Boy In China Jumps 5 Floors To Escape Mother Beating Him - Sakshi
Sakshi News home page

అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదు ఫ్లోర్లపై నుంచి దూకి..

Published Tue, Jul 4 2023 1:37 PM | Last Updated on Tue, Jul 4 2023 2:43 PM

Boy In China Jumps 5 Floors To Escape Mother Beating Him - Sakshi

చైనాలో దారుణం జరిగింది. అమ‍్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఓ బాలుడు(6) ఐదు ఫ్లోర్ల బిల్డింగ్‌ నుంచి దూకేశాడు. బయటకు వెళ్లకూడదని కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ వస్తున్న తల్లిని చూసి పిల్లాడు ఆందోళన చెంది భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో తల్లి తన కుమారునితో జీవిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడ‍ు అల్లరితో విసుగు తెప్పిస్తున్న క్రమంలో తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలున్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది. ఓ కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ బాలుని వైపు వచ్చింది. అమ్మ తిడుతుందనే భయంతో బాలుడు ఐదు ఫ్లోర్ల భవనంపై భాగం నుంచి దూకేశాడు. 

అక్కడే ఉన్నవారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఫైరయ్యారు. పిల్లల రక్షణకు మరిన్ని చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.  

ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement