మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం
సాక్షి, కృష్ణా జిల్లా: గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో రుద్రాభిషేకాలు, స్వామివారి సేవలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు అవనిగడ్డలో కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎమ్మారో కార్యాలయం,ప్రభుత్వ పాఠశాలలో కూడా వర్షపు నీరు చేరుకుంది.
పంటపొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్..
అవనిగడ్డ దివిసీమలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొడూరు నాగాయలంక మండలం లో నీటమునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. అల్పపీడనం ప్రభావంతో కైకలూరు,మండవల్లి, ముదినేపల్లి కలిదిండి మండలాల్లో మంగళవారం తెల్లవారు జాము నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది.
(చదవండి: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు)
Comments
Please login to add a commentAdd a comment