Mopidevi Village
-
విదేశీ విద్యకు రూ.కోటి మంజూరు.. కృతజ్ఞతగా సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
సాక్షి, అవనిగడ్డ: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్ కుమారుడు కృష్ణకిషోర్ అమెరికాలోని కొలంబియా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్య అభ్యసించేందుకు ఫీజుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. దీనికి కృతజ్ఞతగా విద్యార్థి కృష్ణ కిషోర్ తన తల్లిదండ్రులతో వచ్చి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తోందని చెప్పారు. చేసిన విద్యార్థి -
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొన్న దేవిరెడ్డి
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి కుటుంబసభ్యులు పుట్టలో పాలు పోసి తమ మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. -
మోపిదేవి ఆలయంలోకి వర్షపు నీరు
సాక్షి, కృష్ణా జిల్లా: గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో రుద్రాభిషేకాలు, స్వామివారి సేవలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు అవనిగడ్డలో కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎమ్మారో కార్యాలయం,ప్రభుత్వ పాఠశాలలో కూడా వర్షపు నీరు చేరుకుంది. పంటపొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్.. అవనిగడ్డ దివిసీమలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొడూరు నాగాయలంక మండలం లో నీటమునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. అల్పపీడనం ప్రభావంతో కైకలూరు,మండవల్లి, ముదినేపల్లి కలిదిండి మండలాల్లో మంగళవారం తెల్లవారు జాము నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది. (చదవండి: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు) -
పాముకాటుతో యువకుడు మృతి
అవనిగడ్డ (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన నాగభూషణం(20) అనే యువకుడు శనివారం మధ్యాహ్నం పాముకాటుకు గురై మృతిచెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన నాగ భూషణంను పాము కాటేసింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలో అతను మృతిచెందాడు.