విద్యార్నిపై మరో విద్యార్థి దాష్టీకం
తరచూ ఇంటికి తీసుకెళ్లి భర్తతో కలిసి గంజాయి సేవనం
ఆపై భర్తతో లైంగికదాడి చేయిస్తూ.. ఫొటోలు, వీడియోలు
ఆమెకు వివాహం కుదరడంతో డబ్బు కోసం బ్లాక్ మెయిల్
తిరుపతిలో దారుణం
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్‌కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్‌పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతోంది.
తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్‌రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్‌లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్‌రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్‌రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి విద్యార్థి ని బ్లాక్‌మెయిల్ చేయసాగారు.
నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది.
బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment