డిపోలో టెంట్లు వేసి ప్రచారం
ఉదయం 5గంటల నుంచి సాయంత్రం
6గంటల వరకూ పోలింగ్ అదేరోజు రాత్రికి ఫలితాలు
అవనిగడ్డ: అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సాధారణ ఎన్నికలను తలపించేరీతిలో పోటా పోటీగా ప్రచారం చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా ఫ్లెక్సీలు, యూనియన్ జెండాలతో ముంచెత్తారు. ఎవరికి వారు ఎత్తులు, పైఎత్తులతో కార్మికులతో విస్త్రత ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొద్దిగంటలే ఉండటంతో యూనియన్ నాయకులు హడావిడి ఎక్కువైంది.
టెంట్‌లు వేసి ప్రచారం
అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో మొత్తం 347 మంది కార్మికులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరిలో 344 మంది రెగ్యులర్ కార్మికులు కాగా, మిగిలిన ముగ్గురు కాంట్రాక్టు కార్మికులున్నారు. ప్రతి రెం డేళ్లకు ఒకసారి జరిగే యూనియన్ ఎన్నికల్లో ఈ సారి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూని యన్ (ఎన్‌ఎంయూ)తో పాటు కొత్తగా టిఎన్ కార్మిక పరిషత్ సంఘం ఎన్నికల బరిలో ఉంది.
గత పది ఎన్నికలను పరిశీలిస్తే అవనిగడ్డ డిపో స్థాయిలో ఎంప్లాయీస్ యూనియన్ 9సార్లు విజయం సాధించగా, రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్ధూర్ సంఘం ఆరు సార్లు గెలుపొందింది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈయూ డిపోలో 58ఓట్లు, రాష్ట్రస్థ్ధాయిలో 81ఓట్లతో విజయం సాధించింది. ఈ సారి డినోలోనూ, రాష్ట్రంలోనూ రెం డుచోట్లా గెలిచి సత్తాచూపాలని ఈయూ, ఎన్‌ఎంయూ ప్రయత్నిస్తుండగా టిఎన్ కార్మిక పరిషత్ సంఘం చీల్చే ఓట్లపైనే విజయం ఆధార పడిఉంది. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఒకరోజు ముందే డిపో గే టు ముందు యూనియన్లు షామియానాలు వేశారు. ఎవరికి వారు తమ టెంట్లు వద్ద యూ నియన్ జెండాలు, హామీలు తెలిపే పోస్టర్లు, ఫ్లెక్సీలు ఉంచారు. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నాయకులను ఈయూ రెండుసార్లు తీసుకొచ్చి విస్త్రత ప్రచారం నిర్వహించారు. స్థానిక బస్టాం డ్ ప్రవేశంలో విద్యుత్ దీపాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఉదయం 5నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్
గురువారం ఉదయం 5గంటలకే యూనియన్ ఎన్నికలు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికలు కొనసాగుతాయి. ఏడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక గంట వ్యవధిలో ఫలితాలు తెలిసిపోనున్నాయని యూనియన్ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ సూర్యపవన్‌కుమార్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షించారు. యూనియన్ ఎన్నికల్లో గెలుపెవరిది తేలాలంటే మరి కొన్నిగంటలు వేచి ఉండాల్సిందే.
నేడే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
Published Thu, Feb 18 2016 12:56 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement