
రామగుండం బల్దియాకు పవర్‌కట్
రూ.2.20 కోట్ల విద్యుత్ బకాయిలు
కోల్‌సిటీ: విద్యుత్ బిల్లులు చెల్లించలేదని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి ట్రాన్స్‌కో విభాగం అధికారులు శనివారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఇన్‌చార్జి కమిషనర్ సీఆర్.బాబు, ఇతర అధికారులు సెల్‌ఫోన్ వెలుతురులో విధులు నిర్వహించారు. రూ.2.20 కోట్ల విద్యుత్ వినియోగ బకాయిలు చెల్లించకపోడంతోనే ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆదేశాల మేరకు కరెంట్ కట్ చేసినట్టు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
బకాయిలు చెల్లించాలని గతంలోనే అనేకసార్లు నోటీసులు జారీ చేసినా కార్పొరేషన్ అధికారులు స్పందించలేదని ఆయన వెల్లడించారు. సుమారు రూ.2.20 కోట్ల బకాయిల్లో హెచ్‌టీ బిల్లులు రూ.1.80 కోట్లు ఉండగా, మిగితా బిల్లులు ఎల్‌టీ కనెక్షన్లవి ఉన్నాయ ని ఏఈ వివరించారు. ఎల్‌టీ బిల్లులు రెగ్యులర్‌గా చెల్లింపులు జరుపుతున్నప్పటికీ హెచ్‌టీ బకాయిలు చెల్లించడం లేదని, ప్రతీ నెలా నోటీసులు జారీ చేస్తున్నా స్పందించడం లేదని అన్నారు.
గతేడాది కూడా విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ట్రాన్స్‌కో అధికారులు రెండుసార్లు కార్పొరేషన్ కార్యాలయాని కి కరెంటు సరఫరాను నిలిపివేశారు. వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు. ఎల్‌టీ బిల్లులు రూ.16 లక్షల వరకు చెల్లించడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆడిట్ ఎగ్జామినర్ అందుబాటులో లేకపోడంతో సమస్య వచ్చిందని ఇన్‌చార్జి కమిషనర్ తెలిపారు.