మీరు కంప్యూటర్ కొన్నారా...? అయితే, దానికి బీమా చేయించలేదా..? అయితే, మీ జీతం కట్ చేస్తాం..!
ట్రాన్స్‌కో సిబ్బందికి అధికారుల మెమోలు
సాక్షి, హైదరాబాద్: మీరు కంప్యూటర్ కొన్నారా...? అయితే, దానికి బీమా చేయించలేదా..? అయితే, మీ జీతం కట్ చేస్తాం..! మీ మీద క్రమశిక్షణాచర్యలు తీసుకుంటాం!! ఏంటి కంప్యూటర్‌కు బీమా చేయించకపోతే ఏకంగా క్రమశిక్షణ చర్యలా అని వాపోతున్నారా..? అవునండీ.. ట్రాన్స్‌కోలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ట్రాన్స్‌కో ఇచ్చిన రుణంతో కంప్యూటర్ కొనుగోలు చేసి... బీమా చేయించకపోతే జీతంలో కోత విధిస్తామని, చర్యలు తీసుకుంటామని సిబ్బందికి ట్రాన్స్‌కో అధికారులు మెమోలు జారీచేస్తున్నారు. ఈ విధంగా సుమారు వంద మందికిపైగా ఉద్యోగులకు వారం రోజుల క్రితం మెమోలు జారీ అయినట్టు సమాచారం. అయితే, రూ. 50 వేలు పెట్టి కంప్యూటర్ కొనుగోలు చేస్తే... బీమా చేయించేందుకు ఏడాదికి 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు.