
61 అంతస్తులతో అత్యంత ఎత్తయిన భవనం
సాక్షి, హైదరాబాద్: ఆకాశహర్మ్యాలతో అంతర్జాతీయ నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ఆకాశసౌధం ఆవిష్కృతం కానుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక అంతస్తులు కలిగిన భవనాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సింక్ అనే సంస్థ 61 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.
సుమారు 7.19 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. 5 టవర్లలో అన్నీ 4 పడకగదులు ఉన్న ఫ్లాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒక్కో ఫ్లాట్ 3,600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. ‘వాక్ టు వర్క్’ కాన్సెప్ట్ తరహాలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణాదిలో ఇప్పటివరకు 59 అంతస్తుల నిర్మాణమే (క్యాండియర్ స్కైలైన్) పెద్దది కాగా.. ఇప్పుడు 61 అంతస్తుల అత్యంత ఎత్తయిన టవర్ హైదరాబాద్‌లో రానుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment