ఏటీఎంలెందుకు..?వాలెట్లో వేద్దామా!! | Paytm transactions and money transfer's in mobile walltes | Sakshi
Sakshi News home page

ఏటీఎంలెందుకు..?వాలెట్లో వేద్దామా!!

Published Mon, Nov 14 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

ఏటీఎంలెందుకు..?వాలెట్లో వేద్దామా!!

ఏటీఎంలెందుకు..?వాలెట్లో వేద్దామా!!

మోదీని హీరోలా పొగిడేస్తున్న మొబైల్ వాలెట్ సంస్థలు
లావాదేవీలు బీభత్సంగా పెరిగాయంటూ ప్రకటనలు
మున్ముందు మరింత పెరుగుతాయంటూ అంచనాలు
వాలెట్లను ఆశ్రరుుస్తే లైన్ల బాధ కొంతరుునా తప్పుతుంది
ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అవగాహన ఉంటే బెటర్
తరచూ బ్యాంకుకు వెళ్లటాన్ని తప్పించుకోవచ్చు
భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా మంచివేనంటున్న నిపుణులు
ఓపెన్ వాలెట్లలో తప్ప మిగతా వాటిలో విత్‌డ్రాకు వీలుండదు
నేరుగా డిపాజిట్ కూడా చేయలేం; ఆన్‌లైన్లో చేయాల్సిందే
డబ్బు ఎన్నాళ్లుంచినా వీటిపై పైసా కూడా వడ్డీ రాదు
మున్ముందు ఇవి కూడా లావాదేవీలు ఛార్జీలు వేసే అవకాశం

నవంబర్ 8 అర్ధరాత్రి!!.ప్రధానమంత్రి ప్రకటనతో...ఆ క్షణం దాకా చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు చెల్లకుండా పోయారుు. నవంబర్ 9 ఉదయం!! పలు పత్రికల్లో నరేంద్రమోదీ ఫోటో పెట్టి మరీ మొబైల్ వాలెట్ సంస్థ ‘పేటీఎం’ ప్రకటనలు. డిజిటల్ మనీకి దారులు తెరుస్తున్న మోదీకి అభినందనలు కూడా అందులోనే.

అంతేకాదు!! ఆ రోజు మధ్యాహ్నానికల్లా... ఎఫ్‌ఎం రేడియో, టీవీ, సోషల్ మీడియా అన్నిటా పేటీఎం, మొబీ క్విక్, ఫ్రీచార్జ్ వంటి మొబైల్ వాలెట్ల ప్రచార విజృంభణ మొదలైంది. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు సైతం నగదు లేకుండా ప్రయాణం చేయటానికి తమ వ్యాలెట్లు వాడాలంటూ  హోరెత్తించేశారుు.

నవంబర్ 10 ఉదయం... తమ యాప్ డౌన్‌లోడ్ల సంఖ్య 200 శాతం పెరిగిందని, లావాదేవీల సంఖ్య 250 శాతం పెరిగిందని పేటీఎం ప్రకటించింది. తమ వ్యాలెట్ రీచార్జ్‌లు ఆ ఒక్కరోజే ఏకంగా 1,500 శాతం పెరిగినట్లు ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా మనీ ప్రకటించింది. ఇంకా మొబీక్విక్, ఫ్రీచార్జ్ కూడా ఇలాంటి ప్రకటనలే చేశారుు.

ఇన్ని జరుగుతున్నా... అసలు మొబైల్ వాలెట్ అంటే ఏంటో!! ఎలక్ట్రానిక్ లావాదేవీలంటే ఏంటో తెలియని జనం... పర్సుల్లో ఉన్న పెద్ద నోట్లు చెల్లక, ఏటీఎంలు పనిచేయక, బ్యాంకుల్లో చాంతాడంత లైన్లలో నిల్చోలేక నానా యాతనలు పడుతూనే ఉన్నారు. బిల్లులు చెల్లించడానికి పాత నోట్లు ఇవ్వవచ్చని కొన్ని ప్రభుత్వ సంస్థలు వెసులుబాటు కల్పించటంతో అక్కడ కూడా లైన్లలో నిల్చోక తప్పలేదు వారికి.

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటుంది. పూర్తిగా కాకపోరుునా... మొబైల్ వాలెట్లను వాడితే వీటిలో కొన్ని కష్టాలరుునా తప్పేవి. ఎలక్ట్రానిక్ లావాదేవీలు అలవాటైన వారు కొన్ని చెల్లింపులైనా ఉన్న చోటు నుంచే చేయగలిగేవారు.

నిజానికి అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో డిజిటల్ లావాదేవీలపై అందరికీ అవగాహన ఎక్కువ కనక అక్కడ చిన్నచిన్న లావాదేవీలూ ఎలక్ట్రానిక్ లేదా మొబైల్ మనీతో పూర్తి చేసేయొచ్చు. పర్సులో కరెన్సీ లేకున్నా రోజులు గడిపేయొచ్చు. కానీ అత్యధిక శాతం కిరాణా షాపుల యజమానుల నుంచి వాటిని వాడే కస్టమర్లు కూడా నిరక్షరాస్యులే అరుున భారతదేశంలో అది సాధ్యమా? డిజిటల్ మనీని పూర్తి స్థారుులో అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని జనం స్వాగతిస్తారా? కరెన్సీ లేకుండా రోజును ఊహించుకోగలమా? ఒక్క మాటలో చెప్పాలంటే సాధ్యం కాకపోవచ్చు.

కానీ క్రమంగా ఈ-లావాదేవీల సంఖ్య పెరుగుతోందన్నది మాత్రం కాదనలేని నిజం. అది సరే! నగదు అవసరం లేకుండా కొన్ని లావాదేవీలనైనా జరపటానికి అవకాశం కల్పిస్తున్న ఈ మొబైల్ వాలెట్ల సంగతేంటి? కాస్తరుునా సౌలభ్యాన్నిస్తున్న ఈ ఫోన్ వాలెట్లతో లాభమేనా? ఎలక్టాన్రిక్ లావాదేవీలు అసలు మంచివేనా? సురక్షితమేనా? సాధా రణ ప్రజలకు వీటితో లాభ నష్టాలేంటి? ఇతరత్రా వివరాలను తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం...

సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
ఎందుకీ మొబైల్ వాలెట్లు?
మనలో చాలా మందికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసు. అరుుతే తెలియని వారూ లేకపోలేదు. మనకు బ్యాంకులో ఉన్న ఖాతాను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవటానికి వీలు కల్పించేదే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ప్రతి ఖాతాదారుకూ తన సొంత ఐడీ, పాస్‌వర్డ్ ఉంటారుు. వాటిని మనకు ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచీకి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా వేరే ఖాతాలోకి నగదు బదిలీ చేయటం... క్రెడిట్ కార్డుతో పాటు బీమా, కరెంటు, టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించటం, స్థానిక సంస్థల పన్నులు చెల్లించటం వంటివి చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... దాదాపు ఏ చెల్లింపరుునా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు.

ఇటీవల ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ వేసిన అంచనాల ప్రకారం దేశంలో ఇప్పటికీ 23.3 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకింగ్ సౌకర్యమే లేదు వారికి. కాకపోతే వీళ్లలో చాలా మందికి మొబైల్ ఫోన్లున్నారుు. ఇలాంటి వారికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవటానికి కొన్ని మొబైల్ వాలెట్లు ఉపయోగపడుతున్నారుు. ఎరుుర్‌టెల్, వొడాఫోన్, రిలయన్‌‌స జియో వంటి టెలికం సంస్థలు తెచ్చిన వాలెట్లతో... అన్ని రకాల లావాదేవీలూ జరుపుకోవచ్చు. ఇంకో విశేషమేంటంటే... పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్ వంటి ఏ వాలెట్లో డబ్బులు డిపాజిట్ చేయటానికై నా మీకో లేదా మీ బంధుమిత్రులకో ఆన్‌లైన్ బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండి తీరాలి. వాటిలోంచే ఈ వాలెట్లలో నగదు డిపాజిట్‌కు వీలుంటుంది. కానీ టెల్కోల వాలెట్లలో నగదు వేయాలంటే నేరుగా ఆయా సంస్థలకు చెందిన ఔట్‌లెట్లలోకి వెళ్లి, నగదు చెల్లించొచ్చు.

టెలికం సంస్థల వాలెట్లివీ...
ఎరుుర్‌టెల్‌కు చెందిన ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్‌కు చెందిన వొడాఫోన్ ఎం పెసా, ఐడియా మనీ, జియో మనీ ఈ కోవలోకి వస్తారుు. వీటన్నిట్లోనూ చూస్తే రిలయన్‌‌సకు చెందిన జియో మనీకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే దేశవ్యాప్తంగా రిలయన్‌‌సకు చెందిన జియో స్టోర్లతో పాటు రిలయన్‌‌స ఫ్రెష్, రిలయన్‌‌స డిజిటల్ దుకాణాల్లోనూ నగదు చెల్లించి జియో మనీలో డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే... రిలయన్‌‌సకున్న రిటైల్ నెట్‌వర్క్ దానికి ఈ రకంగా కలిసొచ్చిందన్న మాట.

 బ్యాంకులకూ ఉన్నాయ్ వాలెట్లు!!
నిజం చెప్పాలంటే వాలెట్లతో చేసే ప్రతి పనినీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో కూడా చెయ్యొచ్చు. కాకపోతే ప్రతిసారీ బ్యాంకు ఖాతాలో ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇపుడు ఇలాంటి అవసరమేదీ లేకుండా బ్యాంకులు సైతం తమ సొంత మొబైల్ వాలెట్లను తెస్తున్నారుు. ఎస్‌బీఐ ‘బడ్డీ’, ఐసీఐసీఐ ‘ఐ-మొబైల్’, హెచ్‌డీఎఫ్‌సీ ‘పే జాప్’ ఇవన్నీ ఇలాంటివే. వీటిని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే అన్ని లావాదేవీలూ మిగతా మొబైల్ వాలెట్ల మాదిరే చేసుకోవచ్చు. కాకపోతే ముందే చెప్పుకున్నట్లు... దేశంలో బ్యాంకింగ్ సదుపాయం లేనివారు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తెలియనివారు కోట్ల మంది ఉన్నారు. వారందరి ఆదరణే ఈ మొబైల్ వాలెట్ల బలం.

 ఎన్ని రకాలున్నాయంటే...
రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు. క్లోజ్డ్... సెమీ క్లోజ్డ్, ఓపెన్.

క్లోజ్డ్ వాలెట్ అంటే కంపెనీలు సొంతగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్... ఇలా చాలా ఆన్‌లైన్ కంపెనీలు తమ సొంత వాలెట్లు అందిస్తున్నారుు. అంటే వీటిలో డబ్బు వేసుకుని, వీటిలో వస్తువులే కొనాలి. ఇవి పూర్తిగా ఆయా కంపెనీల పరిధిలో ఉంటారుు కనక వీటికి ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ క్లోజ్డ్ వాలెట్లను ఆఫర్ చేస్తున్నారుు.

లాభాలు: కంపెనీలు తమ వాలెట్ ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటారుు.

కంపెనీల వాలెట్లు గనక వీటిలో వేసే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు.

నష్టాలు: వీటిలోనే లావాదేవీలు జరపాలి. వేరే కంపెనీల్లో తక్కువ ధరకు వస్తువులు వస్తున్నా ఈ డబ్బుతో కొనలేం. ఉదాహరణకు మీకు ఓలా మనీలో డబ్బులున్నారుు. కానీ మీకు క్యాబ్ కావాల్సి వచ్చినపుడు దగ్గర్లో ఓలా క్యాబ్‌లు లేవు. ఏ ఉబెర్ నుంచో బుక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీ ఓలా మనీ అక్కరకు రానట్టే కదా!!.

ఇక ఈ-కామర్స్ సంస్థల విషయానికొస్తే మీకు ఒక కంపెనీ వాలెట్లో డబ్బులున్నారుు. ఏదైనా కొనాలంటే వివిధ ఈ-కామర్స్ సైట్లను చూడటం అందరూ చేసేదే. అపుడు మనకు డబ్బులున్న సంస్థ కాకుండా వేరే సంస్థ తక్కువ ధరకు ఆఫర్ చేస్తే పరిస్థితేంటి?

డబ్బును వేయటమే తప్ప విత్‌డ్రా చెయ్యటానికి వీలుండదు. ఎలాంటి వడ్డీ రాదు.

 సెమీ క్లోజ్డ్ వాలెట్లలో డబ్బులు వేస్తే వీటిని ఇతర ఆన్‌లైన్ సైట్లలోనూ వాడొచ్చు. అరుుతే ఈ వాలెట్‌ను నిర్వహిస్తున్న కంపెనీకి ఏఏ సంస్థలతో ఒప్పందాలున్నాయో వాటిలోనే లావాదేవీలు జరిపే వీలుంటుంది. పేటీఎం, మొబిక్విక్, పేయు, సిట్రస్ క్యాష్, ఆక్సిజన్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఇలాంటివే.

 లాభాలు: ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సెమీ క్లోజ్డ్ వాలెట్ల  ద్వారా యుటిలిటీ బిల్లులు, అత్యవసర సర్వీసులకు చెల్లింపులు చేయొచ్చు.

వీటితో ఒప్పందం ఉన్న కంపెనీలే కాదు, వాలెట్ సంస్థలు కూడా తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ఇస్తుంటారుు. వాటిని అవకాశాన్ని బట్టి వాడుకుంటే లాభమే.

 నష్టాలు: బిల్లుల చెల్లింపుల పరిమితి రూ.10వేల లోపే. అంటే రూ.10వేలకన్నా ఎక్కువ దీన్లో డిపాజిట్ చేయలేం. అంతకన్నా ఎక్కువ అవసరమైతే ఆ లావాదేవీల్ని దీంతో చెయ్యలేం.

డిపాజిట్ చేస్తే తిరిగి వెనక్కి తీసుకోలేం. ఎలాంటి వడ్డీ రాదు.

 ఓపెన్ వాలెట్లు ఒకరకంగా బ్యాంకు ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా సహా బిల్లుల చెల్లింపు, ఈ-కామర్స్ లావాదేవీలు ఏవైనా చేయొచ్చు. వీటిలో  సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తారుు. ఉదాహరణకు వొడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ సంస్థ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంకుతో జియో మనీ ఒప్పందం చేసుకుంది. ఎరుుర్ టెల్ మనీ, టాటా టెలీ ఎం రుపీ కూడా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారుు. ఇక గతేడాదే పేటీఎం, ఎరుుర్‌టెల్, రిలయన్‌‌స, వొడాఫోన్ వంటివి పేమెంట్ బ్యాంక్ లెసైన్సును పొందారుు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వ్యాలెట్లతో నిర్వహించే లావాదేవీ విలువ రూ.50వేలు మించకూడదు.

డిజిటల్ వాలెట్లతో లాభాలివీ..
నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపిన ప్రతిసారీ అలా జరిపిన వ్యక్తి ఐడెంటిటీ బయటపడుతుంటుంది. కార్డులు, ఖాతాల నంబర్లు తెలుస్తుంటారుు. డిజిటల్ వాలెట్లతో ఆ సమస్య ఉండదు.

డిజిటల్ వాలెట్ పాస్‌వర్డ్ వేరొకరికి తెలిసిపోరుునా జరిగే నష్టం... అందులో ఉన్న సొమ్ముకు మాత్రమే పరిమితమవుతుంది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ అవసరం. వీటివల్ల లావాదేవీలు ఈజీ అవుతున్నారుు.

వీటిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లిస్తున్నారుు. ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావటంతో పాటు లాయల్టీ పారుుంట్ల వంటివి ఆ వాలెట్లలోనే స్టోర్ అరుు ఉంటారుు. దీనివల్ల ఏ కొనుగోలుకు ఏ కార్డు వాడితే మంచిదని ఆలోచించే అవసరం ఉండదు.

మొబైల్ వాలెట్లు అవసరమా?!
ఇటీవలే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సంస్థ ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ను అందుబాటులోకి తెచ్చింది. అంటే మీకు వివిధ బ్యాంకుల్లో ఎన్ని ఖాతాలున్నా... అన్నిటినీ ఒకే మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇప్పటికే 29 బ్యాంకుల వరకూ దీని పరిధిలోకి చేరారుు. మరో ఏడాది కాలంలో దేశంలోని బ్యాంకులన్నీ దీని పరిధిలోకి వస్తాయన్నది ఎన్‌పీసీఐ మాట. అదే జరిగితే అపుడు యూపీఐతో అన్ని బ్యాంకింగ్, మర్చెంట్ లావాదేవీలనూ 365 రోజులూ, 24 గంటలూ అందుకోవచ్చు.

అదే జరిగితే మొబైల్ వాలెట్ల అవసరమే ఉండదన్నది కొందరు నిపుణుల మాట. అరుుతే దేశంలో ఇప్పటికీ బ్యాంకుల మొహం చూడనివారు 23 కోట్లకు పైగా ఉన్నారని, వారంతా మొబైల్ వాలెట్లతోనే బ్యాంకింగ్ లావాదేవీలు చేయాల్సి ఉంటుందన్నది వాలెట్ కంపెనీల మాట.  అరుుతే బ్యాంకులు సొంత అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చి, అన్ని కార్యకలాపాలకూ అనుమతిస్తున్న తరుణంలో మున్ముందు మొబైల్ వాలెట్ల మనుగడ ఎలా అన్నది వేచి చూడాల్సిందే.

చార్జీలెంత ఉంటారుు?
చాలా మందికి ఒక ప్రశ్న మొదులుతుంది. ఈ మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఏమైనా చార్జీలుంటాయా? అని. నిజానికి ప్రస్తుతం చాలా మొబైల్ వాలెట్లు దాదాపు అన్ని లావాదేవీలనూ ఉచితంగానే ఆఫర్ చేస్తున్నారుు. బ్యాంకులు మాత్రం ప్రతి చెల్లింపునకూ ఎంతో కొంత చార్జీ విధిస్తున్నారుు. ఓపెన్, క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ వాలెట్లలో మనం వేసిన నగదుపై ఎలాంటి వడ్డీ ఉండదు కనక ఈ సంస్థలు దాన్ని లిక్విడ్ ఫండ్‌‌సలో పెట్టినా కొంత వడ్డీ వస్తుంది. అది ఆయా సంస్థల ఖర్చులకు కొంతవరకూ కలిసొస్తుందని, అరుుతే చాలా వాలెట్లు ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టులు పెడుతున్న పెట్టుబడులపై ఆధారపడుతున్నారుు.

కనుక సరైన ఆదాయ మార్గాలను వెదకటం లేదన్నది కొందరు నిపుణుల మాట. అరుుతే త్వరలో వీటిక్కూడా లాభార్జన ఒత్తిడి పడుతుంది. అపుడు ఇవి కూడా ఎంతో కొంత చార్జీలు వసూలు చేయక తప్పదు. ప్రస్తుతం కస్టమర్లను సంపాదించటం, డౌన్‌లోడ్లను పెంచుకోవటంపైనే దృష్టి పెట్టిన ఈ వాలెట్లు... మున్ముందు ఆదాయం కోసం చార్జీలు వేయటం మొదలుపెడితే... అపుడు ఎంతమంది కస్టమర్లు నిలుస్తారన్నదే అసలైన ప్రశ్న. అరుుతే అటు బ్యాంకులూ చార్జీలు వసూలు చేసి, ఇటు వాలెట్లు కూడా అదే తీరులో వసూళ్లు మొదలుపెడితే... ఏది తక్కువో చూసుకుని వాడుకోవాల్సిన బాధ్యత కస్టమర్లదే!!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement