floors
-
అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదో ఫ్లోర్ నుంచి దూకి..
చైనాలో దారుణం జరిగింది. అమ్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఓ బాలుడు(6) ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకేశాడు. బయటకు వెళ్లకూడదని కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ వస్తున్న తల్లిని చూసి పిల్లాడు ఆందోళన చెంది భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో తల్లి తన కుమారునితో జీవిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడు అల్లరితో విసుగు తెప్పిస్తున్న క్రమంలో తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలున్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది. ఓ కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ బాలుని వైపు వచ్చింది. అమ్మ తిడుతుందనే భయంతో బాలుడు ఐదు ఫ్లోర్ల భవనంపై భాగం నుంచి దూకేశాడు. అక్కడే ఉన్నవారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఫైరయ్యారు. పిల్లల రక్షణకు మరిన్ని చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
30, 35, 42 నింగిని తాకే నిర్మాణాలు
• 30.. ఆపైన అంతస్తుల్లో నివాసానికి కస్టమర్ల మొగ్గు • నిర్మాణానికి సిద్ధంగా 50కి పైగా ప్రాజెక్ట్‌లు 20, 25, 30, 42.. ఇవి కేవలం అంకెలేం కావు.. నగరంలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల్లోని అంతస్తులు. ఒకప్పుడు 15 ఫ్లోర్ల భవనాలంటేనే అమ్మో అనిచూసే నగరవాసులిప్పుడు.. ఏకంగా 30 ఆపైన అంతస్తుల్లో నివాసానికే సై అంటున్నారు. దీంతో బిల్డర్లు ఎత్తై భవనాల నిర్మాణాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో భాగ్యనగరం ఆకాశహర్మ్యాలకు వేదికవుతోంది. సాక్షి, హైదరాబాద్ : స్థలాల లభ్యత క్రమంగా తగ్గుతుండటమే ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఈ తరహా నిర్మాణాలు కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో ఎప్పుడో మొదలయ్యాయి. కానీ, హైదరాబాద్‌లో ఎత్తై నిర్మాణాలకు బీజం పడింది మాత్రం 2006లోనే అని చెప్పాలి. ఎందుకంటే ఫ్లాట్ల విస్తీర్ణం, రోడ్డు వెడల్పును బట్టి నగరంలో ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని చేపట్టేందుకు వీలుగా 86 జీవోను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. అనుమతులూ త్వరగానే.. ఏటా నగరంలో ప్రభుత్వ విభాగాలు 8-10 వేలకు పైగా నిర్మాణాలకు అనుమతులిస్తున్నాయి. వీటిలో చిన్నా చితక నిర్మాణాలతో పాటు అపార్ట్మెంట్లు, ఆకాశహర్మ్యాలుంటాయి. నగరంలో ఇప్పటివరకు 20 అంతస్తుల భవంతులు తక్కువే. ఎత్తై భవనాల నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీ అనుమతితో పాటు అగ్నిమాపక ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), విమానాశ్రయ విభాగాల నుంచి కూడా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని రకాల అనుమతులు రావటానికి చాలా సమయం పట్టేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఒకే ఒక్క ఎన్ఓసీ విధానం, సత్వర అనుమతులకు ఆన్లైన్ విధానం తీసుకురావటం వంటి నిర్ణయాలు తీసుకోవటంతో నిర్మాణదారులు కూడా ఎత్తై నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 20 అంతస్తులకు మించినవి.. ప్రస్తుతం నగరంలో 20 అంతస్తులకు మించిన భవనాలను నిర్మించేందుకు 50కి పైగా ప్రాజెక్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇవి ఎక్కువగా పశ్చిమ ప్రాంతాల్లోనే వస్తున్నాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ, ఖాజాగూడ, కూకట్పల్లి, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు ఊపందుకున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హైటెక్ సిటీ సమీపంలో మరీనా స్కైస్ పేరిట 31 అంతస్తుల్లో, గచ్చిబౌలిలో సుమధుర సంస్థ అక్రోపొలిస్ పేరిట 31 అంతస్తుల్లో నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి. ఇవే కాకుండా లోధా గ్రూప్ 42, ల్యాంకోహిల్స్ 36, సాకేత్ ఇంజనీర్స్ 25, మంజీరా 23, మంత్రి 24 అంతస్తుల్లో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ. దీంతో స్థలం ఉన్న చోట్ల సాధ్యమైనంత ఎత్తులో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాల్లో స్థలాల లభ్యత ఎక్కువే కానీ, కొనుగోలుదారుల ఆసక్తి మేరకు ఆయా ప్రాంతాల్లోనూ 60 మీటర్ల కంటే ఎత్తై నిర్మాణాలొస్తున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే.. ఇదిలా ఉంటే ఆకాశహర్మ్యాలు నిర్మించాలంటే నిర్మాణానికి తగ్గట్టుగానే పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని బిల్డర్లు చెబుతున్నారు. స్థలాల కొరత ఉన్న మహానగరాల్లో ఈ నిర్మాణాలే పరిష్కారమార్గమని సూచిస్తున్నారు. ఎత్తై నిర్మాణాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఉండేలా నిర్మాణంలో నాణ్యత పాటించడం ఆవశ్యకం. మరోవైపు ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు 6వ అంతస్తు పైనుంచి ప్రతి చ.అ.కు రూ.10-15 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 10 అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది. ఎత్తులో నివాసముంటే.. ⇔ ఆకాశహర్మ్యాల్లో నివాసముంటే అనుకూల, ప్రతికూలాలున్నాయి. ⇔ పై అంతస్తుల్లో నివసించే వారు బాల్కనీలోంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ⇔ గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి. ⇔ పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ⇔ పర్యావరణ సమస్యలు, ధ్వని కాలుష్యం ఉండదు. ⇔ పై అంతస్తులో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగం పెరిగి.. బిల్లూ పెరుగుతుంది. ⇔ తరచూ ఇళ్లు మారేవారికి సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉంటుంది. -
వెలగపూడిలో 3 నుంచి పూర్తి స్థాయి విధులు
* భవనాలు, అంతస్తులు, గదుల వారీగా శాఖలకు కేటాయింపు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంతో పెనవేసుకున్న అనుబంధం వచ్చే నెల 3వ తేదీ నుంచి తెగిపోతోంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తూ వెలగపూడి సచివాలయంలో పనిచేసేందుకు వెళ్లిపోతున్న ఉద్యోగులు.. ఇందులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పూర్తి స్థాయి విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ జీవోతోపాటు వెలగపూడి సచివాలయ భవనాల్లో శాఖల వారీగా గదులను అధికారులకు కేటాయించారు. వివరాలివీ.. ఒకటో భవనం గ్రౌండ్ ఫ్లోర్: సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం గ్రౌండ్ ఫ్లోర్: మున్సిపల్, హోం, ఇంధన-మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం తొలి అంతస్తు: ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు, ఉద్యోగులు మూడో భవనం గ్రౌండ్ ఫ్లోర్: టెలికం, ప్లే స్కూలు, మీ-సేవ, పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, అసోసియేషన్స్, ఐటీ డేటా సెంటర్, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఏపీటీఎస్, లైబ్రరీలు మూడో భవనం తొలి అంతస్తు: బీసీ, మైనార్టీ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, యువజన సర్వీసు శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం తొలి అంతస్తు: ఉన్నత విద్య, ఐటీ, మాధ్యమిక విద్య, జలవనరులు, ఆర్ఎస్ఏడీ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం తొలి అంతస్తు: రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, డిప్యూటీ పే అండ్ అకౌంట్ ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు -
వైకల్యం కన్నా... స్నేహం మిన్న
దేవరకద్ర రూరల్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు... ఇద్దరూ ప్రాణ స్నేహితులు... ఇందులో ఒకరికి కళ్లులేవు. మరొకరికి బుద్ధిమాంధ్యం ఉంది. ఎప్పుడూ కలిసిమెలసి ఉండే వీరు స్నేహితుల దినోత్సవమైన ఆదివారం దేవరకద్ర నుంచి గద్దెగూడేనికి వె ళుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. వారిని పలకరించగా స్నేహబంధాన్ని వివరించారు. ఆస్తి, అంతస్తులు చూస్తున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే శారీరకలోపంతో సతమతమయ్యే తాము 30ఏళ్ల క్రితమే స్నేహితులుగా మారామన్నారు. మహబూబ్‌నగర్‌లోని టీడీగుట్టకు చెందిన మహబూబ్‌పాషా పుట్టుకతోనే అంధుడు, అదే ప్రాంతానికి చెందిన కృష్ణకు బుద్ధిమాంధ్యం ఉంది. అప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండరు. తన కళ్లతో కృష్ణ స్నేహితుడు మహబూబ్‌పాషాకు లోకాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా కృష్ణ భుజంపై చేయి వేసి నడుస్తాడు. యాచించిన డబ్బులను ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. వారు కలిసే తింటారు, ఉంటారు. వైకల్యం ముందు స్నేహం మిన్న అన్న చందంగా వీరు ముందుకు సాగుతున్నారు. కులమతాలు వేరైనా స్నేహానికి అవేమీ సాటిరావన్న నానుడిని నిజం చేస్తున్నారు. మనసుండాలే కాని స్నేహానికి కొదవలేదని చాటి చెబుతున్నారు.