ఎలక్ట్రికల్
ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన సిలబస్‌లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్‌వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, మెసర్‌మెంట్స్, అనలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్; ఎలక్ట్రికల్ ఎం/సీ, పవర్ ఎలక్ట్రానిక్స్, డివెసైస్, పవర్ సిస్టమ్, స్విచ్ గేర్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంటాయి.గతంతో పోల్చుకుంటే ఈసారి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంశాలను సిలబస్‌లో కొత్తగా చేర్చేందుకు అవకాశముంది. ప్రశ్నపత్రంలో పవర్ సిస్టమ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో విద్యార్థులు అనలాగ్, డిజిటల్ అంశాలపై అంతగా దృష్టిసారించరు. అయితే ఈ అంశాలు సబ్జెక్టులో కీలకంగా మారనున్నాయి.
ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్‌వర్క్ సబ్జెక్టు బేసిక్ సబ్జెక్టు. దీన్నుంచి సమస్యలు (8-10) ఎక్కువగా వస్తాయి. ఇవికూడా సాధారణ సూత్రాల ఆధారంగానే ఉంటాయి. కంట్రోల్ సిస్టమ్ నుంచి ప్రామాణికమైన ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి ఆరేడు ప్రశ్నలు రావొచ్చు. మెసర్‌మెంట్స్ నుంచి థియరీ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రామాణికమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.అనలాగ్, డిజిటల్ అంశాలు కీలకమైనవి. అనలాగ్ నుంచి 3 లేదా 4; డిజిటల్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. నేర్చుకోవాలి. ఎలక్ట్రికల్ మెషీన్స్ విభాగం నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. పవర్ ఎలక్ట్రానిక్స్‌లో డివెసైస్ ను బాగా అధ్యయనం చేయాలి. రిఫరెన్స్: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ (ఒ.ఆ. ఎఠఞ్ట్చ); Galgotia publications.
మెకానికల్ ఇంజనీరింగ్
స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషీన్స్, థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర అంశాలుంటాయి.థర్మల్ ఇంజనీరింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ సబ్జెక్టులో టర్బైన్స్, ఐసీ ఇంజన్స్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ అంశాల నుంచి థియరీ, సమస్యల ఆధారిత ప్రశ్నలు 15 నుంచి 20 వస్తాయి.ఎస్‌ఎం అండ్ ఎఫ్‌ఎం బేసిక్ అంశాలు కాబట్టి ఫార్ములాలు, కాన్‌స్టెంట్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నుంచి వచ్చే ప్రశ్నలు ఎక్కువగా థియరీ ఆధారంగా ఉంటాయి.సిలబస్‌లో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు అంశాలను చేర్చేందుకు అవకాశముంది కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిపై దృష్టిసారించాలి.ఫరెన్స్ బుక్స్: మెకానికల్ ఆబ్జెక్టివ్ పుస్తకాలు- ఆర్.కె.బన్సల్, ఆర్.ఎస్.ఖుర్మి.
సివిల్ ఇంజనీరింగ్
ఎస్‌ఎం, టీఎస్, ఆర్‌సీసీ, స్టీల్ స్ట్రక్చర్స్, ఎఫ్‌ఎం, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, వాటర్ మేనేజ్‌మెంట్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-పవర్ ప్లాంట్ తదితర అంశాలుంటాయి.ఎస్‌ఎం, ఎఫ్‌ఎం అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ-ఏఈఈ పరీక్షలో ఈ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.హైడ్రాలజీ, వాటర్ మేనేజ్‌మెంట్ అంశం కూడా ముఖ్యమైంది. దీనికి కనీసం 15 మార్కులు కేటాయించే అవకాశముంది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రిఫరెన్స్: ఆర్.ఎస్.ఖుర్మి, బీ.ఎల్.గుప్తా, రంగాచారి.
ఎలక్ట్రానిక్స్
బేసిక్ సర్క్యూట్, మెసర్‌మెంట్స్, ఈడీసీ, డిజిటల్, ఎస్‌ఎస్, కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.ఇన్‌స్ట్రుమెంటేషన్ అంశంపై ఎక్కువ దృష్టిసారించాలి. మెసర్‌మెంట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ నుంచి 20-25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెలికం స్విచింగ్ సిస్టమ్, నెట్‌వర్క్స్ కూడా మంచి వెయిటేజీ ఉన్న సబ్జెక్టులు.ఎలక్ట్రానిక్ డివెసైస్ అండ్ సర్క్యూట్లు బేసిక్ సబ్జెక్టు కాబట్టి ఎక్కువగా దృష్టిసారించాలి. వీటి నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. డిజిటల్ నుంచి ఆరేడు ప్రశ్నలు వస్తాయి. అన్ని బ్రాంచ్‌ల వారి తరహాలోనే వీరు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. గతంలో వచ్చిన గేట్, ఐఈఎస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
రిఫరెన్స్: Galgotia Publications, Rajput.
జెన్‌కో... అసిస్టెంట్ ఇంజనీర్!
Published Wed, Sep 23 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement