మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్‌ | Major Fire Breaks Out In Cotton Godown In Medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్‌

Published Sat, Nov 30 2024 5:04 PM | Last Updated on Sat, Nov 30 2024 6:56 PM

Major Fire Breaks Out In Cotton Godown In Medchal

మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూడూరు గ్రామంలోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పత్తి నిల్వ చేసిన గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 గోడౌన్‌ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయ్నతం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్‌ కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement