Krishna kishore
-
నమ్మించి.. మత్తులో ముంచి..
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్‌కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్‌పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్‌రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్‌లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్‌రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్‌రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి విద్యార్థి ని బ్లాక్మెయిల్ చేయసాగారు. నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది. బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. -
దివిసీమ బిడ్డకు ‘జగనన్న దీవెన’
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్‌కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్‌గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ -
‘జాస్తి’ అవినీతి రూ.60 కోట్లు పైమాటే
సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌కు గురైన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసినప్పుడు రూ.60 కోట్లకుపైగానే అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ప్రాథమికంగా లెక్కలు తేల్చింది. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కృష్ణకిషోర్, అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును గతేడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖలు వేర్వేరుగా ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిపై కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిషోర్ అమరావతిని విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులిచ్చింది. ఆయనపై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద కేసు నమోదు చేసి సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలానికి ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా ఎంపికైన కృష్ణకిషోర్.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు కృష్ణకిషోర్ అవినీతి చిట్టాను ఆధారాలతో సహా సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రూ.60 కోట్లకుపైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు సీఐడీ నిర్ధారించింది. కృష్ణకిశోర్ తనకు అనుకూలంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుని వారి పేరుతో నిధులు మళ్లించినట్టు తేల్చింది. పలు పనులకు ఇచ్చే వర్క్ ఆర్డర్లలో అధిక మొత్తాలు చూపి కోట్లాది రూపాయలు నిధులను దారి మళ్లించినట్టు గుర్తించింది. ప్రభుత్వ ఫైనాన్స్ రూల్స్ ప్రకారం.. వర్క్ ఆర్డర్స్‌లో అడ్వాన్సుగా 30 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. అయితే ఏకంగా 90 శాతం నిధులను ముందే చెల్లింపులు (అడ్వాన్సులు) చేసినట్టు నిగ్గు తేల్చింది. హైదరాబాద్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటింగ్ పనుల కోసం 48 సార్లు రూ.70 లక్షల వరకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చినట్టు తేలింది. ఏదైనా ప్రభుత్వ శాఖ ప్రకటనలు, పబ్లిసిటీ వంటివి రాష్ట్ర సమాచార శాఖ ద్వారా ఇవ్వాల్సి ఉండగా దానితో నిమిత్తం లేకుండా కృష్ణకిషోర్ స్వయంగా ప్రకటనలు జారీ చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేయడానికి ఏకంగా రూ.24 లక్షలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు రాసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా అనేక అక్రమాలతో నిధులు కాజేసినట్టు గుర్తించిన సీఐడీ.. అరెస్టుకు సిద్ధమవుతోంది. కృష్ణకిషోర్ అరెస్టుపై హైకోర్టు 8 వరకు స్టే విధించినందున కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. -
తప్పు చేస్తే సస్పెండ్ చేయక.. సన్మానాలు చేస్తారా ?
సాక్షి,అమరావతి: అవినీతి ఆరోపణల వల్లే ఐఆర్ఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థికావృద్ధి మండలి మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. తప్పుచేసిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపడం కొత్తేమీ కాదన్నారు. పరిశ్రమల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. తప్పుచేసిన అధికారులను సస్పెండ్ చేయకుండా.. సన్మానాలు చేస్తారా అని ప్రశ్నించారు. కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్‌పై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇది కక్షసాధింపు అంటున్నారంటే.. ఆ అధికారికి, చంద్రబాబుకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయన్నారు. ఏదోవిధంగా ఆయనను రక్షించేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని తెలిపారు. బాబు ఏం చెబితే అది చేసి ఉండొచ్చు.. జగతి పబ్లికేషన్ విచారణ టీమ్‌లో కృష్ణకిషోర్ సభ్యుడిగా ఉండి బహుశా బాబుకు అనుకూలంగా ప్రవర్తించి ఉండి ఉండొచ్చని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. జాస్తి కృష్ణకిషోర్, జేడీ లక్ష్మీనారాయణ, వెంకయ్యచౌదరి వీళ్లందరినీ తన కనుసన్నల్లో పనిచేసేలా చంద్రబాబు చేసుకున్నారని ఆరోపించారు. కాబట్టే ఆ రోజున వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారని చెప్పారు. శాసనసభలో మార్షల్స్‌పై చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. అధికారం కోల్పోయేసరికి బాబు ఉన్మాదిలా మారారని పేర్కొన్నారు. -
'సస్పెండ్ చేయకుండా సన్మానం చేస్తారా?'
సాక్షి, అమరావతి : పరిశ్రమల శాఖ నివేదికతోనే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై వేటు వేయడం జరిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలతోనే ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. అయితే దీనిని రాష్ట్ర, జాతీయ సమస్యగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తప్పుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయకుండా సన్మానం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణ కిషోర్ సస్పెన్షన్‌పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణ కిషోర్ తనకు అనుకూలంగా పనిచేయడం వల్లే ఇప్పుడు ఇలా పెడబొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేశారని ఆధారాలుంటే ఎంతటి అధికారులైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్, చంద్రబాబు కుట్రతోనే వైఎస్ జగన్‌పై కేసులు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సభలో అసెంబ్లీ ఛీఫ్ మార్షల్‌ను బహిరంగంగానే చంద్రబాబు, లోకేష్‌లు దూషించారని గుర్తు చేశారు. సభలో ఎదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చట్టానికి లోబడే పని చేయాలని అంబటి వెల్లడించారు. (చదవండి : ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ సస్పెన్షన్) -
కృష్ణ కిషోర్ సస్పెన్షన్‌పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరం
-
కక్ష గట్టి కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేశారు
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్ వ్యవహారంపై నిక్కచ్చిగా ఆడిట్ చేసినందుకే ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌పై కక్ష గట్టి పద్ధతి లేకుండా ఆయన్ను సస్పెండ్ చేశారని ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇది ఉన్మాది చర్య కాకుంటే మరేంటన్నారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూకుమ్మడిగా తనపై దాడి చేయాలనుకుంటున్నారని, మీరింతలా కక్ష సాధిస్తారని తెలిస్తే ప్రజలు వైఎస్సార్సీపీకి అధికారం ఇచ్చేవారు కాదని అన్నారు. సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పీకర్ ఎప్పుడంటే అప్పుడు మైక్ ఇస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్‌కు ఉంటుందా? అని మండిపడ్డారు. చీఫ్ మార్షల్‌ను బాస్టర్డ్ అన్నానని వక్రీకరించారని, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి అనని మాటలు అన్నట్లు చెబుతున్నారని అన్నారు. సీఎం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణకిషోర్ అంశం చర్చకు రాకుండా సబ్జెక్ట్ డైవర్ట్ చేశారని ఆరోపించారు. సీఎంపై సభాహక్కుల నోటీసిచ్చామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతిపక్ష సభ్యుల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైఎస్సార్సీపీవాళ్లే. తిరిగి నేనే అనని పదాన్ని అన్నట్లుగా వాళ్లు సభలో సృష్టించారు. ఎంత కోపంలోనైనా వైఎస్సార్సీపీ వాళ్లలాగా సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, అమర్యాదకరంగా ప్రవర్తించడం నాకు రాదు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. -
రూ.100కోట్లకు పైనే అవినీతి
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/ఒంగోలు క్రైమ్/నెల్లూరు (క్రైమ్): ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ ఆర్‌టిఓగా పనిచేసి అటాచ్‌మెంట్‌పై విజయవాడ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిసున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయనపై పంజా విసిరింది. ఆయనతోపాటు ఆయన బంధువులు, బినామీల ఆస్తులపై గురువారం గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరులో కృష్ణకిశోర్ ఇంటితోపాటు ఆయన బినామీలుగా చెబుతున్న రవాణాశాఖ ఏజెంట్లు చెంచయ్య, ఎల్లయ్య ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. దాడుల్లో గుర్తించిన ఇళ్లు, స్థలాలు, పొలాలు తదితర ఆస్తుల విలువ రూ.వంద కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీఓలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకిశోర్ భార్య అనురాధ, కుమారుడు సత్య కమల్ కిషోర్, తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు శ్రీనివాస రాంప్రసాద్ నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. కృష్ణకిషోర్ తండ్రి వెంకటేశ్వర్లు గుంటూరు రవాణా శాఖలో టైపిస్ట్‌గా చేరి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది 1989లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందగా.. ఆ స్థానంలో కృష్ణకిశోర్ 1991 జూలై 13న గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 1997లో సీనియర్ అసిస్టెంట్‌గా అక్కడే పదోన్నతి పొందారు. 2010లో నెల్లూరు ఆర్టీవో కార్యాలయ ఏఓగా బదిలీ అయ్యారు. ఏఓగా, ఇన్చార్జి ఆర్టీవోగా నెల్లూరులో సుమారు ఆరేళ్లకుపైగా బాధ్యతలు నిర్వహించారు. స్థలాలే స్థలాలు... కృష్ణకిశోర్‌కు గుంటూరు జిల్లా ఈదులపాలెంలో 400 చ.గజాలు, సత్తెనపల్లిలో 60 గజాలు, గుంటూరు స్తంభాలగరువులో 36.78, 112 గజాల స్థలాలు, తాడికొండలో 100 గజాలు, నరసరావుపేట మండలం కాకానిలో 2.4 ఎకరాలు, 9.10 ఎకరాలు, 9.66 ఎకరాలు, 2.98 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. పిట్లవారిపాలెంలో 25 సెంట్లు, కొరిటెపాడులో 175 గజాలు, గోరంట్లలో 195.5 గజాలు, వినుకొండలో 1.7 ఎకరాలు, రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో రామ్‌లీలా అపార్ట్మెంట్లో టి.అనూరాధ పేరు మీద రెండు ఫ్లాట్లు, సంతపేటలో మరో ఇంటిని గుర్తించారు. పలు ప్రాంతాల్లో 10 ఇళ్ల ప్లాట్లు, విశాఖ జిల్లా రామాపురంలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను గుర్తించారు. 250 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, రూ.1.37లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రముఖ జర్నలిస్టు పిరాట్ల అస్తమయం
హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, కృష్ణా పత్రిక పూర్వ సంపాదకుడు పిరాట్ల వెంకటేశ్వర్లు (74) సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమారుడు కృష్ణకిశోర్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఎర్రగడ్డ ఈఎస్ఐ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1940 జూలై 16న కృష్ణాజిల్లా గన్నవరం మండలం వెన్నునూతలలో జన్మించిన పిరాట్ల 50 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తెలుగు భాషాభివద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సాహిత్యమన్నా, సంప్రదాయమన్నా ప్రాణమిచ్చేవారు. ముట్నూరి కృష్ణారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పిరాట్ల కృష్ణా పత్రికా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. 1983లో అప్పటికే మూసి ఉన్న కృష్ణాపత్రికను పునరుద్ధరించి సంపాదకునిగా పనిచేశారు. అంతకుముందు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆర్ఎస్ఎస్ ముఖ్య ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపారు. వైఎస్ జగన్ సంతాపం పిరాట్ల మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణా పత్రిక పునరుద్ధరణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని ఒక ప్రకటనలో కొనియాడారు. పిరాట్ల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పలువురి సంతాపం పిరాట్ల మృతి పట్ల కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పిరాట్ల మృతి పత్రికాలోకానికి తీరని లోటని ఏపీడబ్ల్యుజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, టీడబ్ల్యుజేఎఫ్ అధ్యక్షుడు ఎం.సోమయ్యలు సంతాపం ప్రకటించారు. -
నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఏడో రోజు విశేషాలు ఆదివారం తెల్లవారుజాముకి పూర్తి స్థాయిలో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మరోపక్క ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ‘యువసేన’ ఫేమ్, బుల్లితెర పాపులర్ నటుడు కృష్ణ కిశోర్ (కె.కె.) కీలక పాత్రలో చివరి రోజు షూటింగ్లో పాల్గొన్నారు. 80 శాతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డీఐ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. టైటిల్ యానిమేషన్, పోస్టర్ డిజైన్స్, ట్రైలర్స్ రూపొందించే పనిలో దర్శకుడు నాగేంద్ర ప్రసాద్, ఎడిటర్ శివ నిమగ్నమయ్యారు. -
తప్పిన ముప్పు
* మద్యం మత్తులో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్ * రెండు కార్లు, ఓ ట్రాక్టర్‌ను ఢీకొన్న వాహనం కీసర: డ్రైవర్ తప్పతాగి స్కూల్ బస్సును నడిపి రెండు కార్లు, ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని నాగారం సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రాంపల్లి గ్రామంలోని రికిల్పోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో 15 మంది విద్యార్థులను ఎక్కించుకొని డ్రైవర్ సుధాకర్‌రెడ్డి బయలుదేరాడు. అప్పటికే అతిగా మద్యం తాగిన డ్రైవర్ బస్సును నాగారం, దమ్మాయిగూడల్లో 11 మంది విద్యార్థులను దింపాడు. మరో నలుగురిని కీసర, గోధుమకుంట, ప్రజయ్‌సాయి గార్డెన్లో దింపేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో నాగారం ఐకాం కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టాడు. అనంతరం పక్కనే ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని బస్సు ఆగిపోయింది. బస్సులో కీసరకు చెందిన రిత్రిక, నేత్రికతో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంతో వీరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు కార్లలో ఉన్న కృష్ణగౌడ్, శ్రీకాంత్‌గౌడ్, మహేందర్‌గౌడ్, శైలజ, లావణ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారులను కిందికి దించి, మత్తులో ఉన్న డ్రైవర్ సుధాకర్‌రెడ్డిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు కీసర సీఐ కృష్ణకిషోర్ తెలిపారు.