సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ వేగం పెంచింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కార్యాచరణకు ఉపక్రమించింది.
అందులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. బుద్దా వెంకన్న, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సహా 23 మంది సోషల్ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా గుర్తించిన సీఐడీ వారందరినీ విచారించాలని నిర్ణయించింది.
బుచ్చయ్య చౌదరికి కూడా ఒకట్రెండురోజుల్లో నోటీసులు జారీ చేయనుంది. నిందితులతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్(ఎక్స్), గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది.
చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా?
Comments
Please login to add a commentAdd a comment