ఐక్యరాజ్య సమితిలో మెరిసిన తెలుగు తేజం కృష్ణకిషోర్
సుస్థిర అభివృద్ధి అంశంపై ప్రసంగం
జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నాడు రూ.కోటి మంజూరు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్‌ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్‌ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్‌కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్‌మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్‌ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్‌గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.
జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ
Comments
Please login to add a commentAdd a comment