హన్మకొండ : బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ తాడ్వారుు పంచాయతీరాజ్ ఏఈ జీపీ.కృష్ణ సోమవారం ఏసీబీకి దొరికాడు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్లో భాగంగా చిలుకలగుట్ట వద్ద సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఫైనల్ బిల్లు చెల్లించేం దుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వివరాలు వెల్లడించా రు. కాంట్రాక్టర్ మెతుకు తిరుపతిరెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనులు చేశాడు. ఈ పనుల ఫైనల్ బిల్లు చెల్లించేందుకు పంచాయతీరాజ్ తాడ్వాయి మండల ఏఈ జీపీ.కృష్ణ రూ.40 వేలు డిమాండ్ చేశాడు.
ఈమేరకు ఆయన కోరినవిధంగా హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్-2 తేజస్వీ స్కూల్ సమీపంలోకి సోమవారం సాయంత్రం కాంట్రాక్టర్ వెళ్లి డబ్బులు ఇవ్వగా వలపన్ని పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని కృష్ణను అరెస్ట్ చేశారు. జాతర పనుల్లో సీసీరోడ్డును టెండర్ ద్వారా దక్కించుకొని జనవరిలో పూర్తి చేయగా తనకు ఫైనల్ బిల్లు చెల్లించేందుకు రూ.40వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి తెలిపారు.
డబ్బులు ఇచ్చేందుకు డీఈఈ ఇంటికి రావాలని చెప్పాడని, దీంతో అక్కడికి వెళ్లగా బేకరి వద్దకు రావాలని చెప్పగా వెళ్లానని, అక్కడ డీఈఈ కాకుండా తానే డబ్బులు తీసుకున్నాడని వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబ య్య పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబయ్య పాల్గొన్నారు.
కక్కుర్తితోనే...
ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వారుు పంచాయతీరాజ్ శాఖ ఏఈ కృష్ణ ఓ కాంట్రాక్టర్ నుంచి హన్మకొండలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ టం కలకలం రేపింది. తాడ్వారుులో ఆయన ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు ఇంజనీరింగ్ అధికారి కమీషన్లు కావాలని ఒత్తిడి చేయగా కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రరుుంచా డు. కమీషన్లు ఇచ్చే వరకు బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇప్పుడు అతడు ఏసీబీకి చిక్కడం నియోజకవర్గంలోని ఇంజనీరింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
Published Tue, Jun 7 2016 8:56 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement