తెలంగాణ రాష్ట్రంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీని ద్వారా 1948 ఏఈ ఉద్యోగాలు, 733 సబ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముంది. ఉద్యోగ ప్రకటనల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇప్పటి నుంచి సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఉద్యోగ సాధన తేలికే!
ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తిచేసిన వారు ఏఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వారికి 70 శాతం ఉద్యోగాలు, మిగిలిన బ్రాంచ్‌ల కూడా వారికి 30 శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉండొచ్చు. ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్ధులు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులు.
రాత పరీక్ష:
100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు.
కాన్సెప్టులు, విశ్లేషణ ఆధారిత ప్రశ్నలు:
ఇంజనీరింగ్ సిలబస్‌లోని కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తేనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
ఉదా: Ferranti effect in power system is due to?
1) Inductance 2) Capacitance
3) both Induction and Capacitance
4) Resistance, Inductance and Capacitance
Ans: 3
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు:
ఇంజనీరింగ్ కాన్సెప్టులను.. ఎక్కడ, ఎందుకు అనువర్తిస్తారు (అఞఞడ) అనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకుంటే ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు.
ఉదా:
Which of the following motor is used in Com-puter printers?
1) DC series motor 2) Universal motor
3) Stepper motor 4) Compound motor
Ans: 3
Trouble shooting, error corrections ప్రశ్నలు.. అప్లికేషన్స్‌లో.. ఏ ట్రబుల్స్ వస్తాయి? వాటిని ఎలా రికవరీ చేయాలి? లోపాలను ఎలా సరిచేయాలి? తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.
ఉదా:
If DC Shunt generator is failure to build up voltage then the reason is.....
1) Presence of Residual Magnetism
2) Reversily the field terminals
3) Speed is less than critical speed
4) either 2 or 3
Ans: 4
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో:
ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, ఎలక్ట్రికల్ మెషీన్లు, పవర్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్లు, కంట్రోల్ సిస్టమ్ వంటి అంశాలు ముఖ్యమైనవి. వీటిపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
జనరల్ ఆప్టిట్యూడ్‌పైనా ప్రశ్నలుంటాయి కాబట్టి న్యూ మరికల్ ఎబిలిటీ,రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రిపరేషన్‌కు ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, ఆబ్జెక్టివ్ స్టడీ మెటీరియల్, పాత ప్రశ్నపత్రాలను ఉపయోగించుకోవాలి.
సిలబస్ ఆధారంగా రోజువారీ ప్రణాళికను సిద్ధం చేసుకొని, దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుపై ఎంత పట్టు సాధించినా ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధనను ప్రాక్టీస్ చేయకపోతే ఫలితం ఉండదు. ఒక సబ్జెక్టును చదివిన తర్వాత, దానికి సంబంధించిన సూత్రాలను విడిగా రాసుకోవాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 500 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ నుంచి 25 శాతం, ఎలక్ట్రికల్ మెషీన్స్ నుంచి 25 శాతం, బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ల నుంచి 15 శాతం, మిగిలిన సిలబస్ నుంచి 35 శాతం మార్కులు రావొచ్చు.గత ఐఈఎస్, గేట్ ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. నాలుగైదు సబ్జెక్టులను చదివితే సరిపోతుందని అనుకోకుండా అన్ని సబ్జెక్టులపైనా అవగాహన పెంపొందించుకోవాలి.
రిఫరెన్స్:
Network Theory:
Van valkenburg, Hyte Kimberly.
Power Systems: Stevenson, C.L.Wadhwa.
Electrical Machine:
P.S.Bimbra, Nagrath and Kotari.
Control Systems: I.J.Nagrath, Gopal
Power Electronics: Rashid
Electrical measurements: A.K.Sawhney.
-జి.రమణ, డెరైక్టర్,
సాయిమేధ, హైదరాబాద్.
ఏఈ, సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ వ్యూహాలు
Published Thu, Feb 19 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement