2 కిలోల గంజాయి పట్టివేత
2 కిలోల గంజాయి పట్టివేత
Published Wed, Aug 3 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
రాజుపాలెం: ఇనిమెట్ల గ్రామంలో బుధవారం ఓ మహిళ నుంచి 2 కిలోల గంజాయిని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఎస్‌కే రంజాన్‌బీ కొన్నాళ్ల నుంచి గంజాయి అమ్ముతోందని గ్రామానికి చెందిన యువకులు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అధికారులు గ్రామానికి సమీపంలో వాహనాన్ని ఆపి బ్రహ్మంగారి గుడి సమీపంలో గంజాయి అమ్ముతున్న రంజాన్‌బీని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ జి.సూర్యనారాయణ తెలిపారు. సత్తెనపల్లి ప్రొహిబిషన్ సీఐ ఎం.రమేష్, ఎస్‌ఐ ప్రసన్నలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి నతానియేలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement