కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది? | Is Telangana BJP Struggling With Leadership Crisis, More About Kishan Reddy BJP Work Shop | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?

Jun 1 2025 5:45 PM | Updated on Jun 1 2025 6:18 PM

IS Telangana BJP struggling with leadership crisis

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు ఇప్పుడు బయటపడిందా?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కొంతమంది నేతలకు పొసగడం లేదా?, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయా? అంటే అవుననక తప్పదు.

ఈ రోజు(ఆదివారం, జూన్ 1వ తేదీ) నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన  జరిగిన బీజేపీ వర్క్ షాపు చెప్పుకునేంత స్థాయిలో జరగలేదనేది అక్కడ హాజరైన నేతల తీరును బట్టే అర్థమవుతోంది. తప్పని సరిగా ఈ వర్క్ షాపుకు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలున్నా కొంతమంది నాయకులు వాటిని బేఖాతరు చేశారు.  

‘ఆ మీటింగ్ కు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?’ అన్న చందంగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులుకిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాపుకు హాజరుకాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పైకి ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలిస్తున్నప్పటికీకిషన్‌రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇందుకు మరింత  బలాన్ని చేకూరుస్తుంది.

ప్రధానంగా దీనికి  ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రఘునందన్ లు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. పదకొండు మంది ఎమ్మెల్సీలు,  ఎమ్మెల్యేలకు గాను మొత్తంగా నలుగురు మాత్రమే హాజరయ్యారు.

ఎంపీల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా,  ధర్మపురి అరవింద్, గోడం నగేశ్ లు వర్క్ షాపుకు దూరంగా ఉన్నారు.  ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉండగా, బీజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో  ఉన్నారు. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది. 

ఇదీ చదవండి:

‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement