విద్యుత్‌షాక్‌తో బాలుడి మృతి
మక్తల్ : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని యాదవనగర్‌లోని కుర్వ కుమరయ్య, శంకరమ్మల కుమారుడు గ ణేష్(13) శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ ఇంటిపైకి వెళ్లాడు. ఇంటిని ఆనుకొని వెళ్లిన ఎల్‌టీలైన్ తీగలు తగిలి అక్క డే మృతిచెందాడు. పెద్ద శబ్ధం రావడం తో తేరుకున్న స్థానికులు అధికారులతో మాట్లాడి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్ చేశారు. అయితే ఇంటికి తగిలేవి ధంగా ఉన్న ఎల్‌టీలైన్‌ను తొలగించాల ని, ఇళ్ల మధ్యనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. బాలుడి మృతికి ట్రాన్స్ కో అధికారులే బాధ్యత వహించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
గతం లో కూడా ఇదే మిద్దెపై సంఘటన జరిగి న వ్యక్తి మృతిచెందాడు. అప్పట్లోనే తీగ లు తొలగించి ఉంటే మరో ప్రాణం బలయ్యేది కాదని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. విషయం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్ బాలయ్య ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతి చెందిన బాలుడు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.
పరిహారం కోసం రాస్తారోకో
బాధిత కుటుంబాన్ని ట్రాన్‌సకోశాఖ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నా యకుల ఆధ్వర్యంలో ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. అధికారు ల నిర్లక్ష్యం వల్లే గణేష్ మృతి చెందాడని, ఈ సంఘటనపై బాధ్యత వహిస్తూ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చే శారు. స్పందించిన ఏడీ శ్రీనివాస్, ఏఈ రాజ్‌ప్రకాష్‌లు సంఘటన స్థలానికి చేరుకొని తక్షణసాయంగా రూ.50వేల నగ దు అందించారు.
అలాగే ప్రభుత్వం నుం చి వచ్చే ఆర్థిక సహాయాన్ని త్వరగా ఇ ప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మక్త ల్ జెడ్పీటీసీ శ్రీహరి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేష్, లక్ష్మణ్, శివశంకర్, నర్సిములు, కల్లూరినాగప్ప, వివిధ పార్టీల నాయకులు బాధితులకు అండగా నిలిచారు.
ట్రాన్‌సకో అధికారుల నిర్లక్ష్యం
Published Sat, Mar 14 2015 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement