో ఈ వ్యాపారాలు సక్రమంగా లేవని తేలినా, స్టాకు నిల్వల్లో తేడాలున్నా అధికారుల పంట పడినట్టే. 6ఏ కేసు పెట్టకుండా ఉండడానికి వ్యాపారుల గల్లా పెట్టెలు ఊడ్చేస్తున్నారు. డీలర్లను పిండేస్తున్నారు... జిల్లాలో కార్డుదారులందరికీ సక్రమంగా నిత్యావసరాలు సరఫరా అవుతున్నాయో లేదో చూడాల్సిన అధికారులు ఆ విషయాన్ని పక్కనపెడుతున్నారు. భారీగా సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. కొంత మంది డీలర్లు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోని అధికారులు మామూళ్ల విషయంలో కచ్చితంగా ఉంటున్నారు. ముఖ్యంగా చెకింగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ప్రతీ నెలా డీలర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యం. వెయ్యి నుంచి 1500 వరకు కార్డులున్న ఒక్కో షాపు నుంచి రూ.1500 నుంచి రూ.2 వేలు దండుకుంటున్నారు. అలాగే అధికంగా ఫిర్యాదులు వస్తే మాత్రం దాడులు చేసినట్లు చేసి 6ఏ కేసులు పెడతామని బెదిరించి చివరకు కార్డులను బట్టి వారి నుంచి రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో 14 కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు ఉన్నారు. రికార్డుల ప్రకారం వీరు ప్రతీ నెలా కిరోసిన్ సరఫరా చేస్తున్నట్లు చూపిస్తున్నారు. అయితే ఈ చౌక కిరోసిన్ అధికంగా బయట మార్కెట్‌కు తరలిపోతున్న విషయం అనేక సార్లు బహిర్గతమైంది. దీనిని పట్టించుకోని అధికారులు ఒక్కో డీలర్ నుంచి ప్రతీ నెలా రూ.5వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంక్‌ల నుంచి కూడా రూ.లక్ష నుంచి రూ.1.75 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో అంతా గోప్యమే. నెలసరి మామూళ్లు రావడంతో దాడులు జరగడమే గగనం. ఉన్నతాధికారులు ఆదేశాలతో అప్పుడు దాడులు చేసినా ఆ విషయం బయటకు పొక్కనీయడం లేదు. కేసులు పెట్టడం తరువాత డబ్బులు వసూలు చేసి చర్యలు తీసుకోకుండా వదిలేడయం సర్వ సాధారణమైపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నో కిక్
ప్రొద్దుటూరు: కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు దాదాపు సమాజంలోని అన్ని వర్గాల వారు ఎంతో కొంత మేరకు మద్యం సేవిస్తున్న వారే. ఇందు కోసం ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఏ ఒక్కరు మద్యం సేవించడంపై సంతృప్తి చెందడం లేదు.మద్యం కల్తీయే ఇందుకు అసలు కారణం. ప్రొద్దుటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. వీటి పరిధిలో నెలకు రూ.6కోట్ల వ్యాపారం జరుగుతోంది. కొంత మంది వ్యాపారులు విచ్చల విడిగా మద్యం కల్తీ చేసి అమ్ముతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోంది. కల్తీ ఇలా ... వ్యాపారులు ప్రతి నెల దుకాణానికి సంబంధించిన మద్యాన్ని కడప పరిధిలో ఉన్న డిపో నుంచి కొనుగోలు చేస్తారు. మద్యాన్ని తెచ్చిన వెంటనే దుకాణంలో దించడం, కల్తీ చేయడం జరుగుతోంది. ఇందుకుగాను నైపుణ్యం గల కొంత మంది వ్యక్తులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు సీల్ తీయకుండానే పరికరంతో మద్యం బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో కల్తీ చేస్తారు. కొన్ని బాటిళ్లకు సీల్ తీయడం కల్తీ చేసిన తర్వాత తిరిగి అతికించడం జరుగుతోంది. తక్కువ ధర గల చీఫ్ లిక్కర్ లాంటి క్వార్టర్ బాటిల్లో 6 ఔన్స్‌లకు గాను రెండు, మూడు ఔన్స్‌ల వరకు డెరైక్ట్‌గా నీటిని కలుపుతున్నారు. ధర అధికంగా ఉన్న మద్యానికి సంబంధించి ఆ బాటిళ్లను ఓపెన్ చేసి వాటిలో చీఫ్ లిక్కర్‌ను కలుపుతారు. చాలా కాలంగా పట్టణంలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులు కల్తీ మద్యంపై తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంత తాగినా కిక్ ఎక్కడం లేదని, బాటిళ్లలో నీరు కలుపుతున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అప్పుడప్పుడు శాంపిళ్లు తీసి పంపుతున్నా పరిస్థితి మాత్రం యధావిధిగానే ఉంది. ఒరిజనల్ మద్యం ఎక్కడ లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రొద్దుటూరుకు వచ్చిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మద్యం కల్తీపై గట్టి హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఓ మద్యం వ్యాపారి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రివిలైజ్ రూపంలో అధికంగా టాక్స్ వసూలు చేస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేయాల్సి వస్తోందని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉన్న ప్రొద్దుటూరులోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం గమనార్హం. క్వార్టర్‌పై రూ.10 పెంపుదల నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మద్యానికి డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి యధావిధిగా రూ.10 చొప్పున పెంచి అమ్ముతున్నారు. ఈ విధంగా ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే బీరు బాటిల్‌పై రూ.20-40 వరకు పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. -
బ్లాక్ మార్కెట్
కరీంనగర్ క్రైం/పెద్దపల్లి/జగిత్యాల : ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి తద్వారా కృత్రిమ కొరత సృష్టించి రైతులను దోచుకునేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి శుక్రవారం జగిత్యాల, పెద్దపల్లిలోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాల నిల్వలు బయట పడ్డాయి. పెద్దపల్లిలో రూ.35 లక్షలు, జగిత్యాలలో రూ.13 లక్షలు.. మొత్తం రూ.48 లక్షల విలువైన నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మూడు బృందాలుగా విడిపోయిన కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు జగిత్యాల, పెద్దపల్లితో పాటు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. లక్సెట్టిపేటలో సైతం రూ.37 లక్షల విలువైన ఎరువులు, విత్తనాల అక్రమ నిల్వలను పట్టుకున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి రూ.85 లక్షల విలువైన 4,644 బస్తాల ఎరువులు, 1,271 ప్యాకెట్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాలు తెప్పించి దాచి ఉంచారు. గతంలో ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా ముందుగానే ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్దపల్లి, జగిత్యాలలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాలు తెప్పించి నిల్వలు చేశారని సమాచారం. అక్రమ నిల్వలపై సమాచారం ఉందని, దాడులు కొనసాగించి వాటన్నింటిని బయటపెడుతామని విజిలెన్స్ సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో.. పట్టణంలోని ఆవునూరి సత్యనారాయణ, సాయిరాం, శ్రీలక్ష్మి, ప్రమీల వేర్ హౌసింగ్ స్టాక్ పాయింట్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపారు. ఆవునూరి సత్యనారాయణ, సాయిరాం దుకాణాల్లో ఉన్న స్టాక్‌కు, రిజిస్టర్లలో నమోదు చేసిన రికార్డులకు తేడా రావడంతో 148 టన్నుల డీఏపీ బస్తాలను సీజ్ చేశారు. ఈ దాడుల్లో వ్యవసాయ శాఖ అధికారులు అశోక్‌రెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆవునూరి సత్యనారాయణ షాపులో అధికారులు సోదా చేస్తున్న విషయం తెలుసుకున్న మిగతా వ్యాపారులు షాపులకు తాళాలు వేసి వెళ్లారు. జగిత్యాలలో.. జగిత్యాలలోని రెండు ఎరువుల దుకాణాలపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గోపీకృష్ణ, మణిదీప్ ఫర్టిలైజర్స్‌లో ఉన్న ఎరువులకు, రికార్డుల్లోని స్టాక్‌కు పొంతన కుదరకపోవడంతో దుకాణాలను సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ బలరాంరెడ్డి, ఎఫ్ఆర్వో విష్ణువర్ధన్, ఏవో రాంచందర్ పాల్గొన్నారు. -
నష్టాల మామిడి
కొంపముంచిన అకాల వర్షం కోత దశలో నేలరాలిన మామిడి పంట పతనమైన ధర నష్టాల్లో కూరుకుపోయిన రైతులు, వ్యాపారులు ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు, వ్యాపారులు పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారు. మామిడి పూత, కాపు, పిందె దశ వరకు వాతావరణం అనుకూలించడంతో మంచి కాపుతో లాభాలు వస్తాయని ఆశించారు. అయితే కోత దశలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అంతకు ముందు వారం రోజులు పెను గాలులు వీచాయి. వేలాది ఎకరాల్లో పంట నేలరాలిపోయింది. ఉద్యానవన శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: భిన్నమైన మామిడి రకాల సాగుకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. మామిడి సాగులో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, దేశంలో మూడో స్థానంలో నిలిచింది. అయితే పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. ప్రతి ఏటా మామిడి రైతులు ఏదో ఒక రకంగా నష్టపోతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అయితే ఏటా లక్షా 50 వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగవుతోంది. జిల్లాలో ప్రధానంగా తోతాపురి రకాన్ని 50 శాతంపైగా సాగు చేస్తున్నారు. 20 శాతం బేనీషా రకం, 20 శాతం ఖాదర్ రకం, మిగిలిన శాతం మల్లిక, నీలం రకాలు సాగు చేస్తున్నారు. తగ్గిన బరువు, రాలిన కాయలు ఈ ఏడాది మామిడి దిగుబడిపై రైతులు ఆశలు పెంచుకున్నారు. పూత, కాపు, పిందె దశ వరకు వాతావరణం అనుకూలించింది. కాయదశ వచ్చే సరికి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసాయి. అంతకు ముందు వారం రోజుల పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించిం ది. దీంతో కాయదశకు చేరకున్న మామిడి ఒక్కసారిగా బరువు తగ్గిపోవడంతో పాటు బలమైన ఈదురు గాలులకు కాయలు రాలిపోయాయి. ఉద్యాన శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కాయబరువు తగ్గడం, సైజు లేకపోవడం కారణాలతో పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఎకరాకు 4 టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 3 టన్నులు మాత్రమే రైతుల చేతికి అందనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పిందె దశలో నీలం రకం మామిడి ఆగస్టు మాసంలో కోతకు రావచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. సింకేట్తో పడిపోయిన ధరలు ఈ ఏడాది మామిడికి మార్కెట్ బాగా ఉంటుందని రైతులు ఆశపడ్డారు. అయితే గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేట్ కావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. జిల్లాలో మామిడి పండ్ల గుజ్జు (ఫల్ఫ్) పరిశ్రమలు 70కి పైగా ఉన్నాయి. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేటై ధరలు నిర్ణయించాయి. దీని ప్రభావం ఎక్స్‌పోర్టు క్వాలిటీ కాయలపైనా పడింది. తోతాపురి రకం మామిడి గిట్టుబాటు ధర టన్ను రూ.15 వేలు కాగా, రూ.9 వేలకు పడిపోయింది. బేనీషా రకం మామడి గిట్టుబాటు ధర టన్ను రూ.25 వేలు కాగా, రూ.13 వేలకు కుదేలైంది. ఖాదర్ రకం మామడి ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. టన్ను ధర రూ.24 వేలు పలుకుతోంది. అయితే ఈ రకం మామిడి సాగు జిల్లాలో కేవలం 20 శాతమే ఉంది. గిట్టుబాటు ధర నిర్ణయించాలి మామిడికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. మామిడికి గిట్టుబాటు ధర నిర్ణయించడంపై ఏటా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశం జరుగుతుంది. కమిటీలో నిర్ణయించిన ధర ప్రకారం రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఈ ఏడాది సైతం అన్యాయం జరగకుండా తగిన గిట్టుబాటు ధర కల్పించి, ఖచ్చితంగా అమలు చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నచూపు తగదు వాణిజ్య పంటగా మామిడి మంచి లాభాలను అందిస్తుంటే ప్రభుత్వాలు సాగుపై శ్రద్ధ చూపడం లేదు. సూచనలు అందించే ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండరు. యాజమాన్య పద్ధతులపై అవాగాహన లేక నాసిరమైన మందుల వినియోగంతో నష్టపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో చెట్లను నాటిస్తున్నారే తప్ప మార్కెటింగ్‌పై శ్రద్ధ చూపడం లేదు. మార్కెట్ కమిటీలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారే తప్ప రైతులకు ఒరిగేది లేదు. దిగుబడి ఒక్క సారిగా మార్కెట్‌కు రావడంతో ధరను వ్యాపారులు తగ్గిస్తున్నారు. రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ చూపి జ్యూస్ ఫ్యాక్టరీలచే మామిడి రైతులకు అగ్రిమెంట్ చేయిస్తే నేరుగా కొనుగోళ్లతో లాభపడే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం గాలి వానలకు రాలిన కాయలతో సుమారు 2 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది - పి. సుదర్శన్ రెడ్డి, మామిడి రైతు, నారాయణవనం. -
వారు కట్టరు..వీరికి పట్టదు
అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు కలిసొస్తోంది. స్వతహాగా వ్యాపారులు ట్రేడ్ లెసైన్స్ ఫీజును చెల్లిద్దామని ముందుకు రారు. అధికారులు కూడా గట్టిగా అడగరు. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోంది. ప్రతి మునిసిపాలిటీల్లో 70శాతం ఇళ్లుంటే 30శాతం దుకాణాలే ఉంటాయి. కానీ వ్యాపారాలకు సంబంధించిన లెసైన్సులు కొందరికే ఉన్నాయి. ఏటా దుకాణాలు పెరుగుతున్నా మున్సిపల్ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఉన్నవారు కూడా ఏళ్ల తరబడి నుంచి ఫీజు చెల్లించడానికి మొండికేస్తుండటంతో ట్రేడ్ లెసైన్సు రుసుము కోట్లల్లో పేరుకపోయింది. గద్వాల మున్సిపల్ పరిధిలో.. గద్వాల ప్రధాన రహదారిపై లెక్కలేనన్ని దుకాణాలు వెలిశాయి. ఇక్కడ గతంలో ఉన్న దుకాణ దారులు మినహా కొత్తగా పెట్టుకున్న దుకాణదారులు లెసైన్సు ఫీజు చెల్లించడం లేదు. ఏటా రూ.10 లక్షలు ట్రేడ్ లెసైన్సు ఫీజు లక్ష్యానికి గాను, ఏటా మార్చి ముగింపులో కేవలం లక్షకు మించి వసూలు చేయడంలేదు. మున్సిపల్ రికార్డుల ప్రకారం 1200 మంది మాత్రమే ట్రేడ్ లెసైన్సు పొందినట్లు సమాచారం. అనధికారికంగా సుమారు 3 వేల మందికి పైగా దుకాణ దారులు లెసైన్సు లేకుండా వ్యాపారులు కొనసాగిస్తున్నారు. వీరు కొన్నేళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తూ రూ.లక్షల్లో ఫీజు ఎగ్గొడుతున్నారు. అలాగే ఆస్తిపన్నులు సైతం పెద్ద మొత్తంలో పేరుకపోయాయి. ఎన్నికల నేపథ్యంలో పన్నుల వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ రూ.1.70 కోట్లుతో పాటు గత ఏడాది బకాయిలు సుమారు కోటి వరకు ఉన్నాయి. దుకాణాల అద్దెలు సుమారు రూ.10 లక్షలు, నీటి పన్ను బకాయిలు రూ.4 లక్షల వరకు పేరుకపోయి ఉన్నాయి. -
దుకాణాల్లో వరుస చోరీలు
ఉలిక్కిపడ్డ కలిదిండి రూ.48 వేల నగదు అపహరణ ఆందోళనలో వ్యాపారులు కలిదిండి, న్యూస్‌లైన్ : దొంగల బీభత్సంతో ఒక్కసారిగా కలిదిండి ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఒకేసారి దొంగలు షాపులపై పడి నగదు దోచుకున్నారు. దీంతో వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. కలిదిండి సెంటరులోని ఆరు షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.48 వేల నగదును దొంగలు దోచుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజూమాదిరిగానే గురువారం రాత్రి 10 గంటలకు వ్యాపారులు తమ దుకాణాలు మూసి ఇళ్లకు వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం ఉదయాన్నే షాపులు తెరిచేందుకు రాగా షట్టర్ల తాళాలు పగలగొట్టి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన వాటిలో సబిశెట్టి ధనవీరవెంకట వరప్రసాద్‌కు పురుగు మందుల షాపు, సత్యపాండురంగ గుప్తకు చెందిన రొయ్యలమేత షాపు, సోము భూషణానికి చెందిన కిరాణా షాపు, చాదళ్ల కృష్ణమూర్తికి చెందిన రొయ్యల మేత దుకాణం, నీలి దుర్గా వెంకట సత్యనారాయణకు చెందిన మందుల షాపు, హిమాలయ బ్రాందీ షాపు ఉన్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చోరీలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ డి.నాగన్న, కైకలూరు సీఐ వెంకటేశ్వరరావు, కలిదిండి ఎస్సై యేసేబు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశామని డీఎస్పీ డి.నాగన్న తెలిపారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసు గస్తీ పెంచుతామన్నారు. మచిలీపట్నం నుంచి క్లూస్ టీం వచ్చి వేలుముద్రలను సేకరించింది. -
నోరు కట్టుకోండి..!
ముందుగా గుండెనిండా గాలిని ప్రశాంతంగా పీల్చుకోండి. బీపీ, సుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నాయో లేదో చూసుకోండి. మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ఆహ్లాదంగా ఉంచుకోండి. ఇదేదో యోగా తరగతుల్లో గురువులు బోధిస్తున్న తీరు అనుకోకండి. ప్రస్తుతం మార్కెట్లకు సరుకులు కొనేందుకు వెళ్లే వినియోగదారులు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోక పోతే గుండెలు గుభేల్ మనక తప్పదు. కూరగాయల నుంచి..నిత్యవసరాల ధరలు చుక్కలను తాకుతుండడంతో ఏర్పడిన పరిస్థితి. నోటిరుచి మాట దేముడెరుగు.. ముచ్చటగా నాలుగు ముద్దలు కూరలతో తిందామన్నా ఖరీదు చేయలేని దుర్భరత. సామాన్య, మధ్య తరగతి వారికి చెమటలు పట్టిస్తున్న రేట్ల తీరు. పాలమూరు, న్యూస్‌లైన్ : బస్తాలో డబ్బులు తీసుకుపోతే.. సంచుల్లో సరుకులు తీసుకునే రోజులు వస్తాయన్న నానుడి ఇప్పుడు అక్షరసత్యాలు అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులను కుదేల్ చేస్తున్నాయి. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పుచారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరుమాసాల కిందట రూ.50 నుంచి రూ.60 ఉన్న పెసర, కందిపప్పు ధరలు ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతోపాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధరకూడా అమాంతంగా పెరిగి పోయింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఎండు కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు సన్న బియ్యం (బీపీటీ) ధరలు కొద్దిగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ వాటికి రెక్కలు వచ్చాయి. పప్పుల ధరలదీ అదేబాట. కూరగాయలదీ అదే రూటు కూరగాయలను కొనుగోలు చేయాలంటేనే అంతా హడలెత్తి పోతునానరు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళితే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా దేన్ని ముట్టుకున్నా కిలో రూ.20కి పైమాటే. ప్రస్తుతం జిల్లాలో కూరగాయలసాగు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. -
‘ఫుల్లు’గా స్టాక్
మద్యం నిల్వపై వ్యాపారుల దృష్టి రాష్ట్ర విభజన నేపథ్యంలో 24 నుంచి డిపోలు మూత డిపోల వద్ద బారులు తీరిన వ్యాపారులు రూ. 2 కోట్లు నుంచి రూ. 6 కోట్లకు పెరిగిన అమ్మకాలు జూన్ నెలాఖరు వరకు సరిపోయే స్టాక్ కొనుగోలు మద్యం కోసం డిపోల వద్ద వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఉన్నదంతా ఊడ్చి మరీ సరకు కొంటున్నారు. జూన్ నెలాఖరు వరకు సరిపోయే విధంగా స్టాక్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సయిజ్ డ్యూటీ లెక్కలు తేల్చేందుకు ఈ నెల 24 నుంచి మద్యం డిపోలకు తాళాలు పడతాయన్న సమాచారంతో వీరంతా అప్రమత్తమయ్యారు. భారీగా మద్యం నిల్వ చేస్తున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్: మద్యం డిపోలకు తాళం వేయనున్నారన్న సమాచారంతో మద్యం వ్యాపారులు సరకు నిల్వలపై దృష్టి సారించారు. మద్యం స్టాక్‌ను పదింతలు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. భారీగా సరకు నిల్వ చేసేందుకు అవసరమైన మొత్తాన్ని సమీకరించి మద్యం ఫుల్‌గా దిగుమతి చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు దుకాణాల్లో నో స్టాక్ బోర్డు పెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు జిల్లాలోని మద్యం లెసైన్సుదారులు ఉన్నదంతా ఊడ్చి మరీ సరకు కొంటున్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచీ లిక్కర్ వ్యాపారులు మద్యం డిపోల ముందు క్యూ కట్టారు. మంగళవారం ఒక్కరోజే ఆదాయం రెట్టింపు అయినట్టు లెక్కలు స్పష్టంగా కనిపించాయి. విశాఖ జిల్లాలో 300కు పైగా మద్యం దుకాణాలున్నాయి. మరో 100కు పైగా బార్లున్నాయి. వీటన్నింటికీ కావలసిన సరకు రెండు డిపోల నుంచి నిత్యం సరఫరా అవుతోంది. పెద్దగా సరకు అక్కర్లేని రోజుల్లో కూడా రోజుకి రూ. 2 కోట్లు స్టాక్‌ను మద్యం దుకాణాలకు సరఫరా చేసేవారు. ఎన్నికల సమయంలో రూ. 3 కోట్లు నుంచి 3.50 కోట్ల స్టాక్‌ను రోజూ వ్యాపారులు కొనేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సయిజ్ డ్యూటీ లెక్కలు తేల్చేందుకు ఈ నెల 24 నుంచి మద్యం డి పోలకు తాళం వేస్తున్నారన్న సమాచారం తెలియడంతో బుధవారం మధ్యాహ్నం నుంచి వ్యాపారులు ఎగబడ్డారు. వంద మందికి పైగా వ్యాపారులు క్యూ కట్టి రూ. 6 కోట్లకు పైగా చలానాలు చెల్లించి మద్యం స్టాక్‌ను విడి పించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. గురువారం నుంచి రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లుకు పైగా స్టాక్ విడిపించుకునేందుకు మద్యం దుకాణాదారులు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నగరంలో వచ్చే నెల మొదటి వారం వరకూ పార్టీలు ఎక్కువగా జరుగుతాయని ఎక్సయిజ్ శాఖ అంచనా వేస్తోంది. మంత్రి పదవులు ఆశించేవారు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో పాటు పర్యాటకులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలుండడంతో వచ్చే నెల రోజులకు మద్యం నిల్వలు భారీగా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పరిధిలో బార్లు, స్టార్ హోటళ్లు ఎక్కువగా ఉండడంతో స్టాక్‌ను పెద్ద ఎత్తున తరలించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ వరకూ స్టాక్ ఇచ్చేది లేదంటూ అబ్కారీ శాఖ చెబుతుండంతో జూన్ నెలాఖరు వరకూ సరిపోయే స్టాక్ కొని నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోప్రగతే లక్ష్యం
అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం 8 లైన్లుగా జాతీయరహదారి నిర్మాణం గ్యాస్ వినియోగదారులకు ఊరట స్థిరీకరణ నిధితో రైతుకు మేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కనిపించింది. అభివృద్ధిలో జిల్లాకు సముచితమైన చోటు దక్కింది. జిల్లా అభివృద్ధికి వరాలు ప్రకటించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో జిల్లాకు చోటు లభించింది. ఇతర పార్టీల మాదిరిగా ఆచరణకు సాధ్యంకాని హామీలను గుప్పించకుండా ప్రజాసమస్యల పరిష్కారం, నూతన రాజధాని నిర్మాణంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మకమైన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. అన్నదాతలు మొదలుకొని విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా తయారుచేసిన మేనిఫెస్టోని ఆదివారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ముఖ్యంగా జిల్లాకు వరాలు ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా ‘గన్నవరం’... ప్రధానంగా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రసుత్తం విమానాశ్రయం 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని విస్తరించాలని మరో 400 ఎకరాల భూసేకరణకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తొలి ప్రాధాన్య అంశంగా దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తొలుత ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, మండలంలో 102 సేవలు ప్రారంభం ఇలా అనేక ఆచరణాత్మక హామీలను పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టో ప్రకటనపై జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని అంశాలపై, అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారని, జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల కష్టాలు కచ్చితంగా తొలగుతాయని మేనిఫెస్టో ద్వారా రుజువైందనే అభిప్రాయం జిల్లాలోని అన్నివర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. అన్నదాతకు మేలు... జిల్లాలో 7.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు ఉన్నాయి. ప్రధానంగా 6.35 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో చెరుకుతో పాటు ఉద్యానవన పంటలు సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ముఖ్యంగా వరి రైతుకు పంట సాగుకు క్వింటాలుకు సగటున రూ.1766 వరకు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం రూ.1,355 మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది రైతులకు పూర్తిగా మేలు చేస్తుంది. అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుకునే అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2.50 లక్షల ఎకరాలకు విద్యుత్ మోటార్ల ద్వారానే నీటి సరఫరా జరగాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తారు. గ్యాస్ భారం నుంచి ఊరట... ముఖ్యంగా భారంగా మారిన గ్యాస్ ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట కలగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెరిగిన గ్యాస్ ధరలో రూ.100ను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. తద్వారా జిల్లాలో 11.61 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. పింఛనుదార్లకు నెలకు రూ.500 అదనంగా అందనున్నాయి. -
ఈ-బిడ్డింగ్‌ను వ్యతిరేకించిన వ్యాపారులు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ-బిడ్డింగ్ విధానాన్ని శుక్రవారం వ్యాపారులు వ్యతిరేకించారు. ఈ విధానం అమలుతో తమకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటూ పత్తి జెండాపాటకు హాజరుగాకుండా వ్యాపారులు భీష్మించుకు కూర్చున్నారు. గురువారం సాయంత్రం కొందరు వ్యాపారులు మార్కెట్లో కొనుగోలు చేసిన పత్తిని ఈ-బిడ్డింగ్‌లో నమోదు చేయించకుండా బయటకు తరలించారు. ఈ వ్యవహారంపై మార్కెట్ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ శుక్రవారం ఆరా తీసి ఆయా వ్యాపారులను సరుకు తరలింపుకు సంబంధించిన వివరాలను ఈ-బిడ్డింగ్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఆది నుంచి ఈ-బిడ్డింగ్‌ను వ్యతిరేకిస్తున్న వ్యాపారులు మరోసారి ఏకమై తామకు ఈ విధానం నచ్చలేదని, దీనిని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ-బిడ్డింగ్ పనులు తాము చేయలేమని, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ఈ-బిడ్డింగ్ విధానం సక్రమంగా అమలు చేయకుండా పత్తిలోనే అమలు చేయడం సరికాదని వ్యాపారులు కార్యదర్శితో వాదించారు. ఈ-బిడ్డింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయం నిర్వహించిన జెండా పాటకు గైర్హాజయ్యారు. ఈ వ్యవహారం తెలుసుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చిన్ని కృష్షారావు మార్కెట్‌కు చేరుకొని కార్యదర్శితో ఈ-బిడ్డింగ్ విధానంపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-బిడ్డింగ్‌ను అమలు చేస్తున్నామని, దానిలో మార్పేమీ ఉండదని కార్యదర్శి స్పష్టం చేశారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించరాదని, వెసులుబాటు కలిగించాలని వారు కోరారు. సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరడంతో కార్యదర్శి ఆ మేరకు అంగీకరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావడంతో శుక్రవారం మార్కెట్‌కు సరుకు తక్కువగా వచ్చింది. మార్కెట్ ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలు ఉండడంతో తక్కువ సంఖ్యలో ఉద్యోగులు మార్కెట్ విధులు నిర్వహించారు. ఇదే అదునుగా వ్యాపారులు ఈ-బిడ్డింగ్‌పై తమ వ్యతిరేకతను చూపినట్లు కూడా మార్కెట్లో చర్చించుకున్నారు. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలో అమ్మకానికి సరుకు తెచ్చిన రైతులు కొందరు తమ సరుకు కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెట్ అధికారులను కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో చర్చలు పూర్తయిన తర్వాత 11 గంటల సమయంలో జెండాపాట నిర్వహించారు. జెండాపాటలో వ్యాపారులు యధావిధిగా పాల్గొన్నారు. ఈ-బిడ్డింగ్‌ను వ్యతిరేకించిన వ్యాపారుల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, పత్తి ఖరీదుదారుడు గొడవర్తి శ్రీనివాసరావు, సత్యంబాబు, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్న పొగాకు రైతులు
కొండపి, న్యూస్‌లైన్: పొగాకు..రైతుల పాలిట పగాకుగా మారింది. ఏటా ఏదో ఒక విధంగా పొగాకు రైతులు నష్టాలు మూటగట్టుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్నారు. కష్టించి పండించిన పంటను ఏదో ఒక రేటుకు వ్యాపారులకు విక్రయించి నిట్టూర్పు విడుస్తున్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి మండలాల్లోని 41 గ్రామాలకు చెందిన రైతులు 2,140 బ్యారన్ల పరిధిలో 9.06 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతివ్వగా 12.9 మిలియన్ కేజీలు పండించారు. ఒక్కో బ్యారన్‌కు 5 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ప్రకృతి అనుకూలించి గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలో 90 శాతం బ్రైట్ ఎఫ్-1 రకం పొగాకు దిగుబడి వచ్చింది. క్యూరింగ్ చేసుకుని బేళ్లు కట్టుకున్నారు. వేలం ప్రారంభమైంది. కేజీకి 130 ఇస్తే రైతులకు గిట్టుబాటవుతుందని, ఈ రేటు ఇవ్వాలని రైతులు, రైతు నాయకులు బోర్డు అధికారుల సమక్షంలో వ్యాపారులను కోరారు. వేలం ప్రారంభమైన రెండు వారాల పాటు వచ్చిన పొగాకు బేళ్లలో ఎక్కువ శాతం కేజీ 126 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రమేపీ మార్కెట్ పెరుగుతుందని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ రోజులు గడిచేకొద్దీ మార్కెట్ పెరగలేదు సరికదా..మరింత తగ్గిపోతోంది. పది రోజులుగా 90 శాతం పొగాకు బేళ్లను కేజీ 116లకే కొంటున్నారు. వేలం కేంద్రం ప్రారంభించిన 36 రోజుల్లో కేజీకి 10 ధరను దిగకోశారు. మార్కెట్లో పోటీతత్వం లేకపోవడంతో గుత్తాధిపత్యం వహిస్తున్న ఐటీసీ ప్రారంభంలో 65 శాతం పొగాకు కొనుగోలు చేయగా..ప్రస్తుతం తన వాటాను 35 శాతానికి కుదించుకుంది. అదేమని రైతులు అడిగితే పొగాకులో దమ్ములేదని, తెల్లని పొగాకు తాము కొనలేమని ఐటీసీ వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారుల కుట్రే.. గతంలో పండిన పొగాకు రంగు లేదని..రంగు ఉన్న పొగాకును బాగా కొంటామని చెప్పుకుంటూ వచ్చిన వ్యాపారులు ఈ సంవత్సరం పొగాకు పంట మంచి రంగు రావడంతో చివరకు ఏదోక విధంగా వంకపెట్టి తక్కువ ధరకు దక్కించుకునేందుకు కుట్రపన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 కంపెనీలు పొగాకు కొనుగోలుకు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. అందులో చాలా మంది వ్యాపారులు రోజుకు పట్టుమని పదిబేళ్లు సైతం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అదేమని అడిగే నాథుడే లేడు. వ్యాపారుల మాయాజాలంతో రైతులు ఈ ఏడాది కూడా పగాకు నష్టాలపాలయ్యేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. అటు రైతు ప్రతినిధులు గానీ ప్రభుత్వం గానీ పొగాకు ధరల విషయం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రైతులు సంఘటితంగా వ్యాపారులను ఎదుర్కొనే శక్తిలేక వారు కొన్న ధరలకే అమ్ముకొని బయటకు వస్తున్నారు. మరో పక్క అప్పులు సైతం రైతులను వేధిస్తున్నాయి. ఇప్పటికైనా పొగాకు బోర్డు స్పందించి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరీఘోరం చల్లా మధు, రైతు, నెన్నూరుపాడు మంచి రంగులు వచ్చిన పొగాకును సైతం తక్కువ రేట్లకే వ్యాపారులు కొంటున్నారు. అడిగేవారు లేరు. రాజన్న పాలనలో గిట్టుబాటు ధర దక్కింది. వ్యాపారులు సైతం ప్రభుత్వ ఒత్తిడితో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చైర్మన్ చొరవ తీసుకోవాలి బొడ్డపాటి బ్రహ్మయ్య, చోడవరం, గ్రోయెర్స్ అసోసియేషన్ మెంబర్ బోర్డు చైర్మన్ చొరవ తీసుకుని వ్యాపారుల చేత ఇండెంట్ ప్రకారం కొనుగోలు చేయించాలి. చాలా మంది వ్యాపారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప పొగాకు కొనుగోలు చేయడం లేదు. దీని వలన వ్యాపారుల్లో పోటీతత్వం తగ్గిపోయి రైతు నష్టపోతున్నాడు. ఎక్కువ బేళ్లు నోబిడ్లు చేస్తున్నారు మేకల శేషారెడ్డి, రైతు, గుర్రపడియ తెచ్చిన పొగాకు బేళ్లలో సగం నోబిడ్లే అవుతున్నాయి. అదేమంటే పొగాాకు తెల్లగా ఉందని మరోసారి బేళ్లు తిరగకట్టుకుని తెచ్చుకోమంటున్నారు. ఒకసారి వెనక్కు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తే బేలుకు 10 కేజీల పొగాకు కాటా తగ్గిపోతుంది. చెక్కుకు *1200 నష్టం వస్తుంది. వ్యాపారులు దగా చేస్తున్నారు యం మాలకొండారెడ్డి, రైతు, గుర్రపడియ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దగా చేస్తున్నారు. మార్కెట్‌ను పెరగనీయకుండా చేసి తక్కువ ధరలకే పొగాకు కొనుగోలు చేస్తున్నారు. బోర్డు అధికారులు సైతం మిన్నకుండి పోతున్నారు. రంగు పొగాకు కావాలన్న వ్యాపారులుకు కుంటిసాకు దొరక్క తెల్లగా ఉందని నాటకాలు ఆడుతున్నారు.