transco
-
ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.10 మంది డైరెక్టర్ల రాజీనామా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన డైరెక్టర్లు » టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్‌కో) » డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్కో) » సయ్యద్ రఫి (హెచ్ఆర్, ఐఆర్ – ఏపీ జెన్కో) » ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్కో) » సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్) » ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్) » వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్) » బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్) » టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్) » కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్) -
ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్, ట్రాన్స్మిషన్), డైరెక్టర్(ఫైనాన్స్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పోస్టులతోపాటు జెన్కో డైరెక్టర్ (జలవిద్యుత్), డైరెక్టర్ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), డైరెక్టర్ (కోల్–లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్–కమర్షియల్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్‌ల డైరెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్ సర్వీస్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్‌రంగ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది. -
‘విద్యుత్’ డైరెక్టర్లకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పిడీసీఎల్ తదితర సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్ అధికారులను నియమించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్సర్విస్, రిటైర్డ్ విద్యుత్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. ఈ సెలెక్షన్ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. అర్హతలు ఉంటేనే కొలువు గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్‌గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్ ఇంజనీర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్ ఇంజనీర్/చీఫ్ జనరల్ మేనేజర్/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు. పదవీకాలం రెండేళ్లే.. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఏడుగురు, టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, ఎన్పిడీసీఎల్లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ట్రాన్స్‌కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు ఇటీవల ట్రాన్స్‌కో జేఎండీగా ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్‌కుమార్ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్‌కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్ ఝాకు రెండో జేఎండీగా హెచ్ఆర్ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. -
జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
భారీగా విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఆగస్టు మొదటివారం నుంచి మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 31లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు లేక బోరుబావుల కింద ఉచిత విద్యుత్ బాగా వాడేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్దఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. దీంతో గతవారం రోజులుగా రాష్ట్రంలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 13వేల మెగావాట్లకు మించిపోయింది. ఈ నెల 11న అత్యధికంగా 13,829 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదేరోజు జాతీయస్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,28,963 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వేసవిలో డిమాండ్ ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. గత నెలాఖరులో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో అప్ప ట్లో రోజువారీగా రాష్ట్రస్థాయిలో గరిష్ట విద్యుత్ డి మాండ్ 8వేల మెగావాట్లలోపు మాత్రమే నమోదైంది. గత నెల 27న అయితే గరిష్ట డిమాండ్ ఏకంగా 6904 మెగావాట్లకు పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ త్వరలో 14వేల మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయని ట్రాన్స్‌కో యాజమాన్యం అంచనా వేస్తోంది. జల విద్యుదుత్పత్తిపై కరువు నీడలు కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 3000 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతి ఏటా తెలంగాణ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1000 ఎంయూలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 97 టీఎంసీలు, నాగార్జునసాగర్ నిండాలంటే 166 టీఎంసీల వరద ఎగవ నుంచి రావాలి. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. రోజూ రూ.30 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో గరిష్ట డిమాండ్ నెలకొని ఉండే వేళల్లో నిరంతర విద్యుత్ కొనసాగించడానికి పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పెద్దఎత్తున విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. రోజూ రూ.30 కోట్ల వ్యయంతో 60 ఎంయూల విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు తీవ్ర భారంగా మారాయి. -
ఏపీ ట్రాన్స్‌కోలో నకిలీ లేఖ కలకలం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కోలో నకిలీ లేఖ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ ఆదేశాల ప్రతులు నిజం కాదని, అదంతా తప్పుడు ప్రచారమని ట్రాన్స్‌కో అదనపు కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోమని చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు తాను రాసినట్లుగా చక్కర్లు కొడుతున్న లేఖ అబద్ధమని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కోకి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు ట్రాన్స్‌కో, ఇతర విద్యుత్ సంస్థల అధికారిక వెబ్సైట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటన ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఛీటింగ్ ‘మార్గం' మూత! -
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 9 సంవత్సరాలు.. రూ.97,321 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవి? -
సమ్మె ప్రభావం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. యూనియన్ నేతలు డిస్మిస్.. సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్‌రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు. సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్‌ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్‌కోలో 80 శాతంమంది, జెన్కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు. -
15,254 మెగావాట్ల గరిష్ట డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం ఉదయం 10:03 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 15,254 మెగావాట్లుగా నమోదైంది. విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. ఈ నెలలోనే నమోదైన 14,750 మెగావాట్ల పీక్ డిమాండ్‌ను మంగళవారం రాష్ట్రం అధిగమించింది. గతేడాది మార్చిలో 14,160 మెగావాట్లుగా పీక్ డిమాండ్ నమోదైంది. వేసవి మొదలవడంతో వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేస్తున్న పంటలకు నీటి సరఫరా కోసం రైతులు భారీగా విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సాగు విస్తీర్ణం పెరగడం కూడా విద్యుత్ వినియోగాన్ని పెంచింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ సైతం గణనీయంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రెండు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి 600 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో రోజువారీ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని విద్యుత్ సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి చివరి వరకు పీక్ విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో తెలిపింది. 13 రోజుల్లో రూ.600 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా విద్యుత్ సంస్థలు ఎఎక్స్చేంజి ల నుంచి భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ నెలలో గత 13 రోజుల్లో రూ. 600 కోట్ల వ్యయంతో 930 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. రోజుకు సగటున రూ. 45 కోట్ల వ్యయంతో 72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 4 వేల కోట్ల రుణాలను ప్రభుత్వ పూచికత్తుతో తీసుకోవడానికి అనుమతిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 3 వేల కోట్ల రుణం కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలో ఈ మేరకు రుణం విడుదల కానుంది. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్ రంగంలో జనరేషన్ (ఉత్పత్తి), ట్రాన్స్మిషన్ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్ మానిటైజేషన్) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్మిషన్ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఐదు ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. నామమాత్రపు బుక్ విలువ ఆధారంగా.. కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్‌కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్ విలువ ఆధారంగా బిడ్డింగ్ జరుగుతుంది. అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్‌కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి. -
‘చీకటి’ కథనాలు ఉత్తదే
సాక్షి, అమరావతి: ‘అప్పుల చీకట్లో డిస్కంలు’ శీర్షికతో ‘ఈనాడు’ అసంబద్ధ కథనాన్ని ప్రచురించటాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఖండించారు. 2022–23 ఆర్థ్ధిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఆగస్టు నాటికి నెలవారీ వాయిదా కింద చెల్లించాల్సిన అప్పులు రూ.24,838 కోట్లేనని చెప్పారు. డిస్కంల అప్పులు రూ.56 వేల కోట్లు దాటాయని అసత్యాలతో నిరాధార కథనాన్ని ప్రచురించటాన్ని తప్పుబడుతూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ, వివిధ శాఖలు, స్థానిక సంస్థలు వినియోగించిన విద్యుత్ చార్జీలను వసూలు చేయడం ద్వారా నెలవారీ అప్పులు, జీతభత్యాలు, ఇతర ఖర్చులను సకాలంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రిసిటీ లేట్ పేమెంట్ సర్‌చార్జీ (ఎల్పీఎస్) పథకంలో చేరి మొదటి వాయిదాగా గత నెలలో రూ.1,422 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 3 వరకు బకాయిలను పవర్ పీఎఫ్సీ, ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఈసీ) లిమిటెడ్ ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆలస్య రుసుము భారం నుంచి మినహాయింపు లభించి డిస్కంలకు ఆర్థికంగా కొంత మేర వెసులుబాటుగా ఉన్నట్లు తెలిపారు. -
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం !
-
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’నుంచి లావాదేవీలు జరపకుండా రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రూ.1,380 కోట్ల బకాయిలు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కంపెనీ (టీఎస్పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయని తెలిపింది. అవసరానికి కొనుగోళ్ల కోసం.. విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే సమయాల్లో రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రాప్తి పోర్టల్‌లో పేర్కొన్న బకాయిలన్నింటినీ చెల్లించామని, తమపై నిషేధాన్ని తొలగించాలని ఆయన పోసోకోకు లేఖ రాశారు. ప్రస్తుతానికి ప్రభావం తక్కువే! రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది. ఇక బిల్లులు చెల్లించకుంటే రాష్ట్రాలకు కరెంట్ కట్ కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంటుకు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. గత వేసవిలోనూ నిషేధం ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ సంస్థలకు సహకరించాలి. – డి.ప్రభాకర్‌రావు, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ -
విద్యుత్ సంస్థల్లో బదిలీలు షురూ
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో బదిలీల పర్వం మొదలైంది. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎండీ బీ శ్రీధర్ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటితో ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి, హెచ్ హరనాథరావు కూడా వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు వెల్లడించారు. వీటి ప్రకారం నేటి (4వ తేదీ) నుంచి బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. బదిలీలకు అర్హులైన వారి పేర్ల జాబితాను సంబంధిత కార్యాలయాల్లో శనివారం ప్రదర్శిస్తారు. దీంతో మొత్తం ఎంతమందికి బదిలీలు జరుగుతాయనేది స్పష్టంకానుంది. అందులో ఉన్నవారు డిస్కంల ఉద్యోగులైతే ఈ నెల 9లోగా.. జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులైతే ఈ నెల 10లోగా తమ అభ్యర్థనలను సమర్పించాలి. డిస్కంలలో బదిలీలు ఈ నెల 15కల్లా పూర్తికానుండగా, 16కల్లా జెన్కో, ట్రాన్స్‌కోలో చేస్తారు. అయితే, ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఈ నెల 23 వరకు గడువిచ్చారు. ట్రాన్స్‌కో, జెన్కోలో మార్గదర్శకాలిలా.. ప్రస్తుత పోస్టులో ఏప్రిల్ 30 నాటికి మూడేళ్ల పనికాలం పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. అయితే.. ఇదే తేదీకి విద్యుదుత్పత్తి కేంద్రం, కార్పొరేట్ కార్యాలయంలో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేస్తారు. ఇందులోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి మాత్రమే సీనియారిటీ ప్రకారం బదిలీ జరుగుతుంది. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలపై సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ కోరుకోవచ్చు లేదా నిలుపుకోవచ్చు. పరస్పర బదిలీ కావాలనుకునే వారు కనీసం ఏడాది పాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు ‘రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్’ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్లీ ఎనిమిదేళ్లకే అర్హులవుతారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారు బదిలీలకు అనర్హులు డిస్కంలలో నిబంధనలు ఇలా.. ప్రస్తుత ప్రాంతంలో ఐదేళ్లు, ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. మొత్తం అర్హుల్లో 100 శాతం మందికి బదిలీ జరుగుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయరు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పొందాలంటే రెండేళ్లు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోరాలంటే ఏడాదిపాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ పూర్తయిన తరువాత ఖాళీలను బట్టి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకే ఊర్లో సుదీర్ఘకాలం కుదరదు.. విద్యుత్ సంస్థల్లో గతంలో ఒకే ఊరిలో సెక్షన్, డివిజన్ కార్యాలయాలకు బదిలీ అయ్యేవారు. పోస్టులోకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనే దానిని బట్టి బదిలీ జరిగేది. కానీ, ఇప్పుడలా కుదరదు. ఒక ఊరిలో ఎన్నేళ్లు ఉన్నారనే దానినే తప్ప పోస్టులోకి వచ్చింది లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఒకే ఊరిలో పదేళ్లు, ఇరవై ఏళ్లు సర్వీసుచేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన నుంచి యూనియన్ల నాయకులతో సహా ఎవరికీ మినహాయింపులేదు. డిస్కంలలో బదిలీ పరిధిలోకి వచ్చే వారిలో 20 శాతం మందిని మాత్రమే గతంలో బదిలీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందినీ బదిలీ చేయనున్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ మగ్గిపోతున్న వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పరస్పర ఆమోదంతో బదిలీ కోరుకోవాలంటే పట్టణం నుంచి గ్రామానికి, లేదా గ్రామం నుంచి పట్టణానికి అనుమతిస్తారు. -
పోలీసులపై కోపం.. టౌన్ మొత్తం కరెంట్‌కట్
సాక్షి,పలమనేరు(తిరుపతి): ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అవమానించారని ఆగ్రహించిన ట్రాన్స్‌కో సిబ్బంది పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం శుక్రవారం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ఇటీవల పట్టణంలో జరిగిన గంగజాతరలో స్థానిక ముత్తాచారిపాళ్యానికి చెందిన రజని(58) కరెంట్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా స్థానిక లైన్‌మన్ ప్రకాష్, సచివాలయ పరిధిలో సిబ్బందిని శుక్రవారం స్థానిక స్టేషన్‌కు పిలిపించారు. వారు వెళ్లగానే వారి సెల్ఫోన్లను తీసిపెట్టుకుని అక్కడే వేచిఉండమని చెప్పారు. దీంతో వారు తమకి, కేసుకు ఏంటి సంబంధంమంటూ అడిగినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కాస్త దురుసుగా మాట్లాడడంతో, వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తమను అవమానించారని భావించిన ట్రాన్స్‌కో సిబ్బంది పట్టణంలో కరెంట్ సరఫరాను నిలిపేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆపై ట్రాన్స్‌కో ఏడీ చిన్నబ్బ, డీఎస్పీ గంగయ్య చర్చించి, ఈ విషయం పెద్దది కాకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఈవిషయమై ట్రాన్స్‌కో ఏడీ చిన్నబ్బను ‘సాక్షి’ వివరణ కోరగా తమ సిబ్బందిపట్ల పోలీసుల తీరు బాగోలేకనే వారు కరెంటు ఆఫ్ చేసినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్ స్పందిస్తూ.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రాన్స్‌కో సిబ్బందిని పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కాసేపు స్టేషన్లోనే కూర్చోబెట్టుకున్నామన్నారు. దీన్ని అవమానంగా భావించి పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్‌లో నోట్ల ముద్రణ -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
తెలంగాణలో ‘కరెంట్’కు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొండలా పేరుకు పోయిన రుణాలకు ప్రతినెలా వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తమ వల్ల కావట్లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మొత్తుకుంటున్నాయి. ప్రతినెలా రూ.1,200 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, లేకుంటే డిస్కంల నిర్వహణ సాధ్యం కాదని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్సిడీలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింతగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించి డిస్కంలను గట్టెక్కించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒత్తిళ్లు తట్టుకోలేక..: గత నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన ఓ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు డిస్కంల పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ప్రతినెలా డిస్కంల అప్పులపై వడ్డీల చెల్లింపు కోసం రూ.800 కోట్లు, జీతాల కోసం రూ.400 కోట్లు కలిపి రూ.1,200 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయంగా విడుదల చేయాలని కోరారని.. విద్యుత్ చార్జీలు పెంచడానికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే విద్యుత్ చార్జీల పెంపుపై మాత్రమే సీఎం సానుకూలంగా స్పందించారని.. అదనపు నిధులివ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చేసేదేమీ లేక ప్రభాకర్‌రావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని పేర్కొంటున్నాయి. బిల్లులు, బకాయిలు చెల్లించాలంటూ విద్యుదుత్పత్తి కంపెనీలు, రుణ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని.. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రభాకర్‌రావు కొద్దినెలలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, కానీ సీఎం అంగీకరించడం లేదని పేర్కొంటున్నాయి. రూ.20 వేల కోట్ల అప్పుల్లో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఏటేటా పెరిగిపోయి.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లను దాటినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్ పంపిణీ వ్యవస్థల (నెట్వర్క్) సామర్థ్యం పెంపునకు డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు చేశాయి. ప్రస్తుతం ప్రతినెలా వడ్డీల కిందనే రూ.800 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తలెత్తుతోంది. దీనితో కొంతకాలంగా ప్రతి నెలా బ్యాంకుల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చార్జీల పెంపుపై కసరత్తు రాష్ట్రంలో గత ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. విద్యుత్ చట్టం ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను, ఆదాయ, వ్యయాల అంచనా (ఏఆర్ఆర్) నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ వాటిని పరిశీలించి చార్జీల సవరణను ఆమోదిస్తుంది. అయితే డిస్కంలు గత మూడేళ్లుగా టారిఫ్ సవరణ, ఏఆర్ఆర్ నివేదికలను సమర్పించడమే లేదు. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలను గట్టెక్కించడం కోసం చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో.. ఆ ప్రక్రియ ముగిశాక ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆరేళ్లుగా చార్జీలు పెంచని నేపథ్యంలో ఈసారి గణనీయంగానే పెంపు ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కేటగిరీల వారీగా 10 శాతం నుంచి 20శాతం వరకు చార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయని వివరించాయి. అంతేగాకుండా గత ఆరేళ్లుగా వచ్చిన నష్టాలకు సంబంధించి ‘ట్రూఅప్’ చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయని.. దానికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి పెనుభారం పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించాయి. ప్రభుత్వం, ఈఆర్సీ అనుమతిస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఇప్పటికే సబ్సిడీల భారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర రాయితీ పథకాలు, ఎత్తిపోతల స్కీమ్‌లకోసం ప్రతినెలా డిస్కంలకు రూ.833.33 కోట్లు విడుదల చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లోరూ.10 వేల కోట్లు కేటాయిస్తోంది. డిస్కంలు కోరినట్టు ప్రతినెలా మరో రూ.1,200 కోట్ల చొప్పున ఇస్తే ఏడాదికి రూ.14,400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పులు, నష్టాలు పెరుగుతూ.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డిమాండ్‌కు తగినట్టుగా ఎక్కువ ధరతో విద్యుత్ కొని తక్కువ రేటుతో సరఫరా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాల పెంపుతోనూ డిస్కంలపై ఆర్థిక భారం పడింది. వివిధ కేటగిరీల కింద సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్ కంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ సొమ్ము తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఏటేటా నష్టాలు, అప్పులు పెరుగుతూ పోయాయి. -
ఇన్చార్జ్ సీఎండీల పాలనలో ట్రాన్స్‌కో, జెన్కో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్‌కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్‌రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు 2014 అక్టోబర్ నుంచి డి.ప్రభాకర్‌రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 22 వరకు ప్రభాకర్‌రావు సెలవు పొడిగించుకున్నారు. అక్టోబర్ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీధర్‌లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్‌రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్‌రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
‘లైన్మన్ల’ నియామకం నెలలో పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 2017లో జారీచేసిన నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ లైన్మన్ల నియామకాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించిన మరో ఏడు పిటిషన్లను కూడా కొట్టివేసింది. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్ల నియామకాలకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. లైన్మన్ల నియామకాల్లో 20 మార్కులు వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వెయిటేజీ మార్కులను సమర్థించింది. మరో ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఈ వివాదం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ముందుకు రాగా అది కూడా వెయిటేజీని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్..
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సరికొత్త హై టెన్షన్ లో సాగ్ (హెటీఎల్‌ఎస్) సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతోంది. ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచబోతోంది. కొత్తగా లైన్లు వేయకుండా, ఉన్న కారిడార్‌తోనే ఎక్కువ విద్యుత్ సరఫరా చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఎక్కువ కరెంట్ రావడమే కాకుండా, కొత్త లైన్లు వేసే అవసరం లేకపోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 2 జిల్లాల్లో చేసిన ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరికొన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కండక్టర్ల మార్పుతో రెట్టింపు వేగం విద్యుత్ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుత్ పంపిణీ లైన్ల సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే కొత్త కారిడార్లు వేయాలి. వ్యవసాయ భూముల్లోంచి విద్యుత్ లైన్లు వేయడం కష్ట సాధ్యంగా మారుతోంది. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో హెటీఎల్‌ఎస్ టెక్నాలజీపై ట్రాన్స్‌కో దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కారిడార్‌ను వాడుకుంటూనే కేవలం కండక్టర్‌ను మార్చడం ద్వారా రెట్టింపు విద్యుత్‌ను పంపేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. హెచ్‌టీఎల్‌ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కండక్టర్లు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అత్యధిక వేగంతో కరెంట్‌ను సరఫరా చేస్తాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు, వివిధ రకాలుగా లభిస్తున్న విద్యుత్‌ను గ్రిడ్‌పై ప్రతికూల ప్రభావం లేకుండా పంపిణీ చేయడానికి ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. రూ.100 కోట్ల వ్యయం.. హెటీఎల్‌ఎస్ టెక్నాలజీ కోసం ఏపీ ట్రాన్స్‌కో రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.15 కోట్లతో 13 కిలోమీటర్ల మేర 132 కేవీ కండక్టర్లు వేశారు. ఇవి మంచి ఫలితాన్నిచ్చాయి. రెండో దశలో విశాఖ, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు విద్యుత్ జోన్లలో కొత్త కండక్టర్లు వేయనున్నారు. 27 కిలోమీటర్ల మేర 220 కిలోవాట్ల సామర్థ్యంతో, 110 కిలోమీటర్ల మేర 132 కేవీ సామర్థ్యంతో హెటీఎల్‌ఎస్ కండక్టర్లు వేయబోతున్నారు. కాగా, విద్యుత్ లోడ్ తగ్గించడమే లక్ష్యంగా.. కొత్త టెక్నాలజీతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నట్లు ట్రాన్స్‌కో డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
లో వోల్టేజీకిక చెక్!
సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి విద్యుత్ బల్బులు డిమ్‌గా మారిపోవడం, ట్యూబ్‌లైట్లు ఆరిపోవడం, విద్యుత్ సరఫరా ఎక్కువ, తక్కువ కావడం వంటి సమస్యలు ఇక సమసిపోనున్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం విద్యుత్ లోవోల్టేజీ సమస్య తలెత్తదని అంటున్నారు. ఏపీ ట్రాన్స్‌కో రూ.6,610.5 కోట్ల వ్యయంతో 85 ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రపంచబ్యాంక్‌తో పాటు పలు ఆర్థిక సంస్థలు సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. ► సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, లైన్లు వేయడం కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ పెరిగినా లోవోల్టేజీ అన్న సమస్యే తలెత్తదు. ► రాష్ట్రంలో ఏటా 20 శాతం మేర విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పంపుసెట్లకు పీక్ అవర్స్‌లోనే విద్యుత్ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే లోడ్‌ను తట్టుకునేందుకు విద్యుత్ వ్యవస్థల బలోపేతం తప్పనిసరి. ► ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ► ఈ ప్రాజెక్టులకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే కొంత భాగానికి పాలనపరమైన అనుమతులు కూడా లభించాయి.