మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు | CID Notice To Former CS Somesh Kumar | Sakshi
Sakshi News home page

మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు

Published Sat, Sep 14 2024 10:39 AM | Last Updated on Sat, Sep 14 2024 10:49 AM

CID Notice To Former CS Somesh Kumar

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.

ఫేక్ ఇన్వాయిస్‌లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్‌మెంట్‌ను నమోదు చేయనుంది.

ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్‌

తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement