పేటీఎం ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌ | Paytm Mall launches 'pre-GST clearance sale': Here are the top deals | Sakshi
Sakshi News home page

పేటీఎం ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌

Published Thu, Jun 15 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

పేటీఎం ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌

పేటీఎం ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైట్‌ రిటైల్‌ సంస్థ ‘పేటీఎం’ తాజాగా ‘ప్రి–జీఎస్‌టీ’ పేరుతో ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌లో దాదాపు 6,000 మంది రిటైలర్లు 500కుపైగా బ్రాండ్లకు సంబంధించిన ప్రొడక్టులను విక్రయిస్తున్నారు. ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌లో టీవీలు, ల్యాప్‌టాప్స్, మొబైల్‌ ఫోన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫుట్‌వేర్, కెమెరాలు వంటి తదితర ప్రొడక్టులపై డిస్కౌంట్లను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను పొందొచ్చు.

ఆఫ్‌లైన్‌ రిటైలర్లు ఈ సేల్‌లో పాల్గొనడం ద్వారా జీఎస్‌టీ అమలుకు ముందే వారి స్టాక్‌ను విక్రయించుకోవచ్చని పేటీఎం పేర్కొంది. ఆన్‌లైన్‌ డ్రగ్‌ మార్కెట్‌ప్లేస్‌ ‘1 ఎంజీ’ కూడా డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది స్టాక్‌ మెడిసిన్స్‌పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement