pre-GST
-
ఊరట: ఆ స్టాక్‌ను మరో మూడు నెలలు అమ్ముకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమల్లోకి వచ్చే కొన్ని రోజుల ముందు వర్తకులు హడావుడిగా తన స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్లతో తమ పాత స్టాక్‌ను అమ్ముడుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మిగిలిపోయే స్టాక్‌కు కొత్త ఎంఆర్పీ రేట్లను ముద్రించి విక్రయించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ప్రభుత్వం కఠిన చర్యలే ఎదుర్కొంటారని వర్తకులను హెచ్చరించింది కూడా. చాలా మంది వర్తకులు వద్ద ఇంకా జీఎస్టీ ముందున్న స్టాక్ మిగిలిపోయే ఉంది. వాటికి కొత్త ఎంఆర్పీలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రీ-జీఎస్టీ స్టాక్‌పై వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రీ-జీఎస్టీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తుది గడువును మూడు నెలల పాటు అంటే డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ గడువు పొడిగింపుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. -
పేటీఎం ‘ప్రి–జీఎస్టీ’ సేల్
న్యూఢిల్లీ: ఆన్లైట్ రిటైల్ సంస్థ ‘పేటీఎం’ తాజాగా ‘ప్రి–జీఎస్టీ’ పేరుతో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌లో దాదాపు 6,000 మంది రిటైలర్లు 500కుపైగా బ్రాండ్లకు సంబంధించిన ప్రొడక్టులను విక్రయిస్తున్నారు. ‘ప్రి–జీఎస్టీ’ సేల్‌లో టీవీలు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫుట్‌వేర్, కెమెరాలు వంటి తదితర ప్రొడక్టులపై డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందొచ్చు. ఆఫ్‌లైన్ రిటైలర్లు ఈ సేల్‌లో పాల్గొనడం ద్వారా జీఎస్టీ అమలుకు ముందే వారి స్టాక్‌ను విక్రయించుకోవచ్చని పేటీఎం పేర్కొంది. ఆన్లైన్ డ్రగ్ మార్కెట్‌ప్లేస్ ‘1 ఎంజీ’ కూడా డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది స్టాక్ మెడిసిన్స్‌పై 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.