ae
-
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు
సనత్‌నగర్: విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి 20 విద్యుత్ మీటర్ల కోసం గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద్ రెడ్డిలు రేపు మాపు అంటూ భాస్కర్‌రెడ్డిని తిప్పించుకుంటున్నారు. డబ్బులు ముట్టజెబితేనే పని అవుతుందని కరాఖండీగా చెప్పారు. ఏఈకి రూ.25,000, లైన్ ఇన్స్పెక్టర్కు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 18న ఏఈకి రూ.10,000, 19న లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.3,500ను భాస్కర్‌రెడ్డి ఇచ్చారు. దీంతో కేవలం ఐదు మీటర్లను మాత్రమే వారు మంజూరు చేసి మిగతా మీటర్లను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే మీటర్లను మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక భాస్కర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో అవినాష్‌కు రూ.10,000, కృషానంద్‌రెడ్డికి రూ.4,000ను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు చెందిన కూకట్పల్లి, బోరబండలలోని వారి ఇళ్లలో సోదాలు కొనసాగించారు. (చదవండి: ఫోనొచ్చింది ఆపండహో!) -
కాలువలో దూకిన ఏఈ కుటుంబం.. భార్య, కుమార్తె మృతి
తుమకూరు (బెంగుళూరు): నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీర్ కుటుంబం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య, కుమార్తె మృతదేహాలు లభ్యం కాగా ఇంజినీర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈఘటన తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా సాగరహళ్లి గేట్ వద్ద చోటు చేసుకుంది. కే.బీ.క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రమేష్(55) తుమకూరు నగరంలోని రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. భార్య మమత(46), కుమార్తె శుభ(25)తో కలిసి గురువారం సాయంత్రం కారులో గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలో ఉన్న సాగరనహళ్లి గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే కారు నిలిపి ముగ్గురూ హేమావతి కాలువలో దూకారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి పరిశీలించగా మృతులను మమత, శుభగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే రమేష్ కూడా కాలువలోకి దూకినట్లు తెలుసుకొని గాలింపు చేపట్టారు. -
అవినీతి చేయాలని బెదిరిస్తున్నారు
-
నగరపాలక సంస్థలో వసూల్ రాజా..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ప్రతి పనికీ ఓ రేటు విధించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో అతిడిని విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్లుగా నగరంలోని ఓ లాడ్జీలో ఉంటూ అవినీతి దందాను కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ఇసనాక సురేంద్రరెడ్డి నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. గతేడాది జూలై 22న, అక్టోబర్ ఒకటిన ¯ðనెల్లూరు నగరం 25వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ, ఇందిరమ్మ కొత్తకాలనీ, కనుపర్తిపాడు ఎస్సీ, బీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తోలేందుకు మూడు వర్క్ఆర్డర్లు సురేంద్రరెడ్డికి వచ్చాయి. దీంతో ఆయన నిర్దేశిత ప్రాంతాల్లో నీటిని సరఫరా చేశారు. కాలపరిమితి ముగియడంతో నీటి సరఫరా తాలూకా రూ.2,63,250 బిల్లు అతడికి రావాల్సి ఉంది. దీంతో ఆయన అదే ఏడాది డిసెంబర్లో పలుమార్లు ఎంబుక్‌ల్లో పనులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్సప్లై, రోడ్స్ విభాగం ఏఈ బీఎస్ ఆంజనేయులరాజును కోరారు. ఏఈ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. సురేంద్రరెడ్డి గతేడాది డిసెంబర్ 27న దుబాయిలో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే ఏఈని వివిధ ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు కుక్కలగుంటలోని కలరా హౌస్‌లోని వెహికల్స్ డిపో విభాగానికి బదిలీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సురేంద్రరెడ్డి దుబాయి నుంచి తిరిగి వచ్చి బిల్లుల విషయమై ఏఈని కలిసేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడినుంచి ఏఈని వేరే విభాగానికి మార్చాడని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన బాధితుడు ఏఈని కలిసి బిల్లుల విషయమై మాట్లాడాడు. ఎంబుక్‌లు అతని వద్దనే.. ఏఈ వేరే విభాగానికి మారినా సురేంద్రరెడ్డి పనులకు సంబంధించిన ఎంబుక్స్ అతని వద్దనే ఉన్నాయి. పనులు తాలూకా వివరాలను ఎంబుక్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు ఏఈ పంపాల్సి ఉంది. అందుకు గానూ రూ.30 వేలు ఇవ్వాలని ఏఈ సురేంద్రరెడ్డిని డిమాండ్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నానని బాధితుడు చెప్పినా పట్టించుకోలేదు. ఈనెల రెండో తేదీన సురేంద్రరెడ్డి మరోమారు ఏఈని కలిసి ప్రాధేయపడ్డాడు. అయినా అతను కనికరించకపోగా రూ.30 వేలు ఇస్తేనే ఎంబుక్‌లను ఉన్నతాధికారులకు పంపుతానని తేల్చిచెప్పాడు. నాలుగైదురోజుల్లో నగదు ఇస్తానని చెప్పి బాధితుడు అక్కడినుంచి వచ్చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు అదేరోజు నెల్లూరు ఏసీబీ డీఎస్సీ సీహెచ్‌డీ శాంతోను కలిసి ఏఈపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన పత్రాలు, ఏఈతో మాట్లాడిన ఆడియో సంభాషణలకు సంబంధించిన సీడీలను డీఎస్పీకి అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు రూ.30 వేలు ఇస్తానని ఏఈకి తెలిపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత గురువారం ఉదయం ఏఈ (కలరా హాస్‌లోని తన కార్యాలయంలో) రూ.30 వేలు సురేంద్రరెడ్డి వద్ద నుంచి లంచం తాలుకా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్కడే ఏఈకి రసాయన పరీక్షలు నిర్వహించారు. బీరువాలో ఉన్న ఎంబుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ లంచం తీసుకున్న వైనం ఇదిలా ఉండగా సురేంద్రరెడ్డికి గతంలో రూ.8.40 లక్షలకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. అందుకు సంబంధించి ఎంబుక్‌లో వివరాలు నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపేందుకు ఇదే ఏఈ బాధితుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకున్నట్లు ఏబీబీ అధికారులు పేర్కొన్నారు. ఇలా పలువురి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఏఈ ముక్కుపిండి వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఎవరి ప్రమేయం ఉంది? అక్రమ వసూళ్లలో తనతోపాటు ఉన్నతాధికారులకు వాటా ఉందని సదరు ఏఈ ఏసీబీ అధికారుల ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధమైయ్యారు. ఓ డీఈ అక్రమ వసూళ్లలో భాగస్తుడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. సదరు డీఈపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని తాజాగా పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏఈ అరెస్ట్ అవినీతి ఏఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించారు. మామూళ్ల వెనుక ఉన్నతాధికారుల ప్రమేయంపై అతడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. శుక్రవారం ఏఈని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ శాంతో, ఇన్స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, రమేష్‌బాబు, శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐదున్నరేళ్లుగా.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బీఎస్ ఆంజనేయులరాజు 2013 జూలైలో నెల్లూరు నగరపాలక సంస్థలో ఏఈగా బాధ్యతల్లో చేరాడు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆయన కార్పొరేషన్లోనే పనిచేస్తున్నారు. గతంలో వాటర్ సప్లై, రోడ్స్ విభాగంలో పనిచేశారు. ఈక్రమంలోనే పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అతడిపై పలు ఆరోపణలు వినిపించడంతో మూడునెలల క్రితం కలరా హౌస్‌లోని మున్సిపల్ వెహికల్స్ డిపోకు మార్చారు. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్లను బెదిరించి వారి వద్దనుంచి సంతకాలను తీసుకుని డీజిల్ డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం ఏసీబీ అధికారులు సైతం గుర్తించినట్లు తెలిసింది. కాగా సదరు ఏఈ నగరపాలక సంస్థలో చేరిన నాటినుంచి బృందావనంలోని లాడ్జీలో ఉంటున్నాడు. అనధికార కార్యకలాపాలను లాడ్జీ నుంచే నడిపిస్తున్నాడని అధికారులు గుర్తించారు. -
విద్యుత్ ఏఈపై వేటు
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు రూరల్ ఏఈ నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఆయన పని చేసిన బీ రోడ్డు సెక్షన్లో ఉపయోగించిన సామగ్రి, మంజూరైన పనుల వివరాలను పూర్తి స్థాయిలో సంస్థకు తెలుపలేదు. అలాగే ప్రస్తుత ఏఈ చలపతికి సెక్షన్ అప్పగించలేదు. ఈ కారణాలతో నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవరాముడు పేర్కొన్నారు. -
బనగానపల్లె ఏఈ సస్పన్షన్?
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ డోన్ ఆపరేషన్స్ డివిజన్లోని బనగానపల్లె రూరల్ ఏఈగా పనిచేస్తున్న పుల్లయ్యపై సస్పెన్షన వేటు పడినట్లు తెలిసింది. కమర్షియల్ మీటర్లు అమర్చడంలో అవకతవకలు జరిగిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమర్షియల్ టవర్ కనెక్షన్‌కు సీటీ మీటర్‌కు బదులు సాధారణ మీటర్‌ను ఏర్పాటు చేయడంతో సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని ఇటీవలే డీపీఈ(విజిలెన్స్ స్క్వాడ్) విభాగం అధికారలు తనిఖీలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. గత రెండున్నరేళ్ల నుంచి నెలవారీ బిల్లింగ్ అయిన యూనిట్ల వివరాలు బయటకు తీయడంతో లక్షల యూనిట్లు సంస్థ నష్టపోయినట్లు సమాచారం. ఈ కారణంగా డీపీఈ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏఈ పుల్లయ్యపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏఈకి ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదని ఎస్ఈ భార్గవ రాముడు తెలిపారు. -
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
అచ్యుతాపురం(విశాఖపట్నం జిల్లా): ఏసీబీ వలలో అచ్యుతాపురం విద్యుత్‌శాఖ ఏఈ రంగారావు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈని, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెదురువాడ గ్రామానికి చెందిన రవివర్మకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రంగారావు రూ.50 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ
రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం పిడుగురాళ్ల (గురజాల) : మున్సిపల్ ఏఈ ఏసీబీ వలలో చిక్కిన ఘటన పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానందం శాంతో మాట్లాడుతూ.. గత వేసవి కాలంలో పట్టణంలో పలు వార్డుల్లో తాగునీరు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ యరగాని ఏసుబాబుకు మూడు వర్క్ ఆర్డర్లు అందించారని చెప్పారు. వాటి ప్రకారం అతనికి రూ.4.20 లక్షల బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. వాటికోసం ఎంబుక్స్ రికార్డు చేసేందుకు గత కొన్ని నెలలుగా మున్సిపల్ ఏఈ బాబర్ రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఏసుబాబు ఏసీబీని ఆశ్రయించటంతో మొదటి విడతగా రూ.10 వేలు ఏఈ బాబర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జరిపిన దాడిలో ఏఈ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఈ రామమునిరెడ్డిని మున్సిపల్ కార్యాలయానికి రావాలని తాను ఫోన్ చేసినా రాలేదని, దీంతో తామే డీఈ గృహానికి వెళ్లామని వివరించారు. ఈ దాడిలో సీఐ వెంకటేశ్వర్లు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. కడుపు కాలి ఏసీబీని ఆశ్రయించా - యరగాని ఏసుబాబు, కాంట్రాక్టర్ ఆరు నెలలుగా బిల్లులు చేయక ఇబ్బందులు పెట్టడమే కాక తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదిలేక ఏసీబీ అధికారులను సంప్రదించాను. ట్రాక్టర్లకు డీజిల్ బకాయి బిల్లులు ఇవ్వాలని నిత్యం ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఏఈ బాబర్ దృష్టికి తీసుకెళ్లినా కనికరించకుంగా నిర్లక్షంగా వ్యవహరించారు. అందుకే తప్పని పరిస్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. -
నేడు ఏఈ పోస్టులకు పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష¯Œన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఆదివారం జరగుతున్న పరీక్షను నగరంలో ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలియజేశారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
వరంగల్ : సాంఘిక సంక్షేమ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ కలెక్టరేట్లో ఏఈగా పనిచేస్తున్న అజీజ్ ఒక పనికి రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
హన్మకొండ : బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ తాడ్వారుు పంచాయతీరాజ్ ఏఈ జీపీ.కృష్ణ సోమవారం ఏసీబీకి దొరికాడు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్లో భాగంగా చిలుకలగుట్ట వద్ద సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఫైనల్ బిల్లు చెల్లించేం దుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వివరాలు వెల్లడించా రు. కాంట్రాక్టర్ మెతుకు తిరుపతిరెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనులు చేశాడు. ఈ పనుల ఫైనల్ బిల్లు చెల్లించేందుకు పంచాయతీరాజ్ తాడ్వాయి మండల ఏఈ జీపీ.కృష్ణ రూ.40 వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు ఆయన కోరినవిధంగా హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్-2 తేజస్వీ స్కూల్ సమీపంలోకి సోమవారం సాయంత్రం కాంట్రాక్టర్ వెళ్లి డబ్బులు ఇవ్వగా వలపన్ని పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని కృష్ణను అరెస్ట్ చేశారు. జాతర పనుల్లో సీసీరోడ్డును టెండర్ ద్వారా దక్కించుకొని జనవరిలో పూర్తి చేయగా తనకు ఫైనల్ బిల్లు చెల్లించేందుకు రూ.40వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి తెలిపారు. డబ్బులు ఇచ్చేందుకు డీఈఈ ఇంటికి రావాలని చెప్పాడని, దీంతో అక్కడికి వెళ్లగా బేకరి వద్దకు రావాలని చెప్పగా వెళ్లానని, అక్కడ డీఈఈ కాకుండా తానే డబ్బులు తీసుకున్నాడని వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబ య్య పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబయ్య పాల్గొన్నారు. కక్కుర్తితోనే... ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వారుు పంచాయతీరాజ్ శాఖ ఏఈ కృష్ణ ఓ కాంట్రాక్టర్ నుంచి హన్మకొండలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ టం కలకలం రేపింది. తాడ్వారుులో ఆయన ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు ఇంజనీరింగ్ అధికారి కమీషన్లు కావాలని ఒత్తిడి చేయగా కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రరుుంచా డు. కమీషన్లు ఇచ్చే వరకు బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇప్పుడు అతడు ఏసీబీకి చిక్కడం నియోజకవర్గంలోని ఇంజనీరింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
హన్మకొండ: వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాడ్వాయి పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న కృష్ణ ఓ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి హన్మకొండలోని ఏఈ నివాసం సమయంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
-
ముగిసిన ట్రాన్స్‌కో ఏఈ, టీఎస్పిఎస్సీ రాతపరీక్ష
-
ప్రశాంతంగా ముగిసిన ఏఈ రాత పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఏఈ పోస్టుల రాత పరీక్ష ప్రశాంతంగా ముగింసింది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో)లో ఉన్నటువంటి 206 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 39,092 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 37,489 మంది హాజరయ్యారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
ములుగు: వరంగల్ జిల్లా ములుగు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అబ్బాపూర్ గ్రామంలో ట్రాన్స్ఫారం ఏర్పాటుకు రైతులు డీడీ తీసి నాలుగు నెలలుగా ఏఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, లంచం ఇస్తేనే పని అవుతుందని ఏఈ శ్రీనివాస్ చెప్పినట్టు తెలిసింది. దీంతో అబ్బాపూర్‌కు చెందిన రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఓ రైతు ఏఈ శ్రీనివాస్‌కు ములుగులోని ఆయన కార్యాలయంలో రూ.15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. -
ఏఈ పై టీడీపీ నేతల దాడి
వైఎస్సార్ జిల్లాలో దౌర్జన్యం బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జి.ప్రసాద్‌పై టీడీపీకి చెందిన ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, అతడి అనుచరులు గురువారం దాడి చేశారు. కార్యాలయంలోని కుర్చీ లు, కం ప్యూటర్‌ను ధ్వర సం చేశారు. అడ్డుకోబోయిన డీఈని కూడా తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలిసింది. తాగునీటిఎద్దడి నివారణకు పంచాయతీల ఆమోదం తో ట్యాంకర్లను ఏఈ ఏర్పాటు చేశారు. అయితే, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి తాను చెప్పినవారికే ట్యాంకర్లు కేటాయించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఎంపీపీ, అతని సోదరుడు సుబ్బారెడ్డి, రాజుపాళెం నేత తిరుపతిరెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డిలతోపాటు మరో పది మంది ఏఈతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్ప డ్డారు. ఏఈల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు నిందితులపై కేసు నమోదు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్‌పై టీడీపీ నేతల దాడిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తిరువీధి జయరాములు తీవ్రంగా ఖండించారు. -
కళ్యాణదుర్గం డీఈని నిర్బంధించిన బాధితులు
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఇంటి బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న డీఈ, ఏఈలను స్థానికులు నిర్బంధించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. డీఈ శివశంకర్ నాయక్, ఏఈ రంగనాయక్‌లు బిల్లులు ఇవ్వకుండా ప్రజలను తిప్పించుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎమ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులు హౌసింగ్ కార్యాలయానికి చేరుకొని డీఈని, ఏఈని నిర్బంధించారు. -
ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ
రంగారెడ్డి (వనస్థలిపురం): వినియోగదారుని నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వనస్థలిపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ, ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక వినియోగదారుని వద్ద బుధవారం 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా విద్యుత్ ఏఈ అశోక్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 20వేలరూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
మిర్యాలగూడ క్రైం : కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ బ్రాంచి కెనాల్ ఏఈ జిసి.మల్లయ్య సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎసీబీ డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మం డలం తక్కెళ్లపాడుకు చెందిన కాంట్రాక్టర్ బొలిశెట్టి గంగాధర్ నాలుగు నెలల క్రితం గ్రామ పరిధిలోని మైనంవారిగూడెంలో రూ.8 లక్షలు, తాడిచెట్టుతండాలో రూ.6లక్షలు, దొండవారిగూడెం గ్రామ పరిధి సామ్యతండాలో రూ.8 లక్షలతో జాలుకాలువలకు గైడర్వాల్స్ నిర్మించాడు. ఈ పనులను నాలుగు నెలల క్రితం పూర్తిచేశాడు. ఎంబీ రికార్డు చేయాలని నెలరోజులుగా ఐబీ ఏఈ మల్లయ్య చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రూ.1.50 లక్షలు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఏఈ స్పష్టం చేశాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న గంగాధర్ మూడు రోజుల క్రితం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ముందుగా రూ.50వేలు, మరో రెండురోజుల అనంతరం మిగతా లక్ష రూపాయలు ఇస్తానని గంగాధర్ ఏఈతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఎసీబీ అధికారులు వలపన్ని రాత్రి సమయంలో ఏఈ ఇంటి వద్ద గంగాధర్ రూ 50వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ ఇంటి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనపర్చుకున్నారు.ఐబీ ఏఈ మల్లయ్యపై అవినీతి నిరోదకచట్టం కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో సీఐలు శ్రీనివాస్, ముత్తులింగం, సిబ్బంది ఉన్నారు. -
ఏసిబికి చిక్కిన ఏఇ, జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్: ఏసిబి అధికారులు ఈ రోజు విశాఖలో ఓ జూనియర్ అసిస్టెంట్‌ను, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పంచాయతీరాజ్ ఏఇని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖపట్నం జివిఎంసిలో జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రావు ఓ వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తసుకున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పంచాయతీరాజ్‌లో ఏఇ శ్రీహరి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ :నాగిరెడ్డిపేట మండల పంచాయతీరాజ్ ఇన్చార్జి ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చీనూర్ పంచాయితీ పరిధిలోని మేజర్‌వాడి ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో మూడుమాసాల క్రితం రూ. 75వేలతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఎంబీ రికార్డు చేసేందుకు శ్రీనివాస్ మూడునెలలుగా కాంట్రాక్టరైన టీఆర్ఎస్పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గంపల యాదగిరిని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. చివరికి ఎంబీ రికార్డు చేసేం దుకు రూ. 15 వేలు డిమాండ్ చేశారు. అంతపెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని యాదగిరి పేర్కొనగా చివరికి రూ. 10 వేలకు బేరం కుదిరింది. అనంతరం యాదగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మం డల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో యాదగిరి నుంచి రూ. 10వేలు తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాస్‌ను అక్కడ మాటువేసిఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలోని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని హైద్రాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీయస్సీ సంజీవరావు తెలిపారు. ఇన్చార్జి ఏఈగా శ్రీనివాస్ రెండున్నరేళ్లుగా మం డలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనఎల్లారెడ్డి పీఆర్ ఏఈగా రెగ్యులర్ పోస్టులో కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే బాధితులు తమను సంప్రదించాలని డీయస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ కోరారు. సెల్ నం. 9440446155 కు ఫోన్ చేయాలని సూచించారు. ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఖుర్షిద్ పాల్గొన్నారు. ఏసీబీ దాడులు మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికారి ఇలా దొరికిపోవడం ఈ ప్రాంతంలో మొదటి సారిగా స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకుని పలుగ్రామాల నుంచి నాయకులు, ప్రజలు మండల పరిషత్ కాార్యాలయానికి తరలివచ్చారు. అవినీతి అధికారుల్లో మాత్రం గుండె దడ మొదలైంది.