సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీఎస్టీ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆమె ఆరా తీశారు. కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై టీకే శ్రీదేవి నివేదిక ఇచ్చారు. ఇక, సీఎస్ శాంతకుమారికి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్‌తో పాటుగా పలువురు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా రూ.1000 కోట్ల మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.
ఇక, ఈ కుంభకోణంపై వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment