ములుగు: వరంగల్ జిల్లా ములుగు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అబ్బాపూర్ గ్రామంలో ట్రాన్స్‌ఫారం ఏర్పాటుకు రైతులు డీడీ తీసి నాలుగు నెలలుగా ఏఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, లంచం ఇస్తేనే పని అవుతుందని ఏఈ శ్రీనివాస్ చెప్పినట్టు తెలిసింది.
దీంతో అబ్బాపూర్‌కు చెందిన రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఓ రైతు ఏఈ శ్రీనివాస్‌కు ములుగులోని ఆయన కార్యాలయంలో రూ.15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.