avanigadda
-
కదిరిలో సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
-
బాబు, పవన్ డబుల్‌గేమ్‌పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్‌గేమ్‌పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్‌కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్‌కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్‌ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్‌నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్‌నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
టీడీపీ నేతకే ఇచ్చేసేనా?
సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు. ఇక్కడ పార్టీలోని ఆశావహులను కాదని టీడీపీ నేతల వైపు ఆయన చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జనసేన రోజుకో పేరుతో ఫోన్ సర్వేలు చేయిస్తుండడం పార్టీ శ్రేణుల్లో అసహనం పెంచుతోంది. గతనెలలో జనసేనలో చేరిన అవనిగడ్డకు చెందిన కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనుతోపాటు ఎడ్లంకకు చెందిన ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్, జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ కన్వినర్ బండి రామకృష్ణ ఈ సీటును ఆశిస్తున్నారు. బండ్రెడ్డి రామకృష్ణ సొంతూరు నాగాయలంక మండలం మర్రిపాలెం. ఈయన తొలి నుంచీ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా ఇంతకాలం పార్టీకి సేవలందించానని తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే బందరు అసెంబ్లీ టికెట్ టీడీపీకి కేటాయించడంతో తనకు అవనిగడ్డలో అవకాశం ఇవ్వాలని బండి రామకృష్ణ అడుగుతున్నారు. ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేసుకుంటూ.. హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంత వరకు పార్టీలో చేరలేదు. టికెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తే చేరతానని చెబుతున్నట్టు సమాచారం. బాపట్ల జిల్లాకు చెందిన సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కూడా అవనిగడ్డ టికెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. రేసులో ముందున్న టీడీపీ నేతలు ఈ సీటు కోసం జనసేన నుంచి టీడీపీ నేతలూ పోటీ పడుతున్నారు. ఇక్కడ వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దించుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. -
సర్వే పేరుతో అయోమయం బయటపడ్డ కాల్ రికార్డు
-
రగిలిపోతున్న ‘మండలి’.. జంపేనా?
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ రగిలిపోతున్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.. తొలి జాబితాలో అవకాశం దక్కక పోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్‌కు పంపించగా, అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు. సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు బుద్ధ ప్రసాద్ దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కడ టీడీపీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోయింది. మరో వైపు, కృష్ణా జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే యోచనలో బుద్ధ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ‘‘తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ బుద్ధ ప్రసాద్ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం -
టీడీపీ తొలి జాబితాపై మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్.. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని బుద్ధ ప్రసాద్ ఆశపడ్డారు. పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్‌లో పెట్టారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'కు 365 రోజులు.. ఎక్కడో తెలుసా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. గతేడాది బాక్సాఫీస్ హిట్‌గా భారీ విజయాన్ని అందుకుంది. శుత్రిహాసన్, రవితేజ నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది అత్యధిక కలెక్షన్స్ (రూ. 236 కోట్లు) రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పాటు థియేటర్లలో కనిపిస్తేనే అదొక రికార్డు.. ఇప్పటి రోజుల్లో ఏ సినిమా అయినా కానివ్వండి బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రూ. 100 కోట్లు వచ్చాయా..? అని చూస్తున్నారు. అలా అయితేనే నేటి రోజుల్లో సినిమా హిట్ అనేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకకు రెడీగా ఉంది. ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది. నేడు సాయింత్రం (జనవరి 9) అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో మెగా ఫ్యాన్స్ 365 రోజుల వేడుక చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతేడాదిలో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో జరిపింది. ఆ సమయంలో చిరంజీవి ఇలా మాట్లాడారు. 'అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని సంతోషం వ్యక్తం చేశారు. అలా పాతరోజులను ఆయన మళ్లీ గుర్తుచేసుకున్నారు. వాల్తేరు వీరయ్య నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
దేశంలో సామాజిక సాధికారత సాధించిన తొలి సీఎం జగన్
అవనిగడ్డ: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసి సామాజిక సాధికారత సాధించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ పేదలకు ఉన్నతస్థాయి విద్య, వైద్యాన్ని చేరువ చేశారని చెప్పారు. ప్రతి పేద పిల్లవాడికి ఫీజుల నుంచి చదువుకోవడానికి అవసరమైన అన్ని వనరులు సీఎం జగన్ సమకూరుస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, వందల కోట్లు తీసుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు అమ్ముకున్నారని విమర్శించారు. సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి చరిత్ర సృష్టించారని చెప్పారు. గతంలో చంద్రబాబు బీసీల తోక కట్ చేస్తానని అన్నారని, ఎస్సీల్లో పుడతారని ఎవరు కోరుకుంటారని హీనంగా మాట్లాడారన్నారు. 2019 ఎన్నికల్లో ఆ బీసీలు, ఎస్సీలే చంద్రబాబు తోక కట్‌చేశారని చెప్పారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకే పవన్‌కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా యాదవులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారన్నారు. పౌష్టికాహారం సూచీలో 24వ స్థానం నుంచి 8వ స్థానానికి తెచ్చారని, పేదరికాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్‌దే అని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గతంలో ఎందరో మేధావులు సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా సాధ్యం కాలేదని, ముఖ్యమంత్రి వైస్ జగన్ దానిని సాధ్యం చేసి చూపించారని చెప్పారు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం, లక్షలాది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్ధలాలు, నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాలను ఆధునికంగా తీర్చిదిద్దారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారని, సీఎం జగన్ సమూలంగా ప్రక్షాళన చేసి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి విద్య, అత్యాధునిక వైద్యం, అవినీతి రహిత సంక్షేమం ద్వారా పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. మాజీ సీఎం చంద్రబాబు పేదల ఇళ్లలో దీపాలు ఆర్పే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎన్నో అవమానాలకు గురిచేసి, జైలుకి పంపించారని, అదే వర్గాలను సీఎం జగన్ అక్కున చేర్చుకొని, పార్లమెంట్‌కు పంపించారని చెప్పారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు రాకుండా కోర్టుల ద్వారా అడ్డుపడిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. సీఎం జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతారన్నారు. గతంలో చాలా మంది నాయకులు పేదరికాన్ని తగ్గిస్తామని మాటలే చెప్పారని, సీఎం జగన్ దానిని ఆచరణలో చేసి చూపించారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశంసించారు. సీఎం జగన్ రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పేద కుటుంబాలను బలోపేతం చేశారని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఓసీకి రిజర్వ్ అయినప్పటికీ, బీసీ అయిన తనకు ఆ సీటు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతకు అసలైన అర్ధం చెప్పారని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చెప్పారు. 22ఎ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడంతో పాటు అడిగిన వెంటనే కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్‌కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
అవనిగడ్డలో దిగ్విజయంగా కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర
-
అవనిగడ్డలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పర్యటన
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సోమవారం పర్యటించారు. సామాజిక సాధికార బస్ యాత్ర ఏర్పాట్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధమైన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరిశీలించారు. కాగా నవంబర్ 2న అవనిగడ్డలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ళ్ల అయ్యోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. నాలుగేళ్ళలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 85 శాతం మందికి వారి అవసరాలు తీర్చామని చెప్పారు. ఆయా వర్గాల జీవన విధానం మెరుగు పడిందన్నారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులు, లబ్ధిదారులు వేడుకలా జరుపుకునే వాతావరణం ఏర్పడిందని తెలిపారు. బస్సు యాత్ర రూట్లో అన్ని వర్గాల వారిని కలుస్తామని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ది ద్వారా కలిగిన సంతోషాన్ని పంచుకునే కార్యక్రమం సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్ధిక, సామాజిక సాధికారతకు సీఎం జగన్ పరిపాలన దోహదపడిందని తెలిపాఉ. -
పవన్ ది అదే పలాయనవాదం..
-
"ఆ" పని చేయకపోతే నాకు ఓటేయంకండి
-
ఆవనిగడ్డ కరకట్ట కేసు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
సాక్షి, కృష్ణా: చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గాజుల రత్నభాస్కర్ (47) మృతదేహంగా దొరికిన సంగతి విదితమే. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారడంతో.. చేధించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ముదినేపల్లికి కారులో వెళ్లాల్సిన భాస్కర్ చోడవరం వైపు వెళ్లడం.. చివరకు శవమై కనిపించడం, పైగా వెంట తీసుకెళ్లిన డబ్బులూ కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ ప్రమాదం కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కెనాల్లో కారు దూసుకెళ్లిన 36 గంటల తర్వాత(మంగళవారం ఉదయం).. తోట్లవల్లూరు మండలం కళ్లంవారిపాలెం వద్ద నగ్నంగా రత్నభాస్కర్ మృతదేహం తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వచ్చి మృతదేహాన్ని చూసి రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఒంటిపై గాయాలు - ఎలాంటి క్లూ లేకపోవడంతో ఏం జరిగిందన్నది నిర్ధారించుకోలేకపోయారు పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. అర్థరాత్రి ఏం జరిగింది.. రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనేదే మిస్టరీగా మారింది. ఇంటి నుంచి ఆయన రూ.4 లక్షలతో బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. ఆర్థిక లావాదేవీలు, శత్రువులున్నారా? లేదంటే దొంగల పనా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అలాగే.. రత్నభాస్కర్ కారు జర్నీ ఆధారంగా సీసీఫుటేజ్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఒంటరిగానే వెళ్తున్నట్లు కనిపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం కీలకం.. రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం దొరికినా కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. నివేదిక వస్తేనే.. ఏం జరిగిందనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జరిగింది ఇదే.. ముదినేపల్లికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని గాజుల రత్నభాస్కర్ ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముదినేపల్లి ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సోమవారం వేకువజామున చోడవరం వద్ద తాను ప్రయాణిస్తున్న కారుతో సహా కేఈబీ కెనాల్లోకి దూసుకువెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న రత్నభాస్కర్ ముదినేపల్లికి వెళ్లకుండా చోడవరం వచ్చి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడాలని కారులోనే దుస్తులు విప్పి కాలువలోకి రత్నప్రసాద్ దిగి మృతి చెందాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న దుస్తులు, సెల్‌ఫోన్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తామని డీఎస్పీ జయసూర్య తెలిపారు. -
కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..
అవనిగడ్డ(కృష్ణా జిల్లా): ఆ దంపతుల అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టిందో.. లేక తల్లీబిడ్డల ప్రేమను చూసి మృత్యువు పగబట్టిందో ఏమో.. రోడ్డు ప్రమాదం తల్లీబిడ్డల జీవితాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేసింది. భార్యాబిడ్డలను దూరం చేసి ఆ యువకుడిని ఒంటరిని చేసింది. ఎంత శిక్ష వేశావు దేవుడా.. అంటూ అతను కన్నీరుమున్నీరుగా విలపించాడు. చదవండి: దొంగలను ఎదిరించిన మహిళ.. కత్తులతో పొడిచినా.. అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని లంకమ్మ మాన్యం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీబిడ్డలు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రెండో వార్డుకు చెందిన తోట చలమేశ్వరరావు, శ్రీవల్లి (32) దంపతులు. శ్రీవల్లి నడకుదురు సచివాలయంలో ఉద్యోగి. చలమేశ్వరరావు స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. 14 నెలల క్రితం కుమారుడు ప్రహాస్ జన్మించాడు. రెండు నెలల క్రితం ప్రహాస్ తొలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వ హించారు. చలమేశ్వరరావు, శ్రీవల్లి దంపతులు తమ కుమారుడు ప్రహాస్తో కలిసి బుధవారం అశ్వారావుపాలెంలోని తమ బంధువుల ఇంట జరిగే వేడుకకు బైక్‌పై బయలుదేరారు. లంకమ్మ మాన్యం మలుపు వద్ద ముందు వెళ్తున్న సెప్టిక్ ట్యాంకు ట్రాక్టర్ సైడ్ ఇవ్వడంతో చలమేశ్వరరావు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో డ్రైవర్ ట్రాక్టర్‌ను కుడివైపునకు తిప్పడంతో ట్రక్కు బైక్‌కు తగిలి ముగ్గురూ కింద పడిపోయారు. ప్రహాస్, శ్రీవల్లికి రోడ్డు దెబ్బలు బలంగా తగిలాయి. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహు టిన అవనిగడ్డలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ప్రహాస్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీవల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమారుడు, భార్య ఇద్దరూ తన కళ్లెదుటే మరణించడంతో చలమేశ్వరరావు విలపిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. ఈ ఘటనతో అవనిగడ్డ రెండో వార్డులో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఏది న్యాయం? ఎవరిది ధర్మం?
నాకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. నాకు దేవుడి దయ, ఆశీర్వదించే ప్రజలు ఉన్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అవ్వ, తాత తోడుగా నిలబడతారన్న నమ్మకం ఉంది. వారు అబద్ధాలను, కుట్రలను, మీడియాను, దత్తపుత్రుడిని, వారి పొత్తులను నమ్ముకుంటే.. నేను దేవుడి దయను, అక్కచెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగుంటే జగనన్నకు తోడుగా నిలవండి. – సీఎం జగన్ ఆయన గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఇలా నాలుగేళ్లో, ఐదేళ్లో కాపురం చేసి.. ఎంతో కొంత డబ్బులిచ్చి విడాకులు ఇచ్చేసి.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే.. అలా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి నాయకులు మనకు అవసరమా.. ఆలోచించండి. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని వారు, వెన్నుపోటు దారులు ఎన్నికల సమయంలో రంగు రంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. ఎన్నికల తర్వాత వాటిని చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ప్రజలు ప్రశ్నిస్తారేమోనని కనీసం వెబ్సైట్లలో కూడా కనిపించకుండా చేస్తారు. ఇలాంటి వారంతా దుష్టచతుష్టయంగా ఏర్పడ్డారు. మీ బిడ్డ మీద.. మన ప్రభుత్వం మీద.. మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట? ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతుండటం ఆశ్చర్యం వేస్తోంది. రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, విజయవాడ: ‘ప్రజలకు మనం మంచి చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని ఆ పెద్ద మనిషి (చంద్రబాబు).. తన దత్తపుత్రుడి (పవన్ కళ్యాణ్)తో ఎలా తిట్టించారో అందరం చూశాం. మనం మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని మాట్లాడుతుంటే, కాదు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ ఆయన గారు సెలవివ్వడమూ విన్నాం. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మును ముందు మరెన్నో కుట్రలు కనిపిస్తాయి. వాటిన్నింటినీ తిప్పికొట్టి.. ఏది న్యాయం, ఎవరిది ధర్మమో ఆలోచించండి. న్యాయం, ధర్మం వైపు నిలబడండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన 22(ఏ)1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనందరి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేస్తుంటే దుష్టచతుష్టయం ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►మీ గ్రామంలో మీ కళ్ల ఎదుటే కనిపిస్తున్న మార్పులను గమనించండి. గ్రామ సచివాలయాలు, అందులో 10 మంది ఉద్యోగులైన మన పిల్లలు మనకు సేవలు అందిస్తూ.. ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకూ వలంటీర్ కనిపిస్తున్నారు. ప్రతి అడుగులోనూ మనకు మంచి చేస్తూ చేదోడు, వాదోడుగా ఉన్నాడు. ►వివక్ష చూపకుండా, లంచాలు అడగకుండా 1వ తారీఖునే సూర్యోదయం అయిన వెంటనే, అది ఆదివారమైనా, పండుగ అయినా ఇంటికి వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టి వెళ్తాడు. ►అదే గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతులను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తోంది. మన కళ్లెదుటనే పారదర్శకంగా ఈ–క్రాప్ జరుగుతోంది. విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కల్తీ లేకుండా అందిస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో అండగా నిలుస్తున్నారు. ►మరో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రాక్టీçషనర్ అక్కడే ఉంటూ 24 గంటలూ అందుబాటులో ఉంటూ 67 రకాల మందులిస్తూ.. 14 రకాల డయోగ్నిస్టిక్ టెస్టులు చేస్తూ.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా పని చేస్తున్నారు. ►ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. నాడు–నేడుతో స్కూళ్ల రూపు రేఖలను మార్చాం. డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టబోతున్నాం. మన గ్రామాలలో మన పిల్లల కోసం వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మన కళ్ల ఎదుటే గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి. ►కాబట్టే మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో మీ ఇంటికి ఈ మేలు చేశామని, సవినయంగా చెప్పుకుంటూ గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చెప్పుకోవడానికి ఏమీ లేనివాళ్లంతా, గతంలో ప్రజలకు ఏ మేలూ చేయని వారంతా ఈ రోజు ఏం చేస్తున్నారో గమనించండి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సీఎం వైఎస్ జగన్ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం అవనిగడ్డకు వరాల జల్లు.. ►అవనిగడ్డకు సంబంధించి కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ సహకారాలు కావాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అడిగారు. అవనిగడ్డ–కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నా. కృష్ణానది కుడి, ఎడమ కరకట్ట.. సముద్రపు కరకట్టను పటిష్టం చేయడానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా. పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటుకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డలో కంపోస్ట్ యార్డు తరలించడానికి రూ.5–10 కోట్లు.. సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ.10–15 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మంజూరు చేస్తాం. ►ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, ఆర్కే రోజా, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థ సారధి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీధి రౌడీలను మించి బూతులు ►వాళ్లు చేసిన మంచేమిటో చెప్పుకోలేరు. ఈ రోజు వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. నాయకులుగా చెప్పుకుంటున్న వారు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మన నాయకులా? ►అవ్వాతాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆడ బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. దత్తపుత్రుడితో, దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అందరం చూస్తున్నాం. ►ఎవ్వరికీ, ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతుంటే.. కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండి.. అని చెప్పుకుంటున్న వారి గురించి ఆలోచించండి. అలాగైతే రేపు మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన కూతుళ్ల పరిస్థితి ఏంటి? మన చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ►వివక్ష, లంచాలు లేకుండా నేరుగా 87 శాతం ప్రజలకు మేలు చేసిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడూ మేలు చేయని పచ్చ రంగు పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతోంది. మరో 18–19 నెలల పాటు రోజూ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఆ దుష్టచతుష్టయం మోసాలను నమ్మొద్దు. ఆ పేపర్లను చదవొద్దు. ఆ టీవీలను చూడొద్దు. -
బిగ్ క్వశ్చన్ : దత్తపుత్రుడికి సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
సీఎం వైఎస్ జగన్ అవనిగడ్డ పర్యటన (ఫొటోలు)
-
ఒక్క జగన్ ను కొట్టడానికి అందరూ ఏకం అవుతున్నారు : సీఎం వైఎస్ జగన్
-
పవన్ మూడు పెళ్లిళ్ల కామెంట్స్ పై సీఎం జగన్ కౌంటర్
-
పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం: సీఎం జగన్
సాక్షి, అవనిగడ్డ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడం వల్ల రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలుసని, ఇవాళ ఆ సమస్యలన్నింటినీ రీ సర్వే ద్వారా పరిష్కరిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఎంతో మంది ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు, నిరాహార దీక్షలు సైతం చేస్తున్నప్పటికీ సమస్యలు కొలిక్కి రాలేదన్నారు. ఈ సమస్యపై గత పాలకులెవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనందరి ప్రభుత్వం.. ఈ సమస్యపై దృష్టి సారించి.. పరిష్కార మార్గం చూపుతోందని స్పష్టం చేశారు. గురువారం ఆయన 22ఏ–1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో భూముల రీ సర్వే చేపట్టి ఒక మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 వేల మంది సర్వేయర్లను నియమించామని, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ.. కోర్స్(కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టం) బేస్ సిస్టంను తీసుకొచ్చి.. విమానాలను, హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నామని.. డ్రోన్లను, రోవర్లను కొనుగోలు చేసి వాటినీ వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఒక యజ్ఞంలా రీ సర్వే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసి, ఉపయోగిస్తున్నాం. వంద సంవత్సరాలకు పూర్వం జరిగిన సర్వేకు మళ్లీ రీ సర్వే చేయించి, హద్దులను మళ్లీ పూర్తిగా మార్కు చేసి, రికార్డులు అన్నింటినీ పూర్తిగా అప్డేట్ చేయిస్తున్నాం. సబ్డివిజన్లు, మ్యుటేషన్స్ అన్నీ పక్కాగా చేపట్టి, ఇటువంటి సమస్యలున్న చోట అంటే షరతులు గల పట్టాలు, చుక్కల భూములు, అనాధీనం భూములు ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న అనేక భూములకు ఒక పరిష్కారం చూపాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దీక్షగా, ఒక యజ్ఞంలా చేస్తున్నాం. గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా రీసర్వే చేసి భూములు, స్థిరాస్తుల యజమానులకు స్పష్టంగా సరిహద్దులు చూపడంతోపాటు, ఈ మహాయజ్ఞంలో భాగంగా హక్కు పత్రాలను కూడా ఇవ్వబోతున్నాం. నవంబర్‌లో 1,500 గ్రామాలలో.. 17 వేల పై చిలుకు గ్రామాలకు గాను, నవంబరు నెలలో 1,500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి, హద్దులు రీ మార్క్ చేసి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూ హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇవన్నీ పూర్తి చేసి, ఆయా గ్రామాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉండేటట్టుగా అడుగులు వేస్తున్నాం. మన గ్రామంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటే మన భూములు వేరే వాళ్ల పేరు మీదకు మార్చి, తిక్క తిక్క చేష్టలు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. అటువంటి వాటిని మనం వెంటనే అడ్డుకోగలుగుతాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప యజ్ఞంగా భావించాం. నవంబరు నుంచి 1500 గ్రామాలతో మొదలు పెట్టి.. ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను యాడ్ చేసుకుంటూ వెళతాం. వచ్చే ఏడాది (2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ దిశలో మరో అడుగే ఈ రోజు మనం తీసుకుంటున్న నిర్ణయం. షరతులుగల పట్టా పేరుతో నిషేధిత జాబితాలో అంటే 22ఏ–1 లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు క్లియరెన్స్ పత్రాలను జారీ చేస్తున్నాం. రైతు మనసు తెలిసిన ప్రభుత్వమిది ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన చెడు ఏంటి? అన్నది ఆలోచించాలి. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది గతంలో దివంగత నేత వైఎస్సార్ అయితే, ఇవాళ మీ జగనన్న ప్రభుత్వం. అసైన్డ్ గాని, ఆర్వోఎఫ్ఆర్ కానీ, ఆలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నది మన అందరి ప్రభుత్వం. అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం వంచిస్తే.. ఈరోజు మంచి చేసింది మన ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతుల భూములను ఎలా దోచుకోవాలని ఆలోచిస్తే, అవి రైతులకు ఎలా ఇవ్వాలని ఆరాటపడుతూ, ఆలోచన చేస్తున్నది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం. పేదవాడి బాగోగులు మనసులో పెట్టుకుని అడుగులు వేస్తున్న ప్రభుత్వం. ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అందిస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవద్గీతగా భావించి 98 శాతం హామీలను 3 ఏళ్ల 4 నెలల కాలంలోనే నెరవేర్చిన ప్రభుత్వం మనది. 22 వేల మంది రైతులకు హక్కు పత్రాలు... ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాలలో 22ఏ–1 నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపినట్టవుతుంది. దీనివల్ల ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న 22,042 మంది రైతులకు, వారి భూమి మీద వారికి హక్కు కల్పించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. వేలాది మంది రైతులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయి. ఇలాంటి వారంతా ఇక రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. 22ఏ–1 కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ భూముల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తూ.. వాటిని డీనోటిఫై చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఈ నిర్ణయం వల్ల ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రమే 10,119 మంది రైతన్నలకు 15,791 ఎకరాలకు సంబంధించి ప్రయోజనం కలుగుతోంది. వీరందిరకీ యాజమాన్య హక్కులు అందుతాయి. ఇకపై ఆ రైతులు వాళ్ల భూములు అమ్ముకోవచ్చు. మరొకరు కొనుక్కోవచ్చు. లేదా ఆ రైతన్నలు ఆ భూములను వాళ్ల పిల్లలకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. వారికి పక్కాగా హక్కు పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. గత ప్రభుత్వ నిర్వాకం.. దేశంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారమే జరుగుతుంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతుగల భూముల పట్టాల పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటిని రకరకాల కేటగిరీ భూములు.. మెట్ట, తరి, సాగులో ఉన్న మెట్ట భూములు, డొంక, వంక, వాగు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు.. ఇలా అనేక రకాల కేటగిరీల్లో 1932 నుంచి 1934 మధ్యలో రికార్డులన్నీ రీసెటిల్మెంట్ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను, సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932–34 నుంచి రైతన్నలు వారి తరాలు, వారి పిల్లల తరాలు, తర్వాత వారి మనవళ్ల తరాలు అనుభవిస్తున్నారు. 2016 వరకు రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్ ఇలా ఈ భూములకు సంబంధించిన అన్ని లావాదేవీలు కొనసాగాయి. పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వడం వల్ల వారికి పంట రుణాలతో పాటు ఇతర రుణాలు కూడా అందేవి. కానీ 2016 మే నెలలో గత ప్రభుత్వం జిల్లాల వారీగా ఈ భూములు అన్నింటినీ నిషేధిత జాబితా 22–ఎ లో చేర్చుతూ.. రకరకాల జీవోలు జారీ చేసింది. అప్పటి నుంచి రైతన్నలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకే ఆ భూములు అన్నింటినీ డీ నోటిఫై చేసి, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసి, ఆ రైతన్నలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. వివాదాలన్నింటికీ ముగింపు పలికి.. అనాధీన భూములు, చుక్కల భూములు, ఇనాం భూముల సమస్యలన్నింటికీ గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపిస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డుల నిర్వహణలో దేశానికే ఒక మోడల్‌గా నిలిచేలా రీసర్వే చేపట్టాం. రైతుల సమస్యలు తెలిసిన మారాజు జగనన్న మా తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. 2017లో మా అమ్మాయి పెళ్లికి లోను తీసుకుందామని బ్యాంకుకు వెళితే రెండు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందని, లోను ఇవ్వం అని చెప్పారు. తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయంతో మా లాంటి రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. నిజంగా ఈ రోజు మా రైతులందరికీ పండుగ రోజు. – కొండవీటి వీర వెంకట నారాయణ, విశ్వనాథపల్లి, కోడూరు మండలం జగనన్న రుణం తీర్చుకుంటాం తండ్రి వారసత్వంగా నాకు వచ్చిన ఐదు ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లింది. పిల్లలను చదివించుకునేందుకు లోను కావాలని బ్యాంకుల చుట్టూ తిరిగితే ఇవ్వం అని చెప్పారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గతంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో భూ సమస్య తొలగిపోయింది. – రేపల్లె రాజయ్య, వి.కొత్తపాలెం, కోడూరు మండలం -
అవనిగడ్డకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్
సీఎం జగన్ అవనిగడ్డ పర్యటన.. అప్డేట్స్ 12:50PM నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు 12:08PM సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవు రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో ఇబ్బందులు వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నాం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నాం భూముల రీసర్వేతో రికార్టులను అప్డేట్ చేస్తున్నాం చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం చేశాం రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు భూముల, స్థిరాస్తుల యాజమానులకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నాం నవంబర్‌లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం హద్దులు సరిచేసి హక్కు పత్రాలు అందజేస్తాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం పేదవాడి బాగోగులను పట్టించుకునే ప్రభుత్వం మనది మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం వాగ్దాలను నెరవేర్చాం గ్రామాల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం మనది వాలంటీర్ వ్యవస్థతో నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు ఆర్బీకేల్లో విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సేవలు అవనిగడ్డ నియోజకవర్గంలో 15, 791 ఎకాలు, 10,019 మంది రైతన్నలకు ప్రయోజనం రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ 2016లో జీవో ఇచ్చింది ఆ భూములను డీనోటిఫై చేసి రైతన్నలకు మేలు చేశాం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేశాం రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలన్నింటికీ పరిష్కారం దేశానికి ఆదర్శంగా ఉండేలా రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణ మన పాలన, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి వెన్నపోటు దారులంతా ఎవరికీ మంచి చేయలేదు దుష్ట చతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతుంటే ఆశ్చర్యమేస్తోంది ఇది మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం పేదవానికి పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం మనం ఎవరికీ అన్యాయం చేయలేదు మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే..కాదు మూడు పెళ్లిళ్లు వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు మీరు చేసుకోండి.. అని ఏకంగా టీవీల్లో చెబుతున్నారు అలా అందరూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి నాయకులా మనకు దిశ దశ చూపేది? దుష్టచతుష్టయంగా ఏర్పడి కలిసి కూటములు కడతారు వాళ్ల మాదిరిగా నేను కుట్రలు, మీడియాను నమ్ముకోలేదు నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా 11:51AM మంత్రి ధర్మాన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్ చెప్పారు భూములపై సీఎం జగన్ అన్ని హక్కులు కల్పించారు భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్ రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్ కల్పించారు 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్ ఆర్డర్ ఇచ్చారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం 11:30 అవనిగడ్డ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ 10:51AM అవనిగడ్డకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన మంత్రులు ధర్మాన, రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, అధికారులు 10:00AM గురువారం అవనిగడ్డ పర్యటనలో భాగంగా.. గుంటూరులోని తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు సీఎం జగన్. ► అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే రైతులకు భూపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సాగనుంది. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. -
సీఎం వైఎస్ జగన్ అవనిగడ్డ పర్యటన
-
అవనిగడ్డ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అవనిగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం సీఎం జగన్ పర్యటన ఉండనుంది. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్ పత్రాలను అందజేయనున్నారు. సీఎం జగన్ అవనిగడ్డ పర్యటన షెడ్యూల్ ఇలా.. ► ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. ► పదకొండు గంటల ప్రాంతంలో.. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ► గంటన్నర పాటు సాగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ► ఆపై నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేస్తారు. ► అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదీ చదవండి: ఎవరూ వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూసర్వే -
Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి. మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి) ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు) – డా. జె. వి. ప్రమోద్ కుమార్, పైడిమెట్ట (సెప్టెంబర్ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి) -
సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం: రోజా
-
CM YS Jagan: అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
కబడ్డీ ఆడిన నటుడు అలీ..
సాక్షి, అవనిగడ్డ: టాలీవుడ్ సినీ నటుడు ఆలీ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆదివారం సందడి చేశారు. అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొని కబడ్డీ కోర్టులో కూతపెట్టి పోటీలను ప్రారంభించారు. అలీతో కలిసి స్థానిక ఆర్డీవో ఖాజావలీ కూడా కబడ్డీ ఆడి అలరించారు. అనంతరం పోలో విజేతలుగా నిలిచిన వారికి అలీ చేతుల మీద బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఆటలపోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆటలపోటీలు నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీకి అలీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి జిల్లా ఎస్పీ ఆలోచన అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని అలీ కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. చదవండి : నా మేనకోడలిని ఆశీర్వదించండి అదే విధంగా మండల పరిధిలోని పులిగడ్డ ఇరిగేషన్ అతిథి గృహంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సతీష్ దర్శకత్వంలో అలీ ముఖ్యపాత్రలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ని ఆదివారం నిర్వహించారు. సమాజంలో మూఢ నమ్మకాలు రూపుమాపాలనే సందేశంతో రూపొందిస్తున్న ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అలీ నటిస్తున్నారు. ఇరిగేషన్ అతిథి గృహం ప్రాంగణంలో అలీపై పలు దృశ్యాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్బాషాతో పాటు పలువురు నేతలు అలీని కలిసి, ఆయనను ఘనంగా సత్కరించారు. షూటింగ్ విషయం తెలుసుకున్న పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పులి గడ్డకు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. -
రిసెప్షన్‌కు హెలికాప్టర్లో వచ్చాడు!
సాక్షి, నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లాలోని మారుమూల పర్రచివర గ్రామంలో మంగళవారం వివాహ రిసెప్షన్‌కు గుజరాత్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రైవేట్ హెలికాప్టర్లో వచ్చారు. గుజరాత్‌కు చెందిన కేపీ గ్రూప్ సీఎండీ ఫరూక్ జి.పటేల్‌కు పర్రచివర గ్రామస్తుడైన బొండాడ రాఘవేంద్రరావు పార్ట్నర్గా ఉన్నారు. తన మేనల్లుడు సందీప్–శరణ్యల వివాహ రిసెప్షన్‌కు ఫరూక్‌ను బొండాడ ఆహ్వానించారు. ఫరూక్ తన కుటుంబ సభ్యులతో గుజరాత్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పర్రచివర గ్రామానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
దారుణం: అవనిగడ్డలో వైద్యుడి హత్య
సాక్షి, కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావును గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనే హతమార్చారు. బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఆయన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా హంతకులు జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. శ్రీహరిరావు కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. చదవండి: సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం -
విగ్రహం ధ్వంసం కేసు: ముగ్గురు అరెస్ట్
సాక్షి, అవనిగడ్డ (కృష్ణా జిల్లా): దివంగత నేత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను అవనిగడ్డ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవనిగడ్డకు చెందిన భూపతి అన్వేష్, భూపతి రేణుకయ్య, భూపతి అజయ్‌లు ఈ చర్యకు పాల్పడినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. నిందితులు మోదుమూడి బస్‌షెల్టర్ వద్ద ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని ఆయన తెలిపారు. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు) ఈ నెల 14న మద్యం మత్తులో విగ్రహం ధ్వంసం చేసి కాల్వలో పడి వేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా అవనిగడ్డ మహబూబ్ బాషా ఆదేశాల మేరకు.. అవనిగడ్డ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను అవనిగడ్డ ఎస్ఐ సందీప్, నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎవరైనా దేవాలయాలు, రాజకీయ నాయకుల విగ్రహాలపై అసంఘటిత చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. (చదవండి: భార్య నగ్న వీడియోల కేసులో మరో ట్విస్ట్) -
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విషాదం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి, చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన తండ్రి కిరణ్‌కుమార్, 11నెలల చిన్న కుమారిడిని ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లి మండలం పెనుమాక నుంచి నాగాయలంక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిని పెనుమాకకు చెందిన విస్సంశెట్టి దుర్గా మహాలక్ష్మి(32), 6ఏళ్ల పెద్ద కుమారుడు శ్రీమహత్‌గా పోలీసులు గుర్తించారు. -
దివిసీమలో పేలుడు కలకలం..
-
తల్లడిల్లి తనువు చాలించింది
నాగాయలంక(అవనిగడ్డ): పాపం.. ఆ తల్లి గుండె తల్లడిల్లింది.. బిడ్డను కరోనా బలితీసుకున్నా అయిన వారు అక్కరకు రాలేదు.. ఇంట్లోనే 16 గంటల పాటు కుమారుడి మృతదేహం ఉన్నా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు ఆ మాతృ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. అంతే కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం జరిగింది. ఎస్ఐ చల్లా కృష్ణ కథనం మేరకు.. ► తలశిల హైమావతి(62) కుమారుడు(42) కరోనాతో ఈ నెల 23న మృతి చెందాడు. ► బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు చొరవతో ఎస్ఐ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ బి.సుబ్బారావు, సామాజిక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకటనారాయణతో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సభ్యులు ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ► ఈ ఘటన ఆ తల్లి హృదయాన్ని తల్లడిల్లేలా చేసింది. అదే రోజు ఉదయం కోడలికి చేసిన టెస్ట్‌లో పాజిటివ్ రావడం, అయిన వారి పలుకరింపు కరువవడంతో ఆ అమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ► ఉదయం నుంచి హైమావతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం సాయంత్రం టి.కొత్తపాలెం శివారు మరియపురం వద్ద కృష్ణానదిలో హైమావతి మృతదేహం బయట పడింది. -
కడలే ఆధారం.. తీరమే ఆవాసం
కడలి అలల పైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే.. ఇంతచేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు.. మరు గడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకం ఉంచి, బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు.. అన్న నానుడిని మననం చేసుకుంటూ, వలలు భుజాన వేసుకుని, ఎన్ని రోజులకు వస్తారో వారికే తెలీని పయనానికి సిద్ధమవుతారు మత్స్యకారులు.. రేపు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, నాగాయలంక(అవనిగడ్డ): తీరప్రాంతంలో అందునా కృష్ణానది బంగాళాఖాతంలో సంగమించే సాగర సంగమ ముఖద్వారం చెంత.. అటు సాగర అలల ఘోష, ఇటు నదీపాయల హొయల నడుమ నిత్యం బతుకు సమరం సాగించే మత్స్యకారుల జీవనశైలికి అద్దం పట్టే దృశ్యాలు మనకెన్నో కనిపిస్తాయి. వలల మాటున వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు కూడా అలాగే స్పృశిస్తుంటాయి. నాగాయలంక సాగరతీరం, కృష్ణానదీ పాయలు, ప్రతి ఆదివారం గ్రామంలో జరిగే వారపుసంతలోనూ ఇలాంటి బతుకు చిత్రాలు జీవిత పరమార్ధాన్ని గుర్తుచేస్తునే ఉంటాయి. సాగరంలో లభించే మత్స్య సంపద , నాగాయలంకలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉప్పు చేపల వారపు సంత 15 వేల కుటుంబాలకు ఆధారం.. దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాలలో సంగమేశ్వరం నుంచి నాలి, సొర్లగొంది, దీనదయాళపురం, పర్రచివర, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లోని ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, ఎదురుమొండి, నాగాయలంక, పాలకాయతిప్ప, బసవవానిపాలెం, హంసలదీవి తదితర గ్రామాలలో బంగాళాఖాతం, కృష్ణానదిలో అత్యధిక మత్స్యకార కుటుంబాలు నిత్యం చేపలవేట సాగిస్తున్నాయి. దివిసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ‘సన్ డ్రై’ ఫిష్.. నాగాయలంకలో దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం జరిగే వారపుసంతలో డ్రై ఫిష్ అమ్మకాలు మత్స్యకారులు, ముఖ్యంగా మత్స్యకార మహిళల బతుకు చిత్రాలను ప్రతిబింభిస్తుంటాయి. గత యాభై ఏళ్లుగా కేవలం ఆదివారం మాత్రమే కొనసాగుతూ వస్తున్న ఆదివారం డ్రై ఫిష్ మార్కెట్ కొద్ది సంవత్సరాలుగా సంతాశీల పాటదారుల నిరంకుశత్వం కారణంగా ఎక్కువ శాతం శనివారమే ముగించేస్తున్నారు. మీన ప్రియలకు జిహ్వచాపల్యం చూపించే ఉప్పు చేపల్లో (డ్రై ఫిష్)లలో పండుగప్ప, మాగ, మాతగురక వంటి భారీచేపలు, రొయ్యపప్పు, చప్పిడి మెత్తళ్లు లాంటి వాటికి డ్రై ఫిష్ మార్కెట్ తరతరాలుగా ప్రసిద్ధి. శని, ఆదివారాలు నాగాయలంక సంతలో ఉప్పుచేపలు (డ్రై ఫిష్)అమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాయి. నవరత్నాలతో కొత్త వెలుగులు.. రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు తీరప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి. నాగాయలంక, కోడూరు మండలాలలో 842 మోటరైజ్డ్ నావలకు గతంతో లీటరుకు రూ.6.03 సబ్సిడీ ఇవ్వగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు తొమ్మిది రూపాయల సబ్సిడీతో నెలకు 300లీటర్లు ఇస్తున్నారు. ఆమేర సబ్సిడీ వరకు తగ్గించి ఎంపికచేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్ తీసుకోవచ్చు. రెండవది చేపలవేట నిషేధకాలంలో ఇప్పటివరకు రూ.4వేలు ఉన్న భృతిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా రూ.10వేలకు పెంచారు. దీనికోసం 4500 మంది లబ్ధిదారులను మత్స్యశాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. అలాగే వేటసమయంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ప్రమాద బీమాను రూ.10లక్షలకు, అంగవైకల్యం సంభవిస్తే రూ.5లక్షలకు పభుత్వం పెంచింది. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విద్యుత్‌చార్జీలు, ఆయిల్ సబ్సిడీ లాంటి రాయితీలను అధికారంలోకి రాగానే అమలులోకి తేవడంతో అటు ఆక్వారైతులకు ఇటు తీరప్రాంత మత్స్యకారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈసందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్విహించాలని మత్స్యకారులు, మత్స్యకార సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మోపిదేవి ఆలయంలోకి వర్షపు నీరు
సాక్షి, కృష్ణా జిల్లా: గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో రుద్రాభిషేకాలు, స్వామివారి సేవలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు అవనిగడ్డలో కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎమ్మారో కార్యాలయం,ప్రభుత్వ పాఠశాలలో కూడా వర్షపు నీరు చేరుకుంది. పంటపొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్.. అవనిగడ్డ దివిసీమలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొడూరు నాగాయలంక మండలం లో నీటమునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. అల్పపీడనం ప్రభావంతో కైకలూరు,మండవల్లి, ముదినేపల్లి కలిదిండి మండలాల్లో మంగళవారం తెల్లవారు జాము నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది. (చదవండి: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు) -
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎడతెరిపిలేని వర్షాలు
-
పండగ వేళ కార్మికులపై శరాఘాతం
చల్లపల్లి (అవనిగడ్డ), కృష్ణాజిల్లా : పండగ వేళ కేసీపీ యాజమాన్యం తమ కార్మికులపై శరాఘాతం లాంటి నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో 206 మందికి లే–ఆఫ్ వర్తింపచేస్తూ ప్రకటించింది. ఈ మేరకు కేసీపీ ఆవరణలోని గేటు వద్ద బోర్డులు ఏర్పాటు చేసింది. కర్మాగారంలో పర్మినెంట్ పద్ధతి కింద పని చేస్తున్న 69 మంది కార్మికులు, క్రషింగ్ సీజనల్ పర్మినెంట్ పద్ధతిపై పని చేస్తున్న 137 మంది కార్మికులకు లే–ఆఫ్ వర్తింపచేశారు. మరో 46 మంది పర్మినెంట్ కార్మికులకు లే–ఆఫ్ వర్తింపచేయకుండా ఉపశమనం కల్పించారు. సోమవారం నుంచే అమలు.. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని సెక్షన్ 2 (కేకేకే) ప్రకారం లక్ష్మీపురంలోని కేసీపీ షుగర్స్ కర్మాగారంలోని ఉద్యోగులకు ధ్రువీకరించిన స్టాండింగ్ ఆర్డర్స్ క్లాజ్ 7(బి) ప్రకారం సోమవారం నుంచి లే–ఆఫ్ ప్రకటిస్తూ బోర్డు ఏర్పాటు చేసింది. లే–ఆఫ్ వర్తింపచేయని 46 మంది పరి్మనెంట్ కార్మికులను ఉయ్యూరులోని కేసీపీ షుగర్స్‌లో వినియోగించుకోనున్నట్లు తెలిసింది. నష్టాలు కారణం.. రెండు సంవత్సరాలుగా చెరకు లభ్యత లేకపోవటంతో కర్మాగారం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కేసీపీ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా పంచదార నిల్వలు అధికంగా పేరుకుపోవటంతో పాటు, కేసీపీ లక్ష్మీపురం కర్మాగారం పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెరకు పరిమాణం ఫ్యాక్టరీ సామర్థ్యాని కంటే చాలా తక్కువగా ఉంటోందని తెలిపింది. దీంతో కర్మాగారంలో క్రషింగ్ కొనసాగిస్తే ఆరి్థకంగా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంగా తాత్కాలికంగా ఇక్కడి చెరకు పంటను ఉయ్యూరు కర్మాగారానికి తరలించి క్రషింగ్ చేయటానికి తీసుకున్న నిర్ణయం అమలులో భాగంగా లక్ష్మీపురం కర్మాగారంలోని కార్మికులకు లే–ఆఫ్ వర్తింప చేసినట్లు వివరించింది. -
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, కృష్ణా : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నెరవేర్చారని ఆర్టీసీ కార్మికులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గన్నవరం ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల కల నేరవేరిందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. -
కరకట్టపై బస్సు ప్రమాదం; ఎమ్మెల్యే సహాయం
సాక్షి, విజయవాడ : డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం ఉంగరాల కట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే సుమారు 60 మంది ప్రయాణీకులతో విజయవాడ నుండి ఆవనిగడ్డ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు ఉంగరాల కట్ట మూల మలుపు వద్ద బోల్తా పడి పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అదే దారిలో ప్రయాణీస్తున్న ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విషయం తెలుసుకొని ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసి, అంబులెన్స్‌ను పిలిపించి దగ్గరుండి బాధితులను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. కాగా, బస్సును వేగంగా మలుపు తిప్పడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు చెబుతున్నారు. -
ఒకే రోజు 17 మందికి పాముకాట్లు
సాక్షి, అవనిగడ్డ: కృష్ణా జిల్లా దివిసీమలో గురువారం 17 మంది పాముకాటుకి గురయ్యారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు చెందిన పదిమంది పాముకాటుకు గురయ్యారు. కోడూరు మండలానికి చెందిన సురేష్, బ్రహ్మయ్య, విశ్వనాధపల్లికి చెందిన నాగ వీరాంజనేయులు, హర్జిత్ మండల్, పెద మాచవరానికి చెందిన వీరాస్వామి, పాదాలవారిపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, కోడూరుకు చెందిన రామారావు, నాగాయలంక మండలానికి చెందిన కృష్ణారావు, అవనిగడ్డ మండలానికి చెందిన భీముడు, తుంగలవారిపాలెంకు చెందిన గాలి మురళీకృష్ణ పాముకాటుకు గురయ్యారు. మరో ఏడుగురు పాముకాటు బాధితులు చల్లపల్లి కస్తూర్బా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన పరిశె యశోద, చల్లపల్లి మండలానికి చెందిన కొమ్ముకూరి ఐజాక్, పేరుపోయిన ఓన్సీము, యార్లగడ్డకు చెందిన పల్లెకొండ వాసుదేవరావు, పులిగడ్డకు చెందిన కనకమ్మ, వక్కపట్లవారిపాలెంకు చెందిన కోటేశ్వరమ్మ పాముకాటుకు గురై చల్లపల్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. -
పని ప్రదేశంలో పాముకాటు.. మహిళ మృతి
సాక్షి, విజయవాడ : అవనిగడ్డ నియోజక వర్గంలో పాముల బెడద స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 8 నెలల కాలంలో ఇప్పటికే 8 మందికి పైగా పాముకాటుకు గురైప్రాణాలు కోల్పోగా.. తాజాగా నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామంలో పీతా వెంకటేశ్వరమ్మ (45) అనే మహిళ పాముకాటుతో మరణించారు. కూలీ చేసుకుని బతికే వెంటేశ్వరమ్మ ఎప్పటిలాగానే శుక్రవారం పనికి వెళ్లారు. అక్కడ ఆమెను ఓ పాము కాటేసింది. అయితే, త్వరగా ఆస్పత్రికి వెళ్లకుండా ఆమె ఆలస్యం చేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచారు. -
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, అవనిగడ్డ(గుంటూరు) : దివిసీమలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వరద గండి పూడుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు విచక్షణా రహితంగా కర్రలో దాడిచేసిన ఘటన మంగళవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జరిగింది. ఎస్ఐ డి.సందీప్‌కుమార్ ఘటనా స్ధలికి వచ్చి దాడికి పాల్పడిన వారిని చెల్లా చెదురు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఐదు రోజుల క్రితం వచ్చిన వరదలకు బొబ్బర్లంక ప్రధాన రహదారికి గండి పడింది. మూడు రోజుల క్రితం వరద తగ్గుముఖం పట్టడంతో గండిపై తాడిచెట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు గండి పూడ్చమని చెప్పడంతో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ అరవింద్, అతని తండ్రి బసవ పున్నయ్య తూములు వేసి గండి పూడ్పించే పనులు చేస్తున్నారు. కర్రలతో దాడి చంద్రబాబు పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో గండివద్దకు వచ్చిన కొంతమంది టీడీపీ నాయకులు చంద్రబాబుకు గండి చూపిద్దామంటే ఎందుకు పూడ్పిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చినపుడు వరద తగ్గగానే పూడ్పించ మన్నారని అందుకే పూడుస్తున్నామని బసవపూర్ణయ్య బదులిచ్చారు. పూడ్చమని చెప్పడానికి వాళ్లెవరూ అని ఇష్టారాజ్యంగా దుర్భాషలాడారు. ప్రజలకు ప్రయోజనానికి ఆదేశించినా నేతలను ఎందుకు తిడతారని అనడంతో మూకుమ్మడిగా బసవపూర్ణయ్యపై టీడీపీ నాయకులు బాల రామకృష్ణ, బాల భార్గవ్, బాల తేజ, వేములపల్లి సురేంద్ర, దొప్పలపూడి జగదీష్‌లు కలిసి కర్రలతో దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టారు. కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అతని కుమారుడు వైఎస్సార్సీపీ గ్రామ కన్వీనర్ అరవింద్ అడ్డుపడటంతో అతనిని కొట్టారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న అవనిగడ్డ ఎస్ఐ సందీప్‌కుమార్ వచ్చి దాడిచేస్తున్న వారిని చెల్లా చెదురు చేయడంతో పారిపోయారు. బాబు మెప్పు కోసం దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ముమ్మనేని బసవపూర్ణయ్య, అరవింద్‌ని పరామర్శించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ తాడిపట్లెపై వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడటంతో గండి పూడుస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడిచేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు మెప్పు కోసం గూండాల్లా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్సీపీ నాయకులకు భద్రత కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, మోహన శివరాజయ్య, లింగం జగదీష్ తదితరులు ఉన్నారు. -
క్షిపణి ప్రయోగ కేంద్రానికి మోక్షం
సాక్షి, నాగాయలంక(అవనిగడ్డ): కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద సముద్రతీరంలో కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రక్షణ కేంద్రానికి అవరోధాలు తొలగిపోయాయి. 289 హెక్టార్లలో వెయ్యి కోట్ల వ్యయంతో డీఆర్డీవో నెలకొల్పనున్న గుల్లలమోద (నాగాయలంక) మిస్సైల్ లాంచింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈనెల చివరి వారంలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఆదివారం నాగాయలంకలో పర్యటించి డీఆర్డీవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 26న రక్షణ కేంద్రానికి శంకుస్థాపన? రక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈనెల 26న శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం కోసం కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఆదివారం నాగాయలంకలో అకస్మిక పర్యటన చేశారు. డీఆర్డీవో అధికారులు లెప్టినెంట్ కల్నల్ తిమ్మయ్య, బందరు ఆర్డీవో ఉదయభాస్కర్తో కలిసి ఆయన నాగాయలంకలో పర్యటించారు. దేశరక్షణశాఖకు చెందిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపనకు కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ నాగాయలంకకు రానున్నట్టు అధికారులు చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి పర్యటన కోసం నాగాయంలక సమీపంలోని వక్కపట్లవారిపాలెం ఓఎన్జీసీ హెలీపాడ్‌ను కలెక్టర్ పరిశీలించారు, అనంతరం బహిరంగసభ కోసం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ, గుల్లలమోద గ్రామంలో స్థలాలను అధికారులు పరిశీలించారు. అయితే శంకుస్థాపన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. సాకారం కానున్న దివి తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల దివిసీమ తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల సాకరం కానుండటంతో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ఈప్రాజెక్టకు కీలకమైన క్లియరెన్స్ చేయడంలో గత ఏడాది ఆగస్టులో అప్పటి కేంద్రప్రభుత్వ సైంటిఫిక్ అడ్వయిజర్ సతీష్‌రెడ్డి, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అనుమతుల పరంగా చేసిన విశేష కృషి చేశారు. అనుమతుల్లో అతికీలకమైన సుప్రీంకోర్టు క్లియరెన్స్, కేంద్రఅటవీశాఖ అనుమతులు, అమెండ్మెంట్ టూ సీఆర్‌జెడ్ రెగ్యులేషన్‌తో పాటు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లాంటివి ఈనెల మొదటివారంలో పూర్తయ్యాయి. ఈ రక్షణ కేంద్రానికి ఆరేళ్లుగా డీఆర్డీవో అధికారులు, అటవీశాఖ అత్యున్నత అధికారులు గుల్లలమోద, లైట్‌హౌస్ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి అవసరమైన వనరుల పరిస్థితిని అధ్యయనం చేశారు. సముద్రతీరంలో గాలివేగం, అత్యాధునిక సాయిల్ టెస్ట్‌లు ముగించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు తొలుత ఆటంకాలుగా ఉన్న అటవీశాఖ, రెవెన్యూవర్గాల ఒప్పందాలు క్లియర్ కావడంతో ప్రాజెక్ట్‌కు అవసరమై కేటాయించిన 381ఎకరాల భూమి అటవీశాఖ కింద ఉండటంతో పరస్పర భూముల అప్పగింత కార్యక్రమం రెండేళ్ల క్రితం పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూములకు 112మంది రైతులకు రూ.5కోట్ల పైచిలుకు పరిహారాన్ని 2018లో క్లియర్ చేశారు. సాగరమాల పథకంద్వారా తీరప్రాంత భవిష్యత్ మార్గాలు? గుల్లలమోద(నాగాయలంక)క్షిపణి ప్రయోగకేంద్రం నేపథ్యంలో కేంద్రప్రభుత్వ సాగరమాల పథకంద్వారా తీరప్రాంత ప్రధాన రహదారులన్నీ నాలుగు లేన్ల మార్గాలవుతాయని అంటున్నారు. పులిగడ్డ నుంచి నుంచి గుల్లలమోద వరకు, కోడూరుమండలంలో నూతనంగా నిర్మితమైన ఉల్లిపాలెం–మచిలీపట్నం వంతెన నుంచి గుల్లలమోద వరకు సాగరమాల కింద భవిష్యత్మార్గాలు ఏర్పడనున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు. ప్రాజెక్టు పనులు మొదలయితే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కలగనుంది. దేశంలో రూపొందించే రెండో మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్ సెంటర్ ఇదే కావడంతో కృష్ణాజిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఒడిస్సా రాష్ట్రం లోని బాలాసూర్ ధీటుగా ఇక్కడి ప్రాజెక్ట్ నిర్మాణం కానుందని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ పర్యటనలో మండల స్పెషలాఫీసర్ రామభార్గవి, తహశీల్దార్ ఎం.వెంకట్రామయ్య , ఈఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు. డీఆర్డీవో ప్రాజెక్ట్‌తో కృష్ణాజిల్లాకు గుర్తింపు డీఆర్డీఓ ప్రాజెక్ట్ ఏర్పాటుతో కృష్ణా జిల్లాకు ప్రపంచపటంలో గుర్తింపు దక్కనుంది. ముఖ్యంగా దివిసీమ తీర ప్రాంతవాసులు కల త్వరలో సాకారం కానుంది. ప్రధానమైన అనుమతులు పూర్తయి త్వరలో ప్రధాని శ్రీకారం చుట్టబోవడం సంతోషం. డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి, ఇతర కేంద్ర ప్రభుత్వశాఖల ఉన్నతవర్గాల కృషి ఫలించింది. – డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో -
మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి
సాక్షి, ఆవనిగడ్డ(కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్, డిఐజి ఏఎస్ ఖాన్లు అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరితకు అధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయల కల్పన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సమస్యలను పరిష్కరించడానికి ' మహిళా క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 'మహిళా మిత్ర' పేరిట ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులు బందోబస్తుకు వెళ్లినపుడు వారికి కనీస అవసరాలు తీర్చేందుకు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు. -
కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్ పంచాయతీలు గ్రేడ్–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్.. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది. ఐదు పంచాయతీలు ఇవే.. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. – జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి -
అవనిగడ్డలో పెరిగిన పాముకాటు కేసులు!
సాక్షి, అమరావతి: జీవన చక్రంలో ఒక జీవి.. మరో జీవికి ఆహారంగా మారడం గమనిస్తూనే ఉంటాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల హల్చల్ అధికమవుతుంది. కప్పలు, క్రిమికీటకాలను వేటాడేందుకు సర్పాలు అధికంగా బయట సంచరిస్తాయి. ఈ కాలంలోనే పాము కాట్ల బారిన పడుతున్న మనుషుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పాము కాటుకు గురికాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం.. ఒక వేళ పాము కాటేసినా సకాలంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వానాకాలం వచ్చిందంటే చాలు చిరు జల్లులు.. వాటితో పచ్చగా మారే పరిసరాలు.. ఆ పరిసరాల్లో ఏపుగా పెరిగే గడ్డి.. దాన్ని తినడానికి వచ్చే కీటకాలు.. వాటిని వేటాడటానికి వచ్చే కప్పలు.. దీంతో పాటే ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉండే కాలం.. ఈ ఆహ్లాదం వెనుకే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. విషసర్పాలు యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాటేసి ప్రాణం మీదకు తెస్తాయి. అందుకే వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివాసాలు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వర్షాకాలంలో గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటి చాటున పాములు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి సాగించే కాలమిది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా పాము కాట్లపై ప్రత్యేక కథనం. దివిసీమపై అధిక ప్రభావం వర్షాకాలం వచ్చిందంటే చాలు దివిసీమ వాసులకు కంటిపై కునుకులేకుండాపోతోంది. ఎప్పుడు ఎవరు పాము కాటుకు గురవుతారోనని భయపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో పొలాల్లోకి వెళ్తున్న రైతులు, కూలీలు పాము కాటుకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 63 మంది పాము కాటు బాధితులు అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో చేరారని సమాచారం. ఒక్క అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే గత ఏడాది 350కి పైగా పాము కాటు కేసులు నమోదయ్యాయంటే వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గన్నవరం, మైలవరం ప్రాంతంలోనూ పాము కాటు ప్రమాదాలు తీవ్రత అధికంగానే ఉంటోంది. కొందరు గ్రామీణులు నాటు వైద్యులను సంప్రదించి కాలహరణం చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పెరిగిన పాముల సంతతి కొన్నేళ్లుగా దివిసీమలో పాముల సంతతి అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం వరి పొలాల్లో వాడే గుళికలను రైతులు మూడేళ్లుగా వాడకపోవడమేనని స్థానికులు పేర్కొంటున్నారు. పాముల సంతతి 2009లో వచ్చిన వరదల తర్వాత ఈ ప్రాంతంలో అధికమయ్యిందని, అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు పాములను పట్టి అడవుల్లో వదిలే స్నేక్ లవర్స్ కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం మరో కారణం. పాటించాల్సిన జాగ్రత్తలు.. పాములు సాధారణంగా ఎవరిని ఏమీ చేయవు. వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. వాటికి ప్రమాదమనిపించినప్పుడు, ఏకాంతానికి భంగం కలిగినా, తొక్కడం, వేటాడటం వంటి చర్యలకు ప్రతి స్పందనగా మాత్రమే కాటు వేస్తాయి. మనం ముందు జాగ్రత్తతో చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. పొలానికి వెళ్లే రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళలో తిరిగే వారు, అక్కడే నిద్రించే వారు తమ వెంట తప్పనిసరిగా టార్చిలైట్ తీసుకెళ్లాలి. పొలాలు, గడ్డి వాముల్లో తిరిగే వారు మోకాళ్ల దాకా రక్షణనిచ్చే బూట్లను ధరించడం ఉత్తమం. చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. పొదలు, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి. రైతుల కోసం పరిశోధనల ద్వారా బెంగళూరుకు ప్రసాదం ఇండస్ట్రీస్ వారు ‘స్నేక్ గార్డ్’ అనే ఒక కర్రను పోలిన యంత్రాన్ని కనుగొన్నారు. దీనిద్వారా వచ్చే అల్ట్రాసోనిక్ తరంగాలకు భయపడి పాములు దూరంగా పారిపోతాయి. వీటివల్ల రైతులకే కాక పాముల జాతికి కూడా మానవుల నుంచి రక్షణ లభిస్తుంది. పెట్రోల్, కిరోసిన్ వంటి ద్రావణాల వాసనలను పాములు భరించలేవు. తగు జాగ్రత్తలతో వీటిని ఉపయోగించి కొంత వరకు నిరోధించవచ్చు. ప్రథమ చికిత్స తప్పనిసరి పాము కాటుకు గురైన వ్యక్తికి పాము విషం కన్నా.. అతని భయమే ఎక్కువ ప్రమాదం తెస్తుంది. బాధితులకు పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. కాటు వేసిన చోటుకు పైభాగంలో వెంటనే తాడుతో మిగతా శరీరానికి రక్త ప్రసరణ జరగకుండా బిగించి కట్టివేయాలి. గాయం చేసి రక్తం కారనివ్వాలి. వీలైనంత వరకు కాటుకు గురైన వ్యక్తి నడిపించడం చేయరాదు. -
‘దివి’ గుండెచప్పుడు వైఎస్!
సాక్షి, అవనిగడ్డ: దివిసీమ ప్రజల గుండెలో మహానేత వైఎస్ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆధునికీకరణ పనుల ద్వారా సాగునీటి కష్టాలు తొలగించి, రైతులకు వందేళ్ల భరోసా ఇచ్చేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అడగకుండానే విజయవాడ – పులిగడ్డ డబుల్ లైన్ కరకట్టకు నిధులు మంజూరు చేశారు. దివిసీమలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసి చెరగని ముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006 నవంబర్ 2వ తేదీన ఓగ్ని తుఫాన్ ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి అవనిగడ్డ వచ్చారు. 60 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుంభవృష్టి వర్షాలు పడ్డాయి. ఈ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డెల్టాను ఆధునికీకరిస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన డెల్టా ఆధునికీకరణకు రూ.4,576 కోట్లు మంజూరు చేశారు. 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డ వార్పు వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. 150 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా వైఎస్ చరిత్ర పుటల్లో నిలిచారు. చిత్తరువుని చూసి మురిసిన వైఎస్.. కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. పులిగడ్డ వార్పు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకంపై వైఎస్ పలుగు పట్టుకుని గాతవేస్తున్న ప్లాస్టరాఫ్ ప్యారిస్ చిత్తరువు మహానేతను అచ్చుగుద్దినట్టు ఉంటుంది. శంకుస్థాపన మహోత్సవానికి వచ్చిన వైఎస్ తన చిత్తరువుని చూసి ఎంతో మురిసిపోయారు. అడగకుండానే దివిసీమకు వరాలు దివిసీమకు వైఎస్ అడగకుండానే ఎన్నో వరాలు అందించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.590 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35 కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం – మందపాకల పంట కాల్వ ఏర్పాటుతో పాటు, జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు దివిసీమ ప్రజల గుండెల్లో వైఎస్‌కు చెరగని ముద్ర వేశాయి. ఉల్లిపాలెం వారధికి అప్పుడే అంకురార్పణ.. ఉల్లిపాలెం – భవానీపురం వారధికి వైఎస్ హయాంలోనే అంకురార్పణ జరిగింది. ఈ వారధి కోసం రూ.32 కోట్లకు ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వైఎస్ సమాయత్తమవగా ఎన్నికల కోడ్ రావడంతో కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత పలు దఫాలుగా అంచనాలు పెంచి వారధిని నిర్మించారు. -
చరిత్ర సృష్టించిన సింహాద్రి
సాక్షి, అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయిన సింహాద్రి రమేష్‌బాబు రికార్డు మెజారిటీ సా«ధించారు. మొత్తం 19 రౌండ్లకుగానూ 17 రౌండ్లలో వైఎస్సార్సీపీ అత్యధిక మెజారిటీ సాధించగా, టీడీపీ రెండు రౌండ్లలో స్వల్ప ఆధిక్యత మాత్రమే కనబరచింది. దివిసీమలో తొలిసారి వైఎస్సార్సీపీ విజయ బావుటా ఎగురవేయడంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రికార్డు మెజారిటీ... అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తం 2,07,240 మంది ఓటర్లు ఉండగా, గత నెల 11న జరిగిన ఎన్నికల్లో 1,82,603 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీ తరఫున సింహాద్రి రమేష్‌బాబు, టీడీపీ తరఫున మండలి బుద్ధప్రసాద్, జనసేన తరఫున ముత్తంశెట్టి కృష్ణారావు పోటీచేయగా త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు రికార్డు స్థాయిలో 20,725 మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీగా నమోదైంది. 1962లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన తొలి ఎన్నికల మెజారిటీ 10,668 ఇప్పటి వరకూ అత్యధిక మెజారిటీగా నమోదైంది. అంతకంటే రెట్టింపు మెజారిటీ సాధించిన సింహాద్రి దివిసీమ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేశారు. ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణంతో 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరి ప్రసాద్ పోటీచేయగా, ఇంటిపెండెంట్ అభ్యర్థిపై 61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నిక కావడం, ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో సింహాద్రికి పోస్టల్ బ్యాలెట్స్‌తో కలుపుకుని 78,434 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కు 57,701 ఓట్లు వచ్చాయి. 20,725 ఓట్ల బంపర్ మెజారిటీతో సింహాద్రి విజయ దుందుభి మ్రోగించారు. -
అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు ప్రచారం
-
మూడో రోజు ఎన్నికల ప్రచారం
-
వైఎస్ జగన్ చెప్పిన శిశుపాలుడు కథ
-
వైఎస్ జగన్ చెప్పిన ఆసక్తికర కథ విన్నారా?
సాక్షి, అవనిగడ్డ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, సర్కారు నిష్ఫూచీని ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను చిన్న చిన్న కథలతో ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాలనను ప్రస్తావించిన ఆయన, శిశుపాలుడి కథ వినిపించి ప్రజలందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబును చూస్తే ఒక కథ గుర్తుకు వస్తుందంటూ శిశుపాలుడు, 100 తప్పులు, ఆయన వధ ఘట్టాన్ని చాలా ఆసక్తికరంగా వివరించారు. ‘మీ అందరికీ తెలుసు శిశుపాలుడి గురించి. ఆయన 100 తప్పులు చేసే వరకు దేవుడు ఓపిక పట్టాడు. తప్పులు 101 కాగానా విష్ణుచక్రంతో ఆయన తల నరికారు. ఇప్పుడు ఆ శిశుపాలుడు నరకంలో ఉన్నాడు. ఆయన అక్కడ యముడిని ఒక ప్రశ్న అడిగాడట. నేను 100 తప్పులు చేస్తేనే నా తల నరికారు. మరి చంద్రబాబు ఇంకా చాలా తప్పులు చేశారు. ఎందరినో వెన్నుపోటు పొడిచారు. అయినా ఎందుకు వదిలిపెట్టారు? అని ప్రశ్నిస్తే యముడు ఇలా చెప్పాడట’. ‘ఈ యుగంలో విష్ణుచక్రం బదులు ఫ్యాన్ చక్రం ఉందని, అలాగే శ్రీకృష్ణుడి బదులు ఓటింగ్ యంత్రం ఉందని యముడు చెప్పాడు. దాంతో చంద్రబాబును పదవి నుంచి దింపబోతున్నారని, అదే విధంగా శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా రాష్ట్ర ప్రజలున్నారని చెప్పారట. అంతే కాకుండా నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు.. అన్నీ కలిసిన వాడే చంద్రబాబు కాబట్టి, ఆయనకు బుద్ధి చెప్పడానికి కాస్త టైమ్ పడుతుందని వివరించారట’ అని వైఎస్ జగన్ ఆ కథ చాలా ఆసక్తికరంగా వినిపించారు. -
వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి పేదవాడికి అండగా ఉంటా
-
శిశుపాలుడికి ప్రతిరూపం చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, అవనిగడ్డ: గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారని, సీఎం అయ్యాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి పేదవాడి కష్టాలను దగ్గరుండి చూశానని, వారందరికీ నేనున్నానని అని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు శిశుపాలుడు వంటి రాక్షసుడని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. శిశుపాలుడి తప్పులను చూసి దేవుడు విష్ణుచక్రంతో ఆయనను వధించాడని, అలాంటి విష్ణుచక్రం లాంటిదే మన ఫ్యాను చక్రమని జగన్ వర్ణించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు వందకు పైగా తప్పులు, మోసాలు, కుట్రలు చేశారని మండిపడ్డారు. చదవండి: (అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు) ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలను తీసుకుని మోసపోవద్దని, మరో 20 రోజులు ఓపిక పడితే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నవరత్నాలు ద్వారా ప్రతి పేదవాడి జీవితాలు మారిపోతాయని, ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా అవనిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చదవండి:(కొండంత అండగా నేనున్నాను: వైఎస్ జగన్) సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘‘గత ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఏవీ కూడా అమలుచేయలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా అనేక హామీలను ఇచ్చారు. ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి.. మచిలీపట్నం పోర్టు, స్మార్ట్‌సిటీ, పుడ్‌పార్క్, ఐటీహబ్, మామిడి పరిశోధనా కేంద్రం, మెట్రోరైలు నిర్మిస్తామని అన్నారు. ఐదేళ్లు గడిచినా వాటి ఊసేలేదు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కూర్చోని ఇక్కడి ఇసుకను అక్రమంగా తరలిస్తూ.. ఇసుక మాఫియాను చేస్తున్నారు. కృష్ణా జిల్లాను కాల్‌మనీ సెక్స్ రాకెట్‌కు కేంద్రంగా మార్చారు. కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. జిల్లా కేంద్రంలో టీడీపీ నేతలు ఐపీఎస్ అధికారిని చొక్కాపట్టుకుని లాగితే సీఎం కనీసం చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు 60 నెలల పాలనలో 57 నెలలు ప్రజలకు నరకం చూపించారు. చివరి మూడు నెలలు రోజుకో సినిమా చూపిస్తున్నారు. ఇలాంటి పరిపాలన మనకు మరోసారి అవసరమా? గతంలో చంద్రబాబు పదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు.. వైఎస్సార్‌ను గెలిపిస్తే.. ఆయన పాలన చూసి రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే వైఎస్సార్సీపీ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అలాంటి పాలన మళ్లీ మీకు అందిస్తా. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథాకాలు అందేలా చేస్తా. రైతులు, డ్వాక్రా మహిళలు, బడుగుబలహీన వర్గాలు, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. పేదవాడితో రాజకీయం చేసిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలకు ఏమైనా అవసరం ఉంటే ఈ ప్రభుత్వంలో మొదట జన్మభూమి కమిటీని సంప్రదించాలి. అక్కడికి వెళ్లితే వారు ఏ పార్టీ అని అడుగుతారు. పేదలతో రాజకీయం ఏంది బాబు? పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీ రామారావుకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఇక ప్రజలను మోసం చేయడం ఆయనకు చాలా తేలిక. మనందరి మంచికే మొదటి విడతలోనే ఎన్నికలు వచ్చాయి. త్వరలోనే ఈ అవినీతి పాలనను అంతం చేసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. చదువుకు దూరమైన ప్రతి పిల్లవాడిని చదివిస్తాం. పిల్లల్ని బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి 15000 రూపాయలు అందిస్తాం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందేలా పరిపాలన అందిస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
బుసకనూ బొక్కేస్తున్నారు
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బుసక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి అక్రమంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్లను స్పీడుగా తోలడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు. భారీగా తవ్వకాలు మండల పరిధిలోని వేకనూరులో సొసైటీ భూములు, కృష్ణానది ఒడ్డు నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో పొక్లెయిన్లు పెట్టి బుసకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నాలుగు రోజుల్లో అవనిగడ్డ మండలంలో రూ.10 లక్షల విలువైన మట్టి, బుసకను అక్రమంగా తరలించారని ఎడ్లంక, పల్లెపాలెం వాసులు చెబుతున్నారు. ట్రాక్టర్లపై పట్టాలు కప్పకుండా తరలిస్తుండటంతో దుమ్మురేగి స్థానికులు, ట్రాక్టర్ల వెనుకవచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దుమ్ముతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుసక ట్రాక్టర్ల వల్ల అవనిగడ్డ నుంచి ఎడ్లంక వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొందరు డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టించుకోని అధికారులు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అక్రమ బుసక రవాణాపై అధికారులు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎడ్లంక, పల్లెపాలెం ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కులపై ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్థానిక పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మీదుగానే యథేచ్ఛగా తరలివెళుతున్నా అధికారుల్లో స్పందన లేదని చెప్పారు. రెండు గ్రామాల నుంచి.. మండల పరిధిలోని రామచంద్రపురం, దక్షిణ చిరువోలులంక గ్రామాల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బుసక, మట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై అవనిగడ్డ తహసీల్దార్ ఎన్. నరసింహమూర్తిని వివరణ కోరగా మండలంలో ఎక్కడా బుసక, మట్టి, ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, వీఆర్వోలను పంపించి అలాంటివి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడాదిలో పదివేల ట్రక్కులకు పైగా తరలింపు నాలుగు రోజుల నుంచి వేకనూరు లంకల్లో యథేచ్ఛగా బుసక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 20 ట్రాక్టర్లకు పైగా బుసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. ట్రక్కులపై ఎలాంటి పరజా లేకుండా వెళ్లడంతో కళ్ల నిండా దుమ్ము పడుతోంది. ఏడాదిలో ఎడ్లంక, వేకనూరు నుంచి పదివేలకు పైగా ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను తరలించారు. – దోవా గోవర్దన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నాలుగు రోజుల నుంచి మా ఊరి మీదుగా పెద్దఎత్తున బుసక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లు చాలా స్పీడుగా వెళుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. ఈ రోడ్డుపై వెళుతుంటే కళ్లనిండా బుసక, దుమ్ము పడుతోంది. రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం. – కొల్లు గోపాలకృష్ణ, పాతఎడ్లంక -
అవనిగడ్డలో ఆకలి కేకలు
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెథాయ్ తుపాన్ కన్నెర్ర చేసింది. తుపాన్ ప్రతాపానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కూడు,గూడూ,బట్ట లేక అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పునరావాస కేంద్రాల్లో రెండు రోజుల నుంచి మంచినీరు, భోజనం లేక తుపాను బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప సహాయ కేంద్రాల్లో ఉన్న బాధితులను ఆదివారం పరామర్శించడానికి వచ్చిన జిల్లా ఎస్పీ సర్వేష్ఠ త్రిపాఠి వద్ద వారి బాధలను వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా అందిచలేకపోతుందని, రెవిన్యూ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు. తుపాను దాటికి పిల్లల నుంచి పెద్దల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సహాయ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యరని తుపాను బాధితులు వాపోయారు. పంటలు నష్టపోయి, ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండిలేకపోయినా తమను పట్టించుకునే నాథుడే కరువైయ్యారని ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రేగుల్లంక వంతెన పూర్తయ్యేనా?
సాక్షి, అవనిగడ్డ: ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న రేగుల్లంక వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు ప్రజాప్రతినిధులు, అ«ధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార పార్టీ నేతే అడ్డంకులు కలిగిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి. వంతెన పనులు ప్రారంభించకుంటే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఆది నుంచి వివాదాలే... పులిగడ్డ రేగుల్లంకలో కాలిబాట వంతెన, సీసీ రహదారులు నిర్మించేందుకు రూ.1.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2016 నవంబర్‌లో మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది ఏప్రిల్‌లో సీసీ రహదారి పనులు చేపట్టగా నాసిరకమైన మెటీరియల్ వాడటంపై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సిమెంట్ రోడ్లు నిర్మించగా, వంతెన పనులు మాత్రం నిలిచిపోయాయి. ఉపసభాపతి హెచ్చరించినా... వారం క్రితం గాంధీ క్షేత్రంలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో రేగుల్లంక వంతెన నిర్మాణ విషయమై శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పంచాయతీరాజ్ డీఈ రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనా కాంట్రాక్టర్‌తో పనులు చేయించలేకపోతున్నారని మండిపడ్డారు. పత్రికల్లో కథనాలు వచ్చినా మీలో చలనం రాలేదని ఆగ్రహించారు. అయినా ఇంతవరకూ పనులు ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. మీరే సమస్య పరిష్కరించుకోవాలి... స్థానికులు పంచాయతీరాజ్ ఏఈ గోపాలరావు దగ్గరకు సోమవారం వెళ్లి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. మీరు దగ్గరుండి ఆక్రమణదారుడిని తొలగింపజేస్తే పనులు చేస్తామని ఏఈ చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోగా పంచాయతీరాజ్ డీఈ రమేష్, ఏఈ గోపాలరావుని పిలిపించి వంతెన నిర్మాణ విషయమై మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు దోవారి శేషు, బత్తుల శ్రీను మాట్లాడుతూ వంతెన నిర్మాణం గురించి ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇద్దరు చిన్నారులకు పాముకాటు
కృష్ణాజిల్లా, అవనిగడ్డ : ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాముకాటుకు గురైన ఘటన లంకమ్మమాన్యంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక పంచాయతీ పరిధిలోని లంకమ్మమాన్యం కాలనీలో నివాసం ఉంటున్న తోట గంగాధర్, భార్య, ఆరేళ్ళ వయస్సున్న వేణుమాధవ్, మూడేళ్ళ నవీన్‌కుమార్ శనివారం ఇంట్లో నేలపై నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పిల్లలిద్దరూ లేచి బిగ్గరగా ఏడవడంతో తండ్రి లేచి లైట్ వేసి చూశారు. ఇద్దరి పిల్లల కాలి నుంచి రక్తం కారడం, గాట్లు ఉండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణదొర గాట్లను పరిశీలించి పాముకాటుకు గురైనట్టు చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి లేదని, అయినా 24 గంటలు పరిశీలనలో ఉంచాలని వైద్యులు చెప్పినట్టు గంగాధర్ తెలిపారు. కాగా, మరో ఇద్దరు పాముకాటుకు గురవ్వగా స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు చెప్పారు. -
ఎస్ఐ వంశీధర్ మృతదేహం లభ్యం
-
ఎస్ఐ మృతదేహం లభ్యం
చల్లపల్లి : విజయవాడ-అవనిగడ్డ మార్గంలోని కరకట్టపై ఘంటసాల మండలం పాపవిశానం వద్ద పంటకాలువలో కొట్టుకుపోయిన ఎస్ఐ మృతదేహం ఆదివారం ఉదయం బయటపడింది. చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద మృతదేహం లభ్యమైంది. సుమారు 20 కిలో మీటర్ల దూరం ఎస్ఐ మృతదేహం కొట్టుకుపోయింది. కాలువలో నుంచి వెలికి తీసిన అనంతరం పోస్టుమార్టం చేయడానికి ఎస్ఐ వంశీధర్ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వానికి తరలించారు. వంశీధర్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్ఐగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. శనివారం ఉదయం తల్లితో కలిసి స్వగ్రామం కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్పేట్కు కారులో బయలుదేరిన సమయంలో పాపవినాశనం వద్ద కారు అదుపుతప్పి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న స్థానిక గ్రామస్తులు ఎస్ఐ వంశీధర్ తల్లితో పాటు మరొకరిని కాపాడగలిగారు..కానీ కారు నీళ్లలోకి పూర్తిగా వెళ్లిపోవడంతో ఎస్ఐను కాపాడలేకపోయారు. వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. -
పాము కాట్లకు గురవుతున్న అవనిగడ్డ ప్రాంత ప్రజలు
-
దివిసీమకు సర్పదోషం
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలు పాము కాట్లతో వణికిపోతున్నారు. వందలాది మంది పాముకాటు బాధితులను ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు అధికంగా పడుతుండటం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దాదాపు 70 పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో అధిక భాగం నారు వేసే కూలీలు గురికావడం గమనార్హం. గన్నవరం ప్రాంతంలోనూ గత వారం రోజుల్లో పాము కాటుతో ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన దొడ్ల శ్యాంసన్ (18) ఆదివారం రాత్రి గ్రామంలో నడుచుకుంటూ ఇంటికి చేరుతున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయానకి అపస్మారక స్థితికి చేరుకొని మృత్యువాత పడ్డాడు. అలానే ఉంగుటూరు మండలం తేలప్రోలు యాదవులపేటకు చెందిన పూర్ణచంద్రరావు గడ్డి వామిలో పాము కాటుకు గురయ్యాడు. ఆ విషయాన్ని గుర్తించి వెంటనే వైద్యం చేయించుకోకపోవడంతో వారం రోజుల చిక్సిత అనంతరం సోమవారం మృతి చెందాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే 248 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 పాయిజన్ కేసులు, 101 నాన్ పాయిజన్ కేసులుగా నమోదయ్యాయి. ఇవి కాక స్థానికంగా ఉన్న ఏడు పీహెచ్సీలలోనూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరిగిన పాముల సంతతి.... కొన్ని సంవత్సరాలుగా దివిసీమలో పాముల సంతతి అమాంతం పెరిగిపోయింది. రైతులు వరిపొలాల్లో గుళికలను వాడకపోవడమే పాములు పెరగడానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. పాముల సంతతి 2009లో వచ్చిన వరదల తర్వాత ఈ ప్రాంతంలో అధికమయ్యిందని, అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు పాములు పట్టి అడవుల్లో వదిలే స్నేక్ లవర్స్ కూడా ఈ ఏరియాలో అందుబాటులో లేకపోవడం మరో కారణం. పాముకాటు బాధితులు గ్రామాల్లోని నాటువైద్యం నమ్ముకోవడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాటుకు గురైన వెంటనే దగ్గర్లోని వైద్యశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదు కానీ నిర్లక్ష్యంగా చేయడం వల్ల మృత్యువాత పడుతున్నారు. ఆధునిక యుగంలోనూ వైద్యుడిని సంప్రదించుకుండా ఇంకా చాలా గ్రామాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రథమ చికిత్స తప్పనిసరి... పాము కాటు గురైన వ్యక్తికి పాము విషం కన్నా భయమే ఎక్కువ ప్రమాదం. బాధితులకు పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. కాటు వేసిన చోటుకు పై భాగంలో వెంటనే తాడుతో మిగతా శరీరానికి రక్త ప్రసరణ జరగకుండా బిగించి కట్టివేయాలి. కాటు వేసిన భాగంలో పదునైన బ్లేడుతో గాయం చేసి రక్తం కారనివ్వాలి. వీలైనంత వరకు కాటుకు గురైన వ్యక్తిని నడిపించకూడదు. (చదవండి: సమయస్ఫూర్తితోనే ప్రాణాలకు రక్షణ) 24 గంటలూఅందుబాటులో వైద్యం.... వర్షాకాలంలో పాముల సంచారం అధికంగా ఉంటుంది. తడి ప్రాంతం నుంచి పొడి ప్రాంతానికి పాములు చేరుతుంటాయి. ఇటువంటి సమయాల్లో ప్రజలు జాగ్రత్త వహిస్తే కాట్ల నుంచి బయటపడవచ్చు. అవనిగడ్డ ప్రాంతంలోని అన్ని పీహెచ్సీలలో పాము కాటుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 136 యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్పప్పటికీ ఇప్పటికి కొంతమంది నాటువైద్యం నమ్మకుంటున్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. – డాక్టర్ కృష్ణదొర, సూపరింటెండెంట్, అవనిగడ్డ ఏరియా వైద్యశాల -
వృద్ధురాలి మెడలో ఆభరణాల అపహరణ
విజయవాడ: అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాంచారమ్మ అనే వృద్ధురాలి ఆభరణాలు చోరీకి గురయ్యారు. నాంచారమ్మకు మత్తుమందు ఇచ్చి ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసును గుర్తుతెలియని మహిళ దోచుకెళ్లింది. వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మించి ఆభరణాలు మాయం చేసింది. తన ఆభరణాలు చోరీకి గురైన సంగతి తెల్సుకున్న తరవాత నాంచారమ్మ పోలీసులను ఆశ్రయించింది. నాంచారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
రెండు కుటుంబాల్లో విషాదం
పులిగడ్డ (అవనిగడ్డ): కటిక చీకటి.. దీనికి తోడు వర్షం కురుస్తుండటంతో వాహన చోదకులు వేగాన్ని పెంచారు. అతి వేగమే ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన పులిగడ్డ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రేగుల్లంకకు చెందిన దాసరి రమేష్ (33) జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావుతో కలిసి విజయవాడలో చికిత్స పొందుతున్న రామచంద్రపురం మాజీ సర్పంచ్ అద్దంకి నారాయణను చూసేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. నారాయణను పరామర్శించిన అనంతరం కారులో అవనిగడ్డకు చేరుకున్నారు. రాత్రి పదిన్నరకు తిరిగి ఇంటికి బైక్‌పై రమేష్ బయలుదేరాడు. రాముడుపాలెం నుంచి బైక్‌పై ఇంటికి వస్తున్న అవనిగడ్డకు చెందిన బురాన్‌వలి (35) స్థానిక అటవీశాఖ కార్యాలయం ఎదురుగా వచ్చేసరికి ఒకరినొకరు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బురాన్‌వలి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బురాన్వలికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. పిల్లలు లేరు. రమేష్‌కి ఇంకా వివాహం కాలేదు. మృతులిద్దరూ ఆయా కుటుంబాలకు పెద్ద కుమారులే. పులిగడ్డలోనే ఆగుంటే.. విజయవాడ నుంచి వస్తున్న రమేష్‌ని పులిగడ్డ రాగానే జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు రాత్రయింది ఇక్కడ దిగి ఇంటికి వెళ్లమని చెప్పారు. అయితే అవనిగడ్డలో బైక్ ఉందని, దానిని తీసుకుని వస్తానని చెప్పి రమేష్ అవనిగడ్డ వచ్చాడు. పులిగడ్డకు చెందిన పులిగడ్డ పిచ్చేశ్వరరావు ఇంటికి వెళదాం రమ్మని రమేష్‌ను కోరగా కొద్దిగా పనుందని చెప్పి రమేష్ సిగరెట్ కాల్చుకుని బయలు దేరి వెళ్లి ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పులిగడ్డలో దిగినా, పిచ్చేశ్వరరావుతో కలిసి వెళ్లినా బతికేవాడేమోనని బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఉద్యోగం కోసం ప్రయత్నం.. బురాన్‌వలి బీఈడీ, వ్యాయామ ఉపాధ్యాయ ట్రైనింగ్ చేశారు. గతంలో జరిగిన రెండు డీఎస్సీల్లో 92, 94 మార్కులతో డీఎస్సీ చేజారింది. ఈ సారి డీఎస్సీలో ఎలాగైనా పోస్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్న బురాన్‌వలి ఎంతో కష్టపడి చదువుతున్నాడు. చల్లపల్లి మండలంలోని రాముడుపాలెంలో ఇతని పేరున మద్యంషాపు ఉండగా అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బురాన్‌వలి తండ్రి షేక్ మస్తాన్ బాషా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న కొత్తవంతెన ప్రాంతంలో పాత ఇనుప సామాన్ల షాపు నిర్వహిస్తున్నారు. సింహాద్రి రమేష్‌బాబు పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, మాజీ సర్పంచ్ నలుకుర్తి పృధ్వీరాజ్, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ, టీడీపీ నేత బండే రాఘవ తదితరులు వైద్యశాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. రమేష్ మృతదేహానికి స్థానిక రేగుల్లంక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించగా బురాన్‌వలి సోదరుడు జర్మనీలో ఉండటంతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మణికుమార్ తెలిపారు. -
వాటర్ ట్యాంకులెక్కి నిరసన
అవనిగడ్డ/ఒంగోలు: టెట్ పీఈటీ ప్రశ్నపత్రం లీకైందని, అందువల్ల ఈ నెల 19న జరగనున్న పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డ, ప్రకాశం జిల్లా ఒంగోలులో అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకులు ఎక్కి ఆందోళన చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది పీఈటీ అభ్యర్థులు అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా పీఈటీ అభ్యర్థులకు టెట్ నిర్వహిస్తుండటంతో రెండు నెలల నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న తేళ్ల వంశీకృష్ణ విజయవాడలో బాసర ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఒంగోలులోనూ ఆయనకు శిక్షణా కేంద్రం ఉంది. స్కూల్ గేమ్ ఫెడరేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్న సయ్యద్ బాషా సహకారంతో వంశీకృష్ణ టెట్ పేపర్ లీక్ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. వంశీకృష్ణ శిక్షణ ఇచ్చిన వారందరినీ చెన్నై సెంటర్లో వేయించుకున్నారని చెప్పారు. జాబ్ గ్యారెంటీ అంటూ 75 మందికి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.8లక్షలు తీసుకుని టెట్ పేపర్ లీక్ చేయించారని వారు ఆరోపించారు. టెట్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో మధ్యాహ్నం 1.15 గంటలకు స్ధానిక సంత వద్ద ఉన్న రెండు వాటర్ ట్యాంకులపై 28 మంది పీఈటీ అభ్యర్థులు ఎక్కారు. మరో రెండొందల మంది పీఈటీలు కింద నిలబడి టెట్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఘటనా స్ధలికి చేరుకుని పీఈటీలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుతో వీరి సమస్యలపై మాట్లాడించారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థులు అంబటిని కోరారు. ఇదిలా ఉండగా టెట్‌ను రద్దు చేయాలంటూ ఒంగోలు లోనూ సుమారు 50 మంది అభ్యర్థులు ఓవర్‌హెడ్‌ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చచెప్పడంతో రాత్రి 8 గంటలకు కిందికి దిగారు. టెట్ పీఈటీ పేపర్ యథాతథం: మంత్రి ఈ నెల 19న నిర్వహించే టెట్ పీఈటీ పేపర్ లీకైందనే వార్తలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. 19న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తుందున ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వంశీకృష్ణను సస్పెండ్ చేస్తున్నామన్నారు. టెట్ రద్దు చేయాలి విజయవాడతో పాటు, ఒంగోలులో తేళ్ల వంశీకృష్ణ పీఈటీలకు టెట్‌కు శిక్షణ ఇచ్చారు. టెట్ పేపరు సెట్‌చేసే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సయ్యద్‌బాషాకు ఇతనికి సన్నిహిత సంబం«ధాలున్నాయి. ఇతని ద్వారా తమ దగ్గర శిక్షణ తీసుకున్నవారికి టెట్ పేపర్ ముందుగానే లీక్ చేశారు. అందువల్ల టెట్ని రద్దు చేసి మరోసారి నిర్వహించాలి. – శ్రీరామకృష్ణ, పెద్దాపురం, తూర్పుగోదావరి చెన్నై సెంటర్ రద్దు వివాదానికి కారణమైన చెన్నై పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం తహశీల్దార్ బి ఆశయ్య ద్వారా ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు తెలిపారు. ఈ సెంటర్లో పరీక్ష రాసేవారికి రాష్ట్రంలోని వేర్వేరు కేంద్రాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న తేళ్ల వంశీకృష్ణపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈనెల 19వ తేదీన పీఈటీలకు టెట్ జరుగుతుందని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చెప్పారని తహశీల్దార్ వెల్లడించారు. -
అవనిగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు నూతనంగా ప్రవేశపెట్టిన టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో పీఈటీ అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకు ఎక్కారు. పరీక్షను రద్దుచేస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి దిగేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులను నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. టెట్ పరీక్షలో చెన్నై కేంద్రంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెన్నైలో కొన్ని ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయించుకున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. పీఈటీ అభ్యర్థుల నుంచి వేల రుపాయలు వసూలు చేసి.. పేపర్ లీకేజీ చేయించేందుకే ఈ ఏర్పాట్లు చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని పీఈటీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు కిందకు దిగి రావాలని కోరుతున్నారు. -
‘అవనిగడ్డ నుంచి పవన్ కల్యాణ్ పోటీ’
సాక్షి, అవనిగడ్డ: వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారని ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ముత్తంశెట్టి విజయనిర్మల పాల్గొన్నారు. కాగా, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. తిరుపతి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. జనసేన పార్టీ దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. -
ప్రగతి విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్
సాక్షి, అవనిగడ్డ : డీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ వందల కోట్లు గడించిన ప్రగతి విద్యాసంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు బుధవారం దాడి చేశారు. ప్రగతి విద్యాసంస్థల యజమాని పూర్ణచంద్రరావు ఆస్తులను తనిఖీ చేస్తున్నారు. ప్రగతి విద్యాసంస్ధలకు అవనిగడ్డ, రేపల్లె, తెనాలి, కంకిపాడుల్లో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. పామర్రు సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో కోచింగ్ సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు, మచిలీపట్నంలో వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాగా, ప్రగతి విద్యాసంస్థల్లో ప్రతి ఏటా 20 వేల మంది డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. డీఎస్సీ కోచింగ్‌కు ఒక్కరికి గానూ రూ. 25 వేల ఫీజును ప్రగతి విద్యాసంస్థ వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
కుంగిపోయిన కొత్త రోడ్డు!
► ‘ సాక్షి’ ముందే హెచ్చరించినా మేలుకోని అధికారులు ► రోడ్డు పనులు పూర్తికాక ముందే ఈ పరిస్థితి ► ఆర్ అండ్ బీ ఆదేశాలు బేఖాతర్ ► గతంలో ఇరిగేషన్ పనుల వల్లే దెబ్బతిన్న నాగాయలంక రోడ్డు అవనిగడ్డ : కొద్దిరోజుల క్రితం వేసిన నాగాయలంక రోడ్డు వేకనూరు వద్ద కుంగిపోయింది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదకర పరిస్థితిలో ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించినా అధికారుల్లో చలనం లేదు. దీంతో రూ.1.67 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త రోడ్డు పది రోజులకే కుంగిపోయింది. అధికారులు స్పందించి ఉంటే.. ఆధునికీకరణ పనుల్లో భాగంగా గతంలో అవనిగడ్డ–కోడూరు, అవనిగడ్డ–నాగాయలంక మధ్య చేపట్టిన రిటైనింగ్ వాల్ పనుల వల్ల రెండు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు పలుచోట్ల కుంగిపోయాయి. అధికారులు పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని గతంలో ‘సాక్షి’లో పలు ప్రత్యేక కథనాలు వచ్చిన విషయం విదితమే. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదు. వేకనూరు–గుడివాకవారిపాలెం మధ్య ఇటీవల చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల వల్ల ప్రధాన రహదారికి పొంచిఉన్న ప్రమాదంపై ఈ నెల 4వ తేదీ ‘సాక్షి’లో ‘అదే నిర్లక్ష్యం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో రహదారి కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా అధికారులు స్పందించక పోవడంతో పది రోజుల క్రితం రూ.1.97 కోట్లతో వేసిన తారురోడ్డు పెచ్చులుపెచ్చులుగా కుంగిపోయింది. ఈ రహదారి పనులు ఇంకా పూర్తికాక ముందే రోడ్డు కుంగిపోవడం కొసమెరుపు. ఎస్ఈ ఆదేశాలు బేఖాతర్ గతంలో ఈ ప్రాంతంలో చేపట్టిన ఆధునికీకరణ పనుల వల్ల కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రధాన రహదారులు దెబ్బతిన్న విషయం ఇటీవలే రోడ్డు పనులను పరిశీలించడానికి వచ్చిన ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీంతో స్పందించిన ఎస్ఈ రోడ్డు పక్కన పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అయినా సంబంధిత అ«ధికారులు స్పందించకపోవడం వల్లే ఈ రహదారి కుంగిపోయింది. పనులు పూర్తయినా.. ఆధునికీకరణ పనుల్లో భాగంగా అవనిగడ్డ – నాగాయలంక మధ్య చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులు పూర్తయినా ఖాళీలో ఇసుక నింపకపోవడం వల్ల రహదారి దెబ్బతింటోంది. ఏడాది క్రితం నిర్మించిన రిటైనింగ్ వాల్ పనులకు ఇసుకను తోలకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నా ఉన్నతాధికారులు చోద్యం చూడటం పట్ల ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి దెబ్బతినకుండా ఆధునికీకరణ పనులను పర్యవేక్షణ చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
రాష్ట్రంలో కొత్తగా ఆరు మత్స్యకార వసతిగృహాలు
అవనిగడ్డ: రాష్ట్రంలో కొత్తగా ఆరు మత్స్యకార వసతిగృహాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక రెండో వార్డులో నూతంగా ఏర్పాటుచేసిన బీసీ కళాశాల వసతి గృహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు మత్స్యకార వసతిగృహాలు ఉన్నాయని తెలిపారు. మరో ఆరు ఏర్పాటుకు శుక్రవారం జీవో జారీ చేశామని చెప్పారు. త్వరలోనే వీటి ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 374 బీసీ వసతిగృహాలు, 32 రెసిడెన్సియల్ స్కూల్స్ ఉన్నాయని, కార్పొరేట్‌కు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించారు. బీసీ వసతిగృహాల్లో ఈ ఏడాది పదో తరగతిలో 97.4 శాతం ఫలితాలు సాధించగా, వచ్చే ఏడాది నూరు శాతం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బీసీ విద్యార్థులకు రూ.1,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చేసినట్లు మంత్రి చెప్పారు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.10లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 250మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదివించేందుకు పంపామని తెలిపారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కోడూరు, అవనిగడ్డ జడ్పీటీసీ సభ్యులు బండే శ్రీనివాసరావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, కోడూరు, మోపిదేవి ఎంపీపీలు మాచర్ల భీమయ్య, మోర్ల జయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ డీడీ యుగంధర్, డివిజనల్ అధికారి కృష్ణారావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), టీడీపీ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటనాథ్, ఎంపీటీసీ సభ్యులు గాజలు మురళీకృష్ణ, చిలకా శ్రీనుబాబు, బెల్లంకొండ రాణీధనలక్ష్మి పాల్గొన్నారు. -
సాగునీటి ప్రత్యామ్నాయ ప్రణాళికను వెల్లడించాలి
అవనిగడ్డ : పట్టిసీమలో మరో ఐదారు రోజులు మాత్రమే నీరందే పరిస్థి్ధతి ఉందని, కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు సాగునీటి పత్యామ్నాయ ప్రణాళికను వెల్లడించాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు నుంచి సరిగా వర్షాలు పడకపోవడంతో రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరో పది రోజులు ఇదే పరిస్థితి ఉంటే డెల్టాలో చాలాచోట్ల పంటలు ఎండిపోతాయని చెప్పారు. ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించుకోవాలని, కృష్ణా డెల్టాలో ఎకరం పొలం ఎండిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో ఇంతటి తీవ్ర సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక పోతే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని చెప్పారు. డెల్టా పరిరక్షకుడిగా చెప్పుకునే ప్రజాప్రతినిధి బుద్ధప్రసాద్‌కు రైతుల గోడు పట్టడంలేదా? అని ప్రశ్నించారు. రెండేళ్లుగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏనాడైనా సీఎం చంద్రబాబును సాగునీరు కావాలని అడిగారా? అని మండిపడ్డారు. పంట చేతికొచ్చే వరకూ సాగునీటిని అందించేందుకు చర్యలు తసుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రైతు సమస్యలపై పోరాడేందుకు కృష్ణా జిల్లాలో సింహాద్రి రమేష్‌బాబు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో కొవ్వూరు త్రినాథరెడ్డి, అనంతపురం జిల్లా సింగమల కన్వీనర్ గరిమెల శరత్‌చంద్రరెడ్డిని రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారన్నారు. -
అవనిగడ్డ ఆవేదన పట్టని బుద్ధప్రసాద్
అవనిగడ్డ: అవనిగడ్డ, కోడూరు మండలాల్లో రూ.19 కోట్లతో వేసిన మూడు రహదారులు రెండో రోజే దెబ్బతిన్నా పట్టించుకోని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అ«ధికారులపై కేకలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు విమర్శించారు. పుష్కరాల్లో రూ.4కోట్లతో నిర్మించిన అవనిగడ్డ–కోడూరు రహదారి పలుచోట్ల దెబ్బతినగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రూ.12.98 కోట్లతో కోడూరు–పాలకాయతిప్ప, రూ.2 కోట్లతో కోడూరు వయా దింటిమెరక–పాలకాయతిప్ప రోడ్లు వేసిన రెండో రోజే దెబ్బతిన్నాయన్నారు. రూ.18. 98 కోట్లతో వేసిన ఈ రోడ్లు రాళ్లు లేచిపోయి, గోతులు ఏర్పడ్డాయని గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసిన రోజే రహదారి దెబ్బతిన్న ఘనత స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కే దక్కుతుందని, ఈ రికార్డును ఎవరూ తిరగరాయలేరని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు అడ్డంగా పనులు చేసి కోట్లు దోచేసుకుంటున్నా స్ధానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. రైతుల గోడు పట్టదు, సమస్యలను పట్టించుకోరు ఈ ఏడాది కోడూరు, నాగాయలంక మండలాల్లో సాగునీరందక ఇంకా 25 వేల ఎకరాల్లో నాట్లు వేయలేదని, ఎమ్మెల్యే వైఫల్యమే కారణమని సింహాద్రి ఆరోపించారు. అటవీ అధికారుల అభ్యంతరాల సాకుతో ఎదురుమొండి–నాచుగుంట, పాలకాయతిప్ప–సాగరసంగమం రహదారి నిర్మాణాలు నిలిచిపోయాయని అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నా ఎమ్మెల్యే పట్టించుకోరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రాజనాల మాణిక్యాలరావు, నేతలు ఇంకొల్లు శేషగిరి, చింతలపూడి బాలు, తోట శివప్రసాద్, గార్లపాటి గోపీ పాల్గొన్నారు. -
అవనిగడ్డ పేరు చిరస్థాయిగా...
అవనిగడ్డ, చిరస్థాయి, పుష్కరఘాట్, కృష్ణా పుష్కరాలు కొత్తపేట(అవనిగడ్డ): స్థానిక కొత్తపేటలో ఏర్పాటు చేసిన అవనిగడ్డ పుష్కరఘాట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. నియోజకవర్గంలోనే అతి పెద్ద ఘాట్‌గా పేరొందిన ఈ ఘాట్‌ని రూ.65 లక్షలతో అభివృద్ధి చేశారు. రూ.27 లక్షలతో పాతఘాట్ని ఆనుకుని 40 అడుగుల పొడవుతో కొత్తపుష్కరఘాట్ని నిర్మించగా, రూ.25 లక్షలతో ఫ్లాట్‌ఫాంని ఏర్పాటుచేశారు. రూ.11 లక్షలతో ఘాట్ మొత్తం టైల్స్‌ని ఏర్పాటు చేశారు. ఘాట్ పైభాగంలో ఇంగ్లీష్‌లో అవనిగడ్డ అక్షరాలతో చేసిన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో రెం డు లక్షలతో మెయింటెన్స్ పనులు చేశారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప నుంచి 1929లో కృష్ణానదిని మహాత్మాగాంధీ దాటుకుని కొత్తపేట మీదుగా వచ్చి దివి సీమలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.అందుకు గుర్తుగా ఈ ఘాట్ వద్ద ఎడమవైపున గాంధీజీ విగ్రహం కుడివైపున కృష్ణవేణి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
తెలుగు భాషాభిమాని మండలి
అవనిగడ్డః ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో పాటు తెలుగు భాషాభివృద్ధికి పాటుపడిన దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు ఎనలేనివని మలేషియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దాతుక్ అచ్చయ్యకుమార్ కొనియాడారు. అవనిగడ్డలో గురువారం నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు 90వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅథిగా హాజరయ్యారు. తొలుత మలేషియా బృందానికి పులిగడ్డలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం కులపతి మునిరత్నం నాయుడు, అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ గణేష్, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఒకరు మృతి
అవనిగడ్డ : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో.. వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నాంచారయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య ఈశ్వరమ్మకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు విద్యుత్ కార్యాలయం ఎదుట బడ్డీ కొట్టు నిర్వహించడానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. -
శిశువు అపహరణ కేసులో ఐదుగురి అరెస్ట్
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అపహరణ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన నిందితురాలు గంగు మల్లేశ్వరితో పాటు ఆమె భర్త రాజు, ఆస్పత్రి రికార్డు అసిస్టెంట్ శ్రీను, సెక్యూరిటీ సిబ్బంది ముఖర్జీ, కన్నయ్యలను అరెస్ట్ చేసినట్లు వివరించారు. కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలేనికి చెందిన గంగు నాగమల్లేశ్వరి గత గురువారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును అపహరించిన విషయం తెలిసిందే. -
బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం
విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ ఉదంతంలో మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన బెజవాడ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం అపహరణకు గురైన శిశువు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. నిందితురాలు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలేనికి చెందిన గంగు నాగమల్లేశ్వరిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే బిడ్డను అపహరించిన నాగమల్లేశ్వరికి గతంలో వివాహమైంది. భర్తతో వివాదాల కారణంగా విడిగా ఉంటున్న ఆమె ఏడాది క్రితం కగ్గావారిపాలేనికి చెందిన రాజును రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ అవనిగడ్డ వెంకటేశ్వర ధియేటర్ రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేరు. అయితే ఇంటి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. డీఎస్పీ ఖాదర్ బాషా నేతృత్వంలో అవనిగడ్డ సీఐ మూర్తి రాత్రి పదిన్నర సమయంలో నాగమల్లేశ్వరి ఇంటికి వెళ్లారు. మహిళను,శిశువును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి ఫోటో తీసి విజయవాడ కమిషనరేట్‌కు ఫోన్లో పంపించారు. శిశువు తమ బిడ్డేనని తల్లిదండ్రులు సుబ్రమణ్యం,కళ్యాణి గుర్తించారు. ఈ మేరకు ఎస్పీకి సమాచారమందించిన పోలీసులు పసికందును విజయవాడకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం శిశువును తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులకు,సహకరించిన మీడియాకు తల్లిదండ్రులు, బంధువులు కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు. -
బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం
-
కృష్ణాజిల్లాలో రెచ్చిపోయిన కాల్‌మనీ వ్యాపారులు...
అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న పూజారి అడిగిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడంతో ఇనుప రాడ్లతో దాడికి తెగబడి గాయపరిచారు. మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న బుద్దు పవన్ కొన్ని సంవత్సరాల క్రితం వనవలయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అసలు, చక్రవడ్డీలతో కలిపి అప్పు రూ.4 లక్షలకు చేరుకుంది. పవన్ అప్పుడప్పుడూ కొంత మొత్తం చెల్లిస్తున్నా వడ్డీ రేటు అధికం కావడంతో అప్పు, అప్పుగానే మిగిలింది. కాగా, ఆదివారం రాత్రి పవన్ రేపల్లె నుంచి మోపిదేవి వస్తుండగా మోపిదేవి కాలనీలో వడ్డీ వ్యాపారి వనవలయ్య మరికొందరితో కలసి పవన్‌ను అడ్డగించి బాకీ తీర్చాలని అడిగాడు. దానికి పవన్ ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తప్పకుండా తీరుస్తానని కొంత సమయం కావాలని ఆయన్ను కోరాడు. దీంతో ఆగ్రహించిన వారు ఇనుప రాడ్లతో పవన్‌పై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన పవన్ అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అవనిగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణానదిలో యువకుడి గల్లంతు
అవనిగడ్డ: శివరాత్రి పండుగ సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేసేందుకు ఇద్దరు స్నేహితులు వెళ్లారు. నీళ్లలోకి దిగిన తర్వాత ప్రవాహధాటికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన ఓ వ్యక్తి నీళ్లలోకి దూకి ఒకరి కాపాడగలిగాడు. మరొకరికోసం గాలిస్తూ తానూ మునిగిపోయాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో యువకుడు గల్లంతుకాగా, కాపాడటానికి నీళ్లలోకి దూకిన వ్యక్తి అస్వస్థతకుగురై ఆసుపత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళితే.. కొవ్వాడ రమణ(18), అతని స్నేహితుడు స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి దిగి, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. గట్టుమీదున్న అంబేద్కర్ అనే వ్యక్తి వాళ్లను కాపాడేందుకు నదిలోకి దూకాడు. రమణను కాపాడి, అతని స్నేహితుడి కోసం మళ్లీ నదిలోకి వెళ్లాడు. కానీ శ్వాస తిప్పుకోలేక నీట మునిగాడు. సమయానికి అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ అంబేద్కర్ ను కాపాడింది. గల్లంతైన మరో యువకుడికోసం గాలిస్తోంది. -
వైఎస్ఆర్ సీపీ నేతకు తీవ్రగాయాలు
అవనిగడ్డ (కృష్ణా జిల్లా): కోడూరు మండలం వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ పరిశా మాధవరావుకు శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన బైక్‌పై కోడూరు నుంచి అవనిగడ్డ వెళ్తుండగా వి.కొత్తపాలెం వద్ద వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో మాధవరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. -
నేడే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
డిపోలో టెంట్లు వేసి ప్రచారం ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ అదేరోజు రాత్రికి ఫలితాలు అవనిగడ్డ: అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సాధారణ ఎన్నికలను తలపించేరీతిలో పోటా పోటీగా ప్రచారం చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా ఫ్లెక్సీలు, యూనియన్ జెండాలతో ముంచెత్తారు. ఎవరికి వారు ఎత్తులు, పైఎత్తులతో కార్మికులతో విస్త్రత ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొద్దిగంటలే ఉండటంతో యూనియన్ నాయకులు హడావిడి ఎక్కువైంది. టెంట్లు వేసి ప్రచారం అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో మొత్తం 347 మంది కార్మికులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరిలో 344 మంది రెగ్యులర్ కార్మికులు కాగా, మిగిలిన ముగ్గురు కాంట్రాక్టు కార్మికులున్నారు. ప్రతి రెం డేళ్లకు ఒకసారి జరిగే యూనియన్ ఎన్నికల్లో ఈ సారి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూని యన్ (ఎన్ఎంయూ)తో పాటు కొత్తగా టిఎన్ కార్మిక పరిషత్ సంఘం ఎన్నికల బరిలో ఉంది. గత పది ఎన్నికలను పరిశీలిస్తే అవనిగడ్డ డిపో స్థాయిలో ఎంప్లాయీస్ యూనియన్ 9సార్లు విజయం సాధించగా, రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్ధూర్ సంఘం ఆరు సార్లు గెలుపొందింది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈయూ డిపోలో 58ఓట్లు, రాష్ట్రస్థ్ధాయిలో 81ఓట్లతో విజయం సాధించింది. ఈ సారి డినోలోనూ, రాష్ట్రంలోనూ రెం డుచోట్లా గెలిచి సత్తాచూపాలని ఈయూ, ఎన్ఎంయూ ప్రయత్నిస్తుండగా టిఎన్ కార్మిక పరిషత్ సంఘం చీల్చే ఓట్లపైనే విజయం ఆధార పడిఉంది. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఒకరోజు ముందే డిపో గే టు ముందు యూనియన్లు షామియానాలు వేశారు. ఎవరికి వారు తమ టెంట్లు వద్ద యూ నియన్ జెండాలు, హామీలు తెలిపే పోస్టర్లు, ఫ్లెక్సీలు ఉంచారు. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నాయకులను ఈయూ రెండుసార్లు తీసుకొచ్చి విస్త్రత ప్రచారం నిర్వహించారు. స్థానిక బస్టాం డ్ ప్రవేశంలో విద్యుత్ దీపాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉదయం 5నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ గురువారం ఉదయం 5గంటలకే యూనియన్ ఎన్నికలు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికలు కొనసాగుతాయి. ఏడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక గంట వ్యవధిలో ఫలితాలు తెలిసిపోనున్నాయని యూనియన్ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ సూర్యపవన్‌కుమార్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షించారు. యూనియన్ ఎన్నికల్లో గెలుపెవరిది తేలాలంటే మరి కొన్నిగంటలు వేచి ఉండాల్సిందే. -
రాజకీయాలంటే భయమేస్తోంది-మండలి బుద్ధప్రసాద్
-నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవు -రాజకీయాలంటే భయమేస్తోంది -ఉపసభాపతి బుద్ధప్రసాద్ ఆవేదన అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : కులాలు, మతాల వారీగా ప్రజలను విభజిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న నేటి రాజకీయాలంటే భయమేస్తోందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం రచ్చబండపై సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవని, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసేవారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కులమతాలను ప్రోత్సహించకుండా రాజకీయాలు లేవని, అన్ని పార్టీలూ వీటిని ప్రోత్సహిస్తూ అశాంతికి కారణమవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు అభివృద్ధి, పనిచేసే నాయకుడిని చూసి ప్రజలు ఓటేసేవారని, నేడు డబ్బులు పంచకపోతే ఓటేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవని, అధికారమే పరమావధిగా ఎదుటి పార్టీలను దూషించడానికే ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయని, ప్రజల బాగోగులను పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలా అనే ఆలోచనలతోనే పనిచేస్తున్నాయని, మారిన ఈ రాజకీయాలంటేనే భయమేస్తోందని తెలిపారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, జాతిని జాగృతం చేసేలా మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని యువతకు సూచించారు. తహశీల్దార్ వెన్నెల శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లాలో టీచర్‌పై ఎస్ఐ దౌర్జన్యం
-
అవనిగడ్డలో చైన్ స్నాచర్లు అరెస్ట్
విజయవాడ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో పోలీసులు శుక్రవారం ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 105 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. చైన్ స్నాచర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విచారణ నిమిత్తం పోలీసులు చైన్ స్నాచర్లను తమదైన శైలిలో విచారిస్తున్నారు. అవనిగడ్డలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శుక్రవారం పోలీసులు తనిఖీల్లో సదరు చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు. -
కూలిన ఆంజనేయస్వామి గుడి
-
గుడిసెలు దగ్దం: 15 లక్షల ఆస్తి నష్టం
మచిలీపట్నం : కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం సింహ్రది నగర్లో 15 గుడిసెలు శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. దాంతో గుడిసె వాసులంతా నిరాశ్రయులయ్యారు. దాదాపు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశలు ఆవిరి
అవనిగడ్డ సాక్షిగా... మాటతప్పిన బాబు ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు నో చాన్స్ లబోదిబోమంటున్న అభ్యర్థులు ‘ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తాం..’ ఈ ఏడాది మేలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మండలి బుద్ధప్రసాద్ తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక రాజీవ్‌చౌక్‌లో జరిగిన బహిరంగసభలో నాటి టీడీపీ అభ్యర్థి, నేటీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు ఈ ప్రకటన చేశారు. మరి ఇప్పుడేం చేశారంటే.. అవనిగడ్డ : ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తామని అవనిగడ్డ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు నేడు మాట తప్పారు. తాజాగా టెట్, డీఎస్సీ స్థానంలో టెట్ కమ్ టీఆర్టీగా పేరు మార్చి విడుదల చేసిన జీవోలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీలకు అవకాశం కల్పించకుండానే ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాడు చంద్రబాబు చేసిన ప్రకటనను నమ్మి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ పొందుతున్న వేలాదిమంది అభ్యర్థులు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఊరించి.. ఉసూరుమనిపించారు... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీ నోటీఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బాలారిష్టాలు తొలగి ఎట్టకేలకు వెలువడిన డీఎస్సీ నోటీఫికేషన్ బీఈడీ విద్యార్థులు, అభ్యర్థులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులు రాయడానికి అవకాశం కల్పించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కూలీనాలి చేసుకుని బతికే బడుగు జీవులు సైతం వేలాది రూపాయలు వ్యయంచేసి తమ బిడ్డలను ఇక్కడకు శిక్షణకు పంపారు. గత ఆరు నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతమైంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎస్జీటీ చేసిన వారిని, ఆరు నుంచి పదో తరగతి బోధించే ఉపాధ్యాయులుగా బీఈడీ అభ్యర్థులను ఎంపిక చేస్తే ప్రతి జిల్లాలోనూ స్కూలు అసిస్టెంట్ పోస్టులు పెరిగేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు అందులో తమ జిల్లాలో తమ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు చూపకపోవడంతో మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తామేం చేయాలో పాలుపోవడం లేదని పలువురు అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు. కొందరి ఆవేదన ఇలా ఉంటే మరికొందరి ఆవేదన మరోలా ఉంది. డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి జూలై ఒకటి నాటికి 40 సంవత్సరాలు నిండకూడదని గడువు విధించటం కూడా కొందరిపాలిట అశనిపాతమైంది. కనీసం జూన్ నెలను ప్రాతిపదికగా చేసుకుని ఉంటే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిరాశే మిగిలింది... ఐదు నెలలుగా ఇక్కడ మ్యాథ్స్ బీఈడీ అసిస్టెంట్‌కు శిక్షణ పొందుతున్నాను. డీఎస్సీ నోటిఫికేషన్లో మా జిల్లాలో ఖాళీలు చూపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయినవారందరికీ దూరంగా ఉంటూ ఉద్యోగంపై ఆశతో శిక్షణ పొందిన నాకు చివరకు నిరాశే మిగిలింది. - ఎస్.పద్మ, కడవకుదురు, ప్రకాశం జిల్లా అగమ్యగోచరం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే పోస్టుల సంఖ్య పెరుగుతాయని ఎంతో ఆశగా గత ఆరు నెలల నుంచి పగలనకా రేయనకా కష్టపడి చదువుతున్నాం. తీరా విద్యాశాఖ ప్రకటన చూశాక ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. - ఎన్.వెంగమ్మ, నెల్లూరు -
‘శంఖారావం’ సభకు జిల్లా నుంచి 50 వేల మంది
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు 800 బస్సులు, వందలాది కార్లలో భారీగా తరలివెళుతున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికాప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల నుంచి 50 వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనావేసినట్టు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 50 బస్సులు ఏర్పాటుచేశామని, కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య 15 వేల పైచిలుకు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. వీరందరికీ అవసరమైన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలే చూసుకుంటారని, వీటికి అనుబంధంగా రాష్ట్ర పార్టీ కూడా సహకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజధానిలో వసతి ఏర్పాట్లు.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వచ్చే కార్యకర్తలకు హయత్‌నగర్‌లోని ధనుంజయ గార్డెన్స్‌లోను, పెడన, నందిగామ నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి నాచారం పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న సి.కె. గార్డెన్స్‌లోను, మచిలీపట్నం నుంచి వచ్చే కార్యకర్తలకు ఉప్పల్ బస్టాండ్ (బోడుప్పల్) దగ్గర్లోని శబరి గార్డెన్స్‌లో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని భాను తెలిపారు. జగ్గయ్యపేటతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రామోజీ ఫిలింసిటీ వద్ద గల అన్నమాచార్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా నుంచి వచ్చే ప్రతి కార్యకర్త 25వ రాత్రికే హైదరాబాద్ వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రాష్ర్టం నలుమూలల నుంచి సుమారు ఆరు లక్షల మంది ఈ సభకు హాజరయ్యే అవకాశముందని రాష్ట్ర పార్టీ అంచనావేస్తున్నట్టు తెలిపారు. పాస్‌ల వివరాలు.. సీఈసీ, సీజీసీ సభ్యులు, తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ జిల్లా కన్వీనర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్లమెంట్ పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లకు వీవీఐపీ పాసులు ఇస్తారని తెలిపారు. మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిదులు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ర్ట పార్టీ సభ్యులకు వీఐపీ పాసులు ఇస్తారని పేర్కొన్నారు. వీరంతా తమ గుర్తింపుకార్డులు విధిగా తీసుకునిరావాలని ఉదయభాను సూచించారు. -
ముంచెత్తుతున్న వానలు.. కర్షకుడికి కన్నీళ్లే
వాయుగుండం రైతులపాలిట దినదినగండంగా మారింది. పగబట్టిన ప్రకృతి కర్షకుడికి కన్నీళ్లను మిగులుస్తోంది. మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి పంటలు నీటిపాలవుతున్నాయి. పత్తి, మొక్కజొన్న మొలకలు వచ్చి రైతుల ఆశలను తుంచేస్తున్నాయి. నీటమునిగిన వరిచేలు రైతును కన్నీటిపాలు చేస్తున్నాయి. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో రైతులు ప్రస్తుత సార్వా సీజన్లో 6.42 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వాటిలో మూడు లక్షల ఎకరాల్లో బీపీటీ 5204(సాంబామసూరి), రెండున్నర లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1061, సుమారు లక్ష ఎకరాల్లో ఎంపీటీయూ 1001, బాసుమతి, మిగిలిన రకాలు వేశారు. ఇప్పటికే విత్తన రకాలు ఈనిక పూర్తి చేసుకుని గింజలు పాలుపోసుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అవి కోతకు రానున్నాయి. ఆలస్యంగా నాట్లు వేసిన అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, కోడూరు, ఘంటసాల మండలాలతోపాటు గూడూరు, బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి మండలాల్లో పైరు నిలదొక్కుకునే దశలో ఉంది. ఈనిక దశలోను, పాలుపోసుకునే దశలో ఉన్న చేలకు ప్రస్తుత వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడూరు, బందరు, ముదినేపల్లి తదితర మండలాల్లో 1500 ఎకరాల వరిచేలు నీట మునిగాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆక్వాకూ అవస్థలే.. జిల్లాలో 75 వేల ఎకరాల్లో చేపలు, 35 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వల్ల ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు, బందరు, కృత్తివెన్ను, అవనిగడ్డ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు కాసి, ప్రస్తుతం మబ్బులు, వర్షం పడడంతో రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో ఆక్సిజన్ సమతుల్యత కోసం ఏరియేటర్లను తిప్పడం, చేపల చెరువుల్లో డీవోబీ సమస్య రాకుండా మందులు చల్లడం, మేతలు తగ్గించడం వంటి చర్యలను ఆక్వా రైతులు చేపట్టారు. పత్తి పంటకు రూ.2 కోట్ల నష్టం.. జిల్లాలో లక్షా 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ, పంట దశల్లో ఉంది. ప్రస్తుత వర్షాలతో దాదాపు పది శాతం వరకు పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నష్టం 30 శాతం వరకు ఉంటుందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల కారణంగా పత్తికాయలకు బూజు తెగులు వచ్చి దూదిపింజలు పగలకుండా కుళ్లిపోతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విచ్చుకున్న పత్తి వర్షాలకు తడిసి రంగుమారే ప్రమాదం ఉంది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సుమారు రూ.2 కోట్ల విలువైన పంట నష్టపోయినట్టు అంచనా. ఎకరాకు సుమారు రూ.10 వేల వరకు నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండటంతో మొక్కలు ఎర్రబారి ఎండిపోతున్నాయి. దీని కారణంగా నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. మొక్కజొన్న, కూరగాయల పంటలకూ నష్టమే.. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి మొలకలు వచ్చేశాయి. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మండలాల్లో లేతగా ఉన్న బీర, దోస, కంద పొలాల్లోకి నీరు చేరడంతో మొక్కలు చనిపోయే ప్రమాదం ఏర్పడింది. నీట మునిగిపోవడంతో బీర, దోస, కంద పూత రాలిపోవడం, కాయలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పసుపు చేలల్లో నీరు రెండు మూడు రోజులు నీరు నిల్వ ఉంటే దుంప కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టమాటా తోటలో నీరు చేరే ప్రమాదం ఉంది. ఈ ప్రభావంతో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని తమలపాకుల తోటల్లో నీరు నిల్వ ఉండడంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టాలను అంచనా వేస్తున్నాం : జేడీఏ భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను అంచనా వేస్తున్నట్టు ఇన్చార్జి జేడీఏ బాలూనాయక్ ‘సాక్షి’కి చెప్పారు. చల్లపల్లి, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో బుధవారం ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇప్పటికే వరిచేలు నీట మునిగాయని, వర్షం పెరిగితే నష్టం పెరుగుతుందని అన్నారు. పత్తి 10 శాతానికి పైగా నష్టం ఉంటుందని అన్నారు. విచ్చుకున్న పత్తికాయలు తడిసిపోతే రంగుమారిపోతుందన్నారు. తయారైన కాయల్లోకి నీరుచేరి కుళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పత్తి పూత రాలిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. దీనికి సంబంధించి పంట నష్టాలు అంచనాలు వేయాల్సి ఉంద న్నారు. కాగా వరిలో పెద్దగా నష్టం లేదని చెప్పారు. ఈ చర్యలు తీసుకోండి.. జిల్లాలో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఈ చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.మహేశ్వర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి చేలల్లోని నీటిని బయటకు తోడి, నేలవాలిన వరిదుబ్బులను సుడులు కట్టుకుని నిలబెట్టాలి. నీట మునిగిన వరిపైరు దుబ్బు దశ నుంచి అంకురం ఏర్పడే దశలో ఉంటే పాముపొడ తెగులు వచ్చే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటరు హెక్సాకోనాజోల్ మందు లేదా ఒక మిల్లీలీటరు ప్రోపికొనజోల్ లేదా రెండు మిల్లీలీటర్ల వాలిడామైసిన్ మందు వాడాలి. అగ్గి తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో 0.6గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును పిచికారీ చేయాలి. దోమ, ఆకుముడత తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిఫెట్ మందు పిచికారీ చేయాలి. పత్తి పొలంలోని నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడాలి. ఎకరానికి 20కిలోల యూరియాతోపాటు 10 కిలోల పొటాషియం నైట్రేట్‌ను చల్లాలి. తెగుళ్ల నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఒక గ్రాము కార్బన్‌డిజమ్ లీటరు నీటిలో కలిపి చల్లాలి. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కలు పూర్తిగా తడిసేటట్టు పిచికారీ చేయాలి. కూరగాయల పంటల్లో, పాక్షికంగా దెబ్బతిన్న మిరప చేలో రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పక్కకు వంగిపోయిన మిరప మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మట్టిని ఎగదోయాలి. పాక్షికంగా దెబ్బతిన్న పసుపు పంట పొలంలో 0.5 శాతం పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల్లో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. భూమి ఆరిన తర్వాత 50 గ్రాముల ఎంవోపీ, 250 గ్రాముల వేపపిండి మొక్క దగ్గర వేయాలి. ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటరు చొప్పున వారం వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలి. -
నేడు అవనిగడ్డ నుంచి షర్మిల యాత్ర ప్రారంభం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం జిల్లాలో కొనసాగనుంది. బుధవారం రాత్రి అవనిగడ్డ బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం రాత్రి బసకు చేరుకున్నారు. గురువారం ఉదయం అవనిగడ్డ నుంచి బస్సుయాత్ర ప్రారంభమై చల్లపల్లి, కొడాలి, పామర్రు, అడ్డాడ, గుడ్లవల్లేరు, విన్నకోట, ముదినేపల్లి మీదుగా కైకలూరు చేరుకుంటారు. కైకలూరులోని అడవినాయుడు సెంటర్లో జరిగే బహిరంగసభలో ప్రసంగించి అక్కడనుంచి పశ్చిమగోదావరి జిల్లాకు వెళతారని పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ప్రోగాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. -
అవనిగడ్డలో షర్మిళ సమైక్య శంఖారావం
-
'చూశారా... మాదే బలం..' టీడీపీయే బలంగా ఉందని చంద్రబాబు ప్రచారం
రాష్ట్రంలో తెలుగుదేశం పనైపోయిందని ఆ పార్టీ నేతలంతా దిగాలుపడిపోగా... లేదులేదు మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి ఏం చేయాలని తలపట్టుకున్న అధినేతకు మెరుపులాంటి ఒక ఆలోచన తట్టిందట... అదే అవనిగడ్డ. రాష్ట్రంలో ఒక్క టీడీపీయే బలంగా ఉందని చెప్పడానికి అవనిగడ్డ ఫలితం గురించి ప్రచారం చేయమన్నారట చంద్రబాబు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అనారోగ్యంతో మృతి చెందటంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందిన కారణంగా ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెడుతున్నామనీ, ఏక గ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కోరుతూ చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలందరికీ లేఖలు రాశారు. ఆయన విజ్ఞప్తికి అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించి పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే ఇద్దరు స్వతంత్రులు మాత్రం పోటీకి నిలవడంతో ఎన్నిక అనివార్యమై పోలింగ్ జరగ్గా టీడీపీ అభ్యర్థి 61 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రజలు ఒక్క టీడీపీని మాత్రమే ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణని ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారట. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. రేపటి రోజున రాష్ట్రమంతా ఇవే ఫలితాలొస్తాయని వియ్యంకుడు బాలకృష్ణ తొడగొట్టారు. ఇక ఢిల్లీలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలు, లాబీల్లో కలిసిన జాతీయ పార్టీ నేతలందరికీ ఇదే విషయం చెప్పడం ప్రారంభించారు. విషయం తెలియని కొందరు ఇతర రాష్ట్ర నేతలు ఔరా...!అని ఆశ్చర్యపోయారట. పార్లమెంట్లో విభజన గొడవ జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి చెందిన నేతలు కొందరు లాబీల్లో కలిసినప్పుడు... ‘మీరెంత చేసినా ఫలితం లేదు. కొద్ది రోజుల కింద మీ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉపఎన్నిక జరిగితే టీడీపీయే గెలిచింది కదా’.. అని ఉత్తర భారత దేశానికి చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు చెప్పడంతో అక్కడున్న నేతలంతా ఆశ్చర్యపోయారట. ఉపఎన్నికా... అదెక్కడ జరిగింది? అని కాసేపు బుర్ర బద్దలు కొట్టుకుంటే అవనిగడ్డ గుర్తుకొచ్చిందట. అసలక్కడ ఏ పార్టీ పోటీ చేయలేదు కదా... అని ఒక టీడీపీ ఎంపీని ఆరా తీయగా చంద్రబాబు మంత్రాంగం తెలియడంతో అవాక్కయ్యారట. ‘ఔరా.. బాబూ... ప్రచారంలో నీకు నీవే సాటి’ అనుకుని, ఆ ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా వాళ్లే నిలబెట్టారేమో... అని సందేహం వ్యక్తం చేశారట. -
అవనిగడ్డ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
అవనిగడ్డ శాసనసభకు బుధవారం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ శనివారం మచిలీపట్నంలోని హిందూకళాశాలలో ప్రారంభమైంది. ఇప్పటికి ఐదో రౌండ్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ (హరిబాబు) తన సమీప ప్రత్యర్థుల కంటే 15,502 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యునిగా ఉన్న అంబటి బ్రాహ్మణయ్య తీవ్ర అనారోగ్యంతో ఈ ఏడాది మొదట్లో మరణించారు. దీంతో ఆ నియోజవర్గం ఖాళీ ఏర్పడింది. అయితే తెలుగుదేశంపార్టీ అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును ఎన్నికల బరిలోకి దింపింది. కాగా ఆయనకు పోటీ నిలిపేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు నిరాకరించాయి. దీంతో హరిబాబు అభ్యర్థిత్వం ఏకగ్రీవం అయ్యేది. అయితే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీకి రంగంలోకి దిగటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. -
అవనిగడ్డ ఉప ఎన్నిక
సాక్షి, మచిలీపట్నం / చల్లపల్లి న్యూస్‌లైన్ : అనుకున్నట్టే అయ్యింది. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలోనే అతి తక్కువ పోలింగ్ బుధవారం నాటి ఉప ఎన్నికల్లో నమోదైంది. సమైక్య సెగ, మాగాణి పనులు, ప్రధాన పార్టీల పోటీ లేకపోవడం, కాంగ్రెస్ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో కేవలం 47.01 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా ఓటర్ల కంటే పోలీసుల సంఖ్యే ఎక్కువగా కనిపించింది. మొత్తానికి అవనిగడ్డ ఉప పోరు ప్రశాంతంగా ముగిసింది. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. గతంలో జరిగిన ఎన్నికలను పరికిస్తే 58 శాతం ఓటింగ్‌తో అతి తక్కువ పోలింగ్ జరిగినట్టు రికార్డు ఉంది. దాన్ని తలదన్నేలా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం 47.01 శాతం పోలింగ్‌కే పరిమితమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలవ్వగా పది గంటల సమయంలో కేవలం 7 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. అనంతరం 12 గంటల సమయంలో 19 శాతం, రెండు గంటల సమయంలో 31 శాతం, 4 గంటల సమయంలో 36 శాతం, ఐదు గంటలకు 47.01 శాతం పోలింగ్ జరిగింది. చివరి ఒక్క గంటలో సుమారు 11 శాతం నమోదవడం విశేషం. ఓటింగ్ శాతం తగ్గడంతో కంగారుపడిన తెలుగుదేశం శ్రేణులు గ్రామాల్లోకి వెళ్లి తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను స్వయంగా తీసుకుని వచ్చి ఓటింగ్ చేయించుకోగలిగారు. దీంతో చివరి నిమిషంలో ఓటింగ్ శాతం ఒక మేరకు పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 1,88,300 మంది ఓటర్లు ఉంటే వారిలో 88,682 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జేసీ పి.ఉషాకుమారి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు ఉప ఎన్నికలను పర్యవేక్షించారు. ముప్పేట దాడి.. ముందు నుంచి అనుకున్నట్టే అవనిగడ్డ ఉప ఎన్నికలపై మూడు ప్రధాన అంశాలు ప్రభావం చూపించాయి. తొలి నుంచి మూడు అంశాలు తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాయి. వాటిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో లేకపోవడం ఒకటి, సమైక్యాంధ్ర ఉద్యమం మరొకటి, మాగాణి సాగు పనులు ముమ్మరంగా సాగడం ఇంకొకటి. ప్రధాన పార్టీలు పోటీ చేయడం లేదని ప్రకటించడం, సానుభూతితో టీడీపీకి ఏకగ్రీవం అవుతుందనుకున్న తరుణంలో స్వతంత్రులు ఇద్దరు బరిలో నిలవడంతో పోటీ తప్పలేదు. ప్రధాన పార్టీలు లేకపోవడంతో ఎన్నికలను ఓటర్లు అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో ఓటింగ్‌కు ఎక్కువమంది దూరంగానే ఉన్నారు. పోటీలో లేని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడం కూడా కొంత ప్రభావం చూపింది. అవనిగడ్డ నియోజకవర్గంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను సాగు పనులు ముమ్మరంగా సాగడంతో రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తానికి డబ్బు, మద్యం ప్రలోభాల వల గట్టిగా విసరని ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు సైతం అంతే నిరాసక్తి చూపించారన్నది కొసమెరుపు. -
ఇరకాటంలో టీడీపీ
సాక్షి, మచిలీపట్నం : అవనిగడ్డ ఉప ఎన్నికల పోరులో తెలుగుదేశం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఊరిస్తున్న ఉపపోరు ఫలితాన్ని అందుకునేందుకు టీడీపీ అవస్థలు పడుతోంది. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమం టీడీపీకి శిరోభారంగా మారగా మరోవైపు ఊపందుకున్న మాగాణి పనులతో ఓటింగ్ తక్కువ జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇది చాలదన్నట్టు తాజాగా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపు టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం జరుగుతున్న ఉప ఎన్నికల్లో స్వతంత్రులు మరింత పట్టు బిగిస్తే టీడీపీ అభ్యర్థి గెలుపు, మెజార్టీలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చర్చనీయాంశంగా కాంగ్రెస్ బహిష్కరణ పిలుపు.. అవనిగడ్డ ఉప ఎన్నికలను బహిష్కరించాలంటూ కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అందుకు దీటుగా ఓటు వేసి సమైక్య నినాదం చాటాలని టీడీపీ ఉపపోరులో గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోగా, ఇక్కడ ఆ పార్టీ స్థానిక నాయకత్వం మాత్రం అందుకు నిరసనగా ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యాంధ్ర విషయంలో గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న టీడీపీ.. ఎక్కడిమాట అక్కడ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రెండూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమంలో వెనుబడిన సంగతి తెలిసిందే. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఎన్నికల బహిష్కరణకు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు మంగళవారం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి నిరసన తెలిపేలా అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ఓటు వేయకుండా ఓటర్లు బహిష్కరించాలంటూ ఇదే నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు పిలుపునివ్వడం గమనార్హం. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమం, మాగాణి పనులు ఊపందుకోవడం వెరసి గురువారం జరిగే అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. దీనికితోడు కాంగ్రెస్ నేతల పిలుపుతో ఎన్నికలను ఓటర్లు బహిష్కరిస్తే టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు మరింత ఇబ్బందికరమే. వీటికితోడు స్వతంత్ర అభ్యర్థులు సైకం రాజశేఖర్, రావు సుబ్రహ్మణ్యంలు పట్టు బిగిస్తే టీడీపీ అభ్యర్థి మెజార్టీ తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలు మింగుడుపడని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మరికొందరు నేతలు రెండు రోజుల కిత్రం నియోజకవర్గంలో మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసి దివంగత అంబటి బ్రాహ్మణయ్యకు నివాళులర్పించాలని, సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని వ్యూహాత్మకంగా ఉపన్యాసాలు ఇచ్చారు. సర్వం సిద్ధం.. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించి తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావులు అవనిగడ్డలో పోలింగ్ కేంద్రాలు, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు వెయ్యి మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ, సామగ్రి పంపిణీ తదితర ఏర్పాట్లను బందరు ఆర్డీవో పి.సాయిబాబు పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా కలెక్టర్, ఎస్పీ అన్ని శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. -
ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి
కోనేరుసెంటర్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ జె.ప్రభాకరరావు పోలీస్ అధికారులకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉప ఎన్నికకు జరుగుతున్న భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. కేసుల దర్యాప్తుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. నేరస్తులను పసిగట్టే సందర్భాల్లో తలెత్తే సమస్యలను జిల్లా పోలీసు అధికారులు సమన్వయంతో పరిష్కరించు కోవాలని సూచించారు. జిల్లాలోని తీరప్రాంతాల వెంబడి కొట్టుకొచ్చే మృతదేహాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డాక్టర్ షెముశీ బాజ్‌పాయి, బందరు డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు, గుడివాడ డీఎస్పీ డి.మురళీధర్, నందిగామ డీఎస్పీ డీసీహెచ్ హుస్సేన్, నూజివీడు డీఎస్పీ ఎ.శంకర్‌రెడ్డి, అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు, సీఐలు పాల్గొన్నారు. 20, 21 తేదీల్లో స్కూళ్లకు సెలవు మచిలీపట్నం : ఉప ఎన్నికను పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గంలోని పాఠశాలలకు ఈ నెల 20, 21 తేదీల్లో సెలవు మంజూరు చేసినట్లు కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి ఆదివారం తెలిపారు. పోలింగ్ జరిగే 21న షాపుల్లో పనిచేసే కార్మికులకు కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే 24వ తేదీన హిందూ కళాశాలకు, పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు తెలియజేశారు. -
అవనిగడ్డ ఉప పోరు ఎన్నికా? ఏకగ్రీవమా?
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ సానుభూతి మంత్రాన్ని జపించిన టీడీపీ ఏకగ్రీవంతో తమ స్థానాన్ని పదిలపర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనబడటం లేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో ఎన్నికా, ఏకగ్రీవమా అనేది ఉత్కంఠగా మారింది. సానుభూతి కోణంలో పోటీకి పార్టీలు దూరం అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. ఏదేమైనా అవనిగడ్డ ఉప ఎన్నికలను సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టడంలేదని ప్రకటించాయి. దీంతో అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడమే తరువాయి పోటీ లేకుండా ఏకగ్రీవం అవుతారని అందరూ భావించారు. తీరా నామినేషన్ల సమయం వచ్చేసరికి ఆయనతోపాటు మరో 16 మంది వరకు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన దశలో ఐదుగురిని అనర్హులుగా ప్రకటించడం, మంగళవారం ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ నుంచి విరమించుకోవడంతో టీడీపీతో కలిపి మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. రాజీ యత్నాలు ముమ్మరం.. నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో ఏకగ్రీవం కోసం తెలుగుదేశం రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం మాచవరపు ఆదినారాయణ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మిగిలిన 10 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. వారిని ఎలాగోలా ఒప్పించి పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మరికొందరు నేతలు రంగంలోకి దిగారు. 21న ఎన్నికలు.. నియోజకవర్గంలో మొత్తం 1,87,200 మంది ఓటర్లుండగా వీరిలో 93,307 మంది పురుషులు, 93,893 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయగా ఆయనపై టీడీపీ తరఫున పోటీచేసిన అంబటి బ్రాహ్మణయ్య 417 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పీఆర్పీ తరఫున సింహాద్రి రమేష్‌బాబు పోటీలో ఉండటంతో కాంగ్రెస్ ఓట్లకు భారీ స్థాయిలో గండిపడటంతో టీడీపీ అతి కష్టంమీద గెలిచింది. బ్రాహ్మణయ్య మృతితో ఈ నెల 21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
అవనిగడ్డ ఏకగ్రీవంకు తెదేపా చూపు