![TDP Leader Ayyanna Patrudu Arrested In Narsipatnam - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/3/Ayyanna-Patrudu.jpg.webp?itok=yE3sPuSo)
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు.
అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు అయనను, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
చదవండి: అది రాజకీయ యాత్రే
Comments
Please login to add a commentAdd a comment