cought
-
విరాట్ కోహ్లీకి అనారోగ్యమా? మైదానంలో ఇబ్బంది పడ్డాడా? రోహిత్ క్లారిటీ..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో అద్భుత శతకంతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు కింగ్ విరాట్ కోహ్లీ. 186 పరుగులు చేసి కెరీర్లో 75 శతకం నమోదు చేశాడు. అయితే కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మైదానంలో కాస్త ఇబ్బందిపడుతున్నాడని వార్తలొచ్చాయి. నాలుగో రోజు కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అక్షర్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. కోహ్లీ అనారోగ్యం విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే అతను ఇబ్బంది పడుతున్నట్లు తనకు అన్పించలేదని, వికెట్ల మధ్య పరుగెడుతున్నప్పుడు ఎలాంటి అసౌకర్యంగా కూడా కన్పించలేదని చెప్పుకొచ్చాడు. ఎండను కూడా తట్టుకుని గంటలపాటు క్రీజులో ఉండి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకొచ్చాడు. తనకైతే కోహ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు అస్సలు అన్పించలేదని పేర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ చివరి రోజు కోహ్లీ రోజంతా ఫీల్డింగ్ చేశాడు. దీంతో అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు అర్థమైంది. కానీ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. కోహ్లీ కాస్త దగ్గుతున్నాడని రోహిత్ వెల్లడించాడు. కానీ అంతమాత్రానికే అనారోగ్యంగా ఉన్నట్లు కాదు కదా అని బదులిచ్చాడు. కోహ్లీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తనకు అన్పించిందని చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితిలో ఉండటానికి కోహ్లీనే ప్రధాన కారణమని కొనియాడాడు. ఈ మ్యాచ్ డ్రా కావడం వల్లే సిరీస్ మనం కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశాడు. చదవండి: Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను -
ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్ కానిస్టేబుల్
సాక్షి, ఎర్రగుంట్ల: లంచం తీసుకుంటూ ఓ రైల్వే పోలీసు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో దేవానందం అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ కేసు విషయమై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఒక ఖైదీ దొరికాడు..!
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. గాజువాకలో చిక్కాడు వరంగల్/గాజువాక: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీల్లో ఒకడైన సైనిక్ సింగ్ గాజువాక దరి శ్రీనగర్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. ఆయుధాల దొంగతనంలో పట్టుబడి వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ రాజేష్ యాదవ్ అలియాస్ కుమార్‌తో కలసి జైలునుంచి తప్పించుకున్నాడు. గాజువాకలో గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ ఎస్ఐ అశోక్ చక్రవర్తి శ్రీనగర్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని విచారించగా పొంత నలేకుండా మాట్లాడటంతో స్టేషన్‌కు తరలించారు. వరంగల్ పోలీసులు తమ వద్ద ఉన్న ఫొటోలను వాట్సప్‌లో పంపగా పారిపోయిన ఖైదీ సైనిక్సింగ్గా విశాఖ పోలీసులు గుర్తించారు. తాను వరంగల్ జైలునుంచి తప్పించుకున్నట్టు సింగ్ అంగీకరించడంతో పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. అతడు చెప్పిన వివరాలు సరిపోవడంతో అరెస్టు చేశారు. కాగా, సైనిక్సింగ్తో కలసి జైలునుంచి పరారైన రెండో ఖైదీ రాజేష్ యాదవ్ కూడా గాజువాక ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గాజువాకలో అరెస్టైన ఖైదీ సైనిక్ సింగ్‌ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు. -
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చిలుకూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మండలంలోని బేతవోలు గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ టి. రాము తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని బేతవోలు గ్రామం శివారులో ∙రేషన్ బియ్యంతో వస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నట్లుగా తెలిపారు. వ్యాన్‌లో అక్రమంగా 25 క్వింటాళ్ల బియ్యంను తరలిస్తున్నరని తెలిపారు. ఈ విషయంపై విచారణ చేసి పలువురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం తరలించిన, కొనుగోలు చేసిన, అమ్మినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఏవరైనా రేషన్ బియ్యంను తరలిస్తే వెంటనే 94407 00058 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చౌటుప్లో 174, నార్కపల్లిలో 175 క్వింటాళ్లు తిరుమలగిరి నుంచి కర్ణాటకకు రవాణా పంతంగి టోల్‌ప్లాజా వద్ద చిక్కిన లారీ చౌటుప్పల్ : తిరుమలగిరి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఉదయం జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీని చౌటుప్పల్‌లోని సివిల్సప్లై గోదాంకు తరలించారు. లారీలో 346 బస్తాల్లో 174.15 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయి. వీటిని గోదాంలో భద్రపరిచారు. లారీని, పట్టుబడిన డ్రైవర్ వెంకటేశ్‌ను చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లారీ శ్రీకాళహస్తిలో ధాన్యాన్ని నింపుకుని ఆదివారం ఉదయం మిర్యాలగూడకు వచ్చింది. అక్కడ ధాన్యాన్ని దింపి సూర్యాపేటకు వచ్చింది. లారీ యజమాని డ్రైవర్ వెంకటేశ్‌కు ఫోన్ చేసి తిరుమలగిరిలో బియ్యాన్ని నింపుకుని కర్ణాటకలోని బంగారుపేటకు వెళ్లమని చెప్పాడు. దీంతో డ్రైవర్ లారీని తిరుమలగిరికి తీసుకెళ్లాడు. తిరుమలగిరిలోని సంతోష్ రైస్‌మిల్లులో రేషన్ బియ్యం బస్తాలను లారీలో నింపారు. సోమవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో లారీ కర్ణాటకకు బయలుదేరింది. 7 గంటల సమయంలో విజిలెన్స్ డీఎస్పీ సత్తన్న ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద లారీని ఆపి పట్టుకున్నారు. పట్టుకున్న లారీని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించగా భువనగిరి ఏఎస్వో బ్రహ్మారావు, ఆర్ఐ హరిశ్చంద్రారెడ్డి పంచనామా నిర్వహించారు. బియ్యాన్ని గోదాంలో భద్రపరిచారు. నార్కపల్లిలో మరో లారీ... రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని వివేరా హోటల్ సమీపంలో పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిలోని సంతోష్ రైస్ మిల్లు నుంచి కర్ణాటకలోని బంగారుగడ్డకు రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం నార్కట్‌పల్లి వద్ద మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపారు. లారీలో 350 బస్తాల్లో 175 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో విజిలెన్స్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ సత్తన్న, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, సివిల్ సప్లయి అధికారులు డి.టి రంగారావు, ఏఎస్ఓ శేషన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, విజిలెన్స్ ఎస్సై గౌస్, కానిస్టేబుల్ కొయ్య నర్సింహ్మరెడ్డి, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో కట్ట యాదయ్య పాల్గొన్నారు. -
పీడీయస్ బియ్యం పట్టివేత
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి శివారులో పీడీయస్ బియ్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్ఐ ఏ.శివకుమార్ తెలిపారు. వివిధ గ్రామాల నుంచి సేకరించిన 25 క్వింటాళ్ల పీడీయస్ బియ్యంను మండలంలోని పెద్దకాపర్తి శివారులోని కోళ్ల ఫారాలకు అందజేసేందుకు వెళ్తుండగా మండలంలోని వట్టిమర్తి శివారులో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పంచానామ నిర్వహించి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
40పశువుల పట్టివేత
చౌటుప్పల్: కబేళాకు తరలిస్తున్న 40పశువులను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద శనివారం పోలీసులు పట్టుకున్నారు. రెండు డీసీఎంలలో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పుర కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటిలో గేదెలు, ఆవులు ఉన్నాయి. వీటిని గోశాలకు తరలించారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
2 కిలోల గంజాయి పట్టివేత
రాజుపాలెం: ఇనిమెట్ల గ్రామంలో బుధవారం ఓ మహిళ నుంచి 2 కిలోల గంజాయిని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఎస్కే రంజాన్‌బీ కొన్నాళ్ల నుంచి గంజాయి అమ్ముతోందని గ్రామానికి చెందిన యువకులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అధికారులు గ్రామానికి సమీపంలో వాహనాన్ని ఆపి బ్రహ్మంగారి గుడి సమీపంలో గంజాయి అమ్ముతున్న రంజాన్బీని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ జి.సూర్యనారాయణ తెలిపారు. సత్తెనపల్లి ప్రొహిబిషన్ సీఐ ఎం.రమేష్, ఎస్ఐ ప్రసన్నలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి నతానియేలు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
హన్మకొండ : బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ తాడ్వారుు పంచాయతీరాజ్ ఏఈ జీపీ.కృష్ణ సోమవారం ఏసీబీకి దొరికాడు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్లో భాగంగా చిలుకలగుట్ట వద్ద సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఫైనల్ బిల్లు చెల్లించేం దుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వివరాలు వెల్లడించా రు. కాంట్రాక్టర్ మెతుకు తిరుపతిరెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనులు చేశాడు. ఈ పనుల ఫైనల్ బిల్లు చెల్లించేందుకు పంచాయతీరాజ్ తాడ్వాయి మండల ఏఈ జీపీ.కృష్ణ రూ.40 వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు ఆయన కోరినవిధంగా హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్-2 తేజస్వీ స్కూల్ సమీపంలోకి సోమవారం సాయంత్రం కాంట్రాక్టర్ వెళ్లి డబ్బులు ఇవ్వగా వలపన్ని పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని కృష్ణను అరెస్ట్ చేశారు. జాతర పనుల్లో సీసీరోడ్డును టెండర్ ద్వారా దక్కించుకొని జనవరిలో పూర్తి చేయగా తనకు ఫైనల్ బిల్లు చెల్లించేందుకు రూ.40వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి తెలిపారు. డబ్బులు ఇచ్చేందుకు డీఈఈ ఇంటికి రావాలని చెప్పాడని, దీంతో అక్కడికి వెళ్లగా బేకరి వద్దకు రావాలని చెప్పగా వెళ్లానని, అక్కడ డీఈఈ కాకుండా తానే డబ్బులు తీసుకున్నాడని వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబ య్య పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాఘవేందర్, సాంబయ్య పాల్గొన్నారు. కక్కుర్తితోనే... ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వారుు పంచాయతీరాజ్ శాఖ ఏఈ కృష్ణ ఓ కాంట్రాక్టర్ నుంచి హన్మకొండలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ టం కలకలం రేపింది. తాడ్వారుులో ఆయన ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు ఇంజనీరింగ్ అధికారి కమీషన్లు కావాలని ఒత్తిడి చేయగా కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రరుుంచా డు. కమీషన్లు ఇచ్చే వరకు బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇప్పుడు అతడు ఏసీబీకి చిక్కడం నియోజకవర్గంలోని ఇంజనీరింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
హన్మకొండ: వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాడ్వాయి పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న కృష్ణ ఓ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి హన్మకొండలోని ఏఈ నివాసం సమయంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
వాహనంలో తరలిస్తున్న 420 తాబేళ్ల స్వాధీనం
చింతూరు(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల తాబేళ్లను తూర్పు గోదావరి జిల్లా లక్కవరం ప్రాంత అటవీ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. తాబేళ్ల అక్రమ రవాణా సమాచారం తెలుసుకున్న రేంజ్ అధికారి ఉషారాణి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొత్తపల్లి సమీపంలో సీలేరు నది వద్ద ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. రాజమండ్రి నుంచి వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేయగా 8 మూటల్లో కట్టి ఉంచిన 420 తాబేళ్లు లభ్యమయ్యాయి. డ్రైవర్ పరారవ్వగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామని రేంజ్ అధికారి తెలిపారు. తాబేళ్లను రాజమండ్రి నుంచి కొత్తపల్లి మీదుగా ఒడిశాకు రవాణా చేయబోతుండగా పట్టుకున్నామని చెప్పారు. కాగా, ఆ తాబేళ్లను మోతుగూడెం వద్ద సీలేరు నదిలో వదిలారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
-
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
రాయికల్ (కరీంనగర్): లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన రాయికల్ మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇంటిని మార్పిడి చేయాడనికి పర్మిషన్ కావాలంటూ వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రాయికల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి 5 వేలు లంచం తీసుకుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం
సికింద్రాబాద్: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్‌లో సూది ఉన్మాది శనివారం కలకలం సృష్టించాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఎక్కిన రవికుమార్ అనే సైకో ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు. సూది ఉన్మాదిని ప్రయాణికులు చితకబాది సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు అతడిని పట్టుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రవికుమార్ నుంచి రెండు సిరంజీలు, రెండు సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని దాదాపు గంట పాటు విచారించారు. రవికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అతని మానసిక స్థితి బాగా లేదని పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇంటి దగ్గర ఉండట్లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అతడి దగ్గర రెండు సిరంజీలు, సూదులు, ఒక మందు సీసా కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయింటున్నారు. ఇతడికి, నగరంలో గతంలో జరిగిన ఘటనలకు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
కర్నూలు: బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గుర్ని కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కారులో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి కర్నూలుకు తరలిస్తుండగా బనగానపల్లె వద్ద వీరిని పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన సయ్యద్ అహ్మద్, షఫీక్ అహ్మద్, ఫిరోజ్ బాషాలు కర్నూలు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాల్పుల ఘటన: నలుగురు అనుమానితుల అరెస్ట్
అనంతపురం: ధర్మవరం హైవేపై నిన్న జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న వీరిని ఏపీ, కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు దోపీడీలకు పాల్పడే ముఠాకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలు..జిల్లాలోని ధర్మవరం మండలం సీతారామపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఎన్ హెచ్ 44పై కారులో వచ్చిన ఓ వ్యక్తి ఓ లారీడ్రైవర్పై కాల్పులు జరిపాడు. కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన లారీ బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ పక్క నుంచి ఇండికా కారులో వచ్చిన దుండగులు కారులో నుంచే డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. లారీ డ్రైవర్ సురేష్ డొక్కలో ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి. బుల్లెట్ల దెబ్బకు సురేష్ పక్కకు ఒరిగిపోవడంతో క్లీనర్ లారీని సమయస్ఫూరితో ఆపేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆరుగురు దొంగల అరెస్ట్
నల్లగొండ: వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటర్లు, పంపుసెట్లు, ట్రాక్టర్ ట్రాలీలు, కల్టివేటర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.50 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మిర్యాలగూడ నుంచి హాలియాకు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న మోటర్లు, పంపుసెట్లను గుర్తించారు. ఇవి ఎవరివని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో దొంగతనాల విషయం బయటకు వచ్చింది. మిర్యాలగూడ మండలానికి చెందిన గద్దెల సురేష్ ఆరుగురు సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడి దామరచర్ల, త్రిపురారం, మిర్యాలగూడా మండల పరిధిలోని పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తెలిపారు. పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో ఆటో సహాయంతో.. మోటర్లను తలించే వారని విచారణలో తేలింది. అపహరించిన మోటర్లను హాలియాలో విక్రయించడానికి వెళ్తున్న సమయంలో ఆదివారం త్రిపురారం పోలీసుల చేతికి చిక్కారు. -
25 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లా: అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గోదాం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఫ్యాషన్ డిజైనర్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో సైనిక్ పురికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జనిఫా పట్టుబడింది. తొలుత తాగలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. బ్రీతింగ్ అనలైజర్‌తో పరీక్షించిన పోలీసులు తాగినట్టుగా గుర్తించారు. జనిఫాకు చెందిన కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 11 బైకులు , 4 కార్లను సీజ్ చేసి 16 మందిపై కేసు నమోదు చేశారు. -
7 కిలోల బంగారం స్వాధీనం
విశాఖపట్నం: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు కిలోల బంగారాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన వీరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న వారి పేర్లను అధికారులు వెల్లడించలేదు. -
చిలకలూరి పేటలో అక్రమంగా చేపల వేట
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసమూరు గ్రామంలోని మంచినీటి చెరువులో అక్రమంగా చేపల్ని వేటాడుతున్న 10 మంది గుర్తు తెలియని వ్యక్తులను గ్రామస్థులు పట్టుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా వేటాడిన చేపల్ని తీసుకువెళ్లేందుకు తెచ్చిన ఐస్‌బాక్సులు, లారీని గ్రామస్థులు తమ స్వాధీనంలోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.