
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. కాంప్లెక్స్ ఆవరణలో బస్సు నిలిపి ఉంచిన అనంతరం క్లీనర్ తాళాలు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. తుని వెళ్లేందుకు డ్యూటీ డ్రైవర్ కాంప్లెక్స్‌కు వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రదేశంలో బస్సు లేదు.
డ్రైవర్ వెంటనే బస్సు యజమాని దాట్ల గీతంరాజుకు విషయం చెప్పాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గాలింపు చేపట్టారు. చింతపల్లికి సమీపంలోని చింతలూరు వద్ద పోలీసులు బస్సుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాధిక్ బాషా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
చింతలూరు వద్ద… pic.twitter.com/E4jhNy1bXl— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024