Jagananna Videshi Vidya Deevena
-
Andhra Pradesh: విదేశీ విద్య.. ఇప్పుడు మిథ్య!
పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూటమి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.ఏదైనా అప్డేట్ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుంచి స్పష్టత రాక పోవడం శోచనీయం. – సాక్షి, అమరావతిప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు. – గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం. – పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదనపేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్ జగన్ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.⇒ ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దివిసీమ బిడ్డకు ‘జగనన్న దీవెన’
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్‌కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్‌గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ -
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్ లెట్ ఆవిష్కరణ
-
విద్యాదీవెన..ఉన్నత శిఖరాలకు వంతెన
-
AP: విదేశాల్లో చదువుతున్నారా? ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది). లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము... విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ బీమా వలన ముఖ్య ప్రయోజనాలు ► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లింపు ► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు ... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించండి మరియు వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయండి. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించండి. -
స్టూడెంట్ మాటలకు సీఎం జగన్ ఫిదా
-
విదేశీ విద్యా దీవెన స్కాలర్షిప్ తో మా కల నెరవేరింది: విద్యార్థులు
-
జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
చదుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్
-
పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ‘విదేశీ విద్యా దీవెన’: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. చదవండి: Dec 20th: AP పొలిటికల్ అప్డేట్స్ జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయి. ►కార్నిగిమెలన్ యూనివర్సిటీలో రూప అనే చెల్లెమ్మకు 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ► సాంబశివ అనే తమ్ముడికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు.. ►కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 75.87 లక్షలు ఫీజు ►వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయ 70 లక్షలు ఫీజు ► యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చింది 67.50 లక్షలు ఫీజు.. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయి. ►సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నంబర్స్ ఉన్నాయి. ► ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ కలిగే పరిస్థితి. ► అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా అడుగులు పడుతున్నాయి. ►ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక బూన్ కింద, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోంది. ►ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వాళ్ల కుటుంబాలను ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు స్థాయిలోకి తీసుకుపోయేలా రావాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని ఆశీస్తున్నా. ► మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. ►ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటంతో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ►ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్‌కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. ►ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ►చదువులు మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ►చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ►ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నాం. ►11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నాం ► గవర్నమెంట్లో శాచురేషన్, ట్రాన్స్పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ►అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ► ఎక్కడా రికమెండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ► అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తున్నా. ►గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి. ►ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. ►ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ► ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి. ►* దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదు. ►ఎల్లయ్య.. పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా రికమెండేషన్లు పెట్టుకొని కొంతమంది మాత్రమే పొందేవారు. ►అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. పొలిటికల్ జోక్యం, కరప్షన్, లంచాలు లేవు. ►ఎవరికైనా టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీలు 350 కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా కోటీ 25 లక్షల దాకా లిమిట్ పెట్టి చేశాం. ► ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. లీడర్స్‌గా ఎదగాలి. ► మీరు రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ స్టోరీలు స్పూర్తిగా నిలవాలి. ►ఇవన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మనస్పూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. ►నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా.. ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
Live: జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల
-
నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం జమ
-
Vidya Deevena: నిధుల్ని విడుదల చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ.. మరోవైపు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అందించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.6 కోట్లను, సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలుచేసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధిచేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకలీ్టలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. దీనిద్వారా ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం పేదలకు వరం
-
విదేశీ విద్యా దీవెన కింద 1,830 మందికి సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం కింద ఇప్పటివరకు 1,830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకం అక్రమాల పుట్టగా మారిందని విజిలెన్స్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకంలోని లోపాలను చక్కదిద్ది మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులందరికీ సంతృప్త విధానంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయమందిస్తోంది. 21 నిర్దేశిత సబ్జెక్ట్ కేటగిరీల్లో 50 విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ప్రవేశం పొందినవారికి ట్యూషన్ ఫీజు కింద రూ.కోటి 25 లక్షల వరకు ఆర్థిక సాయం (వాస్తవ రుసుం) అందిస్తోంది. ఈబీసీలు రూ.కోటి వరకు ఆర్థిక సాయానికి అర్హులు. గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే సాయం అందించేది. అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకే పరిమితం చేసింది. ఆ ఆదాయ పరిమితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.8 లక్షలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. -
విదేశీ విద్యకు రూ.కోటి మంజూరు.. కృతజ్ఞతగా సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
సాక్షి, అవనిగడ్డ: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్ కుమారుడు కృష్ణకిషోర్ అమెరికాలోని కొలంబియా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్య అభ్యసించేందుకు ఫీజుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. దీనికి కృతజ్ఞతగా విద్యార్థి కృష్ణ కిషోర్ తన తల్లిదండ్రులతో వచ్చి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తోందని చెప్పారు. చేసిన విద్యార్థి -
విద్యకి విలువనిచ్చే వ్యక్తి మా జగన్ మామ
-
విదేశీ విద్యపై రామోజీ విష ప్రచారం
-
చదువులే అసలైన ఆస్తి అని చాటుతున్న జగన్ సర్కార్
-
విదేశీ విద్యపైనా ‘ఈనాడు’ విషం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని రూపొందించేటప్పుడు లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపికలో నిబంధనలను స్పష్టంగా పేర్కొంటుంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యున్నత ప్రతిభావంతులకు రూ. కోటికి పైగా సాయం అందించే అద్భుత పథకం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’. ఈ పథకానికీ నిబంధనలు రూపొందించి పారదర్శకంగా అమలు చేస్తోంది. అది కూడా సంతృప్త స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా రూపొందించిన పథకమిది. ఈ పథకంతో రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు నోబెల్ గ్రహీతలకు నిలయమైన గొప్ప సంస్థల్లో చదువుకుంటున్నారు. టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు చదువుకున్న విశ్వవిద్యాల యాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇదే ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. అవాస్తవా లతో ‘ఈనాడు’ పత్రిక ఓ విష కథనాన్ని ప్రచురించింది. గత ప్రభుత్వంలో ఊరూ పేరూ లేని కొన్ని విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించడంతో పాటు నిబంధనలకు పాతరేసి నిధులను దోచుకున్నా పట్టించుకోని ఈ విష పత్రిక.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిభ ఉన్నవారికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు, గుర్తింపు పొందిన గొప్ప యూనివర్సిటీల్లో చేరిన వారికి అవకాశాలు కల్పిస్తుంటే తప్పుగా చూపిస్తోంది. ప్రభుత్వ నిబద్ధతను, ఉన్నత ఆశయాలను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా కథనాన్ని ఇచ్చింది. గతం కంటే పెరిగిన విదేశీ విద్యా సంస్థలు ప్రభుత్వం 2022 జూలై 11న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్యూఎస్/ టైమ్ ర్యాంకుల్లో ఉన్న 200 యూనివర్సిటీలనే తీసుకుంది. కానీ, ఎక్కువ మంది విద్యార్థులు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్ 50లో ఉన్న విద్యా సంస్థలకూ వర్తింపజేసింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. అంటే గతంలోకంటే 120 యూని వర్సిటీలు అధికంగా ఉన్నాయి. పైగా విద్యా ర్థులు ఫలానా దేశంలోని యూనివర్సిటీ లకు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఏదీ విధించకుండా ఆ ర్యాంకింగ్‌లో ఉన్న ఏ విద్యా సంస్థకైనా వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. మరి విద్యా సంస్థలు ఎక్కడ తగ్గిపోయాయో రామోజీనే చెప్పాలి. గత ప్రభుత్వంలో విదేశీ విద్యా సంస్థల ఎంపికకు ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. ర్యాంకింగ్‌ను పట్టించుకోకుండా 15 దేశాల్లోని విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశమిచ్చారు. దాంతో విద్యార్థులు నాసి రకమైన సంస్థల్లో ప్రవేశాలు పొంది భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టుకున్నారు. బాబు పాలనలో ఫీజు రూ.15 లక్షలే.. ఇప్పుడు రూ.1.25 కోట్లు గత చంద్రబాబు ప్రభుత్వం విదేశాల్లో చదువు కునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గరి ష్టంగా రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకొంది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్లు వెచ్చిస్తోంది. ♦ గత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను, వర్గాన్నిబట్టి 100 నుంచి 500 మందికి మాత్రమే పరిమితం చేసింది. దాంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగింది. విద్యార్థుల ఎంపికలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంది. విద్యార్థి కుటుంబ వార్షికాదాయ పరిమితిని కూడా రూ.6 లక్షల కు పరిమితం చేసింది. కుటుంబంలో ఒక్కరికే పథకం వర్తింపజేస్తూ నిబంధన పెట్టారు. ♦ ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిభావంతులు ఎందరున్నా వారందరికీ అవకాశం కల్పిస్తోంది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు పెంచింది. ♦ గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకోలేదు. పైగా 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.318 కోట్లు ఎగ్గొట్టింది.దీంతో వారి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపో యారు. చాలామంది విద్యార్థులు విదేశీ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం నిధుల దుర్వి నియో గానికి తావు లేకుండా విద్యార్థి సెమి స్టర్/ టర్మ్ పత్రాలు సమర్పించగానే ఆ నిధు లను విడుదల చేస్తోంది. ఈ మార్గదర్శ కాల్లో ఎలాంటి మార్పు లేకున్నా ఈనాడు పత్రిక మాత్రం నిధుల విడుదలకు అదనపు ఆంక్షలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. ♦గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలులో జరిగిన తీవ్రమైన లోపాలు విజిలె న్స్ విచారణలో బయటపడ్డాయి. చాలా మంది విద్యార్థులు నిధులు మంజూరైన తర్వాత విద్యా సంస్థను మార్చే యగా, మరికొంత మంది కోర్సును మధ్య లో ఆపేసి వచ్చేశారు. పథకానికి ఎంపికైన వారిలో కొందరు దరఖా స్తులో ఇచ్చిన చిరు నామాలో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు ప్రతి విద్యార్థీ ఎక్కడ ఏ కోర్సు చదువుతు న్నారు, వారి చిరునామా, కుటుంబ వివరా లతో సహా పారదర్శకంగా పరిశీలిస్తున్నారు. 357 మంది లబ్ధిదారులకు రూ.142.71 కోట్లు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద గత ఏడాది 290 మంది, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబ్ధిపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీలు 64 మంది, క్రిస్టియన్లు నలుగురు, ముస్లింలు 20 మంది, ఈబీసీలు 175 మంది ఉన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్ సీజన్ కింద ఎంపికైన 67 మందిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒకరు, బీసీలు 13 మంది, క్రిస్టియన్లు నలుగురు, ముస్లింలు 8 మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్ విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈనాడు మాత్రం కేవలం ఐదుగురు ఎస్సీ, ఒక ఎస్టీ విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారని, బీసీ విద్యార్థులెవరికి ఈ పథకం వర్తించలేదని అబద్ధపు కథనం ప్రచురించింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు ఎంతగా మేలు చేస్తుందో చెప్పడానికి లబ్ధిపొందిన ఓ విద్యార్థి అధికారులకు రాసిన లేఖే ఉదాహరణ.. ఇదిగో లేఖ.. ‘‘రెస్పెక్టెడ్ సర్, నా పేరు సుకుమార్ దొడ్డ. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వణుకూరు గ్రామం నుంచి వచ్చాను. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ చదువుతున్నా. వణుకూరులోనే పాఠశాల విద్య పూర్తి చేశాను. అండర్ గ్రాడ్యుయేట్ వరంగల్ ఎన్ఐటీలో చేశాను. మా నాన్న దినసరి కూలీ. అమ్మ గృహిణి. మా ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పటికీ, నాన్న నన్ను కష్టపడి చదవమని ప్రోత్సహించేవారు. నేను విదేశాలలో మాస్టర్స్ చదవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ అవకాశం లేదని విరమించుకున్నాను. అదృష్టవశాత్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టడంతో నా కల మలుపు తిరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు తోడ్పాటు నిచ్చింది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ 50 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేశాను. ఎస్ఎల్సీ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ పథకానికి ఎంపికయ్యా ను. 2023 జూలై 24 నుంచి క్లేటన్‌లోని మోనాష్ విశ్వవిద్యాలయంలో చదువుతు న్నాను. విదేశాలలో చదువుకో వాలనే నా కలను సాధ్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రూ.52 లక్షల స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం నుంచి అందుకున్నాను, ఇది నా రెండేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తం. ఈ ఉదారమైన స్కాలర్షిప్ నా కలను నెరవేర్చుకునేందుకు, నన్ను నేను నిరూపించుకునేందుకు దోహదపడింది. కృతజ్ఞతలతో – అసుకుమార్ దొడ్డ -
జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల
-
జగనన్న విదేశీ విద్యా దీవెన.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పు అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్యార్థులకు ‘విదేశీ’ వరం!
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం విద్యా రంగంలో విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో నిలిచిపోతుంది. మన పిల్లలు టాప్ సీఈవోలుగా ప్రపంచాన్ని శాసించే ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాంటి యూనివర్సిటీల్లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు అప్పుల బారిన పడకుండా.. పిల్లలు దిగులు చెందకుండా విదేశాల్లో ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నాం. ఇలా పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పథకానికి పరిమితులు లేకుండా శాచ్యురేషన్ విధానంలో అర్హులందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఏమన్నారంటే.. వీసా నుంచి విమాన చార్జీల దాకా.. మంచి కాలేజీలో సీటు వచ్చినా అంత డబ్బులు కట్టే స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుంది. ఒక భరోసా కల్పిస్తుంది. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ 50 విద్యాసంస్ధల్లో సీటు సాధించిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. శాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నా అర్హత ఉంటే సపోర్టు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వ విద్యాలయాలకు వెళ్లే పిల్లలను విమాన చార్జీలు, వీసా చార్జీల దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. పది ఉత్తమ విద్యాసంస్థల్లో ఫీజులిలా.. ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే ఫీజులు ఎలా ఉన్నాయి? సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా? అన్నది ఒక్కసారి గమనిస్తే.. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్టర్‌లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీ మిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్‌లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో రూ.67 లక్షలు, యూసీ బర్క్లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులున్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను. ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలని.. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా సామాన్యులు, పేదరికం కారణంగా అంత ఫీజులు కట్టి చదవడం సాధ్యమేనా? అన్నది మొట్టమొదట ఈ పథకం గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే రేపొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈవోలుగా రాణించే స్థాయికి చేరుకుంటారు. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. అందుకే అలాంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే ఏ రకంగా మన పిల్లలను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరణ. నాడు.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా గత ప్రభుత్వంలో పరిస్థితి చూస్తే కేవలం రూ.10 లక్షలు.. ఎస్సీ ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? మనమిస్తున్న రూ.1.02 కోట్లు, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ? గతంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ దొరికేది కాదు. శాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. నేడు అర్హులందరికీ.. ఈరోజు పథకంలో పూర్తి మార్పులు తీసుకొచ్చి శాచ్యురేషన్ విధానంలో అమలు చేస్తున్నాం. అర్హత కలిగి ఉండి టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింప చేస్తున్నాం. గతంలో ఆదాయ పరిమితి రూ.6 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.8 లక్షల వరకూ పెంచాం. అర్హత ఉంటే చాలు.. రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఏకైక రాష్ట్రం ఏపీ ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో భావితరాలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని గుర్తుంచుకునేలా ఇంత సపోర్టు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదిగి పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఉన్నత స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలుగు విడతలుగా స్కాలర్షిప్.. ఈ స్కాలర్షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత ఇస్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి మార్క్స్ షీటు అప్లోడ్ చేయగానే చివరి విడతను విద్యార్థులకు అందించేలా పథకాన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన రాష్ట్ర ఖ్యాతిని పెంచాలి మన పిల్లలకు అంతా మంచి జరగాలి. తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదు. అప్పుల పాలవుతామనే భయం లేకుండా పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి. పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపారనే బాధ ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించాం. పిల్లలు అక్కడకు (విదేశాలకు) వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె.వెంకటమురళి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆల్ ది బెస్ట్ చరణ్: సీఎం జగన్
-
జగనన్న విదేశీ విద్య లేకపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి..