RTC depot
-
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. కాంప్లెక్స్ ఆవరణలో బస్సు నిలిపి ఉంచిన అనంతరం క్లీనర్ తాళాలు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. తుని వెళ్లేందుకు డ్యూటీ డ్రైవర్ కాంప్లెక్స్‌కు వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రదేశంలో బస్సు లేదు. డ్రైవర్ వెంటనే బస్సు యజమాని దాట్ల గీతంరాజుకు విషయం చెప్పాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గాలింపు చేపట్టారు. చింతపల్లికి సమీపంలోని చింతలూరు వద్ద పోలీసులు బస్సుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాధిక్ బాషా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. చింతలూరు వద్ద… pic.twitter.com/E4jhNy1bXl— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024 -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి అమానుషం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: పట్టణంలో రౌడీమూకలు చెలరేగిపోయి విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై నడిరోడ్డులో అమానుషంగా దాడి చేసి కాళ్లు, చేతులతో దారుణంగా తన్నడం పాశవిక చర్య అని కావలి ఆర్టీసీ ఉద్యోగులు అన్నారు. కావలిలో రోడ్డుపై వాహనాన్ని ఆపి ఉంటే హారన్ కొట్టి సైడ్ ఇవ్వమని అడిగిన విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకలు దాడి చేశాయని, బస్సును మద్దూరుపాడు వద్ద హైవేలో ఆపి డ్రైవర్‌ను చితకబాదడం విచారకరమని అన్నారు. రౌడీమూకల చర్యలను నిరసిస్తూ కావలి ఆర్టీసీ ఉద్యోగులు శనివారం ఆందోళన చేపట్టారు. కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీగా వెళ్లి లిఖిత పూర్వక వినతిపత్రాలు అందజేశారు. రౌడీమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఉద్యోగులమైన తమపై రౌడీమూకల దాడులను ప్రజలందరూ ఖండించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలి నెల్లూరు సిటీ: విజయవాడ ఆర్టీసీ డిపో డ్రైవర్‌పై దాడి అమానుషమని, దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్ఎంయూఏ జిల్లా కార్యదర్శి జానా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిలో ఆర్టీసీ డ్రైవర్ బత్తుల రామ్‌సింగ్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. రాత్రి, పగలు నిరంతరం ప్రజల కోసం విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిరూపించేలా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి పీఎస్‌రెడ్డి, జోనల్ కార్యదర్శి కె.లుక్సన్, డిపో–1 కార్యదర్శి చెంచయ్య, అధ్యక్షుడు బీఆర్ ప్రసాద్, డిపో–2 ఎన్ఎంయూ అధ్యక్షుడు సునీల్, కార్యదర్శి శివయ్య, అసోసియేషన్ సభ్యులు బాబూ శామ్యూల్, ప్రసాద్, కట్టా సుబ్రహ్మణ్యం, జిలానీ, దశరథ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
విశాఖపట్నం: 93వ వార్డు పరిధి గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్‌లోని ఎన్ఎస్టీఎల్ కాలనీలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. డీసీపీ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడుకుల రాధాగాయత్రి(45), ఆమె భర్త నరేంద్ర ఎన్ఎస్టీఎల్ కాలనీలో అద్దె ఇంట్లో గత ఆరు నెలల నుంచి ఉంటున్నారు. నరేంద్ర వీఎస్పీఈజెడ్లో పనిచేస్తున్నారు. నరేంద్ర అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తుండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. రాధాగాయత్రికి శ్రీనివాసనగర్‌లో ఉంటున్న కల్పన అనే బ్యూటీషియన్‌తో కొంతకాలంగా స్నేహం ఉంది. రాధాగాయత్రి, కల్పన గతంలో బాలాజీ గార్డెన్స్‌లోనే అద్దె ఇళ్లలో ఉండేవారు. ఈనెల 21వ తేదీన ఒంట్లో బాగోలేదని రాధాగాయత్రి కల్పనకు చెప్పింది. దీంతో ఆరోజు ఉదయం తన కూతురు గీతికతో కలిసి రాధాగాయత్రి ఇంటికి వచ్చి టిఫిన్ ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలుమార్లు కల్పన ఫోన్ చేసినా రాధాగాయత్రి లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆదివారం సాయంత్రం కల్పన తన కూతురు గీతికతో కలిసి రాధాగాయత్రి ఇంటికి వచ్చింది. గీతిక బయటి నుంచి పిలవగా ఎంతకీ పలకలేదు. ఇంటి పెరటివైపు ఉన్న డోరు తీసి ఉండటంతో లోపలకి వెళ్లి చూసింది. ఇంట్లో రాధాగాయత్రి మృతి చెంది ఉండటాన్ని చూసి భయంతో బయటకి వచ్చేసింది. వెంటనే విషయాన్ని స్థానిక వలంటీర్ సత్యశ్రీకి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన సత్యశ్రీ పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ ఆనంద్‌రెడ్డి, ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, పెందుర్తి సీఐ శ్రీనివాసరావు పరిశీలన జరిపారు. డాగ్‌స్క్వాడ్‌తో కూడా పరిశీలించారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లను, కల్పన కూతురు గీతికని, వలంటీర్ సత్యశ్రీలను విచారించారు. ఆమె భర్త నరేంద్రకి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో నరేంద్ర పనిచేస్తున్న ఆఫీసుకి పోలీసులను పంపిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా రాధాగాయత్రి ఒక్కరే ఇంట్లో ఉంటోందని, నరేంద్ర ఆమె భర్త కాదేమో అన్న అనుమానాలు సంఘటన స్థలంలో చోటుచేసుకున్నాయి. -
మస్త్ పైసల్!...లాభాల బాటలో మెదక్ డిపో
మెదక్‌జోన్ : మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో దూసుకుపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఙాపూర్, దుబ్బాక డిపోలు ఉన్నాయి. వాటిలో ఆదాయం రాబట్టడంలో మెదక్ ప్రథమ స్థానంలో ఉంది. ● మెదక్ డిపోలో మొత్తం 98 బస్సులు ఉన్నాయి. వాటిలో 66 ప్రైవేట్ బస్సులు, 35 ఆర్టీసీ సంస్థకు చెందినవి ఉన్నాయి. వీటిలో 8 ఎక్స్‌ప్రెస్, 10 డీలక్స్, 2 సూపర్ లగ్జరీలు ఉండగా, మిగతావి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ● ఈ బస్సులు నిత్యం 35,180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా 36, 800 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాయి. లెక్కల ప్రకారం తిరగాల్సిన దానికన్న 1,620 కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాయి. దీంతో రోజుకు రూ.15 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా రూ.16.50 లక్షల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ● ఈ లెక్కన మెదక్ డిపోకు నెలకు రూ.4.50 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ఏకంగా రూ.4.95 కోట్లు వస్తుంది. అంటే నెలకు రూ.45లక్షలు అదనంగా ఇన్‌కం వస్తుంది. అలాగే ఇందుకు భిన్నంగా గత ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా రూ.11.45 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ఆర్టీసీకి అదనంగా కోటి రూపాయల ఆదాయం రావడం ఉమ్మడి జిల్లాలోనే రికార్డుగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఆదాయం సమకూరే రూట్లు ఇవే.. మెదక్ జిల్లాలో మెదక్ డిపోతో పాటు పాతబస్టాండ్, రామాయంపేట బస్టాండ్, కౌడిపల్లి బస్టాండ్, చేగుంట, నర్సాపూర్ డిపోలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మెదక్ –జేబీఎస్, మెదక్– పటాన్చెరువు, మెదక్– సిద్దిపేట రూట్లలో అధిక ఆదాయం వస్తుంది. అలాగే పాత బస్సుల స్థానంలో 8 కొత్త బస్సులను వేశారు. అందులో 2 సూపర్ లగ్జరీ, 6 డీలక్స్ బస్సులు ఉన్నాయి. బీదర్‌తో పాటు కర్నూల్, తిరుపతి ప్రాంతాలకు నిత్యం మెదక్ డిపో నుంచి బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ అందిస్తున్న సబ్సిడీలు ఆర్టీసీ పలు రకాల సబ్సిడీలు అందిస్తుంది. ప్రధానంగా డయాలసిస్ పేషెంట్లకు, జర్నలిస్టులకు ఫ్రీబస్ పాస్‌తో పాటు 80 శాతం సబ్సిడీపై విద్యార్థులకు బస్ పాస్‌లను అందిస్తోంది. అలాగే బస్సులో ప్రయాణిస్తుండగా ఏదేని ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి పరిహారం కూడా ఇస్తారు. కార్గోతో ఆదాయం 2020లో ప్రవేశ పెట్టిన కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా పుంజుకుందని చెప్పవచ్చు. ఈ సర్వీస్‌కు ప్రజలు త్వరగా కనెక్టు అయ్యారు. ఏదేని వస్తువును పంపాలన్నా, ఉత్తరాల నుంచి మొదలుకుని వస్తువుల వరకు త్వరగా చేరవేయటంలో కార్గో సక్సెస్ అయ్యింది. ప్రయాణంలో ఆర్టీసీ ఎంత సురక్షితమో వస్తు రవాణాలో కార్గో కూడా అంతే సుక్షితమనే భావనను ప్రజల్లో కలిగించింది. కొత్త విధానాలతో మార్పు ఆర్టీసీ సంస్థ అమలు చేస్తున్న కొత్త విధానాలతో ప్రజలకు మరింత చేరువైంది. ఆర్టీసీ బస్ ఆఫీసర్ పేరుతో గ్రామానికో వ్యక్తిని నియమించారు. గ్రామాల్లో ఎవరికై నా పెళ్లి బస్సులు కావాలన్నా, ఆయా గ్రామాల్లో పండగలు, జాతరలు జరిగే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపటం, ప్రైవేట్ వాహనాలతో పోల్చుకుంటే ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా ప్రజలకు అవగాహన కలిపించటం వీరి విధి నిర్వహణ. ఇలాంటి నిర్ణయాలతో ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాతో పోల్చితే మెదక్ డిపో లాభాల బాటలో నడుస్తోంది. లాభాల బాటలో.. మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తోంది. నా తోటి ఉద్యోగులతో పాటు కార్మికుల సమష్టి కృషి ఫలితంగానే డిపోను ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఆదాయంలో ముందంజలో ఉంచాం. అందరి సహకారంతో ఇలాగే అధిక లాభాలు గడిస్తాం –రవిచందర్, డీఎం, మెదక్ -
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్ సీజ్
ఆదిలాబాద్‌టౌన్: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్‌లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్‌లో దింపారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్‌లను సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్‌లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వీరిని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్‌లను సోమవారం సీజ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎం కల్పన పాల్గొన్నారు. -
ఆర్టీసీకి లాభాల రుచి చూపాలి
చమురు ధర రూపాయి పెరిగితే సాలీనా ఆర్టీసీపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతోంది. దీన్ని నివారించాలంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులను అంచనా వేసి ఆయిల్ ప్రైస్ హెడ్జింగ్ ద్వారా ముందుగానే చమురు ధరను కోట్ చేసి బల్క్‌గా ఆర్డరిస్తే భారీ ఆదా అవుతుంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో సింహభాగం వాటిని ఖాళీ చేసి ఔటర్ రింగురోడ్డు చేరువలో కొత్త డిపోలు ఏర్పాటు చేసుకోవాలి. నగరంలోని స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తే ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తుంది. – సాక్షి, హైదరాబాద్ ఇవన్నీ ఆర్టీసీ అధికారుల ద్వారా వ్యక్తమైన కొన్ని సూచనలు. నష్టాలు, ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని రెండు, మూడేళ్లలో బ్రేక్ ఈవెన్ స్థాయికి తీసుకెళ్లి క్రమంగా లాభాల బాటన నడిపించేందుక సంస్థ ఎండీ సజ్జనార్ భారీ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించారు. వీటిని ఫలప్రదం అయ్యేలా నిర్వహించటంలో అనుభవం ఉన్న హంస ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ సౌజన్యంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహించారు. బస్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రయంలో ఈడీలు, అన్ని విభాగాల అధిపతులు, కొందరు ఎంపిక చేసిన డీవీఎంలు, కొందరు డిపో మేనేజర్లు పాల్గొన్నారు. మూడు అంశాలు ప్రామాణికంగా.. ప్రయాణికుల సంతృప్తి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం.. ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవటం.. ఈ మూడు అంశాలు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు జరిగింది. పాల్గొన్న వారిని ఐదు సమూహాలుగా విభజించి, ప్రధాన ఎజెండాలోని మూడు అంశాలపై అంతర్గతంగా చర్చించుకుని సలహాలు ఆహ్వానించారు. వారి నుంచి వచ్చిన సూచనలపై చర్చిస్తూ సదస్సును నిర్వహించారు. కొంతకాలంగా ఆర్టీసీకి దూరమవుతున్న ప్రయాణికులను తిరిగి రప్పించటం, వారి సంఖ్యను మరింత పెంచుతూ ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయాలంటే పాటించాల్సిన అంశాలు, ఉద్యోగుల సంక్షేమం విషయంలో చేయాల్సిన మార్పులు, ఆర్టీసీ, కార్గో లాంటి దాని అనుబంధ విభాగాల్లో ఖర్చు తగ్గించి ఆదాయం మరింత పెరగాలంటే చేయాల్సిన పనులు.. ఇలా ఎన్నో సూచనలు వచ్చాయి. వాటి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. నాలుగు బృందాలు.. నాలుగు సెమినార్లు.. ఇందులో వ్యక్తమైన అంశాలే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆలోచనలను ప్రోది చేసి వాటిని ప్రాక్టికల్‌గా అన్వయించుకోవటం, చేయాల్సిన మార్పులపై సూచనలు చేయటం కోసం ఈడీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కొంతకాలం ఈ మేధోమధనంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మరో నాలుగు సెమినార్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తయ్యాక, అనుసంరించాల్సిన అంశాలపై ఓ స్పష్టత తెచ్చుకుని, ప్రాక్టికల్‌గా ఫలవంతమయ్యే వాటిని ఎంపిక చేసి అమలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇలా మరో రెండు నెలల తర్వాత అమలు కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించారు. సూచనలు ఇవీ.. ►బస్సులు శుభ్రంగా ఉండాలి, ఆకట్టుకునేలా సిబ్బంది యూనిఫాంలో కనిపించాలి. ప్రయాణికులతో స్నేహంగా మెలగాలి. ►బస్సులు వేళకు రావాలి. వాటి నిర్వహణ, సమయ పట్టిక పూర్తి శాస్త్రీయం గా ఉండాలి. బస్సులు ఎక్కడ ఉన్నాయో, ఎప్పుడు వస్తాయో ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్ ఆధారిత ఆధునిక, సులభ పరిజ్ఞానం అమలు చేయాలి. ►ఒకటో తేదీన తప్పకుండా జీతాలు ఇస్తూ, కార్మికులు చనిపోతే కనీసం రూ.10 లక్షలు చెల్లించే బీమా వసతి ఉండాలి. ►ఆర్టీసీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్)కి పూర్తి బకాయిలు చెల్లించి దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి దాని ద్వారా ఉద్యోగులు రుణాలు పొందే పరిస్థితి అవసరం. ►స్లీపర్ సర్వీసులను ఆర్టీసీలో ప్రారంభించాలి. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తి ప్పుతూ, రద్దీ అంతంత మాత్రంగా ఉ న్న ప్రాంతాల్లో ట్రిప్పుల సంఖ్య తగ్గించాలి. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించే వారికి రాయితీ ధరలు కల్పించాలి. -
ఆర్టీసీ డిపో, ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
-
ఆర్టీసీ డిపో, ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్ డిపోను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. కడప డిపోకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో ద్వారా ప్రజల కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్ సురేష్‌బాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దేవుడు నాకిచ్చిన అదృష్టం: సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ఈ రోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయం. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇది దేవుడు నాకిచ్చిన అదృష్టం. మీకు ఇంకా మంచి చేయాలని, ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నానని’’ సీఎం జగన్ అన్నారు.. సంస్థ కు ప్రాణం పోశారు: మంత్రి పేర్ని నాని ‘‘గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సు డిపోలు మూతబడే పరిస్థితి తీసుకువచ్చి, దాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరిగింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 50 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రూ.3600 కోట్ల భారం ఏటా పడుతున్నా, ప్రభుత్వం వెనుకంజ వేయలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి సీఎం జగన్. కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం. మరో వైపు పుంగనూరు డిపోను ఇవాళ ప్రారంభించారు. కార్మికుల కోసం ఇంతగా ఆలోచిస్తున్న ఇలాంటి సీఎం మనకు ఉండటం ఎంతో అదృష్టమని’’ మంత్రి పేర్ని నాని అన్నారు. పుంగనూరు ప్రజలకు వరం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘సీఎం వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ఇవాళ నిలబెట్టుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పుంగనూరు డిపోను ప్రారంభించారు. పుంగనూరు ప్రజలకు ఇది ఎంతో వరం. ఆ పట్టణం 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డిపో లేదు. కానీ అది ఇవాళ అది సాకారం అయ్యింది. మహానేత వైఎస్సార్ హయాంలో పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత కాలంలో అవి ముందుకు సాగలేదు. మళ్లీ ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ దాన్ని పూర్తి చేశారని’’ పెద్దిరెడ్డి పేర్కొన్నారు కాగా, మొత్తం 7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో పుంగనూరు బస్సు డిపో నిర్మాణం చేశారు. 65 బస్సులతో డిపో ఏర్పాటు కాగా, ఆ డిపోను ఒక మోడల్ డిపోగానూ, అదే విధంగా డిపోలో మోడల్ వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు ఇక కడపలో ఆర్టీసికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా, మరో రూ.2 కోట్లతో మెడికల్ ఎక్విప్మెంట్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించారు. 1.6 ఎకరాలలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా, ఈ ఆస్పత్రిలో 7 గురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్ సిబ్బందితో పాటు, హౌజ్ కీపింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు. దాదాపు 90 వేల మందికి కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి సేవలు అందించనుంది. దీంతో పాటు కడప ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా పేరు మార్పు చేశారు. -
ఆర్టీసీలో కరోనా కలకలం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ డిపో గ్యారేజీలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కలకలం రేగింది. మంగళవారం విధులకు హాజరు కావడానికి తోటి ఉద్యోగులు తర్జనభర్జన పడ్డారు. ఉదయం 9గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉన్నా మధ్యాహ్నం వరకు కూడా విధుల్లో చేరలేదు. డిపో మేనేజర్ మల్లేశయ్య అక్కడి చేరుకోగా హోంక్వారంటైన్లో ఉండేందుకు పదిహేను రోజులపాటు మూకుమ్మడి సెలవులు ఇవ్వాలంటూ సెలవు పత్రాలు అందజేశారు. డీఎం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒకేసారి ఉద్యోగులందరికి సెలవులు ఇవ్వడం కుదరదని జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న ఉద్యోగులకు సెలవులు ఇచ్చేందుకు సమ్మతించారు. ఆర్టీసీ వైద్యుడు జోగిందర్ కరోనాపై ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉద్యోగులతో చర్చల అనంతరం 10 మందికి సెలవులకు అనుమతించగా మిగిలిన ఉద్యోగులు సెలవు పత్రాలు వెనక్కి తీసుకొని విధులకు హాజరయ్యారు అగ్ని మాపకశాఖ ఆధ్వర్యంలో డిపో ఆవరణలో హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేశారు. డీఎం మల్లేశయ్యతో విజిలెన్స్, సెక్యూరిటీ హెడ్‌కానిస్టేబుల్ సురేందర్‌రావు, ఎంఎఫ్ మధుసూధన్, అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత పాల్గొన్నారు. -
బాన్సువాడ ఆర్టీసీ డిపో ముందు నిరుద్యోగుల పడిగాపులు
-
గత ప్రభుత్వ హయంలోనే ప్రకటనలు: ఆర్టీసీ ఈడీ
సాక్షి, విజయవాడ : తిరుపతి ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ఉండడం పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్ రావు శుక్రవారం వివరణనిచ్చారు. ఆ ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవని ఆయన వెల్లడించారు. గత మార్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో టిక్కెట్ల వెనుక ముద్రించారని, అందులో కొన్ని రోల్స్ తిరుపతి డిపోకు వచ్చాయని తెలిపారు. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం కనుక మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
నిశ్చితార్థం ఇంట చావు మెతుకులు పెడతారా?
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సింహాచలం ఆర్టీసీ డిపో కార్మికుల ఆగ్రహావేశాలతో అట్టుడికింది. డిపో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సుమారు 110కి పైగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బాధిత కుటుం బం రోదనలు మిన్నంటాయి. నాగేశ్వరరావు ఆత్మహత్య సం ఘటన ఆయన కుటుంబంలోనే కాదు.. కార్మికుల్లో కల్లోలం రేపింది. ఇంటికి వెలుగుని కోల్పోయిన దుఃఖంలో కుటుంబం రోడ్డున పడితే.. ఆ కష్టం మరే కుటుంబానికీ రాకూడదని డిపో కార్మికులంతా ఆ గుండె పగిలే బాధ తామంతా పడుతున్నామని చెబుతూ శనివారం వేకువజాము నుంచి డిపో మొత్తంగా బస్సులు ఆపేశారు. నాగేశ్వరరావు భార్యాపిల్లలు, బంధువుల రోదనలు.. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికుల ఆందోళనలతో డిపోలో వాతావరణం వేడిక్కింది. ఇలాంటి ఆందోళన ఆర్టీసీ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా జరిగింది. డిపోలో మిన్నంటిన రోదనలు తెల్లారేసరికి బస్సుల హారన్లతో సందడిగా కనిపించాల్సిన సిం హాచలం ఆర్టీసీ డిపో రోదనలతో నిండిపోయింది. వేకువజా మున బస్సులు కదలాల్సిన సమయానికి నాగేశ్వరరావు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమారులు, పెద్ద సంఖ్యలో బంధువులతో డిపోకు చేరుకుని గేటు వద్ద భైఠాయించారు. వారి రోదనలతో డిపో శోకసంద్రమైపోయింది. బస్సులతో వెళ్లాల్సిన డ్రైవర్లు, కండక్టర్ల గుండెలు బరువెక్కిపోయాయి. యూనియన్లు, వర్గాలకు అతీతంగా నిరసన చెబుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. నాగేశ్వరరావు భార్యా పిల్లలకు సంఘీభావంగా నిలిచారు. మూకుమ్మడి బంద్‌తో నివ్వెరపోయిన పోలీసులు అసలే శనివారం.. అందులోనూ యాత్రికుల తాకిడి.. ఇక్కడి నుంచి కదలాల్సిన బస్సులు 110 పైగానే. ఈ బస్సులన్నీ వేకువజాము నుంచే నిలిచిపోయాయని తెలిసి గోపాలపట్నం సీఐ పైడియ్య, ఎయిర్‌పోర్టు జోన్ సీఐ మళ్ల శేషు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ, ఎస్ఐలు తమ్మినాయుడు, జి.డి.బాబు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో సహాయ పోలీసు కమిషనర్ అర్జున్ చేరుకున్నారు. కార్మికులకు నచ్చజెప్పి గేటు నుంచి పంపే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు కుటుంబానికి న్యా యం జరిగే వరకూ ఇక్కడి నుంచి బస్సులను తీయలేమని డ్రైవర్లు, కండక్టర్లు భీష్మించారు. మూకుమ్మడి బంద్‌తో పోలీ సులు నివ్వెరపోయారు. దీంతో ఏసీపీ అర్జున్.. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధేష్‌కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కార్మికుల ఆందోళనతో సాయంత్రం 6 గంటల వరకూ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో సింహాచలం వెళ్లే యాత్రికులు, భక్తులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆటోలే దిక్కయ్యాయి. లిఖిత పూర్వక హామీ కోసం పట్టు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చి బస్సులను నడిపించాలని ఆర్ఎం సుధేష్‌కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీపీఎం నేత బలివాడ వెంకటరావు ఆధ్వర్యంలో కార్మికులంతా లిఖిత పూర్వక హామీ కోసం పట్టుబట్టారు. మీడియా ముందు చెబుతున్నా నమ్మరా.. అంటూ ఆర్ఎం విజ్ఞప్తి చేస్తే.. మీరూ రాజకీయనేతలా హామీలిస్తే విలు వేముందంటూ కార్మికులు ప్రశ్నించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ చర్చలు జరిపి ఎట్టకేలకు ఆర్ఎం లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. నాగేశ్వరరావుకు రావాల్సిన పరిహారాలను మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తామని, ఆయన కుమారుని విద్యార్హతను బట్టి తాత్కాలికంగా అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తామని.. తదుపరి రెగ్యులర్ పోస్టు ఇప్పిస్తామని, పెన్షన్, బెనిఫిట్లు రెండు నెలల్లో సెటిల్ చేస్తామని ఆర్ఎం తన సంతకంతో ఉన్న లేఖ రాసిచ్చారు. నేతల నిర్వాకంపై కార్మికుల ఆగ్రహం సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో కొందరు నేతల వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎం డిపోకు వచ్చాక పలువురు తీరు మారిపోయింది. అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్ఎం కోరిక మేరకు వెళ్లిపోవాలని పలువురు చెబుతుంటే.. లిఖిత హామీ ఎందుకు.. మాటిచ్చారు కదా.. పదండిపోదాం.. అంటూ కదిలించే ప్రయత్నాలు చేయడంతో కార్మికులంతా గ్రహించి, ఆ నాయకులకు వారంతా చీవాట్లు పెట్టారు. మాకు దిక్కెవరు? ► నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదు ►నిశ్చితార్థం భోజనాలు తినాల్సిన ఇంట చావు మెతుకులు పెడతారా? ►రీజినల్ మేనేజర్, ఏసీపీల ఎదుట ►నాగేశ్వరరావు భార్య అమ్మాజీ రోదన ‘నా కుమారుడి నిశ్చితార్థం భోజనాలు శనివారం పెడతానని బంధులతో చెప్పి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లిన తన భర్తను శవంగా పంపి.. తమకు చావుమెతుకులు పెడతారా?.. నా భర్త పది మందికి సాయపడే ధైర్యవంతుడు.. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు.. అన్యాయం జరిగిపోయిందయ్యా..’అంటూ ఏసీపీ అర్జున్, ఆర్టీసీ ఆర్ఎం సుధేష్కుమార్ల వద్ద చింతా నాగేశ్వరరావు భార్య అమ్మాజీ గుండెలవిసేలా రోదించింది. సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో తొలుత ఏసీపీ అర్జున్ ఆమెను పరామర్శించారు. తర్వాత వచ్చిన ఆర్ఎం ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైంది. రోజూ తన ఎదురుచూసుకునే డ్యూటీకి వెళ్లే భర్త రాత్రయినా రాకపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందానని.. కుటుంబానికి దిక్కయిన డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుమిలిపోయింది. తనకు, తన బిడ్డలకు దిక్కెవరని విలపించింది. నాగేశ్వరరావు చేసుకుంది ఆత్మహత్య కాదని.. మానసికంగా వేధించి మరణానికి కారణమయ్యారని బంధువులు, సీఐటీయూ నేత శీర రమణ ఆరోపించారు. దీనిపై ఆర్ఎం స్పందిస్తూ మంచి ఉద్యోగిని కోల్పోవడం తమకూ బాధగా ఉందని, తన వంతు బాధ్యతగా నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విచారణ జరుపుతాం : అర్జున్, ఏసీపీ ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతామని ఏసీపీ అర్జున్ తెలిపారు. ఇక్కడ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జరిగిన ఘటనలో నాగేశ్వరరావు చేతిపై రాత, డిపోలో సంఘటన జరగడం వంటి పరిణామాలను పరిగణిస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్(డీఎం)ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు బంధువులు చేసిన డిమాండ్‌పై స్పందించారు. ఇక్కడ విచారణలో సందేహాలు వద్దని చెప్పడానికే మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసుకు సంబంధించిన ఏసీపీ ప్రవీణ్‌కుమార్ కూడా దర్యాప్తులో భాగంగా ఉన్నారని తెలిపారు. డీఎం వేధింపులు భరించలేకపోతున్నాం.. సింహాచలం డిపో మేనేజర్, స్క్వాడ్ల తీరుపై ఆర్ఎంకు ఫిర్యాదు సింహాచలం ఆర్టీసీ గ్యారేజీ డిపోలో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో అలా ఒత్తిడికి గురైన కండక్టర్లు, డ్రైవర్లు ఆర్ఎం సుధేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ దివ్య తీరును భరించలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. స్క్వాడ్ల పేరిట అధికారులు ప్రయాణికుల ఎదుట తీవ్రంగా అవమానిస్తున్నారని, మహిళా కండక్టర్లని కూడా చూడకుండా కుంగిపోయేలా వారి చర్యలు ఉంటున్నాయని ఆవేదన చెందారు. గతంలో ఇదే డిపోకు చెందిన డ్రైవర్ ఆర్పీ నాయుడు గాజువాకలో లారీ ట్రాలర్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇప్పుడు నాగేశ్వరరావు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఇలా అనేక మంది వారికి జరిగిన అవమానాలను ఆయనకు వివరించారు. పలువురి బాధితుల మాటల్లోనే.. మెడకు బోర్డు తగిలించి తిప్పారు నేను 28కే బస్ నడుపుతున్న సమయంలో 104 జంక్షన్ వద్ద రిక్వెస్టు స్టాప్‌లో విపరీతమైన రద్దీగా ఉండడం వల్ల ఆపలేదు. అక్కడ ఆ బస్సుకు స్టాప్ నిర్ణయించలేదు కూడా. బస్సు ఆపలేదని డీఎంకు ఎవరో ఫోన్ చేసి చెబితే నేను రెస్ట్ ఆఫ్‌లో ఉన్న రోజున డిపోకి పిలిచి మరీ నా మెడలో బోర్డు తగిలించారు. అలా ఎక్కడైతే బస్సు ఆపలేదో అక్కడ అందరినీ క్షమాపణ కోరుతూ డ్రైవర్లకు కనిపించేలా తిరగాలని ఆదేశించారు. ఆ రోజంతా అలా బోర్డు తగిలించుకుని అవమానంతో బాధపడ్డాను. – ఎం.ఎన్.రావు, డ్రైవర్ బస్సెక్కినా వేధింపులే.. బస్సులో ప్రయాణికులతో ఎంత జాగ్రత్తగా ఉండాలని అత్రుతగా ఉంటాం. అలాంటి తరుణంలో ఎవరో ప్రయాణికుల నుంచి వాట్సప్ ఫిర్యా దు వచ్చిందని డ్యూటీలో ఉండగానే ఫోన్ చేసి డీఎం వేధిస్తుంటారు. ఇలా ఒత్తిళ్ల వల్లే కేపీ నాయుడు, నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. – వల్లీ, కండక్టర్ ప్రయాణికుల ఇళ్లకు పంపుతున్నారు.. బస్సులో చిల్లర సమస్య అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో చిల్లర లేదని డ్యూ రాస్తే బస్సు దిగినప్పుడు ప్రయాణికులు మరచిపోయి డీఎంకు ఫోన్ చేస్తే వారి ఇళ్లకు వెళ్లి డ్యూ ఇచ్చేసి రమ్మని ఆదేశిస్తున్నారు. మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. ఇలా అయితే ఎలా?. – భవానీ, కండక్టర్ ఇంక్రిమెంట్ కట్ చేశారు.. నేవీ డే నాడు ట్రిప్‌లు పెంచారు. మరుసరి రోజు రాత్రి 12 గం టల వరకూ పని చేయలేనని చెబితే డీఎం అర్థం చేసుకోలేదు. ఓరోజు రెండు టికెట్లు మిస్సయ్యాయన్న కారణంతో మెమో ఇవ్వకుండా ఇంక్రిమెంట్ కట్ చేసేశారు. – బీవీ లక్ష్మి, కండక్టర్ బ్యాగులు చింపి మరీ తనిఖీలా.. స్క్వాడ్ అధికారులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కండక్టర్లేదో డబ్బులు వెనకేసుకుంటున్నారన్న అనుమానాలతో మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. చేతిలో ఉన్న బ్యాగుల అరలను చింపేసి మరీ ప్రయాణికుల ముందు తనిఖీలు చేస్తున్నారు. నేను అలా అవమాన భారం పడ్డాను. – బి.ఎస్.రత్నం, కండక్టర్ -
వరంగల్-1 ఆర్టీసీ డిపోలో ఆగ్నిప్రమాదం
-
మాకు ప్రజలే హైకమాండ్
నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో హైకమాండ్ ఉంటుందని, వారు ఏది చేయాలన్న ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమకు కాంగ్రెస్‌లాగా కాకుండా రాష్ట్ర ప్రజలే హైకమాండ్ అని, తమ ఆత్మ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటుకు కొరత, విత్తనాలకు కొరత, ఎరువుల కొరత, సాగు, తాగునీటి కొరత ఉండేదని.. విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో క్యూలో నిల్చొని, కొనాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రైతులు పండించిన ఏ పంటకూ మద్దతు ధర లభించేది కాదని దీంతో రైతులు నష్టపోయేవారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఓట్ల కోసం కాకుండా ప్రజల కష్టాలు గుర్తించి వాటిని పరిష్కరించడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు. అలాగే 24 గంటల కరెంటు సరఫరా, రైతులకు కావాల్సినన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయ న్నారు. సాగు నీరు అందచేస్తున్నామని, తాగు నీరు అందజేసేందుకు భగీరథ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకం కింద ఎకరానికి ఒక పంటకు రూ.నాలుగు వేలు ఇవ్వాలని నిర్ణయించి రాష్ట్రంలోని రైతులకు రూ.12 వేల కోట్లు పెట్టుబడి సాయంగా అందజేశారన్నారు. నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లు: మహేందర్‌రెడ్డి రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్లో నాలుగేళ్లలో వెయ్యికోట్లు కేటాయించారని అన్నారు. ఆర్టీసీని పటిష్టం చేసేందుకు 230 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, సిబ్బంది జీతాలు పెంచనున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఉన్నంత కాలం ‘రైతుబంధు’ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం, సీఎంగా కేసీఆర్ కొనసాగినంత కాలం ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్, చందాపూర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్, ఆగస్టు 15 నుంచి ‘రైతు బీమా’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపోలో పేలిన బస్సు టైరు
జనగామ: బతుకు దెరువు కోసం ఔట్ సోర్సింగ్ ద్వారా బస్ డిపోలో పనిచేస్తున్న యువకుడు బస్సు టైరు పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన సంఘటన మంగళవారం జనగామ ఆర్టీసీ డిపోలో జరిగింది. బస్సును క్లీన్ చేస్తు ండగా జరిగిన ప్రమాదంలో కుడి చేయి.. కన్ను పోయే పరిస్థితి నెలకొనగా.. తలకు బలమైన గా యాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా శారా జీపేటకు చెందిన పుట్టల రత్నం కుమారుడు స్వా మి అలియాస్ పవన్ జనగామ ఆర్టీసీ డిపోలో ఆరు సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ద్వారా వాషి ంగ్ పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున బస్సును క్లీన్‌చేస్తుండగా టైరు పేలి పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు హుటాహుటిన బ స్సు వద్దకు చేరుకున్నారు. అప్పటికే రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడిపోయిన స్వామిని చూసి ఆందోళనకు గురయ్యారు. కుడిచేయి మూడు ముక్కలు కాగా, కన్ను పూర్తిగా దె బ్బతిని, తలకు తీవ్రగాయాలతో పడి ఉన్న ఉద్యోగిని, జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సలు నిర్వహించి, పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. బతుకు దెరువు కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్వామిని విధి వక్రీకరించడంతో తోటి కార్మికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాలం చెల్లిన టైర్లు.. లాభార్జనే ధ్యేయంగా బస్సు సర్వీసులను నడిపిస్తూ కార్మికుల ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నారా..? లేదా ప్రమాదవశాత్తు టైరు పేలిందా అనే దానిపై విచారణ చేయాల్సి ఉంది. కాలం చెల్లిన టైర్లను మార్చకుండా నడిపిస్తుండడంతో హేయిర్ వస్తూ పేలుతున్నాయని పలువురు కార్మికులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. టైర్లు వైర్లు తేలే వరకు నడిపించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోలో ఇంకెన్ని కాలం చెల్లిన టైర్లు ఉన్నాయనే దానిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వామికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, భద్రత కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. -
సిటీ సర్వీసులెన్నడో?
రోజురోజుకు నగర పరిధి విస్తరిస్తున్నా అం దుకు అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడటం లేదని నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తే వారు నిర్ణయించిన చార్జీలు ఇవ్వాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందంటున్నారు. నిజామాబాద్ నాగారం: నగరంలో సిటీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఏళ్లుగా నగరవాసులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్టీసీ అధికారులు అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తూనే ఉన్నారు. సాక్షాత్తు ఆర్టీసీ సంస్థ ఎండీ జీవీ రమణారావు ఏడాదిక్రితం సిటీ బస్సులు ప్రారంభిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. నగరంలో ఆటోల జోరు కొనసాగుతోంది. ఆదాయ మార్గమున్నా ఆర్టీసీ మాత్రం సిటీబస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర పరిధి రోజురోజుకు నలువైపులా విస్తరిస్తూనే ఉంది. ఏవైపు వెళ్లినా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కాలనీలు వెలిశాయి. దీంతో నగరనడిబొడ్డున ఉన్న బస్టాండ్ నుంచి శివారు కాలనీలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గల్లీలో నుంచి బస్టాండ్‌కు వెళ్లాలన్నా, బస్టాండ్‌నుంచి గల్లీలోకి వెళ్లాలన్నా ఆటోలే దిక్కు. ఇదే అదనుగా ఆటోవాలలు అందినకాడికి దండుకుంటున్నారు. బస్టాండ్ నుంచి కంఠేశ్వర్ మీదుగా దాస్‌నగర్ వరకు, అలాగే బస్టాండ్ నుంచి పూలాంగ్ మీదుగా మాధవనగర్ వరకు, బస్టాండ్ నుంచి వర్నిచౌరస్తా మీదుగా నాగారం వరకు, మరోవైపు గాంధీచౌక్, అర్సపల్లి మీదుగా సారంగపూర్ వరకు 5కిలో మీటర్ల పైనే విస్తరించింది. నగరంలోని 50 డివిజన్ల పరిధిలో 100కు పైగా కాలనీలున్నాయి. దీంతో బ స్టాండ్ నుంచి శివారు ప్రాం తాల్లోని ఏ కాలనీకి వెళ్లాలన్నా ఆటోవాలాలు రూ. 10 నుంచి 30వరకు వసూ లు చేస్తున్నారు. అదే రాత్రి 8గంటలకు దాటితే ఒక్కోరికి రూ.20 నుంచి రూ.50 కి పైగా వసూలు చేస్తు న్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. నగరంలో 6వేల నుంచి 8వేల వరకు ఆటోలున్నాయి. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ భరోసా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం. ఇది అందరికి తెలిసిందే. ప్రైవే ట్ ఆటోలో ప్రయాణం చేయాలంటే రాత్రుల్లో నగర ప్రజలు జంకుతున్నారు. ఆటోవాలల ఆగడాలు గురించి అందరికి తెలిసిందే. ఆర్టీసీ సిటీ సర్వీసులను తిప్పితే రాత్రి వేళల్లో సైతం సురక్షితంగా ఇంటికి చేరుకొవచ్చని నగరప్రజలంటున్నారు. నగరంలోని రోడ్లు విస్తరిస్తుండటంతో పాటు పునరుద్ధరిస్తుండటంతో బస్సులు నడపాలని కోరుతున్నారు. -
గవర్నర్‌పేట బస్ డిపో మాయం
సాక్షి, అమరావతి /అమరావతి బ్యూరో: విజయవాడ గవర్నర్‌పేట ఆర్టీసీ బస్ డిపో వైభవం కనుమరుగు కానుంది. ఈ డిపోను ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. నగర అభివృద్ధి, కాలువల ఆధునీకరణ పేరుతో రూ.500 కోట్ల విలువైన ఈ 4 ఎకరాల భూమిని ఓ కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గన్నవరంలో ఆర్టీసీకున్న రూ.250 కోట్ల విలువైన 28 ఎకరాల భూముల్ని హెచ్‌సీఎల్ కంపెనీ అధినేత శివనాడార్‌కు అప్పగించారు. దానికి బదులుగా ఆర్టీసీకి ఇంతవరకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వకపోవడం గమనార్హం. ఆర్టీసీకి ఆయువుపట్టు... ఏపీఎస్ఆర్టీసీకి 13 జిల్లాల్లో 1,960 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ ఇప్పుడున్న రెవెన్యూ రికార్డు ప్రకారం సుమారు రూ.15 వేల కోట్లు. మార్కెట్ రేటు ప్రకారం రూ.50 వేల కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన కొందరు పెద్దలు అభివృద్ధి ముసుగులో ఒక్కొక్కటిగా బడా వ్యాపార వేత్తలకు, ఐటీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే మొన్న గన్నవరం, నేడు గవర్నర్‌పేట స్థలాలు అప్పగించేస్తున్నారు. ఆర్టీసీకి విజయవాడలోని గవర్నర్ పేట –2 డిపోకు 5.2 ఎకరాల భూమి ఉంది. ఆర్టీసీ యాజమాన్యం 1970 మార్చిలో గజానికి రూ.16 వేల చొప్పున రూ.4.6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించి ఆర్టీసీ ఆ భూమిని కొనుగోలు చేసింది. అనంతరం అందులో సంస్థ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టింది. తర్వాత కాలంలో రహదారుల విస్తరణలో ఎకరా భూమి పోయింది. ఇటీవల కృష్ణా పుష్కరాల సమయంలో పార్కు అభివృద్ధి పేరుతో మరో 20 సెంట్లు భూమిని స్వాధీనం చేసుకోగా ప్రస్తుతం 4 ఎకరాలు ఉంది. దీన్ని ఇప్పుడు ఓ కార్పొరేట్ సంస్థ దక్కించుకోబోతోంది. నగరాభివృద్ధి ముసుగులో సంస్థ పెద్దలు సైతం ఈ నిర్ణయానికి తల ఊపినట్లు సమాచారం. ఇక్కడ ఉన్న డిపోను 30రోజుల్లో ఖాళీ చేయాలంటూ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. రూ.500 కోట్లు విలువైన ఈ భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో మంచి భవనాలు నిర్మిస్తామని, కాలువలు ఆధునీకరిస్తామని చెప్పడం కార్మిక సంఘాలను విస్మయపరుస్తోంది. లీజుల పేరిట ఆస్తుల అప్పగింత నష్టదాయకం రాష్ట్రంలో గుంటూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్టణం, విజయనగరం, విజయవాడలలో ఆర్టీసీ స్థలాల్ని బీవోటీ (నిర్మించు–నిర్వహించు–బదలాయించు) విధానంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. గుంటూరు, తెనాలిలలో స్విస్ ఛాలెంజ్ విధానంలో స్థలాల్ని ఇప్పటికే కట్టబెట్టారు. ఈ స్థలాలన్నింటినీ 49 ఏళ్లకు నామమాత్రపు ధరలతో లీజుకు అప్పగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు నడిబొడ్డున ఉన్న రూ.వంద కోట్ల విలువైన రెండెకరాల స్థలాన్ని లీజు విధానంలో సింగిల్ టెండర్‌కు అప్పగించారు. నర్సీపట్నంలో ఓ మంత్రికి సన్నిహితంగా ఉన్న గ్రీన్ హుడ్ కంపెనీకి రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని ఏకపక్షంగా అప్పగించడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. సేవ్ ఆర్టీసీ పేరిట ధర్నాలు: ఎన్ఎంయూ సేవ్ ఆర్టీసీ పేరిట నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలలో నిరసన, ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 24న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని ఎన్ఎంయూ అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను పప్పు బెల్లాల్లా ప్రభుత్వం తమ అనుయాయులకు పంచిపెట్టడంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని వైఎస్సార్ సీపీ ఆర్టీసీ యూనియన్ నేత రాజారెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, ఎన్‌ఎంయూతో కలిసి ఐక్య ఉద్యమం నిర్వహిస్తామని ఈయూ నేత పద్మాకర్ తెలిపారు. -
అయ్యో.. ఆర్టీసీ!
పెరగని ఆక్యుపెన్సీరేషియో రూ.2.20కోట్ల నష్టాల్లో ఎమ్మిగనూరు డిపో ఎమ్మిగనూరు: సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయివేటు వాహనాల తాకిడి.. పని చేయని పరిరక్షణ కమిటీ.. వెరసి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నష్టాల బాటలో నడుస్తోంది. డిపోలో ఆక్యుపెన్సీరేషియో పెరగకపోగా మరింత దిగజారుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎమ్మిగనూరు డిపో ఒకప్పుడు లాభాలబాటలో ఉండేది. ప్రయివేటు వాహనాలు.. స్టీరింగ్, మాక్సి ఆటోలు ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. సమయ పాలన కొరవడడం కూడా నష్టాలకు కొంత కారణంగా తెలుస్తోంది. సమయానికి బస్సులు రాని పరిస్థితి ఉండటంతో ప్రయాణీకులు అందుబాటులో ఉన్న ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా సంపూర్ణంగా అమలు కావడంలేదన్న ఆరోపణలున్నాయి. డిపోకు సంబంధించి 84 బస్సులుండగా 48 సర్వీసులు పల్లెవెలుగులే. మిగతా వాటిలో 10 సూపర్ లక్జరీ, 24 ఎక్స్‌ప్రెస్, 2 ఆల్ట్రాడీలక్స్ బస్సులున్నాయి. వీటిలో సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం పైగా ఉండగా, పల్లెవెలుగు బస్సులకు 55శాతానికి మించడం లేదు. అధిక సర్వీసులుండే పల్లెవెలుగు బస్సులతో పాటు సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి కనీసం 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో వస్తేనే రాబడికి, వ్యయానికి సరిపోతుంది. ప్రస్తుతం 75శాతం వరకు ఆక్యుపెన్సీ పెరిగినా నష్టాలు నివారించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో కూడా 2 నుంచి 3శాతం వరకు స్కూల్ పిల్లల బస్ పాసుల రీయింబర్స్మెంట్ డబ్బు కలుస్తోంది . అక్రమ రవాణాను అరికట్టకుండా ఆక్యుపెన్సీరేషియో పెంచాలనడం సమంజసం కాదని, వీటిని అరికడితే సీట్ల భర్తీ శాతం పెంచడం పెద్ద కష్టమేమికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా దిగువ చూపులు.. మూడేళ్లుగా ఎమ్మిగనూరు డిపో ఆక్యుపెన్సీ రేషియో హెచ్చుతగ్గులుగా ఉంటూ అసలైన రేషియోకు చేరుకోవడంలేదు. 2015–16లో 71శాతం, 2016–17లో 68శాతంగా ఉండగా 2017–18కి సంబంధించి ఇప్పటి వరకు 74శాతం మాత్రమే ఉంది. ఈ రేషియో 80శాతం వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమంటున్నారు ఆర్టీసీ అధికారులు. వరుసగా నష్టాలు.. ఎమ్మిగనూరు డిపో సుమారు రూ.3.90కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాది కాలంగా రూ.1.68కోట్ల నష్టాన్ని పూడ్చినా రూ.2.20కోట్ల నష్టం మిగిలే ఉంది. అభయ పథకం, సేవాకేంద్రాలు, ట్రాఫిక్ గైడ్స్ నియామకం, గిఫ్ట్ స్కీం, వనిత, క్యాట్ కార్డులు తదితర పథకాలు పెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. పనిచేయని ఆర్టీసీ పరిరక్షణ కమిటీ.. ప్రయివేటు వాహనాలను నియంత్రిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఏర్పాటు చేసిన ఆర్టీసీ పరిరక్షణ కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు. కమిటీలో భాగస్వాములుగా ఉన్న డిపో మేనేజర్, స్థానిక ఎస్ఐ, ఆర్టీఓ.. నెలలో కనీసం రెండుసార్లు ఆయా రూట్లలో పర్యటించి అక్రమ వాహనాలపై చర్యలు తీసుకోవాలి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు లైసెన్సులున్నాయో లేదో పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే డిపో పరిధిలో చాలా కాలంగా పరిరక్షణ కమిటీ పనిచేయడంలేదు. అమలుకు నోచుకోని మోటార్‌వాహనాల చట్టం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం 1989, సెక్షన్ 185(సి) ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయివేటు వాహనాలు, ఆటోలు ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు కనీసం కిలోమీటరు బయట ఉండాలి. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునే హక్కు పరిరక్షణ కమిటీకి ఉంది. కానీ ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద అమలు కావడం లేదు. కమిటీ తరఫున కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉంచడంతో వారి మాట ప్రయివేటు బస్సులు, ఆటో వాలాలు వినడంలేదు. నిత్యం బస్టాండ్ ప్రధాన ద్వారం వద్దే ఉండి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. -
సత్తుపల్లి స్వచ్ఛంద బంద్
• తొలిరోజు ప్రశాంతం.. నేడు కూడా • ఆర్టీసీ, బ్యాంక్‌లకు మినహారుుంపు సత్తుపల్లి : సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ తలపెట్టిన 48 గంటల సత్తుపల్లి పట్టణ బంద్ తొలిరోజు బుధవారం ప్రశాంతంగా జరిగింది. దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. పట్టణంలో మోటారు సైకిళ్లతో ప్రదర్శన చేశారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కొత్తనోట్లతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బ్యాంకులను బంద్ నుంచి మినహారుుంచారు. ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్తత... సత్తుపల్లి ఆర్టీసీ డిపో వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకు బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు బైఠారుుంచారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో బస్సులు యథావిధిగా నడిచారుు. మద్దతు తెలిపిన మాజీ మంత్రి... సత్తుపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న జేఏసీ నేతలకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్, కూకలకుంట రవి, ఉడతనేని అప్పారావు, గంగిశెట్టి ప్రసాద్, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, కొర్రపాటి సాల్మన్‌రాజు, వనమా వాసు, ఎస్కే రఫీ(మోనార్క్), పసుమర్తి గోపాలరావు, ఎం.ఫయాజ్‌అలీ, కూసంపూడి రామారావు, ఎండీ మున్వర్ హుస్సేన్, పరెడ్ల సత్యనారాయణరెడ్డి, బండి వెంకటరెడ్డి, రఘుపతిరెడ్డి, తేళ్లూరి ఆడమ్స్, ఐ.కృష్ణ, కూసంపూడి మహేష్, దూదిపాల రాంబాబు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, పింగళి సామేలు, జూపాటి పాపారావు, గొర్ల సంజీవరెడ్డి, ఎండి అమీరుద్దీన్, గాదె చెన్నారావు, తన్నీరు జమలయ్య, ఎల్ఎస్ రెడ్డి, అద్దంకి అనిల్, చాంద్‌పాషా, వన్నెంరెడ్డి సాగర్ పాల్గొన్నారు. -
ఉప్పల్ డిపో ఎదుట ఉద్రిక్తత
ఉప్పల్ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నె లకొంది. అకారణంగా ఓ మహిళా కండాక్టరును బదిలీ చేశారని తోటి కార్మికులంతా ధర్నాకు దిగారు. దీంతో డిపోకు చెందిన సుమారు 70 బస్సులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని నిరసనకారులను సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలో అధికారులకు నిరసన కారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
మానుకోట ఆర్టీసీ డిపో పదిలం
∙గతంలో ఎత్తివేసే కుట్రలు జరిగాయి ∙జిల్లా ఏర్పాటుతో పెరుగనున్న బస్సులు సంఖ్య, సిబ్బంది ∙జిల్లా ఏర్పాటుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు మానుకోట డిపో నష్టాల ఊబిలో ఉందనే కారణంతో డిపోలో బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గించారు. డిపోను కూడా ఎత్తివేసే కుట్రలు జరిగాయి. చివరికి శాటిలైట్ డిపోగా మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో జిల్లా ఏర్పాటుకు సానుకూల నిర్ణయం జరిగింది. జిల్లా ఏర్పాటు నేపథ్యంతో ఎత్తివేసే కుట్రలకు స్వస్తి పలికినట్లే. దీంతో మానుకోట ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో 1989లో డిపోను ఏ ర్పాటు చేశారు. డిపో ఏర్పాౖటెనప్పుడు క్రమం గా 80 బస్సులతో నడిచింది. సుమారు 500 మంది సిబ్బంది పనిచేయడం జరిగింది. త ర్వాత పట్టణంలో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాç హనాలు పెరగడంతో ఆర్టీసి ఆదాయానికి కొంత గండి పడింది. మానుకోటలో రైల్వే సౌక ర్యం ఉండటం కూడా ఆర్టీసికి నష్టం జరిగింది. ఏడాదికి సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినప్పటికి నష్టాల్లోనే డిపో కొనసాగిందని యూనియన్ నాయకులు తెలిపా రు. ఆ సమయంలో పలు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మూలంగా ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించింది. చివరికి డిపో లో 60 బస్సులు మాత్రమే మిగిలాయి. క్రమం గా బస్సులను తగ్గించే కుట్రలు జరుగుతున్న క్రమంలో మానుకోట జిల్లా ఏర్పాటుకు సానుకూలత ఏర్పడటంతో అట్టి కుట్రలకు భగ్నం కలిగింది. డిపోపై ఆశలు సడలుతున్న సమయంలో జిల్లాలో పునర్విభజనలో మానుకోట పేరు ఉండటంతో డిపో పరంగా అభివృద్ది చెందుతుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసి లాభాల్లో నడిచే అవకాశం ఉంది. ఆర్టీసి యూనియన్ నాయకులు జిల్లా నేపథ్యం దృష్ట్యా ఎంతో ఆనందంగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ తరహాలో మానుకోట డిపో అభివృద్ది జరుగుతుంది. జిల్లా ఏర్పాటుతో మానుకోట ఆర్టీసి సమస్య తీరినట్లే. బస్సుల సంఖ్య పెరుగుతుంది జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసి డిపో అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా బస్సుల సంఖ్య పెరిగి ప్రయాణికులకు మేలు జరుగనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉండటం వల్ల డిపో ఆదాయం 100 శాతం పెరుగుతుంది. జిల్లా ఏర్పాటుకు సహకరించిన నాయకులందరికీ టీఎంయూ తరపున కృతజ్ఞతలు. –కె.మల్లయ్య, టీఎంయూ చీఫ్ అడ్వయిజర్ మానుకోట డిపో కష్టాలు గట్టెక్కినట్లే కొంత కాలంగా నష్టాల్లో ఉందనే కారణాన్ని చూపిస్తూ బస్సుల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మానుకోట జిల్లా ఏర్పాటు నేపథ్యంతో డిపో కష్టాలు గట్టెక్కుతాయి. ఆదాయం పెరగడంతో పాటు అన్ని సౌకర్యాలు మెరుగుపడుతాయి. జిల్లా నేపథ్యంతోనే ఆర్టీసి సమస్యలు తీరనున్నాయి. – బీ.ఆర్.రెడ్డి టీఎంయూ డిపో కార్యదర్శి -
ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు గాలం
డబ్బులు పంచుతుండగా పట్టుకున్న ఐక్యకూటమి నాయకులు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగింత అచ్చంపేట రూరల్ : అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఓ వ్యక్తి డబ్బులు పంచుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఐక్యకూటమి నాయకులు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని తొమ్మిదో వార్డులో ఐక్యకూటమి అభ్యర్థి సుగుణమ్మ తరపున ఆర్టీసీ డిపో పక్కన డీకే అరుణ, కూటమి నాయకులు ప్రచారం చేశారు. ఓటర్లను డబ్బులతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండగా ఆ వ్యక్తిని కూటమి నాయకులు పట్టుకుని చితకబాదారు. ఇది చూసిన మరో ముగ్గురు వ్యక్తులు పారిపోయారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి నుంచి నగదు, టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన కరపత్రాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో కూటమి కార్యకర్తలు ఆ వ్యక్తిపై దాడిచేసి చితకబాదారు. అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రాములు, వంశీకృష్ణ, నాయకులు బక్కని నర్సింహ, జెడ్పీటీసీ ధర్మానాయక్, మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తాం : డీఎస్పీ డబ్బులు పంచుతున్న వ్యక్తి కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గులకు చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించామని డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేస్తామన్నారు. అచ్చంపేట లాడ్జింగ్, ప్రైవేటు ప్రదేశాలలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
నేడే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
డిపోలో టెంట్లు వేసి ప్రచారం ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ అదేరోజు రాత్రికి ఫలితాలు అవనిగడ్డ: అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సాధారణ ఎన్నికలను తలపించేరీతిలో పోటా పోటీగా ప్రచారం చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా ఫ్లెక్సీలు, యూనియన్ జెండాలతో ముంచెత్తారు. ఎవరికి వారు ఎత్తులు, పైఎత్తులతో కార్మికులతో విస్త్రత ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొద్దిగంటలే ఉండటంతో యూనియన్ నాయకులు హడావిడి ఎక్కువైంది. టెంట్లు వేసి ప్రచారం అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో మొత్తం 347 మంది కార్మికులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరిలో 344 మంది రెగ్యులర్ కార్మికులు కాగా, మిగిలిన ముగ్గురు కాంట్రాక్టు కార్మికులున్నారు. ప్రతి రెం డేళ్లకు ఒకసారి జరిగే యూనియన్ ఎన్నికల్లో ఈ సారి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూని యన్ (ఎన్ఎంయూ)తో పాటు కొత్తగా టిఎన్ కార్మిక పరిషత్ సంఘం ఎన్నికల బరిలో ఉంది. గత పది ఎన్నికలను పరిశీలిస్తే అవనిగడ్డ డిపో స్థాయిలో ఎంప్లాయీస్ యూనియన్ 9సార్లు విజయం సాధించగా, రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్ధూర్ సంఘం ఆరు సార్లు గెలుపొందింది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈయూ డిపోలో 58ఓట్లు, రాష్ట్రస్థ్ధాయిలో 81ఓట్లతో విజయం సాధించింది. ఈ సారి డినోలోనూ, రాష్ట్రంలోనూ రెం డుచోట్లా గెలిచి సత్తాచూపాలని ఈయూ, ఎన్ఎంయూ ప్రయత్నిస్తుండగా టిఎన్ కార్మిక పరిషత్ సంఘం చీల్చే ఓట్లపైనే విజయం ఆధార పడిఉంది. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఒకరోజు ముందే డిపో గే టు ముందు యూనియన్లు షామియానాలు వేశారు. ఎవరికి వారు తమ టెంట్లు వద్ద యూ నియన్ జెండాలు, హామీలు తెలిపే పోస్టర్లు, ఫ్లెక్సీలు ఉంచారు. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నాయకులను ఈయూ రెండుసార్లు తీసుకొచ్చి విస్త్రత ప్రచారం నిర్వహించారు. స్థానిక బస్టాం డ్ ప్రవేశంలో విద్యుత్ దీపాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉదయం 5నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ గురువారం ఉదయం 5గంటలకే యూనియన్ ఎన్నికలు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికలు కొనసాగుతాయి. ఏడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక గంట వ్యవధిలో ఫలితాలు తెలిసిపోనున్నాయని యూనియన్ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ సూర్యపవన్‌కుమార్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షించారు. యూనియన్ ఎన్నికల్లో గెలుపెవరిది తేలాలంటే మరి కొన్నిగంటలు వేచి ఉండాల్సిందే. -
కారుచీకట్లో కామాంధుని క్రూరత్వం
అర్ధరాత్రి మరాఠీ మహిళపై లైంగిక దాడి కోరిక తీర్చుకుని ఆపై గాయపర్చిన కామాంధుడు బాధితురాలిని ఒంగోలు హోమ్‌కు తరలించిన కార్మికులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిందితుని అకృత్యం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కనిగిరి ఆర్టీసీ డిపో అర్ధరాత్రి.. ఆర్టీసీ డిపో ఆవరణలో ఒంటరిగా ఉన్న మహిళ.. పైగా చిమ్మ చీకటి.. ఓ కామాంధుడి కన్ను ఆమెపై పడింది. ఆకలితో అలమంటిచే ఆ మహిళను ఆ మానవ మృగం మాయమాటలు చెప్పి లొంగదీసుకుంది. పలుమార్లు పశువాంఛ తీర్చుకుని రాక్షసునిలా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా కొరికి గాయపర్చి వదిలేసింది. ఈ పైశాచిక ఘటన కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది. - కనిగిరి నాగపూర్ ప్రాంతానికి చెందిన మహిళను నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు కనిగిరి ఆర్టీసీ డిపో ఆవరణలో వదిలి వెళ్లారు. ఓ రోజు చీకటి పడిన తర్వాత అర్థంకాని భాషతో మాట్లాడే ఆ మహిళకు ఓ మృగాడు ఆన్నం ఆశ చూపాడు. చీకట్లోకి తీసుకెళ్లి పశువులా వ్యవహరించాడు. మద్యం తాగిన మత్తులో రాక్షసుడిలా మారి పలుమార్లు కోరిక తీర్చుకుని వదిలేశాడు. తెల్లవారు జామున మరో మృగాడి కన్ను ఆ బాధిత మహిళపై పడింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించిన కార్మికులు.. అతడిని మందలించి పంపారు. ఆదివారం కనిగిరి డిపో గేటు మూలన కూర్చొని ఏడుస్తూ.. శరీరం, చేతిపై ఉన్న గాయాలు చూపిస్తూ ఆ మహిళ కన్నీటి పర్యంతమవ్వడాన్ని కార్మికులు గమనించి చలించిపోయూరు. వెంటనే ఆమెకు టిఫిన్ పెట్టించి ఓదార్చారు. వెంటనే స్థానిక ఐసీడీఎస్ కార్యాలయూనికి సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించి ఒంగోలు చైల్డ్‌లైన్ ప్రతినిధి సాగర్‌కు తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఆర్టీసీ కార్మికుడు మారాఠి మహిళను ఆర్టీసీ బస్సులో ఒంగోలు తీసుకెళ్లారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి సాగర్, స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఆర్టీసీ కండక్టర్ కలిసి ఆమెను ఒంగోలులోని ఓ హోమ్‌లో చేర్పించారు. మందుబాబుల కేరాఫ్ ఆర్టీసీ డిపో కనిగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ఇదే డిపో ప్రాంగణంలో డ్యూటీ దిగి వెళ్తున్న మహిళా ఉద్యోగులపై దాడులు జరిగిన సంఘటనలున్నాయి. డిపోలో చీకటి పడితే మందుబాబుల చిందులు, కేరింతలు షరా మామూలయ్యాయి. కార్మికులతో పాటు కొందరు బయట వ్యక్తులు డిపో ఆవరణలోని చీకటి ప్రాంతాల్లో మద్యం తాగుతూ పార్టీలు చేసుకుంటున్నారు. డిపో ప్రధాన గేటుకు ఇరువైపులా, చెట్ల కింద, చీకటి ప్రదేశాల్లో మద్యం ఖాళీ బాటిళ్లు బారు షాపుల్లోలా దర్శనమిస్తున్నాయి. మద్యం షాపూ అక్కడే డిపోకు ఎదురుగా బ్రాందీ షాపు నిత్యం తెరిచే ఉంటుంది. దీని వల్లే బస్టాండ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే ఆ ప్రాంతంలో మహిళలు ఒంటరిగా నడిచే పరిస్థితి లేదు. రాత్రి పూట డ్యూటీలు ముగించుకుని మహిళా ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ఇక కుర్రాళ్లు మద్యం తాగి బైకులపై డిపో ఆవరణలో హల్చల్ చేస్తుంటారు. మద్యం మత్తులో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఏదైనా సంఘటన జరిగినప్పుటు కాస్త హడావుడి చేసి మళ్లీ పట్టించుకోకపోవడం కూడా నేరస్తులకు కలిసి వస్తోంది. ఆ మహిళ..హోమ్‌లో క్షేమంగా ఉంది: బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి ఆ మహిళను ఒంగోలులోని ఓ హోమ్‌లో ఉం చాం. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. హోమ్ నిర్వాహకుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం. ఆమె మానసిక స్థితి సరిగానే ఉంది. మరాఠీ భాష వచ్చిన వారితో మాట్లాడించి ఆమె పూర్తి వివరాలు తెలుసుకుంటాం. -
'కార్మికులను అపహాస్యం చేస్తే సహించం'
- మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో ధర్నా మహబూబ్‌నగర్: జిల్లాలో ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికుల శ్రమను అపహాస్యం చేస్తే ఏమాత్రం సహించమని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీఎంల్ గౌడు అన్నారు. ఆర్టీసీ ఆర్ఎం, డిప్యూటీ సీటీఎం ఇద్దరు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని దానిని నిరసిస్తూ బుధవారం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ఆర్ఎం, డిప్యూటీ సీటీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల మనోస్థైర్యం దెబ్బతీయడానికి అధికారులు మాట్లాడుతున్నారని ఇలాంటి సమయంలో కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు, యాజమాన్యలు ఐక్యంగా ఉన్నప్పుడే ఆర్టీసీ అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాలో సిబ్బంది బదిలీలు పూర్తి స్థాయిలో జరగలేదని వెంటనే బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. డిపోలలో కొన్ని క్యాటగిరిలలో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని కోరారు. జిల్లాలో వెంటనే కారూణ్య నియామకాలు వెంటనే చేయాలని, డబుల్ డ్యూటీ చేస్తున్న వారికి డబుల్ జీతం చెల్లించాలన్నారు. అధికారుల వైఖరి మార్చుకోకపోతే నవంబర్2న జిల్లాలో ఉన్న అన్ని డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్ బసప్ప, అధ్యక్షుడు రవీంధర్‌రెడ్డి, జోనల్ కార్యదర్శి అహ్మద్‌ఖాన్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు కుర్మయ్య, బీహెచ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి, గ్యారేజ్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యం, వెంకటయ్య, డిపో ప్రచార కార్యదర్శి కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.