కోకాపేట జీఏఆర్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరగలేదు: ఏసీపీ | Major Fire Breaks Out At Kokapet GAR Building | Sakshi
Sakshi News home page

కోకాపేట జీఏఆర్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరగలేదు: ఏసీపీ

Published Sat, Mar 15 2025 6:15 PM | Last Updated on Sat, Mar 15 2025 7:35 PM

Major Fire Breaks Out At Kokapet GAR Building

కోకాపేట జీఏఆర్‌ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట జీఏఆర్‌ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. బిల్డింగ్‌లో రెస్టారెంట్ పనులు జరుగుతున్నాయని.. గ్యాస్‌ లీక్‌ అయ్యిందని తెలిపారు. దీంతో గ్యాస్ పీల్చి కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. వారిని వారిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నార్సింగి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, మొదట కోకాపేట జీఏఆర్‌ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో పలువురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారంటూ ప్రచారం జరిగింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్డింగ్‌లో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement