పేటీఎంలో పెట్టుబడులకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 20% వాటాలు కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీసీఐ ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పేటీఎంలో 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 9,079 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ మే నెలలో వెల్లడించింది.