సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు.
రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment