![Videshi Vidya Deevena: Student Anointed To CM Jagan Photo Mopidevi mandal - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/17/Videshi-Vidya-Deevena.jpg.webp?itok=AZAPAs94)
సాక్షి, అవనిగడ్డ: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్ కుమారుడు కృష్ణకిషోర్ అమెరికాలోని కొలంబియా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్య అభ్యసించేందుకు ఫీజుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది.
దీనికి కృతజ్ఞతగా విద్యార్థి కృష్ణ కిషోర్ తన తల్లిదండ్రులతో వచ్చి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తోందని చెప్పారు.
చేసిన విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment