narsipatnam
-
కూటమి సర్కార్ ‘రాజకీయ కూల్చివేతలు’ షురూ!
నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరెస్టులు, బెదిరింపులతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్సార్సీపీ నాయకుల భవనాలే లక్ష్యంగా ‘రాజకీయ కూల్చివేతలను’ షురూ చేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండు నెలల క్రితం గచ్చపువీధిలోని చిటికెల కరుణాకర్ భవనాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, తాజాగా శారదానగర్‌లోని బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేతకు పాల్పడ్డారు. తహసీల్దార్ రామారావు సోమవారం ఉదయం 7 గంటలకే భారీ సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వెంట పెట్టుకొని బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు.విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా పార్టీ నాయకులతో భవనం వద్దకు చేరుకున్నారు. నోటీసులో రెండు రోజులు గడువు ఇచ్చినందున, భవనాన్ని యజమానే తొలగించుకునేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే తహసీల్దార్‌ను కోరినప్పటికీ వినలేదు. భవనంలో ఫర్నిచర్‌ను రెవెన్యూ సిబ్బంది బయటకు తీస్తుండగా భవన యజమాని, పార్టీ నాయకులు అడ్డుకున్నారు.తనపై కక్షతోనే స్పీకర్ కావాలనే తన సోదరుని బిల్డింగ్‌ను కొట్టిస్తున్నాడని, ఇలా ఎంత మందిని నాశనం చేస్తారంటూ శ్రీనివాసరావు ఆవేదన చెందారు. కాగా, 10.47 గంటలకు కూల్చివేత పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు అక్కడ నుండి జారుకున్నారు. కానీ అప్పటికే రెండో ఫ్లోర్ శ్లాబ్ సగం తొలగించారు. కింద పోర్షన్ గోడలు తొలగించి ద్యామేజ్ చేశారు. అయ్యన్నపాత్రుడి కక్షపూరిత చర్యలు: మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ అకృత్యాలను న్యాయస్ధానాల ద్వారా ఎదుర్కొంటామన్నారు. అయ్యన్నపాత్రుడు కుట్రలపై కోర్టుల్లో న్యాయం జరుగుతుందని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం స్పీకర్ గ్రహించాలని హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కో–ఆప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో YSRCP నేత ఇల్లు కూల్చివేత
-
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. కాంప్లెక్స్ ఆవరణలో బస్సు నిలిపి ఉంచిన అనంతరం క్లీనర్ తాళాలు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. తుని వెళ్లేందుకు డ్యూటీ డ్రైవర్ కాంప్లెక్స్‌కు వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రదేశంలో బస్సు లేదు. డ్రైవర్ వెంటనే బస్సు యజమాని దాట్ల గీతంరాజుకు విషయం చెప్పాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గాలింపు చేపట్టారు. చింతపల్లికి సమీపంలోని చింతలూరు వద్ద పోలీసులు బస్సుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాధిక్ బాషా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. చింతలూరు వద్ద… pic.twitter.com/E4jhNy1bXl— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024 -
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ‘తీర్పు’ చాలా కీలకం : వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశం
-
చంద్రబాబులో అలాంటి విలువలు లేవు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుందంటే దాని అర్థం ఏంటి?.. కొనుగోలుచేసి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని చూస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడన్నదానిపై సమాజం చూస్తుంది. కాని చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధంచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు, కాని మోసం చేస్తున్నాడు. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్ధాలు చెప్పి, ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకు ఏం సంతృప్తి వస్తుంది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేల వరకూ తిరిగి గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా?. జగన్ మాట చెప్పాడు, కాని అమలు చేయలేదనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెప్తే కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు కూడా ఇలాంటి హామీలు ఇచ్చి, మాట తప్పాడు. ఇది ప్రజలకు అర్థమైంది, అందుకే 2019లో ఆయన డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019లో మనం అధికారంలోకి వచ్చి ఇచ్చిన ప్రతిమాటనూ నిలబెట్టాం. ఇవ్వాల్టికీ ప్రజల దగ్గరకు వెళ్లి మనం ఇది చేశామని చెప్పుకోగలిగాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారు. ప్రజలకు మనకు శ్రీరామ రక్షగా ఉంటారు. విలువలు కోల్పోయిన రోజు మనకు ప్రజలనుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. విలువలు, విశ్వసనీయతగా మనం అడుగులేశాం. కష్టాలు లేకుండా ఏదీ ఉండదు. చీకటి తర్వాత వెలుగు రాక మానదు. పలానా వాడు మన నాయకుడు అని చెప్పుకునే రీతిలో మనం ఉండాలి. జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా.. పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే.. బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘స్కూళ్లు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. గడపవద్దకే మనం సేవలు అందిస్తే ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పాలన దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. వ్యవసాయం దెబ్బతింది. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలు, మోసాలని తేలిపోతున్నాయి. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అంది ఉండేది. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే.. కాలెండర్ ప్రకారం పథకాలు వచ్చేవి. తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మనం దగ్గరంగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకూ నేను భరోసా ఇస్తున్నాను. వీటిని ఎదుర్కొని ఉన్నప్పుడు ప్రజలు మనల్ని కచ్చితంగా ఆదరిస్తారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా నన్ను 16 నెలలు జైలుకు పంపారు. కాని ప్రజలకోసం మనం చేసిన పోరాటాలతో మళ్లీ మంచి స్థానంలో పెట్టారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ధనబలం, అధికార బలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధర్మం, అన్యాయం సాగదన్న సందేశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ కొనలేరనే మెసేజ్ పంపాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.‘‘విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీకి చుక్కెదురు అంటూ ఈనాడు పత్రిక ఏదో ఘనకార్యం జరిగినట్టుగా రాసింది. మెజార్టీలేని చోట ప్రలోభాలు పెట్టి, పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నందుకు ఘనకార్యమా?. దొంగతనం, హత్యలు చేస్తే దాన్ని కూడా ఘనకార్యంగా రాసే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఘన కార్యాలుగా రాస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు చాలా కీలకం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నర్సీపట్నం ఇసుక డిపోలో!
సాక్షి, అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఇసుక డిపోలో రూ.5 కోట్ల విలువైన ఇసుక తరలించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేశారని.. ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని టీడీపీ మోసం చేస్తోందంటూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు.టన్నుకు కేవలం రూ.175 తగ్గించి ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమ్తెతారు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇచ్చామని ఉమాశంకర్ అన్నారు. డిపోకి వచ్చిన, అమ్మిన ఇసుక వివరాలు వెల్లడించాలని అధికారులను ఉమా శంకర్ గణేష్ కోరారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. -
క్లర్క్ నుంచి లెఫ్టినెంట్ స్థాయికి..
నర్సీపట్నం: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడా యువకుడు. ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని సంతృప్తి చెందలేదు. అందులోనే ఉన్నత స్థానానికి వెళ్లాలని నిరంతరం కష్టపడ్డాడు. పోటీ పరీక్షలు రాసి అనుకున్నది సాధించాడు. యువతరానికి ఆదర్శంగా నిలిచాడు. రావికమతం మండలం జెడ్.కొత్తపట్నం పంచాయతీ శివారు గంపవానిపాలేనికి చెందిన విజనగిరి గోవింద్ విజయప్రస్థానమిది. గోవింద్ పుట్టింది పల్లెటూరు అయినప్పటికీ తల్లిదండ్రులు రాజారావు, సత్యవతి ప్రోత్సాహంతో చదువుపై దృష్టి సారించారు. ప్రాథమిక విద్య గంపవానిపాలెం ప్రభుత్వ పాఠశాల, కొత్తకోట జూనియర్ కాలేజీలో ఇంటర్, బీకాం డిగ్రీ నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. 2011లో కాకినాడలో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్ ర్యాలీలో క్లర్క్‌గా సెలెక్ట్ అయ్యారు. భోపాల్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ సెంటర్లో ఏడాదిన్నర శిక్షణ పూర్తి చేసుకుని, అహ్మదాబాద్‌లో విధుల్లో చేరారు. 13 ఏళ్లుగా ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. 2023 మార్చిలో ఎస్ఎస్బీ (సర్వీసెస్ సెలక్షన్ బోర్డు) బెంగళూరులో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో 152 మంది పోటీ పడగా 8 మంది ఎంపికయ్యారు. ఈ ఎనిమిది మందిలో గోవింద్ ఒకరు. ఆఫీసర్స్ విభాగం క్లాస్‌వన్‌లో స్పెషల్ కమిషన్ ఆఫీసర్ (లెఫ్టినెంట్)గా ఎంపికయ్యారు. బిహార్ రాష్ట్రం గయాలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ అనంతరం తల్లిదండ్రులు, భార్య భవాని, పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇండియన్ ఆర్మీలో స్పెషల్ కమిషన్ ఆఫీసర్‌గా రాజస్థాన్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. -
రేప్ కేసు ముద్దాయి.. లాటరైట్ ఖనిజం దోపిడీ
-
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
-
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా సాగింది. వైఎస్సార్సీపీ సభ్యులపైకి టీడీపీ సభ్యులు దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సభ్యులపై అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారు. వేలు చూపిస్తూ.. అయ్యన్న సతీమణి పద్మావతి బెదిరించారు. వైఎస్సార్సీపీ సభ్యులపైకి కుమారుడు రాజేష్ దూసుకెళ్లాడు. దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రవేశించారు. -
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం. ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు . -
అయ్యన్న ఎన్ని కుయుక్తులు పన్నినా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే ఉమాశంకర్
-
ఏజెన్సీ ముఖద్వారంలో ‘సామాజిక’ జైత్రయాత్ర
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం ‘జై జగన్..జైజై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం, ఉత్తేజంతో సాగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార పదవులు లభించాయని కొనియాడారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళితులకు అడుగడుగునా మేలు.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు. జనవరి 1 నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే టీడీపీ నేతలకు.. ఇక వృద్ధులు, వితంతువులు మూడు వేళ్లు చూపాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా మేలు జరుగుతోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఈసారి తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజల సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశంసించారు. వైద్య విప్లవం తీసుకొచ్చారు.. సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో రూ.2,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సాధికారతకు సీఎం జగన్ నిజమైన అర్థం చెప్పారని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, పార్టీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది
-
జనసంద్రంగా మారిన నర్సీపట్నం
-
వాడుకుని వదిలేశాడా? ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండ్
చంద్రబాబు వాడుకుని వదిలేసే జాబితాలో మరో నేత చేరారా? ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండిస్తున్నారా? నాలుగేళ్ల పాటు ఆయన్ను పొలిటికల్‌గా వాడుకుని ఇప్పుడు సీటు లేదంటున్నారా? చంద్రబాబు చేసిన మోసంతో ఆ నాయకుడికి రాజకీయంగా జ్ఞానోదయం కలిగిందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఏంటి? అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి తగిన శాస్తి జరిగిందనే చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడనే విషయం ఆ పార్టీ వాళ్ళందరికీ బాగానే తెలుసు. గడచిన నాలుగేళ్లుగా అయ్యన్నతో అధికార పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేయించారు. అయ్యన్నను అడ్డుపెట్టుకుని బీసీల మీద జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు. తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అయ్యన్న కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఇష్టారీతిన రెచ్చిపోయారు. చంద్రబాబు మాట విని ప్రభుత్వం మీద రెచ్చిపోతే తనకు ఎమ్మెల్యే సీటు, తన కొడుక్కి ఎంపీ సీటు వస్తుందని ఆశపడ్డారు. అయితే అయ్యన్న కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదు. కేవలం ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందనే సాకుతో అయ్యన్న కుటుంబానికి ఎంపీ సీటు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తీరుతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి అయ్యన్న బెంగ పెట్టుకున్నారు. అయ్యన్న కుమారుడికి సీటు ఇచ్చేదిలేదని చెప్పడమే గాకుండా..ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదనను చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాటలు విని ఒళ్ళు మరిచి ఇష్టానుసారంగా రెచ్చి పోయిన అయ్యన్నకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతోంది. చంద్రబాబు తన రాక్షస క్రీడలో తనను బలి పశువును చేశారనే విషయం అయ్యన్నకు అర్థమైంది. తన రాజకీయ ప్రత్యార్థులైన గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి చంద్రబాబు తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడని వారికి పెద్దపీట వేస్తూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఇంట్లో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానికి సీట్లు ఇవ్వడంతో పాటు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని.. అదే తన ఇంట్లో తనకూ తన కుమారునికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు మాత్రం పార్టీలో ఉన్న బీసీలను అవసరానికి వాడుకొని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు.. సీఎం జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, చంద్రబాబు మాత్రం మాట ఇస్తే నిలబెట్టుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? గత ఎన్నికల్లో ఎంతోమంది యువకులకు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని..చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇస్తానని చెప్పి తమను మోసం చేశారని, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అయ్యన్న రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారునికి సీటు ఇవ్వకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు మాటలు విని నాలుగేళ్లపాటు ఇస్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వచ్చే ఎన్నికల్లో తేడా వచ్చినా... తట్టుకోలేం
నర్సీపట్నం/మాకవరపాలెం: వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగిన పులి పంజాను ఏమాత్రం తట్టుకోలేమని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి టీడీపీ మాజీ మంత్రి కళావెంకటరావు అన్నారు. టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య యాత్రలో భాగంగా నర్సీపట్నంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారన్నారు. ఇప్పటి నుంచే పార్టీ విజయానికి శ్రమించాలని, ఏమాత్రం తేడా వచ్చినా పులి పంజాకు తట్టుకోలేమన్నారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు ఉపన్యాసంలో ఎప్పుడు చెప్పే విషయాలే తప్ప కొత్తదనం లేదు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, బండారు సత్యనారాయణమూర్తి ఊకదంపుడు ఉన్యాసం చేశారు. టీడీపీ నేతలు బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. సభ నిండుగా కనిపించేందుకు ప్రైవేట్ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. జనాలను నింపేందుకు టీడీపీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమయానికి గ్యాలరీ నిండకపోవడంతో మీటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వచ్చిన జనాలు సైతం సభ జరుగుతుండగానే జారుకున్నారు. అంతకు ముందు మాకవరపాలెం మండలంలోని శెట్టిపాలె, రాచపల్లి జంక్షన్ వద్ద బస్సు యాత్రజరిగింది. -
మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం.. -
ఇంగితంలేని మాటలు.. అయ్యన్నా.. ఇక ఆపన్నా! టీడీపీ నేతల హితవు
తాగి వాగే అయ్యన్న మాటలు సొంత పార్టీ నేతలకు కూడా రుచించడం లేదా..? అయ్యన్న రోజూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారా..? అయ్యన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇంతకీ టీడీపీలో అయ్యన్న పాత్ర ఎలా ఉంది?. కొంతకాలం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది బడితే అది వాగడం వల్ల పార్టీకి నష్టం జరుతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రిని, మహిళలను, ఉద్యోగులను, పోలీసులను పట్టుకొని ఏది బడితే అది మాట్లాడటం వల్ల పార్టీకి డామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా అయ్యన్న తీరును కొందరు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండాతో వ్యవహరించే నాయకులు పార్టీకి మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ట్విట్టర్ వేదికగా అయ్యన్నను ప్రశ్నించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు సహనం కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. సీఎంను విమర్శించడం ద్వారా అయ్యన్న తన ఉనికిని చాటుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తన కుమారుడికి పార్టీ అధినేత అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారనే ఆశతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పోలీసులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసులను కాల్చి పారేస్తానంటు బహిరంగ వేదిక పైనుంచి మాట్లాడారు. హోం మంత్రి పదవితో పాటు లా అండ్ ఆర్డర్ పదవి కట్టబెడితే పోలీసుల సంగతి తేలుస్తానంటూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించింది. అయ్యన్న వ్యాఖ్యలపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. ఉద్యోగుల మనోభావాలు కించిపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించింది. గతంలో కూడా ఒక మహిళా అధికారిని పట్టుకొని బట్టలూడదీసి కొడతానంటూ దుర్భాషలాడి విమర్శల పాలయ్యారు.. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? గ్రాఫిక్స్ చరిత్రలు సైకిల్ పార్టీవే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణమంతా గ్రాఫిక్స్ అంటూ అయ్యన్న చేసిన విమర్శలపై అనకాపల్లి జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గ్రాఫిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడని స్థానిక ప్రజలు అయ్యన్నకు గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడుతో సహా టిడిపి నేతలు వస్తే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అయ్యన్న నోటికి తాళం వేయకపోతే రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయమంటునన్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
CM YS Jagan: పచ్చ ప్రకోపానికి ఇదే సరైన మందు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు, రోజుకు తన ప్రసంగాలలో పదును తేలుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్‌లో ఆదివారం రోజు చేసే చేసే విమర్శలకు ఆయన వారానికి ఒక్కసారి తన కార్యక్రమంలో తిప్పికొడుతున్న తీరు ప్రభావవంతంగా ఉంటోందని చెప్పాలి. చంద్రబాబు.. రోజూ చేసే దూషణలన్నిటినీ జగన్ ఒక్క గంటలో ఘాటుగా జవాబిస్తున్నారు. అందులో చమత్కారం, ఎద్దేవ కలగలిసి ఉండి సభికులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు తన పద్దతి మార్చుకోలేదు. సభలను ఆపకపోగా, ఇతర పట్టణాలలో కూడా అవే ఇరుకు రోడ్లలో సభలు పెడుతున్నారు. పైగా చచ్చిపోయినవారిలో బిసిలు ఎక్కువగా ఉన్నారంటూ, కనుక తన సభకు బిసిలు ఎక్కువమంది వస్తున్నారని లెక్కలేసుకునే దారుణ స్థితికి చంద్రబాబు రాజకీయం చేరింది. వచ్చినవారిలో పలువురు కూలీకి వచ్చామని ఓపెన్‌గానే చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సభకు బస్‌లలో తరలించారని, ఉపాధి హామీ కూలీలను తీసుకు వచ్చారని ప్రచారం చేసే తెలుగుదేశం పత్రిక ఈనాడు, మరి చంద్రబాబు సభకు ఎలా తీసుకు వచ్చింది ఎందుకు రాయడం లేదు? యధా ప్రకారం ఇరుకు రోడ్ల పోటోలను చూపి భారీగా తరలి వచ్చారని ఎందుకు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సభలను గమనించినా, ఈనాడు, తదితర టిడిపి మీడియాలను గమనించినా కందుకూరులో ఎలాంటి ఘటన జరగలేదేమో, అంతా సజావుగానే ఉందేమో అన్న భ్రమ కలుగుతుంది. ఎందుకంటే టిడిపి సభలో ఎనిమిది మంది మరణించిన ఘటనను అంతా మర్చిపోవాలని వారి అభిలాష అన్నమాట. ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం సభను పరిశీలించండి. సభకు వచ్చిన జనాన్ని చూడండి. సభా ప్రాంగణం చాలక బయట కూడా కిక్కిరిసిపోయిన జనం కనిపిస్తారు. అయినా ఈనాడు మాత్రం వచ్చినవారు అలా వచ్చారు? ఇలా వెళ్లారు.. పులిహోరా వదలివేశారు.. అంటూ పులిహోర వార్తలు వేస్తోంది. చంద్రబాబు సభను రోడ్డు మధ్యలో పెడితే ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగలేదన్నమాట. ట్రాఫిక్ ఎక్కడా ఆగలేదన్నమాట. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సభలకే కాదు.. అమరావతిలో పిచ్చి మొక్కలు చూపించడానికి, పోలవరంలో అసంపూర్తి కట్టడాలు చూపించడానికి, జయము జయము చంద్రన్న అని పాడించడానికి జనాన్ని తరలించినప్పుడు ఈనాడు వారి కన్నులకు పండగగాను, చెవులకు శ్రావ్యంగానూ ఉన్నాయన్నమాట. ఈ పత్రిక దిగజారుడుతనం గురించి రోజూ చెప్పుకున్నా చాలడం లేదు. మరో వైపు జగన్ ప్రసంగానికి వస్తున్న స్పందన చూడండి. ఆయన విసిరిన వ్యంగ్యోక్తులు పేలుతున్నాయి. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు, డైలాగులు చెప్పడం కాదు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం, నిరుపేదల కష్టాన్ని తీర్చి వారికి అండగా ఉండడం అని ఆయన తేల్చి చెప్పారు. కందుకూరులో చంద్రబాబు తన డ్రోన్ షాట్ల కోసం అంతమందిని బలితీసుకున్నారని ఆయన చెబుతూనే రాజకీయం ఎందుకోసమో వివరించారు. చంద్రబాబు సభలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని తిప్పికొట్టారు. గతంలో గోదావరి పుష్కరాలలో 29 మంది మరణించిన ఘట్టాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అసలు చంద్రబాబు సభలకు ఎందుకు జనం వస్తారు అంటూ పలు ప్రశ్నలు సంధించారు. లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎగ్గొట్టినందుకా? డ్వాక్రా మహిళలను మోసం చేసినందుకా? బిసిలను, ఎస్సిలను అవమానించినందుకా అంటూ అంటూ జగన్ పలు ప్రశ్నలు సంధించిన తీరు సున్నితంగా కనిపించినా, చంద్రబాబు నషాళానికి అంటే ఘాటు వంటిదే అని చెప్పాలి. కాకపోతే చంద్రబాబు వీటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు కనుక ఆయనకు ఆ బాధ ఉండదు. అందుకే జగన్ విమర్శలకు ఆయన జవాబు ఇవ్వకుండా తన దూషణలను మాత్రం కొనసాగిస్తుంటారు. జగన్ చెప్పిన మాటలలో కొన్నిటికైనా చంద్రబాబు రిప్లై ఇచ్చే పరిస్థితి లేకపోవడం తెలుగుదేశం దయనీయ పరిస్థితికి దర్పణం అని చెప్పాలి. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
అభివృద్ధి పథంలో ఏపీ..
-
సీఎం వైఎస్ జగన్ కు సెల్యూట్ : ఆర్ నారాయణ మూర్తి
-
జోగునాథుని పాలెంలో సీఎం జగన్ సభ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు: సీఎం జగన్
-
రాజకీయమంటే.. డైలాగులు, డ్రోన్ షాట్లా?: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ‘‘రాజకీయమంటే డ్రోన్ షాట్లు, డైలాగులు చెప్పడం కాదు.. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం! ప్రతి నిరుపేద కష్టాన్ని తీర్చి వారికి అండగా నిలవడం.. చంద్రబాబులా ప్రజలను వంచించేవారు రాజకీయ నాయకుడు కాదు..’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు ఆయన మార్కు అభివృద్ధి పథకాన్ని ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. గత పాలకుల నిరాదరణకు గురైన ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం నియోజకవర్గం రూపు రేఖలు ఇప్పుడు ప్రజల ప్రభుత్వం చేపడుతున్న భారీ కార్యక్రమాలతో మారనున్నాయని చెప్పారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జోగినాథునిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బలిఘట్టం చేరుకున్న సీఎం జగన్ పార్టీ నేతలను కలిశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నం మీదుగా సభా స్థలికి చేరుకున్నారు. దారి పొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభాస్థలి వద్ద ఏలేరు–తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టుల బ్లూప్రింట్స్ని సీఎం పరిశీలించారు. అనంతరం నర్సీపట్నంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, అనుబంధ నర్సింగ్ కళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.470 కోట్లతో ఏలేరు, తాండవ కాలువల అనుసంధానం, నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రూ.16.60 కోట్లతో రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. నర్సీపట్నం రూపురేఖలు మారుస్తాం నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్‌వే. గత పాలకుల హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అనారోగ్య బాధితులు రెండు గంటలు ప్రయాణించి విశాఖ చేరుకుంటే కానీ వైద్యం అందించలేని దుస్థితిలో తల్లడిల్లుతున్నా పట్టించుకోలేదు. ఈ రోజు ఈ ప్రాంతం రూపురేఖలను మార్చబోయే కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు రూ.986 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు నర్సీపట్నంలో మొదలుపెడుతున్నాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. తద్వారా దాదాపు 150 మెడికల్ సీట్లు ఇక్కడ రానున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. మూడున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజీ, పాడేరులో మరో వైద్య కళాశాల, విజయనగరంలో ఇంకోటి.. ఇవన్నీ కేవలం ఈ మూడున్నరేళ్లలో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అడుగులు పడుతున్నాయి. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, వచ్చే నెలలో ఈ ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. రైతుల కన్నీళ్లు తుడిచేందుకే.. తాండవ రిజర్వాయరు కింది 51,465 ఎకరాల ఆయకట్టుని పూర్తిగా స్ధిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద కొత్తగా మరో లిఫ్ట్ ఏర్పాటు చేసి మరో 5,600 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ఏలేరు, తాండవ రిజర్వాయర్లని అనుసంధానం చేస్తున్న కాలువ అభివృద్ధికి మరో 6 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దాదాపు రూ. 470 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తైంది. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాలతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు టెండర్లతో పాటు అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా పూర్తయ్యాయి. శరవేగంగా పనులు మొదలయ్యేలా సర్వే కూడా పూర్తి కావచ్చింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతన్నల కలను మనందరి ప్రభుత్వం నెరవేరుస్తోంది. మీ కష్టాలు పాదయాత్రలో చూశా.. ఇవాళ నర్సీపట్నం మున్సిపాల్టీలో రూ.16.60 కోట్లతో ప్రధాన రహదారిని విస్తరించడంతో పాటు మరో రహదారిని అభివృద్ధి చేస్తూ సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ లాంటి పనులు చేపడుతున్నాం. ఒకవైపు మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ మరోవైపు పట్టణంలో ప్రధాన రహదారులన్నీ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే నర్సీపట్నం రూపురేఖలు పూర్తిగా మారతాయి. తాండవ, ఏలేరు రిజర్వాయరు కాలువల అనుసంధానం కూడా పూర్తయితే ఆయకట్టు స్ధిరీకరణ, విస్తరణ గణనీయంగా పెరిగి ఈ రెండు జిల్లాల్లో రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయి. మీ కష్టాలన్నీ నా పాదయాత్రలో చూశా. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసేలా.. మీ జగనన్న ప్రభుత్వంలో చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటా. జగన్ గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ఫలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ అన్న పరిపాలన చేస్తాడు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా మీ అన్న బతుకుతాడు. మంచి చేస్తున్నా.. బురద చల్లుడే రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవçస్థ్ధతో మనందరికీ యుద్ధం జరుగుతోంది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. మనం ఎంత మంచి చేస్తున్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తోంది. పెంచేదే.. తగ్గించేదేలే జనవరి 1వతేదీ నుంచి ప్రతి అవ్వాతాత మొహంలో చిరునవ్వులు చూసేలా సామాజిక పెన్షన్‌ని రూ.2750కి పెంచి ఇవ్వబోతున్నాం. దీన్ని చూసి దుష్ట చతుష్టయంలో ఓర్వలేనితనం కనిపిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు వీళ్లంతా మాట ప్రకారం పెన్షన్ పెంచుతూ చేపట్టిన గొప్ప కార్యక్రమంపైనా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆర్నెల్లకు ఒకసారి జూన్ , డిసెంబర్లో సాధారణ ఆడిట్లో భాగంగా పారదర్శకంగా జరిగే వెరిఫికేషన్ కార్యక్రమంపై కూడా ఎన్నెన్నో అబద్ధాలు సృష్టించి ఎంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు హయాంలో 2018 అక్టోబరు వరకు అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. మీ జగన్ ప్రభుత్వంలో ఇవాళ అక్షరాలా 62.30 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మీ జగన్ మనసు ఎలాంటిదంటే రేపు జనవరి 1 తరువాత ఈ 62.30 లక్షల పెన్షన్లు పెరిగేవే కానీ తగ్గేవి కాదన్న సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు నెలకు రూ.400 కోట్లు అయితే ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు రూ.1,700 కోట్లకు పైగా ఉంది. తేడా ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఎల్లో మీడియా ఎలా అల్లకల్లోలం చేస్తోందో చూడండి. డైరెక్టర్ బాబు.. యాక్టర్ దత్తపుత్రుడు చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క మంచైనా చేసినట్లు చెప్పుకోడానికి ఆధారాలున్నాయా? ఇలాంటి దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడో దత్తపుత్రుడు. వీరిద్దరి స్టైల్ ఒక్కటే. అదేమిటంటే.. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం... ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు... ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్య.. ఇదీ వీరిద్దరి స్టైల్! వీరి స్వభావం చూస్తే ఎవరికైనా ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి? ఇదేం ఖర్మ మన రాజకీయాలకు? అని అనిపిస్తుంది. ఒకాయన రాజకీయాల్లో వచ్చి 14 ఏళ్లైనా ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్లా ప్రజలు ఆయన్ను ఓడించారు. ఆయనకు నిర్మాత, దర్శకుడు బాబు. ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు కాల్షీట్స్ ఇస్తాడు. ఎక్కడ షూటింగ్ అంటే అక్కడకు వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు. బాబుకు అనుకూలంగా, బాబు చెప్పిన డైలాగులన్నీ యాక్ట్ చేసి చూపిస్తాడు. ఇదీ ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. ఆ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా అది తానే చేశానని, తనవల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా కూడా ఆమెకు ఆడటం తానే నేర్పించానంటాడు. ఈ పెద్దమనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే అందరికీ రెండే రెండు స్కీంలు గుర్తుకొస్తాయి. ఒకటి వెన్నుపోటు... రెండోది మోసాలు. నీ సభలకు ఎందుకొస్తారు? ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించేందుకు ఎల్లో మీడియా, దుష్టచతుష్టయం నానా తంటాలు పడుతున్నాయి. ప్రతి వర్గాన్ని వంచించిన ఆ బాబు సభలకు అసలు ఎందుకొస్తారనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ♦రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి చివరికి నిండా మోసం చేసినందుకు థాంక్యూ.. థాంక్యూ బాబూ.. అని రైతులేమైనా ఆయన సభకు వస్తారా? ♦రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, వడ్డీలు కూడా కట్టొద్దని నిలువునా మోసగించి పొదుపు సంఘాలన్నింటినీ సర్వనాశనం చేసినందుకు ఆ అక్కచెల్లెమ్మలంతా థాంక్యూ.. థాంక్యూ బాబూ అని ఆయన సభలకు వస్తారా? ♦ప్రత్యేక హోదాను తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ఎగ్గొట్టినందుకు నిరుద్యోగులంతా థాంక్యూ.. థాంక్యూ బాబూ అని చెప్పడానికేమైనా ఆయన సభలకు వస్తారా? ♦ ఓ ఊరిలో పదివేల మంది ఉంటే కేవలం పదిమందికి మాత్రమే విదిల్చి అది కూడా లంచాలు తీసుకుంటూ జన్మభూమి కమిటీలతో నరకం చూపినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు థాంక్యూ థాంక్యూ బాబూ అంటూ ఆయన సభలకు వస్తారా? ♦కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచితంగా చదువులు చెప్పిస్తానంటూ ఎన్నికల వాగ్దానాలు చేసి చివరకు పిల్లలను కూడా మోసగించి ఫీజు రీయింబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని నీరుగార్చినందుకు థాంక్యూ థాంక్యూ బాబూ అంటూ వస్తారా? ♦దత్తపుత్రా.. ఈ పాపంలో నీక్కూడా వాటా ఉంది కాబట్టి నీక్కూడా థాంక్యూ థాంక్యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా? ♦వీరి సభలకు ఎవరైనా ఎందుకొస్తారు ? ఈ దుర్మార్గులను, వంచకుల్ని చూడడానికా? ఏదైనా ఘనకార్యం చేస్తే అధికారం నుంచి ఎందుకు దించేశారు? నిజంగానే వీళ్లు మంచి చేసి ఉంటే ఆయన కుమారుడిని, దత్తపుత్రుడుని ప్రజలు ఎందుకు ఓడించారు? ♦దుష్టచతుష్టయం రామోజీ, రాధాకృష్ణ, టీవీ 5, దత్తపుత్రుడికి బాబు అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) పథకం చాలా బాగుందని థాంక్యూ చెప్పడానికి వస్తారా? రాజకీయమంటే..? ►రాజకీయమంటే షూటింగ్‌లు, డైలాగులు, డ్రోన్ల షాట్లు కాదు.. డ్రామాలు అంతకన్నా కాదు. ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబంలో ఎలాంటి మంచి మార్పు తేగలిగామన్నదే రాజకీయమని వీళ్లందరికీ అర్థం కావాలి. ►ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖల్ని మార్చడం, ప్రతి గ్రామంలోనూ రైతన్నల చేయిపట్టుకుని నడిపిస్తూ వ్యవసాయం రూపురేఖలను మార్చడమే రాజకీయం. లంచాలు, వివక్షకు తావులేకుండా పౌర సేవలను ప్రతి గ్రామంలో ఆత్మగౌరవంతో అందించడం.. రాజకీయమంటే ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి çస్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా కట్టించి ఇచ్చి వారి గుండెల్లో చోటు సంపాదించడం. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల గురించి ఆలోచించడం రాజకీయం. ►రాజకీయం అంటే ఒక మాటిస్తే దాని మీద నిలబడటం అనేది వీళ్లందరికీ అర్థం కావాలి. అన్ని ప్రాంతాలు, అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేస్తే దాన్ని రాజకీయం అంటారు. అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్రను, రాయలసీమను చూసుకుంటూ వారందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే అసలైన రాజకీయం. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవకుడు. చంద్రబాబు మాదిరిగా ప్రజలపై అధికారాన్ని చలాయించడం కాదు. బీసీలు వారి సమస్యలు గురించి చెప్పడానికి వెళితే నాడు వారి తోకలు కత్తిరిస్తానన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా? అని హేళన చేశారు. రాజకీయమంటే అది కాదు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా సేవకులే అన్నది రాజకీయం. మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలను నెరవేర్చాం కాబట్టే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో సగర్వంగా ప్రతి గడప వద్దకు వెళ్లి ఆశీర్వదించాలని అడుగుతుండటం రాజకీయం. సీఎం సభ సూపర్ సక్సెస్ నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దాని కంటే ఎక్కువగా తండోపతండాలుగా తరలివచ్చిన జనసందోహంతో సభాప్రాంగణం లోపల, బయటా కిటకిటలాడింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు చోడవరం, పాయకరావుపేట, మాడుగుల, అనకాపల్లి, తుని నియోజకవర్గంలోని మరికొన్ని మండలాల నుంచి రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన జనాలు ప్రధాన కూడళ్లలో బారులు తీరారు. ఇక నర్సీపట్నం ఎటు చూసినా జనసంద్రంగా కనిపించింది. మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం నుంచి జోగునాథునిపాలెంలోని సభా ప్రాంగణం వరకు 4.5 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో వైఎస్ జగన్‌కు పూలజల్లులతో జనం నీరాజనం పలికారు. చిన్నారుల నృత్యాలతో, గిరిజన థింసా నృత్యాలతో, డప్పులతో సీఎంకి ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు.. హెలిపాడ్ వద్ద సీఎం గంటన్నర పాటు పార్టీ శ్రేణులతో కరచాలనం చేసి, ఆత్మీయంగా పలకరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ అమ్మాయి ఇంగ్లీష్ స్పీచ్‌కి సీఎం జగన్ ఫిదా
-
చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ రాబోతుంది. కొత్త మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది' అని సీఎం జగన్ చెప్పారు. 'ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు. 12:12 PM నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ అన్నారు. 12:01 PM మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన నర్సీపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించనున్నారు. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. 11:47AM ►సభాస్థలికి చేరుకున్న సీఎ జగన్ 11:27AM ►రోడ్డు షోలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు ►రోడ్డుకు ఇరువైపులా నిలుచుని సీఎం జగన్‌కి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు ►ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తున్న సీఎం జగన్ 11:17AM అనకాపల్లి: ►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బలిఘట్టం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ధర్మశ్రీ అవంతి శ్రీనివాస్, కన్నబాబురాజు, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, పాల్గుణ, సీతం రాజు సుధాకర్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ.. దాడి వీరభద్రరావు, చింతకాయల జమీల్ ►బలిఘట్టం నుంచి జోగినాథపాలెం వరకు ర్యాలీగా బయలుదేరిన సీఎం.. ►మరికాసేపట్లో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. 10:56AM ►గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నర్సీపట్నం బయల్దేరారు. 09:23AM తాడేపల్లి: నర్సీపట్నం బయలుదేరిన సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు లిఫ్టు ఇరిగేషన్ కెనాల్స్ అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం ►అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనకాపల్లి నర్సీపట్నంలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శుక్రవారం(డిసెంబర్ 30) అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం, సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన వివరాలు ఇవే.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. ఉదయం 11.15-12.50 మధ్య జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన. తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన. అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ
-
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు : వైఎస్ షర్మిల
-
వైఎస్సార్ మన మధ్య లేకున్నా అందరి గుండెల్లో ఉన్నారు : వైఎస్ విజయమ్మ
-
నర్సీపట్నం కృష్ణబజార్ సెంటర్ లో విషాదం
-
AP: ఘోర అగ్నిప్రమాదం.. తండ్రీకొడుకులు సజీవదహనం
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం కృష్ణబజార్ సెంటర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబికా జ్యూవెల్లర్స్‌లో భవనంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా, అంబికా జ్యూవెల్లర్స్‌లో పై అంతస్తులో షాపు ఓనర్స్ మల్లేశ్వరరావు ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగడంతో మల్లేశ్వరారావు, ఆయన కుమారుడు మౌలేష్ అక్కడే సజీవ దహనమయ్యారు. మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక, పాత భవనం కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు సమాచారం. -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు అయనను, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. చదవండి: అది రాజకీయ యాత్రే -
నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్
-
లోసింగి అటవీ ప్రాంతంలో బుల్లి జింక స్వాధీనం
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలోని రోలుగుంట మండలం లోసింగిలో మౌస్ డీర్ (బుల్లి జింక)ను అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసు కలిగిన వింత ప్రాణితో లోసింగి గ్రామంలో చిన్నారులు ఆడుకుంటుండగా జాన్ అనే వ్యక్తి గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్సు, సిబ్బందితో లోసింగి గ్రామం వెళ్లి పిల్లల దగ్గర ఉన్న మౌస్ డీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మౌస్ డీర్‌ను డీఎఫ్‌వో సూర్యనారాయణ పరిశీలించి, ఇది అరుదైన ప్రాణి అని చెప్పారు. అటవీ అధికారుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంచారు. ఆదివారం విశాఖ జూకు అప్పగిస్తున్నట్లు రేంజర్ తెలిపారు. -
Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ
నర్సీపట్నం: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా రిలీజ్ కావడంతో నర్సీపట్నంలో అభిమానుల సందడి నెలకొంది. రాజు థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. పూరీ జగన్నాథ్ సోదరుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, మిగతా కుటుంబ సభ్యులతో రాజు థియేటర్లో సినిమాను తిలకించారు. అభిమానులు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సినిమా తిలకించిన అనంతరం థియేటర్ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, ఎమ్మెల్యే సతీమణి కళావతి కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందనడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (గణేష్ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి) -
అమాయక గిరిజనుడిని బలిగొన్న అయ్యన్న పాత్రుడి కుటుంబం !
-
అదిగో పులి... ఇదిగో తోక
కోటవురట్ల: పులి భయంతో అటవీ పరిధి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా నర్సీపట్నం–రేవుపోలవరం రోడ్డుపై కూడా సంచరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి ఇందేశమ్మవాక ఘాట్‌రోడ్డులో పలువురికి పులి కనిపించినట్టు చెబుతున్నారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా ఘాట్‌రోడ్డులో పులి కనిపించడంతో బైకును అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసినట్టు చెబుతున్నారు. పందూరు గ్రామానికి చెందిన కిర్రా నాగేశ్వరరావు ఇందేశమ్మతల్లి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఎప్పటిలానే గురువారం రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి దీపం పెట్టి తిరిగి పందూరులోని ఇంటికి వెళ్లేందుకు బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసేసరికి లైట్ వెలుతురులో సుమారు 200 అడుగుల దూరంలో పులి కొండపైకి ఎక్కుతూ కనిపించినట్టు నాగేశ్వరరావు చెబుతున్నారు. తాను స్పష్టంగా చూశానని, పులి తోక, కాళ్లు కనిపించాయని రోడ్డు నుంచి కొండపైకి ఎక్కుతుండడంతో భయపడి వెంటనే గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టు తెలిపాడు. మరికొద్ది సమయానికి అటుగా రెండు లారీలతో పాటు కొందరు యువకులు బైకులపై రావడంతో వారితో పాటు హారన్లు కొట్టుకుంటూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం వదంతులేనని ఫారెస్టు రేంజరు రాజుబాబు కొట్టిపారేస్తున్నారు. పులి కొండల్లో సంచరిస్తున్న మాట వాస్తవమేనని, ఘాట్‌రోడ్డుపైకి రావడం కేవలం వదంతులే అన్నారు. శ్రీరాంపురంలో దున్నపై దాడి జరిగిన ప్రాంతంలో ట్రాక్ కమెరాలు ఏర్పాటు చేశామని, ఆ పులి మళ్లీ అటువైపు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాని దిశ మార్చుకుని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దున్నను వేటాడి ఆహారం తీసుకుని సుమారు 30 గంటలు దాటుతోందని, మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి పులి ఆచూకీ తెలుసుకుని ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది, రెస్క్యూ టీమ్ అనుమానం వచ్చిన ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పులి పాదముద్రలు లభ్యం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. ఇందేశమ్మ వాక ఘాట్‌రోడ్డులో పులి తిరుగుతోందని అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వైపు ఎవరూ వెళ్లొద్దని గురువారం రాత్రి వాట్సప్ గూపుల్లో ప్రచారం జరిగింది. వేర్వేరు ప్రాంతాలల్లో పులి సంచరిస్తున్న వీడియోలను గ్రూపుల్లో అప్లోడ్ చేసి హడలెత్తిస్తున్నారు. దాంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అణుకు, అల్లుమియ్యపాలెం, రామచంద్రపురం, గూడెపులోవ, పందూరు, బంద, శ్రీరాపురం, తడపర్తి, బోనుకొత్తూరు గ్రామాలను పులిభయం వెంటాడుతోంది. ఒంటరిగా బైకులపై వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవి వైపు వెళ్లొద్దు... యలమంచిలి రూరల్ : రిజర్వ్ ఫారెస్ట్‌ను అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటవీశాఖ అధికారి రామ్ నరేష్ అన్నారు. శుక్రవారం పెదపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పులి ప్రవేశించడంతో ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదన్నారు. అడవిని ఆనుకొని ఉన్న రైతులు పశువులను ఇంటికి తరలించడంతో పాటు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెదపల్లి రిజర్వాయర్, కొక్కిరాపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పశువులను గ్రామానికి తరలించాలని సూచించారు. పులికి ఆహారం లభించు స్థలం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెదపల్లి ఆటవీ శాఖ ప్రాంతంలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు వెంకటపురం, పెదగొల్లలపాలెం, చిన గొల్లలపాలెంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆటవీ శాఖ అధికారులు రవి కుమార్, గోవిందు, ప్రభాకర్, మూర్తి పాల్గొన్నారు. (చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..) -
అర్ధరాత్రి పూట స్టేలు అవసరం ఏముంది: సన్యాసి పాత్రుడు
సాక్షి, అనకాపల్లి: వందల ఎకరాలు దానం చేశామని చెప్పుకుంటున్న అయ్యన్న రెండు సెంట్లు స్థలం కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. ఈ మేరకు నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆక్రమించిన రెండు సెంట్లు స్థలం రావనపల్లి రిజర్వాయర్ కాలువకు సంబంధించింది. అయ్యన్న ఆక్రమించిన స్థలంపై రిజర్వాయర్ కమిటీ మొదట్లోనే అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం తెలిపిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. వారివి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రెండు సెంట్లు స్థలం మీదే అయినప్పుడు ఎందుకు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పూట స్టేలు తెచ్చుకోవలసిన అవసరం ఏముంది. కోస్తా టైగర్ అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు దాక్కున్నారు. 276 సర్వేనెంబర్లో ఆక్రమించారని అధికారులు చెబుతుంటే మీరు 277 సర్వేనెంబర్ చూపిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి అయ్యన్న కుటుంబం భూములు ఇవ్వలేదు. మా తాత ముత్తాతలు ఇచ్చారు, దానిని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యన్న భార్య మహానటి సావిత్రిని మించి నటించింది. మేము పార్టీ మారినప్పుడు నన్ను నా కొడుకుని పంపించడానికి రౌడీలను పంపారని' చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. చదవండి: (పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
అయ్యన్న పాత్రుడు ఇంటి ముందు టీడీపీ నాయకుల డ్రామా
-
నర్సీపట్నంలో బయటపడ్డ అయ్యన్న బాగోతం
-
అత్యాచార బాధితురాలికి ఎమ్మెల్యే పరామర్శ
నర్సీపట్నం: అత్యాచారానికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శనివారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు సమకూర్చిన రూ.2 లక్షల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి, కోఅప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ నాయకులు చింతకాయల వరుణ్, గుడబండి నాగేశ్వరరావు, మామిడి శ్రీనివాసరావు, అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, బుజ్జి, లలిత ఉన్నారు. -
అయ్యన్నపాత్రుడిపై ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
-
ఆఘోర వేషధారణలో హల్చల్.. నగ్నంగా చిందులేస్తూ..
నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు. బుధవారం ఏకంగా టౌన్ స్టేషన్ ముందు హాల్చల్ చేశారు. చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..? చూసుకుందాం రండిరా అంటూ నగ్నంగా చిందులు వేశారు. పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్చల్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్ ముందు వీరంగం చేశారు. -
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
నర్సీపట్నం/నల్లజర్ల/: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌ని దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఆయనకు 41(ఎ) నోటీసు ఇచ్చేందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. తాడేపల్లిగూడెం సీఐ రఘు ఇద్దరు ఎస్ఐలతో కలిసి ఉదయాన్నే అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. చదవండి: బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా? అయ్యన్నతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో 3 గంటల పాటు నిరీక్షించారు. అయ్యన్నకి ఫోన్ కలపాలని ఆయన పీఏకు సీఐ సూచించగా.. స్విచ్ఛాఫ్ వస్తోందని పీఏ ఆయనకు బదులిచ్చాడు. అయ్యన్న ఎంతకూ రాకపోవడంతో చివరకు ఆయన ఇంటి గోడకు 41(ఎ) నోటీసు అంటించారు. అయ్యన్న మెయిల్ అడ్రస్‌కు నోటీసు ఫార్వర్డ్ చేసి, మరో 2 నోటీసులను పీఏకి ఇచ్చారు. టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
గూగుల్‌కు నర్సీపట్నం యువకుడి ఎంపిక.. భారీ వేతనం!
విశాఖపట్నం: స్థానిక వెలమ వీధికి చెందిన జయంతి విష్ణు యాష్ భారీ వేతనంతో సాఫ్ట్వేర్ కొలువుకు ఎంపికయ్యాడు. విష్ణు హిమచల్‌ప్రదేశ్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం యాక్సించర్ కంపెనీకి రూ.8.50 లక్షల వేతనంతో ఎంపికయ్యాడు. తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ సంస్థ రూ.47.50 లక్షలు వార్షిక వేతనంతో విష్ణును ఎంపిక చేసింది. విష్ణు తండ్రి సత్యనారాయణమూర్తి రిటైర్డ్ వార్డెన్, తల్లి వేదవల్లి గృహిణి, కుమారుడు గూగుల్ సంస్థకు ఎంపిక కావటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం
నర్సీపట్నం (విశాఖపట్నం): నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన .. ప్రతి దానిని గుద్దుకుంటూ అలజడి రేకెత్తించారు. ఘటన వివరాలిలాఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన సిద్ధూ, ఇఫ్రాన్, రోహిత్ చింతపల్లిలో 240 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. మహారాష్ట్ర తీసుకెళ్లేందుకు కారులో నర్సీపట్నం వైపు వస్తుండగా.. డౌనూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అపేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వచ్చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్ఐకు కారులో వస్తున్న గంజాయి స్మగ్లర్ల సమాచారం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబిద్‌సెంటర్ వద్ద పోలీసులు స్మగ్లర్ల కారును ఆపేందుకు ప్రయత్నించగా వృద్ధురాలికి డాష్ ఇచ్చి వేగంగా దూసుకెళ్లారు. శ్రీకన్య సెంటర్లో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ ఆపే ప్రయత్నం చేయగా.. బారికేడ్లను గుద్దుకుని వెళ్లిపోయారు. వెంటనే ఎస్ఐ ద్విచక్రవాహనంపైన, పోలీసు వాహనంతో సిబ్బంది గంజాయి కారును వెంబడించారు. గంజాయి స్మగ్లర్లు కారుతో ఎలా పడితే అలా దూసుకొస్తుండడంతో వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోయారు. స్మగ్లర్ల వాహనం, పోలీసు వాహనం ఒకదాని వెనుక మరొకటి వేగంగా దూసుకెళ్తుండడంతో సినిమా సీన్‌ను తలపించింది. కాగా, దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పెదబొడ్డేపల్లి వంతెన సమీపంలో కారును ఆపి వంతెన కింద ఉన్న కాలువలోకి దూకేశారు. దీంతో స్థానికులు, పోలీసులు వారిని చుట్టుముట్టారు. కాలువలోంచి ముగ్గురు స్మగ్లర్లను బయటకు రప్పించి స్టేషన్‌కు తరలించారు. -
అందరి చూపు.. రంగురాళ్ల వైపు!.. వారం రోజుల్లో కోట్ల వ్యాపారం
రంగురాళ్లంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖ ఏజెన్సీ.. అందులో నర్సీపట్నం ప్రాంతాలే. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఇక్కడికి సమీపంలో లభ్యం కావడమే ఇందుకు కారణం. నెల రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ.. అప్పట్లో మూసివేసిన క్వారీలన్నీ తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది. నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్‌వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయిన సంఘటన మరువక ముందే వారం నుంచి గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో సైతం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారింది. వారం రోజుల్లో సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఫారెస్టు, పోలీసు సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా సాగిస్తున్నారు. కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే ఇందుకు కేంద్రంగా మారింది. – నర్సీపట్నం కోట్లు కురిపించే క్వారీలు.. చెంతనే ప్రమాదాలు విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా మారాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. సిగనాపల్లి క్వారీలో సెల్‌సిగ్నల్స్ అందుబాటులో ఉండటం రంగురాళ్ల వ్యాపారులకు కలిసొచ్చింది. తవ్వకాలు జరుపుతున్న కూలీలు (ఫైల్) పోలీసు, అటవీ సిబ్బంది ఎవరు వచ్చినా ఇట్టే సమాచారం తెలుస్తుండడంతో సమయానుకూలంగా తవ్వకాలు సాగిస్తున్నారు. 1992–93లో పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో క్వారీ కూలి అప్పట్లో 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. కరక ప్రమాదం తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాష్ , జిల్లా పోలీసు, అటవీ అధికారులు రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తున్నారు. చదవండి: (ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్) నర్సీపట్నానికి చెందిన వ్యాపారి క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యాపారి వద్దకు వచ్చి రంగురాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిగనాపల్లి క్వారీలో లభ్యమైన రంగురాళ్లు సుమారు రెండు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి మరింత మంది అమాయకులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, అటవీ, రెవెన్యూ అధికారులు రంగురాళ్ల తవ్వకాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్ జరిపితే వదిలే ప్రసక్తి లేదు. లీజు క్వారీల వద్ద తప్ప మిగిలిన చోట్ల తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి రంగురాళ్ల తవ్వకాలకు వెళ్ళ వద్దు. ఎవరైనా వ్యాపారులు డబ్బులిచ్చి తవ్వకాలు జరపమని ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –మణికంఠ చందోలు, నర్సీపట్నం ఏఎస్పీ -
అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న వ్యాఖ్యలపై నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ నిరసన తెలిపింది. అయ్యన్న తీరును నిరసిస్తూ అబిద్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. చంద్రబాబు, అయ్యన్న దిష్టిబొమ్మలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దహనం చేశారు. అయ్యన్న పాత్రుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది. అయ్యన్నపై ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, ‘‘సీఎంపై అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు హేయమన్నారు. గత ప్రభుత్వంలో అయ్యన్న భూ దోపిడీకి పాల్పడ్డాడు. అయ్యన్న తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని’’ ఉమాశంకర్ గణేష్ అన్నారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
టీడీపీ నేత అయ్యన్న తనయుడి రచ్చ రచ్చ..
విశాఖపట్నం: వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. టీడీపీ నేతలకు కాళ్లు చేతులు ఆడట్లేదు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు నర్సీపట్నం ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అందుకే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.విజయ్ ఆదివారం మార్చి నెలకు సంబంధించి నిత్యావసరాల పంపిణీని అడ్డుకున్నారు. దురుద్దేశంతో ఆటంకం కలిగించారు. 26వ వార్డులో ఎప్పటి మాదిరిగానే వాహనదారుడు సరకులు పంపిణీ చేస్తుండగా విజయ్ అనుచరులు వ్యాన్ దగ్గరకు వెళ్ళి పంపిణీని అడ్డుకుని వ్యాన్‌ను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. డ్రైవర్ వద్ద ఉన్న రూ.10 వేల గురించి గొడవ చేశారు. అది నాలుగు రోజుల నుంచి నిత్యావసర సరుకులు అమ్మగా వచ్చిన సొమ్మని వ్యాన్ డ్రైవర్ పోలీసులకు వివరించారు. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పినప్పటికీ సంతృప్తి చెందని విజయ్ మున్సిపల్ కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలకు తెర తీశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా 26వ వార్డులో తన తల్లి పద్మావతి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులు, మున్సిపల్ కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రోడ్డు మీద పడుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఉపన్యసించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎలక్షన్లో ఎవరి వ్యూహాలు వారివి.. దీన్ని ఇంత రచ్చ చేయడం అనవసరమని పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. పట్టణ సీఐ హామీతో ఆందోళన విరమించిన అయ్యన్న పట్టణ సీఐ స్వామినాయుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ హామీ ఇచ్చినా చాలని అయ్యన్నపాత్రుడు పేర్కొనడంతో సీఐ స్వామినాయుడు మైక్ తీసుకుని మాట్లాడారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో పట్టణ ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు వేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో అయ్యన్నపాత్రుడు ఆందోళన విరమించారు. చదవండి: ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు.. పాచి పనులకు పోతారా? -
తప్పుగా మాట్లాడా.. క్షమించండి: డాక్టర్ సుధాకర్
సాక్షి, నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన ఎనస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఘటనకు సంబంధించి వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ యు.రామకృష్ణరాజు ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రావు మంగళవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. విచారణకు డాక్టర్ సుధాకర్ హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణిదేవి, ప్రసూతి వైద్యనిపుణులు గౌతమి, అప్పట్లో సూపరింటెండెంట్‌గా పనిచేసిన హెచ్‌వి.దొర, జనరల్ సర్జన్ సింహాద్రి, వైద్యులు, వైద్య సిబ్బందిని కోఆర్డినేటర్ విచారించారు. అనంతరం లక్ష్మణ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. రూల్ నంబర్ 20 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని డాక్టర్ సుధాకర్‌పై వచ్చిన అభియోగంతోపాటు ఆయన ప్రవర్తనపై విచారించామన్నారు. విచారణ నివేదికను కమిషనర్‌కు నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.. అవగాహన లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశా’ అని చెప్పారు. ‘నాకు తెలియకనే అలా మాట్లాడానని విచారణ అధికారికి విన్నవించాను.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని మాట్లాడలేదు.. ఆరోగ్యం బాగులేని కారణంగా ఆ రోజు అలా మాట్లాడాను తప్ప కావాలని కాదు’ అని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టు తెలిపారు. డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో మద్యం సేవించి నడిరోడ్డుపై న్యూసెన్స్ సృష్టించిన విషయం తెలిసిందే. -
నర్సీపట్నంలో పరువుహత్య కలకలం!
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో దుప్పటితో కట్టిన మృతదేహాన్ని స్తానికులు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం చెరువులో పడేసి నాలుగు రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడిని నర్సీపట్నంకు చెందిన గారా కిషోర్ గా గుర్తించారు. ఘటనను పరువుహత్యగా భావిస్తున్నారు. కిషోర్ గత కొంతకాలంగా ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని, ఇది ఇష్టం లేకే పరువుహత్య చేశారని కిషోర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, అబ్బాయి అడ్డు తొలిగించేందుకే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
స్థానికులే చేతులు కట్టేశారు
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మద్యం సేవించి స్థానికులు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులే చేతులు కట్టేశారని అడిషనల్ డీజీపీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డాక్టర్‌ను లాఠీతో కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు. వైద్యుల పరిశీలనలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయన ‘ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కామెంట్ సైకోసిస్’ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఇదిలావుండగా, డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిభాయి ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిపై అన్యాయంగా పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆరోపించారు. -
అనస్థీషియా వైద్యుడి వీరంగం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సీతమ్మధార (ఉత్తర): నర్సీపట్నం అనస్థీషియా (మత్తు) వైద్యుడు సుధాకర్ మరోసారి వీరంగమాడారు. జాతీయ రహదారిపై కారు ఆపి నానా హంగామా సృష్టించారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని తన ఇంటికి వెళుతున్నారు. మార్గంమధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై తన కారాపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడటం ప్రారంభించారు. దీంతో వారు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా వారిపై తిరగబడ్డాడు. చొక్కా విప్పి నడిరోడ్డుపై పడుకుని పోలీసుల్ని, స్థానికుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. డాక్టర్ ప్రవర్తనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణ చేతిలోంచి సెల్‌ను లాక్కుని రోడ్డుకేసి కొట్టారు. వైద్యుడిని అదుపు చేసేందుకు పోలీసులు అతని చేతులను తాళ్లతో కట్టారు. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించి ఎమ్ఎల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ రక్త నమూనాలు సేకరించి వైద్యులు రిఫర్ చేయడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించినట్టు ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ చెప్పారు. వైద్యుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, డాక్టర్‌ను లాఠీతో కొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు సీపీ ఆర్కే మీనా చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి: చంద్రబాబు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్‌పై జరిగిన దాడి.. దళితులపై దాడి, వైద్య వృత్తిపై దాడి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. -
అయ్యన్నా.. చౌకబారు విమర్శలు మానుకో
సాక్షి, నర్సీపట్నం : ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తే మాజీ మత్రి అయ్యన్నపాత్రుడుకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాపై అయ్యన్నపాత్రుడు రాజకీయం చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు అండగా నిలవాల్సిన అయ్యన్నపాత్రుడు తీరు పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు కరోనా కేసులు దాచిపెడుతున్నారని, పరిపాలన రాజధాన్ని విశాఖకు తరలిస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు రాజకీయం చేస్తున్నారన్నారు. కరోనా కేసులు దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న ఆయన గుర్తించుకోవాలన్నారు.కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్మోహన్రెడ్డిని జాతీయ మీడియా ప్రశంసించిన విషయాన్ని గుర్తించుకోవాలని హితువు పలికారు. ప్రజలకు సహాయపడకుండా టీడీపీ నాయకుడు చంద్రబాబు హైదరాబాద్, అయ్యన్నపాత్రుడు విశాఖలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పు తెలుగు వారి విజయంగా పేర్కొన్న అయ్యన్నపాత్రుడు తన పిల్లలను ఏ మీడియంలో చదివించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు మనవుడిని ఎక్కడ చదివిస్తున్నాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ నాయకులు, పెద్దలను అగౌరవ పరిచే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
మాజీ మంత్రిపై మరో కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, విధులకు ఆటంకం కలించారనే అభియోగాలపై ఆయనపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిలు పత్రాలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించేందుకు వెళ్లేక్రమంలో అయ్యన్నతన అనుచరులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం అబీద్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎటువంటి అనుమవతి లేకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అనుమతి లేకుండా సభ నిర్వహించడం.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన కారణంగా పోలీసులు ఆయనపై మరోసారి కేసు నమోదు చేశారు. (చదవండి : మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు) అంబేద్కర్‌ను అవమానించారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు ఆరుగుల్ల రాజుబాబు డిమాండ్ చేశారు. అయ్యన్న, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సోమవారం అబీద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేటప్పుడు చెప్పులు తీయకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఇందుకు టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మట్లాడినందుకు అయ్యన్నపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెయిల్) రౌడీషీట్ ఓపెన్ చేయాలి.. సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి అనే కనీసం గౌరవం ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ తీశారు. అయ్యన్న నోటి దురద తగ్గించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు పలికారు. చట్టంపై గౌరవంలేని అయ్యన్నకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఆయన కోర్టుకు విఙ్ఞప్తికి చేశారు. ఏడు నెలల కాలంలోనే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి బాట పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు
నర్సీపట్నం: పరుష పదజాలంతో పోలీసులను దూషించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ స్వామినాయుడు శనివారం చెప్పారు .ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన నివాసముంటున్న ఇంటిపైన వైఎస్సార్సీపీ జెండా కట్టడంతో ఈ నెల 12న ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అయ్యన్న నివాసం వద్దపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసుల విధులకు భంగం కలిగించి, అసభ్యకరంగా దూషించిన అయ్యన్నపై ఈ నెల 20న కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు
నర్సీపట్నం : మాజీ మంత్రి అయ్యన్న సోదరుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్సీపీలో చేరిన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు) తన ఇంటిపై పార్టీ జెండా కడుతుండగా అడ్డుతగలడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న కుటుంబంలో విభేదాలు నెలకొనడంతో ఇటీవల సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన అనుచరగణంతో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి మాదిరిగానే ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం ముహూర్తం చూసుకుని తాను నివాసముంటున్న ఇంటిపై సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ జెండా కడుతుండగా వరుసకు చిన నాన్నమ్మ అయిన పెదపాత్రుని లక్ష్మి, మరో బంధువు హర్ష వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న లక్ష్మి స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. తన ఇంటిపై జెండా కడుతుండగా అడ్డుకుంటున్నారని, అదేవిధంగా మాజీ మంత్రి తనయుడు విజయ్, మరో బంధువు హర్ష వల్ల తనకు ప్రాణహాని ఉందని వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా అస్వస్థతకు గురైన లక్ష్మి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు సన్యాసిపాత్రుడు, అయ్యన్న నివాసం వద్ద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపై అయ్యన్న దురుసుతనం కాగా ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్న విరుచుకుపడ్డారు. ‘తమాషాగా ఉందా.. మేం కోడితే ఏమిచేస్తావు నీవు.. మర్యాదగా వెళ్లిపొండి..పద్ధతి గల మనుషులము మేము..మా ఇంటికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా రాకూడదు..ఎవరిచ్చారు నీకు అనుమతి?’ అంటూ పోలీసులపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడుతూ దబాయించారు. -
నెల్లూరు జిల్లా టీడీపీకి మరో షాక్
-
టీడీపీకి వరుస షాక్‌లు
సాక్షి, నెల్లూరు/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు నచ్చక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నేత కువ్వారపు బాలాజీతో పాటు వందలాది మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. వీరిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు చూసి వైఎస్సార్సీపీలో చేరినట్టు ఈ సందర్భంగా కువ్వారపు బాలాజీ తెలిపారు. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, ఆడారి ఆనంద్ సమక్షంలో మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామానికి చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. నవరత్నాలు పథకాల ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. రైతు భరోసా, పింఛన్ల పెంపు, అమ్మఒడి పథకాలు ప్రవేశ పెట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. (చదవండి: వైఎస్సార్ సీపీలోకి ఆకుల, జూపూడి) -
2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ
సాక్షి, నర్సీపట్నం: రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కాగా, బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగుతోందన్న ఆరోపణలకు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీచేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. మరోవైపు ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: పవన్ పర్యటనలో టీడీపీ నేతలు) -
వైద్యుడి నిర్వాకం !
వైద్యుడ్ని దేవుడితో సమానంగా భావిస్తాం. రోగాన్ని నయం చేస్తే అతన్ని జీవితాంతం గుర్తించుకుంటాం. డాక్టర్‌కు ఉన్న గౌరవం సమాజంలో ప్రత్యేకం. కానీ ఓ వైద్యుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళలకు మత్తు మందు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్ జోక్యం చేసుకొని.. అనకాపల్లి నుంచి మరో మత్తు వైద్యుడ్ని రప్పించి ఆపరేషన్లను చేయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న మత్తు వైద్యుడు(ఎనస్తీషియా) సుధాకర్ వ్యవహారశైలి తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. గతంలో కూడా విధులకు సమయానికి రావాలంటూ హెచ్చరించిన సూపరింటెండెంట్‌ను గదిలో బంధించి తలుపులకు గడియ పెట్టేశారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పట్లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు గడవక ముందే మరో వివాదానికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏడుగురు గర్భిణులకు సోమవారం సిజరైన్ ఆపరేషన్లు చేసేందుకు గైనికాలజిస్టు గౌతమి సోమవారం ఏర్పాట్లు చేసుకొని ఆపరేషన్ థియేటర్లో మత్తునిచ్చే డాక్టర్ సుధాకర్ కోసం వేచి చూస్తున్నారు. థియేటర్‌కు వచ్చిన డాక్టర్ సుధాకర్ ముగ్గురుకి మించి మత్తు ఇవ్వలేనని మొండికేశారు. అయితే వెంటనే అపరేషన్లు చేయకుంటే గర్భిణుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని గైనికాలజిస్టుకు నచ్చచెప్పినప్పటికీ ఆయన పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ప్రసవ వేదనతో బాధపడుతున్న జి.ఉమాదేవి, ఎం.స్పందన, పి.సునీత, సీహెచ్.దేవి, ఎస్.మీనాక్షి, జి.భవాని తదితరులను విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు వైద్యులు సిద్ధపడడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో వైద్యులు లేకపోవటమేమిటని సిబ్బందిని నిలదీశారు. పరిస్థితిని బంధువులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మాకవరపాలెం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణలను చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. బాధితుల బంధువులకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు. కావాలనే ఆస్పత్రిలో కొంత మంది ప్రభుత్వానికి, తనకు చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని సూపరింటెండెంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. అక్కడ నుండే ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటనను, మత్తు డాక్టర్ నిర్వాకాన్ని వివరించారు. ఆస్పత్రిలో ప్రసవవేదనతో ఉన్న గర్భిణులకు అపరేషన్లు జరిగేలా చూడాలని కోరారు. డాక్టర్లు వచ్చే వరకు తాను ఆస్పత్రిలోనే ఉంటానని మంత్రికి వివరించారు. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన గైనికాలజిస్టు, మత్తు డాక్టర్ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆపరేషన్లు చేసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చచేలా చేశారు. దీంతో బంధువులు, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఊపిరి పీల్చుకున్నారు. మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రికి చెందిన కొందరు కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి, తనకు చెడ్డు పేరు వచ్చే విధంగా వీరు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మత్తు డాక్టర్ సుధాకర్‌పై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. ఏడుగురు మహిళలు సుఖప్రసవాలు పోసుకుని తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో ఆయన సంతోసం వ్యక్తం చేశారు. -
డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల తీరుపై వైఎస్సార్సీపీ స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమయానికి అనస్థీషియా డాక్టర్ లేకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నట్టు గమనించారు. దీంతో ఆపరేషన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే డాక్టర్‌ను రప్పించాలని ఆదేశించారు. దీంతో స్పందించిన యాజమాన్యం హుటాహుటిన చర్యలు ప్రారంభించింది. అనకాపల్లి నుంచి అనస్థీషియా డాక్టర్‌ను రప్పిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, డాక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే కూర్చున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా...
సాక్షి, నర్సీపట్నం: మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆదివారం పర్యటించారు. ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు,అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట వైసీపీ నేత కోనేటి రామకృష్ణ, కార్యకర్తలు ఉన్నారు. మత్స్యకార గ్రామాల్లో ఎమ్మెల్యే గొల్లబాబురావు పర్యటన: పాయకరావుపేట: మండలంలో మత్స్యకార గ్రామాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పర్యటించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. మత్స్యకారులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట వైసీపీ నేతలు చిక్కాల రామారావు, బాబురావు, సాయిబాబా ఉన్నారు. -
ఉన్నది 200 మంది.. కానీ రెండే గదులు
సాక్షి, నర్సీపట్నం(విశాఖపట్నం) : కస్తూర్బా పాఠశాలను తొలుత మాకవరపాలెం ప్రాథమిక పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య ప్రారంభించారు. దీంతో ఏళ్ల తరబడి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2015లో భీమబోయినపాలెం సమీపంలో కొండ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషించారు. ఇక నుంచి తమకు వసతి సమస్య తప్పినట్టేనని వారు సంబరపడ్డారు. కానీ ఈ కొత్త భవనంలో విద్యార్థులకు సరిపడిన గదులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ భవనం ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అదనపు గదులు నిర్మించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాలుగేళ్లయినా అలాగే.. ఈ పాఠశాలకు ప్రస్తుతం తొమ్మిది గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటిలో తరగతులు, ఒక గదిలో ఆఫీస్, మరో గదిలో కంప్యూటర్, స్టాఫ్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన రెండు గదులు మాత్రమే 200 మంది విద్యార్థులు రాత్రి సమయంలో నిద్రించేందుకు ఉన్నాయి. ఇవి చాలక విద్యార్థులు ఉన్న వాటిలోనే తమ సామగ్రిని పెట్టుకుని ఇరుకుగా పడుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం మరో రెండు గదులు డార్మెటరీకి, మూడు గదులు గ్రంథాలయం, ల్యాబ్‌కు అవసరం. మొత్తం ఐదు గదులు మంజూరు చేస్తే ఇక్కడి విద్యార్థులకు, సిబ్బందికి పూర్తిగా ఇబ్బందులు తొలగిపోతాయి. అయ్యన్న హామీ ఇచ్చినా.. ఈ పాఠశాలను ప్రారంభించిన అప్పటి మంత్రి అయ్యన్న కొండ ప్రాంతంలో నిర్మించడమేంటని అధికారులను ప్రశ్నించారు. అయితే భవనానికి రక్షణగా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు తారురోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదించాలన్నారు. గదుల కొరత కారణంగా మరో మూడు అదనపు గదులను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తామని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలోనే అప్పటిలో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల అనంతరం రోడ్డు పనులు చేపట్టారు. ఇక ప్రహరీ నిర్మాణం జరగలేదు. ఇక అదనపు గదుల హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో నిత్యం విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
నర్సీపట్నంలో ఓట్ ఫర్ జగన్ టీమ్ ప్రచారం
-
బయటపడిన టీడీపీ - జనసేన మైత్రి
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను నిజం చేసే సంఘటన ఒకటి ఈ రోజు చోటు చేసుకుంది. నర్సీపట్నం జనసేన రెబల్ అభ్యర్థి బైపీ రెడ్డి అశోక్ గురువారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అశోక్ బరిలో ఉంటే టీడీపీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని సమాచారం. మరోవైపు జనసేన అభ్యర్థి వేగి దివాకర్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. -
దిగ్విజయీభవ
సుమారు ఏడు నెలల క్రితం..నర్సీపట్నం.. హోరువాన..ఇప్పుడు.. ఆదివారం.. అదే నర్సీపట్నం.. మలమలమాడ్చేసే మండుటెండ..కానీ నాడూ.. నేడూ.. కనిపించిన దృశ్యం ఒక్కటే.. జనం.. జనం.. జనం.. అభిమాన నేతను చూడాలన్న ఆరాటం.. ఆయన చెప్పేది వినాలన్న ఉత్సుకత.. అవే.. నాడు భారీ వర్షాన్నీ.. నేడు మండుటెండనూ లెక్కచేయకుండా రోడ్డుపైకి రప్పించింది.అంతటి అపూర్వ ఆదరణ చురగొన్న ఆ నేత.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్సీపీ అధినేతగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల్లో ఉంటూ.. పోరాటాలు చేసిన ఆయన రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే కీలకమైన ఎన్నికల యుద్ధంలో ప్రచార శంఖం పూరించడానికి వచ్చినప్పుడు.. అశేష జనవాహిని సాక్షిగా.. నర్సీపట్నం అత్యంత ఆదరణతో అక్కున చేర్చుకుంది. దిగ్విజయీభవ.. అని నిండు మనసుతో ఆశీర్వదించింది. నిప్పులు చెరిగే ఎండలో అభిమాన జల్లులు కురిపించింది. జనం ఉత్సాహం.. కేరింతలతో ఉప్పొంగిపోయిన జననేత.. నర్సీపట్నం సాక్షిగా.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. అని నినదించారు. రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 3648 కి.మీ. పాదయాత్ర సందర్భంగా ‘మీ కష్టాలు చూశాను. మీ సమస్యలు విన్నాను.. ఇక అన్నీ నాకొదిలేయండి.. నాదీ భరోసా.. ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడుస్తాను.. కష్టాలు తీరుస్తాను’.. అని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఒటేయాలని అడిగే ముందు ఇదే నా పిలుపు.. విజ్ఞప్తి అని వినమ్రంగా చెప్పారు. ఎండ వేళ నడిరోడ్డుపై ఎండమావులు కనిపిస్తుంటాయి.. నీళ్లున్నట్లు భ్రమింపజేస్తాయి.. కానీ అక్కడ ఏమీ ఉండదు.. చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు కూడా ఆ ఎండమావుల్లాంటివేనని.. గత ఐదేళ్లలో ఆయన ఇచ్చిన వాగ్దానాల అమలు తీరు చూస్తే.. ఇదే అర్థమవుతుందని.. అందువల్ల వాటిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు తాత్కాలిక ప్రయోజనం కోసం.. ఓట్లు కొల్లగొట్టేందుకు ఇచ్చే డబ్బు మూటలకు మోసపోవద్దని సూచించారు.జిల్లాలో ఇటు నర్సీపట్నంలో నడిరోడ్డుపై వైఎస్జగన్ ప్రచార సభ జనప్రభంజనంతో హోరెత్తితే.. అటు విశాఖ నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు అట్టహాసంగా షామియానాలు, కుర్చీల వేసి మరీ నిర్వహించిన సభ జనాలు లేక బోసిపోయింది. పైగా సుదీర్ఘంగా.. సుత్తిలా సాగిన ఆయన ప్రసంగం వినలేక ప్రజలు మధ్యలోనే పలాయనం చిత్తగించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, నర్సీపట్నం: నర్సీపట్నం ప్రజలు విజయీభవ అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదిస్తూ తమ మద్దతు ప్రకటించారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు, ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీ వెంటే మేముంటామంటూ బాసటగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నర్సీపట్నంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సభకు జనం పోటెత్తారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ వేదికపైకి చేరుకున్న జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ గతంలో పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు వర్షం వచ్చినా, ఇప్పుడు మండుటెండ కాస్తున్నా లెక్చచేయకుండా వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సమయంలో తాను విన్న ప్రజల కష్టాలు, కళ్లారా చూసిన నష్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకపోవడంతో అనారోగ్యంతో ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలను చూశానని చెప్పారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల బాధలు, పిల్లల చదువుల కోసం ఆస్తులమ్ముకున్న కుటుంబాలను చూశానంటూ చెప్పుకొచ్చారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, సాగుకు రుణాలివ్వక ఇబ్బందులు పడుతున్న రైతన్నల బాధలను కళ్లారా చూశానన్నారు. రేషన్‌కార్డు నుంచి పింఛను మంజూరు వరకు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో దోచుకునే తతంగాన్ని చెవులారా విన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రజల బాధలే కాకుండా అధికారి వనజాక్షిని వేధింపులకు గురిచేయడం, తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని సైతం గొడ్డళ్లతో నరికి పొట్టన పెట్టుకుని అ«ధికార దాహంతో చట్టాలను సైతం పట్టించుకోకుండా అధికార పార్టీ బకాసురులు చేసిన ఘన కార్యాలయాలను ప్రజలకు వివరించారు. ఇంతటి ఘనకార్యాలు చేసిన జిత్తులమారి చంద్రబాబు ఎన్నికల్లో ప్రతి ఓటుకు మూడు వేల రూపాయలిచ్చి కొనుగోలు చేసి మళ్లీ సీఎం కుర్చీ ఎక్కేందుకు పన్నాగం పన్నుతున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాటికి లొంగిపోకుండా నిర్భయంగా వైఎస్సార్ పార్టీకి ఓటేసి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మీ అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. అవినీతి లేని పాలన కోసం, కుల పిచ్చిలేని పరిపాలన అందించేందుకు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే చదువుల భారం తల్లిదండ్రులపై లేకుండా ఎన్ని లక్షలు ఖర్చైనా అందరి పిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయడమే కాకుండా లంచాలనేవి లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ హామీ ఇచ్చారు. మహిళల రక్షణ, చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యం వంటి అన్ని రకాలైన వసతులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతామన్నారు. ప్రత్యేకహోదా సాధనతో పరిశ్రమలను తీసుకొచ్చి, వాటిలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ. 75 వేలు అందిస్తానన్నారు. ఈ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రుణాలన్నీ రద్దు చేసి, వడ్డీలేని రుణాలను అందిస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చారు. రైతులకు మే నెల నాటికే పెట్టుబడి కింద రూ.12, 500 అందిస్తానని హామీ ఇచ్చారు. తాను నవరత్నాలను ప్రకటించడంతో అవ్వా, తాతలకు చంద్రబాబు ఎన్నికలు దగ్గర చేసి పింఛను రూ. రెండు వేలు చేశాడు. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రూ.మూడు వేల వరకు పెంచుతానని హామీ ఇచ్చాడు. ప్రతి నాయకుడు, కార్యకర్త మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలని, పార్టీ ప్రకటించిన నవ రత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నర్సీపట్నం అసెంబ్లీ, అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పెట్ల ఉమాశంకర్ గణేష్, కె.సత్యవతిలకు ఆశీస్సులు అందించి గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అరకు ఎంపీ అభ్యర్థి గొట్టేటి మాధవి, అనకాపల్లి, యలమంచిలి అసెంబ్లీ అభ్యర్థులు గుడివాడ అమర్నా«థ్, కన్నబాబురాజు, భీమిలి, చోడవరం అభ్యర్థులు అవంతి శ్రీనివాస్, ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
నర్సీపట్నం వైఎస్ జగన్ సభలో జనసందోహం
-
సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తాం
-
ఉమశంకర్, సత్యవతిని దీవించండి: వైఎస్ జగన్
సాక్షి, నర్సీపట్నం : ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర భేరీ మోగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నర్సీపట్నం వేదికగా రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తామని, అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఎండ మావులను చూసి నమ్మకండి. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతోన్న యుద్ధం. విశ్వసనీయతకు వంచన మధ్య జరుగుతోన్న యుద్ధం. ఈ కురు క్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరి దీవెనలు వైఎస్సార్ సీపీకి కావాలి. ప్రతి ఒక్కరి సహకారం మాకు అవసరం. మీ అమూల్యమైన ఓటు వేసి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమశంకర్ గణేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సత్యవతిని గెలిపించాలని ఆయన కోరారు. చదవండి....(వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన..) వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ...‘పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల నడిచాను. 13 జిల్లాల ప్రజల కష్టాలు విన్నాను. ప్రతి కుటుంబం పడుతున్న బాధను కళ్లారా చూశాను. నాడు హోరున వర్షంలో పాదయాత్రలో వెంట నడిచారు. ఇవాళ మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలి వచ్చారు. నర్సీపట్నంలో మీ అందరి మధ్య ఈరోజు వైఎస్సార్ సీపీకి ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడిగే ముందు...మాకు అధికారం ఇస్తే....ఏం చేయదలచుకున్నామో చెబుతాను. ఆదుకోవాల్సిన 108 సకాలంలో రావడం లేదు. ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవు. 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. ఉద్యోగాలిస్తామని చెప్పి... ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళుతోంది. ప్రతి ఒక్కరి నష్టాన్ని కళ్లారా చూశా... రాష్ట్రంలో ప్రతి కష్టాన్ని చూశా.. ప్రతి నష్టాన్ని చూశా. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలను చూశాను. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పిల్లలను చూశాను. నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వైనాన్ని చూశాను. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నష్టాన్ని చూశాను. తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చూస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తాం. వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తాం. గిట్టుబాటు ధలు అందిస్తాం. అయిదేళ్లలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తా. అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ఎక్కడ చూసినా లంచాలే. మట్టి నుంచి ఇసుక దాకా దేన్నీ వదలకుండా దోచుకున్నారు. కుల పిచ్చి లేని పరిపాలన ఇస్తాను. జలయజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తాం. జన్మభూమి కమిటీలు రద్దు చేస్తా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం. ఈ ఎన్నికలలో ఒక జిత్తుల మారి నక్కతో యుద్దం చేస్తున్నాం. మోసాలు చేసే చంద్రబాబుతో తలపడుతున్నాం. ఎన్నికలను పురస్కరించుకుని ఆయన గ్రామాలకు డబ్బు మూటలను పంపిస్తారు. అనేక ప్రలోభాలు పెడతారు. ప్రతి ఓటరుకు రూ3 వేలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దని ప్రతి కుటుంబానికి తెలియచెప్పండి. అడ్డగోలుగా డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబు మోసాల గురించి వారికి తెలియ జేయండి. ఎన్నికల నాటికి డ్వాక్రా రుణాలు ఏమేరకు ఉన్నాయో ఆ రుణాన్ని నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. వడ్డీ లేని రుణాలను రైతులు, మహిళలకు అందిస్తాం. రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఏపీలో రేషన్ కావాలన్నా.. పెన్షన్ కావాలన్నా..లంచం . లంచాలు లేనిదే పని జరగదు. మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తుంది. ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. మా చిన్నాన్నను ఇంట్లో ఉండగా గొడ్డలితో నరికి చంపారు. మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే లాగినా పోలీసులు చర్యలు తీసుకోరు. మా ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అవినీతిమయమైన జన్మ భూమి కమిటీలను ఎత్తి వేస్తాం. పేదల చదవుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కేవలం రెండే రెండు సంవత్సరాలలో విద్యా రంగంలో ఏ విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామో మీరే చూస్తారు. ఏ కుటుంబం గానీ ఆస్తులు అమ్ముకునే దయనీయ స్థితి ఉండరాదు. వ్యవసాయం ఒక పండుగలా తయారు చేస్తాం. రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అయిదు సంవత్సరాలలోగా లక్షాధికారులను చేస్తాం. ప్రతి మహిళ ఆర్థిక స్థితి గతులను మెరుగు పరుస్తాం. ఏటా ఏపీపీఎస్సీ పరీక్షలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ఏపీ అభివృద్ది కావాలంటే ప్రత్యేక హోదా స్థాయి తప్పనిసరి. ఏపీకి హోదాను సాధించి అన్ని రంగాలు అభివృద్ధి అయ్యేలా చూస్తాం. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలలో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు లభించేలా కొత్తగా ఒక చట్టాన్ని రూపొందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి సాగు తాగు నీటి సదుపాయాన్ని కల్పిస్తాం. జలయజ్ఞానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. దళితులకు తోడుగా నిలుస్తాం.’ అని హామీ ఇచ్చారు. -
ఉద్దండుల పట్నం
సాక్షి, నర్సీపట్నం: నర్సీపట్నం నియోజకవర్గం మారుమూలగా ఉన్నా జిల్లాలో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో మంత్రి పదవులు లభించాయి. రాజుల కాలంలో కాంగ్రెస్‌ను ఆదరించిన ఓటర్లు, టీడీపీ ఆవిర్భావం తర్వాత అనేకసార్లు ఆ పార్టీకే పట్టం కట్టారు. ఆంగ్లేయులను ఎదురొడ్డి పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి ఉద్యమానికి ఊపిరులూదిన ప్రాంతంగా నర్సీపట్నం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏజెన్సీ ముఖద్వారంగా పేరుగాంచిన నర్సీపట్నం మారుమూలగా ఉన్నా.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కణ్ణుంచి ఎన్నికైన సాగి సూర్యనారాయణరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రి పదవులను అలంకరించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ విధంగా ఉన్నత పదవులు పొందిన నియోజకవర్గ నాయకులు జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో పనిచేశారు. తొలి ఎమ్మెల్యేగా సాగి సూర్యనారాయణరాజు చరిత్రలో నిలిచారు. ఇండిపెండెంట్‌గా రుత్తల లత్సాపాత్రుడు, రెడ్డి కాంగ్రెస్ తరపున బోళెం గోపాత్రుడు ఎన్నికయ్యారు. పదిహేనేళ్లు అప్రతిహతంగా ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీని నిలువరిస్తూ 2009లో బోళెం ముత్యాలపాప కాంగ్రెస్ తరపున గెలుపొందారు. అప్పట్లో నాతవరం మండలంలోని 20 గ్రామాలు, నర్సీపట్నం మండలంలోని పది గ్రామాలు, మూడు గ్రామాలు మినహా మాకవరపాలెం మండలం, పూర్తిస్థాయిలో కోటవురట్ల మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉండేవి. 2009 పునర్విభజన తరువాత చింతపల్లి నియోజకవర్గంలో ఉన్న గొలుగొండ మండలం, పూర్తిస్థాయిలో నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం మండలాలు నర్సీపట్నం నియోజకవర్గంలో కలిశాయి. కోటవురట్ల మండలాన్ని విడదీసి పాయకరావుపేట నియోజకవర్గంలో కలిపారు. నర్సీపట్నం అసెంబ్లీకి ఎన్నికైన నేతల వివరాలు కాలపరిమితి ఎమ్మెల్యే పార్టీ 1955 సాగి సూర్యనారాయణరాజు కాంగ్రెస్ 1962 రుత్తల లత్సాపాత్రుడు స్వతంత్ర 1967,1972 సాగి సూర్యనారాయణరాజు కాంగ్రెస్ 1978 బోళెం గోపాత్రుడు రెడ్డి కాంగ్రెస్ 1983,1985 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ 1989 సాగి కృష్ణమూర్తిరాజు కాంగ్రెస్ 1996 వేచలపు శ్రీరామ్మూర్తి టీడీపీ 1999,2004 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ 2009 బోళెం ముత్యాలపాప కాంగ్రెస్ 2014 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ వెనుకబడిన వర్గం ఓటర్లే ఎక్కువ! నియోజకవర్గంలో 80 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన ఓటర్లే ఉన్నారు. ఒకప్పుడు తంగేడు రాజుల ఆధిపత్యం ఉండగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక వెలమ సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. జనాభాలో అత్యధికంగా వెలమలు ఉండగా, ద్వితీయ స్థానంలో కాపులున్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపులున్నప్పటికీ ఇప్పటివరకు అత్యధిక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా వెలమల సామాజిక వర్గ నేతలే ఎన్నికయ్యారు. బీసీలతో పాటు ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ జనాభా కూడా ఈ నియోజకవర్గంలో పెరుగుతూ వస్తోంది. జనాభా 2,66,639 పురుషులు 1,31,538 స్త్రీలు 1,35,101 గ్రామీణులు 2,20,101 పట్టణవాసులు 46,538 విస్తీర్ణం 0.9 చదరపు కిలోమీటర్లు మండలాలు నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ రెవెన్యూ గ్రామాలు 107 పంచాయతీలు 85 మొత్తం గ్రామాలు 283 మొత్తం ఓటర్లు 2,12,028 పురుషులు 98,191 మహిళలు 1,03,020 ఇతరులు 17 పోలింగ్ కేంద్రాలు 262 పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా.. బ్రిటీష్ పాలనలో జిల్లా కేంద్రమైన విశాఖపట్నం తర్వాత ప్రముఖ పట్టణంగా గుర్తింపు పొందిన నర్సీపట్నం చాన్నాళ్లు గ్రామ పంచాయతీగానే కొనసాగింది. 2012లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన నర్సీపట్నం రాష్ట్రంలో అతి పురాతన రెవెన్యూ డివిజన్లలో ఒక్కటిగా గుర్తింపు ఉంది. బ్రిటీష్ కాలం నుంచి ఎందరో ప్రముఖులు సబ్ కలెక్టర్లు, ఏఎస్పీలుగా ఇక్కడ పనిచేయడంతో నర్సీపట్నానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. యువ ఐఏఎస్, ఐపీఎస్‌లు శిక్షణ అనంతరం తమ తొలి పోస్టింగ్ నర్సీపట్నంలో రావాలని కోరుకుంటూ ఉంటారు. నర్సీపట్నం కేంద్రంగా.. 1922–24 మధ్యకాలంలో ఏజెన్సీలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొనసాగించిన మన్యం పితూరీ పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటీష్ పాలకులు నర్సీపట్నం కేంద్రంగా పోలీస్, సైనిక చర్యలు చేపట్టారు. ప్రస్తుతమున్న ఏఎస్పీ, సబ్‌కలెక్టర్, రెవెన్యూ కార్యాలయ భవనాలు అప్పట్లో బ్రిటీష్ పాలకుల నివాస గృహాలు. అల్లూరి సీతారామరాజును కొద్దిరోజుల పాటు నర్సీపట్నంలో గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో నర్సీపట్నం పేరు చెప్పగానే నాడు అల్లూరి సాయుధ పోరాటానికి, నేడు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా గుర్తింపు పొందింది. పట్టుతగ్గిన టీడీపీ.. నర్సీపట్నం నియోజకవర్గం రాజకీయ, సినీ, కళా, సాంస్కృతిక, విద్యా రంగాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు అనేక పదవులు నిర్వహించిన తంగేడు రాజులు, సుమారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో కొనసాగుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఐదుసార్లు రాష్ట్ర కేబినేట్ మంత్రి పదవులు పొందారు . దివంగత సీఎం వైఎస్ నియోజవకర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. దీనిలో భాగంగా 2004లో బోళెం ముత్యాలపాపను బరిలో దింపడంతో మంత్రి అయ్యన్నపాత్రుడు ఘోర పరాజయం పొందారు. 2014లో మంత్రి అయ్యన్నపాత్రుడు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
నర్సీపట్నం, పాయకరావుపేటల్లో ఐటీ దాడులు
విశాఖపట్నం, నర్సీపట్నం, పాయకరావుపేట: నర్సీపట్నం, పాయకరావుపేటల్లో సోమవారం ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సీపట్నంలోని సౌత్‌సెంట్రల్ షాపింగ్‌మాల్, జ్యూయలర్స్‌పై దాడులు జరిపారు. రూరల్ జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సీపట్నంలో ఇటీవల వస్త్ర, బంగారు షాపులు అధిక సంఖ్యలో వెలిశాయి. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన సౌత్‌సెంట్రల్ షాపింగ్‌మాల్, నాయుడు, శాంతిసాయి జ్యూలయర్స్‌పై ఆదాయ పన్నుశాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సెంట్రల్‌మాల్‌ను మూసివేసి లోపల అధికారులు తనిఖీలు జరిపారు. పాయకరావుపేట పట్టణంలో ఉన్న సౌత్ సెంట్రల్ షాపింగ్‌మాల్‌లో కూడా ఆదాయ పన్ను శాఖ అ«ధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగాయి. యాజమాన్యం సమక్షంలోనే అధికారులు షాపింగ్‌మాల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్ తలుపులు మూసి వేశారు.ఈ మాల్లో వస్త్రవ్యాపారంతో పాటు, బంగారం వ్యాపారం కూడా జరుగుతోంది. ఐటీ అధికారుల దాడులతో ఈ రెండు పట్టణాల వ్యాపారుల్లో కలవరం మొదలైంది. -
మంత్రి గంటాపై మరో మంత్రి అయ్యన్న చిందులు
-
240వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, నర్సీపట్నం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 240వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సుబ్బరాయుడు పాలెం, చంద్రయ్య పాలెం, వజ్రగడ క్రాస్, తమ్మయ్య పాలెం, జోగివాని క్రాస్ మీదుగా ధర్మసాగరం క్రాస్ వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
ముగిసిన 239వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
టీడీపీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు
-
ధర్మసాగరం సెజ్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చింది : వైఎస్ జగన్
సాక్షి, నర్సీపట్నం : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. ధర్మసాగరం ప్రాంతంలో సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. నర్సీపట్నంను అభివృద్ధి చేసి మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతానన్న హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చెప్పారు. నీరుచెట్టు కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని చెరువుల్లో పూడిక తీసి మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు. చెరువులను తాటి చెట్టు లోతు తవ్వేసి ట్రాక్టర్ మట్టికి రూ.500 చొప్పున వసూలు చేస్తూ టీడీపీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నర్సీపట్నం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి 20 ఏళ్లకిందట వరాహ నదిపై దుక్కాడ వద్ద మొదలైన ప్రాజెక్టు ద్వారా నేటికీ నీరు అందుబాటులోకి రాలేదని అన్నారు. తుప్పుపట్టిన పైపులతో బురద నీరు వస్తోందనీ, నర్సీపట్నంలోని 65 వేల జనాభా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో డాక్టర్లు, నర్సులు లేని ఆస్పత్రులు దర్శనమిస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. 150 పడకలు గల ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, నర్సులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సర్కార్ దవాఖానాలో ఉండే అంబులెన్స్‌కు రోగులనుంచే డీజిల్ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన 82 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం లాక్కొందని ధ్వజమెత్తారు. ఆ స్థలంలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పిన బాబు... వాటిల్లో కూడా కమీషన్ నొక్కాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో పన్నుల బాదుడు ఎక్కువైందని ఆయన పేర్కొన్నారు. ఇంటి పన్ను కింద 800 కట్టాల్సి వస్తోందనీ, రూ.200 వచ్చే నీటి పన్ను వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. -
239వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, నర్సీపట్నం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం మెట్టపాలెం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్, కృష్ణాపురం, దుగ్ధ క్రాస్ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూల్
సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. నర్సీపట్నంలోని మెట్టపాలెం క్రాస్ రోడ్డు, బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం నర్సీపట్నం టౌన్‌లోని కృష్ణాపురం, దుగ్ధ క్రాస్ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పున: ప్రారంభమౌతుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘చంద్రబాబు అతిపెద్ద గజదొంగ’
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సోమవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆస్తులు పెంచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతున్న గజదొంగ చంద్రబాబు నాయుడని విమర్శించారు. అవసరాల కోసం ఏ పార్టీతోనైనా లాలూచీ పడే వ్యక్తిత్వం చంద్రబాబుదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్ కోడెల శివప్రసాద్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
నిత్య నరకం
విశాఖపట్నం, నర్సీపట్నం: పట్టణ జనాభా పెరిగింది. వాహనాల వినియోగం అధికమైంది. ప్రధాన రహదారులు అక్రమణకు గురయ్యాయి. వాహనాల రద్దీ పెరిగి ఫలితంగా ప్రధానరోడ్డులో అడుగడుగున వాహనల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను గురించి ఒక్క పోలీసులే కాస్తో కూస్తో పట్టించుకుంటున్నారు. ఇటు పురపాలక సంఘం అటు రోడ్లు భవనాలశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పెరిగిన వాహన రద్దీ.. పట్టణంలో జనాభా బాగా పెరిగింది. దాంతో పాటు పరిసర మండలాల నుంచి విద్య. వైద్య అవసరాలకు వేలాది మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లటానికి వందలాది ఆటోలు వస్తుంటాయి. పరిసర గ్రామాల నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోలు పట్టణానికి క్యూ కడుతున్నారు. నిత్యం ఇటు విశాఖ. తుని, చోడవరం, ఏâలేశ్వరం, చింతపల్లి వైపు బస్సులు, లారీలు, కారులు పట్టణం మీదుగానే వెళుతుంటాయి. అక్రమణతో ఇరుకుగా.. పట్టణంలోని శ్రీకన్య, పాతబస్టాండ్, అబిద్‌సెంటర్ ప్రధానమైన కూడల్లు. పెదబొడ్డేపల్లి నుంచి ఏరియా ఆసుపత్రికి వెళ్లే వరకు రోడ్లు అక్రమణకు గురయ్యాయి. ఫలితంగా రోడ్లు ఇరుకంగా మారాయి. మరోవైపు ఆటోలు, బస్సులు ఎక్కడబడితే అక్కడ ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ప్రధానరోడ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అడ్డదిడ్డంగా వాహనాలతో.. ప్రధానరోడ్ల మీద అడ్డదిడ్డంగా ఆటోలు ఆపటం, రోడ్డు అక్రమణకు గురికాటంతో వచ్చే పోయే వాహనాలకు బాగా అంతరాయం కలుగుతోంది. మరోవైపు ప్రధాన కూడళ్లలో ప్రజలు రోడ్డు దాటాలంటే గగనమైపోతోంది. పాదచారులు నడవటానికి రోడ్డు మార్జిన్ స్థలాన్ని పూర్తిగా అక్రమణకు గురికావడంతో ప్రజలు రోడ్డు నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు మీద నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేక.. ట్రాఫిక్ విధులకు వచ్చే పోలీసులు కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్అండ్బీ రోడ్లు అక్రమణకు గురైనా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అక్రమణలు తొలగించడానికి ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. పురపాలక సంఘం అధికారులు రోడ్డు మార్జిన్ పాట ద్వారా ఆదాయం కలిసివస్తుందనే ఉద్దేశంతో ప్రధానరోడ్డు స్థలాన్ని అక్రమించిన దుకాణదారులను ఏమీ అనడం లేదు.పాలకవర్గం సభ్యులు ఎన్నికై నాలుగేళ్లు కావస్తున్నా ఈ సమస్య వారికి పట్టలేదు. ఇప్పటికైనా వివిధ శాఖల అధికారులు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సమన్వయంతో ట్రాఫిక్క్రమబద్ధీకరిస్తాం పట్టణంలో ట్రాఫిక్ స మస్య చాలా జఠిలం గా మారింది. ఏఎస్పీ అ రిఫ్ హఫీజ్ ట్రాఫి క్‌పై ప్రధానంగా దృష్టిసారించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాలు, ము న్సిపల్ అధికారుల సమన్వయంతో అక్రమణలు తొలగింపు చేపడతాం. ఆటోలను కూ డా క్రమబద్ధీకరిస్తాం. అక్రమణలు తొలగిస్తే కొంత మేర ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది.–సింహాద్రినాయుడు, పట్టణ సీఐ, నర్సీపట్నం -
బయటపడ్డ చంద్రబాబు కుట్ర రాజకీయం
-
బాలికపై అత్యాచారం
నర్సీపట్నం: బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బలిఘట్టంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. బలిఘట్టం గ్రామానికి చెందిన బాలిక (9) ఆదివారం మధ్యాహ్నం అదే గ్రామంలోని మంచంశెట్టి రామకృష్ణ (32) దుకాణం వద్దకు సరకులు కొనుగోలుకు వెళ్లింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న రామకృష్ణ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు అమ్మమ్మకు తెలపడంతో ఆమె సోమవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. నిందితునిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
‘సాక్షి’ ప్రతినిధిపై టీడీపీ కౌన్సిలర్ కొడుకు దాడి
నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. జన్మభూమి కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ ప్రతినిధి అప్పలస్వామి నాయుడుపై టీడీపీ నాయకుడొకరు దాడికి దిగారు. వార్డు కౌన్సిలర్ బెన్నయ్యనాయుడు కొడుకు అశోక్ ‘సాక్షి’ ప్రతినిధిపై దాడి చేయడమేగాక ఫోన్ లాక్కుని దుర్భాషలాడారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కౌన్సిలర్ కుమారుడిపై నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆ రెండు చోట్ల పిడుగు పడే అవకాశం
అమరావతి: కాసేపట్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు 3 కి.మీల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి 3 కి.మీ పరిధిలోనూ పిడుగు పడే అవకాశముందని తెలిపింది. మార్కాపురం, నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. -
మావోల కలకలం: ప్రత్యేక బలగాలతో జల్లెడ
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం పట్టణంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి ప్రత్యేక బలగాలతో జల్లెడ పట్టారు. ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఏజెన్సీ ప్రాంతాల నుండి వందలాది మంది గిరిజనులు నర్సీపట్నం వస్తుంటారు. ఏజెన్సీ నుండి గంజాయి రవాణా కూడా నర్సీపట్నం మీదుగా జరుగుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ చౌదరి ప్రత్యేక బలగాలతో కెఎన్ఆర్. లాడ్జీ, వెంకటాద్రిలాడ్జి, కృష్ణాఫేలస్, ఫాలీమర్, సాయి రెసిడెన్సీ వూడా రెసిడెన్సీ, ఫణీచంద్రలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లాడ్జీల్లో ఉన్న కొంత మందిని విచారించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి సీఐ విచారిస్తున్నారు. ఈ దాడుల్లో పట్టణ ఎస్సై అప్పన్న, దామోదర్ నాయుడు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు. -
నా భర్తను విడిచిపెట్టండి
పిల్లలు, అత్తమామలతో ఏఎస్పీకార్యాలయానికి వచ్చిన బాధిత మహిళ నర్సీపట్నం: పోలీసులు అదుపులోకి తీసుకున్న తన భర్తను విడిచిపెట్టాలని కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ శివారు దబ్బలంకకు చెందిన గెమ్మిలి చిలకమ్మ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసింది. మూడు వారాల క్రితం వాయిదా నిమిత్తం కోర్టుకు వెళ్లిన తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి తన భర్త ఆచూకీ తెలియడం లేదని చిలకమ్మ తెలిపింది. సీపీఐ నాయకుల సహాయంతో డివిజన్ కేంద్రమైన నర్సీపట్నానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం ఆమె వచ్చింది. ఏఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కిందస్థాయి సిబ్బందికి వినతిపత్రం అందజేసింది. దబ్బలంక గ్రామానికి చెం దిన గెమ్మిలి సత్తిబాబు ఆలియాస్ బంద్ అనే గిరిజనుడు గత నెల 30న పాత కేసు వాయిదా నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల కోర్టుకు వెళ్లా డు. వాయిదాకు హాజరుకాకుండానే అడ్డతీగల పోలీసులు సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారు. వాయిదాకు వెళ్లిన భర్త సత్తిబాబు తిరిగిరాకపోవడంతో భార్య చిలుకమ్మ, సర్పంచ్ చంద్రకళను ఆశ్రయించింది. ఆమె సహకారంతో అడ్డతీగల వెళ్లి భర్త కోసం పోలీసులను ఆరా తీసింది. సత్తిబాబు తమ వద్ద లేడని, విశాఖ జిల్లా మంప పోలీసులకు అప్పగించామని వారు సమాధానం చెప్పినట్టు చిలకమ్మ తెలిపింది. తన భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించినా పోలీసుల నుంచి సమాధానం రాలేదని ఆమె వాపోయింది. అక్కడ నుంచి మంప పోలీసులను కలిసి తన భర్త కోసం అడగగా, సత్తిబాబుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, విచారించడం కోసమే అదుపులోకి తీసుకున్నామని మంప పోలీసులు చెప్పారని చిలకమ్మ తెలిపింది. విచారణ చేసి పంపిస్తామని మంప పోలీసులు చెప్పి 22 రోజులు కావస్తున్నా విడుదల చేయకపోవడంతో తాము ఏఎస్పీని కలిసేందుకు వచ్చామని తెలిపింది. తన భర్తకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. -
వంద పడకల ఆస్పత్రిలో ఆరుగురే వైద్యులు
నర్సీపట్నం (విశాఖపట్నం) : ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు పెద్దదిక్కుగా ఉన్న ఏరియా ఆసుపత్రిని వైద్యుల కొరత వెంటాడుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందక అవస్థలు పడుతున్నారు. ప్రధాన విభాగాలకు సంబం«ధించిన వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో చిన్నపాటి రోగానికి సైతం కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. వంద పండకలైనా.. పేరుకు వంద పడకల ఆస్ప‘తి అయినప్పటికీ అవసరమైన మేర వైద్యులను నియమించడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్న వైద్యులను సైతం ఇటీవల బదిలీ చేశారు. ఖాళీల భర్తీ విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించకపోవడం వల్ల వైద్యుల కొరత ఏర్పడింది. ఏరియా ఆసుపత్రిని మానస పుత్రికగా చెప్పుకునే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం వైద్యాధికారుల పోస్టుల భర్తీపై దష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రథమస్థానంలో ఉన్నా.. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అందించడంలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉండేది. అటువంటి ఆసుపత్రిని వైద్యుల కొరత వెంటాడుతోంది. పది మండలాల నుంచి రోజుకు వందల సంఖ్యలో రోగులు నిత్యం ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యుల కొరత కారణంగా వైద్యసేవలు అందక చాలా మంది రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వంద పడకల స్థాయికి సరిపడా వైద్యులు లేరు. రేపోమాపో 150 పడకల వరకు స్థాయికి పెరగనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రూ.కోట్ల వెచ్చించిన పడకలు సైతం నిరుపయోగంగా మారనున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమస్యలు పట్టని కమిటీ పరిసర ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు, జనరల్ వ్యాధులతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల, జనరల్ ఫిజిషియన్ వైద్యులను నియమించకపోవడంతో రోగులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అయ్యన్నపాత్రుడే ఆసుపత్రి అభివద్ధి కమిటీ చైర్మన్‌గా ఉండేవారు. ప్రతి మూడు నెలలకు సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిని సమీక్షించేవారు. మంత్రికి పనిఒత్తిడి అధికం కావడంతో ఇటీవల ఆసుపత్రి ఆభివద్ధి కమిటీ బాధ్యతలను పట్టణానికి చెందిన సీనియర్ వైద్యాధికారి సుశీలకు అప్పగించారు. కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టి సుమారు ఏడాది కావస్తున్నా పర్యవేక్షణ గాలికి వదిలేశారన్న పలువురు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి అయ్యన్నపాత్రుడు దష్టిసారిస్తే తప్ప వైద్యుల నియామకం జరగని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పది మండలాల ప్రజలు కోరుతున్నారు. -
200 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్‌కౌంటర్‌పై గొంతు నొక్కేసిన పోలీసులు
వివరాలు వెల్లడిస్తే మావోయిస్టు సానుభూతిపరులుగా కేసు ఫోన్లో సీఐల హెచ్చరికతో ప్రెస్మీట్నుంచి వెనుదిరిగిన సర్పంచ్‌లు నర్సీపట్నం: పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై పోలీసులు గొంతు నొక్కేస్తున్నారు. ప్రజాప్రతినిధులను మాట్లాడనీయకుం డా బెదిరిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై గోడు వినిపించుకునేందుకు శుక్రవారం నర్సీపట్నంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి వచ్చిన ఇద్దరు ఏజెన్సీ ప్రాంత ఇద్దరు సర్పంచ్‌లను పోలీసులు ఫోన్లో హెచ్చరించడంతో ప్రాణభయంతో వెళ్లిపోయారు. కొయ్యూరు మండలం పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై తమ గోడును వెల్లబుచ్చేందుకు, పోలీసుల తీరును తెలిపేందుకు నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు లోకుల గాంధీ ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు సీఐలు ఆయా సర్పంచ్‌లకు ఫోన్ చేశారు. ప్రెస్‌మీట్ ఆపి పోలీసుస్టేషన్‌కు రాకపోతే మావోయిస్టు సానుభూతిపరులని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో వారు అటు పోలీసులకు ఇటు మావోయిస్టులకు మధ్య నలిగిపోతున్నామని, సర్పంచ్‌లకే రక్షణ లేకపోతే పంచాయతీల్లోనున్న మారుమూల శివారు గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చేతులెత్తి నమస్కరించి స్టేషన్‌కు వెళ్లారు. ఇదిలావుండగా ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, గిరిజనుల కథనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్కౌంటర్ సమయంలో ఒడిశా ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆడవిలోకి వచ్చినట్టు గిరిజనులు చెబుతున్నారు. వీరిని మిలీషియా సభ్యులు అనుకొని పోలీసులు కాల్పులు జరపగా, ఇద్దరు చనిపోగా, ఒకరు తప్పించుకున్నారు. రెండు చేతులు కోల్పోయిన ఇరుముళ్ల అనే వ్యక్తి మఠంభీమవరంలోని చర్చి వద్ద ఏడుస్తూ కనిపించాడు. గ్రామస్తులు ఆరాతీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇదే విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో ఎన్కౌంటర్ పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఊహించిన పోలీసులు, మావోయిస్టులనుంచి మీకు ముప్పు ఉందంటూ గ్రామానికి చెందిన కొంతమందిని కేడీపేట పోలీసుస్టేషన్‌కు తరలించడం తెలిసిందే. విడుదలైన వారిలో కొందరు నర్సీపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు సిద్ధపడ్డారు. పోలీసు హెచ్చరికలతో వెనుదిరిగారు. -
రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్
విశాఖపట్నం: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. ఇంటిపన్నులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్.. వైఎస్ఆర్ సీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. కమిషనర్ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. -
1600 కిలోల గంజాయి పట్టివేత
నర్సీపట్నం : విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు 1600 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టగా.. ఐచర్ లారీలో తరలిస్తున్న 40 బస్తాల గంజాయి (1600 కిలోలు) రవాణా వెలుగు చూసింది. సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని చింతపల్లి నుంచి తుని రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది. -
500 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టిన అధికారులు 500 కేజీల గంజాయి పట్టుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. -
బొలెరో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం తురుబాల గడ్డ శనివారం మధ్యాహ్నాం ఓ బొలెరో వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పట్టణంలోని డీఎంకే కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు బొలెరో వాహనంలో లంబసింగి పర్యాటక ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
65 కిలోల గంజాయి పట్టివేత
నర్సీపట్నం (విశాఖపట్నం) : మూడు వాహనాల్లో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని డిగ్రీ కళాశాల సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 65 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఒక ఆటో, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
800 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : నర్సీపట్నం మండలం పెదబోడ్డేపల్లి సమీపంలో పోలీసులు శనివారం అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి కారు డ్రైవర్ పరారైయ్యాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 80 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
20 నుంచి గ్యాప్ ఏరియా భూముల సర్వే
నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు నాతవరం : గ్యాప్ ఏరియా భూముల సర్వే ఈ నెల 20 నుంచి చేపట్టనున్నట్టు నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు తెలిపారు. బుధవారం ఆయన సరుగుడు పంచాయతీలోని గ్యాప్ ఏరియా భూములను పరిశీలించారు. దీనిపై సుందరకోట, అసనగిరి గ్రామాల్లో గిరిజనులతో మాట్లాడారు. అనంతరం సుందరకోట ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరపాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామస్తులనుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సరుగుడులో సర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. బండి గంగరాజు తదితరులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లేటరైట్ విషయంలో నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కనకారావును ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం ఐదో షెడ్యూల్ ఏరియాతోపాటు, పీసాచట్టం పరిధిలో ఉందన్నారు. గ్యాప్ ఏరియా భూములను ప్రైవేట్ వ్యక్తులకు గాని, ఫ్యాక్టరీలకు కేటాయిస్తేనే ఈ ప్రాంత గిరిజనుల అంగీకారం అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గ్యాప్ ఏరియా భూములు ఎక్కువగా ఉన్నాయన్న అటవీశాఖ నివేదించడం వల్ల సర్వేకు కలెక్టర్ ఆదేశించారన్నారు. ఈ ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ యువరాజ్, జేసీ జనార్ధన్ నివాస్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ టీవీఎల్ రాజు, సర్వేయర్ గిరిప్రసాద్ పాల్గొన్నారు. -
గుట్టల్లో... గుట్టుగా
ఏటా కొండలను గుల్లచేస్తూ సాగించే రంగురాళ్ల తవ్వకాలు సాలూరు ఏజెన్సీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా పట్టించుకోకుండా ఎప్పటిలాగే పలుగుపార పట్టుకుని కొండలను తొలిచేస్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారం సాగుతుండడంతో వ్యాపారులే కూలీలను నియమించి తవ్వకాలు సాగిస్తున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా కూలీలు, వ్యాపారులు వెరవడంలేదు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన వర్తకులు వెనక ఉండి చక్రం తిప్పుతున్నారు. సాలూరు/సాలూరు రూరల్: చినుకుపడితే చాలు ఏజెన్సీలో రంగురాళ్ల జాతర ప్రారంభమవుతుం ది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండప్రాం తంలో మట్టి వదులుగా మారడంతో రంగరాళ్ల కోసం తవ్వకాలు ప్రారంభించారు. సాలూరు ఏజెన్సీతో పాటు ఒడిశా రాష్ట్రంలోని సుంకి వద్ద ఈ తవ్వకాలు జోరుగా సాగుతు న్నాయి. మట్టిపెళ్లలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నా కూలీలు భయపడడం లేదు. మండలంలోని సారిక పంచాయతీలోని సొంపిగాం స మీపంలోనున్న బంగారుగుడ్డి, సంపంగిపాడు పంచాయతీలోని పుల్లమామిడి సమీపంలోనున్న తండికొండ, రూడి గ్రామం సమీపంలోని హనుమాన్‌కొండ, దండిగాం కొత్తూరు సమీపంలోని సూరన్నకొండలతోపాటు బట్టివలస సమీపంలోని ఎత్తై కొండలతోపాటు దొరలతాడివలస సమీపంలోని గుట్టల్లోనూ, దుగ్దసాగరం డిపట్టా భూముల్లో కూడా విలువైన రంగురాళ్లున్నాయి. ప్రస్తు తం తండికొండ, హనుమాన్‌కొండ, దొరలతాడివలస, బట్టివలస ప్రాంతాలలో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ రాకను గమనించిన తవ్వకందారులు పరుగందుకుని కొండలెక్కారు. రూ కోట్లలో వ్యాపారం రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా బేఖాతరుచేస్తున్నారు. కేట్ ఐ, మూన్ స్టోన్ తదితర రకాల రంగురాళ్లు ఎక్కువగా లభ్యమవుతుండడంతో ఈ ప్రాంతంపై వ్యాపారులు దృష్టి పెట్టారు. వీటి పరిమాణం, నాణ్యతనుబట్టి వేల రూపాయల నుంచి రూ. లక్షల్లో ధర పలుకుతున్నాయి. స్థానిక వ్యాపారులు తవ్వకందారుల నుంచి రంగురాళ్లను కొనుగోలుచేసి బడావ్యాపారులకు చేరవేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కోటి రూపాయలకు పైనే వ్యాపారం జరిగినట్టు తెలిసింది. బయటకుమాత్రం ఇదో కక్కుర్తి వ్యాపారంలా, గిరిజనులకు ఉపాధి మార్గంలా కనిపిస్తున్నా, అక్రమ వ్యాపారుల పాలిట కామథేనువుగా మారింది. నర్సీపట్నం వ్యాపారులే కీలకం స్థానికంగా లభ్యమవుతున్న రంగురాళ్ల కొనుగోలులో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ఇద్దరు వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకవ్యాపారి గతంలో లాడ్జిలో మకాంవేసి లావాదేవీలు నిర్వహించేవాడు. కానీ గత రెండేళ్లగా పోలీసులు నిఘా అధికమవడంతో తన సమీప బందువు ఇంట్లో తిష్టవేసి చక్రం తిప్పుతున్నాడు. అలాగే మరోవ్యాపారి సాలూరు, రామభద్రపురం తదితర ప్రాంతాల లాడ్జీలలో ఉంటూ స్థానిక వ్యాపారుల నుంచి రంగురాళ్లను కొనుగోళు చేస్తున్నాడు. విఫలమవుతున్న పోలీసు రంగురాళ్ల తవ్వకాలను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమతున్నారు. ఏజెన్సీప్రాంతంలోని ఎత్తై కొండలపై తవ్వకాలు జరగుతుండడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నారు. ప్రయాసపడి వెళ్లినా వీరి రాకను పై నుంచి గమనించి, కూలీలు పారిపోతుండడం పరిపాటైంది. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. -
తప్పు చేస్తే ఉరేసుకుంటా
నర్సీపట్నం (విశాఖ) : తాను ఎప్పడూ తప్పు చేయలేదని, అలా చేస్తే ఉరేసుకుంటానంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి అయ్యన్న పాత్రుడు పత్రికలపై మరోమారు దండెత్తారు. ఆయన మంగళవారం నర్శీపట్నంలో నవ నిర్మాణదీక్షను ప్రారంబించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పత్రికల్లో తనపై ఆవాస్తవాలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. -
నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు దాడులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. దీని విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. (నర్సీంపట్నం) -
నర్సిపట్నంలో వైఎస్సార్ సీపీ సమావేశం
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం సోమవారం నర్సిపట్నంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ నేరవేర్చని హామీలు, తుపాను సాయం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ఈనెల 5న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలకు సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. -
నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం
విశాఖపట్నం: సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు గుల్లిపాడు - నర్సీపట్నం మధ్య నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నగరానికి చేరవలసిన గోదావరి, విశాఖ, గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ తుని వద్ద నిలిచిపోయాయి. దీంతో సదరు రైళ్లలోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గూడ్స్ ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. -
నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. రెండు వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 8.5 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. -
మహిళపై హత్యాయత్నం?
కొడవటిపూడిలో కలకలం ముగ్గురిని బంధించిన గ్రామస్తులు వీరిని ప్రోత్సహించారన్న ఆరోపణపై మరో మహిళ అరెస్టు పలు సెక్షన్ల కింద కేసుల నమోదు కోటవురట్ల : కొడవటిపూడిలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు కలక లం సృష్టించాయి. గ్రామస్తులు నిందితులను బంధించడంతో పోలీసులు వచ్చి వారిని విడిపించాలని ప్రయత్నించినా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం...మండలంలోని కొడవటిపూడిలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు మహిళలతోపాటు మరో వక్తి వ చ్చి తలుపు తట్టారు. సాయిలక్ష్మి తలుపు తెరవగానే ఇద్దరు మహిళలు ఆమె మెడకు చున్నీ విసిరి దగ్గరకు లాగారు. ఇంతలో సాయిలక్ష్మి ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆ ముగ్గురినీ పట్టుకుని రామాలయంలో బంధించారు. సమాచారం అందుకున్న కోటవురట్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురినీ విడిచిపెట్టాలని కోరినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో బుధవారం ఉదయం నర్సీపట్నం రూరల్ సీఐ దాశరథి, ఇద్దరు ఎస్‌లతో వచ్చి బందీల వివరాలను ఆరా తీశారు. వారిలో సంతాభక్తల అనూష (జంగారెడ్డిగూడెం), కర్రిఆనంద మోహనరావు (బిల్లనందూరు, కోటనందూరు మండలం), ఎం.అనూష (మల్లవల్లి, కృష్ణాజిల్లా) ఉండగా, వీరు ముగ్గు రూ పాయకరావుపేట జీఎస్ఎస్ సంస్థలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. నిందితులను పోలీసు స్టేషనుకు తీసుకెళ్తామంటూ జీపులో ఎక్కించేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గుర్తించిన ఆయన ఏఎస్పీ విశాల్‌గున్నికి సమాచారం అందించడంతో, ఆయన ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ వర్మ సహా మరో నలుగురు ఎస్ఐలు, పోలీసు బలగాలు గ్రామానికి తరలివచ్చారు. బందీలను విడిచిపెట్టేందుకు గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో గ్రామపెద్దలతో చర్చించారు. చివరకు బాధితురాలికి న్యాయం చేస్తామన్న హామీతో బందీలను పోలీసులకు అప్పగించారు. సీఐ దాశరథి మాట్లాడుతూ ముగ్గురిపైనా హత్యాయత్నం, అత్యాచార యత్నం, కిడ్నాప్ నేరాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. సాయం చేయాలని వచ్చాం: నిందితులు సాయిలక్ష్మిపై హత్యాయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనందమోహనరావు, ఎం. అనూష, ఎస్.అనూష మాత్రం, తాము పాయకరావుపేటలోని జీఎస్ఎస్ సంస్థలో పని చేస్తున్నామని, సాయిలక్ష్మికి సాయం చేయాలనే తలంపుతో ఆమె వద్దకు వస్తే తప్పుగా అర్థం చేసుకున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. ఆనందరావు అన్యాయం చేశాడంటూ సాయిలక్ష్మి పోలీ సులను ఆశ్రయించిన నేపథ్యంలో వివాదం పెద్దది కాకుండా చర్చించాలన్న ఉద్దేశంతో వచ్చామే తప్ప, ఉపాధి కోసం చిరు ఉద్యోగాలు చేసే తాము హత్యచేయాలని మాత్రం రాలేదని చెప్పారు. విచారణ అనంతరం ముగ్గురు నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనందరావు అక్క బావిశెట్టి లక్ష్మిని కూడా రప్పించి అరెస్టు చేసి కోటవురట్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు సాయిలక్ష్మికి, బావిశెట్టి ఆనందరావులకు వివాహం చేస్తామని సీఐ దాశరథి హామీ ఇచ్చారు. కేసు పరిష్కారం కోసం పోలీసులు జరిపిన చర్చల్లో ఎమ్మెల్యే అనిత భర్త శివ, సర్పం చ్ బాలేపల్లి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యుడుపైల రమేష్, లాలం కాశీనాయుడు పాల్గొన్నారు. తెర వెనుక కథ ఇదీ! సాయిలక్ష్మి, అదే గ్రామానికి చెందిన ఆనందరావు 2000లో ప్రేమించుకున్నారు. వారి వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 2003లో సాయిలక్ష్మి రాజమండ్రికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన వారం రోజుల్లోనే ప్రియుడు ఆనందరావు సాయిలక్ష్మిని తనవద్దకు తీసుకొచ్చేశా డు. అనంతరం సాయిలక్ష్మి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆనందరావు ఓ గుళ్లో తాళికట్టి, అదే గ్రామంలో కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు అ న్నిటిలో నూ ఓ కుటుంబంగానే నమోదైంది.అయితే ఇటీవల ‘నీకూ నాకూ ఏ సంబంధం లేద’ంటూ ఆనందరావు సాయిలక్ష్మిని తరిమేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆనందరావుకు అక్క అయిన బావిశెట్టి లక్ష్మి ఆమెకు సన్నిహితుడైన పాయకరావుపేట గ్రామ స్వరాజ్య సమితి(జీఎస్ఎస్) ప్రతినిధితో కలిసి తనపై పై ముగ్గురిని ఉసిగొల్పి హత్యాయత్నానికి ప్రయత్నించిందని బాధితురాలు సాయిలక్ష్మి పోలీసుల విచారణ సందర్భంగా ఆరోపించింది. -
నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. -
సాక్షి టీవీ విలేకరి రమణకు గాయాలు
విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం సాక్షి టీవీ విలేకరి రమణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రోడ్డు పక్కన నిలబడిన ఆయనను ఓ బైకిస్టు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన రమణను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం
విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ పాము కలకలం రేపింది. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షంగా కావటంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం పామును బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు పెద్దబొడ్డేపల్లి వద్ద ఉన్న డాన్‌బాస్కో కాలేజ్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో గత నెల 6,11 తేదీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. -
అనకాపల్లి, నర్సీపట్నంలో విజయమ్మ పర్యటన రద్దు!
విశాఖపట్నం: అనకాపల్లి, నర్సీపట్నంలో వైఎస్ విజయమ్మ పర్యటనలను రద్దు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనకాపల్లి, నర్సీపట్నంలో విజయమ్మ పర్యటించాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విజయమ్మ పర్యటనను రద్దు చేశారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా విశాఖపట్నం, విజయనగరం, కోస్తాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఓ సభలో వర్షంలోనే తడుస్తూ విజయమ్మ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అనకాపల్లి, నర్సీపట్నంలో విజయమ్మ పర్యటించే షెడ్యూల్ ను త్వరలోనే పార్టీ ప్రచార కమిటీ విడుదల చేస్తారు. -
రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో బాబుకు తెలుసా?:జగన్
విశాఖపట్నం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మన రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం చొప్పున మూడున్నర కోట్ల ఉద్యోగాలు చంద్రబాబు ఇస్తాడట అని ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలు తాను ఇవ్వనని చెప్పారు. నర్సీపట్నంలో జరిగిన వైఎస్ఆర్ సిపి జనపథం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బాబు హయాంలో పింఛన్ డబ్బులు కోసం అష్టకష్టాలు పడ్డ అవ్వ,తాతలను చూశానని, విద్యార్థుల చదువుల కోసం పొలాలు అమ్ముకున్న తల్లిదండ్రులను చూశానని చెప్పారు. నాటి భయానక రోజులు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉన్నాయన్నారు. చంద్రబాబు హయాంలో నిజాయతీ ఎక్కడుందా అని టార్చ్‌లైట్ పెట్టి వెతికినా కనబడని రోజులవన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు పెట్టించిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ఆల్ ఫ్రీ అంటూ మళ్లీ చంద్రబాబు మన ముందుకు వస్తున్నాడని హెచ్చరించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎన్నికలొస్తే చాలు ఆయన ఫొటో బయటకు తీస్తాడన్నారు. మరో 45 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎన్నికలు రాబోతున్నాయని, మనం ఓటేసే ముందు మనకు మనమే ప్రశ్నించుకోవాలని అన్నారు. ఏ నాయకుడయితే ప్రజల గుండెచప్పుడు వింటాడో అలాంటి నాయకుణ్ని మనమంతా కలసి కట్టుగా ఎన్నుకోవాలన్నారు. విశ్వసనీయత అనే మాటకు అర్థం తీసుకొచ్చింది మహానేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆయనకు ముందు తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులొచ్చారని, అయినా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలనేలా ఆ మహానేత తన పాలన సాగించారన్నారు. ఇంకా ఆయన ప్రసంగం...నాకు ఏదయినా వారసత్వం వల్ల వచ్చింది అంటే అది విలువలు, విశ్వసనీయత అని చెప్పగలను. అధికారంలోకి రాగానే రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు చేస్తాను. బడికి పంపించే తల్లులకు భరోసా ఇస్తున్నాను. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున, ఇద్దరికీ రూ.1000లు ఆ తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాం. ఇదే నా తొలి సంతకం. నా రెండో సంతకం అవ్వతాతల కోసం పెడతా. రూ.200 ఉండే పింఛన్‌ను రూ.700 చేస్తా. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ ఫండ్‌పై నా మూడో సంతకం చేస్తా. రైతులకు భరోసా కల్పిస్తా. డ్వాక్రా రుణాల రద్దుపై నా నాలుగో సంతకం. అడిగిన వారికి ఏ కార్డు కావాలో ఆ కార్డును 24 గంటల్లో ఇచ్చేలా చేస్తా. దీనిపైనే నా ఐదో సంతకం. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తా. 2019 కల్లా కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తా. పగటిపూటే రైతన్నకు 7 గంటల కరెంట్ ఇచ్చేలా చేస్తా. ఉద్యోగం కోసం తిరిగే పేద పిల్లలకు కచ్చితంగా ఉద్యోగం వచ్చేలా కృషిచేస్తా. విలువలు, విశ్వసనీయత - కుళ్లు, కుతంత్రాల మధ్య ఈనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. -
నర్సీపట్నంలో 137 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తనిఖీలలో నిర్వహాణలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయితోపాటు రెండు బైకులను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు మంగళవారం నర్సీపట్నంలోని డిగ్రీ కళాశాల వద్ద తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల వేఢీ
విశాఖపట్నం : జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నమొన్నటివరకు సమైక్య ఉద్యమాలతో అట్టుడికిన జిల్లా ఇప్పుడు రాజకీయసందడితో రంజుగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికలు, ఆ వెంటనే అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాజకీయపార్టీలు పోటాపోటీగా గ్రామాల్లో ఇప్పటినుంచే ప్రచార వ్యుహా లు రచిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లతో ప్రభుత్వ కార్యాలయాల్లో బిజీ వాతావరణం నెలకొంది. రానున్న సాధారణ ఎన్నికలకోసం మొత్తం 3,506 పోలింగ్స్టేషన్లను అధికారులు ఖరారుచేశారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 40 పోలింగ్ కేంద్రాలు అదనంగా పెరిగాయి. అవసరమైన ఈవీఎంలు 16వేలు దఫదఫాలుగా జిల్లాకు చేరుతున్నాయి. అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌తో యలమంచిలి, నర్సీపట్నంలలో సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వీటికి ఈనెల 30న పోలింగ్ ఉంటుంది. 10నుంచి నామినేషన్ల స్వీకరిస్తారు. ఇవి పూర్తయిన కొద్దిరోజులకే అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. దీంతో ఇప్పటికే జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3,506 పోలింగ్ స్టేషన్లు అవసరమని అధికారులు తేల్చారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 40స్టేషన్లు పెరిగాయి. ఈవీఎంలు 16 వేలుఅవసరం. 3వేలు వరకు సిద్ధంగా ఉన్నట్లుఅధికారులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు 25వేల మంది పోలింగ్ సిబ్బంది అవసరమని గుర్తించారు. పోలింగ్ కేంద్రాలయిన పాఠశాల,ఇతర భవనాల తనిఖీ దాదాపు పూర్తయింది. నియోజక వర్గాల్లో సెక్టోరల్ అధికారుల నియమాకం కొలిక్కి వస్తోంది. వార్డులు,గ్రామాల వారీగా అధికారులను నియమించి పోలింగ్‌ను వీడియోల ద్వారా చిత్రీకరణపై శిక్షణ మొదలు పెట్టనున్నారు. పోలీసుశాఖ శరవేగంగా కదులుతోంది. 5వేల మంది పోలీసులు,రెండుహెలికాప్టర్లతో నిఘాకు ఏర్పాట్లుచేస్తోంది. విశాఖతోపాటు,జిల్లాలోను పాతనేరస్తులు,రౌడీషీటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, యలమంచిలి పట్టణాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు సమైక్యాంధ్ర ఉద్యమంతో హోరెత్తిన పల్లెలు,టిక్కెట్లు ఆశిస్తోన్న అభ్యర్థుల ముందస్తు ప్రచారాలు,కటౌట్లు,హోర్డింగ్‌లతో కొత్తరంగు పులుముకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల ఆశావహులు జెండాలు, బ్యానర్లతో ఇప్పటికే రహదారులను నింపేశారు. కొందరైతే ప్రచారం మొదలుపెట్టకపోయినా ఆంతరంగిక సమావేశాలు, మద్దతు కోసం సామాజికవర్గ సమీకరణ మంత్రాంగాలు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల నేరుగా తమ అనుచరులతో అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు. ప్రచారానికి గడువు సరిపోతుందో లేదోననే ముందుచూపుతో కొందరు ఏదొక కార్యక్రమం పేరుతో ఇంటింటికి తిరుగుతున్నారు. కాంగ్రెస్,టీడీపీల తరపున అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటినుంచే ఎన్నికల ఖర్చుకు అవసరమైన నిధుల సమీకరణకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సీపట్నం,యలమంచిలి మున్సిపాల్టీలో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. వైఎస్సార్సీపీకి అనుహ్యరీతిలో ప్రజలనుంచి ఆదరాభిమానాలు లభిస్తుండగా, రాష్ట్ర విభజనకు కారకులంటూ కాంగ్రెస్, టీడీపీల వారిని ప్రజలు కనీసం దగ్గరకు రానీయడంలేదు. దీంతో ఏదోలా ప్రజాభిమానం సంపాదించుకునేందుకు ఆయా పార్టీల నేతలు,అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. -
కమిషనర్లకు పన్ను పోటు!
ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు రెండు నెలలే గడువుంది. విశాఖ రీజియన్ మునిసిపాలిటీల్లో పన్నుల వసూలు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమేరకు వసూళ్లను వేగవంతం చేస్తూ ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తాగునీటి పన్నులు సకాలంలో వసూలు చేయని అధికారులకు షోకాజ్‌నోటీసులు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో ఎవరి మెడకు ఉచ్చు చుట్టుకుంటుందోనని కమిషనర్లు ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ నగరపాలక సంస్థతో పాటు 13 మున్సిపాలిటీలున్నాయి. వీటిలో నర్సీపట్నం, యలమంచిలి, నెల్లిమర్ల, పాలకొండలు కొత్తవి. మిగి లిన సాలూరు, బొబ్బిలి, పార్వతీ పురం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస, రాజాం మున్సిపాలిటీల్లో కేంద్రం అభివృద్ధి పనులకు జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ మిషన్ (జెఎన్ఎన్యూఆర్ఎం)కింద రూ. కోట్లు మంజూరు చేసేది. వీటితో పట్టణాల్లో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పనకు వీలుపడేది. ప్రస్తుతం కేంద్రం నిబంధనలతో సగానికి పైగా ఈ నిధుల్లో కోత పడింది. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే రాష్ట్రం ప్రత్యేక నిధులు కేటాయించడం లేదా పట్టణాల్లో నివశించే ప్రజల నుంచి పూర్తిస్థాయిలో పన్నులను వసూలు చేయడం తప్పనిసరయింది. ఈ నేపథ్యంలో పట్టణ వాసుల నుంచి ప్రధానంగా ఆస్తి, తాగునీటి పన్ను వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గతంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. అయినా మార్పు రాలేదు. రాష్ట్రంలోని మిగిలిన వాటితో పోలిస్తే విశాఖ రీజియన్‌లో ఈ వసూళ్లు 15 శాతానికి మించలేదు. మొత్తం డిమాండ్ రూ. 7 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 1.09 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ప్రధానంగా కొత్త మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోవడంతో పాటు మరికొన్నింటిలో చార్జీలు పెంచడంతో వసూళ్లు మందగించడానికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా పన్నులు వసూలు చేయకుంటే సంబంధిత కమిషనర్లకు షోకాజ్ నోటీసు జారీచేసి, వారిపై తగు చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో కమిషనర్లు తలలు పట్టుకుంటున్నారు. పన్ను వసూలు కాకపోతే తామేం చేస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. -
మళ్లీ పట్టుకు మావోయిస్టుల ఎత్తు
నర్సీపట్నంరూరల్, న్యూస్‌లైన్: విశాఖ మన్యం లో మునుపటి ఆధిపత్యాన్ని మళ్లీ దక్కించుకోవాలని ఆరాటపడుతున్న మావోయిస్టులు ఆ దశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజనులకు మరింతగా సన్నిహితం కావడానికి వ్యూ హం రూపొందిస్తున్నారు. ఏవోబీలో ఒడిశా ప్రాంతం కన్నా విశాఖ ఏజెన్సీ మావోయిస్టులకు సురక్షితమైనదిగా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ యువత రిక్రూట్మెంట్ కూడా అధికంగా ఉండేది. గిరిజన గ్రామాల్లో ఖాళీగా ఉండే యువకులను ఆకట్టుకుని వారికి శిక్షణ ఇచ్చి ముందు మిలీషియా సభ్యులుగా, తర్వాత పూర్తి స్థాయి దళ సభ్యులుగా చేర్చుకు నే వారు. ఆవిధంగా తమ కార్యకలాపాలు సులువుగా సాగించుకునేవారు. అయితే ఇటీవ ల కాలంలో గిరిజన యువతకు దగ్గరయ్యేం దుకు పోలీసులు చేపడుతున్న కార్యకలాపాల తో మావోయిస్టులకు చుక్కెదురవుతోంది. దాంతో గ్రామాల్లో సామాజిక కార్యకలాపాల పై వారు దృష్టి పెడుతున్నారు. అపరాల సీజన్‌పై దృష్టి ఏజన్సీలో కీలకమైన అపరాల సీజన్‌ను అవకాశంగా చేసుకొని మావోయిస్టులు తమ ప్రాబ ల్యం పెంచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నా రు. గిరిజనులు ఏడాది పొడవునా జీవనానికి అవసరమయ్యే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపరాల వ్యాపారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అపరాల వ్యాపారం ఊపందుకోవడంతో గిరిరైతులకు మేలు చేయడం ద్వారా తమ పట్టు నిలబెట్టుకోవాలని మావోయిస్టులు యత్నిస్తున్నారు. అపరాలకు గిట్టుబాటు ధర ఇప్పించి, ఏళ్ల తరబడి నిలిచిపోయి న బకాయిలు వసూలుకు కృషి చేసి గిరిజనుల ఆదరణ పొందాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు సేకరిస్తూ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. వ్యాపారులపై ఒత్తిడి గిరిజనులకు బకాయిలు చెల్లించేలా మావోయిస్టులు అప్పుడే ఒత్తిళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల ఆరున గూడెం కొత్తవీధి మండలం దారకొండలో ఓ వ్యాపారి భార్యను, మంగళవారం మరో అపరాల వ్యాపారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. దారకొండకు చెందిన వ్యాపారి చేత రైతులకు బకాయి చెల్లింపజేసి అతని భార్యను చెర నుంచి విడిచి పెట్టినట్టు తెలిసిం ది. అలాగే గిరిజనులకు బకాయి పడ్డ మొత్తా న్ని చెల్లిస్తేనే వ్యాపారిని విడిచిపెడతామని చెప్పిన మావోయిస్టులు ప్రజాకోర్టులో విచారిం చి అతనిని విడిచిపెట్టినట్లు తెలిసింది. గతంలో గిరిజనుల మద్దతు కూడగట్టుకోవడానికి మా వోలు ఇదేఎత్తుగడ అనుసరించారు. ఇప్పుడూ అదే బాటలో యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
టన్నుకు పైగా గంజాయి స్వాధీనం
నర్సీపట్నం రూరల్/గొలుగొండ/మాడుగుల, న్యూస్‌లైన్ : జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పోలీసులు, అటవీసిబ్బంది దాడులు జరిపి అక్రమంగా తరలిస్తున్న 1006 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి పైచిలుకు ఉంటుంది. మూడు కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తకోట సీఐ పి.వి. కృష్ణవర్మకు అందిన సమాచారం మేరకు నర్సీపట్నం, కొత్తకోట పోలీసులు సంయుక్తంగా రోలుగుంట మండలం వడ్డిప సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు. టాటా టయోటా వాహనాన్ని ఆపి రికార్డులు పరిశీలించగా వాహనానికి సంబంధించిన రికార్డులకు,నంబరుకు పొంతనలేకపోవడంతో అనుమానించిన పోలీసులు దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. 80 సంచుల్లో ప్యాకింగ్ చేసిన 540 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దానిని నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో రత్నంపేటకు చెందిన సన్నవాడ నాగబాబు, పందూరి ప్రసాద్, పెదబొడ్డేపల్లికి చెందిన రెడ్డి నానిబాబులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు. ఈ దాడుల్లో రోలుగుంట ఎస్ఐ జి.ఎన్.అప్పన్న, నర్సీపట్నం పట్టణ ఎస్ఐ అప్పారావు, శిక్షణ ఎస్ఐ వై.తారకేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. జీకే వీధి మండలం సిరిబాల నుంచి టాటామ్యాజిక్ వ్యాన్‌పై తరలిస్తున్న సుమారు 450 కిలోల గంజాయిని గొలుగొండ మండలం కె.డి.పేట సమీపంలోని భీమవరం చెక్‌పోస్టు అటవీ సిబ్బంది మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మాటువేసి ఉన్న అటవీ సిబ్బంది మాటువేసి వాహనాన్ని పట్టుకున్నారు. అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వాహనదారులు రూ.50వేలు ఇస్తామని బేరాలు సాగించడంతో అటవీశాఖ అధికారులు కె.డి.పేట ఎస్ఐ పేర్రాజుకు సమాచారమందించారు. పోలీసులొచ్చి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనంపై పెలైట్‌గా వ్యవహరించిన వ్యక్తి పరారయ్యాడు. వాహనంలో ఉన్న ముగ్గురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కొయ్యూరు ఎస్ఐ సి.హెచ్.వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్లో మంగళవారం సాయంత్రం 16 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్ఐ బి.హరి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరిని ఘాట్‌రోడ్డు జంక్షన్లో పట్టుకున్నామన్నారు. -
నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీ ఎత్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, నర్సిపట్నం స్టేషన్‌కు తరలించారు. అలాగే గంజాయి తరలింపునకు వినియోగించిన కారును పోలీసులు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 40 తులాల బంగారం స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మంగళవారం ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 తులాల బంగారం, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మంగళవారం తనిఖీల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నర్సీపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో మంగళవారం మట్కా నిర్వహకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 6.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ఆదోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే పోలీసులు అతడి స్కార్పియో వాహనాన్ని స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. మట్కా నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సీపట్నంలో వెంకటలక్ష్మి ఆమరణదీక్ష భగ్నం
నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్ సిపి విశాఖ రూరల్ మహిళా కన్వీనర్ పీలా వెంకటలక్ష్మి ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా వెంకటలక్ష్మి ఆదివారం ఆమరణ దీక్ష చేపట్టింది. అప్పటి వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్ జైలులో దీక్ష చేపట్టిన తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జననేత జగన్‌కు జిల్లా వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు. నర్సీపట్నంలో పార్టీ నాయకులు పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషాలు ఆదివారం నుంచి ఆమరణ దీక్షలు చేపట్టారు. వారి దీక్షలను పోలీసులు ఈ రోజు భగ్నం చేశారు. -
నర్సీపట్నంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. వారు ఉపయోగించిన వాహన్నాన్ని కూడా పోలీసులు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి వంద కేజీలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారిని విచారిస్తున్నామని పోలీసులు వివరించారు. -
బ్రాందేయవాదాన్ని నమ్ముకున్న కాంగ్రెస్: షర్మిల