Pay tm
-
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చేసింది పిన్ లేకుండానే చెల్లింపులు చేసేలా పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్‌తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. ఏ బ్యాంకుల యూజర్లకు ఈ సేవలు వర్తిస్తాయి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి. లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్‌కు బ్యాలెన్స్‌గా రూ. 1,000 జోడిస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్‌లో ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్‌నుండి విమాన టికెట్ల బుకింగ్‌పై రూ. 149, బస్ టిక్కెట్లకు రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై 'క్యాన్సిల్ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తక్షణమే సంబంధిత ఖాతాలోకి నగదు జమ అవుతుంది. Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this 🚀🚀 pic.twitter.com/c1tr7J4V3A — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023 -
పేటీఎం చేతికి రహేజ క్యూబీఈ
ముంబై : పేటీఎం ఆర్థిక సేవలను విస్తరించేందుకు సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ముంబైకి చెందిన ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రహేజ క్యూబీఈని కొనుగోలు చేయనున్నారు. రహేజ క్యూబీఈలో నూరు శాతం వాటాను పేటీఎం కొనుగోలు చేస్తుందని, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పనిచేసే క్యూబీఈ ఉద్యోగులు యథావిథిగా కొనసాగుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఒప్పందం విలువ రూ 568 కోట్లుగా భావిస్తున్నారు. పేటీఎం మాతృసంస్థ ఒన్97 రహేజా క్యూబీఈ కొనుగోలును వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. పేటీఎం ఆర్థిక సేవల ప్రయాణంలో ఇది కీలక మైలురాయని, పేటీఎం కుటుంబంలోకి రహేజా క్యూబీఈని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని పేటీఎం ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ పేర్కొన్నారు. పటిష్టమైన నిర్వహణ బృందం కలిగిన రహేజా క్యూబీఈ కొనుగోలుతో జనరల్ ఇన్సూరెన్స్‌ను పెద్దసంఖ్యలో భారతీయుల చెంతకు చేర్చేందుకు తమకు ఉపకరిస్తుందని అన్నారు. రహేజా క్యూబీఈలో ప్రిస్మ్ జాన్సన్‌కు 51 శాతం వాటా ఉండగా క్యూబీఈ ఆస్ర్టేలియా 49 శాతం వాటా కలిగిఉంది. చదవండి : జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు -
‘పేటీఎం’కే టైటిల్ స్పాన్సర్షిప్
ముంబై: భారత్‌లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ ‘పేటీఎం’ తిరిగి దక్కించుకుంది. స్వదేశంలో భారత జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో (టెస్టులు, వన్డేలు, టి20లు) పాటు మహిళల క్రికెట్ సహా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీలు అన్నింటికీ ‘పేటీఎం’ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుంది. స్పాన్సర్‌షిప్‌పై ‘పేటీఎం’ యాజమాన్యం వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 2019–2023 మధ్య నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందు కోసం ‘పేటీఎం’ రూ.326.80 కోట్లు చెల్లించ నుంది. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా ఒక్కో మ్యాచ్‌కు పేటీఎం రూ. 3.80 కోట్లు చెల్లిస్తుంది. గత ఏడాది రూ. 2.4 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టి20తో భారత్ స్వదేశీ సీజన్ మొదలవుతుంది. -
పేటీఎంలో క్యాష్‌బ్యాక్‌గా డిజిటల్ బంగారం ఆఫర్
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ పసిడి రూపంలోనూ పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే యూజర్లు ప్రస్తుతం తమ వాలెట్లలో ఉన్న క్యాష్‌బ్యాక్‌ను సైతం పేటీఎం గోల్డ్ కింద మార్చుకునేందుకు ప్రత్యేక ప్రమోషనల్ కోడ్‌ను కూడా ఇవ్వనున్నట్లు వివరించింది. ఈ విధంగా జమయిన డిజిటల్ బంగారాన్ని డెలివరీ తీసుకోవచ్చని, లేదా పసిడి రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీకైనా విక్రయించుకోవచ్చని పేటీఎం తెలిపింది. అత్యంత తక్కువగా రూ.1కే డిజిటల్ బంగారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలు కల్పించేందుకు ఎంఎంటీసీ–పీఏఎంపీతో పేటీఎం జట్టు కట్టిన సంగతి తెలిసిందే. -
పేటీఎంలో పెట్టుబడులకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 20% వాటాలు కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీసీఐ ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో పోస్ట్ చేసింది. పేటీఎంలో 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 9,079 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ మే నెలలో వెల్లడించింది. -
బిగ్ బాస్కెట్లో పేటీఎంకు మైనారిటీ వాటా?
రూ.1,300 కోట్ల పెట్టుబడులపై చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ (కిరాణా సరుకులు) రిటైలింగ్ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో పేటీఎం మైనారిటీ వాటా తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (రూ.1,300 కోట్లు) ఉండొచ్చని సమాచారం. చర్చలు మొదలయ్యాయని, వచ్చే కొన్ని వారాల్లో డీల్ ఖరారవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశాయి. బిగ్‌బాస్కెట్‌లో పెట్టుబడులతో ఈ కామర్స్‌లో పేటీఎం మరింత బలోపేతం అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొన్నాయి. కాగా, ఇది పూర్తిగా నిజం కాదని బిగ్‌బాస్కెట్ స్పష్టం చేయగా, పేటీఎం స్పందించేందుకు నిరాకరించింది. అమెజాన్, బిగ్‌బాస్కెట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని లోగడ వార్తలు వచ్చాయి. ఆన్లైన్ గ్రాసరీ విక్రయాలను పేటీఎం, అమెజాన్ ఇప్పటికే తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రారంభించాయి కూడా. -
పేటీఎం ‘ప్రి–జీఎస్టీ’ సేల్
న్యూఢిల్లీ: ఆన్లైట్ రిటైల్ సంస్థ ‘పేటీఎం’ తాజాగా ‘ప్రి–జీఎస్టీ’ పేరుతో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌లో దాదాపు 6,000 మంది రిటైలర్లు 500కుపైగా బ్రాండ్లకు సంబంధించిన ప్రొడక్టులను విక్రయిస్తున్నారు. ‘ప్రి–జీఎస్టీ’ సేల్‌లో టీవీలు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫుట్‌వేర్, కెమెరాలు వంటి తదితర ప్రొడక్టులపై డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందొచ్చు. ఆఫ్‌లైన్ రిటైలర్లు ఈ సేల్‌లో పాల్గొనడం ద్వారా జీఎస్టీ అమలుకు ముందే వారి స్టాక్‌ను విక్రయించుకోవచ్చని పేటీఎం పేర్కొంది. ఆన్లైన్ డ్రగ్ మార్కెట్‌ప్లేస్ ‘1 ఎంజీ’ కూడా డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది స్టాక్ మెడిసిన్స్‌పై 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. -
పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలు షురూ
⇔ 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ⇔ 2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారుల టార్గెట్ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మంగళవారం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఉండబోవని, ఆన్లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. చైనా దిగ్గజం ఆలీబాబా, జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న పేటీఎం.. రెండేళ్లలో తమ బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తొలి ఏడాదిలో సంస్థ31 శాఖలు, 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ పాయింట్స్‌ను ప్రారంభించనుంది. కస్టమరు ఖాతాలో రూ. 25,000 డిపాజిట్లు దాటితే రూ. 250 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించిన పేటీఎం.. డిపాజిట్లపై ఈ తరహా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొంది. వ్యాపార వర్గాల కోసం కరెంటు అకౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ‘ఒక కొత్త తరహా బ్యాంకింగ్ మోడల్‌ను రూపొందించేందుకు ఆర్బీఐ మాకు అవకాశం కల్పిం చింది. మా ఖాతాదారుల డిపాజిట్లు.. సురక్షితమైన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా జాతి నిర్మాణంలో పాలుపంచుకోనుండటం గర్వకారణం. డిపాజిట్లేవీ రిస్కులున్న సాధనాల్లోకి మళ్లించడం జరగదు‘ అని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ తోడ్పాటుతో 2020 నాటికల్లా 50 కోట్ల మంది ఖాతాదారులకు విశ్వసనీయ బ్యాంకుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ సీఈవో రేణు తెలిపారు. 22 కోట్ల మంది వాలెట్ యూజర్లు... ప్రస్తుతం పేటీఎం డిజిటల్ వాలెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 22 కోట్లుగా ఉంది. ఈ వాలెట్స్‌ను సంస్థ పేమెంట్ బ్యాంకుకు మళ్లించనుంది. యూజర్లు అకౌంటు ప్రారంభించేందుకు ఖాతాదారుల వివరాల వెల్లడి నిబంధనల (కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేవైసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తొలి దశలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు ఆహ్వాన ప్రాతిపదికన ఉండనున్నాయి. బ్యాంకింగ్ బీటా యాప్ ఉద్యోగులు, అనుబంధ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేటీఎం కస్టమర్లు బ్యాంక్ వెబ్సైట్ లేదా యాపిల్ ఐవోఎస్ ప్లాట్‌ఫాంలోని పేటీఎం యాప్ ద్వారా ఇన్విటేషన్ పొందవచ్చు. -
జియో, పేటీఎం.. మోదీ ఫొటోలు అడగలేదు
న్యూఢిల్లీ: ప్రకటనల కోసం ప్రధాని మోదీ ఫొటోలను వినియోగించేందుకు అనుమతి కోరిన వారి వివరాలను బహిర్గతం చేయలేమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎం వో) స్పష్టం చేసింది. మోదీ చిత్రాలను వినియోగించుకునేందుకు అనుమతి కోరు తూ కంపెనీలు, ట్రస్టులు, వ్యక్తులు దాఖలు చేసిన దరఖాస్తుల వివరాలను, అనుమతి లేదా తిరస్కరణకు సంబంధించిన కాపీల ను ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చింది. ప్రకటనల కోసం మోదీ ఫొటోల అనుమ తికి రిలయన్స్ జియో, పేటీఎం విజ్ఞప్తి చేసినట్లుగా తమ వద్ద ఎలాంటి రికార్డు లేదంది. -
వెనక్కి తగ్గిన పేటీఎం
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం క్రెడిట్ కార్డుల వడ్డనపై వెనక్కి తగ్గింది. క్రెడిట్ కార్డుతో టాప్ అప్‌లపై విధించిన 2శాతం చార్జీలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. లక్షలాది ఖాతాదారులు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2 శాతం ఫీజును ఉపసంహరించుకుంటున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. వినియోగదారుల సౌలభ్యమే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఇటీవల విధించిన ఫీజును రద్దు చేస్తున్నామని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు. అలాగే తమ సేవల దుర్వినియోగాన్ని పసిగట్టేందుకు తమ బృందాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ తమ వాలెట్స్‌లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. కాగా క్రెడిట్ కార్డులతో టాప్ అప్ విధానాన్ని టెక్నాలజీపై పట్టున్న కొందరు యూజర్లు నగదు రొటేషన్ కోసం వాడుకుంటున్నందున, మార్చి 8నుంచి వీటిపై 2 శాతం ఫీజును వసూలు చేయనున్నట్టు ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేటీఎం ప్రకటించింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా టాప్ అప్‌లపై ఎలాంటి చార్జీలు ఉండబోవని వివరించిన సంగతి తెలిసిందే. -
క్రెడిట్ కార్డుతో టాప్ అప్‌లకు పేటీఎం షాక్
2 శాతం చార్జీల వడ్డన న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం.. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేసేవారికి షాకిచ్చింది. 2 శాతం లావాదేవీ చార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ విధానాన్ని టెక్నాలజీపై పట్టున్న కొందరు యూజర్లు నగదు రొటేషన్ కోసం వాడుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక బ్లాగ్ పోస్ట్‌లో సంస్థ తెలిపింది. కొందరు యూజర్లు క్రెడిట్‌కార్డులతో మొబైల్ వాలెట్లో డబ్బులు వేసుకుని, తర్వాత ఆ నగదును బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకోవడాన్ని గమనించినట్లుగా తెలిపింది. క్రెడిట్ కార్డుతో టాప్ అప్ చేసిన ప్రతిసారీ తాము అటు కార్డ్ నెట్వర్క్ సంస్థకు, ఇటు బ్యాంకుకు భారీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుండగా.. తమ ప్లాట్‌ఫాంపై ఎటువంటి లావాదేవీలు జరపకుండానే సదరు యూజర్లు లబ్ది పొందారని పేటీఎం పేర్కొంది. తమ నెట్‌వర్క్‌లో ఉత్పత్తులు, సర్వీసుల విక్రయం ద్వారా వచ్చే స్వల్ప మార్జిన్లే తమకు ఆదాయమని, కొందరు యూజర్లు అనుసరిస్తున్న విధానాలతో నష్టపోవాల్సి వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకే రెండు శాతం చార్జీలు విధిస్తున్నట్లు వివరించింది. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేసిన 24 గంటల్లోగా నిర్దిష్ట మొత్తానికి డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తామని తెలిపింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా టాప్ అప్‌లపై ఎలాంటి చార్జీలు ఉండబోవని స్పష్టం చేసింది. మొబిక్విక్ ఆహ్వానం..: మరోవైపు, తమ వాలెట్స్‌లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి చార్జీలు విధించబోమని మరో మొబైల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. డీమోనిటైజేషన్ అనంతరం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు తాము ఫీజుల విధానాన్ని ఉపసంహరించామని, అదే విధానాన్ని ఇకపైనా కొనసాగిస్తామని వివరించింది. -
విలీన బాటలో స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్
ముంబై: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ సంస్థ విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా స్టాక్స్ డీల్‌గా ఉండొచ్చునని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే సంప్రతింపులు మళ్లీ ప్రారంభం కావొచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్‌ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్నాప్‌డీల్‌తో ఈ–కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్‌కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్‌డీల్‌లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది. స్నాప్‌డీల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ–కామర్స్‌లో రూ. 1,350–1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. తద్వారా భారత మార్కెట్లో ఆన్లైన్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో పోటీపడుతోంది. పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. పేటీఎంలో రిలయన్స్ క్యాప్ వాటా సేల్..! పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో తమకున్న 1 శాతం వాటాను విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ యోచిస్తోంది. తద్వారా 50–60 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించాయి. -
ప్రధాని ఫొటోలు ఎందుకు వాడారు?
జియో, పేటీఎంలకు కేంద్రం నోటీసులు న్యూఢిల్లీ: జియో, పేటీఎంలు తమ ప్రకటనల్లో ప్రధానమంత్రి ఫొటోలను వినియోగించడంపై కేంద్రం స్పందించింది. ఇలా ఎందుకుచేశారని ప్రశ్నిస్తూ, నోటీసులు జారీ చేసింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే శుక్రవారంనాడు ఈ విషయాన్ని తెలిపారు. ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్(ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్) యాక్ట్ 1950 కింద నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత స్థాయి ప్రతి ష్టకు కస్టోడియన్‌గా వ్యవహరించే వినియోగ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ చట్టం కింద అత్యున్నత స్థాయి ప్రతిష్టను తగ్గించే చర్యలకు జరిమానా విధించే వీలుంది. తాజా పరిణామంపై ఈ–మెయిల్ ప్రశ్నలకు అటు జియో కానీ ఇటు పేటీఎంకానీ స్పందించలేదు. జియో తన 4జీ సేవల ప్రకటనలకు సంబంధించి ప్రధాని ఫొటోను వినియోగించుకుంది. ఇక పెద్ద నోట్ల రద్దు అనంతరం పేటీఎం ప్రకటనల్లో మోదీ ఫొటోలు చోటుచేసుకున్నాయి. -
పేటీఎం చెల్లింపుల బ్యాంక్‌కు ఆర్బీఐ తుది ఆమోదం
వచ్చే నెలలో కార్యకలాపాలు న్యూఢిల్లీ: పేటీఎం సంస్థ.. ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్‌కు తుది ఆమోదం పొందింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్బీఐ నుంచి తుది ఆమోదం పొందామని పేటీఎం తెలిపింది. వచ్చే నెల నుంచి చెల్లింపు బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఈ బ్యాంక్‌కు పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించడానికి ఇష్ఠపడతానని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యాపార విధానాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని వివరించారు. బ్యాంకింగ్ సేవలు అందని కోట్లాది భారతీయులకు ఆర్థిక సేవలందించడంపై దృష్టి సారిస్తామన్నారు. తొలి బ్రాంచ్ నోయిడాలో.. కాగా వచ్చే నెల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేటీఎం ప్రతినిధి ఒకరు చెప్పారు. తొలి బ్రాంచ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆరంభిస్తామని వివరించారు. చెల్లింపుల బ్యాంక్‌లు వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థల నుంచి రూ. లక్ష వరకూ డిపాజిట్లను అంగీకరిస్తాయి. -
పేటీఎంలో1% వాటా 325 కోట్లు
• వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ విక్రయం • ఈ నిధులు పేమెంట్ బ్యాంకుపై పెట్టుబడి • పేటీఎం పేమెంట్ బ్యాంకులో శర్మకు 51 శాతం వాటా న్యూఢిల్లీ: డిజిటల్ వ్యాలెట్ సేవలు, ఈ కామర్స్ సంస్థ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స)లో ఒక్క శాతం వాటాను ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఏకంగా రూ.325 కోట్లకు విక్రరుుంచారు. దీంతో రూ.32,500 కోట్ల మార్కెట్ విలువ(అంచనా)తో పేటీఎం భారీ కంపెనీల సరసన నిలవనుంది. పేటీఎం మాతృ సంస్థ.. వన్97 కమ్యూనికేషన్‌సలో శర్మకు ఈ ఏడాది మార్చి నాటికి 21% వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 20%కి పరిమితం కానుంది. తాజా పరిణామంపై పేటీఎం అధికార ప్రతినిధి స్పం దిస్తూ.. పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాల కోసమే వాటా విక్రయం జరిగినట్టు స్పష్టం చేశారు. కంపెనీలో ప్రస్తుత వాటాదారులే కొనుగోలు చేశారని తెలిపారు. అంతకు మించి వివరాలను మాత్రం వెల్లడించలేదు. పేటీఎం పేమెంట్ బ్యాంకులో విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం, మిగిలిన వాటా వన్97 కమ్యూనికేషన్స చేతిలో ఉంది. పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు గతేడాది శర్మకు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్బీఐ నుంచి తుది అనుమతి వచ్చిన వెంటనే పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించే సన్నాహాల్లో ఈ సంస్థ ఉంది. పేటీఎం వ్యాలెట్ వ్యాపారాన్ని ఇటీవలే పేమెంట్ బ్యాంకుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. వన్97 కమ్యూనికేషన్‌సలో 40 శాతం వాటాలు చైనాకు చెందిన అలీబాబా గ్రూపు, దాని అనుబంధ సంస్థ ఏఎంటీ ఫైనాన్షియల్ చేతిలో ఉన్నారుు. వీటితోపాటు సెరుుఫ్ పార్ట్నర్స్, ఇంటెల్ క్యాపిటల్, శాప్ వెంచర్స్ కూడా వాటాలు కలిగి ఉన్నారుు. బాధ్యతలన్నీ ఆయనవే... ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ విజయ్ శేఖర్ శర్మ స్వస్థలం. అక్కడే పదో తరగతి వరకు హిందీ మాతృభాషగా చదువు పూర్తి చేసిన ఆయన ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. 2005లో వన్97 కమ్యూనికేషన్సను స్థాపించారు. వార్తలు, క్రికెట్ స్కోర్, రింగ్టోన్లు, జోక్స్, పరీక్షా ఫలితాల వెల్లడి వంటి సేవలను ప్రారంభంలో ఈ సంస్థ అందించింది. పేమెంట్ సేవల కోసం 2010లో పేటీఎంను ప్రారంభించడం కీలక మలుపు. పేటీఎం చైర్మన్‌గా, ఎండీగా, సీఈవోగా అన్ని బాధ్యతలను చేపట్టి... కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ, అమలు వంటి కీలక వ్యవహారాల్ని నిర్వహిస్తున్నారు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్ఎస్ కార్ప్ అనే వెంచర్‌ను ప్రారంభించిన ఆయన 1999లో దాన్ని న్యూజెర్సీకి చెందిన లోటస్ ఇంటర్వర్క్స్కు విక్రరుుంచారు. తనతోపాటు పేటీఎంను ఈ స్థారుుకి తీసుకెళ్లడానికి కృషి చేసిన బృందానికి 4 శాతం వాటాను కానుకగా ఇచ్చి తనలోని నాయకత్వ గుణాన్ని చాటుకున్నారు. -
పేటీఎం ఇకపై తెలుగులోనూ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాలె ట్, ఈ కామర్స్ సంస్థ పేటీఎం తెలుగు సహా పది ప్రాంతీయ భాషల వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయా భాషల్లో యూజర్ ఇంటర్ఫేస్ను అంబుబాటులోకి తెచ్చింది. పేటీఎం ఆండ్రారుుడ్ యూజర్ ఇంటర్ఫేస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుం దని, దీంతో దేశంలోని 10 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు చేరువ కానున్నట్టు కంపెనీ పేర్కొంది. -
ఏటీఎంలెందుకు..?వాలెట్లో వేద్దామా!!
• మోదీని హీరోలా పొగిడేస్తున్న మొబైల్ వాలెట్ సంస్థలు • లావాదేవీలు బీభత్సంగా పెరిగాయంటూ ప్రకటనలు • మున్ముందు మరింత పెరుగుతాయంటూ అంచనాలు • వాలెట్లను ఆశ్రరుుస్తే లైన్ల బాధ కొంతరుునా తప్పుతుంది • ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అవగాహన ఉంటే బెటర్ • తరచూ బ్యాంకుకు వెళ్లటాన్ని తప్పించుకోవచ్చు • భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా మంచివేనంటున్న నిపుణులు • ఓపెన్ వాలెట్లలో తప్ప మిగతా వాటిలో విత్‌డ్రాకు వీలుండదు • నేరుగా డిపాజిట్ కూడా చేయలేం; ఆన్లైన్లో చేయాల్సిందే • డబ్బు ఎన్నాళ్లుంచినా వీటిపై పైసా కూడా వడ్డీ రాదు • మున్ముందు ఇవి కూడా లావాదేవీలు ఛార్జీలు వేసే అవకాశం నవంబర్ 8 అర్ధరాత్రి!!.ప్రధానమంత్రి ప్రకటనతో...ఆ క్షణం దాకా చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు చెల్లకుండా పోయారుు. నవంబర్ 9 ఉదయం!! పలు పత్రికల్లో నరేంద్రమోదీ ఫోటో పెట్టి మరీ మొబైల్ వాలెట్ సంస్థ ‘పేటీఎం’ ప్రకటనలు. డిజిటల్ మనీకి దారులు తెరుస్తున్న మోదీకి అభినందనలు కూడా అందులోనే. అంతేకాదు!! ఆ రోజు మధ్యాహ్నానికల్లా... ఎఫ్ఎం రేడియో, టీవీ, సోషల్ మీడియా అన్నిటా పేటీఎం, మొబీ క్విక్, ఫ్రీచార్జ్ వంటి మొబైల్ వాలెట్ల ప్రచార విజృంభణ మొదలైంది. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు సైతం నగదు లేకుండా ప్రయాణం చేయటానికి తమ వ్యాలెట్లు వాడాలంటూ హోరెత్తించేశారుు. నవంబర్ 10 ఉదయం... తమ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 200 శాతం పెరిగిందని, లావాదేవీల సంఖ్య 250 శాతం పెరిగిందని పేటీఎం ప్రకటించింది. తమ వ్యాలెట్ రీచార్జ్‌లు ఆ ఒక్కరోజే ఏకంగా 1,500 శాతం పెరిగినట్లు ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా మనీ ప్రకటించింది. ఇంకా మొబీక్విక్, ఫ్రీచార్జ్ కూడా ఇలాంటి ప్రకటనలే చేశారుు. ఇన్ని జరుగుతున్నా... అసలు మొబైల్ వాలెట్ అంటే ఏంటో!! ఎలక్ట్రానిక్ లావాదేవీలంటే ఏంటో తెలియని జనం... పర్సుల్లో ఉన్న పెద్ద నోట్లు చెల్లక, ఏటీఎంలు పనిచేయక, బ్యాంకుల్లో చాంతాడంత లైన్లలో నిల్చోలేక నానా యాతనలు పడుతూనే ఉన్నారు. బిల్లులు చెల్లించడానికి పాత నోట్లు ఇవ్వవచ్చని కొన్ని ప్రభుత్వ సంస్థలు వెసులుబాటు కల్పించటంతో అక్కడ కూడా లైన్లలో నిల్చోక తప్పలేదు వారికి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటుంది. పూర్తిగా కాకపోరుునా... మొబైల్ వాలెట్లను వాడితే వీటిలో కొన్ని కష్టాలరుునా తప్పేవి. ఎలక్ట్రానిక్ లావాదేవీలు అలవాటైన వారు కొన్ని చెల్లింపులైనా ఉన్న చోటు నుంచే చేయగలిగేవారు. నిజానికి అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో డిజిటల్ లావాదేవీలపై అందరికీ అవగాహన ఎక్కువ కనక అక్కడ చిన్నచిన్న లావాదేవీలూ ఎలక్ట్రానిక్ లేదా మొబైల్ మనీతో పూర్తి చేసేయొచ్చు. పర్సులో కరెన్సీ లేకున్నా రోజులు గడిపేయొచ్చు. కానీ అత్యధిక శాతం కిరాణా షాపుల యజమానుల నుంచి వాటిని వాడే కస్టమర్లు కూడా నిరక్షరాస్యులే అరుున భారతదేశంలో అది సాధ్యమా? డిజిటల్ మనీని పూర్తి స్థారుులో అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని జనం స్వాగతిస్తారా? కరెన్సీ లేకుండా రోజును ఊహించుకోగలమా? ఒక్క మాటలో చెప్పాలంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ క్రమంగా ఈ-లావాదేవీల సంఖ్య పెరుగుతోందన్నది మాత్రం కాదనలేని నిజం. అది సరే! నగదు అవసరం లేకుండా కొన్ని లావాదేవీలనైనా జరపటానికి అవకాశం కల్పిస్తున్న ఈ మొబైల్ వాలెట్ల సంగతేంటి? కాస్తరుునా సౌలభ్యాన్నిస్తున్న ఈ ఫోన్ వాలెట్లతో లాభమేనా? ఎలక్టాన్రిక్ లావాదేవీలు అసలు మంచివేనా? సురక్షితమేనా? సాధా రణ ప్రజలకు వీటితో లాభ నష్టాలేంటి? ఇతరత్రా వివరాలను తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఎందుకీ మొబైల్ వాలెట్లు? మనలో చాలా మందికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసు. అరుుతే తెలియని వారూ లేకపోలేదు. మనకు బ్యాంకులో ఉన్న ఖాతాను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవటానికి వీలు కల్పించేదే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ప్రతి ఖాతాదారుకూ తన సొంత ఐడీ, పాస్వర్డ్ ఉంటారుు. వాటిని మనకు ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచీకి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా వేరే ఖాతాలోకి నగదు బదిలీ చేయటం... క్రెడిట్ కార్డుతో పాటు బీమా, కరెంటు, టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించటం, స్థానిక సంస్థల పన్నులు చెల్లించటం వంటివి చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... దాదాపు ఏ చెల్లింపరుునా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఇటీవల ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ వేసిన అంచనాల ప్రకారం దేశంలో ఇప్పటికీ 23.3 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకింగ్ సౌకర్యమే లేదు వారికి. కాకపోతే వీళ్లలో చాలా మందికి మొబైల్ ఫోన్లున్నారుు. ఇలాంటి వారికి ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవటానికి కొన్ని మొబైల్ వాలెట్లు ఉపయోగపడుతున్నారుు. ఎరుుర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స జియో వంటి టెలికం సంస్థలు తెచ్చిన వాలెట్లతో... అన్ని రకాల లావాదేవీలూ జరుపుకోవచ్చు. ఇంకో విశేషమేంటంటే... పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్ వంటి ఏ వాలెట్లో డబ్బులు డిపాజిట్ చేయటానికై నా మీకో లేదా మీ బంధుమిత్రులకో ఆన్లైన్ బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండి తీరాలి. వాటిలోంచే ఈ వాలెట్లలో నగదు డిపాజిట్‌కు వీలుంటుంది. కానీ టెల్కోల వాలెట్లలో నగదు వేయాలంటే నేరుగా ఆయా సంస్థలకు చెందిన ఔట్‌లెట్లలోకి వెళ్లి, నగదు చెల్లించొచ్చు. టెలికం సంస్థల వాలెట్లివీ... ఎరుుర్‌టెల్‌కు చెందిన ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్‌కు చెందిన వొడాఫోన్ ఎం పెసా, ఐడియా మనీ, జియో మనీ ఈ కోవలోకి వస్తారుు. వీటన్నిట్లోనూ చూస్తే రిలయన్‌సకు చెందిన జియో మనీకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే దేశవ్యాప్తంగా రిలయన్‌సకు చెందిన జియో స్టోర్లతో పాటు రిలయన్స ఫ్రెష్, రిలయన్స డిజిటల్ దుకాణాల్లోనూ నగదు చెల్లించి జియో మనీలో డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే... రిలయన్సకున్న రిటైల్ నెట్వర్క్ దానికి ఈ రకంగా కలిసొచ్చిందన్న మాట. బ్యాంకులకూ ఉన్నాయ్ వాలెట్లు!! నిజం చెప్పాలంటే వాలెట్లతో చేసే ప్రతి పనినీ ఆన్లైన్ బ్యాంకింగ్‌తో కూడా చెయ్యొచ్చు. కాకపోతే ప్రతిసారీ బ్యాంకు ఖాతాలో ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇపుడు ఇలాంటి అవసరమేదీ లేకుండా బ్యాంకులు సైతం తమ సొంత మొబైల్ వాలెట్లను తెస్తున్నారుు. ఎస్బీఐ ‘బడ్డీ’, ఐసీఐసీఐ ‘ఐ-మొబైల్’, హెచ్డీఎఫ్సీ ‘పే జాప్’ ఇవన్నీ ఇలాంటివే. వీటిని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని లావాదేవీలూ మిగతా మొబైల్ వాలెట్ల మాదిరే చేసుకోవచ్చు. కాకపోతే ముందే చెప్పుకున్నట్లు... దేశంలో బ్యాంకింగ్ సదుపాయం లేనివారు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తెలియనివారు కోట్ల మంది ఉన్నారు. వారందరి ఆదరణే ఈ మొబైల్ వాలెట్ల బలం. ఎన్ని రకాలున్నాయంటే... ⇔ రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు. క్లోజ్డ్... సెమీ క్లోజ్డ్, ఓపెన్. ⇔ క్లోజ్డ్ వాలెట్ అంటే కంపెనీలు సొంతగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్... ఇలా చాలా ఆన్లైన్ కంపెనీలు తమ సొంత వాలెట్లు అందిస్తున్నారుు. అంటే వీటిలో డబ్బు వేసుకుని, వీటిలో వస్తువులే కొనాలి. ఇవి పూర్తిగా ఆయా కంపెనీల పరిధిలో ఉంటారుు కనక వీటికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ క్లోజ్డ్ వాలెట్లను ఆఫర్ చేస్తున్నారుు. లాభాలు: కంపెనీలు తమ వాలెట్ ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటారుు. ⇔ కంపెనీల వాలెట్లు గనక వీటిలో వేసే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు. నష్టాలు: వీటిలోనే లావాదేవీలు జరపాలి. వేరే కంపెనీల్లో తక్కువ ధరకు వస్తువులు వస్తున్నా ఈ డబ్బుతో కొనలేం. ఉదాహరణకు మీకు ఓలా మనీలో డబ్బులున్నారుు. కానీ మీకు క్యాబ్ కావాల్సి వచ్చినపుడు దగ్గర్లో ఓలా క్యాబ్‌లు లేవు. ఏ ఉబెర్ నుంచో బుక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీ ఓలా మనీ అక్కరకు రానట్టే కదా!!. ⇔ ఇక ఈ-కామర్స్ సంస్థల విషయానికొస్తే మీకు ఒక కంపెనీ వాలెట్లో డబ్బులున్నారుు. ఏదైనా కొనాలంటే వివిధ ఈ-కామర్స్ సైట్లను చూడటం అందరూ చేసేదే. అపుడు మనకు డబ్బులున్న సంస్థ కాకుండా వేరే సంస్థ తక్కువ ధరకు ఆఫర్ చేస్తే పరిస్థితేంటి? ⇔ డబ్బును వేయటమే తప్ప విత్‌డ్రా చెయ్యటానికి వీలుండదు. ఎలాంటి వడ్డీ రాదు. సెమీ క్లోజ్డ్ వాలెట్లలో డబ్బులు వేస్తే వీటిని ఇతర ఆన్లైన్ సైట్లలోనూ వాడొచ్చు. అరుుతే ఈ వాలెట్‌ను నిర్వహిస్తున్న కంపెనీకి ఏఏ సంస్థలతో ఒప్పందాలున్నాయో వాటిలోనే లావాదేవీలు జరిపే వీలుంటుంది. పేటీఎం, మొబిక్విక్, పేయు, సిట్రస్ క్యాష్, ఆక్సిజన్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఇలాంటివే. లాభాలు: ఆర్బీఐ నిబంధనల ప్రకారం సెమీ క్లోజ్డ్ వాలెట్ల ద్వారా యుటిలిటీ బిల్లులు, అత్యవసర సర్వీసులకు చెల్లింపులు చేయొచ్చు. ⇔ వీటితో ఒప్పందం ఉన్న కంపెనీలే కాదు, వాలెట్ సంస్థలు కూడా తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ఇస్తుంటారుు. వాటిని అవకాశాన్ని బట్టి వాడుకుంటే లాభమే. నష్టాలు: బిల్లుల చెల్లింపుల పరిమితి రూ.10వేల లోపే. అంటే రూ.10వేలకన్నా ఎక్కువ దీన్లో డిపాజిట్ చేయలేం. అంతకన్నా ఎక్కువ అవసరమైతే ఆ లావాదేవీల్ని దీంతో చెయ్యలేం. ⇔ డిపాజిట్ చేస్తే తిరిగి వెనక్కి తీసుకోలేం. ఎలాంటి వడ్డీ రాదు. ఓపెన్ వాలెట్లు ఒకరకంగా బ్యాంకు ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా సహా బిల్లుల చెల్లింపు, ఈ-కామర్స్ లావాదేవీలు ఏవైనా చేయొచ్చు. వీటిలో సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తారుు. ఉదాహరణకు వొడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ సంస్థ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంకుతో జియో మనీ ఒప్పందం చేసుకుంది. ఎరుుర్ టెల్ మనీ, టాటా టెలీ ఎం రుపీ కూడా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారుు. ఇక గతేడాదే పేటీఎం, ఎరుుర్‌టెల్, రిలయన్స, వొడాఫోన్ వంటివి పేమెంట్ బ్యాంక్ లెసైన్సును పొందారుు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వ్యాలెట్లతో నిర్వహించే లావాదేవీ విలువ రూ.50వేలు మించకూడదు. డిజిటల్ వాలెట్లతో లాభాలివీ.. ⇔ నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపిన ప్రతిసారీ అలా జరిపిన వ్యక్తి ఐడెంటిటీ బయటపడుతుంటుంది. కార్డులు, ఖాతాల నంబర్లు తెలుస్తుంటారుు. డిజిటల్ వాలెట్లతో ఆ సమస్య ఉండదు. ⇔ డిజిటల్ వాలెట్ పాస్వర్డ్ వేరొకరికి తెలిసిపోరుునా జరిగే నష్టం... అందులో ఉన్న సొమ్ముకు మాత్రమే పరిమితమవుతుంది. ⇔ ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు ఒన్‌టైమ్ పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ అవసరం. వీటివల్ల లావాదేవీలు ఈజీ అవుతున్నారుు. ⇔ వీటిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లిస్తున్నారుు. ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావటంతో పాటు లాయల్టీ పారుుంట్ల వంటివి ఆ వాలెట్లలోనే స్టోర్ అరుు ఉంటారుు. దీనివల్ల ఏ కొనుగోలుకు ఏ కార్డు వాడితే మంచిదని ఆలోచించే అవసరం ఉండదు. మొబైల్ వాలెట్లు అవసరమా?! ఇటీవలే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంస్థ ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ను అందుబాటులోకి తెచ్చింది. అంటే మీకు వివిధ బ్యాంకుల్లో ఎన్ని ఖాతాలున్నా... అన్నిటినీ ఒకే మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇప్పటికే 29 బ్యాంకుల వరకూ దీని పరిధిలోకి చేరారుు. మరో ఏడాది కాలంలో దేశంలోని బ్యాంకులన్నీ దీని పరిధిలోకి వస్తాయన్నది ఎన్పీసీఐ మాట. అదే జరిగితే అపుడు యూపీఐతో అన్ని బ్యాంకింగ్, మర్చెంట్ లావాదేవీలనూ 365 రోజులూ, 24 గంటలూ అందుకోవచ్చు. అదే జరిగితే మొబైల్ వాలెట్ల అవసరమే ఉండదన్నది కొందరు నిపుణుల మాట. అరుుతే దేశంలో ఇప్పటికీ బ్యాంకుల మొహం చూడనివారు 23 కోట్లకు పైగా ఉన్నారని, వారంతా మొబైల్ వాలెట్లతోనే బ్యాంకింగ్ లావాదేవీలు చేయాల్సి ఉంటుందన్నది వాలెట్ కంపెనీల మాట. అరుుతే బ్యాంకులు సొంత అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చి, అన్ని కార్యకలాపాలకూ అనుమతిస్తున్న తరుణంలో మున్ముందు మొబైల్ వాలెట్ల మనుగడ ఎలా అన్నది వేచి చూడాల్సిందే. చార్జీలెంత ఉంటారుు? చాలా మందికి ఒక ప్రశ్న మొదులుతుంది. ఈ మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఏమైనా చార్జీలుంటాయా? అని. నిజానికి ప్రస్తుతం చాలా మొబైల్ వాలెట్లు దాదాపు అన్ని లావాదేవీలనూ ఉచితంగానే ఆఫర్ చేస్తున్నారుు. బ్యాంకులు మాత్రం ప్రతి చెల్లింపునకూ ఎంతో కొంత చార్జీ విధిస్తున్నారుు. ఓపెన్, క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ వాలెట్లలో మనం వేసిన నగదుపై ఎలాంటి వడ్డీ ఉండదు కనక ఈ సంస్థలు దాన్ని లిక్విడ్ ఫండ్సలో పెట్టినా కొంత వడ్డీ వస్తుంది. అది ఆయా సంస్థల ఖర్చులకు కొంతవరకూ కలిసొస్తుందని, అరుుతే చాలా వాలెట్లు ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టులు పెడుతున్న పెట్టుబడులపై ఆధారపడుతున్నారుు. కనుక సరైన ఆదాయ మార్గాలను వెదకటం లేదన్నది కొందరు నిపుణుల మాట. అరుుతే త్వరలో వీటిక్కూడా లాభార్జన ఒత్తిడి పడుతుంది. అపుడు ఇవి కూడా ఎంతో కొంత చార్జీలు వసూలు చేయక తప్పదు. ప్రస్తుతం కస్టమర్లను సంపాదించటం, డౌన్లోడ్లను పెంచుకోవటంపైనే దృష్టి పెట్టిన ఈ వాలెట్లు... మున్ముందు ఆదాయం కోసం చార్జీలు వేయటం మొదలుపెడితే... అపుడు ఎంతమంది కస్టమర్లు నిలుస్తారన్నదే అసలైన ప్రశ్న. అరుుతే అటు బ్యాంకులూ చార్జీలు వసూలు చేసి, ఇటు వాలెట్లు కూడా అదే తీరులో వసూళ్లు మొదలుపెడితే... ఏది తక్కువో చూసుకుని వాడుకోవాల్సిన బాధ్యత కస్టమర్లదే!!. -
హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ పేమెంట్స్ అండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం.. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం వినియోగదారులు హిందుస్తాన్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేషన్స్‌లో పేటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. అంటే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో బండికి పెట్రోల్/డీజిల్ పట్టించుకొని జేబులో నుంచి డబ్బులు (నగదు) ఇవ్వాల్సిన అవసరం లేకుండా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్స్‌ను సులభతరం చేయడమే తమ లక్ష్యమని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. -
పేటీఎం చేతికి నియర్డాట్ఇన్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ పేటీఎం తాజాగా హోమ్ సర్వీసెస్ యాప్ నియర్డాట్ఇన్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 1.5- 2 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. రిపేర్లు, హోమ్ సర్వీసులు, ఫిట్నెస్, ఫొటోగ్రఫీ మొదలైన సర్వీసులు అందించే సంస్థలను, యూజర్లను అనుసంధానించే లక్ష్యంతో నియర్డాట్ఇన్ గతేడాది డిసెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించింది. దీని మాతృసంస్థ థంబ్స్పాట్ ఏడాది క్రితం రూ. 1.8 కోట్ల మేర నిధులు దక్కించుకుంది. స్థానిక సేవల మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ తమకు ఉపయోగపడగలదని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి పేర్కొన్నారు.