CID notice
-
మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ను నమోదు చేయనుంది.ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. -
సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..
-
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు
-
టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ వేగం పెంచింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కార్యాచరణకు ఉపక్రమించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. బుద్దా వెంకన్న, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సహా 23 మంది సోషల్ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా గుర్తించిన సీఐడీ వారందరినీ విచారించాలని నిర్ణయించింది. బుచ్చయ్య చౌదరికి కూడా ఒకట్రెండురోజుల్లో నోటీసులు జారీ చేయనుంది. నిందితులతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్(ఎక్స్), గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది. చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా? -
Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్‌భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్‌భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
IRR కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడికి సీఐడీ నోటీసులు
-
మాజీమంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు
-
నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ముసుగులో జరిగిన భూదోపిడీ కుంభకోణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేశారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేశ్‌కు అధికారులు వీటిని అందజేశారు. అక్టోబరు 4న తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ వచ్చిన అధికారులు శనివారం ఉదయం నుంచి లోకేశ్ ఎక్కడున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఓ హోటల్లో ఉన్నారని, ఎంపీ ఇంట్లో ఉన్నారని ఇలా ఊహాగానాలు రావడంతో పూర్తి సమాచారం వచ్చే వరకూ వేచి చూశారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో లోకేశ్ ఎంపీ గల్లా జయదేవ్ అధికారిక నివాసానికి వచ్చారు. దీంతో అధికారులు ఎంపీ జయదేవ్‌తో మాట్లాడారు. అశోకారోడ్–50లోని తన నివాసంలో లోకేశ్ ఉన్నారని జయదేవ్ వారికి తెలిపారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఐడీ అధికారులు ఎంపీ జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. వారిని తొలుత లోపలికి రానీయకుండా గేటు వద్దే అడ్డుకొన్నారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం సమంజసం కాదని అధికారులు తెలిపారు. లోకేశ్ బయటకు వస్తే నోటీసులు అందజేసి వెళ్లిపోతామని చెప్పారు. కొద్దిసేపటకి లోకేశ్ బయటకు రారని గేటు వద్ద ఉన్న సిబ్బంది అధికారులకు తెలిపారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపడ సత్యనారాయణ బయటకు వచ్చి అధికారులతో మాట్లాడారు. వారిని లోపలికి తీసుకెళ్లారు. 20 నిమిషాల అనంతరం బయటకి వచ్చిన అధికారులు లోకేశ్‌కు నోటీసులు ఇచ్చినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై తాము మాట్లాడబోమని మీడియాకు తెలిపారు. ఎందుకొచ్చారు? నోటీసులెందుకు? నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను ఎందుకొచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. నోటీసులు ఎందుకు? ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని అడిగినట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం లోకేశ్‌కు నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా నోటీసులు అందుకున్నట్లు లోకేశ్ ధృవీకరించినట్లు తెలిసింది. అంతకు ముందు సీఐడీ అధికారులను ఎంపీ జయదేవ్ నివాసంలోకి రానివ్వకపోవడంతో వారు లోకేశ్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని అధికారులతోనూ లోకేశ్ ప్రస్తావించినట్లు సమాచారం. నోటీసును చదువుకుంటానని, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడతారని లోకేశ్ వారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఆయా సెక్షన్లు గురించి లోకేశ్‌కు వివరించినట్లు సమాచారం. నోటీసుల్లో ఉన్న వివరాలివీ..! ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో.. ‘ క్రైమ్ నం. 16/2022 ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఐపీసీ సెక్షన్లు 120 (బి), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1) (సి) (డి)లో దర్యాప్తు మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ సబ్ సెక్షన్ (1) ప్రకారం నోటీసులు ఇస్తున్నాం. ప్రస్తుత విచారణకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి తగిన కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 4న ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలి’ అని నోటీసుల్లో పేర్కొంది. వీటలో 10 అంశాలను సీఐడీ స్పష్టంగా పేర్కొంది. ఆ అంశాలివీ.. 1. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు 2. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు చేయకూడదు 3. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులెవరినీ బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం చేయకూడదు 4. ఎప్పుడు పిలిచినా /ఆదేశించినా కోర్టుకు హాజరుకావాలి 5. విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చి అధికారులకు సహకరించాలి 6. కేసుకు సంబంధించి వాస్తవాలు వెల్లడించాలి 7. హెరిటేజ్ ఫుడ్స్ బ్యాంకు ఖాతా వివరాలు అధికారులకు అందజేయాలి 8. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి 9. అమరావతి భూ కొనుగోలు లావాదేవీలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురావాలి 10. నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు రాకపోయినా, నిబంధనలు పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ (3), (4) ప్రకారం అరెస్టు తప్పదు లవ్ లెటర్ అందింది : లోకేశ్ సీఐడీ వైఎస్సార్సీపీ అనుబంధ విభాగమని ఆరోపణ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసును నారా లోకేశ్ లవ్ లెటర్‌గా అభివర్ణించారు. ఢిల్లీలో సీఐడీ అధికారులు వచ్చి వెళ్లిన రెండు గంటల తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు. సీఐడీ అధికారులు వస్తున్న విషయం తెలసుకొని జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు సాయంత్రం ఎంపీ జయదేశ్ నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే, వారిని లోపలికి అనుమతించలేదు. సీఐడీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత లోకేశ్ వెంటనే మీడియా ముందుకు రాలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 7 గంటలకు గంటలు మోగించారు. ఆ తర్వాత లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తనపై మోపినవి దొంగ కేసులని, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. తాము ఎక్కడికీ పారిపోబోమన్నారు. సీఐడీ వాళ్లు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారని తెలిపారు. సీఐడీని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగమని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని, అందులో భాగంగానే జుడిషియల్ రిమాండుకు పంపారని అన్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు దర్యాప్తు అధికారి, డీజీపీపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని అన్నారు. 4న సీఐడీ ముందు హాజరవుతానని, వాయిదాలు అడిగే అలవాటు లేదని చెప్పారు. -
నోటీసుల్లో లోకేష్‌కు సీఐడీ ఏం చెప్పిందంటే..?
సాక్షి, ఢిల్లీ: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇవాళ నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సీఐడీ ఆదేశించింది. అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచించిన సీఐడీ.. హెరిటేజ్ బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్ సమర్పించాలంది. మినిట్స్‌ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ?. చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసుల్లో 10 అంశాలు.. ►భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు ►ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు ►పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి ►విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి ►వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి ►హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి ►భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి ►అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి ►నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు కాగా, రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్నారు. లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్‌హౌజ్‌ను చంద్రబాబు కుటుంబం తీసుకుంది. రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానని భువనేశ్వరీ చెబుతున్నారు. హెరిటేజ్‌తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా సీఐడీ పరిశీలన చేసింది. చదవండి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం: నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం: నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాం కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సీఐడీ పేర్కొంది. ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేష్‌ను కలిసి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్‌ని ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నోటీసులు ఇచ్చిన అధికారుల బృందంలో మధుసూదన్‌రావు, బై జోహన్ సైదా, జగత్ సింగ్ ఉన్నారు. తనకు ముందుగానే వాట్సాప్‌లో నోటీసులు అందాయని లోకేష్ చెప్పగా, అయితే తాము ప్రత్యక్షంగా ఇచ్చేందుకు వచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు. 41ఏ నోటీస్ ఫార్మాట్‌పై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అది రెగ్యులర్‌గా ఇచ్చే ఫార్మాట్ అని సీఐడీ స్పష్టం చేసింది. నారా లోకేష్‌పై 120బీ, 409, 420, 34, 35, 36, 37,166,167,217 ఐపీసీ 13(1),13(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. నోటీసుల్లో 10 అంశాలు.. నోటీసుల్లో 10 అంశాలను సీఐడీ పేర్కొంది. హెరిటేజ్ సంస్థ బ్యాంక్ వివరాలు తీసుకురావాలన్న సీఐడీ.. హెరిటేజ్ బోర్డు మినిట్స్ కూడా సమర్పించాలని పేర్కొంది. హెరిటేజ్ కొనుగోలు చేసిన భూములకు చెల్లింపు లావాదేవీల వివరాలను సీఐడీ అడిగింది. కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులను నిందితులుగా చేర్చింది.చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌ను సైతం 14వ నిందితునిగా చేర్చింది. క్విడ్‌ప్రోకో ద్వారా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెబుతోంది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్‌ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. సొంత కంపెనీకి భూములు టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే తనయుడు లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఆపై అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. చదవండి: వామ్మో చినబాబు.. రింగ్‌రోడ్డులో ఎన్ని మలుపులో! -
లోకేష్ లోకేషన్ ఎక్కడ? కార్లు మారుస్తూ రహస్య మీటింగ్‌లు!
సాక్షి, ఢిల్లీ: నారా లోకేష్ కోసం ఢిల్లీలో ఏపీ సీఐడీ అధికారుల వెతుకులాట ప్రారంభించారు. లోకేష్ కోసం పలు చోట్లు సీఐడీ అధికారులు వాకబు చేశారు. కావాలనే సీఐడి అధికారుల నుంచి తప్పించుకుంటున్నట్లు అనుమానం. రింగ్ రోడ్ కేసులో లోకేష్‌కి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయినా సీఐడీ అధికారులకు అందకుండా లోకేష్ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇక స్కిల్ స్కాం, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ లోకేష్ వేయగా, ఆయన పిటిషన్‌ను కోర్టులో వ్యతిరేకించాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు, మీడియాకు కంటపడకుండా లోకేష్ తిరుగుతున్నారు. కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్.. ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్చినట్లు తెలిసింది. జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని సమాచారం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హై కోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో లోకేష్ మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. చదవండి: Fibergrid Scam : శాఖ బాబుది.. సంతకం చినబాబుది -
విచారించాలి.. ఏపీకి రండి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థి క అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్‌ను ఆంధ్ర ప్రదేశ్‌లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది. దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్‌ను రెండుసార్లు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరిని గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది. న్యాయ సూత్రాల ప్రకారం.. రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో నేరానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మళ్లించింది. ఎఫ్ఐఆర్లు కూడా ఇక్కడే నమోదయ్యాయి. దీంతో న్యాయ సూత్రాల ప్రకారం ఈ కేసులో నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోనే విచారించాల్సి ఉంది. రామోజీరావు, శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించినప్పుడే సీఐడీ అధికారులు వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి విచారిస్తామని సీఐడీ అధికారులు గతంలోనే మీడియాకు తెలిపారు. దేశంలో అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. హాజరు కావడం ఆనవాయితీ నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాలు ఇదే రీతిలో నిందితులను విచారిస్తున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు, శైలజా కిరణ్ ప్రముఖులు కావడం, వారికి ఈనాడు పత్రిక, సొంత మీడియా ఉన్నందున ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యులకు ఒక విధానం, మీడియా బలం ఉన్న వారికి మరో విధానమా? వారికి చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్‌లో శైలజా కిరణ్‌ను విచారించిన సందర్భంగా సీఐడీ అధికారులను తన నివాసంలోకి రానివ్వకుండా గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టి అవమానకర రీతిలో వ్యవహరించినా సంయమనంతో వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సీఐడీ భావిస్తోంది. గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి జూలై 5న రామోజీరావు, శైలజా కిరణ్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్‌పేట బ్రాంచి కార్యాలయ మేనేజర్(ఫోర్మేన్)కు కూడా నోటీసులు జారీ చేశారు. -
A1 రామోజీ, A2 రామోజీ శైలజకు నోటీసులు రండి మాట్లాడాలి..
-
టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులిచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వెలువడుతున్న ‘చైతన్య రథం’ పత్రిక ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ నోటీసులిచ్చారు. ‘చైతన్య రథం’ పత్రికలో గత ఏడాది నవంబరు 23వ తేదీ ఎడిషన్‌లో ‘అపరిచితుడు’, ‘బుగ్గనగారి బాగోతం’ శీర్షికలతో అవాస్తవ కథనాలు ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారని మంత్రి బుగ్గన... సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తాను సమర్పిం చిన నామినేషన్ పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అందులో పేర్కొన్న ఆస్తుల వివరాలను ఫోర్జరీ చేశారని బుగ్గన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విధంగా తన భూముల విస్తీర్ణం, వాటి విలువను అమాంతంగా పెంచేసి దుష్ప్రచారం చేశారన్నారు. సీఐడీ అధికారులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారించి ఈ నోటీసులిచ్చారు. సెక్షన్ 92 సీఆర్పీసీ కింద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు ఇచ్చారు. 2022, నవంబరు 23 నాటి చైతన్య రథం పత్రిక కాపీ, ఆ పత్రిక ఎడిటర్, ఆ వార్తలు రాసిన విలేకరి వివరాలు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. -
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
-
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: రాజధాని భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తేలింది. చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’! -
టీడీపీ నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి/ నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈ నెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ‘భారతి పే’ పేరిట సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుని నివాసానికి సీఐడీ అధికారులు శుక్రవారం వెళ్లగా విజయ్ అందుబాటులో లేరు. దాంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో ఇదివరకే నోటీసు ఇవ్వటం జరిగిందని, విచారణకు రానందున మరోసారి 41 ఏ నోటీసు ఇచ్చామని సీఐడీ పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు అయనను, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. చదవండి: అది రాజకీయ యాత్రే -
అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం ఈనెల 19 సాయంత్రం5 గంటల వరకు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్సైట్లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు. -
అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం రెండు రోజులు పొడిగించింది. డిపాజిట్‌దారులు శుక్ర, శనివారాల్లో కూడా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 6న మొదలైన వివరాల నమోదు ప్రక్రియ గురువారం వరకు కొనసాగుతుందని సీఐడీ విభాగం ముందు ప్రకటించింది. అగ్రిగోల్డ్ బాధితుల నుంచి వస్తున్న వినతులపై సానుకూలంగా స్పందించిన అధికారులు డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు పొడిగించారు. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్సైట్లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు. -
పరారీలో దేవినేని ఉమా..
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు. ఈ నెల 7న ప్రెస్ మీట్లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. చదవండి: మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’ -
టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి/కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో, ఆడియోను మార్ఫింగ్ చేసి తిరుపతిలో మత విద్వేషాలు, అలజడులు రేపేందుకు కుట్ర చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసు జారీ చేసింది. తిరుపతి ఉప ఎన్నికలకు వెళ్లిన దేవినేని ఉమ ఈ నెల 7వ తేదీన మీడియా సమావేశం నిర్వహించి సీఎం వైఎస్ జగన్ వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రదర్శించారు. దానిపై ఉమ ట్వీట్ కూడా చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే కుట్ర పన్నారు. దీనిపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ మార్ఫింగ్ వీడియో వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది. 2014 ఏప్రిల్ 13న వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన విలేకరుల సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి, వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్టు తేలింది. దీనిపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎన్.నారాయణరెడ్డి ఈ నెల 9న కర్నూలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమపై ఐపీసీ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్లతో కేసు నమోదు చేసిన కర్నూలు సీఐడీ డీఎస్పీ సీహెచ్ రవికుమార్ దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఎం జగన్ వీడియోను మార్ఫింగ్ చేసి ప్రెస్మీట్లో ప్రదర్శించిన ట్యాబ్, ఫోన్లను తీసుకుని కర్నూలు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ ఉమకు డీఎస్పీ రవికుమార్ గురువారం నోటీసు జారీ చేశారు. నోటీసు గురించి తెలియజేసేందుకు ఉమామహేశ్వర రావుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదని, వాట్సాప్ నంబర్ 9848035405కు 14వ తేదీ రాత్రి 9.06 గంటలకు మెసేజ్ పంపినట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. నోటీసును స్వయంగా అందజేయడానికి విజయవాడ గొల్లపూడిలోని ఆయన ఇంటి వద్దకు కర్నూలు సీఐడీ పోలీసులు వెళ్లగా ఆయన లేనందున ఇంటికి నోటీసు అతికించి, అతని అనుచరునికి తెలియజేసినట్లు తెలిపారు. చదవండి: ‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్ -
నేడు విచారణకు వచ్చి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసులో గురువారం విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ బుధవారం నోటీసు అందజేసింది. అమరావతిలో ఎస్సీ, ఎస్టీల భూములను టీడీపీ నేతలు బలవంతంగా తక్కువ ధరకు గుంజుకున్నారని, అసైన్డ్ భూముల వ్యవహారంలో దళితులకు తీవ్ర అన్యాయం, నష్టం జరిగిందని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నమోదైన కేసులో ఏ1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి పి.నారాయణ ఉన్నారు. చంద్రబాబు ఈ నెల 23న, నారాయణ 22న విచారణకు రావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఆర్కే వాగ్మూలం నమోదు చేసేందుకు విచారణాధికారిగా ఉన్న సీఐడీ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు సీఆర్పీసీ 160 నోటీసు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజినల్ కార్యాలయానికొచ్చి కేసుకు సంబంధించి.. మీకు తెలిసిన వివరాలు చెప్పాలని సీఐడీ నోటీసులో పేర్కొన్నారు. -
సామాజిక సమతుల్యతకే ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల కేటాయింపులో సామాజిక సమతుల్యతకే సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మునిసిపల్ చైర్మన్, నగర మేయర్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేయాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. వారికి నిజమైన సాధికారిత కల్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్న కారణంగానే జాబితా విడుదల ఆలస్యమైందని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల.. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీగా పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని మీడియాకు పరిచయం చేశారు. ఓ సాధారణ కార్యకర్తకు ఇంతటి ప్రాధాన్యం జగన్ మాత్రమే ఇవ్వగలరన్నారు. చంద్రబాబు మాదిరి ఓడిపోయే సీట్లు దళితులకు ఇవ్వకుండా, నూటికి నూరుపాళ్లు గెలిచే సీటునే కేటాయించారన్నారు. ఇంకా సజ్జల ఏమన్నారంటే.. మోసం చేసినందుకే చంద్రబాబుకు నోటీసులు అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి దళితులను బెదిరించి.. వారి భూములను గత చంద్రబాబు ప్రభుత్వం, ఆయన మనుషులు ప్రలోభపెట్టి లాక్కున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అందుకే సీఐడీ నోటీసులిచ్చింది. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. సీఎం వైఎస్ జగన్‌కు అలాంటిదే ఉంటే రెండేళ్లుగా ఎందుకు ఊరుకుంటారు? ధర్మబద్ధంగా విచారణ జరిపించాలని జగన్ కోరుకుంటున్నారు. చంద్రబాబు సాకులు వెతుక్కోవడం మానేసి విచారణకు సహకరించాలి. నిజానిజాలేంటో చట్టమే తేలుస్తుంది. నోటీసులు ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు, లోకేశ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. భయంతోనో, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనో తెలియదు గానీ.. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. టీడీపీ.. మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎన్నికపైనా ఇష్టానుసారం మాట్లాడటం దారుణం. మైదుకూరు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక విషయంలో టాస్ వేయాల్సి రావచ్చు. ఓటర్ల తీర్పుకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ వెళ్తుంది. టీడీపీ గతంలో చేసినట్టు అడ్డగోలుగా మేం వెళ్లం. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు చేసిందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. అదే నిజమైతే తాడిపత్రి, మైదుకూరు పోగొట్టుకుంటామా? -
టీడీపీ మాజీ మంత్రి నారాయణకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ విభాగం హైదరాబాద్‌లో బుధవారం నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణకు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ సెక్షన్లు 166, 167, 217 కింద కేసులు నమోదు చేసింది. నారాయణ పేరును A2గా చేర్చిన ఏపీ సీఐడీ విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సీఐడీ సోదాలు విజయవాడ: నారాయణ విద్యాసంస్థలు, కార్యాలయాలు, నివాసంలో బుధవారం ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. రాజధాని భూ కుంభకోణంలో నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చదవండి: అవసరమైతే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు