మానుకోట ఆర్టీసీ డిపో పదిలం
-
∙గతంలో ఎత్తివేసే కుట్రలు జరిగాయి
-
∙జిల్లా ఏర్పాటుతో పెరుగనున్న బస్సులు సంఖ్య, సిబ్బంది
-
∙జిల్లా ఏర్పాటుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు
-
తెలిపిన యూనియన్ నాయకులు
మానుకోట డిపో నష్టాల ఊబిలో ఉందనే కారణంతో డిపోలో బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గించారు. డిపోను కూడా ఎత్తివేసే కుట్రలు జరిగాయి. చివరికి శాటిలైట్ డిపోగా మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో జిల్లా ఏర్పాటుకు సానుకూల నిర్ణయం జరిగింది. జిల్లా ఏర్పాటు నేపథ్యంతో ఎత్తివేసే కుట్రలకు స్వస్తి పలికినట్లే. దీంతో మానుకోట ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో 1989లో డిపోను ఏ ర్పాటు చేశారు. డిపో ఏర్పాౖటెనప్పుడు క్రమం గా 80 బస్సులతో నడిచింది. సుమారు 500 మంది సిబ్బంది పనిచేయడం జరిగింది. త ర్వాత పట్టణంలో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాç హనాలు పెరగడంతో ఆర్టీసి ఆదాయానికి కొంత గండి పడింది. మానుకోటలో రైల్వే సౌక ర్యం ఉండటం కూడా ఆర్టీసికి నష్టం జరిగింది. ఏడాదికి సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినప్పటికి నష్టాల్లోనే డిపో కొనసాగిందని యూనియన్ నాయకులు తెలిపా రు. ఆ సమయంలో పలు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మూలంగా ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించింది.
చివరికి డిపో లో 60 బస్సులు మాత్రమే మిగిలాయి. క్రమం గా బస్సులను తగ్గించే కుట్రలు జరుగుతున్న క్రమంలో మానుకోట జిల్లా ఏర్పాటుకు సానుకూలత ఏర్పడటంతో అట్టి కుట్రలకు భగ్నం కలిగింది. డిపోపై ఆశలు సడలుతున్న సమయంలో జిల్లాలో పునర్విభజనలో మానుకోట పేరు ఉండటంతో డిపో పరంగా అభివృద్ది చెందుతుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసి లాభాల్లో నడిచే అవకాశం ఉంది. ఆర్టీసి యూనియన్ నాయకులు జిల్లా నేపథ్యం దృష్ట్యా ఎంతో ఆనందంగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ తరహాలో మానుకోట డిపో అభివృద్ది జరుగుతుంది. జిల్లా ఏర్పాటుతో మానుకోట ఆర్టీసి సమస్య తీరినట్లే.
బస్సుల సంఖ్య పెరుగుతుంది
జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసి డిపో అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా బస్సుల సంఖ్య పెరిగి ప్రయాణికులకు మేలు జరుగనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉండటం వల్ల డిపో ఆదాయం 100 శాతం పెరుగుతుంది. జిల్లా ఏర్పాటుకు సహకరించిన నాయకులందరికీ టీఎంయూ తరపున కృతజ్ఞతలు.
–కె.మల్లయ్య, టీఎంయూ చీఫ్ అడ్వయిజర్ మానుకోట డిపో
కష్టాలు గట్టెక్కినట్లే
కొంత కాలంగా నష్టాల్లో ఉందనే కారణాన్ని చూపిస్తూ బస్సుల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మానుకోట జిల్లా ఏర్పాటు నేపథ్యంతో డిపో కష్టాలు గట్టెక్కుతాయి. ఆదాయం పెరగడంతో పాటు అన్ని సౌకర్యాలు మెరుగుపడుతాయి. జిల్లా నేపథ్యంతోనే ఆర్టీసి సమస్యలు తీరనున్నాయి.
– బీ.ఆర్.రెడ్డి టీఎంయూ డిపో కార్యదర్శి