ఊరట: ఆ స్టాక్‌ను మరో మూడు నెలలు అమ్ముకోవచ్చు | Deadline to sell pre-GST goods extended by 3 months | Sakshi
Sakshi News home page

ఊరట: ఆ స్టాక్‌ను మరో మూడు నెలలు అమ్ముకోవచ్చు

Published Fri, Sep 29 2017 2:53 PM | Last Updated on Fri, Sep 29 2017 8:26 PM

Traders likely to get relief on unsold stock

సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమల్లోకి వచ్చే కొన్ని రోజుల ముందు వర్తకులు హడావుడిగా తన స్టాక్‌ను క్లియర్‌ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. బంపర్‌ డిస్కౌంట్లతో తమ పాత స్టాక్‌ను అమ్ముడుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మిగిలిపోయే స్టాక్‌కు కొత్త ఎంఆర్‌పీ రేట్లను ముద్రించి విక్రయించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ప్రభుత్వం కఠిన చర్యలే ఎదుర్కొంటారని వర్తకులను హెచ్చరించింది కూడా. 

చాలా మంది వర్తకులు వద్ద ఇంకా జీఎస్టీ ముందున్న స్టాక్‌ మిగిలిపోయే ఉంది. వాటికి కొత్త ఎంఆర్‌పీలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రీ-జీఎస్టీ స్టాక్‌పై వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రీ-జీఎస్టీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తుది గడువును మూడు నెలల పాటు అంటే డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. ఈ గడువు పొడిగింపుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement