పేటీఎం చేతికి నియర్‌డాట్‌ఇన్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ పేటీఎం తాజాగా హోమ్ సర్వీసెస్ యాప్ నియర్‌డాట్‌ఇన్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 1.5- 2 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. రిపేర్లు, హోమ్ సర్వీసులు, ఫిట్‌నెస్, ఫొటోగ్రఫీ మొదలైన సర్వీసులు అందించే సంస్థలను, యూజర్లను అనుసంధానించే లక్ష్యంతో నియర్‌డాట్‌ఇన్ గతేడాది డిసెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. దీని మాతృసంస్థ థంబ్‌స్పాట్ ఏడాది క్రితం రూ. 1.8 కోట్ల మేర నిధులు దక్కించుకుంది. స్థానిక సేవల మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ తమకు ఉపయోగపడగలదని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి పేర్కొన్నారు.