సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 14,169 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజున గరిష్టంగా 11,876 మెగావాట్లగా నమోదైంది.
గత డిసెంబర్ నెలలో 13,403 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, తాజాగా 14,169 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మార్చి నెలలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు అయింది. ఈ సారి ఫిబ్రవరి నెలలోనే గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి 14169 మెగా వాట్ల విద్యుత్ నమోదైంది.
చదవండి: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment